Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ghani (2022)



చిత్రం: గని (2022)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: వరుణ్ తేజ్, సైయి  మంజీర్కర్
దర్శకత్వం: కిరణ్ కొర్రపాతి
నిర్మాత: సిధు ముద్ద, అల్లు బాబి
విడుదల తేది: 08.04.2022



Songs List:



Ghani Anthem పాట సాహిత్యం

 
చిత్రం: గని (2022)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ఆదిత్య అయ్యంగార్, శ్రీ కృష్ణ, ప్రుద్వి చంద్ర , సాయి చరణ్ 

నీ జగజగడం… వదలకురా కడవరకు
ఈ కదన గుణం… అవసరమే ప్రతి కళకు

హే, నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు
ఇవ్వాలె నీకు మైదానం
హే, నీ చూపు ఏ వైపు మల్లించకు
ఏకాగ్రతేరా సోపానం

పడ్డావో లేచావో నువ్వాగకు
కొనసాగాలి క్రీడాప్రస్థానం
హే, తగ్గేది నెగ్గేది లెక్కించకు
నీ ఆటే నీకు సన్మానం

ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ
ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ

దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని
దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని

హే, రేపు మనదిరా… గెలుపు మనదిరా
రేయి చివరలో… వెలుతురుందిరా
రేపు మనదిరా… గెలుపు మనదిరా
ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా

దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని
దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని
దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని

నేమ్ ఈజ్… గ ఘ ఘనీ
నేమ్ ఈజ్… గ ఘ ఘనీ




కోడ్తే కోడ్తే పాట సాహిత్యం

 
చిత్రం: గని (2022)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హారికా నారాయణ్

లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా

రింగారె రింగ రింగ
రింగ రింగా
రింగ్ ఆఫ్ ద డెస్టినీ కి
రారా సింఘా

దిల్ మాంగే స్పోర్టే నీకు
ఈ బాక్సింగా
తు ఆజారే అమీ తుమీ సన్నాహంగా

పిడికిల్లై పదివేళ్ళు వంగనీ వంగనీ
వరదల్లె అడ్రినాలిన్ పొంగనీ పొంగనీ
నీ పదునేంటో పవరేంటో
పంచుల్లో కనిపించనీ

కోడ్తే కోడ్తే కోడ్తే కోడ్తే

లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా

సో కాల్డ్ ప్లేయర్స్ సో మెనీ
ఎవ్వడి ఫోర్స్ ఎంతనీ
లెగ్గెడితే నెగ్గాలని
నువ్వాడాలి ఆటని

ఆకాశాల అంచున
నీ మీదున్న అంచనా
నిజమయ్యే లెక్కన
ధమ్ లగాకే ఖేలోనా

ఒప్పొనెంట్ ఎంతోడైనా
ఉస్కో నాకౌట్ కర్ధేనా
హమ్ హై రాజా రేంజ్ లో
తుమ్ ట్రోఫీ లేలోనా

జో జీత ఓ హి
సికందర్ హోతా హై నా
కోడ్తే కోడ్తే కోడ్తే కోడ్తే



రోమియోకి జూలియటులా పాట సాహిత్యం

 
చిత్రం: గని (2022)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హారికా నారాయణ్

రోమియోకి జూలియట్ లా
రేడియోకి శాటిలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోన నీకు నేనిలా

చూపులేమో చాక్లెట్ లా
నవ్వులేమో మాగ్నెట్ లా - లా
నచ్చినావు అన్నివేళలా
మస్తుగున్న చందమామలా

న్యూటన్ చెప్పిన సూత్రమేదో
గుండెనే లాగెనా
యూటర్న్ తిరిగే నీడలాగా
వెంటనే సాగనా

వేటూరిలా నండూరిలా
వర్ణించమంటే నీపై ప్రేమే
బాషలన్ని చాలవే మరి

రోమియోకి జూలియట్ లా - లా
రేడియోకి శాటిలైట్ లా - లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోన నీకు నేనిలా

ఆ మేఘమే వానలా మారి
నా కోసమే చేరగా
ఆనందమే అడుగులే వేసి
నా సొంతమే అవ్వగా

ఎప్పుడైన నాకునేను నిన్నదాకా
నచ్చనైన నచ్చలేదు ఇంతలాగ
ఊపిరే ఊయలై ఊగుతోంది ఉన్నపాటుగా

రోమియోకి జూలియట్ లా - లా
రేడియోకి శాటిలైట్ లా - లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోన నీకు నేనిలా

పై పై… స్వీటీ పై
పై పై… స్వీటీ పై


Palli Balakrishna Saturday, February 12, 2022
Bhala Thandanana (2022)



చిత్రం: భళా తందనాన (2022)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: శ్రీ విష్ణు, కేథరీన్ థెరిసా
దర్శకత్వం: చైతన్య దంతులూరి 
నిర్మాత: రజిని కొర్రపాటి 
విడుదల తేది: 06.05.2022



Songs List:



మీనాచ్చి మీనాచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: భళా తందనాన (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి 
గానం: ధనుంజయ్ సేపాన 

మీనాచ్చి మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి

మీనాచ్చీ మీనాచ్చి
ముసుగేసావే మనస్సాచ్చి
నచ్చిందే ఈ పిచ్చి
నమ్మకపోతే నీ స్సాచ్చి

తిరిగాననీ నీ నీడగా
నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా
నా పేరే మారు మనువాడే
పిసినారీ నా దారి మారి పారిపోయె

మీనాచ్చి మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి

సిగురులా సింత ఇగురులా
నీలో పులుపే ఇలా పలుపైనదే
సెరుకులా నను కొరికితే బాలా
కసికందినా కసి తీరదే

సప్పగా సంకటే మారినా
నీ సుట్టు నే సుట్టడం మారదే
సుక్కలే రేయిలో ఆరినా
నిన్ను నే సూడటం ఆగదే

