Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Santhosh Narayanan"
Yatra 2 (2024)



చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
నటీనటులు: ముమ్మట్టి, జీవ,  కేతకీ నారాయణ్, Suzanne Bernert
దర్శకత్వం: మహి. వి. రాఘవ్
నిర్మాత: శివ మేక
విడుదల తేది: 08.02.2024



Songs List:



ప్రజా సంకల్ప యాత్ర పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కపిల్ కపిలన్ 

ప్రజా సంకల్ప యాత్ర 




భగ భగ మండే పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: దీపక్ బ్లూ

భగ భగ మండే 



తొలి సమరం పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: గౌతం భరద్వాజ్ 

ధమ్మే ధం ధం సన్నద్ధం
రంగం సర్వం సిద్ధం
ధమ్మే… ధర్మంగా అడుగేద్దాం
ధమ్మెంతో చూపేద్దాం… తలపడదాం

ధమ్మే… ధం ధం సన్నద్ధం
రంగం సర్వం సిద్ధం భయపడం
ఎలుగెత్తిన భాస్వర స్వరమే మనం
(ధమ్మే… ధర్మంగా అడుగేద్దాం
ధమ్మెంతో చూపేద్దాం)
ఇది భళ్ళున పెళ్లున పేలిన మౌనం

ఓ ఓ, ఎదురన్నది ఎవరైనా
ఎదిరిద్దాం తలవంచేదే
లేదని చెబుదాం
సయ్యంటు బరిలో దిగుదాం
తొలి గెలుపు జెండా ఎగురేద్దాం

జంకేదే లేదు
మహానేత వారసులు మనం
పౌరుషాల సీమ బిడ్డలం
గాయమైంది ఆత్మ గౌరవం
పెచ్చు మీరుతోంది పెత్తనం

కొంత వరకే ఓర్చుకోగలం
తెగించామో తేల్చుకోగలం
చాలు చాలు చాలు ఊడిగం
అణిచే హస్తం విరిచే వీరులమౌవుదాం

హే, అనివార్యం ధిక్కారం
అవసరమే ఈ సమరం

ఇది సూన్యం పెను సూన్యం
పరీక్షించెనే సమయం
తడబడకన్నది మనోనిశ్చయం
కొనసాగాలి సేవాకార్యం
ఆగిపోరాదుగా ఆశయం
జనమే ధైర్యం, జనమే సైన్యం

ఇక అంతరాయమే లేని
గమనమే గమ్యం

అనుమతులు పరిమితులు ఇక చెల్లే
ఏదైతే కాని పయనం కదిలే
సందేహమే లేదు అసలే
మన విజయం ఇక్కడి నుండి మొదలే

జంకేది లేదు
మహానేత వారసులు మనం
పౌరుషాల సీమ బిడ్డలం
గాయమైంది ఆత్మ గౌరవం
పెచ్చుమీరుతోంది పెత్తనం

కొంత వరకే ఓర్చుకోగలం
తెగించామో తేల్చుకోగలం
చాలు చాలు చాలు ఊడిగం
అణిచే హస్తం విరిచే వీరులమౌవుదాం





చూడు నాన్న పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: విజయ్ నారాయణ్ 

చూడు నాన్న
చూస్తున్నావా నాన్నా
నీడ లేని నేనా వీళ్ళ ధీమా
ఏమిటీ ఇంతటి ప్రేమా

నా దారెటో తోచకుంటే
నీ వెంబడే మేము అంటూ
కదిలారు ఏంటో ఆ నమ్మకం
నేనెలా ఒడ్డుకి చేరడం
వీళ్ళనెలా ఒడ్డుకి చేర్చడం

ఇంటి పెద్దా కన్నుమూస్తే
అయినవాళ్ళు అనాధలే కదా
నువ్వే లేకా ప్రతి ఊరు ఊరు
అనాధ అవ్వడం ఏందయ్యా
ఇది ఏనాడు జరిగుండదయ్యా
ఓ పెద్దయ్యా

ఇందరి కన్నులు
చిమ్మే కన్నీటినంతా
తుడవాలనుంది కొడుకుగా
అందుకు అవసరమయ్యే
కొండంత ధైర్యం నాకు ఇవ్వవా

