Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nandamuri Harikrishna"
Swamy (2004)



చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
నటీనటులు: హరికృష్ణ, మీనా, ఆమని, ఉమాశంకరి,  రాజీవ్ కనకాల , ఆశా షైనీ, ముమైత్ ఖాన్ 
దర్శకత్వం: వి.అర్.ప్రతాప్ 
నిర్మాతలు: ఆర్.కె.బగవాన్, తేజ 
విడుదల తేది: 16.07.2004



Songs List:



చిలకా ఓ చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: E.S.మూర్తి 
గానం: మనో, ఉష, రామమని

చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా
చెబుతా ఓ కథని మా ఇంటికి వస్తావా
నీలాగే మాకు ఉంది ఓ పువ్వుల పొదరిల్లు
మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు

ఆకలి అంటూ అడిగిన రోజే గుర్తే లేదమ్మా
అడగక ముందే తినిపించే అమ్మేలే వదినమ్మా
అల్లరిచేస్తే తిట్టనివాడిని ఏమంటారమ్మా
నాన్నై చూసే అన్నని దేవుడు మకిచ్చాడమ్మ
చదివింది మేమైనా అలసట మా అన్నదిలే
నలతంటు పడుకుంటే వదినకి నిద్దర రాదు
ఈ ఇల్లే మా ఇద్దరి ప్రాణం
ఇంకెందుకు వేరే స్వర్గం

నీలాగే మాకూ ఉందో పువ్వుల పొదరిల్లు
మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు
 
సంతోషానికి ఇంకో పేరై పూసిన రోజాలు
శ్రీరాముడి కల పండే వరమై పుట్టిన లవకుశులు
ఒక నిమిషం ఈ సీతని వదలని వానర సైన్యాలు
తమకోసం అసలేది కోరని కోవెల దీపాలు
ప్రతి రోజు పండగలా ఇల్లంతా సందడులే
అమ్మా అని పిలిచారా ఒళ్లంతా పులకింతే
మీరే గా మీరే గా ఈ తీయని స్వప్నం 
ఏ జన్మదో ఈ తీయని అనుభందం

నీలాగే మాకూ ఉందో పువ్వుల పొదరిల్లు
మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు
 
చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా
నువ్వూ మా జతగా ఉంటావా మా ఇంట
మా అన్నా వదిన ఉండే పువ్వుల పువ్వుల పొదరింట
కలతే రాదమ్మా నవ్వులే పండే ఈ చోట




ఆనాటి నీ కళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: వేటూరి 
గానం: యం.యం..కీరవాణి 

ఆనాటి నీ కళ్ళు 



అందం చందం పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: యం.యం..కీరవాణి , సునీత ఉపద్రష్ట

అందం చందం 





నా పేరు రంభ పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: భువనచంద్ర
గానం: శ్రేయా ఘోషల్

నా పేరు రంభ 



తమిళనాడు బోర్డర్ పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో,  సునీత ఉపద్రష్ట

తమిళనాడు బోర్డర్ 

Palli Balakrishna Friday, January 21, 2022
Sraavanamasam (2005)



చిత్రం:  శ్రావణమాసం (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
నటీనటులు: కృష్ణ, హరికృష్ణ , పోసాని కృష్ణ మురళి , కార్తికేయ, గజాల, కళ్యాణి 
నిర్మాత, దర్శకత్వం: పోసాని కృష్ణ మురళి
విడుదల తేది: 26.02.2005



Songs List:



తెలుగువారి పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: వెనిగాళ్ళ రాంబాబు
గానం: యస్.పి. బాలు, మాళవిక

తెలుగువారి పెళ్లి



నువ్వు ఎదురుగా ఉంటె పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: చిన్నీ చరణ్, రాజ్ కుమార్ 
గానం: యస్.పి. బాలు, కౌశల్య 

నువ్వు ఎదురుగా ఉంటె 



చిలక రెక్క పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: గణేష్, రాజ్ కుమార్, జై సూర్య 
గానం: ఉష 

చిలక రెక్క




గోల్కొండ కట్టినోడు పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: ముని 
గానం: యస్.పి. బాలు, కౌశల్య 

గోల్కొండ కట్టినోడు 



చినుకు చినుకు పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: రాజ్ కుమార్ 
గానం: యస్.పి. బాలు, కౌశల్య 

చినుకు చినుకు 



సైదులా పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: ఆంగ్రోత్ భీమా
కాకి కథ: సుద్దాల అశోక్ తేజ 
గానం: కౌశల్య 

