Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ritika Singh"
Neevevaro (2018)

చిత్రం: నీవెవరో (2018)
సంగీతం: ప్రసన్  ప్రవీణ్, అచ్చు రాజమణి, శ్యామ్
సాహిత్యం: శ్రీజో
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సి పన్ను, రితిక సింగ్
దర్శకత్వం: హరినాథ్
నిర్మాత: ఎమ్.వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 24.08.2018

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా..

మాటే విననీ మనసెగిరిపోనీ
చెలిమే రెక్కలివ్వగా
నీకే తెలియదంటున్న
నిజమే లోకం చూడగా
సందేహం వీడనీ
ఈ మాయే మదిలో నిండనీ
సంతోషం పొంగనీ
నీ హృదయం నీలో లేదనీ

ఓ మాటల్లోనే, మోమాటం కరిగించి
నిన్నూ నన్నూ స్నేహం పెనవేసింది
అలావాటే లేదుగా అడిగేది కాదుగా
ఈ వింతల వేడుక చెలిమికి ఋజువేగా
ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే
నువ్వే ఎదురైతే
ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ

ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా
నువులేవన్నా తలపే చెరిపేస్తున్నా
అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా
నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా
నీతో క్షణకాలం కలకాలంలా ఉందే
అందం ఆనందం కలగలిపి చూపిస్తున్నా
అద్దం మన కథే!

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ
వెన్నెలా.

Palli Balakrishna Friday, January 25, 2019
Shivalinga (2017)


చిత్రం: శివలింగ (2017)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఆదిత్య అయ్యంగార్ , గీతా మాధురి
నటీనటులు: రాఘవ లారెన్స్ , రితికా సింగ్
దర్శకత్వం: పి.వాసు
నిర్మాత: ఆర్. రవీంద్రన్
విడుదల తేది: 14.04.2017

రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర

హే డోంట్ వర్రీ డోంట్ వర్రీ
నైసు పిల్లా డోంట్ వర్రీ
చంటి పిల్లవు కావే నువ్వు
హే ఉఁ అంటేనే ఉలికి పడి
బేజారైతే ఎలా మరి
వెలిగిపోని నీ చిరు నవ్వు
అరె మియావ్ మియావ్
పిల్లిని చూసి అదిరిపోకలా
నయా పైసా మేటర్ కే బెదిరితే ఎలా
హే దిగులు పడకు దిల్లో అసలు చోటే లేదుగా
పాత కరెన్సీలా కంగారట్టా మనేస్తే పోలా
మనేస్తే పోలా మనేస్తే పోలా

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

హే డోంట్ వర్రీ డోంట్ వర్రీ
నైసు పిల్లా డోంట్ వర్రీ
చంటి పిల్లవు కావే నువ్వు
హే ఉఁ అంటేనే ఉలికి పడి
బేజారైతే ఎలా మరి
వెలిగిపోని నీ చిరు నవ్వు
అరె మియావ్ మియావ్
పిల్లిని చూసి అదిరిపోకలా
నయా పైసా మేటర్ కే బెదిరితే ఎలా
హే దిగులు పడకు దిల్లో అసలు చోటే లేదుగా
పాత కరెన్సీలా కంగారట్టా మనేస్తే పోలా

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

అరె పనికి రాని బాధా భయం ఓల్డ్ బాలెన్సు
అది డస్ట్ బిన్ కేశావంటే లైఫే బోనస్సు

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

వారెవ్వా నీ టాలెంట్ కి చెప్పా ఓ యస్సో
నువ్వు గ్రహాలతో ఆడేస్తావు క్రేజీ కేరమ్స్

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

అబ్బా రెండు వేల నోటు
దాని ఫేసు ఎంతో బ్రైట్
అది తాగితే నైటు
మనముంటేనే కరెక్ట్
నీ మాట ఐసు ఫ్రూటు
ఐపోయా నేనేే ఫ్లాటు
తెరిచాను కౌగిలి గేటు
వచ్చి వాలిపొమ్మంటు

హే డోంట్ వర్రీ డోంట్ వర్రీ
నైసు పిల్లా డోంట్ వర్రీ
చంటి పిల్లవు కావే నువ్వు

రంగు రక్కర రక్కర రక్కర రక్కర

బి ఫర్ బోల్డ్ బి ఫర్ బ్రేవ్
బి ఫర్ బ్లాకు రా
నువ్వు వైట్ అండ్ వైట్ దిల్ ఉన్న
సూపర్ మాన్ రా