నేనెలా బాధని మింగడం
వీళ్ళనెలా నే ఓదార్చడం

ఎంతలా అభిమానమే
కురిపిస్తున్నారో ఈ జనం
అందుకే ఈ జన్మలో
తీర్చేసుకుంటా ఈ రుణం
గడపకి ప్రతి గడపకి
నేనవుతా రక్షా తోరణం
మాటపై ఉంటానని
చేస్తున్నా తొలి సంతకం

చూడు నాన్న (x8)

Palli Balakrishna Sunday, August 11, 2024
Dasara (2023)



చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
నటీనటులు: నాని , కీర్తి సురేష్ 
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి 
విడుదల తేది: 30.03.2023



Songs List:



ధూం ధాం దోస్తాన్ పాట సాహిత్యం

 
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ

ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటం
అంత లావైతే గుంజుకుంటం తింటం పంటం
ఐతై ఐతై ఐతై ఐతై బద్దల్ బాషింగాలైతై

అరె ఏం కొడుతుర్ర బై ఊకోర్రి
నీ యవ్వ మా మావగాడు శెప్పుడు సరే మీరు కొట్టుడు సరే
అరె ఓ నైంటి ఈల్లకు ఇంకో నైంటి పోయ్రా
ఎట్ల కొట్టరో సూత్త నీ యవ్వ్

పవ్వగొట్టు పవ్వగొట్టు
బోటికూర దానంచుకు వెట్టు
బ్యాండు గొట్టు బ్యాండు గొట్టు
వాడకట్టు లేసూగేటట్టు

గుద్దితే సూస్కో ఓ అద్ధశేరు
గజ్జల గుర్రం ఈ సిల్కుబారు
ఇచ్చి పడేద్దాం
చల్ కుచ్చి పడేద్దాం
ఎవ్వడడ్డమొత్తడో జూద్దాం బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

టెక్క టెకం టెక్క టెకం
టెక్క టెకం టిటక్ టిటక్
డింక టకం డింక టకం
డుర్ర డుర్ర డుర్ర

కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్
సుట్టూర దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్
జమ్మిని బొగ్గును బంగారమే అంటం
బంగారంలాంటి మనుషుల్లో ఉంటం

డొక్కలు నింపే ఊరే మా అవ్వ
జేబులు నింపే రైలే మా అయ్య
బర్ల మోత ఆ శెర్ల ఈత
ఇగ కోడి కూత మాకేం ఎరుక బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె
హ హు హా హే

సిత్తూ సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారి బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
రాగి బిందె తీస్క రమణి నీళ్ళకు బోతే
రాములోరెరాయేనమ్మో ఈ వాడలోన

తీట లెక్కల్ జేస్తేనే జోరు
ఘాటుగా ఉండాలిరా బతుకు తీరు
నల్లీ బొక్కల్ జూత్తే ఉషారు
ఏం తింటవ్రా ఉప్పు లేని పప్పు శారు

గోశి గొంగడి మా కట్టుబొట్టు
ఎట్లైతే గట్లైతది సూస్కుందాం పట్టు
అంబలి గట్క మాది రాచ పుటక
పూట పూట మాకే దసరా బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె
హు హా హు హే



ఓరి వారి నీది గాదురా పోరి పాట సాహిత్యం

 
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: సంతోష్ నారాయణ్ 

ఓరి వారి నీది గాదురా పోరి
ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి
ఓపారి అవ్వ ఒడిలో దూరి
మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి

బాల్యమే గొప్పది బాధ మర్షిపోతది
చందమామ రాదనే నిజము నమ్మనంటది
చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది
కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది

ఓరి వారి నీది గాదురా పోరి
బజ్జోరా సంటి బిడ్డగా మారి

హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో

ప్రేమ నాలో దాచిన
చిన్న బొడ్డెమ్మగానే గావురంగా
నిన్ను నేనే వద్దనీ
గిరిగీసుకున్న గింత దెల్వకుంటా

రగిలి నా వేదనే దీపమోలే వెట్టినా
పేర్చినా బతుకమ్మనే
కన్నీళ్ళలో సాగదోలిన ఇడిచేసి వదిలేశిన

రెక్కలిరిగినట్టి ఈగ
సుడిగాలిలో చిక్కినట్టు
దిక్కు మొక్కు లేని కన్ను
ఎక్కి ఎక్కి ఎడ్శినట్టు