నాలొ గుంజేసి ఊపిరి నంజేసుకోమరి
నన్నింక నాంచారి చేరి సేయి జారిపోకె

మీనాచ్చీ మీనాచ్చి
దయలేదంటే పిల్లాచి
ముసిముసిగా ఎసరేసి
నను తాగేసావే వడకాచి

సిగలతో నువ్వు సిగినెలే ఇస్తే
వచ్చిపొమ్మనా సచ్చిపొమ్మనా
బొమ్మ సూడని బ్రహ్మచారిని
నన్నే నమ్మలేననా సొమ్ములేదనా

పోకిరీ గాడనీ ఎంచకే
పూటుగా పుట్టినే ముంచకే
కోపమే కొంగుకే కట్టకే
పాపమే కంటితో కొట్టకే

అంట గట్టేసి సురకలు
సూదంటు కులుకులు
సేదైన సెణుకులు
ఓసి ఆశ తీరదాయే

మీనాచ్చీ మీనాచ్చి
కొరుకుడు పడని కొరకంచి
నీ పైటంచూ ఎరవేసి
చేసావే నన్ను సన్నాసి

తిరిగానని నీ నీడగా
నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా
నా పేరే మారు మనువాడే
పిసినారీ నా దారి మారి పారిపోయే

మీనాచ్చీ మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి




రాసానిలా కనబడనీ పాట సాహిత్యం

 
చిత్రం: భళా తందనాన (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా

రాసానిలా కనబడనీ వినబడనీ ప్రేమలేఖ
చూసానిలా కదలననీ వదలననీ మౌనరేఖ

రాసానిలా కనబడనీ
వినబడనీ ప్రేమలేఖ

నింగిలోని నీరులా
నీటిపైన పేరులా
కానరాని ప్రేమలేఖా రాసానిలా

మీటలేని వీణలా
మాటరాని పాపలా
అందమైన మౌనరేఖ చూసానిలా

పుస్తకంలో దాచుకున్న
నెమలికన్ను జ్ఞాపకంలా
మనసు దాటలేని
మొదటి కవితలా

అల్లుకున్న పంజరానే
తేలుతున్న పావురంలా
గీసుకున్న గీతే దాటలేనెలా

తనని నాతో కలపగలిగే
పిలుపు ఏదో తెలియక
తెలుపలేక నిలుపలేక
అలసిపోయా…నికా

దాచానిలా నిజమిదనీ
ఋజువుదనీ చూపలేకా
చేరానిలా ఇరువురిదీ
ఒకటి అనీ తీరారేఖ

నడి ఎడారిదారిలో మౌన బాటసారిలా
ఒంటరల్లే సాగానే నాకు నేనే
ఎండమావి గుండెలో మండుతున్న ఎండనే
వెన్నెలల్లే కాచావే నీవు నన్నే

కలిసి ఉన్న వేళలోన
వీలుకాని మాటలన్నీ
మనసుతోటి నేడే మాటలాడనా
ఊపిరాగి ఆగమన్నా గుండెచప్పుడాపుతున్నా
దాచుకున్న ప్రేమే నీకు చూపనా

తెగిన గాయం తగదు అన్నా
ఆగిపోదే మన కధా
చివరి క్షణమే మధురకావ్యం
ప్రేమకెపుడూ కదా

Palli Balakrishna Friday, February 11, 2022
Khiladi (2022)



చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: రవి తేజా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి
దర్శకత్వం: రమేష్ వర్మ 
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, రమేష్ వర్మ 
విడుదల తేది: 11.02. 2022



Songs List:



ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: హరిప్రియ 

చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం
బళ్ళోకెళ్ళే వేళ… రెండు జల్లు అంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం

కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నాకోసం నువు పడే కష్టం

తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే… స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
అద్దం ముందర నాకు… అందమద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం… ఆహా ఓహో అంటే ఇష్టం

గొడుగులేని వేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదుర రాని వేళ జోలపాట ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం

రెప్పల తలుపు మూసి… కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే… కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే… చిలిపి అల్లరంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే… కొత్త కబురులంటే ఇష్టం

ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం





ఖిలాడీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: రామ్ మిరియాల

హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్
హి ఈజ్ ఏ క్రైమ్ పోస్టర్
వీడు ఎదురయ్యే టైమింగు
డేంజర్ తో డేటింగు
యు గాట్ టు రన్ ఫాస్టర్

హి ఈజ్ ఏ స్పెల్ మాస్టర్
మనీ మోన్స్టర్
వీడితో నీకు మీటింగు
హెల్ తోటి గ్రీటింగు
లైఫే రోలర్ కోస్టర్

స్మెల్ చూసి నోట్ నేమ్ చెప్పగలడు సాల
వెయిట్ చూసి కట్టలోన లెక్క చెప్పేవాల
రాబరీకి పాఠశాల మనీ హెయిస్ట్ కె ఇవ్వాళ
కొత్త హైట్ చూపిన హవాలా

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ

లోకం యాడున్నా లిక్విడ్ మనీ
ట్రాకర్ లా లాగే వాలా
లాకర్ లో దాక్కున్న సీక్రెట్స్ అన్నీ
హ్యకర్ లా పట్టే వాలా

పోకర్ లో కింగంటి నీ ఫేట్ ని
జోకర్ లా మార్చేవాలా
గురి చూసి కరెన్సీ క్యారమ్స్ ని
స్ట్రైకర్ లా కొట్టేవాలా

బాడీ మొత్తం బ్రెయిన్ దోచేసినా
ఏకైక హ్యూమన్ వీడే
హార్ట్ కోసం ఇచ్చిన స్పాట్ ని కూడా
స్కెచ్ ల్తో నింపేశాడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ

అకౌంట్ బుక్కులో టాలీ కానీ… లెక్కలకే బ్యాలన్సరు
ఫైనాన్స్ సబ్జెక్టులో పట్టా ఉన్నా… సరికొత్త ఫ్రీలన్సరు
కంట్రీకే అప్పుంది కోట్లల్లోనా… మనకుంటే తప్పేంటి
సలహాలు ఇస్తూనే సర్వం దోచే… అరుదైన అడ్వైజరు

