చిత్రం: మేజర్ (2022) సంగీతం: శ్రీ చరణ్ పాకాల నటీనటులు: అడవి శేషు, సోబిత ధూళిపాళ దర్శకత్వం: శశి కిరణ్ తిక్క నిర్మాణ సంస్థ: ఫిల్మ్స్ ఇండియా, GMB, విడుదల తేది: 11.02.2022
Songs List:
హృదయమా పాట సాహిత్యం
చిత్రం: మేజర్ (2022) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: కృష్ణ కాంత్, వి. యన్. వి. రమేష్ కుమార్ గానం: సిద్ శ్రీరామ్ నిన్నే కోరేనే… నిన్నే కోరే ఆపేదెలా నీ చూపునే లేనే లేనే… నే నువ్వై నేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీవలనే నీ జతే మరి చేరినా ఇక మరువనే నన్నే హే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా - హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా - ప్రాణమా ఆ ఆ ఆఆ ఆ మౌనాలు రాసే లేఖల్ని చదివా భాషల్లే మారా నీ ముందరా గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసె చూడు నేడిలా నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం మీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే ఔననే ఒక మాటతో పెనవేసెనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా హృదయమా… వినవే హృదయమా - హృదయమా ప్రాణమా… నువ్ నా ప్రాణమా - ప్రాణమా హృదయమా,... హృదయమా.....
ఓ ఇషా పాట సాహిత్యం
చిత్రం: మేజర్ (2022) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: రాజీవ్ భరద్వాజ్ గానం: అర్మాన్ మాలిక్ , చిన్మయి శ్రీపాద ఓఓ ఓ హో ఓఓ ఓ ఓఓ ఓ హో ఓఓ ఓ హాయి హాయి… హాయి ఈ మాయ ఏమిటోయి గుండె ఆగి ఆగి ఎగురుతున్నదీ చిక్కులన్ని కూర్చి ఓ లెక్కలేవో నేర్చి అంకెలాటలేదో ఆడుతున్నదీ ఓ ఒంటరంటు… ఓ నేస్తమంటే ఓ కొత్తలోకం చేరాలిలా ఓ సంఖ్య విసిరినా సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా నిదురనే లాక్కొని… కలలో దాక్కొని కొసరి కొసరి కౌగిలింతలివ్వమాకలా ఎదురుగా నిలబడి… మనసులో అలజడి పెంచి పెంచి ప్రేమలోన ముంచితే ఎలా ఓ కొత్త దారిలో… ఓ ప్రేమ పేజిలో ఓ కధని రాద్దాం, రా ఇలా. ఓ సంఖ్య విసిరినా సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా ఓఓ ఓ హో ఓఓ ఓ ఓఓ ఓ హో ఓఓ ఓ
జనగణమణ పాట సాహిత్యం
చిత్రం: మేజర్ (2022) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: రాజీవ్ భరద్వాజ్ గానం: తోజన్ టోబి జయహే జయహో ఎగిరే కలవో… రగిలే రవివో అలిసే బరిలో నరమే ఇనుమై జ్వలితో చలిచెయ్ విరిచే ఉలివై విధినే గురిచెయ్ వందేమా… భారతమా వందేమా… భారతమా జనగణమనమా వన వన జగమా జనగణమనమా మనదే జయం జనగణమనమా వన వన జగమా జనగణమనమా మనదే జయం జనగణమనమా వన వన జగమా జనగణమనమా మనదే జయం భరతమాతా..!!!
కన్నా కన్నా... పాట సాహిత్యం
చిత్రం: మేజర్ (2022) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చిత్ర కన్నా కన్నా… చిన్నారి కన్నా జోలాలి పాటై… నీ చెంతనున్నా నిదురించరా… కన్నా నిదురించరా లాలి లాలీ… ఆకాశ లాలి లాలీ లాలీ… జాబిల్లి లాలి నిదురించరా… కన్నా నిదురించరా ఆరరో తన్నరే రారారో ఆరరో తన్నరే రారారో తందనే తానానా తందనే తానానా తందనే తానానా తందనే తానానా అమ్మ ప్రేమలోనా… దాగి ఉన్నదంట అమృతాల చిరునామా అమ్మ చీరకొంగు… నిన్ను సేద తీర్చు అద్భుతాల స్వర్గ సీమ ఈ రేయి నీ కోసమే కన్నా ఈ హాయి నీ కోసమే కంటిముందు నిన్ను చూసుకున్న వేళ అంతులేని ఓ ధీమా కన్నబిడ్డలాగ మళ్ళి మళ్ళి నిన్నే కోరుతోంది ప్రతి జన్మా ఈ పాట నీకోసమే కన్నా ఈ అమ్మ నీ నేస్తమే జగమే మరిచి మహరాజులా నిదురించరా… కన్నా నిదురించరా (నిదురించరా… కన్నా నిదురించరా) కన్నా కన్నా… చిన్నారి కన్నా జోలాలి పాటై… నీ చెంతనున్నా నిదురించరా… కన్నా నిదురించరా (నిదురించరా… కన్నా నిదురించరా) ఆరరో తన్నరే రారారో ఆరరో తన్నరే రారారో తందనే తానానా తందనే తానానా తందనే తానానా తందనే తానానా
2022
,
Adivi Sesh
,
Major
,
Saiee Manjrekar
,
Sashi Kiran Tikka
,
Sobhita Dhulipala
,
Sricharan Pakala
Major (2022)
Palli Balakrishna
Friday, July 8, 2022