నీకు దగ్గరవ్వలేక
దూరమయ్యే దారిలేక
చితికిపోయే నా బతుకిలా
గుండె పుండు మీద
గొడ్డు కారమద్ది గుద్దుతుంటే
గుక్కపట్టి ఏడవలేని జన్మా

ఓ ఓఓ ఓ ఓఓ ఓ
ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో



చమ్కీల అంగీలేసి పాట సాహిత్యం

 
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: ధీ, రామ్ మిరియాల 

చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే

సినిగిన బనీనేసి ఓ వదినే
నట్టింట్ల కూసుంటడే ఓ వదినే
మాసిన లుంగీ ఏసి ఎప్పుడు
మంచంలనే పంటడే

హే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే
నీ సీర సింగులువట్టి ఎనకెనక తిరిగిన్నే
ముద్దులిస్తుండే పూలు తెస్తుండే
శెక్కర లెక్క నీ మాటలుంటుండే
మారే నీ తీరు పెరిగే నీ నోరు
మందుకలవాటైతినే

కడుపులో ఇంత వోసి ఓ వదినే
కొడ్తడే బండకేసి ఓ వదినే
అమాస పున్నానికో అట్లట్లా
అక్కరకు పక్కకొత్తాడే

చమ్కీల అంగీలోడే
నాకు జుమ్కీలు అన్న తేడే

వీడు వంటింట్ల నేనుంటే
సాటుంగ వత్తుండె
వంకర నడుము గిచ్చుతుండే
నేడు ఎంత సింగారించిన
వంకలు పెడుతుండే
తైతక్కలాడకంటుండే

కంట నీరన్న వెట్టకుండా
సంటి బిడ్డ లెక్క నిన్ను
అలుగుతుంటే బుదరగియ్యలేదా

నువ్వు సీటికి మాటికి
గింతదాన్ని గంత జేసి
ఇజ్జతంత బజార్లేస్తలేవా

ఏం గాలి సోకేనో ఓ ఓ
వీన్నెత్తి తిరిగెనో ఓ ఓ
పాతబడ్డనేమో శాతనైతలేదో
ఉల్టా నన్నిట్ల మందీ ముంగట్ల
బదనాం జేత్తడే

చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే

నోరిడిసి అడగదుర బామ్మర్ది
శెప్పింది చెయ్యదుర బామ్మర్ది
పక్కింట్లో కూసుంటది
నా మీద శాడీలు జెప్తుంటది

నా గొంతు కోసిర్రంటూ బామ్మర్ది
శోకాలు వెడ్తుంటది బామ్మర్ది
ముచ్చట్లు జెప్పబోతే మీ అక్క
మూతంతా తిప్పుతుంటది

శీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా
కంటికి రెప్పోలే కాస్తడు మొగడు
ఎంత లొల్లైనా నువ్వెంట ఉంటె
ఎదురు నిలిశి వాడు గెలిశి వస్తాడు

గోసల్ని జూస్తా ఉన్నా
ఏదైనా గుండెల్ల దాస్తాడులే
నీ బొట్టు నీ గాజులే ఎంతైనా
వాని పంచ పాణాలులే

Palli Balakrishna Monday, March 20, 2023
Chikkadu Dorakadu (2016)


చిత్రం: చిక్కడు దొరకడు (2016)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం:
గానం:
నటీనటులు: సిద్దార్ధ్ నారాయణ్, లక్ష్మీ మీనన్
దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజు
నిర్మాత: ఎస్.కదిరేశన్
విడుదల తేది: 13.03.2016


Palli Balakrishna Friday, March 15, 2019
Kabali (2016)


చిత్రం: కబాలి (2016)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: ఆనంతు , ప్రదీప్ కుమార్, శ్వేతమోహన్
నటీనటులు: రజినీకాంత్ , రాధిక ఆప్టే, సాయి ధన్సిక
దర్శకత్వం: ప.రంజిత్
నిర్మాత: కళైపులి యస్.థాను
విడుదల తేది: 22.07.2016

గుండె నిండా ఎన్నొ రంగులెన్నో నిండెనె
కల్లనిండా సంతోషాల
సంద్రం పొంగెనే
నేనల నీకై వెతికే
గాలినై బతికా
దేషాలు తిరిగి తిరిగి అలిషా
అనుక్షనం మరనములొ
ఉంచింది కాలం
ఎదురీది వచా తెలుసా తెలుసా

