Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "SK Baji"
Song: Gummare Gumma



Image Source Link



  
పాట: ఘుమ్మరె ఘుమ్మా 
సంగీతం: SK బాజీ
రచన: సుద్దాల అశోక్ తేజా
గానం: శ్రావణ భార్గవి 
ఆర్టిస్ట్స్: అన్ని
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ 
ప్రొడ్యూసర్: శ్రీనివాస యాదవ్ 
రికార్డింగ్ లేబుల్:: శ్రీనివాస మేలోడీస్
విడుదల: 02.06.2023


ఘుమ్మరె ఘుమ్మా పాట సాహిత్యం

 

పాట: ఘుమ్మరె ఘుమ్మా 
సంగీతం: SK బాజీ
రచన: సుద్దాల అశోక్ తేజా
గానం: శ్రావణ భార్గవి 

ఘుమ్మరె ఘుమ్మా ఘుమ్మరె  ఘుమ్మా 
ఘుమ్మరె ఘుమ్మా  ఘుమ్మరే 
ఇక్కడ వాడో అక్కడ వాడో 
ఎక్కడ వాడు ఉన్నాడో 

ఘుమ్మరె ఘుమ్మా ఘుమ్మరె  ఘుమ్మా 
ఘుమ్మరె ఘుమ్మా  ఘుమ్మరే 

సక్కని వాడు చిక్కని వాడు 
నా సెయ్యి పట్టి సిన్నోడు 
పాప అంటాడో పండు అంటాడో 
నా దిండు పంచుకునే మెరుపు మొగాడు 

ఘుమ్మరె ఘుమ్మా ఘుమ్మరె  ఘుమ్మా 
ఘుమ్మరె ఘుమ్మా  ఘుమ్మరే 

ఏరా అంటాడో ఏమె అంటాడో 
నా రింగు ముంగురులు జరిపేవాడు 
తననే ముట్టుకుంటే వజ్రం మల్లె ఉండాలనే 
మనసే వెన్నె లాగ నన్నే చూసి కరుకలేనే 
ఒడ్డు పొడుగు చూసి ఫ్రెండ్స్ ఈర్ష్య పడాలె 
తేనే కన్న తెలుగు కన్న తియ్యగా ఉండాలే 

బండెక్కి వస్తాడో ఫ్లైట్ ఎక్కి వస్తాడో 
ఇన్నోవా కారు ఇంటి ముందాపి హిట్టింగు లిస్తాడో 
హగ్గివ్వమంటాడో సిగ్గివ్వమంటాడో 
బుగ్గల మీద ముద్దులు పెట్టి రిగ్గింగ్ లంటాడో 

ఏ కళ్ళలో స్విమ్మింగ్ చేసే జిమ్మిక్ రావాలే 
నడుము కల్లాలే మెల్లెంగా తీసే మ్యాజిక్కు చెయ్యాలె 

ఘుమ్మరె ఘుమ్మా ఘుమ్మరె  ఘుమ్మా 
ఘుమ్మరె ఘుమ్మా  ఘుమ్మరే 

స్నానాల టబ్బులో రోజా ముగ్గులు నింపాలె 
ఎద కోనల రేఖలు గీసి దగ్గర కావలే
షార్టే  వేసిన సూటే వేసినా పంచె కట్టిన 
పంచ్ ఉండాలే వాని మ్యనేరిజం తోని నన్ను పడేసి 
ఐస్ లగా గరక తీసి అంతరంగుడు 

బండెక్కి వస్తాడో ఫ్లైట్ ఎక్కి వస్తాడో 
ఇన్నోవా కారు ఇంటి ముందాపి హిట్టింగు లిస్తాడో 
హగ్గివ్వమంటాడో సిగ్గివ్వమంటాడో 
బుగ్గల మీద ముద్దులు పెట్టి రిగ్గింగ్ లంటాడో 

హోల హోల హోలా హోల హోల హోలా 
హోల హోల హోలా హోలా హోలా 
హోల హోల హోలా హోల హోల హోలా 
హోల హోల హోలా హోలా హోలా 

స్ట్రీట్ అంతా మెచ్చే నచ్చే స్మైలుండాలి
వాడు మొత్తంగా మచ్చలేని మ్యాన్ అవ్వాలి 

ఘుమ్మరె ఘుమ్మా ఘుమ్మరె  ఘుమ్మా 
ఘుమ్మరె ఘుమ్మా  ఘుమ్మరే 

వైశాఖ పున్నమంటి కలరుండాలి
వాని వైబ్రేషన్ చూడా వెయ్యి కళ్ళుండాలే 
షేక్ హ్యాండ్ ఇచ్చిన చినుకు విసిరినా 
చుట్టు అందరు థ్రిల్ అవ్వాలె 
ఎంతటోడు కాని వాని ముందు తలోంచే 
రాజ గుణం చూపి ధీర శౌర్య తేజుడే 

