Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aadavallu Meeku Johaarlu (2022)
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: శర్వానంద్, రస్మిక మందన్న
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: 25.02.2022Songs List:ఆడాళ్ళు మీకు జోహార్లు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవీశ్రీప్రసాద్

హే లక్ష్మమ్మో పద్మమ్మో
శాంతమ్మో శారదమ్మో
గౌరమ్మో కృష్ణమ్మో
నా బాధే వినవమ్మో

ఈ గోలే ఏందమ్మో
ఈగోలే చాలమ్మో
ఓలమ్మో ప్లీజమ్మో
నా బతుకే బుగ్గయ్యేనమ్మో

నీ మొగుడేమన్నా మహేష్ బాబా
పోనీ అందానికేమైనా బాబా
చైలా..! కాపురం చైలా
కన్లా..! ఇద్దర్ని కన్లా

పోనీ నువ్వేమన్నా కత్రీనా కైఫా
నీ చూపేమన్నా గుచ్చే నైఫా
కానీ, చైలా..! కాపురం చైలా
మీరు కన్లా..! ముగ్గుర్ని కన్లా

మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి
పూలన్నీ జళ్ళోన ముడిసేత్తారా
నాకేమో ఏ పూలు లేకుండా సేసేసి
ఫూల్లాగ మడిసెత్తారా..?

ప్రతి మొగాడి విజయం వెనక
ఆడది ఉంటది అంటారు
కానీ నా విజయాన్ని
చెడగొట్టడానికి ఎందరు ఆడాల్లో

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

సినిమాకెళ్తే నా ఏజ్ ఫ్రెండు
పెళ్ళాన్ని తీసుకురాడా
వాడు నన్నే చూసి
సెల్లమ్మేదని అనడా, మరి అనడా

సాయంత్రమైతే సందు శివర
పువ్వుల కొట్టు సుబ్బన్న
మల్లెలు తీసుకెళ్ళి సెల్లెలుకిమ్మని
వెయ్ డా, జోకులు వెయ్ డా

మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా
సిరునవ్వులొలికించి ఎదురొత్తారా
నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి
ఇవ్వనియ్యకుండా ఆపెత్తారా

ఎదురింట్లోన ఎంకయ్య తాతకి
ఇద్దరు పెళ్ళాలు
అరె, లేనే లేదు నా తలరాతకి
సింగిలు ఇల్లాలు

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

ముద్దులతోటి నిద్దుర లేపే
పెళ్ళాం కావాలని ఉండదా
డిన్నరు పెట్టి డ్రీమ్స్ లోకి
నెట్టే డ్రీమ్ గర్ల్ నాకు కావాలని పించదా

తన ఒళ్ళో వాలి ఓటీటి చూడాలి
అని నాక్కుడా ఉండదా
ఆకలి వేస్తే తనకో ఆమ్లెట్
వేయాలనిపించదా, నాకనిపించదా

మీరేమో మీ మొగుడు పండక్కి
కొని తెచ్చే చీరల్ని చుట్టేసి తిరిగేత్తారా
నేనేమో ఓ పట్టు సీరైనా కొనకుండా
నా పెళ్లి హాంఫట్టు సేసేత్తారా

అరె గంతకి తగ్గ బొంతని సామెత
మీరే సెబుతారే..!!
నా రేంజికి తగ్గా పిల్లని తెస్తే
ఓకే చెప్పరే..!!

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు, హ
ఓ మై ఆద్యా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాజిన్ నిజార్

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే 
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా 
ప్యారంటూ పలికేనే

ఓ ఓ ఓ - తేరే జైస కోయి నహీ
ఓ ఓ ఓ - మేరే జైసా దివానా నహీ
ఓ ఓ ఓ - రూటే గీసా ప్రయాణానికి
నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే

గూగుల్ మ్యాపుకే దొరకని చోటుకే
నడవని బండినే మనతో
వీక్ డే సాటర్డే‌ బేధమే తెలియని
ప్లేసునే వెతకని నీతో

సరదాగా షికారు అంటూ
కొలంబసే కదిలాడే
ఈ దేశం ఆ దేశం అంటూ
ఎన్నో కనిపెట్టాడే
కనుగొందాం మనమీ జర్నీలో
ఓ లవ్ దేశం..!!