సొంత బాడీనంటి ఉంటోందని
నీడలకే రెంట్ ఏస్తాడే
సెంటీమీటర్ సెంటిమెంటే లేని
సెల్ఫ్ మేడ్ సెల్ఫిష్ వీడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ




అట్టా సూడకే పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: దేవీశ్రీప్రసాద్, సమీరా భరద్వాజ్

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నీలో స్పీడుకే… ఊపెక్తాంది మూడుకే
సిగ్గే సైడ్కే… అటకేక్తాంది చోడ్కే

మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా
నా గుండె గోడకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

ఓ బాటిల్ లోన సముద్రం
ఒక బాడీ లోన ఇంతందం
ప్యాకింగ్ చేయడం అసాధ్యం
ఆ గాడ్ కి వందనం

సూపర్ హీరో ఇమేజు
నీకిచ్చారేమో ప్యాకేజు
నీ వల్లే నాకీకరేజు
నువ్వే నా ఇంధనం

దూరం పెంచకే
మెంట్లెక్తాంది మైండుకే
నీతో బాండ్ కే టెంప్టెక్తాంది గుండెకే
ఒక డీజే మిక్సే మొదలయ్యిందే
నాలో మాస్సు గాడికే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఏ, ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నువు స్విచ్చే లేని కరెంటు
ఐపోయా నీకే కనెక్టు
నీకే ఇచ్చా నా రిమోటు
నీ ఇష్టం ఆడుకో

నీ పిక్చర్ కాముడి కటౌటు
నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు
నీ రేంజికి తగ్గ కంటెంటు
నా గ్లామర్ చూసుకో

రావే ట్రేడుకే
ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే
వస్తా తోడుకే
నువ్వెక్కడికెల్తే ఆడికే
మన సీనేగాని చూస్తే
షాకే సెన్సారు బోర్డుకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే





ఫుల్ కిక్కు పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: సాగర్, మమతా శర్మ 

ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి
మాస్ సాంగ్ అన్న
అయ్యబాబోయ్ మాసే
అః మాస్ మహారాజ్ ఇక్కడ
అంతేనంటవా
అదిగో క్యూట్ చిక్కు
నువ్వు పెట్టెయ్ టిక్కు
ఇంక ఫుల్ కిక్కు

నీ లిప్ లోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు
ఓ నిప్పులాగా నన్ను తాకే పెంచెను పల్సు
అది వంటిలొని చేసిన అల్లరి నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు
నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్ వన్ రేస్
ఆ బ్రేకుల్లేని బ్రేక్ డాన్స్ నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్సు
నువ్వు వాడేసి ఆరేసిన టవల్స్
అవి నాకంట పడుతుంటే 
ఆ మంట నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నీ షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్
కెలికేసిన దానితోటి నా ఛానెల్సు
నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నీ కండలోన దాచావు ఓ డంబెల్సు
అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు
ఇక రాతిరెన్నో జాతరలో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

ఇద్దరి బడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు
ఇక తీసేయ్ మద్యల డిస్టెన్స్ దేనికి న్యూసెన్స్
నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నేనున్న చోటు పసిగట్టే నీ  టాలెంట్స్
కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్స్
అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్స్
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

మాగ్నెట్స్ కూడా షాక్ అయ్యే అట్ట్రాక్షన్స్
మన మధ్య మొదలు పెట్టాయి నీ యాక్షన్స్
మన లవ్ కింకా లోకంలో నో ఆప్షన్స్
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్
సంథింగ్ సొమెథింగ్స్యూ
మన ఇద్దరి మధ్యన లిరిక్స్
ఫుల్ అఫ్ రొమాన్స్
ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు




క్యాచ్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: నేహా బాసిన్,  జస్ప్రీత్ జస్జ్

హలో మిస్టర్ మాచో మ్యాన్
నాతో కొంచెం నాచో మ్యాన్
నాటీ డేటే పూచో మ్యాన్
మిస్సయితే రాదు సోచో మ్యాన్

రైటు లేదు రాంగు లేదు
రంగే లేని నైటే లేదు
రంగంలోకి రాబిన్ హుడ్డై
రారా సూపర్ మ్యాన్

హే, విస్కే లేని గ్లాసే లేదు
రిస్కే లేని రేసే లేదు
మాస్కే లేని ఫేసే లేదు
కాస్కో స్పైడర్ మ్యాన్

క్యాచ్ మీ, క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ, టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

హే పార్టీ మ్యాన్
నా డీజే మిక్సే నీకు నచ్చిందా
సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన
ఫెవరెట్ మ్యూజిక్ తో
నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా

హేయ్, బేబీ గర్ల్
నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే
నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక
ఉండదింకా మనకే డోకా
చిందులేసి చిత్తే చేద్దాంరా

హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా
ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా
నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా
ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

హేయ్, ఖిల్లాడి
నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి
బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన
రెచ్చిపోయే నాట్యంతోన
లేడి నెమలై నీతో నా బాడీ

హేయ్ అమ్మాడి..!
నీ అందం ఆయుధమల్లే వెంటాడి
కత్తుల్నే దించుతుంది సోకుల వాడి
దంచుతుందే నాపై దాడి
పెంచుతుందే రక్తంలో వేడి

హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా
నీలోని రొమాన్స్ ని తీయింకా
నీ షైని షైని మెరుపుల మోజింక
నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

Palli Balakrishna Wednesday, February 9, 2022
Kotha Kothaga (2022)



Movie Details



Songs List:



డైమండు రాణి పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త కొత్తగా (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి

వాలు కన్నుల్లో మాగ్నెట్టు దాగుందే
సూదిలా నన్ను గుంజేస్తాందే
హంస నడకల్లో ఏం మాయ దాగుందో
హింస పెట్టేసి లాగేస్తాందే

