Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Navdeep"
Eagle (2024)



చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని 
నిర్మాత: T.G.విశ్వప్రసాద్
విడుదల తేది:09.02.2024



Songs List:



ఆడు మచ్చా పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: రాహుల్ సిప్లిగంజ్

ఎయ్ తురుపు తునక ఎరుపు బారెనే
ఎలుగు దునికి దుంకులాడెనే
ఎనుము ఎనక ఎనుము కదిలెనే
బలికి పొలికి ములికె దొరికెనే

ఏ అరుపులన్ని విరుపులన్ని
ఒకే చరుపు గప్ చుప్
ఒకే చరుపు గప్ చుప్ చూడ్రా

ఏ పిడికిలెత్తి పిడుగులన్ని
కొట్టే దుముకు తీన్ మార్
కొట్టే దుముకు తీన్ మార్ కొట్రా

అబ్బా మన సామిని కూడా
డాన్సుకు పిలవండబ్బా

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో

ఏ రగన భగన సగుణం
తను బుగల సెగల సుగుణం
నగన యగన ద్విగణం రణచరణం

అరె జగన మగన గగనం
వీడు జడల గడుల జగడం
తెగిన తగన హగణం
గల చలనం

ఆయుధానికే ధైర్యం వీడే
ఆగడాలనే ఆర్పేడే
కాగడాలనే కాల్చేవాడే
వేడి అంచులో వెలుగీడే

యో కొంచం బీటు పెంచురోయ్

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో



గల్లంతే గల్లంతే పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కపిల్ కపిలన్, లిన్ (Lynn)

ఏ గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

తడబడే అలజడే
తడబడే అలజడే

కాపుగాసే మాయగాడే
మౌనమే గాని మాటే లేదే
కానరాడే పోనేపోడే వీడెవ్వడే

నేల మీద పువ్వే నువ్వే
కోరుకునే ఒక మేఘం నేనులే
ఔననవే మరి వానై దూకి రానా
నీ యదనే చినుకల్లే చేరనా

ఒకరికి ఒకరని తెలుపుతు
పలికిన వేగమా
వధువుకి వరునికి శుభమని
తెలిపిన రాగమా

ముడిపడు అడుగులు నడుపుతు
వెలిగిన హోమమా
విడి విడి మనసులు కలుపుతు
ఒకటవు ప్రాణమా

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్
యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్

నింగి నేల ఓ చోట చేరి
చేసే సందడే
మౌనం మాట ఓ జంట కట్టే వేళనే

నూరేళ్ళయినా నిల్చుండి పోయే
బంధం మీదిలే
వేలేపట్టి వీడేటి వీలే లేదులే



Eagle On His Way పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: Georgina Matthew
గానం: Georgina Matthew

Time To Die Aa Aa
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You

Youre in the Snipers Sight
Get Ready To Die
Ready to
Youre in the Snipers Might
Its Your Goodbye

Youre in the Snipers Sight
Get Ready To Die
Ready to
Youre in the Snipers Might
Its Your Goodbye
Its Your Goodbye

Yeah Yeah
Breathe Your Last Breath
Your Screams On My Mind
Time To Die You Be Alone
Time To Die

Cry to Mama
Save My Life
This Eagle On His Way

Cry To Mama
Breathe Your Last
This Eagle Wants His Prey

Cry To Mama Cry Goodbye
This Eagle On His Way
Cry To Mama Breed And Die
This Eagle Kills His Prey

He Is A Goddamn Shooter
Ya Ya Ya
Time To Die
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You

Time To Die Aa Aa
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You




గరుడం పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: చైతన్య కృష్ణ 
గానం: శ్రీ కృష్ణ 

విజృంభణము విధ్యంసనము
విశృంఖలము సతతం
విక్రోధనము విస్ఫారితము
విచ్చేధనము నిరతం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితము కల్లోలితము
దిగ్ భాసితము గరుడం