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే

వేమన పద్యమే, షేక్స్పియర్ కావ్యమే
నువ్వు ఏం చెప్పిన కవితే
లాస్ట్ బాల్ సిక్సరే, షూర్ షాట్ హిట్టురే
నువ్వు ఏం చేసిన గెలుపే

అందగా ఉంటావంటూ ఎవరెవరో అంటారే
అందంపై రాసిన హైకూ లెన్నెన్నో చదివాలె
అసలందం ఇవాళ చూసానే అది నీ నవ్వే

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనేఆసమ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్ 

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్
ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్

బాగున్నావా అని నువ్వడిగావా
నా బాధలన్నీ పారిపోవడం, ఆసమ్
భోంచేశావా అని ఓ మాటన్నావా
నా ఆకలే మాయమవ్వడం, ఆసమ్

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్
ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్

ఇంత కాలము… ఇన్ని రాత్రులు
ఎలాగ నువ్వల్లే కబుర్లే లేక
కాలం వ్యర్థమాయనే

ఇన్ని రోజులు… రెండు కళ్ళలో
ఇలాగ కలల్నే కథల్నే
చూసే వీలే లేకపోయెనే

నువ్వు నన్ను కలవమన్న
చోటు ఎక్కడున్నా
ఓ గంట ముందే నేను రావడం, ఆసమ్

ఇంటి వరకు సాగనంపి
వీడుకోలు అన్న వెంటనే
ఫోన్లో కలవడం, ఆసమ్

నాకెంత నచ్చినా… నీ ఇంత నచ్చని
దేన్నైనా ఛీ అంటూ… ఛా అంటూ
నీతోటి ఏవోటి తిట్లు కల్పనా

ఏ పనొచ్చినా… మా అమ్మే చెప్పినా
నాతోటి నీకేదో పనుంది అన్నానో
నీవైపే పరుగు తియ్యనా

నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చెప్పగానే
నా ఇష్టమే మారిపోవడం, ఆసమ్
తాజ్ మహల్ అందం అంటూ
నువ్వు పొగుడుతుంటే
షాజహాన్ ని నేనే అవ్వడం, ఆసమ్

మేల్కొన్నావా అని నువ్వు అడిగావా
నా నిద్ధరే సారీ చెప్పడం, ఆసమ్
తెల్లారిపోయిందా అని ఫోనే పెట్టావా
ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం, ఆసమ్

మాంగల్యం పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: దేవీశ్రీప్రసాద్
గానం: జేస్ప్రీత్ జస్జ్

ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

మూడు ముళ్ళు వెయ్యనివ్వకుండా
నా గూడు మొత్తం కూల్చేసినారు
ఏడడుగులు నడవనివ్వకుండా
ఏడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు

రింగులో ఫింగర్ పెట్టనివ్వకుండా
నా లైఫులో ఫింగర్స్ పెట్టేస్తున్నారు
అరుంధతి నక్షత్రం బదులు
చుక్కలు చూపిస్తున్నారు

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా

ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం ఓం
ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం

జీలకర్ర బెల్లం బదులు
నా నెత్తి మీద టోపీ పెట్టారు
దిష్టి చుక్కే బుగ్గనెట్టకుండా
నన్ను దిష్టిబొమ్మల్లె మార్చేసినారు

ఫస్ట్ నైటే నాకు లేకుండా
ఫ్రస్ట్రేషన్ నైట్సు గిఫ్టుగిచ్చారు
హనీమూన్ కెళ్ళి డ్యూయెట్ పాడకుండా
ఫుల్ మూన్లో సోలోగా పడుకోబెట్టారు

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా

కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం
కలగా కలగా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: మహాలింగం 

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

ఏ దరో చేరాలని
మొదలైన ఈ ప్రయాణమే
ఏ ధరి దరిచేరక ఏ వైపు సాగునో

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

ఏ గుండెది ఏ భారమో
ఈ మనసుకే తెలిసేదెలా
ఏ కన్నుది ఏ శోఖమో
ఈ చూపుతో చూసేదెలా

తెలియదు ఏ పదాలు
రెండు ముడిపడునో
ఏ క్షణాన విడిపోవునో
తెలుపవు ఏ స్వరాలూ
తీపి పాటౌనో టెన్ టు ఫైవ్
వేధనల్లే వేధించునో

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

No comments

Most Recent

Default