గుండెలో ఏదో గడియారం ముళ్ళుందే
రోజు నీ చుట్టు తిరిగేస్తాందే
నన్ను వదిలేసి నా నీడ
నీ రెడ్డు చున్నీ పట్టుకొని వేలాడిందే

పోకే, నన్నొదిలి వెళ్ళిపోకే
నా మనసునే గిల్లిపోకే
నీ దారిలో పువ్వులే నేను చల్లానులే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే

నా డైమండు రాణి నువ్వే
నా గర్ల్ ఫ్రెండు అయిపోవే
పిల్ల నీ మాట ఇస్తే
నిలబెట్టుకుంటా నీతోనే ఉంటానే

నీ చేతిలోని ఓ బుక్కునైతే
నా లైఫ్ ధన్యంలే
నీ వేళ్ళు తాకి ఓ రెక్కలొచ్చి
లోకాన్ని చుడతాలే

బైకుకున్న బ్యాకు సీటు నీకై
మైకు పట్టి పిలుస్తున్నదే
వీపునంటి నువ్వు కూర్చుంటే
గాల్లోన ఎగిరిపోతదే

రావేమే నా రాజే
నాతో పడరాదే నువ్ రాజే
నువ్ ఒప్పుకుంటే మన జంటకొస్తది
ఊళ్ళోన యమ క్రేజే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే

నీ నోట రాలే ముత్యాల కోసం
బెగ్గర్ ని అయ్యానే, ఓ తల్లే
నీ నవ్వులోని రత్నాల కోసం
దొంగల్లె చూశానే

అంటరాని మనిషినేం కాదే
అంత దూరం ఎందుకుంటవే
సెంటీమీటర్ ప్లేసు ఇచ్చి చూడే
అంటుకుంటే నిన్ను వదలనే

ఏవంటవే రాజే, ఓ రాజే
నువ్ రాసెయ్యే లవ్ పేజే
నువ్ తలుసుకుంటే
ఏమంత కష్టం ఎగ్జామ్స్ కంటే ఈజే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే





ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త కొత్తగా (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: సిద్ శ్రీరాం 

మౌనమే మేఘమై గుండెలో చేరెనే
ప్రాణమే వానల కంటిపై జారెనే
నాలోనే చాలానే ఊహించుకున్నానే
ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
నీకేమో దూరంగా నాకే నే భారంగా
మారాక నేనేందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

కాలం సెగలకు గతమంతా కరిగెనే
శూన్యం బరువుకి బతుకంతా విరిగెనే
ఏ కారణాన్నో ఏకాకినైనా
లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే

నీదాకా పోలేని పాదాన్ని దూషించా
నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా
నీ జంట కాలేని గొంతై నే ఘోషించా
నాతో నువ్ లేనందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగెనే
లోలో తొలిచిన ప్రతి ధ్యాస పలికెనే
నీతోడు లేని ఈ తోవలోని నేనింకా
జీవించి ఏం లాభం అన్నాయే

ఆకాశం నాకోసం ఆహ్వానం పంపిందో
ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో
నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో
ఈ జన్మ ఇంకెందుకు, ఏ ఏఏ

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

Palli Balakrishna Friday, February 4, 2022
Bazaar Rowdy (1988)



చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్-కోటి 
నటీనటులు: రమేష్ బాబు, మహేష్ బాబు, నదియా, గౌతమి, సీత
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: యు.సూర్యనారాయణ బాబు 
విడుదల తేది: 12.08.1988



Songs List:



చెక్కిలిగిలి చిక్కులముడి పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి 

చెక్కిలిగిలి  చిక్కులముడి 




సింగారక్కో సిగ్గెందుకే పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

సింగారక్కో సిగ్గెందుకే 




ఓ ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

ఓ ప్రేమ 




తాకమాక తగ్గమాక పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

తాకమాక తగ్గమాక 



కొత్త పెళ్లి కూతురా పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి 

కొత్త పెళ్లి కూతురా 

Palli Balakrishna Wednesday, February 2, 2022
Kanchu Kota (1967)



చిత్రం: కంచుకోటం (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, దేవిక 
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాత: యు.విశ్వేశ్వర రావు 
విడుదల తేది: 22.03.1967



Songs List:



ఉలికి ఉలికి పడుతోంది పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల

ఉలికులికి పడుతుంది
గిలిగింత పెడుతుంది
ఎందుకో ఏమో నామనసు
ఏ సంగతి నాకేమి తెలుసు
ఇన్నాళ్ళ వలెకాదు ఎట్లాగొ అవుతుంది
చన్నీళ్ళ తాకిడికే ఒళ్ళు జిల్లు మంటుంది
చేపల్లే తాకెనో చూపులే సోకెనో
చెప్పలేనయ్యయ్యో సిగ్గుముంచు కొస్తుంది.....
నీటిలో అలలేమొ నిలిచి పొమ్మన్నాయి
తోటలో పూలేమొ లేచిరమ్మన్నాయి
నీటిలో నిలవనా తోటనే పిలవనా
ఉన్నపాటున లేస్తె ఊరంతనవుతుంది....





సిగ్గెందుకే చెలి పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: త్రిపురనేని మహరధి 
గానం: పి.సుశీల, ఎస్.జానకి

సిగ్గెందుకే చెలీ సిగ్గెందుకే
అందాలకే నువ్వు అందానివీ
సిగ్గెందుకే భామ సిగ్గెందుకే.....

సిగ్గులేని కొమ్మ పూలులేని రెమ్మ
సిగ్గులోని సిరులు పాలమీది తరగ
సిగ్గందమే  స్త్రీకి సిగ్గందమే 
రంభైన అతిలోక చతియైన
సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే ....
నీరాజు నినుచేరి సరసాలు సాగించ
సిగ్గేమి చేతువే ఏ చోటు దాతువే
విరిసే పెదవులలో మురిసే హృదయములో
దాచుకొందునె సిగ్గు దోచుకొందునే మనసు....
మనసులోని మమత మనసులోనే దాచ
మనసెట్లు తీరునే మనువెట్లు సాగునే
మనసైన నారాజు మనసార నన్నేల
మమతలు తీరునులే మనువే సాగునులే....




