చిత్రం: కనబడుట లేదు (2021) సంగీతం: మధు పొన్నాస్ నటీనటులు: సునీల్, సుక్రాంత్ వీరెల్ల, వైశాలి రాజ్,ససిత కోన, హిమజ దర్శకత్వం: యమ్. బాలరాజు నిర్మాతలు: సుదీర్ తలసిల, దేవీప్రసాద్ బలివాడ , సతీష్ రాజు విడుదల తేది: 19.08.2021
Songs List:
మామా పాట సాహిత్యం
చిత్రం: కనబడుట లేదు (2021) సంగీతం: మధు పొన్నాస్ సాహిత్యం: మధు నందన్ గానం: రాహుల్ నంబియర్ మామా
ఎదకేమై ఉంటుందే పాట సాహిత్యం
చిత్రం: కనబడుట లేదు (2021) సంగీతం: మధు పొన్నాస్ సాహిత్యం: పూర్ణ చారి గానం: కార్తీక్ ఎదకేమై ఉంటుందే ఏదో చిత్రం జరిగిందే ఎపుడు లేదే మాయే నీదే కథ మారేపోయిందే మధనం మొదలయ్యిందే ఈ ఆలోచన ఎంతో బాగుందే అది ప్రతిసారి నీవైపోస్తుందే ఒక నిముషం చూసేలోగా సమయానికి ఈ పరుగేలా ఇక ఆగే వీలే లేదే ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే మాటే వినదసలే ఓ పిల్లా కనులే కురిసెనులే కలలే తడిపెనులే కథనం కుదిరినదే నీ వల్లా… ఎదకేమై ఉంటుందే ఏదో చిత్రం జరిగిందే ఎపుడు లేదే మాయే నీదే వెనకాలె నీ వెనకాలే అడుగే సాగిందే మునకేసే తాను మునకేసే నీ ఊహల్లె ఉందే దాచే మాటె నీదని నిన్నే ధాటి పోనని నీతో ఉన్నానంటే నాకో వరమే పిలిచే నీ పలకుల మధురం తెగ మురిసెను ఆధారం ఈ చిన్ని చిన్ని జ్ఞాపకాలు గుండె లోతుల్లో పదిలం ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే మాటే వినదసలే ఓ పిల్లా కనులే కురిసెనులే కలలే తడిపెనులే కథనం కుదిరినదే నీ వల్లా… వయసే… తన తొలకరి అలజడి తెలిసిన పరువపు కదలిన అలలుగా ఎగిసెను మాయాలోన తేలి అది మోయలేని హాయి మారులోకం చూసే ఆశే తీరే మార్గం ఉండే వెళదామా ఇపుడే
ప్రేమే లేదు పాట సాహిత్యం
చిత్రం: కనబడుట లేదు (2021) సంగీతం: మధు పొన్నాస్ సాహిత్యం: మధు నందన్ గానం: రాహుల్ సిప్లిగంజ్ , రవి ప్రకాష్ చోడిమల్ల ప్రేమే లేదు
తొలిసారి నిన్నే పాట సాహిత్యం
చిత్రం: కనబడుట లేదు (2021) సంగీతం: మధు పొన్నాస్ సాహిత్యం: చంద్రబోస్ గానం: హరిచరణ్ తానాననా తానాన దిరనా తొలిసారి నేనే ఒక సంద్రాన్నై ఎగసానే నువు అలై కంటపడగానే, ఏ ఏ తొలిసారి నేనే ఒక ఆకసమై ఎదిగానే వెన్నెలై నువు రాగానే, ఏ ఏ నిజంగా నీకోసమే ఇవ్వాళ నా మౌనమే వేవేల రాగాలై మోగిందిలే ఈ భూమి తిరిగే వరకు… నీ ప్రేమై నేనుంటానే ఈ గాలి వీచే వరకు… నీ శ్వాసై ఉంటా ఈ భూమి తిరిగే వరకు… నీ ప్రేమై నేనుంటానే ఈ గాలి వీచే వరకు… నీ శ్వాసై ఉంటా, ఆ ఆఆ (నీ శ్వాసై ఉంటా… నీ శ్వాసై ఉంటా) ఏదో బ్రతుకుతున్నానే నిన్నాలుగా ఏదోలా కదులుతున్నా నిశిలో నీడలా పాదాన్ని నీవైపు నడిపావుగా ప్రాణాన్ని తేనెల్లో తడిపావుగా తీయ తియ్యగా… నను పైకి తీయగా ఆనందాల తాళం తియ్యగా, ఆ ఆ ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా, ఆ ఆఆ నాకై ఎదురుచూసే బంధమే లేదుగా నువ్విలా ఎదిగినావే కోటి బంధాలుగా కౌగిళ్ళలో ఇంత బలముందని కన్నీళ్ళలో ఇంత రుచి ఉందని చూపినావుగా ఊయలూపినావుగా నా రెండో రూపైనావుగా తొలిసారి నేనే ఒక సంద్రాన్నై ఎగసానే నువు అలై కంటపడగానే, ఏ ఏ

No comments
Post a Comment