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

ఒక వైఫై లాగ అల్ రౌండ్ నేను ఉండగా
నా వైపు నువ్వు కొంచమైన టెన్షన్ లేదుగా

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

మై డియర్ మ్యాన్లీ సోల్డ్జర్
ఫుల్ పవర్ ఫుల్ ఫాంతర్
నువ్వు పక్కనుంటే చాలు
ఇక లేనే లేదు టెన్షన్
యు ఆర్ మై లవ్లీ ఏంజిల్
నేను నీకు గోల్డ్ బేంగిల్
విలనల్లే వస్తే ప్రాబ్లెమ్
చూపిస్తా హీరో ఏంగిల్

హే డోంట్ వర్రీ డోంట్ వర్రీ
నైసు పిల్లా డోంట్ వర్రీ
చంటి పిల్లవు కావే నువ్వు
హే ఉఁ అంటేనే ఉలికి పడి
బేజారైతే ఎలా మరి
వెలిగిపోని నీ చిరు నవ్వు
అరె మియావ్ మియావ్
పిల్లిని చూసి అదిరిపోకలా
నయా పైసా మేటర్ కే బెదిరితే ఎలా
హే దిగులు పడకు దిల్లో అసలు చోటే లేదుగా
పాత కరెన్సీలా కంగారట్టా మనేస్తే పోలా

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

హే రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రా...

హే రంగు

Palli Balakrishna Sunday, July 16, 2017
Guru (2017)



చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
నటీనటులు: వెంకటేష్ , రితిక సింగ్
దర్శకత్వం: సుధా కొంగర ప్రసాద్
నిర్మాత: ఎస్. శశికాంత్
విడుదల తేది: 31.03.2017



Songs List:



నే జర మొరటోడ్ని రా పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ధార్ద్ మహదేవన్

నే జర మొరటోడ్ని రా
నే సాలా నీ ఢర్ని రా
నా మాటే నికర్షయిన పిచ్చి నిజమేరా
నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

ఉడుకుతున్న కోపం నాకు నేర్పినది నడక
ఆవేశం వీరావేశం దారి చూపే గనుక 
పిచ్చి లోకం తీరు నాకు వంటబట్టదింక
నా సిద్ధాంతంకై రాద్ధాంతాలే చేస్తా జంకు లేక

నగ్న సత్యం నేనే సిగ్గే లేదే
నీ సానుభూతేం నాకేం అక్కర్లేదే

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

కంకర్రాయి కూడా ఉంటుందేదో వైపు చదును
నా కేరక్టర్ నిండా లెక్కలేనంత పదును
అహంకారి తిక్కవైరి అనుకుంటారా
అవును మీ అర్ధం లేని స్వార్ధం కోసం నన్ను మార్చుకోను ఓ ఓ...

అడ్డదిడ్డం నాకే అడ్డే ఎవడు
రెడ్డా మాత్రం నాదే నెగ్గేదెవడు

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

నే జర మొరటోడ్ని రా
నే సాలా నీ ఢర్ని రా
నా మాటే నికర్షయిన పిచ్చి నిజమేరా
నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...





జింగిడి జింగిడి పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వెంకటేష్

తాగుబోతు మహారాజు లందరికి
పేరు పేరున నమస్కారం
దిస్ మేటెర్ ఈజ్ 
దీని అర్ధం ఏమిటంటే 
బాధలు మర్చిపోవటానికి
పీతల్లా తగుతున్నారుకాని
లోపల లివర్ దొబ్బుతుందని
ఆరోగ్యం షెడ్ కెళ్తుందని
జిందగి బార్బద్ అయిపోతుందని
అసలు తెలులుకోరే
జీవితమంటే సినిమా కాదురా అయ్యా
ప్రతీది సెన్సార్ బోర్డు చూసు కోవటానికి
ధూమ పానం మద్యపానం మా చెడ్డది రా అబ్బాయి
అని ఎంత చెప్పినా వినరే
మిలాంటోళ్లకోసమే యముడు పక్క సీటు రెడీ గా ఉంది
బయలుదేరండి బయలుదేరండి
ఆబ్బె మాకు తెలియదు మరి అంటారా
తాగండి ఊగండి మీ చావు మీరు చావండ్రా

క్వాటర్ బాటిల్ జానెడున్నా మేటర్ బోలెడుంది
మాటలు బొత్తిగా రానోడిచేత పాటలు పాడిస్తుంది
దీనిని మించిన స్వర్గమన్నది
స్వర్గములో కూడా ఉండదన్నది
చీర కట్టిన చిలక లాగ చిల్డ్ బీర్ పొంగి పొరలే
కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే...