లేదు లేదని పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం: 1
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
నల్లని జడలో కరినాగుంది.. నడకలలో అది కనపడుతుంది
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

చరణం: 2
కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కలలోకొచ్చి కబురులు చెప్పే.. జతగాడైనా లేడు.. జతగాడైనా లేడు
ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం: 3
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
మొగలి రేకుల సొగసు ఉంది.. మొన కన్నులలో పదును ఉంది

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు
వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
అద్దంలో నా అందం చూస్తే.. నిద్దర రానే రాదు.. నిద్దర రానే రాదు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దొస్తావు




ఈ పుట్టిన రోజు పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల

పల్లవి:
ఈ పుట్టినరోజు నీ నోముల పండిన రోజు
దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు

చరణం: 1
తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ (2)
మీలో విరిసే లేత వెలుగులు మా చెలి కన్నుల నింపండి
ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు ఆనందించాలీ

చరణం: 2
అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా (2)
మీ నడకల వయ్యారం మా చెలికే ఇవ్వరారా
ఆ వయ్యారం చూసి చూసి ఆమె ప్రియుడు మురియాలి

చరణం: 3
పురివిప్పి నటియించు నీలాల నెమలి (2)
మీలోని హొయలంత చెలికియ్యరాదా
అందాల చెలి నాట్యమాడేటి వేళ
చెలికాని మనసెల్ల విలసిల్ల గలదు... ఆ...




ఈడొచ్చిన పిల్లను పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

ఈడొచ్చిన పిల్లనోయ్ హొయ్ హొయ్
నిన్ను ఆడించే పిల్లనోయ్ సై సై

నువ్వేసే సుక్కకన్న ఎచ్చనైన దాననోయ్
కవ్విస్తే కరగేదాకా కదలనోయ్ హాయ్ హాయ్
కండలున్న మావయ్యకు గుండేలేదట
గుండెలున్న బావయ్యకు గుణమే లేదట
కండలున్నా గుండెలున్నా కన్నెపిల్ల రమ్మంటే
కత్తిలాంటి మగరాయుడు మెత్తనౌనట....
ఇంపుచూసి నా సొంపుచూసి నువు యీల వేయకోయ్
సెంపమీద అబ్బ నొక్కి నొక్కి నువు చిటికె ఏయకోయ్
పట్టుపట్టీ పంతగించి పైట లాగకోయ్
నా పైట లాగితే మనసు పట్టజాలనోయ్....



భం భం భం పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, జమునా రాణి 

భం భం భం భం పట పట పట పట భజగోవిందం
ఏమిటో యీ అనుబంధం
ఎందుకో ఈ ఆనందం....
జం జం జం జం బలె బలె బలె బలె చిటపట బంగారం.
ఏనాటిదో యీ అనుబంధం
చూడవే బ్రహ్మానందం....

అయ్యను మోసంచేశావు
బావయ్యను మడుగులో దోశాపూ
అమ్మ బాబో నిను నమ్మినందుకు
నట్టనడేటను ముంచేస్తావూ....
సందేహంలో పడతావేలా ఏల
అందరిలా నన్ననకే బాల
పూలలోన నీవోలలాడగా
జోల పాడెదనె యిలా యిలా
జోజోజో జోజో జో....
ప్రేమ ఒలక బోస్తున్నావా
నాటకాలు వేస్తున్నావా
అసలు సంగతి బైటికి వస్తే
అయ్యా అపుడేమౌతావూ
ఏమౌతానా? విను 
ఇంటికి అల్లుడనౌతానే నీకు
ఎదురుగానె కూర్చుంటానే
మళ్ళీ మళ్ళీ మాట్లాడావా
భజన చేస్తు కూర్చుంటానే - రామ
భజన చేస్తు కూర్చుంటానే

హరి హరీలరంగ హరి
వైకుంఠవాస హరి
మనయిద్దరికి సరి
మాటాడబోకు మరి
శ్రీమద్రమారమణ గోవిందో హరి 



సరిలేరు నీకెవ్వరూ పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, ఎస్.జానకి

పల్లవి:
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సురవైభవాన భాసుర కీర్తిలోనా
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

చరణం: 1
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
జగతిని లాలించి పాలించినావూ....

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

చరణం: 2
మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
యవ్వనవీణనూ కవ్వించినావూ...

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

చరణం: 3
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్

అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్

జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ..సరిలేరు నీకెవ్వరూ.....





ఏచటనో గల పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం:  దాశరథి
గానం: ఘంటసాల

ఎచటనోగల స్వర్గమ్ము నిచట దింపి
నన్ను మురిపించి మరపించినావు చెలియ
నీవె జీవితాధారము నీవె దిక్కు
నీదు పాదాల సాక్షిగా నీవె రక్ష





అర్ధరేతిరి కాడ పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: యు. విశ్వేశ్వర రావు 
గానం: చక్రవర్తి, ఎల్. అర్. ఈశ్వరి 

అర్ధరేతిరికాడ అత్తయ్య నాకు
కలలోకి వచ్చింది మామో

ఎట్టా ? మాయమ్మా ?
ఆ కలలోన నన్ను అనరాని మాటలతో
అదరగొట్టేసింది మామో నన్ను
బెదరగొట్టేసింది మామో
కొట్టదూ మరి ?
నీయబ్బ నువ్వున్ను నాకన్న బాబునీ
నట్టేట ముంచారు అందీ
నిలువునా ముంచారు గందే 
ఆ ఉసురు ఫలితంగ నా దేవుడూ
నాకు దక్కనే దక్కడందీ
పీడా పొయె 
నాదేవుడూ నాకు దూరమయ్యాడంటే
నాకు దిక్కెవరయ్య మామో
నే ఉళ్లా..?
కడసారి చూపుగా ఒకసారి చూసొస్తా 
నీ దయా నాకుంటె మామో - నువ్వు
తలుపులూ తీయించు మా మో ....