విజృంభణము విధ్యంసనము
విశృంఖలము సతతం
విక్రోధనము విస్ఫారితము
విచ్చేధనము నిరతం

జృంభత్ కాలికొద్దీప్తం
రక్తం నిత్యముద్రిక్తం
భంజత్ శాత్రఉద్ఘోషం
శౌర్యం సర్వదోన్మేషం

జృంభత్ కాలికొద్దీప్తం
రక్తం నిత్యముద్రిక్తం
భంజత్ శాత్రఉద్ఘోషం
శౌర్యం సర్వదోన్మేషం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితము కల్లోలితము
దిగ్ భాసితము గరుడం

Palli Balakrishna Tuesday, February 13, 2024
Seethakoka Chiluka (2006)



చిత్రం: సీతాకోక చిలుక (2006)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: నవదీప్, షీలా కౌర్ (తొలిపరిచయం), సుహాసిని మణిరత్నం
దర్శకత్వం: ఎ.ఆర్.రాజా 
నిర్మాత: హరిగోపల కృష్ణమూర్తి 
విడుదల తేది: 29.09.2006



Songs List:



చూపు తోటి పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలుక (2006)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: మల్లికార్జున్, సైంధవి 

చూపు తోటి 



కన్నులు కన్నులు పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలుక (2006)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: జయదేవ్, సునీత 

కన్నులు కన్నులు 



ఓ గురువా పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలుక (2006)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: వేటూరి 
గానం: మురళి, శ్రీవర్థిని 

ఓ గురువా 




ఈ యవ్వన పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలుక (2006)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: రంజిత్ 

ఈ యవ్వన 



కస్సున లేచే పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలుక (2006)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: టిప్పు, రేష్మా 

కస్సున లేచే 

Palli Balakrishna Thursday, August 11, 2022
Ala Vaikunthapurramloo (2020)






చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హగ్డే, నివేత పేతురాజ్, టబు, నవదీప్, శుశాంత్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ
విడుదల తేది: 12.01.2020





Songs List:




ఓ మై గాడ్ డాడీ పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: రాహుల్ స్పిల్గున్జ్, రాహుల్ నంబయార్, రోల్ రిడ, బ్లాజ్జే, లేడీ కాష్

నా స్టొరీ చెప్పలేను నా బాదకంతు లేదు
ఈ డాడిలందరెండుకిట్ల పీక్కుతింటున్నారు
మాట విన్నిపిచుకోరు అసల అర్ధం చేసుకోరు
ఆలోచిస్తుంటే నానా పేరు రాలుతుంది నా హెయిర్ 
వంద రూపాయల ఇయ్య మంటే మనమేమైన రిచ్ ఆ 
అన్ని క్లాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా
ఆలుకుంటూ ఏడ్చుకుంటూ నేను బైటికొచ్చ
అందరింట్లో same సీన ఏమంటా చిచ్చా
పల్లవి:
Oh My God Daddy Just Stop Being Baddy
Oh My God Daddy Just Stop Being Baddy
Oh My God Daddy Just Stop Being Baddy
Don't be So Hardy That will Make me Saddy(2)

మేర నాం బంటు గాని పేరుకి కొత్త నేనింటు
చర్సౌబీస్ దాడి తో చేసానే ఫైట్ డే అండ్ నైట్ ఊ 
ఓఓఓఓఓఓఓఓ అమ్మకి మొగుడు ఓఓఓఓఓఓఓఓ నానైనాడు
వర్షాన్ని ఓ చిట్టి బాటిల్ లో నిపలేవు సంతోషాన్ని కుట్టి నువ్వు యునిఫారం వెయ్యలేవు 
స్వేచ్చకేమో షార్ట్ కట్ కనిపెట్టలేదు ఒట్టు కాదంటే నన్ను తిట్టు లేదా నా జట్టు కట్టు 
అడివేమో బ్యాక్ యార్డ్ లో పెట్టలేవు మచ్చా పావురాన్ని పేపర్ వెయిట్ చెయ్యలేవు పిచ్చి
వాల్కనో తో చలిమంటే వెయ్యలేవు చిచ్చా బ్లాంక్ చెక్ నా మరి చెప్పి మరి వచ్చా

Hey, He isn't Always Right! Spy Daddy Spy Daddy!
Hey, He isn't Always Right! Spy Daddy Spy Daddy!
Spy Daddy Spy Daddy ! Spy Daddy Spy Daddy ! 

