Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vijaya Bapineedu"
Bottu Katuka (1979)



చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి, జాలాది, ఉత్పల, ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఆనంద్, యస్.పి.శైలజ, రమణ 
నటీనటులు: మురళీమహన్, నూతన్ ప్రసాద్,  శ్రీధర్, హరిబాబు, జయంతి, మాధవి, నిర్మల 
దర్శకత్వం: విజయబాపినీడు 
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి 
విడుదల తేది: 21.12.1979



Songs List:



స్వాగతం - స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఉత్పల
గానం: పి.సుశీల, యస్.పి.శైలజ

స్వాగతం - స్వాగతం సుస్వాగతం
సీతమ్మ చరితమే రామాయణం -
మా అమ్మ కథ మాకు పారాయణం

పిన్నలు పెద్దలు విచ్చేసి - మా కన్నుల పండుగ చేశారు
పూలూ పండ్లూ తాంబూలాలు - పుచ్చుకొనండి.
అమ్మ నుదుట యీ కుంకుమ పెట్టి - అక్షింతలు చల్లండి 
మీ ఆశీస్సులు పలకండి దీర్ఘ సుమంగళీభవ

ఇంటికి దీపం ఎంతో వెలుగు - ఆ వెలుగుల జిలుగే మా అమ్మ
వెన్నలోని మెత్తదనం వెన్నెలలో చల్లదనం -
కలబోసిన బొమ్మే మా అమ్మ
అమ్మంటేనే త్యాగం - అమ్మంటే ఒక యోగం
అమ్మలోని అనురాగం - పొందడమే వైభోగం
తల్లిని తలచి తల్లిని కొలిచి  తల్లయి నిలిచే భాగ్యమే సౌభాగ్యం
నా భాగ్యం దీర్ఘ సుమంగళీభవ




తలనెప్పి అంటేనే తల్లడిల్లిపోయారు పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు

తలనెప్పి అంటేనే తల్లడిల్లిపోయారు
నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు? నావారేమైపోతారు ?
నా గుండెల్లో బరువు దింపుకోవాలని 
నా గోడంతా నీకు చెప్పుకోవాలని 
గుడికొచ్చాను నీ గుడికొచ్చాను
గుప్పటిలో రగులుతున్న నిప్పుల కుంపటిని 
ఎలా దాచుకోనూ నే నెలా తటుకోను... హా మైగాడ్ 

వెన్నవంటి మనస్సున, కన్నతల్లి నిచ్చావు
కనుసన్నల మెసిలే సతినే ఇల్లాలిని చేశావు 

పసిపాపల మురిపాలతో బ్రతుకు తీపి చూపించావు 
వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే ఆ మాటలు వింటుంటే
కన్నీరు ఆగదాయె నా హృదయం నిలువదాయె.... హా మైగాడ్
తనకంటే ముందుగ నేనే తనువును చాలిసుంటే
తన బొట్లూ కాటుకలే పోతున్నాయని వింటే 
కన్న తండ్రి కరువై పోతే చిరుగుండెలు చెరువై పోతే
ఆ పరిణామం తలచుకుంటే ఆ దృశ్యం ఊహించుకుంటే
గుండె పగిలిపోతుంది - బ్రతకాలనిపిస్తోంది - హా మైగాడ్




చాటపర్రు చిన్నోడమ్మో. పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి, జాలాది, ఉత్పల, ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఆనంద్, యస్.పి.శైలజ, రమణ 

చాటపర్రు చిన్నోడమ్మో. యీడు చావతేరి వున్నోడమ్మో
కోడెగిత్త యీడుంది - కోడిపుంజు పొగరుంది
జోడుకట్టి ఆడుకుంటే - జాంచెట్టు నీడుంది
ధధిన్నక్క ధధినక్క - దధినక్క - ధా

జొన్నపాడు చిన్నదాన్నిరో- నేను జున్ను ముక్కలాంటిదాన్ని రో
కందిరీగ నడుముంది మల్లెతీగ నడకుంది
అల్లిబిల్లి ఆడుకుంటే - వొళ్లు ఝల్లు మంటాది
ధదిన్నక్క, ధధినక్క - ధధినక్క - ధా

వెర్రి యెంగళ్ళప్పా - యేమిటయ్యా నీ గొప్పా.... ?
మేకలాగ కేక లెయ్యమాకూ అదుపే లేదే నీకు....
వంగ పండురైక చిన్నదీ - అది దొండపండు కన్నా - ఎర్రదీ
మంచు కురిసి చేను పండదూ - నీ మాటతోటి - మనసే నిండదూ
గంగలాగ పొంగుతున్న గంతులేసి ఆడుతున్న
బొంగరాల బుగ్గమీద బొమ్మరిల్లు కడతానే

ధధినక్క, ధధినక్క - దధినక్క - ధా

యెర్రి యెంగళప్పా - మేమిటయ్యా నీ గొప్పా
మేకలాగ కేక లెయ్యమాకు ఆదుపే లేదే నీకు
చారెడేసి కళ్ళు వున్నాది - అది చేపలాగ యెగురుతు వున్నాదీ

ముసురుకుంటే ముద్దే తీరదూ నిన్నూ తలుసుకుంటే తనివే తీరదూ
డోలు సన్నాయిపాటా - తానా తందాన ఆటా
తాళిబొట్టు కడతానే తకతై తకతై ఆడతానే
ధధినక్క, ధధిన్నక్క అధిన్నక్క కధిన్నక్క





అల్లిబిల్లి గారడీ పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అల్లిబిల్లి గారడీ - అల్లరిచూపులు చిన్నది
కమ్మని కాగినీ ఇమ్మన్నదీ
అల్లిబిల్లి గారడీ - అల్లరిచూపులు టక్కరి
కళ్లల్లో వున్నదీ కాదంబరీ లబధిక లబధిక లాపాప

వరాలు ఇచ్చే దేవతలాగ కనబడతావు నువ్వు
అందం చందం ఆరాధిస్తా ఆశలు తీర్చవే నువ్వు
నీ నవ్వే వెన్నల పువ్వు - అబదిక, లబధిక లాపాప -
ఏదో ఇవ్వమంటావు - అబ్బా ఆగనంటావు
మురిపించే తొలిరేయి రావాలిగా
కమ్మని కౌగిలీ ఇమ్మన్నదీ హ హ హ
మగాడి కున్న తహతహలన్నీ పడుచుపిల్లకీ వున్నా
వురకలువేసే ఉబలాటానికి - పగ్గం వేయమంటుంది
శుభలేఖను రాయమంటుంది - లబదిక, లబదిక లాపాప
ఇప్పుడే లగ్న మంటాను, ఇదిగో తాళి కడతాను
తీరాలి ముచ్చట తీరాలి




ఏమయ్యా మావయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది
గానం: ఆనంద్, యస్.పి.శైలజ, రమణ 

ఏమయ్యా మావయ్యా - కాబోయే చావయ్యా
చక్కని అక్కయ్య దక్కాలంటే చుక్కల పల్లకి ఎక్కాలంటే
మరదలు షరతులు వింటేనే - ఆ ముచ్చటలన్నీ తీరేది
మా అక్కకు అసలే వంటా వార్పులు రావు 
కంటికి రెప్పగా - కాచామందే మేము

అదే మున్నది. హోటలు వున్నది 
కేరేజితోనేనే కాలం గడిపేస్తాను
పరాయి పిల్లతో - సరాగ మాడారంటే 
కరాటి దెబ్బకు నరాలు తొలిగేనండీ
రంభంటిది యిల్లా లుండగా - మరోదానికో పని యేమున్నదీ
ఏమమ్మా కోడలా కాబోయే మరదలా....?
ఏవయ్యా మామయ్యా కాబోయే బావయ్యా