బండెక్కి వస్తాడో ఫ్లైట్ ఎక్కి వస్తాడో 
ఇన్నోవా కారు ఇంటి ముందాపి హిట్టింగు లిస్తాడో 
హగ్గివ్వమంటాడో సిగ్గివ్వమంటాడో 
బుగ్గల మీద ముద్దులు పెట్టి రిగ్గింగ్ లంటాడో 

అరె పాప అంటాడో పండు అంటాడో 
నా దిండు పంచుకునే మెరుపు మొగాడు 

ఘుమ్మరె ఘుమ్మా ఘుమ్మరె  ఘుమ్మా 
ఘుమ్మరె ఘుమ్మా  ఘుమ్మరే 

అరె ఏరా అంటాడో ఏమె అంటాడో 
నా రింగు ముంగురులు జరిపేవాడు

Palli Balakrishna Tuesday, June 13, 2023
Sankranthi Song (2019)


పాట: సంక్రాంతి పాట (2019)
సంగీతం: SK.బాజీ
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్
గానం: మంగ్లీ


సంక్రాంతి పాట (2019) సాహిత్యం

 
రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు 
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు 
పట్టు పరికిణి కట్టి చుక్కల వరసలు పెట్టి 
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి..
కోడితో పందెం కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి 
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి 

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

పంతాలతో రగిలిన మన రాయలసీమ. 
ఆనందాలకు సంక్రాంతే చిరునామా
పౌరుషాల వెలివేసిన పండుగ నీవు
ప్రేమలతో  ప్రతి గుండెల పెనవేసావు
తెలతెలవారుతుంటే రాజేసే భోగి మంట 
కొత్త అల్లుళ్ళతో  కోనసీమ మురిసేనంట
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా
ఊరిని తలుచుకొని తన్మయమే చెందేనట

ఆట పాటలకే  పట్టం కట్టి 
సంతోషాలకే శ్రీకారం చుట్టి..
తరలి తరలి వచ్చెనదిగో సంక్రాంతి
ప్రేమల చిరునామా..రాయలసీమ 
అనురాగాల రాగం పాడేనమ్మా
పసిడి కోనసీమ  పంటచేల నడుమ 
పరువాల గోదావరి పారేనమ్మా
పంటలు కానుక ఇచ్చి 
రైతుల కలలను తీర్చి 
పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి
పచ్చి పాలజల్లు పచ్చని పొదరిల్లు
పైరులతో పల్లెలన్నీ విలసిల్లు
మంచు పూలజల్లు పరిమళాలు చల్లు
వేలాది పువ్వుల కల్లాపిని చల్లు

ఏరువాక ఎదల మీద పంటను తీసి 
సంచారజాతికింత దానం చేసి
గోమాత, భూమాతల పూజలు చేసి 
హరిదాసుల కీర్తనలు గానం చేసి
నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణం..
బొమ్మల కొలువులోన కొలువుదీరే పసితనం 
పసుపు కుంకుమలే పడతులకు వాయనం
గగనం తాకునమ్మా గాలిలోన పతంగం
స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం 
ఉత్తర దిక్కున భానుడి  సంచారం 
తెలంగాణ, ఆంధ్రులకు చెరిపెను దూరం

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు 
పట్టు పరికిణి కట్టి చుక్కల వరసలు పెట్టి 
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి
కోడితో పందెం కట్టి. ఎడ్లతో పరుగులు పెట్టి 
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే    సంక్రాంతి 

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

Palli Balakrishna Saturday, May 29, 2021
Shivaratri Song (2019)




పాట: శివరాత్రి పాట (2019)
సంగీతం: బాజి
రచన: మాట్ల తిరుపతి
గానం: మంగ్లి
దర్శకత్వం: దాము రెడ్డి
విడుదల తేది: 2019


శివరాత్రి పాట (2019) సాహిత్యం

 
పాట: శివరాత్రి పాట (2019)
సంగీతం: బాజి
రచన: మాట్ల తిరుపతి
గానం: మంగ్లి

పల్లవి:
ఎండి కొండాలు ఏలేటోడా 
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా 
జగాలనుగాసే జంగముడా

కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపే టొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రాహ్మండాలు నిండినోడా

నాగభరణుడా నందివాహనుడా
కేదారినాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వరా

||ఎండి కొండాలు ఏలేటోడా||

చరణం: 1
పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలారాలు పంచేరే 
కోరస్: పలారాలు పంచేరే 

గండా దీపాలు ఘనముగా వెలిగించేరే
గండాలు బాపమని పబ్బాతులు పట్టేరే
కోరస్: పబ్బాతులు పట్టేరే