సన్ అఫ్ వాల్మీకి అంటే కేర్ అఫ్ కష్టాలున్నటే
ఈ ఇంట్లో నవ్వలంటే తానోస్ చిటికేయ్యాలంతే
ఓఓఓఓఓఓఓఓ మమ్మీ మొగుడు ఓఓఓఓఓఓఓఓ డమ్మి గాడు
 
Oh My God Daddy Just Stop Being Baddy
Oh My God Daddy Just Stop Being Baddy
Oh My God Daddy Just Stop Being Baddy
Don't be So Hardy That will Make me Saddy(6) 



సామజవరగమన పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల సీత రాం శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్

పల్లవి:
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

చరణం: 1
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా...

విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..

అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా...

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు




బుట్ట బొమ్మ పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగ్గయ్య శాస్త్రి 
గానం: అర్మాన్ మాలిక్
 
పల్లవి:
ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్ట లేదు గని అమ్మో
నీ లవ్ అనేది Bubble Gum అంటుకునాదంటే పోదు నమ్ము 
ముందు నుంచి అందరాన్నమాటే గాని మల్లి అంటున్ననే అమ్మో 
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ ఆపలేవు నన్ను నమ్ము

ఎట్టాగా అనే ఎదురు చూపు కి తగినట్టుగా నువ్వు బదుకు చేబితివే
ఓరి దేవుడా ఇదేన్ధనెంత లోపటే పిలడా అంట దగరై నన్ను చేరదీస్తివే

బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టు కుంటివేవే
జిన్దగికే అట్ట బొమ్మై జంట కట్టుకున్టివే
బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టు కుంటివేవే
జిన్దగికే అట్ట బొమ్మై జంట కట్టుకున్టివే

మల్టీప్లెక్స్ లో ని ఆడియన్స్ లాగ మౌనగ్గున్న గని అమ్మో
లోన దందనక జరిగిందే నమ్ము దిమ్మ దిరిగినాడే మైండ్ సిమ్

రాజుల కాలం కాదు రధము గుర్రం లేవు అద్దం ముందర నాతొ నేను యుద్ధం చేస్తాంటే
గాజుల చేతులు చాపి దగ్గరికొచ్చిన నువ్వు  చెంపల్లో చిటికేసి చక్కరవత్తిని చేసావే 
చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా  తుఫాన్ తేస్తివే 
మాటగా ఓ మల్లె పువ్వునడిగితే మూటగా పూలతోటగా పైనోచ్చి పడితివే
బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టు కుంటివేవే
జిన్దగికే అట్ట బొమ్మై జంట కట్టుకున్టివే
వేలినిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే
కాలికింది పువ్వు నేను నేత్తినేటు కుంటివే

ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్ట లేదు గని అమ్మో
నీ లవ్ అనేది Bubble Gum అంటుకునాదంటే పోదు నమ్ము 
ముందు నుంచి అందరాన్నమాటే గాని మల్లి అంటున్ననే అమ్మో 
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ ఆపలేవు నన్ను నమ్ము




రాములో రాములా పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లి సత్యవతి

హేయ్ బ్రదర్ ఆపమ్మా
ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా
అబ్బా.. కడుపు నిండిపోయింది బంగారం...

బంటు గానికి ట్వెంటీ టు
బస్తీ మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు
కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెట్టు
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
సిల్కు చీర కట్టుకొని
చిల్డ్ బీరు మెరిసినట్లు
పొట్లంగట్టిన బిర్యానీ
బొట్టు బిల్ల వెట్టినట్లు
బంగ్లా మీద నిల్పోనుందిరో సందామావ
సుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ

పల్లవి:
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)

రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)

చరణం: 1
హెయ్! తమలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తా వే
ఎర్రగ పండిన ఋధలు రెండు
యాది కొస్తాయే.
అరె ఫువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెలో దూరి
లొల్లే చేస్తావే

అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు
జల్లుమంటాందే

చరణం: 2
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పుడింటు
పట్టనట్లే తిరుగుతున్నవే ఓ సందామాన
పక్కకు పోయి తొంగిజూస్తవే
ఎం టెక్కురా మావ,

రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (5)





సిత్తరాల సిరపడు పాట సాహిత్యం



చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: విజయ్ కుమార్ భల్ల 
గానం: సూర్రన్న, సాకేత్ కొమండురి

సితారాల సిరపడు సిత్తరాల సిరపడు పట్టు పట్టినాడ ఒగ్గానే ఒగ్గాడు
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గసేని ఉడుం పట్టు ఒగ్గాడు

బుగాతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే బుగాతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే 
కొమ్ములుడదీసి మరి పీపలూదినాడురో...

జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొమ్పంటే జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొమ్పంటే
దేయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు

అమ్మోరి జాతరలో ఒంటి తల రావనాడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావనాడు 
గుంట లెంట పడితేనే గుడ్డి గుండా సేసినాడు... గుంట లెంట పడితేనే గుడ్డి గుండా సేసినాడు

పొన్నూరు వస్తాడు దమ్ముంటే రమ్మంటే పొన్నూరు వస్తాడు దమ్ముంటే రమ్మంటే
రోమ్ముమీదోకటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు రోమ్ముమీదోకటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు
పది మంది నాగాలేని పది మూరల సోరసేప పది మంది నాగాలేని పది మూరల సోరసేప
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకోత్తుకోచినాడు ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకోత్తుకోచినాడు

సాముసేసి కందతోటి దేనికైనా గట్టి పోటి సాముసేసి కందతోటి దేనికైనా గట్టి పోటి
అడుగుగేసినాడు అదిరెను అవతలోడు...
 
సితారాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల 
ఊరుసివర సితారాల సిరపడు
గండుపిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు

సక్కనమ్మ ఎనక పడ్డ పోకిరోల్లనిరగాదంతే సక్కనమ్మ ఎనక పడ్డ పోకిరోల్లనిరగాదంతే
సకనమ్మ కళ్ళలో ఎలా ఎలా సుక్కలోచ్చే సకనమ్మ కళ్ళలో ఎలా ఎలా సుక్కలోచ్చే



అల వైకంఠ పురంలో పాట సాహిత్యం





చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: ప్రియా సిస్టర్స్ , శ్రీకృష్ణ

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల
మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల
పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు
విహ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై…

అల వైకుంఠపురములో అడుగుమోపింది పాశమే
విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చెనే

అల వైకుంఠపురములో బంటుగా చేరే బంధమే
అలై పొంగేటి కళ్ళలో కులాస తీసుకొచ్చేనే

గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమే
దిష్ఠి తీసింది దీవెనై ఘన ఖూస్మాన్డమే

భుజము మార్చింది భువనమే బరువు మోయంగ బంధమే
స్వాగతించింది చిత్రమై రవి సింధూరమే

వైకుంఠపురములో - ల ల ల లాలా
వైకుంఠపురములో - ల ల ల లాలా
ల ల ల ల ల లాలా



*********  Thanks For Watching  *********




  

Palli Balakrishna Tuesday, October 15, 2019
Anukshanam (2014)


చిత్రం: అనుక్షణం (2014)
సంగీతం:
నటీనటులు: మంచు విష్ణు, నవదీప్, రేవతి, మధుశాలిని, తేజేస్వి మదివాడ
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 13.09.2014


Palli Balakrishna Tuesday, February 19, 2019
Jai (2004)



చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నవదీప్ , సంతోషిణి , అయేషా జుల్కా
దర్శకత్వం: తేజా
నిర్మాత: తేజా
విడుదల తేది: 25.03.2004



Songs List:



జై జై పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: మాస్టర్ వేణు , అనూప్ రూబెన్స్, టిప్పు 