మాయె మనన్లిలా మల్లి కలిపెనే
మెరిసే కురులలో ప్రేమె విరిసెనే
మాయె మనన్లిలా మల్లి కలిపెనే
మెరిసే కురులలో ప్రేమె విరిసెనే

కాలువలొ చేప వలె
బందం చేజారిందే
నా కోరకై నీవున్న
సన్యాసం వలచిందె
నిసి నాపె వెలుగై
నాలొ వెలుగావె
నడిపించె అడుగై
నాతొ పదవే

మాయె మనన్లిలా మల్లి కలిపెనే
మెరిసే కురులలో ప్రేమె విరిసెనే
ఏదొ బలమిలా నన్నె తరిమెనే
ఇంకో జనమలా నీతొ నడిపెనే

దేసమెల్ల చాటుతుంది
నువ్ నడిచె సేనవని
కాలమిల వీరునికె
నను చేరువ చేసెనని
వడగాల్లొ చినుకై
ఒడిలోన పడవా
నువ్ నాతొ ఉంటె
నాకెమి కొదవా

మాయె మనన్లిలా మల్లి కలిపెనే
మెరిసే కురులలో ప్రేమె విరిసెనే
ఏదొ బలమిలా నన్నె తరిమెనే
ఇంకో జనమలా నీతొ నడిపెనే


*********  *********  *********


చిత్రం: కబాలి (2016)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: వనమాలి
గానం: ప్రదీప్ కుమార్

కలవని ఒ నది కోసం
కడలిగ వేచానులె
ఒంటరి మది వాడెనులె
ఊపిరగి కూడ ఎందుకీ జీవితం
గయలివాల కలిగే
నీ వల్లనే మానెదెలా

ఆకాసంలొ మెఘం లాంటి తోడే లేక
నేడీ రాయె కరిగినదే

ఆమె నేడు దూరం అయ్యె
హ్రుదయపు అశుగున
స్వరముగ మిగిలిన
తన అడుగెటు సాగిపొఇందా
కనులిక నిదురించేల
తన ఒడి చేరెదెల
చినుకులకై మబ్బులనె
వేడుతున్న నేలలగ నె వాశిన
నువ్ లేని నేను నీడనీ
వెతికే నిజం అయ్యానులే

ఆకసంలొ మెఘం లాంటి తోడే లేక
నేడీ రాయె కరిగినదే

నాలో రోజు నీదె రూపం
కలలలొ తలపులు
నను విదిచెరగవు
ఎదురుగ మరి కన రావెమే
కలవని ఒ నది కోసం
కడలిగ వేచానులె
ఒంటరి మది వాడెనులె
గాలమంచు లోని చేపని నేనులె
ఏమార్చు కాలం ఇకపై ఎన్నాల్లులె చేరలిలె

ఆకసంలొ మెఘం లాంటి తోడే లేక
నేడీ రాయె కరిగినదే...



*********  *********  *********


చిత్రం: కబాలి (2016)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: వనమాలి
గానం: అరుణరాజ కామరాజ

నిప్పు ర తాకర సాద్యమా…
నిప్పు ర తాకర చూద్దాం
తాకితె మసే కద మొత్తం
దురాత్ముల దురాగతం నిత్యం
పెరిగితె రగడం తద్యం
జగానికె తలొంచని తూఫని
జననికై జన్మించిన నేస్తన్ని
విదినె గెలవడ ఈసూలి
ఉషస్సులె పరిచెడు కబాలి.. కబాలి…

కరునలు భలి కలతలిక వెలి
మనుసుడికిందా ఉక్కులడిలు
అంతా నేడు మాయె మాయె
నీ సౌర్యం నిత్యం సమరమాయె
నీ రాజ్యంలోన రగిలె రోషం
ప్రతి మాటకు కొత్త పరమార్దం

స్వేచ్చను ఇక నీ స్వాసనుకొ
భయమును విడు బ్రమనొదిలి నడువ్
ధైర్యం త్యాగం చేసె పోరు
నిను తాకిన గాయం మానె తీరు
ఇక ద్రోహం క్రోదం మాయం కావ
రాబోయె కాలం ఇతిహాసం కాద
కబాలి కబాలి కబాలి కబాలి....