లింగనా రూపాయి..తంబాన కోడేను
కట్టినా వారికి సుట్టానీవే
తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు
మొక్కినా వారికీ  దిక్కు నీవేలే

వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే 
కోరస్: పలికేటి దేవుడావే

కోరితే కోడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే

||ఎండి కొండాలు ఏలేటోడా||

చరణం: 2
నీ యాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే
నరులకు అందని నీ లీలలు చిత్రాలులే
కోరస్: లీలలు చిత్రాలులే

కొప్పులో గంగామ్మ పక్కన పార్వతమ్మ
ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే
కోరస్: ముక్కంటిశ్వరుడావే

నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడ కరుణాలాదేవుడ
కరునించామని నిన్నూ వెడుకుంటామే

త్రీలోక పూజ్యూడా త్రిశూల ధారుడా
పంచభూతాలకు అధిపతివి నీవూరా
కోరస్: అధిపతివి నీవూరా

శరణని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా
దేవనా దేవుళ్లు మెచ్చినోడా
ఒగ్గూ జెగ్గుల పూజలు అందివొడా
ఆనంత జీవా కోటిని ఏలినోడా నీవు
అత్మాలింగనివిరా మాయలోడా

కోటి లింగాల దర్శనమిచ్చేటోడా 
కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా
నటరాజు నాట్యాలు ఆడెటోడా
నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా

నాగభరనుడా నంది వాహనుడా
కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా 
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర

||ఎండి కొండాలు ఏలేటోడా||

Palli Balakrishna Friday, May 28, 2021
Bathukamma Song (2020)




పాట: బతుకమ్మ పాట (2020)
సంగీతం: SK బాజీ, సురేష్ బొబ్బిలి
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ
దర్శకత్వం: దాము రెడ్డి


బతుకమ్మ పాట (2020) సాహిత్యం

 
సేను సెలక మురిసేటి వేళ
రామ చిలుక పలికేటి వేళ… 
ఊరే తెల్లారే… ఏ ఏ
వాడంత రంగు రంగుల సింగిడాయే
పళ్ళెంత పండుగొస్తే సందడాయే…
కొమ్మల్లో పూల గుత్తులు ఊయలూగే
గాలుల్లో అగరబత్తుల పోగలె సాగే

సేను సెలక మురిసేటి వేళ
రామ చిలుక పలికేటి వేళ

చెరువులో తేలే తామరలోలే
చెల్లెలు చేరేనే… ఓ ఓ ఓ
అక్కలు బావలు అన్నలు తమ్ములు
అమ్మలూ మురిసేలే

తళతళలాడే తంగెడులూ
మరదలు వదినెల అల్లరులు
గులుగు మోదుగు గుమ్మడులు
అవ్వల నవ్వులురా ఓ ఓఓ

చిన్నారి చిట్టి బొడ్డెమ్మల్ని పెట్టు
జాబిల్లి సుట్టు సుక్కలు చేరినట్టు
సందేళ తుల్లుతుంది వానగట్టు
నీలాలా నింగి నేలకొచ్చినట్టు

ఏలో ఏలెలో ఏలో ఏలెలో
ఏలో ఏలెలో ఏలో
ఏలో ఏలెలో ఏలో ఏలెలో
ఏలో ఏలెలో ఏలో

పూసల పేరు అల్లిన తీరు
పువ్వులు పెర్సెనే… ఓ ఓ ఓ
మనసున కోరే ఆ‌శలు తీరే
పూజలు చేసేను

సీతజడల సంబరము
కళకళల కనకాంబరము
సీరెలు సారేలు వాయినం
ఎనకటి వంతనరా… ఓఓ ఓ ఓ

తేనెల్ల వాగులన్నీ పారినట్టు
కోయిల్ల గుంపుకట్టి పాడినట్టు
సేతుల్ల డోలుభాజ మోగినట్టు
గుండ్రంగా ఆడుతారు కట్టినట్టు

జగములో ఏ చోటున
లేదే ఈ ముచ్చట
పూలనే దేవుళ్ళుగా
చేసేటి మెక్కట

చెట్టుచేమ కోండకోన
సుట్టూ మనకు సుట్టాలు
నిండు తొమ్మిదొద్దుల్లల
కలుసుకుంటే నేస్తాలు

గంగ ఒడిలో బతుకమ్మ ఓ ఓ ఓ
గంగ ఒడిలో బతుకమ్మ
పాలపిట్టై చేరగా… ఓ ఓ ఓ ఓ

ఊరంతా రంగు రంగుల సింగిడాయే
వాడంతా పండగొస్తే సందడాయే
అందాలే కొత్త విందు చేసినాయే
బందాలే చేరువయిన రోజులాయే

Palli Balakrishna

Most Recent

Default