చిత్రం: కంచుకోటం (1967) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, దేవిక దర్శకత్వం: సి.యస్.రావు నిర్మాత: యు.విశ్వేశ్వర రావు విడుదల తేది: 22.03.1967
Songs List:
ఉలికి ఉలికి పడుతోంది పాట సాహిత్యం
చిత్రం: కంచుకోట (1967) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల ఉలికి ఉలికి పడుతోంది
సిగ్గెందుకే చెలి పాట సాహిత్యం
చిత్రం: కంచుకోట (1967) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: త్రిపురనేని మహరధి గానం: పి.సుశీల, ఎస్.జానకి సిగ్గెందుకే చెలి
లేదు లేదని పాట సాహిత్యం
చిత్రం: కంచుకోట (1967) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు చరణం: 1 కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది నల్లని జడలో కరినాగుంది.. నడకలలో అది కనపడుతుంది లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు చరణం: 2 కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు కలలోకొచ్చి కబురులు చెప్పే.. జతగాడైనా లేడు.. జతగాడైనా లేడు ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు చరణం: 3 దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది మొగలి రేకుల సొగసు ఉంది.. మొన కన్నులలో పదును ఉంది లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు అద్దంలో నా అందం చూస్తే.. నిద్దర రానే రాదు.. నిద్దర రానే రాదు ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దొస్తావు
ఈ పుట్టిన రోజు పాట సాహిత్యం
చిత్రం: కంచుకోట (1967) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దాశరథి గానం: పి.సుశీల పల్లవి: ఈ పుట్టినరోజు నీ నోముల పండిన రోజు దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు చరణం: 1 తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ (2) మీలో విరిసే లేత వెలుగులు మా చెలి కన్నుల నింపండి ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు ఆనందించాలీ చరణం: 2 అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా (2) మీ నడకల వయ్యారం మా చెలికే ఇవ్వరారా ఆ వయ్యారం చూసి చూసి ఆమె ప్రియుడు మురియాలి చరణం: 3 పురివిప్పి నటియించు నీలాల నెమలి (2) మీలోని హొయలంత చెలికియ్యరాదా అందాల చెలి నాట్యమాడేటి వేళ చెలికాని మనసెల్ల విలసిల్ల గలదు... ఆ...
ఈడొచ్చిన పిల్లను పాట సాహిత్యం
చిత్రం: కంచుకోట (1967) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఎల్. ఆర్. ఈశ్వరి ఈడొచ్చిన పిల్లను
భం భం భం పాట సాహిత్యం
చిత్రం: కంచుకోట (1967) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం, జమునా రాణి భం భం భం
సరిలేరు నీకెవ్వరూ పాట సాహిత్యం
చిత్రం: కంచుకోట (1967) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, ఎస్.జానకి పల్లవి: సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సురవైభవాన భాసుర కీర్తిలోనా సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ సిరిలోన గానీ మగసిరిలోన గానీ సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ చరణం: 1 ప్రజలను నీకంటి పాపలుగా కాచి పరరాజులదరంగ కరవాలమును దూసి శాంతిని వెలయించి మంచిని వెలిగించి జగతిని లాలించి పాలించినావూ.... సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ చరణం: 2 మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి మధువే పొంగులువార మనసార తూగాడి నవ్వులు చిలికించి మువ్వలు పలికించి యవ్వనవీణనూ కవ్వించినావూ... సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ చరణం: 3 రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ అసమప్రభావ జోహార్ రసికావతంస జోహార్ అసమప్రభావ జోహార్ రసికావతంస జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సిరిలోన గానీ మగసిరిలోన గానీ..సరిలేరు నీకెవ్వరూ.....
ఏచటనో గల పాట సాహిత్యం
చిత్రం: కంచుకోట (1967) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల ఏచటనో గల
అర్ధరేతిరి కాడ పాట సాహిత్యం
చిత్రం: కంచుకోట (1967) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: యు. విశ్వేశ్వర రావు గానం: చక్రవర్తి, ఎల్. అర్. ఈశ్వరి అర్ధరేతిరి కాడ
No comments
Post a Comment