సైదులా 




హాయ్ హైలెస్సా పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: రాజ్ కుమార్
శ్లోకం: ఆంగ్రోత్ భీమా 
గానం: మాలతి 

హాయ్ హైలెస్సా 


Palli Balakrishna Friday, March 5, 2021
Simham Navvindi (1983)



చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: యన్. టి.రామారావు, బాలక్రిష్ణ , కళారంజని, శ్రీదేవి
దర్శకత్వం: డి.యోగానంద్
నిర్మాత: నందమూరి హరికృష్ణ
విడుదల తేది: 03.03.1983



Songs List:



గువ్వా గువ్వా ఎక్కడికే పాట సాహిత్యం

 
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: నందమూరి రాజా, యస్. జానకి 

గువ్వా గువ్వా ఎక్కడికే 




హే భంచికి భం పాట సాహిత్యం

 
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: నందమూరి రాజా, యస్. జానకి 

హే భంచికి భం 




జాబిల్లి వచ్చింది పాట సాహిత్యం

 
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: నందమూరి రాజా, యస్. జానకి 

జాబిల్లి వచ్చింది 





ముంజలాంటి చిన్నదానా పాట సాహిత్యం

 
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

ముంజలాంటి చిన్నదానా
లేత ముద్దులన్ని దోచుకోనా
పిట్ట సింగారం కింద వయ్యారం
సిగ్గుపూల మొగ్గలేసి కాపుకొచ్చిందే
ముట్ట పొగరు పిల్లగాడా
నాకు ముక్కు పచ్చలారనీర
అహ కొత్త ఆరాటం కొంగు కోలాటం
రెప్పదాటి రెచ్చగొట్టు చూపు కొచ్చిందా

ముంజలాంటి చిన్నదానా
అరె ముట్ట పొగరు పిల్లగాడా

తళుకు తాంబులమిచ్చి తాళి ఏదన్న రోజు
వస్తుందని లగ్గమొస్తుందని
ఎదురెంతో చూశానమ్మో అరె నిదరంతా కాశనమ్మో
కులుకు పేరంటమాడి తలుపు మూసేటి రోజు
వస్తుందని ముద్దులిస్తుందని
కలలెన్నో కన్నానమ్మో కథలెన్నో విన్నానమ్మో
జాజి పూల జల్లులోన 
జాజి పూల జల్లులోన తడవాలని
కన్నుకొట్టాడే కమ్ముకొచ్చాడే
గాలిముద్దులెన్నొ పెట్టి గిల్లుకున్నాడే

ముంజలాంటి చిన్నదానా
లేత ముద్దులన్ని దోచుకోనా
కొత్త ఆరాటం కొంగు కోలాటం
రెప్పదాటి రెచ్చగొట్టు చూపు కొచ్చిందా
అరె ముంజలాంటి చిన్నదానా
అరె ముట్ట పొగరు పిల్లగాడా

వయసే తొలినోము నోచి వలపే నీదన్న రోజు
వస్తుందని కౌగిలిస్తుందని
ఉసురొచ్చి వేసానమ్మ ఎదురెండ కాగనమ్మో
సొగసే సొగసారబోసి సగమే నీదన్న రోజు
ఇస్తుందని కట్నమిస్తుందని
సొదలెన్నో పడ్డానమ్మో బ్రతుకంతా వడ్డానమ్మో
మాపటేల మల్లెపూల
మాపటేల మల్లెపూల తావిళ్ళతో
నల్లమబ్బుల్లో పిల్ల జాబిల్లి
వెన్నెలంటు సన్నముద్దు పెట్టి పోయిందే

ముట్ట పొగరు పిల్లగాడా
నాకు ముక్కు పచ్చలారనీర
అహ కొత్త ఆరాటం కొంగు కోలాటం
రెప్పదాటి రెచ్చగొట్టు చూపు కొచ్చిందా
అరె ముంజలాంటి చిన్నదానా
లేత ముద్దులన్ని దోచుకోనా
పిట్ట సింగారం కింద వయ్యారం
సిగ్గుపూల మొగ్గలేసి కాపుకొచ్చిందే
ముట్ట పొగరు పిల్లగాడా
అరె ముంజలాంటి చిన్నదానా




