Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Urvashi"
Bhale Thammudu (1985)



చిత్రం: భలేతమ్ముడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: బాలక్రిష్ణ , ఊర్వశి, అశ్విని
దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్
నిర్మాతలు: సత్యనారాయణ, సూర్యనారాయణ
విడుదల తేది: 27.04.1985



Songs List:



అన్నగారి అలక పాట సాహిత్యం

 
చిత్రం: భలేతమ్ముడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అన్నగారి అలక 




గాలికి రేగిన పాట సాహిత్యం

 
చిత్రం: భలేతమ్ముడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: మాధవపెద్ది రమేష్, పి.సుశీల 

గాలికి రేగిన 




కొండగాలి వీస్తుంటే పాట సాహిత్యం

 
చిత్రం: భలేతమ్ముడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కొండగాలి వీస్తుంటే




మనసుంటే మన్నించు పాట సాహిత్యం

 
చిత్రం: భలేతమ్ముడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మనసుంటే మన్నించు 




రారోయి మా క్లబ్ కి పాట సాహిత్యం

 
చిత్రం: భలేతమ్ముడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

రారోయి మా క్లబ్ కి 



దేవుడిచ్చిన వయసు పాట సాహిత్యం

 
చిత్రం: భలేతమ్ముడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

దేవుడిచ్చిన వయసు 

Palli Balakrishna Sunday, March 25, 2018
Michael Madana Kamaraju (1991)


చిత్రం: మైకేల్ మదన కామ రాజు (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: కమల్ హాసన్, కీర్తన , కుష్బూ , ఊర్వశి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత:
విడుదల తేది: 1991

సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం

మాటలకందని రూపం వర్ణించదే ఈ కావ్యం
పూచిన నీలో అందం నాకది మంగళ బందం
నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
నీ చూపులన్నీ అరుణోదయాలే..ఆ..ఆ

సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం

ఆమని పండుగ చేసి స్వప్నాల లోకము విరిసె
ప్రేమ సరాగము పిలిచె స్వర్గం ఎదురుగా నిలిచె
ఈ అనురాగం మన్మథ యాగం
భువిని వెలిసె మనకొక లోకం ..ఆ..ఆ

సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం

Palli Balakrishna Friday, December 8, 2017
Sandade Sandadi (2002)


చిత్రం: సందడే సందడి (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: సుజాత మోహన్ టిప్పు
నటీనటులు: జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శివాజి, ఊర్వశి, రాశి, సంఘవి, సోనాలి జోషి, సోనీ రాజ్, స్వప్న మాధురి
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాతలు: ఆదిత్య రామ్
విడుదల తేది: 13.12.2002

I am in Love... (3)
I am in Love... (3)

ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా
ఇన్నాళ్లుగ ఎదలో దాగిన రూపం ఎదురై కనపడగా
ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా

అంతా నువ్వే కావా ఆనందం నవ్వై రావా
నీ సొంతమై చేరుకున్నాగా
ఎదలో వెళుతువున్నా నువ్వెల్లే దారుల్లోన
నీ నీడనై నేనున్నా
నువ్వే నవ్వంగానే నే దోసిలి పడుతూ ఉన్నా
ముత్యాలే అందుకున్నా
నీ చెక్కిలి నొక్కుల్లోన నే చిక్కుకు పోతూవున్నా
నీ చెంతకి చేరుకున్నా
హృదయమా అంతే లేని హాయిలోకి పయణమా
ప్రియతమా అంటుపట్టనివ్వదమ్మ ప్రేమ మహిమ

ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా

కనురెప్పల్లో దూరి నా కలగా నువ్వే చేరి
నా లోకమే నువ్వుగ మారి
పువ్వుల పరిమళమంత నీ జాడనే అందిస్తుంటే
నీ జంటనే చేరాలి
నాలుగు దిక్కుల్లోన నీ చిత్రాలే చూడాలి
నా గుండెల్లో నువ్వుండాలి
నా ఊపిరిలో గాలి నీ పేరే జపియించాలి
నీ కోసమే బ్రతకాలి
చిటికెలో నీ చేతుల్లో బందించావే మనసుని
చిలిపిగా నీ మాయల్లో ముంచేశావే నా మదిని

ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా
ఇన్నాళ్లుగ ఎదలో దాగిన రూపం ఎదురై కనపడగా

I am in Love... (3)
I am in Love... (3)