Palli Balakrishna
Bhama Vijayam (1967)



చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు 
నటీనటులు: యన్.టి.రామారావు, దేవిక 
దర్శకత్వం: సి.పుల్లయ్య 
నిర్మాతలు: సోమశేఖర్, రాధాక్రిష్ణ
విడుదల తేది: 29.06.1967



Songs List:



పైరుగాలి వీచింది పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల

పైరుగాలి వీచింది 




ఓహో యువరాణి పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్ 
గానం: ఘంటసాల 

ఓహో యువరాణి 




రెండు చందమామలు పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్ 
గానం: ఘంటసాల, శోభారాణి

రెండు చందమామలు 




రారా సుందరా పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: పి. సుశీల 

రారా సుందరా 



ఒక్కసారి నన్ను చూడు పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత 

ఒక్కసారి నన్ను చూడు 



రావే చెలి ఓ జాబిలి పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

రావే చెలి ఓ జాబిలి 




భువన మోహిని పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్ 
గానం: ఘంటసాల

భువన మోహిని 




నిప్పులాంటి సీతమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల

నిప్పులాంటి సీతమ్మ 




కోరిన వాడే చెలీ పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

కోరిన వాడే చెలీ 




మగరాయ పాట సాహిత్యం

 
చిత్రం: భామా విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

మగరాయ 


Palli Balakrishna
Subhavartha (1998)



చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: అర్జున్, సౌందర్య
దర్శకత్వం: P. N రామచంద్ర రావు
నిర్మాత: M. Y. మహర్షి
విడుదల తేది: 1998



Songs List:



అరె బాప్ రే పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

అరె బాప్ రే




అచ్చమైన పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

అచ్చమైన



జాబిలమ్మ ఆగవమ్మ (Duet) పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవా ఈ శుభవార్త
జంట ప్రేమ చాటెనమ్మ వేలవన్నెల ఈ శుభవార్త
కలే తీయ్యగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని
ఈ కనివిని ఎరుగని కళ్యాణం అపురూపం అని

రతిమదనులు తొలి అతిధులుగా కదిలొచ్చే కాలమని
శ్రుతిముదిరిన తహతహలన్ని ఆహ్వానం పాడని
మన కలయిక కలలకు కలగా అనిపించే సమయమని
కునుకెరుగక ప్రతి నిమిషాన్ని కౌగిల్లో సాగని
చెరోసగమయే సరాగాలతో ఒకే ప్రాణమై ఉందాం రమ్మని
ఎడబాటే లేని ఏకాంతన్ని అందించని

కలతెరుగని తలపుల హ్రుదయం తను కోరిన కోవ్వెలని
కళతరగని వలపుల దీపం మన ఎదలో చేరని
ఏ ఋతువున చేదరని స్నేహం మన బ్రతుకున ఉన్నదని
మన పెదవుల నిలిచిన చైత్రం చిరునవ్వులు పూయని
సదా ఈ జత..ఇదే తీరుగా ప్రతి ఊహని నిజం చెయ్యగా
నీ తీయని చెలిమే తీరని రునమై జీవించని




కుళుకు బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

కుళుకు బేబీ



జాబిలమ్మ ఆగవమ్మ (Sad)మ పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.ఓ.

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

నా బ్రతుకున బ్రతుకై 
ముడిపడిపోయిన ఓ ప్రియతమా
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

నీ మనసుని తన కొలువంటూ నిను చేరిన నా మది
అనురాగపు మని దీపముగా ఆ గుడిలో ఉన్నదీ
ఏ కలతలు సుడి గాలులకి ఆరని వెలుగే అది
నువు వెలివేయాలనుకున్న నీ నీడై ఉన్నదీ

ప్రాణమే ఇలా నిన్ను చేరగా
తనువు మాత్రము శిలై ఉన్నదీ
ఈ శిల చిగురించే చినుకే నీలో దాగున్నది

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

కనివిని ఎరుగని కలయికగా అనిపించిన జీవితం
ఎడబాటును జరిగిన గతమై చినబోయెను ఈ క్షణం
విష జ్వాలలు విసిరినా అహమే మసి చేసెను కాపురం
ఏ మసకల ముసుగులు లేని మమకారమే శాశ్వతం

ప్రణయమన్నది ఇదేనా అని
మనని అడగదా లోకమన్నది
బదులియకపోతే ప్రేమకి

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా
నా బ్రతుకున బ్రతుకై
ముడిపడిపోయిన ఓ ప్రియతమా

Palli Balakrishna
Ankusham (1989)



చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల (All)
గానం: యస్.పి. బాలు, జానకి (All)
నటీనటులు: రాజశేఖర్, జీవిత
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: యమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 13.07.1989



Songs List:



ఇది చెరగని ప్రేమకు శ్రీకారం పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు, జానకి 

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు
పారాణి మిసమిసలు పదములకు తెలుసు
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు
చిగురుటాశల చిలిపి చేతలు
పసిడి బుగ్గల పలకరింపులు
పడుచు జంటకే తెలుసు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు

ముగ్గులే తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
నింటికి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలి చూలు ఇల్లాలు అందం
జన్మ జన్మల పుణ్యఫలముగా
జాలువారు పసిపాప నవ్వులే
ఆలు మగలకు అందం