కోరిన వెంటనే - పుట్టింటికి పంపాలి
తర్వగా రమ్మని - తొందర పెట్టక వుండాలి
గురుతొచ్చినా గుబులెత్తినా మరదలుపిల్లా నిన్నే పిలిపించుకుంటానూ

పిల్లా జల్లా కని పెంచాలనిలేదు
మా అక్కకు అసలా మాటంటేనే గిట్టదూ...
ఆ బరువెందుకూ యీ గొడవెందుకూ
కావాలంటే - నేనే పిల్లలు కూడా కంటాను
అన్నిటికీ తలవూపే ముద్దుల బావయ్యా
గంగిరెద్దే - నీకన్నా మేలయ్యా

లల్ల లలాలా లల్లలలాలా లాలాలా
లల్ల లలాలా లల్లలలాలా లాలాలా




ఒరేయ్ అసలే కొత్త పాట సాహిత్యం

 
చిత్రం: బొట్టు కాటుక (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు & కోరస్ 

ఒరేయ్ అసలే కొత్త గట్టిగా పట్టుకోండ్రోయ్
పట్టుకున్నాంగాని నువ్వు కానీవోయ్
వచ్చి దాని యవ్వారం కదా తప్పకోమని చెప్పండిరా
తప్పుకో.... తప్పుకో .... తప్పుకో.... తప్పుకో.... తప్పుకో ....
బెల్లూ బ్రేకుల్లేవు నారాయణ ఇది - పరమ కంత్రీ బండి నారాయణ
రైటూ లెఫ్ట్ లేదు  సైడ్ నెంబరు లేదూ

అడ్డు తగిలారంటే నడ్డి నిరుగుద్దండి
సైడో సైడో అహఁ సైదో సైడో.... అహహం
తప్పుకో ....తప్పుకో .... తప్పుకో..... తప్పుకో.....
అమ్మోయ్ నాయనోయ్ దేవుడోయ్ చచ్చాన్రా మీ జిమ్మడ
మీకు కళ్ళున్నాయా? లేవా ? ఏమీ లేవురా....?
బెల్లూ బ్రేకుల్లేవు నారాయణా - ఇది పరమ కంత్రీ బండి నారాయణ
అమ్మా యీరకంగా పదారుసార్లు చెప్పాం ఎన్నిసార్లు పదారుసార్లు
నువ్వు అడ్డంవచ్చి సైకిల కిందపడి మమ్మల్ని అంటే ఎలాగ?
తప్పుకో ....తప్పుకో .... తప్పుకో .... తప్పుకో.... తప్పుకో .... తప్పుకో....
గాడి తప్పితే బండి తిరగబడతది ఆ  తిరగబడతది ....
గడపదాటితే ఆడది పరువు చెడతదీ - ఆ పరవు చెడతదీ

ఓర్పువున్న ఆడదీ యిల్లాలయ్యో యిల్లాలు యిల్లాలయ్యో ఇల్లాలు
ఓటి బండిలాటిది - గయ్యాళయ్యో గయ్యాళి - గయ్యాళయ్యో గయ్యాళి
పెద్దయ్య సుద్దులు కావు - మా బద్రమ్మ చెప్పిన సూత్రాలు
అడ్డు తగిలారంటే నడ్డి విరుగుద్దండి -  సైడో సైడో సైడో
తప్పుకో, తప్పుకో, తప్పుకో, తప్పుకో, తప్పుకో

ఒరేయ్ వరేయ్ వెధవనాయాల్లారా మీకు బుద్దుందా లేదా
నీకు బుద్దుందా నీకు బుద్దుందా
నీకు బుద్దుందా - నీకు బుద్దుందా
మరి నీకో ఓరి నీయవ్వ 

బెల్లు బ్రేకుల్లేవు నారాయణ - పరమ కంత్రీబండి నారాయణ
ముసలిడొక్కు సైకిళ్ళకు ముడుపు పెట్టకు

ఆఁ మదుపు పెట్టకు నక్కజిత్తు నాయాళ్ళను విడిచి పెట్టకు - ఆఁ విడిచిపెట్టకు
బుద్ధి గడ్డితిన్నవాడిని - తన్నాలయ్యో తన్నాలి - తన్నాలయ్యో తన్నాలి..
పక్షిగాడి వాహనాన్ని తుక్కు తుక్కు చేయాలి - తుక్కు తుక్కు చేయాలి
సిద్దయ్యా సుద్దులు కావు మా బద్రమ్మ చెప్పిన సూత్రాలు
అడ్డు తగిలారించే నడ్డి విరుగుద్దండీ - సైడో సైడో 
బెల్లు బ్రేకుల్లేవు నారాయణ - యిది పరమ కంత్రీ బండి నారాయణో

Palli Balakrishna Sunday, October 29, 2023
Punnami Chandrudu (1987)



చిత్రం: పున్నమి చంద్రుడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, జి. సత్యమూర్తి, బాబురావు 
గానం: యస్.పి. బాలు, సుశీల , జానకి, శైలజా, నాగూర్ బాబు 
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, సుమలత 
దర్శకత్వం: విజయబాపినీడు
నిర్మాత: యం.నరసింహారావు 
విడుదల తేది: 14.01.1987



Songs List:



ఆకాశానికి పసుపు పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి చంద్రుడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, జి. సత్యమూర్తి, బాబురావు 
గానం: పి. సుశీల

ఆకాశానికి పసుపు కుంకుమ పున్నమిచంద్రుడట 



గోదావరి వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి చంద్రుడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, జి. సత్యమూర్తి, బాబురావు 
గానం: నాగూర్ బాబు , పి. సుశీల

గోదావరి వెన్నెల 



టి ఒక టి పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి చంద్రుడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, జి. సత్యమూర్తి, బాబురావు 
గానం: యస్.పి. బాలు, యస్.జానకి

టి ఒక టి 




ముద్దొచ్చే పండు పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి చంద్రుడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, జి. సత్యమూర్తి, బాబురావు 
గానం: పి. సుశీల

ముద్దొచ్చే పండు 



బావా రోజూ కమ్మని కలలు పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి చంద్రుడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, జి. సత్యమూర్తి, బాబురావు 
గానం:  పి. సుశీల, నాగూర్ బాబు 

బావా రోజూ కమ్మని కలలు 



చేయి చేయి ధర్మం చేయి పాట సాహిత్యం

 
చిత్రం: పున్నమి చంద్రుడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, జి. సత్యమూర్తి, బాబురావు 
గానం: యస్.పి. బాలు, పి.  సుశీల 

చేయి చేయి ధర్మం చేయి 

Palli Balakrishna Friday, April 15, 2022
Maa Inti Maharaju (1988)



చిత్రం: మాఇంటి మహరాజు (1988)
సంగీతం: సాలూరి వాసురావు
నటీనటులు: కృష్ణం రాజు, జయసుధ
దర్శకత్వం: విజయబాపనీడు
నిర్మాత: యు.వి. సత్యన్నారాయణ రాజు
విడుదల తేది: 1988

Palli Balakrishna Monday, August 30, 2021
Krishna Garadi (1986)



చిత్రం: కృష్ణ గారడి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
నటీనటులు: కృష్ణ, జయప్రద, బాలాజీ, పూర్ణిమ 
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాతలు: అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణరావు
విడుదల తేది: 03.01.1986



Songs List:



నా కళ్ళలో పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ గారడి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల, లలితా సాగర్ 

నా కళ్ళలో




చిక్కని చీకట్లో పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ గారడి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యం.రమేష్, పి.సుశీల

చిక్కని చీకట్లో



సత్యభామ నేనేనురో పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ గారడి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల

సత్యభామ నేనేనురో




చింతలకరి పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ గారడి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యం.రమేష్, పి.సుశీల

చింతలకరి



రుక్మిణమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ గారడి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యం.రమేష్, పి.సుశీల, యస్.పి. శైలజ 

రుక్మిణమ్మ

Palli Balakrishna Saturday, August 28, 2021
Donga Kollu (1988)