Palli Balakrishna Thursday, October 19, 2017
Rustum (1984)




చిత్రం: రుస్తుం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, ఊర్వశి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యస్.పి.వెంకన్నబాబు
విడుదల తేది: 02.12.1984



Songs List:



ఎలా ఉన్నదమ్మ ఒళ్ళూ పాట సాహిత్యం

 
చిత్రం: రుస్తుం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఎలా ఉన్నదమ్మ ఒళ్ళూ
నీకెలా ఉన్నదమ్మ ఒళ్ళూ
ఒంపులు తిరిగే ఒళ్ళూ
వయసులు ఎదిగే ఒళ్ళూ
ఒళ్ళొ కొస్తు ఉంటే ఒకటై పోటు ఉంటే
అమ్మ నాగమ్మొ తిమ్మిరెక్కిందా
కన్నుకొట్టి జున్ను పెట్టిందా

ఎలా చెప్పనయ్యా పాడూ
ఇంకెల చెప్పనయ్య గోడు
చీకటి తాకనీ చెండు
చిలకలు కొట్టని పండు
ఎత్తుకుపోతానంటే హత్తుకుపోతు ఉంటె
అమ్మొ నాగమ్మొ ఆకలేసింది కోకతల్లి కేకలేసింది

నీ ఒళ్ళంతా వలవేనమ్మా
వయ్యారి వలపేనమ్మా
నీ రైకల తళుకులు చూసి
ఆ సోకుల బిళుకులు చూసీ
కంటికి నిదరే రాదాయె
పగలే రాతిరి మసకాయె
చలికాలాల తడితాళాలు రేగే వేళలో
ఒడిలో నాకు విడిదే ఇచ్చి కసిగా ఆడుకో

ఎలా ఉన్నదమ్మ ఒళ్ళూ
నీకెలా ఉన్నదమ్మ ఒళ్ళూ
చీకటి తాకనీ చెండు
చిలకలు కొట్టని పండు
ఎత్తుకుపోతానంటే హత్తుకుపోతు ఉంటె
అమ్మ నాగమ్మొ తిమ్మిరెక్కిందా
కన్నుకొట్టి జున్ను పెట్టిందా

నా ఒళ్ళంతా మనసేనయ్యో
నువ్ వద్దన్నా వరసేనయ్యో
నీ నల్లని మీసం దువ్వి
నా వెన్నెల కోసం రువ్వి
ఒంటిగ ఉంటె గొడవాయె
ఒంటికి పగులే లేదాయే
జత మంచాలు శ్రుతి మించేటి వయసు వేడిలో
ప్రియమౌ తీపిలయలే పుట్టి లాలించాలిలే

ఎలా చెప్పనయ్యా పాడూ
ఇంకెల చెప్పనయ్య గోడు
ఒంపులు తిరిగే ఒళ్ళూ
వయసులు ఎదిగే ఒళ్ళూ
ఎత్తుకుపోతానంటే హత్తుకుపోతు ఉంటె
అమ్మ నాగమ్మొ తిమ్మిరెక్కిందా
కన్నుకొట్టి జున్ను పెట్టిందా

ఎలా చెప్పనయ్యా పాడూ
ఎలా ఉన్నదమ్మ ఒళ్ళూ




నీ బుగ్గ తడమాలంటె... పాట సాహిత్యం

 
చిత్రం: రుస్తుం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

నీ బుగ్గ తడమాలంటె...హ హ హ హ హ
నీ సిగ్గు చిదమాలంటె...ఓహొ హొ హొ హొ
ఆ కిటుకు నేర్పాలె నా చిలక
ఆ కిటుకు నేర్పాలె నా చిలక
ఆటలాడన ఓడగొట్టనా
ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా
ఆటలాడన ఓడగొట్టనా
ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా

నీ మోజు తీరాలంటె...హ హ హ హ హ
నా మొక్కు తీర్చాలంతె...ఓహొ హొ హొ హొ
ఓ ముద్దు పెట్టెయమ్మ కసిగా
ఓ ముద్దు పెట్టెయమ్మ కసిగా
ఆద పిల్లను అడ్డు చెప్పను
ముద్దబంతి పువ్వు లాంటి ముద్దులిచ్చుకో
ఆద పిల్లను అడ్డు చెప్పను
ముద్దబంతి పువ్వు లాంటి ముద్దులిచ్చుకో