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి (4)

హే పిరికోడికైనా ధైర్యమొస్తది
పేదోనికైనా పండగొస్తది
పిచ్చోడికైనా జ్ఞానమోస్తది
మందులోనే మందులోనే
దీనిని మించిన యోగముండదే
దీనికి తగ్గని రోగముండదే
లోకాన్ని మడిచి పెట్టుకున్నదే
ఇందులోనే ఇందులోనే

కూల్ కూల్ డ్యూడ్ ని కూటికి లేని వాడ్ని
చీర్స్ కొట్టి కలపదా మందు మహా రాణి
మూసిన షట్టర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిస
మేరా నామ్ ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ గణేశా

తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు
అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు
తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు
అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు


జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి (4)




గుండెలోతుల్లో పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఢీ

గుండెలోతుల్లో 





ఏయ్ పటాకే పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనంత్

ఐదు వందలు చూడగానే కళ్ళు మెరిసెరా
పెదవిమీద నవ్వు పూల వాన కురిసెరా
ఆడ పిల్ల లాగ ఉన్న లేడి పిల్లరా
ఆకాశాన ఎగురుతున్న చేపపిల్లరా
అసలే ఫైర్ బ్రాండు
రెచ్చగొడితే తీస్తది మీ బెండు
ఏయ్ పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్ చలాకి పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే

కళ్ళలోన కోటి కలల కోట తనదిరా
తనకి తానె తిరుగులేని మహారాణిరా
కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా
సీతాకోక కాదు సీమ్మిరపకాయ్
మన ప్యాంటు షర్ట్ వేసుకున్న చిరుత పులేరోయ్
చిరుత పులేరోయ్ చిరుత పులేరోయ్

ఏయ్ పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్ చలాకి పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే

ఆశలన్ని దండగుచ్చి వేసుకుంటది
మనసు మాట తప్ప ఏది వినను అంటది
జీవితాన్ని ఆటలాగ మార్చుకుంటది
నిప్పు కనిక లాగ దూకి నెగ్గుకొస్తది

ఏయ్ పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్ చలాకి పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే




ఉక్కునరం పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ధార్ద్ మహదేవన్

నీకేమి తక్కువ నిన్నే నువ్ గుర్తించవ
నీలోను ఉంది చూడు ఉక్కునరం
నువ్వేంటో చూపించవ
నిన్నే నువ్ గెలిపించవ
నీకే తెలియని నీలో సత్తా ఉక్కునరం

ఉక్కునరం (4)

అమ్మా నాన్న పుడుతూనే పెట్టారు పేరు
అందరిలాగ నీకోటి 
రంగుల్లోన వెలిగేలా ఆ పేరు నేడు 
సాధించాలి ఏదోటి
గమ్యం లేని గాలల్లే తిరిగావంటే ఏం లాభం
కలలకు ఊపిరి పోయాలి నీ ఉక్కు నరం
స్వాగతమంటు పిలిచింది నలుదిక్కుల్లో మైదానం
జెండా ఎగరెయ్యాలి నీలో ఉక్కునరం

ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం
నిన్నే నడిపించు ధైర్యం
ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం

ఉక్కునరం (4)

నీలో బలం ఇంతేనని హే గీతల్లోన ఒదగకు
ఇంకేముందో చూద్దామనే ఆలోచనని వదలకు
నొప్పి లేని పోరాటం ఏ గొప్ప ఇవ్వదులే
నిప్పుల నడకలు తప్పవులే ఓ...
గమ్యం చేరే దారుల్లో గాయాలన్ని మామూలే 
ప్రతి ఆట పొరాటమంటూ పట్టు బిగించు

ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం
నిన్నే నడిపించు ధైర్యం
ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం

ఇంతే చాలు అనే నీ ప్రయాణం
కోరే గమ్యాన్ని సాధించదే
ఇంకా ఇంకా అనే నీ ప్రయత్నం ఏనాడూ తలొంచదే

ఉక్కునరం (8)




ఓ సక్కనోడ పట్టు పిడికిలి పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఢీ

ఓ సక్కనోడ పట్టు పిడికిలి
ధాడి చేసినావే ధడ ధడ
కస్సు బస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...

చిర్రు బుర్రుగా చిచ్చు బుడ్డిలా
నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను
ఎపుడో అలా తెలవారగా
నన్ను నేను నీ కలలో కనుగొన్నాను
నచ్చావు అందగాడా
తెచ్చావు నాలో తేడా
నువ్వు ఆడే ఆట లాగే ప్రేమించు నన్ను కూడా

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...

పగవాడివో అయినోడివో
తడిలేని పొడి చూపై తరిమేస్తావేం
మన మధ్యలో తెరలెందుకో
గడి దాటి చెలి ఒడిలో పడనంటావేం
చిరు నవ్వు చిలకరించు
చిన్నపాటి చనువు పెంచు
బుజ్జి బుజ్జి మనసు పాపం
కన్నెత్తి దాన్ని కనికరించు

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...
 
ఓ సక్కనోడ పట్టు పిడికిలి
ధాడి చేసినావే ధడ ధడ
కస్సు బస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...

Palli Balakrishna

Most Recent

Default