Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sridevi Soda Center (2021)
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
నటినటులు: సుధీర్ బాబు, అనంది
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి
విడుదల తేది: 27.08. 2021Songs List:నాలోనే ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: అనురాగ్ కులకర్ణి

నాలోనే ఉన్నా నీలోనే లేనా
ఈ దూరమింక నమ్మలేకున్నా
నీతోనే ఉన్నా నిన్నా మొన్నా
లేదన్న మాట నిజమేనా

నిమిషాలు లేని కాలమేదో… నిరసించలేక నీరసించే
నిశి లేని తెల్ల చీకటేదో… చితి లేక మంటలేఖలే రచించే
ఏ కారాగారం కనలేదీ దూరం… కనరా నీ నేరం కాలమా
ఏ గీతాసారం వినిపించని వైరం… విధి రాసిన శ్లోకం శోకమా

నాలోనే ఉన్నా నీలోనే లేనా
ఈ దూరమింక నమ్మలేకున్నా
నీతోనే ఉన్నా నిన్నా మొన్నా
లేదన్న మాట నిజమేనా

వివరించలేని భాష ఏదో… ప్రకటించలేక మూగబోయే
దిగమింగలేని బాధ ఏదో… ఒదిగుండలేక కన్ను దాటి పోయే
ఏ కారాగారం కనలేదీ దూరం… కనరా నీ నేరం కాలమా
ఏ గీతాసారం వినిపించని వైరం… విధి రాసిన శ్లోకం శోకమా


మందులోడా ఓరి మాయలోడా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సాహితి చాగంటి, ధనుంజయ

ఆఆ, అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అయితే…!
సింగపూర్ రంగబాబు ఫ్లైట్ ఎక్కమన్నాడు
ఉంగరాల గంగిరెడ్డి గోల్డ్ ఆఫర్ ఇచ్చాడు
తిక్కరేగి యమబాబు ముహర్తలు పెట్టేసీ
పెద్దూరి నాయుడుతో పెళ్లి చేసినారురో

మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా

పెద్దూరి నాయిడుకి నిన్నిచ్చి పెళ్లి చేస్తే
మద్దూరి పెద్దిరెడ్డి మద్దెల వాయించినాడే
సిన్నూరి సిట్టిబాబు సిడతలు కొట్టాడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే

నా మొగుడు నాయుడు. ఏ పనిపాట సేయ్యకుండా మూలికలు ఏర్లు తేత్తానని అడువులు పట్టుపోయి
నన్ను మరిసే పోనాడు..!!
అవునా..! ఏ ఊర్లేల్లాడు..? ఏ ఏర్లు తెచ్చాడు..?

తూరుపు ఎల్లాడు… తుమ్మేరు తెచ్చాడు
పడమర ఎల్లాడు… పల్లేరు తెచ్చాడు
దచ్చినమెల్లాడు… దబ్బెరు తెచ్చాడు
ఉత్తరమెల్లాడు… ఉల్లేరు తెచ్చాడు
మందులు మందులని మాయమై పోయినాడు, ఊఉ

మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే

పైటే పట్టమంటే… పల్లేరు తెచ్చాడా
నడుమే గిల్లమంటే… నల్లేరు అల్లాడా, ఆ
ముద్దులు పెట్టమంటే… మూలికలు ఇచ్చాడా
ముచ్చట తీర్చమంటే… మూడుర్లు తిరిగాడా
మేమున్నమే పిల్లా… వద్దు నీకు మందుమాకు

మందులోడా ఓరి మాయలోడా
మామ రాకు మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మళ్ళీ రాకు మందుల సిన్నోడా

మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
నాలో ఇన్నాళ్ళుగా… పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దినకర్, రమ్యా బెహ్రా

నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ
అదో ఇబ్బందిగా అనిపించినా… అది కూడా బానే ఉంది
మరి కన్నెర్రగా కసిరేసినా… చిరునవ్వులా ఉందే
తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
తానే అందేనా
ఎంతో దూరాన ఉండే ఆ తారకా
నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ

కొంచం గమనించదేం… దరిదాపుల్లోనే తారాడినా
వైనం గురుతించడేం… కనుబొమ్మతోనే కబురంపినా
ఎలా చెప్పాలో వయస్సేమందో… ఎలా చూపాలో రహస్యం ఏదో
ఇదేమి చిక్కో… నువ్వే కనుక్కో
తెగిస్తా, వరిస్తా… మరెందుకని పరాకనీ
లేపే కిరణాల పిలుపే… తొలిమేలు కొలుపై నను గిల్లగా
తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ

పోన్లే పాపం అని… దరి దాటి రానా నది హోరుగా
సర్లే కానిమ్మనీ… చుట్టేసుకోనా మహాజోరుగా
అలా కాకుంటే మరో దారుందా
ఇలా రమ్మంటే కలే రానందా
తయారయుందాం… తథాస్తు అందాం
అటైనా, ఇటైనా… చెరె విడే హడావిడీ
తరిమే తొలివాన చినుకో మురిపాల
మునకో నను అల్లగా

తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
తానేనె తందానే తానే తననానే తానే తననానేనా
తానే తన్నానే తానే తననానే తానే తననానేనా

చుక్కల మేళం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: అనురాగ్ కులకర్ణి

ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆ
చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం వాసంతం

అక్కరలేక అక్కున చేరే దక్కని చొరవేరా
లెక్కలు వేసి ముక్కలు చేస్తే విలువ మరుగేరా
ఓ ఓఓ..! చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం

బతుకు పదుగురితో అడుగు పడినదనీ
నడక నలుగురితో కలిసి నడవమనీ
ఉన్నతంగా చూడరామరి ఉన్నదే స్నేహం
నమ్మకంగా సాగరా కడదాకా ఓ నేస్తం

హో ఓఓ, చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం, హో ఓ ఓ… వాసంతం

కలతలే దాటీ… కలుపు దూరాన్నీ
కొరత ఏపాటీ కొలత వెయ్ దాన్నీ
కష్టమొచ్చి నేర్పిన తొలిముచ్చటీమాట, ఆ ఆ
ఇష్టపడటం నేర్చుకో విలువిచ్చి ప్రతిచోటా, ఆఆ

హో ఓఓ, చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఓ ఓఓ, ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం, హో ఓ ఓ… వాసంతం
Love Themeయం

 
Song Details

No comments

Most Recent

Default