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు




గోరంత దీపం పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  జానకి 

గోరంత దీపం 




అయ్యలో జగరత పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

అయ్యలో జగరత 




చిన్నారి కసిగందు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

చిన్నారి కసిగందు 



నేను తప్పు చేయలేదు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

నేను తప్పు చేయలేదు 



చట్టాలను దిక్కరిస్తూ పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

చట్టాలను దిక్కరిస్తూ 



అమ్మ పిలుపుని నోచనివాడు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

అమ్మ పిలుపుని నోచనివాడు 

Palli Balakrishna
Jayamma Panchayathi (2022)



చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
నటీనటులు: సుమ కనకాల, దేవి ప్రసాద్, డేనిష్ కుమార్ , శాలిని కొండేపూడి
దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు
నిర్మాత: బలగా ప్రకాష్ 
విడుదల తేది: 06.05.2022



Songs List:



తిప్పగలనా చూపులు పాట సాహిత్యం

 
చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: రామాంజనేయులు 
గానం: PVNS రోహిత్ 

తిప్పగలనా చూపులు
నీ నుంచే ఏ వైపైనా
ఆపగలనా అడుగులు
నా చెంతే కాసేపైనా

వస్తావు నువ్వే తెస్తావు నన్నే
ఇస్తావు నాకే ఓ ఓఓ
నువ్వెళ్ళగానే నేనింకా లేనే
నీ లాగే అయిపోతానే

ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా

నేనెందుకు పుట్టానంటే… ఏమివ్వను బదులే
నీ కోసమే అన్నానంటే… తిడతావో ఏమోలే
నాకెవ్వరు నచ్చారంటే… ఏం చెప్పను మాటే
నీ కన్నా ఎవరుండరు… అంటే, కొడతావేమోలే

అనలేక, ఓ… ఏమనలేక ఓ
మిగిలానే ప్రేమలేఖలా
వస్తావు నువ్వే
తెస్తావు నన్నే ఇస్తావు నాకే ఓ
నువ్వెళ్ళగానే నేనింకా లేనే
నీ లాగే అయిపోతానే

ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా

తిప్పగలనా చూపులు
నీ నుంచే ఏ వైపైనా
ఆపగలనా అడుగులు
నా చెంతే కాసేపైనా

వస్తావు నువ్వే తెస్తావు నన్నే
ఇస్తావు నాకే ఓ ఓఓ
నువ్వెళ్ళగానే నేనింకా లేనే
నీ లాగే అయిపోతానే

ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా




కాసింత భోళాతనం పాట సాహిత్యం

 
చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీకృష్ణ 

కాసింత భోళాతనం
కూసింత జాలి గుణం
కాసింత గండ్రతనం
కూసింత మొండి గుణం

కాసింత భోళాతనం
కూసింత జాలి గుణం
కాసింత గండ్రతనం
కూసింత మొండి గుణం

అచ్చమైన పల్లెటూరి ఇత్తనం
ఎక్కడైనా ఆమెదేగా పెత్తనం
ఈ అమ్మోరు తల్లి తూఫాను ముందర
తూనీగలే మనమందరం

హెయ్, జయమ్మ జయమ్మ
జయమ్మ జయమ్మ జయమ్మ
చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ
అసలైన సంగతి నిజంగానే వేరమ్మా
మచ్చలేని ఆ మనసే ఆకాశమంతమ్మా

పక్క ఇంటి లక్ష్మి
పంచదార అప్పు తీర్చలేదు
పోస్టుమ్యాను భద్రం
వారం రోజుల్నుంచి రాడం లేదు

సికెను షాపు సీను
ఎనకట్లాగా తూకం తుయ్యట్లేదు
అట్టా ఎల్లే ఎంకాయమ్మ
నన్ను సూసి పలకరించలేదు

పొద్దున గొన్న బీరకాయల్
నాలుగింట్లో మూడు చేదు
ఎందోగాని నా గాచారం
ఒక్క సంగతి సరిగ్గాలేదు
ఫో ఫో ఫో

సివంగి లెక్కన లేస్తది గానీ
సిన్న పిల్ల మనసు
ఇట్టాగ ఎందుకు పుట్టించాడో
ఆ దేవుడికే తెలుసు

పట్టాసు తీరున పేలుద్ది బాబోయ్
నోటి మాటే పెళుసు
జయమ్మ గొంతు లెగిసిందో చాలు
భూజగమే సైలెన్సు

బుస్సున ఆకాశమంటే కోపం, తకధిమి
సప్పున సల్లారిపోతది పాపం, తకధిమి
బుస్సున ఆకాశమంటే కోపం, తకధిమి
సప్పున సల్లారిపోతది పాపం, తకధిమి తక తక
తప్పుకోక తప్పదు ఆ అరనిమిషం భూకంపం

హెయ్, జయమ్మ జయమ్మ
జయమ్మ జయమ్మ జయమ్మ
చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ
అసలైన సంగతి నిజంగానే వేరమ్మా
మచ్చలేని ఆ మనసే ఆకాశమంతమ్మా

అమ్మాడియమ్మో జయమ్మా
అమ్మాడియమ్మో జయమ్మా
జయమ్మో జయమ్మో జయమ్మ
జయమ్మో జయమ్మో జయమ్మ

ఎదురింట్లోని చంటిపాప ఏడుపింకా ఆపట్లేదు
ఖతారెళ్లిన కాంతం కొడుకు
ఏమయ్యాడో పత్తా లేడు
రచ్చబండ హనుమంతుడికి
ఎండా వానా నీడే లేదు

అబ్బులు గారి చూలు గేదే
అన్నం నీళ్లు ముడతలేదు
సుబ్బాయమ్మ మొగుడికి దానికి
నిమిషం కూడా పడుతలేదు
అబ్బబ్బా ఈ కష్టాలకి
అంతు పొంతూ లేనే లేదు
ఫో ఫో ఫో