చిత్రం: దొంగ కోళ్ళు (1988)
సంగీతం: వాసూరావు 
సాహిత్యం: వేటూరి, భువనచంద్ర
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, సుమలత 
మాటలు: కాశీ విశ్వనాధ్ 
దర్శకత్వం: విజయబాపినీడు
నిర్మాత: గుత్తా మధుసూదనరావు
విడుదల తేది: 1988

Palli Balakrishna Sunday, August 8, 2021
Police Officer (1986)





చిత్రం: పోలీస్ ఆఫీసర్ (1986)
సంగీతం: వాసూరావు 
నటీనటులు: భాను చందర్, సుహాషిని
దర్శకత్వం: విజయబాపినీడు
నిర్మాతలు: మేడికొండ శ్రీనివాస రావు, పాలడుగుల గోపాలకృష్ణయ్య
విడుదల తేది: 1986

Palli Balakrishna Saturday, August 7, 2021
Naku Pellam Kavali (1987)





చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు 
నటీనటులు: చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, శాంతి ప్రియ, కల్పన
దర్శకత్వం: విజయ బాపినీడు 
నిర్మాత: జె.మురళి మోహన్ 
విడుదల తేది: 25.03.1987



Songs List:



వినోదాల విందు రా పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యస్. పి. బాలు 

వినోదాల విందు రా



పుత్తడి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు  
గానం: పి.సుశీల

పుత్తడి బొమ్మ 



చిలకా చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యస్. పి. బాలు, పి.సుశీల

చిలకా చిలకా 




ఎవ్వరో అతనెవ్వరో పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

సా.......పా.....సా......
ఆ........ఆ........ఆ......

ఎవ్వరో అతనెవ్వరో ఒకడొస్తాడూ....పిల్లనీ చూడాలనీ త్వరపడతాడు
మెల్లగా అడుగేసినా దడ పుట్టెనేందుకో.....ఓరగా ఎటు చూసినా ఒనుకొచ్చేనేందుకో
పిల్లకి పెళ్ళి చూపులూ పాఠం నేర్పని పరీక్షలూ

మనిషే ఎవరని తెలియని వాని....మనసున వున్నా రూపమేమిటో (2)
హంసల నడకల కోయిల పాటల సతి కావాలని కోరెనో ....
రంభా వూర్వశి మేనక మేని అందం కోసం వెతికేనో....

ని స ని ప ప ని ప గ గ ప గ రి రి గ రి స
ని స రి గ ప స రి గ ప ని 

ఆడది వెతికే అందం ఒకటే వంచన లేని మంచితనాన్నేని (2)
అప్పుడు మగడూ వామనుడైనా..హిమాలయంలా కనపడును
ఆకారంలో ఎలాగున్నా మన్మధుడల్లే వుంటాడూ....

ని స ని ప ప ని ప గ గ ప గ రి రి గ రి స
ని స రి గ ప స రి గ ప ని



పుత్తడి బొమ్మ (విషాద గీతం) పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు  
గానం: పి.సుశీల

పుత్తడి బొమ్మ 




నాకు పెళ్ళాం కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యస్. పి. బాలు

నాకు పెళ్ళాం కావాలి

Palli Balakrishna
Maharaju (1985)








చిత్రం: మహారాజు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, స్వప్న
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: ఎం. నరసింహారావు
విడుదల తేది: 20.06.1985

కైలాస శిఖరాన కొలువైన స్వామీ
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
మనసున్న మంచోల్లే మారాజులూ
మమతంటూ లేనోళ్ళే నిరుపేదలూ
ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
ఎవరేమీ అనుకుంటే నీకేమి లే

రాజువయ్యా  మహారాజువయ్యా
రాజువయ్యా మహారాజువయ్యా

కన్నీటా తడిసినా కాలాలు మారవు
మనసారా నవ్వుకో పసిపాపల్లే
ప్రేమకన్నా నిధులు లేవు
నీ కన్న ఎవరయ్యా మారాజులూ
నిన్నెవరూ ఏమన్నా నీ దాసూలూ
జరిగినవి జరిగేవి కలలే అనుకో
జరిగినవి జరిగేవి కలలే అనుకో

రాజువయ్యా మహారాజువయ్యా
రాజువయ్యా మహారాజువయ్యా

త్యాగాల జీవితం తనవారికంకితం
మిగిలింది నీ నేనునా నువ్వేలే
దేవుడు వంటి భర్త ఉంటే
నాకన్నా ఎవరయ్యా మారాణులు
మనకున్న బంధాలే మాగాణులు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు

రాజువయ్యా మహారాజువయ్యా
రాజువయ్యా మహారాజువయ్యా

కైలాస శిఖరాన కొలువైన స్వామీ
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
మనసున్న మంచోల్లే మారాజులూ
మమతంటూ లేనోళ్ళే నిరుపేదలూ
ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
ఎవరేమీ అనుకుంటే నీకేమిలే

రాజువయ్యా  మహారాజువయ్యా
రాజువయ్యా  మహారాజువయ్యా







చిత్రం: మహారాజు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి. బాలు

చెలివో  చెలిమివో
సతివో  రతివో సమ్మతివో
ఓహో రమణీ 
సహధర్మచారినీ సహవాసినీ

నీ నయనాంఛల చంఛల వీక్షణలో
నీ నయగారన యాగర జల సంతోృక్షణలో
నీ నిత్యనూత్న ధరహాస శిరశ్చంద్రికలో
నీ కంకణగల గలలలో
నీ పదనూపుర జనం జలలలో

కన్నాను ఎన్నెన్ని రూపాలనో
ఉన్నాను ఎన్నెన్ని నాధాళ్ళనో
నాధాలనో  మేడాలనో

ఓహో రమణీ
సహధర్మచారినీ సహవాసినీ

నీ హృదయం శ్రమ తీర్చే ఆశ్రమమై
నీ వదనం ప్రతి ఉదయం నా సూర్యోదయమై
నా ఇహపరాలు కలబోయు కలావాహినివై
చవిచూసిన సుధా మాధురిలో
ఏ కవి కానని ప్రణయ సాధనలో

చూచాను ఎన్నెన్ని స్వర్గాలనో
దోచాను ఎన్నెన్ని భోగాలనో
భోగాలనో  భాగ్యాలనో

ఓహో రమణీ
సహధర్మచారినీ సహవాసినీ



Palli Balakrishna Thursday, February 4, 2021
Kongumudi (1985)



చిత్రం: కొంగుముడి (1985)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి , యం.బాబురావు 
గానం: యస్.పి.బాలు, రమేష్ నాయుడు, జానకి, శైలజ
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, రోజా రమణి,  బేబీ షాలిని
దర్శకత్వం: విజయబాపినీడు
నిర్మాతలు: ఆనం. గోపాల కృష్ణారెడ్డి, కందేపి సత్యన్నారాయణ
విడుదల తేది: 15.02.1985



Songs List:



అలాంటిలాంటి దాన్ని కాదురా అప్పలకొండా పాట సాహిత్యం

 
చిత్రం: కొంగుముడి (1985)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: యం.బాబురావు 
గానం: యస్.పి.శైలజ

అలాంటిలాంటి దాన్ని కాదురా అప్పలకొండా 




చేయి చూసి చెప్పండి పాట సాహిత్యం

 
చిత్రం: కొంగుముడి (1985)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి 
గానం:  యస్.పి.బాలు

చేయి చూసి చెప్పండి 



మల్లెపువ్వు గిల్లింది పాట సాహిత్యం

 
చిత్రం: కొంగుముడి (1985)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి:
మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పైట జారిపోయింది పాల పిట్ట కూసింది
మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పైట జారిపోయింది పాల పిట్ట కూసింది
పట్టెమంచం కిర్రుమన్నదిరో చల్ మోహన రంగా
నీకు నాకు జోడు కుదిరెను పదరా
నీకు నాకు జోడు కుదిరెను పదరా

