చిత్రం: ధనలక్ష్మి ఐ లవ్ యు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: యస్.పి.బాలు, కౌశల్య
నటీనటులు: అల్లరి నరేష్ , ఆదిత్య ఓం, అంకిత , సోనీ రాజ్, నరేష్
దర్శకత్వం: శివ నాగేశ్వరరావు
నిర్మాత: బి.సత్యనారాయణ
విడుదల తేది: 18.10.2000
కో కో కోమలి కలవరమా
గుండెల్లో మరి కల కలమా
హాల్లో పోకిరి కనికరమా
అదోమాదిరి చలి జ్వరమా
పిల్లనా తపనలు గిల్లేనా
కలలోన కవితలు అల్లేనా
మందారాలకే మరదలివే
వయ్యారాలికే ఉరవడినే
అయ్యయ్యో అమ్మమ్మో
చెలిమరి మురిసినది
కో కో కోమలి కలవరమా
గుండెల్లో మరి కల కలమా
హాల్లో పోకిరి కనికరమా
అదోమాదిరి చలి జ్వరమా
చరణం: 1
అన్నట్టు నీలో ఏముందో
హఠాత్తు ప్రణయం పుట్టిందో
ఉన్నట్టు ఉండి ఏమైందో
నాక్కూడ ఏదో అయ్యింది
నా కోల కళ్ళు ఈ చీర గళ్లు
నచ్చాయా అబ్బాయి
చూపుల్లో ముళ్ళు గుచ్చాయి ఒళ్ళు
చూస్తావా ఓ సారి
చింత చిగురులో పులుపా
చెలికోరుకున్నది పిలుపా
గుమ్మపాలలో తెలుపా
మదిలోని మాటనే తెలుపా తెలుపా
హాల్లో పోకిరి కనికరమా
అదోమాదిరి చలి జ్వరమా
కో కో కోమలి కలవరమా
గుండెల్లో మరి కల కలమా
చరణం: 2
గమ్మత్తుగుంది ఈవేళ
నన్నెత్తు కోరా గోపాలా
కొంగొత్త గుంది ఈవేళ చెయ్యెత్తి జే జే కొట్టేలా
నా వైపు నీవు ఉన్నావు అంటే ఎంతో సంతోషమే
నీ గుండెలోన చోటున్నదంటే కాదా నాకోసమే
స్వాతివానలో చినుకా తొలిప్రేమ వాకిట తళుకా
తియ్యగున్నది చెరుకా తెర తీయమన్నది చిలకా చిలకా
హాల్లో పోకిరి కనికరమా
అదోమాదిరి చలి జ్వరమా
కో కో కోమలి కలవరమా
గుండెల్లో మరి కల కలమా
పిల్లనా తపనలు గిల్లేనా
కలలోన కవితలు అల్లేనా
మందారాలకే మరదలివే
వయ్యారాలికే ఉరవడినే
అయ్యయ్యో అమ్మమ్మో
చెలిమరి మురిసినది
2002
,
Aditya Om
,
Allari Naresh
,
Ankitha
,
B.Satyanarayana
,
Chakri
,
Dhanalaxmi I Love You
,
Naresh
,
Siva Nageswara Rao
,
Sony Raj
Dhanalaxmi I Love You (2002)
Palli Balakrishna
Thursday, November 30, 2017