పాట: శివరాత్రి పాట (2019)
సంగీతం: బాజి
రచన: మాట్ల తిరుపతి
గానం: మంగ్లి
దర్శకత్వం: దాము రెడ్డి
విడుదల తేది: 2019
శివరాత్రి పాట (2019) సాహిత్యం
పాట: శివరాత్రి పాట (2019)
సంగీతం: బాజి
రచన: మాట్ల తిరుపతి
గానం: మంగ్లి
పల్లవి:
ఎండి కొండాలు ఏలేటోడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలనుగాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపే టొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రాహ్మండాలు నిండినోడా
నాగభరణుడా నందివాహనుడా
కేదారినాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వరా
||ఎండి కొండాలు ఏలేటోడా||
చరణం: 1
పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలారాలు పంచేరే
కోరస్: పలారాలు పంచేరే
గండా దీపాలు ఘనముగా వెలిగించేరే
గండాలు బాపమని పబ్బాతులు పట్టేరే
కోరస్: పబ్బాతులు పట్టేరే
లింగనా రూపాయి..తంబాన కోడేను
కట్టినా వారికి సుట్టానీవే
తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు
మొక్కినా వారికీ దిక్కు నీవేలే
వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే
కోరస్: పలికేటి దేవుడావే
కోరితే కోడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే
||ఎండి కొండాలు ఏలేటోడా||
చరణం: 2
నీ యాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే
నరులకు అందని నీ లీలలు చిత్రాలులే
కోరస్: లీలలు చిత్రాలులే
కొప్పులో గంగామ్మ పక్కన పార్వతమ్మ
ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే
కోరస్: ముక్కంటిశ్వరుడావే
నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడ కరుణాలాదేవుడ
కరునించామని నిన్నూ వెడుకుంటామే
త్రీలోక పూజ్యూడా త్రిశూల ధారుడా
పంచభూతాలకు అధిపతివి నీవూరా
కోరస్: అధిపతివి నీవూరా
శరణని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా
దేవనా దేవుళ్లు మెచ్చినోడా
ఒగ్గూ జెగ్గుల పూజలు అందివొడా
ఆనంత జీవా కోటిని ఏలినోడా నీవు
అత్మాలింగనివిరా మాయలోడా
కోటి లింగాల దర్శనమిచ్చేటోడా
కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా
నటరాజు నాట్యాలు ఆడెటోడా
నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా
నాగభరనుడా నంది వాహనుడా
కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర
||ఎండి కొండాలు ఏలేటోడా||