కోక కొంగు అడిగేనమ్మ కోటి ముద్దులు
వారిస్తున్న ఊరిస్తున్న
వేడి చూపు అడిగేనమ్మ వేడి ముద్దులు
చందమామ దిష్టికొట్టె సంద్య పొద్దు అందాలన్ని
ముప్పుట నాకె ఇచ్చి మురిపించవా
ఆ పక్క వాలె పొద్దు ఈ పక్క ఇచ్చె ముద్దు
నిన్ను నన్ను ముద్దాడుకోమని
ఈడు జోడు అల్లాడుతున్నవి అల్లేసుకొమ్మని

నీ బుగ్గ తడమాలంటె...హ హ హ హ హ
నీ సిగ్గు చిదమాలంటె...హ హ హ హ హ
ఓ ముద్దు పెట్టెయమ్మ కసిగా
ఓ ముద్దు పెట్టెయమ్మ కసిగా
ఆటలాడన ఓడగొట్టనా
ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా
ఆద పిల్లను అడ్డు చెప్పను
ముద్దబంతి పువ్వు లాంటి ముద్దులిచ్చుకో

చెక్కిలి చంప చిలగడ దుంప
చెంగు బట్టి అడిగేనమ్మ దొంగ ముద్దులు
జల్లొ పువ్వు ఒళ్ళొ నువ్వు
వద్దంటున్న ఇస్తానమ్మ వంద ముద్దులు
తెల్లారాక సాక్ష్యం చెప్పె తేనెటీగ ముద్దులన్ని
నేనెట్ట దాచలమ్మ ఈ జోరులో
చిలకల్లె కొట్టెస్తుంటె పులకింతె పుట్టిస్తుంటె
మంధారల మలిసంధ్య పొదూల్లొ
సింధురంగా నా ముద్దె పెట్టుకో
న ముందె ఉండిపో

నీ బుగ్గ తడమాలంటె...హ హ హ హ హ
నీ సిగ్గు చిదమాలంటె...ఓహొ హొ హొ హొ
ఓ ముద్దు పెట్టెయమ్మ కసిగా
ఓ ముద్దు పెట్టెయమ్మ కసిగా
ఆటలాడన ఓడగొట్టనా
ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా
ఆద పిల్లను అడ్డు చెప్పను
ముద్దబంతి పువ్వు లాంటి ముద్దులిచ్చుకో



రామన్న రాముడోయ్ రాంభజన పాట సాహిత్యం

 
చిత్రం: రుస్తుం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

శ్రీ రామా ....
రామన్న రాముడోయ్ రాంభజన
రామన్న దేవుడొయ్ ఎందువలన
రామన్న రాముడోయ్ రాంభజన
రామన్న దేవుడొయ్ ఎందువలన

హనుమయ్య మెచ్చుకుందెదువలనా
హనుమయ్య మెచ్చుకుందెదువలనా
శబరమ్మ కాచుకుందెదువలనా
శబరమ్మ కాచుకుందెదువలనా
ఒకటే బాష ఒకటే బాణం ఒకటే భామ అందువలన

రామన్న రాముడోయ్ రాంభజన
రామన్న దేవుడొయ్ ఎందువలన
రామన్న రాముడోయ్ రాంభజన
రామన్న దేవుడొయ్ ఎందువలన

రాతిని నాతిని చెయ్యకపోతె
రామపాదమున మహిమేది
ఆ రామపాదమున మహిమేది
కోతిని దూతగ పంపకపోతె
రామ నామమున మహిమేది
శ్రీ రామ నామమున మహిమేది
బంగరు జింకను కోరకపోతె సీత
దొన రక్కసికి దోవేది
దొన రక్కసికి దోవేది

లంక చెరకు తను చేరకుంటె
లంకేస్వరునికి చావేది
లంకేస్వరునికి చావేది
ఓ రామ నీ మహిమ ఓ రామ నీ మహిమ
పదితలలుండి ఏమి లాభము పతిత రవనుడు కనగలడ

హరి హరి హరి హరి
శ్రీ మద్రమారమణ గోవింధో హరి

ఇందిర మందిర భక్త సుందర హ్రుదయార వింద
పండిత ముని జన బ్రుంద
పాలక రామ గోవింధ

ఘరల కందరమ్రుత నామ
తరల భూమి దా ప్రితామ
తరలి రార మేఘస్యామ
ధరని దాక దిగిస్యామ
ఇందిర మందిర భక్త
పొందర హ్రుదయారవింద
ఇందిర మందిర భక్త
పొందర హ్రుదయారవింద
తరలి రార మేఘస్యామ
ధరని దాక దిగిస్యామ