ఒక్కసారి నువ్వు పాట సాహిత్యం

 
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: నందమూరి రాజా, యస్. జానకి 

ఒక్కసారి నువ్వు 



ఎలా ఎలా నీకుంది పాట సాహిత్యం

 
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: నందమూరి రాజా, యస్. జానకి 

ఎలా ఎలా నీకుంది 

Palli Balakrishna Thursday, November 2, 2017
Driver Ramudu (1979)



చిత్రం: డ్రైవర్ రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, జయసుధ, రోజారమణి, జయమాలిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: నందమూరి హరికృష్ణ
విడుదల తేది: 02.02.1979



Songs List:



గు గు గు గు గుడిసుందీ పాట సాహిత్యం

 
చిత్రం: డ్రైవర్ రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

గు గు గు గు గుడిసుందీ
మ మ మ మ మనసుందీ
అ గు గు గు గు గు గుడిసుందీ
మ మ మ మ మనసుందీ
గుడిసే మనసూ మడిసే లేక
అమ్మో అంటున్నవీ
అమ్మో అంటున్నవీ..
హూమ్... హూ... ఊహూ... హూ..

హ...గు గు గు గు గుడిసుందీ
మ మ మ మ మనసుందీ
గు గు గు గు గుడిసుందీ
మ మ మ మ మనసుందీ
గుడిసే మనసూ వయసూ కలిసీ
అమ్మో అంటున్నవీ
అమ్మో అంటున్నవీ

నైలాను సీర గడితి
నైసయిన పౌడరు ఏస్తి
నైలాను సీర గడితి
నైసయిన పౌడరు ఏస్తి
చీర కట్టు చూస్తా ఉంటే హా...
పడుచు మనసూ జారేనోయీ హా హా...

లోతెరుగని వయసోడూ
వాటేసే మొనగాడూ
దోర జామ పండుని చూసీ
కావాలని కోరెను వీడూ

నీ లాంటి డైవరోడే
నాకెంతో నచ్చినోడూ
హ...హహ... - అ...హ హ...
హ...హహ... - అ...హ హ...
అయ్యో....

గు గు గు గు గు గుడిసుందీ
మ మ మ మ  మనసుందీ
గుడిసే మనసూ  ముడిసే లేక
అమ్మో అంటున్నవీ
అమ్మో అంటున్నవీ

చేతి నిండా సొమ్ముందీ - హా...
ఒంటి నిండా చేవుందీ - అబ్బో...
చేతి నిండా సొమ్ముందీ
ఒంటి నిండా చేవుందీ
రెండు ఉన్న గండడి గుండె - హా...
జంట లేక ఖాళీ గుందీ - హా..
జంట ఏమీ కాదన్నానా
మనువు మాత్రం వద్దన్నానా
తాళి కట్టీ మురిపాలూ
జరిపించూ తిరునాళ్లూ
నీ లాంటి ఈడు జోడూ కోరానూ ఇన్నాళ్లూ
హ...హహ... - అ...హ హ...
హ...హహ... - అ...హ హ...
అయ్యో....

గు గు గు గు గుడిసుందీ
మ మ మ మ మనసుందీ
గుడిసే మనసూ ముడిసే లేక
అమ్మో అంటున్నవీ
అమ్మో అంటున్నవీ

గు గు గు గు గుడిసుందీ
మ మ మ మ మనసుందీ
గుడిసే మనసూ వయసూ కలిసీ
అమ్మో అంటున్నవీ
అమ్మో అంటున్నవీ

హా... హ... - ఆహా... హా...
హా... హ... - ఊహూ..... హూ...




వంగమాకు..వంగమాకు.. పాట సాహిత్యం

 
చిత్రం: డ్రైవర్ రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
దొంగా..ఆ..ఆ.! అమ్మో..ఓ..
అరెరెరె..వంగమాకు..వంగమాకు..
వంగి..వంగి దొంగలాగ పాకమాకు
వంగమాకు..వంగమాకు..
వంగి..వంగి దొంగలాగ పాకమాకు
వంగుతుంటే కొంగులోని..గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా..ఓ..ఓ
వంగమాకు..

లాగమాకు లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు
లాగమాకు..ఆహ. లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు
లాగుతుంటే కొంగు చాటు..గుట్టంత రట్టయ్యో రామయ్యో..ఓ..ఓ..లాగమాకు

చరణం: 1
ఈతముళ్ళు..! అబ్బా...!!
గుచ్చుకుంటే..! అమ్మో..!!
పువ్వులాంటి లేత వళ్ళు గాయం..
ఈతముళ్ళూ..ఊ..ఊ గుచ్చుకుంటే..ఏ..
పువ్వులాంటి లేత వళ్ళు గాయం
తోటమాలి చూశాడా..ఆ..ఆ..బడితపూజ కాయం..