చరణం: 1
గాలికైనా సందులేని కౌగిలింతల్లో  కౌగిలింతల్లో
పూలు కూడా అత్తరయ్యే పులకరింతల్లో  పులకరింతల్లో
గాలికైనసందులేని కౌగిలింతల్లో 
గాలికైనసందులేని కౌగిలింతల్లో 
మీగడైన దొరకనీడు పాలపుంతల్లో
జాజి పూలు జలకమాడె జలధరింతల్లో
గుడ్డి దీపం గుబులు రేపెనురో చల్ మోహన రంగా
నేను ఉంటే దీపమెందుకు పదరా చల్ మోహన రంగా
నేను ఉంటే దీపమెందుకు పదరా

మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పక్కనోచ్చి కూకుంటే పట్టుజారి పోయింది
హోయ్ తలుపు గడియ బిగుసు కున్నదే చల్ మోహన రంగి
నీకు నాకు జోడు కుదిరెను పదవే చల్ మోహన రంగి
నీకు నాకు జోడు కుదిరెను పదవే

చరణం: 2
గోడలన్ని గొడవ చూసి నవ్వుకుంటుంటే హెయ్
నవ్వుకుంటుంటే
నీడ కూడా నిజము తెలిసి సిగ్గు పడుతుంటే
సిగ్గు పడుతుంటే
గోడలన్ని గొడవ చూసి నవ్వుకుంటుంటే
నీడ కూడా నిజము తెలిసి సిగ్గు పడుతుంటే
కిటికిటీలు కటకటాల కెలుపు మంటుంటే
సందుచూసి చందమామ తొంగి చూస్తుంటే
కోడి కూస్తే కొంపమునగదటే చల్ మోహన రంగి
కోడి కోసి కూర తిందాం పదవే చల్ మోహన రంగి
కోడి కోసి కూర తిందాం పదవే

మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పైట జారిపోయింది పాల పిట్ట కూసింది
మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పక్కనోచ్చి కూకుంటే పట్టుజారి పోయింది
పట్టెమంచం కిర్రుమన్నదిరో చల్ మోహన రంగా
నీకు నాకు జోడు కుదిరెనురా పదరా
చల్ మోహన రంగి నీకు నాకు జోడు కుదిరెనురా పదవే





ఊరి బయట పాట సాహిత్యం

 
చిత్రం: కొంగుముడి (1985)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి 
గానం:  యస్.పి.బాలు, జానకి 

ఊరి బయట 



రాదా మళ్ళీ వసంత కాలం పాట సాహిత్యం

 
చిత్రం: కొంగుముడి (1985)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి 
గానం:  రమేష్ నాయుడు

రాదా మళ్ళీ వసంత కాలం



శివ శివ ఆగరా పాట సాహిత్యం

 
చిత్రం: కొంగుముడి (1985)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి 
గానం:  శైలజ

శివ శివ ఆగరా

Palli Balakrishna Friday, December 1, 2017
Big Boss (1995)



చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
నటీనటులు: చిరంజీవి , రోజా
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 15.07.1995



Songs List:



మావ మావ మావా పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

మావోయ్...
మావ మావ మావా మావ మావ మావా
ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా
నులకమంచం టైట్ చేశా
రొయ్య పొట్టు చారు చేశా
నులకమంచం టైట్ చేశా
రొయ్య పొట్టు చారు చేశా
రైటు కొట్టి లైట్ తీద్దామా...

మావ మావ మావా... మావ మావ మావా

ఫేసు చూస్తే చపకేసు నులకమంచం సుద్దవేస్టు
ఫేసు చూస్తే చపకేసు నులకమంచం సుద్దవేస్టు
చారుతాగి చెక్కేయ్ భామా

మావా... మావ మావ మావా
ఏమే ఏమే భామా
మావ మావ మావా
ఏమే ఏమే భామా

చిలక రంగు పలక మారుతున్నది
పిల్లో కులుకు చూసి గుబులు తీర్చమన్నది
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
కోరికొచ్చి కోకమీద పడ్డది
గురుడా కొంగుపట్టి కస్సు చూడమన్నది
యస్ పాప మిస్ పాప కుట్టినదే కొంటె చేప
పెట్టేయనా కుచ్చుల టోపా

మావ మావ మావా
ఏమే ఏమే భామా
మావ మావ మావా
దామ్మ దామ్మ దామ్మ

అ - అః
ఏయ్ - ఓయ్
ఓ - ఊ
ఉ...
బెండకాయ బ్రహ్మచారి ముదిరితే
మగడా పనికిరావు ముందుచూపు చూసుకో
ఓ ఓ ఓయ్ ఆ...
సామెతల్ని పొగుచెయ్కె సుందరి
అ పడక పంచుకుంటే మంచిదంట జాంగిరి
యస్ బాసు కిస్ బాసు
అదర గొట్టెయ్ బిగ్ బాసు
ఇచ్చేస్కో వలపుల డోసు

మావ మావ మావా
దామ్మ దామ్మ దామ్మ
నులకమంచం టైట్ చేశా
రొయ్య పొట్టు చారు చేశా
నులకమంచం టైట్ చేసి
రొయ్య పొట్టు చారు చేసి
రైటు కొట్టి లైట్ తీద్దామా...

ఓయ్ మావ మావ మావా
దామ్మ దామ్మ దామ్మ
మావ మావ మావోయ్...
అరె దామ్మ దామ్మ భామోయ్...





అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, రేణుక

అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ
ఒల్లంతా ఊగేస్తన్నాడే చీపాడూ
అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ
ఓయబ్బో ఫుల్ నైటు ఉంటా నీ తోడూ
జఫరు జాగా చూసుకో పాగా వేసుకో
జాగా చూసుకో పాగా వేసుకో
కొండెక్కి పోవాలా కోక ఏడీ
కొండెక్కి పోవాలా కోక ఏడీ

అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ
అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ

లాగేస్తాందీ ఎద లాగేస్తాందీ దిగా
లాగేస్తాందీ వయసు నాయనో
హయ్యో కమ్మేస్తాందీ తెగా కుమ్మేస్తాందీ
యమా కుదిపేస్తాందీ కాక దేవుడో
లాగేస్తాందీ ఎద లాగేస్తాందీ దిగా
లాగేస్తాందీ వయసు నాయనో
హయ్యో కమ్మేస్తాందీ తెగా కుమ్మేస్తాందీ
యమా కుదిపేస్తాందీ కాక దేవుడో
అందుకో మూటా దోసుకో ముల్లే దోచుకో
మూటా దోసుకో ముల్లే దోచుకో
కూతంతా జాగరతా తీసుకోనీ
కూతంతా జాగరతా తీసుకోనీ

అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ
ఓయబ్బో ఫుల్ నైటు ఉంటా నీ తోడూ
అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ
ఒల్లంతా ఊగేస్తన్నాడే చీపాడూ

కొట్టెస్తాందే చెడ కొట్టేస్తాందే
పడ గొట్టెస్తాందే కసి జంగిడీ
ఎక్కేత్తాందీ పరుపెక్కేత్తాందీ
అయ్యో నొక్కేస్తాందీ ఆశ జంపరూ
కొట్టెస్తాందే చెడ కొట్టేస్తాందే
పడ గొట్టెస్తాందే కసి జంగిడీ
ఎక్కేత్తాందీ పరుపెక్కేత్తాందీ
అయ్యో నొక్కేస్తాందీ ఆశ జంపరూ
అమ్మిడి దుత్తా ఎత్తుకో దుప్పట్టి కప్పుకో
దుత్తా ఎత్తుకో దుప్పట్టి కప్పుకో
పట్టిందె నా బుల్లి పైట పిచ్చి
పట్టిందే నా బుల్లో పైట పిచ్చీ

అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ
ఒల్లంతా ఊగేస్తన్నాడే చీపాడూ
అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ
ఓయబ్బో ఫుల్ నైటు ఉంటా నీ తోడూ




ఉరుమొచ్చేసిందోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
చలి గాలి తడుతుంటె కైపెక్కేసిందీ

ఉరుమొచ్చేస్తాంటే ఏటైనాదంటా
మెరుపొచ్చేస్తాంటే ఏటవుతాదంటా
చలి గాలి తదతంటె ఏటెయ్యాలంటా

కోనంగి చినుకుల వానా కొట్టేస్తుంటే
ఒల్లంతా ఏదో గిలి గిలి పుట్టెయ్యదా
సుట్టోటి ముట్టించేసి ఇచ్చేయనా
కుంపట్ని ఎలిగించేసి చలి గాద్దునా
అడి యబ్బా ఏందబ్బా ఏదోలా ఉందబ్బా
అరె వచ్చే వచ్చేయ్ తొంగుందామే ఎచ్చెచ్చగా

ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
ఉరుమొచ్చేస్తాంటే ఏటైనాదంటా
మెరుపొచ్చేస్తాంటే ఏటవుతాదంటా

జతకొచ్చి జంతిక ముక్కలు కొరికించినా
అనకాపల్లి బెల్లం కాజా తినిపించినా
గజ్జల గుర్రం లాంటి పిల్ల నీ ముందుంటే
ముచ్చట పడకా జంతికలెడితే ఏమందావోయ్
ఎట్టెట్టా వల్కోయే నా సత్తా చూస్కోయే
నీ కేటియ్యాలో తెలిసేసింది రాయే బుల్లే

ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
చలి గాలి తడుతుంటె కైపెక్కేసిందీ
ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ
వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ
చలి గాలి తడుతుంటె కైపెక్కేసిందీ




నీలాటి రేవుకాడ పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

నీలాటి రేవుకాడ స్తానాలు చేయబోతే
చాపల్లే వచ్చాడే దొంగా
ఏం చెప్పేను నా సామి రంగా

పాలోల్ల బావి కాడ ఏత్తాము యేస్త ఉంటే
ఎనకలల్ల వచ్చింది పిల్లా
చేత పెట్టిందీ పంచదార బిల్లా

వెన్నెలేమో వరదలాయే ఆశ నన్ను విడవదాయే
వయసు పెట్టే వింత బాదా ఆపలేనయ్యో...మావయ్యో
హద్దులన్నీ పక్కనెట్టీ ముద్దు బాణం ఎక్కు పెట్టి
కాక రేపే కోక దుమ్ము దులుపుతానమ్మో
కొట్టడే కన్ను చందమామా
పెట్టరే జున్ను సత్యభామా

నీలాటి రేవుకాడ స్తానాలు చేయబోతే
చాపల్లే వచ్చాడే దొంగా
ఏం చెప్పేను నా సామి రంగా

పాలోల్ల బావి కాడ ఏత్తాము యేస్త ఉంటే
ఎనకలల్ల వచ్చింది పిల్లా
చేత పెట్టిందీ పంచదార బిల్లా

చిలి ఊహా పుట్టినాకా చిలక కూతా పెట్టినాకా
గందమంటీ అందమంతా అరగదియ్యలే ఓ చిలకా
మోజులన్నే మూట కట్టీ మంచులాగా కమ్ముకుంటే
మల్లె మొగ్గా నలిగిపోతే ఎట్త మావయ్యో
పెట్టింది కేక పావురాయీ
సయ్యంది రయ్యొ సోకు రాయీ

నీలాటి రేవుకాడ స్తానాలు చేయబోతే
చాపల్లే వచ్చాడే దొంగా
ఏం చెప్పేను నా సామి రంగా

పాలోల్ల బావి కాడ ఏత్తాము యేస్త ఉంటే
ఎనకలల్ల వచ్చింది పిల్లా
చేత పెట్టిందీ పంచదార బిల్లా




నంబర్ వన్ నంబర్ టు పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు

నంబర్ వన్ నంబర్ టు




సూదికి దారం ఎక్కిద్దామని పాట సాహిత్యం

 
చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, చిత్ర

సూదికి దారం ఎక్కిద్దామని టక్కున వచ్చేశా
చెత్తిన సూది కనపదకుంటే చేతులు ఎత్తేశా
పోయిందోయ్ సూది సూది
వెతికించా వీది వీది
చెప్పించా సోదీ సోదీ
ఇస్తావా నీదీ నీదీ..ఇవ్వవా

తాడుని ఎక్కి తువ్వాయ్ కోసం కట్టిని కోశావా
చాపని పట్టాలనుకొని పిలా చేలో వెతికావా
ఏడుందోయ్ సూది సూది ఆడుందా సూది సూది
ఇడుందా సూది సూది ఇచ్చెయ్నా పోనీ నాదీ..ఇవ్వనా

నీకు నాకు పెళ్ళవుతుందని రాతిరినే కలగన్నా
నీకో లుంగీ నాకో లంగా కుట్టెయ్యాలనుకున్నా
ఆదికోసం వస్తే సూదే పోయేరా కన్నా

రావే నా బందరు లడ్డు ఆదికి నా తూనా బొడ్డు
చేరేద్దం అవతలి ఒడ్డు లేదంటా మనకే అడ్డు
అయ్యొ బాబో అట్ట వస్తే అలుసైపోనమ్మా
పెళ్ళికి ముందే టింగ్ టింగ్ అంటే సిగ్గేస్తుందమ్మా

పోయిందా సూది సూది సు సు సు సూది సూది
ఇస్తావా పోనీ నీది...ఇవ్వవా

సూదికి దారం పిల్లకి మారం ఉండాలే ఓ పిల్లా
ఓసారైనా వాడని సూది ఉండాలే రసగుల్లా
దారమిస్తే సూదెక్కిస్తా ఇచ్చుకో మల్లా

వారెవ్వా హీరో హీరో బేషుగ్గా ఉందోయ్ యారో
కిస్స్ ఇస్తా రారో రారో కౌగిట్లో మారో మారో
ఊసి నీ వేషాలన్ని ఇందాకే చూశా
ముక్కు పట్టి ఆదిద్దాం అని ఓ ట్రై ఏ ఏశా

నువ్వే నా చికెన్ మసాలా నువ్వే నా పెప్సి కోలా
రావే న పెసరట్ ఉప్మా నువ్వే నా మతన్ సమోసా
లేటెందుకు రాజా రాజా లైనేద్దం ఆజా ఆజా
రావే నా మసాల దోసా తీరుస్తా తియ్యని ఆశా


Palli Balakrishna Thursday, August 31, 2017
Magadheerudu (1986)




చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి , జయసుధ
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 07.03.1986



Songs List:



జతకలిసే ఇద్దరం పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: జి. జేషువా
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి
సరిపడదీ లాంఛనం
ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం
ఆపైన నలుగురం 
ఆపైనా...
ఆపేస్తే అదే సుఖం
సుఖం సుఖం సుఖం సుఖం

జతకలిసే ఇద్దరం 
ప్రతిరేయి శోభనం, శోభనం

పాతనేది కొత్తగా కొత్తనేది వింతగా
కొంగుచాటు కవ్వింతగా 
ముద్దుమీద ముద్దుగా మూడు ముళ్ళు గుచ్చగా
ఇల్లే ఈ కౌగిలింతగా
నడుమ నడుమ చిరుగాజులు చప్పుడు
తొడిమ లేని సనజాజుల నిప్పులు
నడుమ నడుమ చిరుగాజులు చప్పుడు
తొడిమ లేని సనజాజుల నిప్పులు
చుప్పనాతి నోళ్ళకి చూడలేని కళ్ళకి
కలుసుంటే ఇద్దరం కన్నీళ్ల కలవరం
ఒళ్ళంతా కంపరం ఆ పైన చలి జ్వరం
జ్వరం జ్వరం జ్వరం జ్వరం 

జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి
సరిపడదీ లాంఛనం
ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం
ఆపైన నలుగురం 
ఆపైనా...
ఆపేస్తే అదే సుఖం
సుఖం సుఖం సుఖం సుఖం

మొన్నకన్న మోజుగా నిన్నకన్న రంజుగా
రోజురోజుకీ లబ్జుగా
పగలు కూడ రాత్రిగా రతుల మొదటి రాత్రిగా
సిగ్గుతాకితే చిచ్చుగా
వెలుగు వెనక ఆడుకునే ఆటలు
వెతికి వెతికి అందుకునే వేటలు
వెలుగు వెనక ఆడుకునే ఆటలు
వెతికి వెతికి అందుకునే వేటలు
చప్పరాని వాళ్ళకి చెప్పుకింద కీళ్ళకి
ఒకటైతే ఇద్దరం అల్లరే ఆగడం
అసూయ ఆగ్రహం ఆపైన చలి జ్వరం
స్వయంవరం ప్రియంవరం

జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి
సరిపడదీ లాంఛనం
ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం
ఆపైన నలుగురం 
ఆపైనా...
ఆపేస్తే అదే సుఖం
సుఖం - సుఖం, సుఖం - సుఖం



ఇంటి పేరు అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, విశ్వనాథ్, లలితా సాగరి, వాణీ జయరాం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బృంధావనం మా ఇల్లె బృంధావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం

వెలుగు నీడలైనా కలిమి లేములైనా
మా ముంగిట ఎప్పుడు చిరునవ్వుల ముగ్గులె
వెలుగు నీడలైనా కలిమి లేములైనా
మా ముంగిట ఎప్పుడు చిరునవ్వుల ముగ్గులె

ఎదిరించని జానకీ నిదురించని ఊర్మిలా
తోడి కోడల్లుగా  ఇల్లు చక్కదిద్దగా
ప్రేమకు రూపాలుగా రామలక్ష్మనులుగా
కొండంత అన్నలు అండగా ఉండగా

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బృంధావనం మా ఇల్లె బృంధావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం

వయసులొ చిన్నైనా మనసులొ పెద్దగా
తమ్ముడన్న మాటకె తాను సాక్షిగా
వయసులొ చిన్నైనా మనసులొ పెద్దగా
తమ్ముడన్న మాటకె తాను సాక్షిగా

అమ్మగా నాన్నగా బిడ్డగా పాపగా
యే దేవకి కనా యే యసోద పెంచినా
గోకులాన వెలిసాడో గొపాల కృష్ణుడు
మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బృంధావనం మా ఇల్లె బృంధావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం



అటు దహనం పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: జి. జేషువా
గానం: యస్.పి.బాలు

అటు దహనం ఇటు ఖణనం
అటు మరణం ఇటు జననం
అటు దహనం ఇటు ఖణనం
అటు మరణం ఇటు జననం

ఇంతకన్న ఏం చేస్తావు
నన్ను ఏం సాదిస్తావు
ఇంతకన్న ఏం చేస్తావు
నన్ను ఏం సాదిస్తావు

నిన్ను నమ్మి ఎప్పుడెవడు సుఖపడ్డాడు
నీలో హృదయం అన్నది ఎవడు చూడగలిగాడు
నిన్ను నమ్మి ఎప్పుడెవడు సుఖపడ్డాడు
నీలో హృదయం అన్నది ఎవడు చూడగలిగాడు
సత్యం నీవని నమ్మి ధర్మం నీవని నమ్మి
హరిచంద్రుడేమైనాడు...
గూటికి పేదైపోయి కాటి కాపరైనాడు
జీవచవమై నాలా స్మశానాలో చేరాడు

సత్యం వధ, ధర్మం చర
సత్యమేవ జయతే

అటు దహనం ఇటు ఖణనం
అటు మరణం ఇటు జననం

ఇంతకన్న ఏం చేస్తావు
నన్ను ఏం సాదిస్తావు
ఇంతకన్న ఏం చేస్తావు
నన్ను ఏం సాదిస్తావు

నా ఇల్లని నా వాళ్ళని ఐక్యంగా బ్రతకాలని
ఆశలు అడియాశలైన పిచ్చివాడ్ని నేను
నా ఇల్లని నా వాళ్ళని ఐక్యంగా బ్రతకాలని
ఆశలు అడియాశలైన పిచ్చివాడ్ని నేను

అన్నపూర్ణ భయపడకు
బాధపడకు అన్నపూర్ణ
ఏదో సుముహూర్తంలో నువ్విటు వస్తావు
చితిమంటల వెలుగులో నన్ను కలుసుకుంటావు
సర్వసమానత్వానికి వేదిక ఈ స్మశానం
ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం
అన్నపూర్ణ
ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం



ఇచ్చోటనే పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: జి. జేషువా
గానం: యస్.పి.బాలు

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె

ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికారముద్రికల్ అంతరించే

ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయె

ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికంగన్న  చిత్రలేఖకుని  కుంచె నశించె

ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు

ఇది మరణదూత తీక్షణమౌ దృుష్టులొలయ అవనిపాలించు భస్మ సింహాసనంబు...

అ.... ఆ....భస్మ సింహాసనంబు


దళమౌ పై ఎదలో నడంగియు
సముజ్వల కాంతులీవెండలన్
మలయింపన్ దిశలన్
వదీయ కడసీమన్
బాల సూర్యప్రబాకలితంబై 
వెలుగొందు చున్నయదీ
అది మంగల్యంబు కాబోలు
అది మంగల్యంబు కాబోలు
దానిని ఏ వెలకైనన్ తెగనమ్మి
నీ సుతునికై వెచ్చించి నన్
చెల్లదే.......  అ....ఆ... 



మన జీవితాలు పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా
మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా

మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా
మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా

ఏ రంగమెక్క వలెనో ఏ రంగు మర్చవలెనో
ఏ పాత్ర వేయవలెనో ఏ యాత్ర చేయవలెనో

ఆ... ఆ...
శభాష్

మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా
మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా

పడుతోంది ఇరవైఒకటో శతాబ్దాల నీడ
పడుచమ్మ మార్చాలమ్మ పాడు పాత పాట
జెట్ మీద వెళ్ళే కాలం నీ జట్కాలింకామానుకో
నీ చిట్కాలింకా మార్చుకో

ఇన్హిలగోనె  ఇన్హిలగోనె
ఇన్హిలగోనె  ఇన్హిలగోనె
లేలో దుపట్టా మేరా
హాయ్ దుపట్టా మేరా

తెలుగే సరిగా రాదు మళ్ళీ హిందీ ఒకటి
తెలుగులో పాడుతల్లి

మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా
మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా

ఎన్నాళ్లీ ఇడ్లీ సాంబార్ కొత్త రుచులు చూడరా
ఎన్నాళ్లీ కాశీ మజిలీ కొత్త కథలు చెప్పరా
వీడియోలు చూసే కాలం నీ సినిమా హాల్లే దండగ
ఈ చిన్నింట్లోనే పండగ

యమునను నడిరేయి దాటితివంట
వెలచితివంట నందుని ఇంట
రేపల్లె ఇల్లాయేనంటా

నా తండ్రే ఇంకొకళ్ళ పాటెందుకు
నీ సొంత పాట పాడమ్మా

మన జీవితాలు నవ నాటకాలు
అహ తెలుసుకొనవె చెలియా
మన జాతకాల ప్రియ సంతకాల
సరి చూసుకోర సఖుడా