జై  జై  




ఎన్ని ఆశలో పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: శ్రేయా ఘోషాల్

ఎన్ని ఆశలో 



ఓ మనసా ఓ మనసా పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: అనూప్ రూబెన్స్, ఉష 

ఓ మనసా ఓ మనసా 




వన్, టు త్రీ పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: టిప్పు 

వన్, టు త్రీ 




వందేమాతరం పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్.యన్ & కోరస్ 

దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా

ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం

దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతీ మనదే జాతీ మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా

ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం ఓ... అంటామందరం

వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం




నీకోసమే పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: మల్లికార్జున్, చిత్ర 

నీకోసమే 





నా చేతిలోన పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: సుమంగళి 

నా చేతిలోన 





చుట్టమ్మో చుట్ట పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: లలిత 

చుట్టమ్మో చుట్ట 


Palli Balakrishna Wednesday, November 1, 2017
Manasu Maata Vinadu (2005)


చిత్రం: మనసు మాట వినదు (2005)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుఖ్విందర్ సింగ్
నటీనటులు: నవదీప్, అంకిత
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాతలు: పొట్లూరి ఫనేంద్ర బాబు, పుల్లారావు
విడుదల తేది: 12.02.2005

సరదాగా ఉంటాం, నో టెన్షన్ అంటాం
సాఫీగా లైఫే సాగేలా
కలలెన్నో కంటాం, కలలే అనుకుంటాం
వెంటాడం బాటని పట్టేలా
అంతా మనమెవరో గుర్తించే లోగా
కనిపెడితే ఆ జెండా లాగా
మనకు మరి ఈ ఫ్రీడం కూడా మిగలదుగా

సినిమా చూసి బాగుంటే మస్త్ అని ఏక్ సీఠీ మారో
స్క్రీనెక్కేసి స్టారైతే బెస్టని టెంప్టేషన్ వద్దురో
పొమ్మని.. వెళ్లిపొమ్మని ప్రాబ్లెంస్ అన్నీ పంపించేస్తాం
పన్లు గిన్లు పక్కకి తోస్తాం…
రమ్మని వెల్‌కమ్మని మాతో వస్తే చెయ్యందిస్తాం
అడ్డనుకుంటే సైడిచ్చేస్తాం
తధిగిణతోం అంటూ రాసేస్తా
కథకళితో కట్టేస్తే ఎట్టా
తలపులతో ఈ కాలం అంతా తడబడదా
సరదాగా ఉంటాం నో టెన్షన్ అంటాం
సాఫీగా లైఫే సాగేలా
టెండుల్కర్లా టెన్నిస్ ఎల్బో వచ్చే ఆటాడం
టీవీ చూస్తూ జాలే అనుకుంటాం
అంతా మనమెవరో గుర్తించే లోగా
కనిపెడితే ఆ జెండా లాగా
మనకు మరి ఈ ఫ్రీడం కూడా మిగలదుగా


ఇష్క్ అన్నది చాలా రిస్కన్నది గుర్తుంచుకోరా
ఇంకేముంది తేలేదెలాగాని తెలియాలి సోదరా
తీరమే చేరక అట్లాంటిక్లో టైటానిక్లా మునిగే దాకా పయనించాలా
ప్రాణమే అరిపించెగా..కాదల్ అంటే కార్గిల్లాగా చచ్చే దాకా ప్రేమించాలా
మన వెనకే ఇలా వస్తే ఓకే, తన వెనకే రమ్మంటే షాకే
మతి చెడితే మన మనసే మాట వినదు కదా



*********   ********   *********


చిత్రం: మనసు మాట వినదు (2005)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణి మాలిక్, జాన్నియ రాయ్