మాలి నాకు మామేలే..తోట కూడ మాదేలే..
డండఢ డాఢ డడడడ దణ్డడ..డండడ..డడ
మాలి నాకు మామేలే..తోట కూడ మాదేలే..
ముల్లయినా నన్ను తాకి పువ్వయిపోతుందిలే....
రామయ్యో..ఓ..ఓ..వెళ్ళి రావయ్యో..ఆహా
రామయ్యో..ఓ..ఓ..వెళ్ళి రావయ్యో అరెరెరె

వంగమాకు..వంగమాకు..
వంగి..వంగి దొంగలాగ పాకమాకు
లాగమాకు లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు
లాగమాకు.

చరణం: 2
చేను మీద చొరవచేస్తే..చెంపమీద చేతి ముద్ర ఖాయం
చేను మీద అహ్హా.. చొరవచేస్తే..ఓహ్హో..చెంపమీద చేతి ముద్ర ఖాయం
నేను గొడవ చేశానా..ఆ..ఆ..ఆ..ఆ..ఎవరు నీకు సాయం..!!

ఆడ చెయ్యి తగిలితే..హాయి నాకు కలిగితే..
డడ్డర డడ్డడడ్డా..డడ్డర డడ్డడడ్డా..
ఆడ చెయ్యి తగిలితే..హాయి నాకు కలిగితే..
వంగ తోటలో సరసం..వరసే అవుతుందిలే..ఏ

చుక్కమ్మో..ఓ..ఓ..ఓ.. నాకు చిక్కమ్మో..
వ్వె..వ్వే..వ్వే..వ్వే..!! ఆ చుక్కమ్మో నాకు చిక్కమ్మో.. ||వంగమాకు||

వంగి..వంగి దొంగలాగ పాకమాకు
వంగమాకు..వంగమాకు..
వంగి..వంగి దొంగలాగ పాకమాకు
వంగుతుంటే కొంగులోని..గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా..ఓ..ఓ
వంగమాకు..

లాగమాకు లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు
లాగమాకు..ఆహ. లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు
లాగుతుంటే కొంగు చాటు..గుట్టంత రట్టయ్యో రామయ్యో..ఓ..ఓ..లాగమాకు



ఏమని వర్ణించను... పాట సాహిత్యం

 
చిత్రం: డ్రైవర్ రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఏమని వర్ణించను...
ఏమని వర్ణించను నీ కంటి వెలుగును
వెన్నంటి మనసును వెన్నెల నవ్వును 
నీ ఇలవేల్పును ఏమని వర్ణించను...

చరణం: 1
పైరగాలి లాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు
పైరగాలి లాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు
తీర్చిన బొమ్మలా తీరైనవాడు
తీర్చిన బొమ్మలా తీరైనవాడు
తీరని రుణమేదో తీర్చుకో వచ్చాడు
ఏమని వర్ణించను... 
ఆ...ఆ...ఆ..ఆ...

చరణం: 2
రాముడు కాడమ్మా నిందలు నమ్మడు
కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు
నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు
నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు 
ఏమని వర్ణించను...
ఆ...ఆ...ఆ..ఆ...

చరణం: 3
కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా
కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
నా అన్న రూపాన్ని చూపితే చాలును
ఏమని ఊహించను నా అన్న రూపును
నాకున్న వెలుగును  వెన్నంటి మనసును
నా ఇలవేల్పును ఏమని ఊహించను...




మావిళ్ళ తోపు కాడ పాట సాహిత్యం

 
చిత్రం: డ్రైవర్ రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఆ రైట్..రైట్..
మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ
మరుమల్లె తోట కాడ పువ్విస్తే..
మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ
మరుమల్లె తోట కాడ పువ్విస్తే..
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..

నిమ్మకూరు రోడ్ దాటి నువ్వొస్తే...ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
నిమ్మకూరు రోడ్ దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే

పాం..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్

చరణం: 1
ఘజ్జల్ల గుర్రమంటి కుర్రదానా..ఆ
ఈ మద్దెళ్ళు ఆపలేనే మనసులోనా..ఆ..ఆ
సజ్జ చేనల్లే ఎదిగి ఉన్నదానా..ఆ..
ఈ పిట్ట పొగరు చూడవేమే..ఏ..ఏ..ఏ వయసులోనా

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మునిమాపు వేళకొస్తే..ముడుపులన్ని కట్టేస్తా..
చుక్కపొడపు చూసి వస్తే..మొక్కులన్నీ తీరుస్తా...
వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా..ఆ..ఆ
వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా...

ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే..ఏ
అమ్మమ్మో..ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
పా్..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్

చరణం: 2
ఏడు నెలవలెత్తు ఉన్న కోడెగాడా..ఆ..ఆ..!! ఆహా..
నీ చుట్టుకొలత చూడలేను బీడుగాడా..!! ఓహోహో..
దిక్కులన్ని ఒక్కటయిన చక్కనోడా...ఆ
నీ ట్రక్కు జోరు ఈడ కాదూ...ఊ..ఊ..ఇంటికాడ..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పంట కెదిగే..వయసు కాస్త కుప్ప వేసి ఊడ్చేస్తా..
జంటకొదిగే సొగసులన్నీ..ఇప్పుడే నే కాజేస్తా..ఆ
వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..ఆ..ఆ
వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..

ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..హ్హే..హ్హే..హ్హే..

నిమ్మకూరు రోడ్ దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
నిమ్మకూరు రోడ్ దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే

పాం..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్




దొంగ దొంగ దొరికాడు పాట సాహిత్యం

 
చిత్రం: డ్రైవర్ రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

దొంగదొంగ దొరికింది. దొంగలబండి ఎక్కింది
పెరిగింది చలి పెరిగింది. నులివెచ్చగా చిచ్చురగిలింది
దొంగదొంగ దొరికాడు దొంగలబండి ఎక్కాడు
పిలగాడు నాజతగాడు_తొలిముద్దు మలిముద్దరేశాడు
లేనట్టు ఉన్నట్టు ఆ లేతనడుమే తీగల్లె సన్నల్లుకుంటే
ఉన్నట్టు పసిగట్టి ఆ చేతి ఒడుపే తీగల్లో రాగాలు తీస్తే
ఆ కొప్పుల్లోమల్లె గుప్పంటే నాగుండె గుమ్మెత్తిరమ్మంటే
సూదంటు రాయంటే ఆ చూపే నాదంటులేకుండ లాగేస్తే
చెట్టాపట్టాలేసుకుంటూ కష్టాలెన్నో దాటుకుంటూ
చెలరేగిపోవాల శానాళ్ళు చెరిసగమై పోవాల నూరేళ్ళు
ఈజోరు ఈహోరు నేనాపలేను ఈ చుక్కనాపక్కనుంటే
ఈ కుదుపు కదుపు నేనోపలేను వాటేసి నువ్వాపకుంటే
వయ్యారముయ్యాలలైతే నీ జడతోన నడుమాడుతుంటే
చెక్కిళ్ళపై వాడి పెదవి చేవ్రాలు చేసేస్తువుంటే
నువ్వూ నేను రివ్వుమంటే గువ్వాగూడూ నవ్వుకుంటే
దాటాలిమన రైలు గండాలు మనపాటలే పచ్చజండాలు.




ఎందరో ముద్దు గుమ్మాలు పాట సాహిత్యం

 
చిత్రం: డ్రైవర్ రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పపప పాపపా.. పపప పాపపా

ఎందరో ముద్దుగుమ్మలు అందరికి నా శుభాకాంక్షలు
చేతులు కలిపి చిందులు వేస్తూ
అందం చందం ముందుకువస్తే
ఓ మై లవ్ -ఢమాల్
I am Damal from Zhulphansia
is there any body to dance with me
you you you you you
హాంకాంగ్ లో విమానమెక్కి బ్యాంకాక్ లో దూకాను 
అక్కడ గల్డెన్ రేగన్ రెస్టారెంట్ లో
నీలాగ నిగనిగలాడే
బాలామణిని చూశాను

చాలా ఫాలో చేశాను
చివరికి స్నేహం చేశాను
చిన్నది ఏమన్నది చెప్పుకో కినిమిని
పోజుచాలురా- మోజు తీర్చరా
పొంగే టెంపరు పొగరు అణచరా
అన్నది కాబోలు హత్తుకున్నది కాబోలు
అంతే...అంతే... అంతే... ఓమైలవ్ డమాల్
సింగపూరులో స్టీమరు ఎక్కి సిలోన్ దాకా వెళ్ళాను
అక్కడ సిగేరియాలో
ఆ సిగేరియాలో