రామన్న రాముడోయ్ రాంభజన
రామన్న దేవుడొయ్ ఎందువలన
రామన్న రాముడోయ్ రాంభజన
రామన్న దేవుడొయ్ ఎందువలన

కరకు బోయడె కరికాకుంటె
రామచందురినికి విలువేది
శ్రీ రామచందురినికి విలువేది
కైకవరాలె అడగకపోతె
రామలక్ష్మనుల విలువేది
ఆ రామలక్ష్మనుల విలువేది
వ్రుష్యముఖమున చేరకుంటె
సిష్యముకలకు దిక్కేది
ఆ కోతి మూకలకు దిక్కేది
నేల వాలిన వాలి జన్మకు
రామ పాదమెటు దక్కేది
రామ పాదమెటు దక్కేది

ఓ రామ నీ మహిమ ఓ రామ నీ మహిమ
తెలియ నేరము తెలిసి నేరము
చేసినారము బ్రోముమయ మము కాయుమయ

రామన్న రాముడోయ్ రాంభజన
రామన్న దేవుడొయ్ ఎందువలన
రామన్న రాముడోయ్ రాంభజన
రామన్న దేవుడొయ్ ఎందువలన



పాడ్యమి నాటి రాత్రి పాట సాహిత్యం

 
చిత్రం: రుస్తుం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం: పి..సుశీల


పాడ్యమి  నాటి రాత్రి 



తోటాకూర కోస్తుంటే పాట సాహిత్యం

 
చిత్రం: రుస్తుం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి: 
తోటాకూర కోస్తుంటే తొంగి తొంగి చూస్తావు...
వంగా పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు
తొంగి తొంగి చూసేది ఏంది మావా...
తొంగి తొంగి చూసేది ఏంది మావా...
దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా
దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా

హొయ్... తోటాకూర కోస్తుంటే పైట జారా వేస్తావు
వంగా పండు కోస్తునే వన్నేలారా వేస్తావు 

తొంగి తొంగి చూసేది చందమావా...
తొంగి తొంగి చూసేది చందమావా...
దొడ్డిదారినొచ్చేది ప్రేమ ప్రేమా
దొడ్డిదారినొచ్చేది ప్రేమ ప్రేమా

చరణం: 1 
కాయో పండో కవ్విస్తోంది... కొమ్మచాటు వద్దింకా.. హహా..
పువ్వు పింది పండె దాకా కొట్టా వద్దు గోరింకా... హహా..
వన్నె చూశా... కన్ను వేశా... అబ్బ నీకు ఎంత ఆశా
చేనే కంచే మేసేస్తోంటే గొప్ప తంటా..
చేసేదంతా చెప్పెస్తోంటే ఒప్పనంటా
వాలు పొద్దు ముద్దు లేని వంగ తోటా
వాలు పొద్దు ముద్దు లేని వంగ తోటా
ఒళ్లు ఒళ్లు అల్లుకుంటే వలపు తోటా
ఒళ్లు ఒళ్లు అల్లుకుంటే వలపు తోటా

అరె... తోటాకూర  కోస్తుంటే పైట జారా వేస్తావు
వంగా పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు 

చరణం: 2
పామో తేలో ఉంటాయేమో వాదించకు వద్దింకా
ఊరు వాడా చూస్తేనేమి చాటు మాటు వద్దింకా
అమ్మ చాటు నాకు లేదు... అయ్య చాటు నాకు లేదు
చెయ్యి చెయ్యి చెట్టా పట్టి చెక్కేద్దామా
సందే గాలి సందిళ్లల్లో నొక్కేద్దామా
తోడు లేని జీవితాలే తోటకూరా...
తోడు లేని జీవితాలే తోటకూరా...
నీడనిస్తే తోడు ఉంటా కట్టుకోరా
నీడనిస్తే తోడు ఉంటా కట్టుకోరా

హొయ్... తోటాకూర కోస్తుంటే పైట జారా వేస్తావు
వంగా పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు

తొంగి తొంగి చూసేది చందమావా...
తొంగి తొంగి చూసేది చందమావా...
దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా
దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా

Palli Balakrishna Monday, August 28, 2017

Most Recent

Default