నువ్వు మరోసారి అను మరోసారి అను చిలకా
మది వినేలాగా అను
నువ్వు మరోసారి విను మరోసారి విను సరిగా
ఇది వెయ్యోసారి విను
మనసు తపన అదే.. తలపు అదే
తెరవిడి రాదేం త్వరగా
కలలుగనే కలను కనే కల అనుకుంటే కుదరదుగా
నేనెలా చెప్పనిక ముద్దిస్తావు అని
ఉరిమిన మేఘం తొలకరి శృతిలో పలికిందా
ముదిరిన దాహం మధువుల నదిలో మునిగిందా
నిన్ను తలపై నిలిపే చొరవిస్తే శివుడైపోనా దివి చినుకా
దిగివస్తాలే సొగసిస్తాలే
నీ పెదవేలే పదవే చాలే
నీకదే మోక్షమను సరే కాదనను

చిలిపి దుమారం చెలిమికి ద్వారం తెరిచిందా
వయసు విహారం వెతికిన తీరం దొరికిందా
నా గెలుపే తెలిపే చిరునవ్వై మహ మెరిశావే మణితునక
సఖి సావాసం..ఇక నీ కోసం
ప్రతి ఏకాంతం నాకే సొంతం
ఈ అల్లరే ఇష్టపడి వరించాను నిన్ను



*********   *********   *********


చిత్రం: మనసు మాట వినదు (2005)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణి మాలిక్, సునీత

నువ్వు నిజం .. నీ నవ్వు నిజం .. నా కంటి కాంతి నడుగు
వేరే వెన్నెలుంది అనదు .. ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం .. నా ప్రేమ నిజం .. ఇది పిచ్చితనం అనకు
అన్నా మనసు మాట వినదు..విన్నా అవును కాదు అనదు

నీలో నా సంతకం ..చెరిపే వీల్లేదుగా ..నాలో నీ జ్ఞాపకం ..కరిగే కల కాదుగా

నువ్వూ నేనూ రెండక్షరాలుగా..మారాలిగా..ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా..ఇకపైన కొత్తగా..మన పేరుగా..పిలిపించుకోగా

ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు
వింటే కొంటె అష్ఠపదులు..వెంటే పడవా అష్ఠదిశలూ
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంట లేని ఎదలో మనకే తగులుతుంది ఉసురు

చెబితే వినవే ఎలా..ఎగసే నిట్టూర్పులూ
చలితో అణిచేదెలా..రగిలే చిరుగాలులూ

నువ్వూ నేనూ రెండక్షరాలుగా..మారాలిగా..ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా..ఇకపైన కొత్తగా..మన పేరుగా..పిలిపించుకోగా

ఎప్పటికీ నను తప్పుకునే వీలివ్వని కౌగిలులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు..కట్టా చూడు వలపు వలలు
దుప్పటిలా నను కప్పినవే నల నల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు..చూస్తూ మేలుకోవు కనులు

మనసే దోస్తే ఎలా..
కనకే ఈ సంకెలా..
వొడిలో పడితే ఎలా..అడుగే కదిలేదెలా

నువ్వూ నేనూ రెండక్షరాలుగా మారాలిగా..ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా..ఇకపైన కొత్తగా..మన పేరుగా పిలిపించుకోగా


********   *********   ********


చిత్రం: మనసు మాట వినదు (2005)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణి మాలిక్, సునీత

నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతి నడుగు
వేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చిదనం అనకు
అన్నా మనసు మాట వినదు విన్నా అవును కాదు అనదు
నీలో నా సంతకం చెరిపే వీల్లేదుగా
నాలో నీ ఙాపకం కరిగే కల కాదుగా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు
వింటే కొంటె అష్టపదులు వెంటే పడవ అష్టదిశలు
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంటలేని ఎదలు మనకే తగులుతుంది ఉసురు
చెబితే వినవే ఎలా ఎగసే నిట్టూర్పులు
చలితో అణిచేదెలా రగిలే చిరుగాలులు
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

ఎప్పటికీ నను తప్పుకునేవీ ఇవ్వని కౌగిలులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు కట్టా చూడు వలపు వలలు
దుప్పటిలా నను కప్పినవేనల నల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు చూస్తూ మేలుకోవు కనులు
మనసే దోస్తే ఎలా తనకే ఈ సంకెలా
ఒడిలో పడితే ఎలా అడుగే కదిలేదెలా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

Palli Balakrishna Sunday, August 20, 2017

Most Recent

Default