Palli Balakrishna Thursday, September 21, 2017
Guru (2017)



చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
నటీనటులు: వెంకటేష్ , రితిక సింగ్
దర్శకత్వం: సుధా కొంగర ప్రసాద్
నిర్మాత: ఎస్. శశికాంత్
విడుదల తేది: 31.03.2017



Songs List:



నే జర మొరటోడ్ని రా పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ధార్ద్ మహదేవన్

నే జర మొరటోడ్ని రా
నే సాలా నీ ఢర్ని రా
నా మాటే నికర్షయిన పిచ్చి నిజమేరా
నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

ఉడుకుతున్న కోపం నాకు నేర్పినది నడక
ఆవేశం వీరావేశం దారి చూపే గనుక 
పిచ్చి లోకం తీరు నాకు వంటబట్టదింక
నా సిద్ధాంతంకై రాద్ధాంతాలే చేస్తా జంకు లేక

నగ్న సత్యం నేనే సిగ్గే లేదే
నీ సానుభూతేం నాకేం అక్కర్లేదే

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

కంకర్రాయి కూడా ఉంటుందేదో వైపు చదును
నా కేరక్టర్ నిండా లెక్కలేనంత పదును
అహంకారి తిక్కవైరి అనుకుంటారా
అవును మీ అర్ధం లేని స్వార్ధం కోసం నన్ను మార్చుకోను ఓ ఓ...

అడ్డదిడ్డం నాకే అడ్డే ఎవడు
రెడ్డా మాత్రం నాదే నెగ్గేదెవడు

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

నే జర మొరటోడ్ని రా
నే సాలా నీ ఢర్ని రా
నా మాటే నికర్షయిన పిచ్చి నిజమేరా
నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా

వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...
వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...





జింగిడి జింగిడి పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వెంకటేష్

తాగుబోతు మహారాజు లందరికి
పేరు పేరున నమస్కారం
దిస్ మేటెర్ ఈజ్ 
దీని అర్ధం ఏమిటంటే 
బాధలు మర్చిపోవటానికి
పీతల్లా తగుతున్నారుకాని
లోపల లివర్ దొబ్బుతుందని
ఆరోగ్యం షెడ్ కెళ్తుందని
జిందగి బార్బద్ అయిపోతుందని
అసలు తెలులుకోరే
జీవితమంటే సినిమా కాదురా అయ్యా
ప్రతీది సెన్సార్ బోర్డు చూసు కోవటానికి
ధూమ పానం మద్యపానం మా చెడ్డది రా అబ్బాయి
అని ఎంత చెప్పినా వినరే
మిలాంటోళ్లకోసమే యముడు పక్క సీటు రెడీ గా ఉంది
బయలుదేరండి బయలుదేరండి
ఆబ్బె మాకు తెలియదు మరి అంటారా
తాగండి ఊగండి మీ చావు మీరు చావండ్రా

క్వాటర్ బాటిల్ జానెడున్నా మేటర్ బోలెడుంది
మాటలు బొత్తిగా రానోడిచేత పాటలు పాడిస్తుంది
దీనిని మించిన స్వర్గమన్నది
స్వర్గములో కూడా ఉండదన్నది
చీర కట్టిన చిలక లాగ చిల్డ్ బీర్ పొంగి పొరలే
కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే...

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి (4)

హే పిరికోడికైనా ధైర్యమొస్తది
పేదోనికైనా పండగొస్తది
పిచ్చోడికైనా జ్ఞానమోస్తది
మందులోనే మందులోనే
దీనిని మించిన యోగముండదే
దీనికి తగ్గని రోగముండదే
లోకాన్ని మడిచి పెట్టుకున్నదే
ఇందులోనే ఇందులోనే

కూల్ కూల్ డ్యూడ్ ని కూటికి లేని వాడ్ని
చీర్స్ కొట్టి కలపదా మందు మహా రాణి
మూసిన షట్టర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిస
మేరా నామ్ ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ గణేశా

తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు
అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు
తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు
అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు


జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి (4)