ఏ రంగమెక్క వలెనో ఏ రంగు మర్చవలెనో
ఏ పాత్ర వేయవలెనో ఏ యాత్ర చేయవలెనో

ఆ... ఆ...
Once more
ఆ... ఆ...
Please once again
I say Shut up



మంచిని పంచిన పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు

మంచిని పంచిన నీవు బాబు
మంచిని పంచిన నీవు బాబు
వంచన పాలైనావు

అనురాగం మమకారం
అరదండాలై ఖైదీ అయ్యావు

మంచిని పంచిన నీవు బాబు
వంచన పాలైనావు

తలపై మోసావు ఈ నేరము
త్యాగం గుర్తించదీలోకము
నీలో నీతిని నమ్మి నలిగిందో హృదయము
నీతికి గోతులు తవ్వి కులికిందో భోగము
ఈ ఆస్తి పాస్తులనేలి కావయ్య శాశ్వతం
ఈ అన్నాదమ్ములగాదే అలనాటి భారతం

బాబు వంచన పాలైనావు
మంచిని పంచిన నీవు బాబు
వంచన పాలైనావు

ధనమే ఓ కక్షగా రగిలెను
మనసే ఓ శిక్షగా మిగెలెను
న్యాయం గాయం చేసి గుండెల్లో మూల్గెను
కల్లా కపటం కలిసి నిను రచ్చ కీడ్చెను
ఈ నెత్తురు మెత్తని కత్తై నీ వెన్నే పొడిచెను
అది రుజువే లేని నిజమై నీతోనే నదిచెను

బాబు వంచన పాలైనావు
మంచిని పంచిన నీవు బాబు
వంచన పాలైనావు



మన జీవితాల ు(Sad Song) పాట సాహిత్యం

 
చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

మన జీవితాలు నవ నాటకాలు
తెలుసుకొనర నాన్న 
మన జాతకాల చిరు సంతకాలు
సరి చూసుకోనర తండ్రి 

ఏ రంగమెక్క వలెనో ఏ రంగు మర్చవలెనో
ఏ పాత్ర వేయవలెనో ఏ యాత్ర చేయవలెనో


మన జీవితాలు నవ నాటకాలు
తెలుసుకొనర నాన్న 


ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బృంధావనం

Palli Balakrishna
Maga Maharaju (1983)



చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి. బాలు, మాధవ పెద్ది రమేష్ , పి. సుశీల, యస్. జానకి, వాణీ జయరాం, యస్. పి. శైలజ, రమణ
నటీనటులు: చిరంజీవి , సుహాసిని, తులసి, రోహిణి
కథ: ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ
మాటలు: కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: విజయబాపిణీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 15.07.1983



Songs List:



నీ దారి పూలదారి పోవోయి బాటసారి పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: గానం: యస్.పి. బాలు, మాధవ పెద్ది రమేష్ , పి. సుశీల, యస్. జానకి, వాణీ జయరాం, యస్. పి. శైలజ, రమణ

నీ దారి పూలదారి పోవోయి బాటసారి



అన్నలో అన్న పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

అన్నలో అన్న



సీతే రాముడి కట్నం పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి 

సీతే రాముడి కట్నం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
రామయ్యే సీతమ్మకు పేరంటం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే
పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం

సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది
ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతమ్మ రామయ్యల కళ్యాణం


సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం





నెలలు నిండే పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్.జానకి 

నెలలు నిండే



మా అమ్మ చింతామణి పాట సాహిత్యం

 
చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి 

మా అమ్మ చింతామణి

Palli Balakrishna
Patnam Vachina Pativrathalu (1982)


చిత్రం: పట్నం వచ్చిన పతివ్రతలు  (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి , మోహన్ బాబు, రాధిక , గీత
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: అట్లూరి రాధాకృష్ణ మూర్తి
విడుదల తేది: 01.10.1982

పల్లవి:
హేయ్... హేయ్... హేయ్... హేయ్
ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
హేయ్... పిలకంత  జడ ఉంది... నలకంత నడుముంది
పిసరంత పొగరుంది... సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్...

ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
పిలకంత జడ ఉంది... నలకంత నడుముంది
పిసరంత పొగరుంది... సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్...

చరణం: 1
ఇంగ్లీషులో ఢంగు చేస్తాదో దొరసాని
నాటు మాటలో ఘాటుకుంటదో దొరసాని..
ఆ.. ఆ.. ఇంగ్లీషులో డంగు చేస్తాదో దొరసాని
నాటు మాటలో ఘాటుకుంటదో దొరసాని..

కాశులపేరుందంది.. కంచిపట్టు చీరంది
రైళ్లుల్లో బసుల్లో కనపడితే చెప్పండి
ఒళ్లు కళ్లు ఒక్కటి చేసుకొని వెతకండోయ్...

ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
పిలకంత జడ ఉంది... నలకంత నడుముంది
పిసరంత పొగరుంది... సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్...

చరణం: 2
పట్టణాలకే పుట్టుమచ్చ ఓ చిలకమ్మా
పల్లెసీమకే పచ్చబొట్టు ఓ చిలకమ్మా
ఆ.. ఆ.. పట్టణాలకే పుట్టుమచ్చ ఓ చిలకమ్మా
పల్లెసీమకే పచ్చబొట్టు ఓ చిలకమ్మా

హేయ్.. సినిమాలే చూస్తోందో? షికారులే చేస్తోందో?
బజారుకే వచ్చిందో? ఏ బాధలు పడుతోందో?
నింగికి నేలకు నిచ్చెనలేసుకొని వెతకండోయ్...

ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
పిలకంత జడ ఉంది... నలకంత నడుముంది
పిసరంత పొగరుంది... సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్...


********   ********  ********


చిత్రం: పట్నం వచ్చిన పతివ్రతలు  (1982)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:
గానం:  సుశీల

పల్లవి:
సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగ నేనే గొప్పా...  స్వామీ

ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి

చరణం: 1
నీ కౌగిలే కాసుల పేరని
నీ ముద్దులే ముత్యపుసరులని
మురిసితిగాని కొసరి కొసరి నే కోరితినా ఆ ఒక్కటి తప్ప
అది నీకు నాకు తెలుసును తప్ప....  స్వామి

ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి

చరణం: 2
ఇంటిపెత్తనాలడిగితినా
వీధికెక్కినే నలిగితినా
ఆ..... ఆ..... ఆ..... ఆ
సాధింపులతో సణిగితినా
ఆ..... ఆ..... ఆ
సాధింపులతో సణిగితినా
నిను బాధపెట్టి నేనెరుగుదునా
కోరితినా ఆ ఒక్కటితప్పా
అది నీకు నాకు తలుసును తప్ప ... స్వామి

ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి

చరణం: 3
ఎన్నాళ్ళీ లంక చెర ..
ఏనాడు విందువో నాదుమొర
ఆ.... ఆ.... ఆ..ఆ
ఆత్రప్రాణపరయాణ శీలా
ఆ..ఆ...ఆ.... ఆ
ఆత్రప్రాణపరయాణ శీలా
అన్యమడుగునా ఆ ఒక్కటితప్ప
కోరితినా ఆ కోరికతప్ప అది నీకు నాకు తలుసును తప్ప స్వామి

ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగ నేనే గొప్పా స్వామీ
సీతారామ స్వామి నే చేసిన నేరములేమి

Palli Balakrishna Saturday, August 26, 2017
Gang Leader (1991)




చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి
దర్శకత్వం: విజయబాపిణీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 09.05.1991



Songs List:



పాపా రీటా పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చిక్ చిక్ హా
చికిచ్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చికిచ్ చిక్క్ చిక్ హా హా
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా
పాపా రీటా హా  ఆపెయ్ వేట హొ
ఆడితే ఆట హా హా ఇస్తా కోటా హా
G A N G  Gang Gang బజావో Bang Bang
Gang Leader...

షబబ్బాబ రిబబ్బాబ రబరిబ బీబ రబరిబ ప ప ప ప
రీప్ప రబరిబ రిబప్పాబ రిప్ప
హు హు హు హు హు
కిసక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే
కిలాడి నక్కల బజారు కీడ్చే A1 gang మాదే

G A N G  Gang Gang బజావో Bang Bang
Gang Leader...