అమ్మాడియమ్మో జయమ్మా
అమ్మాడియమ్మో జయమ్మా
జయమ్మో జయమ్మో జయమ్మ
జయమ్మో జయమ్మో జయమ్మ

పొరుగోళ్ళకి సాయం చెయ్యడమంటే
ఇష్టమండి తనకు
తిరిగి సాయం చెయ్యకపోతే
ఇరకాటమే మనకు

నిద్దరోతే ఒట్టు పక్క వాళ్ళ
కళ్ళ నీళ్లు తుడిచే వరకు
అట్టాగే మనని తోడుండమంటది
తనకొచ్చే ఆపదకు

లేదే మోమాటం ఇంటావంటా, తకధిమి
తనదేననుకుంటది ఊరూరంతా, తకధిమి
లేదే మోమాటం ఇంటావంటా, తకధిమి
తనదేననుకుంటది ఊరూరంతా, తకధిమి
ఎవరేమేమనుకున్నా మరో మాటే లే దం ట

హెయ్, జయమ్మ జయమ్మ
జయమ్మ జయమ్మ జయమ్మ
చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ
అసలైన సంగతి నిజంగానే వేరమ్మా
మచ్చలేని ఆ మనసే ఆకాశమంతమ్మా



బాగుంది కదా స్నేహం పాట సాహిత్యం

 
చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం:  అనిరుద్ సుస్వరం, నీలిమ శంకుల 

నువ్వో రెక్క… అరెరే నేనో రెక్క
రెక్కలు రెండు కలిపి చూద్దామింకా
మనదే కాదా చుక్కల ఆకాశం
మనతో రాదా రంగుల సంగీతం

బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఈడ అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం

నువ్వో రెక్క… అరెరే నేనో రెక్క
రెక్కలు రెండు కలిపి చూద్దామింకా
మనదే కాదా చుక్కల ఆకాశం
మనతో రాదా రంగుల సంగీతం

బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఈడ అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం

తరరా రరరా రారార
తరరా రరరా రార
తరరా రరరా రారార
తరరా రరరా రార

భయము లేదు ఇక్కడ భాధ లేదు
పుస్తకాల సంచీ బరువూ లేదు
కలత లేదు ఇక్కడ కొరత లేదు
రాత కూతలంటూ దిగులు లేదు

ఆడే ఆటకు హద్దే లేదు
పాడే పాటకు పొద్దే లేదు
ఏదో ఏదో కోరిక లేదు
ఏ చోట క్షణము తీరికలేదు

ఉన్నదంటూ ఒక్కటే నీతో
ఉన్నదంటూ ఒక్కటే ఉల్లాసం

బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఈడ అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం



గొలుసుక‌ట్టు గోస‌లైపోయే పాట సాహిత్యం

 
చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం:  చారు హరిహరన్, ఎం.ఎం.కీరవాణి

క‌లిసి బ‌తికే కాల‌మే… మాయే నేడే
ప‌గటి వేళ పీడ క‌ల‌లాయే
అలిసిపోనీ ఆశలేమాయే అయ్యో
గొలుసుక‌ట్టు గోస‌లైపోయే
పొర‌పాట్లు కొన్ని… పంతాలతోని
మ‌రి ఎంత‌కీ… తేల‌దు పంచాయితీ

క‌లిసి బ‌తికే కాల‌మే… మాయే నేడే
ప‌గటి వేళ పీడ క‌ల‌లాయే

పుట్ట‌క‌తో పూజ‌కు త‌గ‌వ‌ని
కోవెల కొలువుకే గోలాయే
వ‌ల‌పులే దూర‌పు త‌ల‌పులై
ప్రేమకు తలుపులే మూసాయే

వెంటాడే మా భయ్యాలే దయ్యాలై
మంచీపైనే మన్నేసెలే
ఖర్మే కాలి పెద్దోళ్లు చెడ్డోల్లై
బంధీలైనారా..!
నారే నా ఆ ఆ ఆ ఓ ఓ ఓ
నారే నా ఆ ఆ ఆ ఓ ఓ ఓ

క‌లిసి బ‌తికే కాల‌మే… మాయే నేడే
ప‌గటి వేళ పీడ క‌ల‌లాయే

వెలుగునే చూడ‌ని క‌లుగులో
చీక‌టి బ‌తుకులై పోయేనే
తిరుగుతూ ఆశ‌ను వెతుకుతూ
ఏ దిశ కొస‌ల‌నే చేరేనో
ఇచ్చేశాక వ‌చ్చేదా చ‌చ్చేదా
క‌చ్చెలోలో గిచ్చేన‌మ్మ‌
సొమ్మూ రాక సొంతమ్మి కన‌రాక‌
సొమ్మాసిల్లేవా

క‌లిసి బ‌తికే కాల‌మే… మాయే నేడే
ప‌గటి వేళ పీడ క‌ల‌లాయే
అలిసిపోనీ ఆశలేమాయే అయ్యో
గొలుసుక‌ట్టు గోస‌లైపోయే
పొర‌పాట్లు కొన్ని… పంతాలతోని
మ‌రి ఎంత‌కీ… తేల‌దు పంచాయితీ

Palli Balakrishna Tuesday, February 1, 2022
Raja Nandini (1958)



చిత్రం: రాజనందిని (1958)
సంగీతం: టి.వి.రాజు 
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీదేవి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య 
నిర్మాతలు: యం.రామకృష్ణారావు, మిద్దే జగన్నాధ రావు 
విడుదల తేది: 04.07.1958



Songs List:

Palli Balakrishna
Dabbuki Lokam Dasoham (1973)



చిత్రం: డబ్బుకు లోకం దాసోహం (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: యన్.టి.రామారావు, జమున
దర్శకత్వం: డి.యోగానంద్ 
నిర్మాత: యం.జగన్నాధరావు 
విడుదల తేది: 12.01.1973



Songs List:

Palli Balakrishna
Aapta Mitrulu (1963)



చిత్రం: ఆప్త మిత్రులు (1963)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి, కాంతారావు
నిర్మాత, దర్శకత్వం: కడారు నాగభూషణం
విడుదల తేది: 29.05.1963



Songs List:

Palli Balakrishna

Most Recent

Default