గుండెలోతుల్లో పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఢీ

గుండెలోతుల్లో 





ఏయ్ పటాకే పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనంత్

ఐదు వందలు చూడగానే కళ్ళు మెరిసెరా
పెదవిమీద నవ్వు పూల వాన కురిసెరా
ఆడ పిల్ల లాగ ఉన్న లేడి పిల్లరా
ఆకాశాన ఎగురుతున్న చేపపిల్లరా
అసలే ఫైర్ బ్రాండు
రెచ్చగొడితే తీస్తది మీ బెండు
ఏయ్ పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్ చలాకి పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే

కళ్ళలోన కోటి కలల కోట తనదిరా
తనకి తానె తిరుగులేని మహారాణిరా
కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా
సీతాకోక కాదు సీమ్మిరపకాయ్
మన ప్యాంటు షర్ట్ వేసుకున్న చిరుత పులేరోయ్
చిరుత పులేరోయ్ చిరుత పులేరోయ్

ఏయ్ పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్ చలాకి పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే

ఆశలన్ని దండగుచ్చి వేసుకుంటది
మనసు మాట తప్ప ఏది వినను అంటది
జీవితాన్ని ఆటలాగ మార్చుకుంటది
నిప్పు కనిక లాగ దూకి నెగ్గుకొస్తది

ఏయ్ పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్ చలాకి పటాకే  పటాకే
చెయ్ పడిందో ఎటాకే




ఉక్కునరం పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ధార్ద్ మహదేవన్

నీకేమి తక్కువ నిన్నే నువ్ గుర్తించవ
నీలోను ఉంది చూడు ఉక్కునరం
నువ్వేంటో చూపించవ
నిన్నే నువ్ గెలిపించవ
నీకే తెలియని నీలో సత్తా ఉక్కునరం

ఉక్కునరం (4)

అమ్మా నాన్న పుడుతూనే పెట్టారు పేరు
అందరిలాగ నీకోటి 
రంగుల్లోన వెలిగేలా ఆ పేరు నేడు 
సాధించాలి ఏదోటి
గమ్యం లేని గాలల్లే తిరిగావంటే ఏం లాభం
కలలకు ఊపిరి పోయాలి నీ ఉక్కు నరం
స్వాగతమంటు పిలిచింది నలుదిక్కుల్లో మైదానం
జెండా ఎగరెయ్యాలి నీలో ఉక్కునరం

ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం
నిన్నే నడిపించు ధైర్యం
ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం

ఉక్కునరం (4)

నీలో బలం ఇంతేనని హే గీతల్లోన ఒదగకు
ఇంకేముందో చూద్దామనే ఆలోచనని వదలకు
నొప్పి లేని పోరాటం ఏ గొప్ప ఇవ్వదులే
నిప్పుల నడకలు తప్పవులే ఓ...
గమ్యం చేరే దారుల్లో గాయాలన్ని మామూలే 
ప్రతి ఆట పొరాటమంటూ పట్టు బిగించు

ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం
నిన్నే నడిపించు ధైర్యం
ఉక్కునరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కునరం

ఇంతే చాలు అనే నీ ప్రయాణం
కోరే గమ్యాన్ని సాధించదే
ఇంకా ఇంకా అనే నీ ప్రయత్నం ఏనాడూ తలొంచదే

ఉక్కునరం (8)




ఓ సక్కనోడ పట్టు పిడికిలి పాట సాహిత్యం

 
చిత్రం: గురు (2017)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఢీ

ఓ సక్కనోడ పట్టు పిడికిలి
ధాడి చేసినావే ధడ ధడ
కస్సు బస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...

చిర్రు బుర్రుగా చిచ్చు బుడ్డిలా
నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను
ఎపుడో అలా తెలవారగా
నన్ను నేను నీ కలలో కనుగొన్నాను
నచ్చావు అందగాడా
తెచ్చావు నాలో తేడా
నువ్వు ఆడే ఆట లాగే ప్రేమించు నన్ను కూడా

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...

పగవాడివో అయినోడివో
తడిలేని పొడి చూపై తరిమేస్తావేం
మన మధ్యలో తెరలెందుకో
గడి దాటి చెలి ఒడిలో పడనంటావేం
చిరు నవ్వు చిలకరించు
చిన్నపాటి చనువు పెంచు
బుజ్జి బుజ్జి మనసు పాపం
కన్నెత్తి దాన్ని కనికరించు

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...
 
ఓ సక్కనోడ పట్టు పిడికిలి
ధాడి చేసినావే ధడ ధడ
కస్సు బస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు

నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతం అంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ...

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default