చరణం: 1
బ్రహ్మ రాతని డుబబ్బాబబ కృష్ణగీతని డుబబ్బాబబ
మళ్ళీ రాస్తా డుబబ్బాబబ డుబ డు డు డు డు
స్వర్ణయుగంలో డుబబ్బాబబ స్వర్గసుఖాన్ని డుబబ్బాబబ
మళ్ళీ తెస్తా డుబబ్బాబబ డుబ డు డు డు డు
ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హా
ఉరితీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే
G A N G  Gang Gang బజావో Bang Bang
Gang Leader...

చరణం: 2
ఆవేశంలో డుబబ్బాబబ భగత్ సింగ్ కి డుబబ్బాబబ
భక్తుడు నేనే డుబబ్బాబబ డుబ డు డు డు డు
ఆలోచనలో డుబబ్బాబబ సుభాష్ బోస్ కి డుబబ్బాబబ
శిష్యుడు నేనే డుబబ్బాబబ డుబ డు డు డు డు
ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హాహా
రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా

G A N G  Gang Gang బజావో Bang Bang యహ్
Gang Leader...



పాలబుగ్గా... పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పాలబుగ్గా... ఇదిగో పట్టు
ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు
జారేపైటా... చప్పున పట్టు
దక్కాలంటే... తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు
లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే పెంచాలా
కామన్ ప్రేమన్ భామన్ ముగ్గులో దించాలా
ఐ లవ్ యూ నా మంత్రం...

చరణం: 1
కంట్లో కథేమిటంట ఒంట్లో కసేమిటింట ఎత్తేయ్ బావుటా
నిన్నే నిలేసుకుంటా నీతో పెనేసుకుంటా లేదోయ్ అలసట
పిల్లా సరేను అంటే మళ్లీ సరాగమంటా లాగించు ముచ్చట
ఈడే విలాసమంటా తోడై కులాసగుంటా సిగ్గే చిటపట

హా... హా... హా... హో... హే... హే... హా... హా...

తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా
ఐ లవ్ యూ నా మంత్రం...

పాలబుగ్గా... ఇదిగో పట్టు
ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు
జారేపైటా... చప్పున పట్టు
దక్కాలంటే... తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు

చరణం: 2
నాలో వసంతగాలి నీలో వయస్సు వేడి రేగే జంటగా
ఏదో తుఫాను రేగి నాలో ఉయ్యాలలూగి నీలో కలవగా
నాలో శివాలు రేపి నిన్నే సవాలు చేసే అందం పండగా
షోకే సలాము చేసే నీకే గులాముకాని దమ్మే దండగ

హా... హా... హా... హో... హే... హే... హా... హా...

తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా
ఐ లవ్ యూ మన మంత్రం...

పాలబుగ్గా... ఇదిగో పట్టు
హా ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు
జారేపైటా... చప్పున పట్టు
ఓ దక్కాలంటే... తాళిని కట్టు
హోయ్ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు





భద్రాచలం కొండ పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

హోయ్ భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకండాదండా...
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

కొండవీటి దొంగ మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా
టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

చరణం: 1
ధం ధమాధం లుక్కేశా ధన్ ధనాధన్ తొక్కేశా ఫట్ ఫటాఫట్ కొట్టేశా రో
జం జమాజం ఝమ్మంటూ కస్ కసాకస్ కిస్సెట్టి ఛం ఛమాఛం వాటేశారో

హోయ్ హోయ్ హోయ్ ధం ధమాధం దుప్పట్లో
ధన్ ధనాధన్ దూరేసి ఫట్ ఫటాఫట్ బజ్జోవమ్మో
జం జమాజం ఏ పిల్లో కస్ కసాకస్ ముద్దెట్టి ఛం ఛమాఛం పోతుందమ్మో

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా
టప్పు టప్పు
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

కొండవీటి దొంగ మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా
హోయ్ టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి హోయ్
టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

చరణం: 2
హొయ్ హోయ్ వెర్రికి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది నిమ్మరసం తాగించనా
వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది ఉన్న మతే పోయిందిరో

అరెరెరె... సిగ్గుపడే పిల్లందం దాస్తేనే ఆనందం వెంటపడి వేధించకే
నవ్వించే పువ్వందం కసిరే తుమ్మెద సొంతం కాదంటే ఎట్టాగయ్యో

అరెరెరెరె... టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
ఓ టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

హోయ్ భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకండాదండా...
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా...

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా




వాన వాన పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

చరణం: 1
చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం
హో తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే
కొండాకోన తుళ్లిపోయే

చరణం: 2
ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

లాలా లాలా లాలా లాలా ఆ...
లాలా లాలా లాలా లాలా ఓ...
లాలా లాలా లాలా...



వయసు వయసు పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం

చరణం: 1
ఉదయం చుంబన సేవనం
మద్యాహ్నం కౌగిళి భోజనం
సాయంత్రం పుష్ప నివేదనం
రాతిరివేళల మహనైవేద్యం
మనసు మనసుల సంగమం
తనువుకు తనువే అర్పణం
తొలివలపుల సంతర్పణం
మరెందుకాలస్యం
నయమారా దరిచేరా బిగువేరా
సరసకు రారా వీరా ధీరా

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

చరణం: 2
నీవేలేని నేనట నీరేలేని యేరట కాలాలన్నీ కౌగిట
మదనుని శరముల స్వరములు విరియగ
తారా తారా సందున ఆకాశాలే అందునా
నీకు నాకు వంతెన
అమాస వెన్నెలలో
పరువాన స్వరవీణ మృదుపాణి
సరస మధురలయ లావణి పలికిన

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం




పని సాసస పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

పని సాసస పని సాసస
సగ మామమ సగ మామమ
అరె హా...హా...
ఆ సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా
నా రాజా రా ఇటు రా... (2)
చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా
లవ్వాడమన్నాను రా...
నా రాజా రా ఇటు రా... (2)

పని సాసస మ్మ్ హుఁ హుఁ
పని సాసస హహ హాహహా
సగ మామమ హేహె హెహెహే
సగ మామమ ఓహొహో
అరె హా...హా...

చరణం: 1
బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో
మన మధ్య తడికెందుకంట... బావోయ్...
ముద్దుల్లో ముంచెత్తమంట
హాయ్...గయ్యాళి గంగమ్మో సిగపట్ల సింగమ్మో
నసమాని దయచేయమంట... పిల్లా...
నువ్వంటే నాకొళ్ళు మంట
అదిగో పక్క ఇదిగో చుక్క
అసలే ఉక్క పోవే తిక్క

అరె హా...హా...
పని సాసస పని సాసస
సగ మామమ సగ మామమ
అరె హా...హా...యా
ఆ సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా
నా రాజా రా ఇటు రా...
నా రాజా రా ఇటు రా రా...

చరణం: 2
ఆ తొట్టు వెళదామా ఓ పట్టు పడదామా
చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో...
ఒళ్ళంతా సెగలే బావయ్యో...

హోయ్... ఒళ్ళంతా సెగలైతే వగలెందుకే వనజమ్మా
నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా
నీ పిచ్చి కుదిరిస్తానమ్మో...
అయ్యో రాత వినవా గీత
ఆపెయ్ మోత పెడతా వాత
అరె హా...హా...

చక చాచచ మ్మ్ హుఁ హుఁ
చక చాచచ హహ హాహహా
ఛీఛీ ఛీఛీఛీ అరె రారరా
తుతు తూతుతు హహ హాహ
అరె హ హ హ హ హ హ హాహా

ఆ సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా
నా రాజా రా ఇటు రా...(2)
చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా
లవ్వాడుమన్నాను రా...
నా రాజా రా ఇటు రా... (2)

Palli Balakrishna Monday, August 7, 2017

Most Recent

Default