ఒడ్డుపొడుగునీలా ఉన్న
గ్లామర్ బాయిని చూశాను
కొంటెగ నన్ను చూశాడు
తుంటరి ప్రశ్న వేశాడు
చిన్నాడు ఏమన్నాడు చెప్పుకో చెకుముకి

నువ్వు పువ్వువి నేను తుమ్మెద
తియ్యని సొగసుల తేనెలుతాగి
టాటా అన్నాడు వలపు ఝాటా  అన్నాడు
అంతె...అంతే...అంత... అంతే.. ఓమైలవ్ డమాల్

Palli Balakrishna Tuesday, October 24, 2017
Siva Rama Raju (2002)




చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
నటీనటులు: నందమూరి హరికృష్ణ, జగపతిబాబు, వెంకట్, శివాజి, పూనమ్ సింగార్, లయ, కాంచి కౌల్, మోనిక
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 01.11.2002



Songs List:



అందాల చిన్ని దేవత పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: శంకర్ మహదేవన్

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

పూవులెన్నొ పూచే నువ్వు నవ్వగానే
ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే
నీడపడితే బీడు పండాలి
అడుగు పెడితే సిరులు పొంగాలి

కల్మషాలు లేని కోవెలంటి ఇల్లుమాది
అచ్చమైన ప్రేమే అంది అల్లుకుంది
స్వార్ధమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
ఎన్ని జన్మలైన గంగకన్న స్వచ్ఛమైన 
ప్రేమబంధమంటె మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

హే స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి
నలక పడితే కంటిలో నీకు 
కలత పెరుగు గుండెలో మాకు

అమృతాన్ని మించే మమత మాకు తోడువుంది
మాట మీద నిలిచే అన్న మనసు అండవుంది
రాముడెరుగలేని ధర్మమేదో నిలిచివుంది
కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది
నేల మీద ఎక్కడైన కానరాని సాటిలేని
ఐకమత్యమంటే మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

శ్రీ లక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరి దేవి తేజము
కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటిదేవతై
సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణమే ఇక
దొరికింది సిరుల కానుకా గతజన్మల పుణ్యఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు




డింగ్ డింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత


డింగ్ డింగ్



అమ్మా భవాని పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: యస్.పి. బాలు

ఓం శక్తి మహా శక్తి 
ఓం శక్తి మహా శక్తి

అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ 
తల్లి నీ మహిమల్ని చూపవమ్మ
అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ
తల్లి నీ మహిమల్ని చూపవమ్మ
ఓ ఓ ఓ .....
సృష్టికే దీపమ శక్తి కె మూలము
సింహ రధమే  నీదమ్మా 
అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించమ్మ 

అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ 
తల్లి నీ మహిమల్ని చూపవమ్మ

అమ్మ పసుపు కుంకుమ చందనము పాలాభిషేకము 
ఎర్రని గాజులు లతో పువ్వులతో నిను కొలిచాము
 
అమ్మ చంధానమే   పూసిన వొళ్ళు  చూడు
అమ్మ చంధానమే   పూసిన వొళ్ళు  చూడు
అమ్మ పున్నమి పుట్టిల్లు అ కళ్ళు చూడు
అమ్మ ముక్కోటి మెరుపులా నోము చూడు
అమ్మమ్మా ముగ్గురమ్మల మూలా పుటమ్మ 
మీ అడుగులే తలలు
అమ్మ నిప్పులనే తొక్కిన నడక చూడు
అమ్మ దిక్కులన్నే దాటిన కీర్తి చూడు 
వెయ్యే సురిల్లె మెరిసిన  శక్తి ని చూడు 
మనుషుల్లో దేవుడి ఈ భక్తుని చూడు

ని పద సేవయే మాకు పుణ్యం 
అమ్మ నీ చూపు సోకినా జన్మ ధాన్యం

అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ
తల్లి ని మహిమల్ని చూపవమ్మ

దిన్నకు దిన్నకు త దిన్నకు దిన్నకు త 
గలగల గలగల గలగల దిన్నకు దినన్నకు త 
గజ్జల్నే కట్టి  ఢమరుకమే పట్టి  
నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట 

భూమే ఊగేల ఇయ్యాలి హారతి
భూమే ఊగేల ఇయ్యాలి హారతి
కాయలు కొట్టి ఫలములు పెట్టి పదాలు తాకితే 
అడిగిన వరములు ఇచ్చును తల్లి 
చిరలు తెచ్చాం రవికలు తెచ్చాం చల్లంగ అందుకో 

జై జై శక్తి శివ శివ శక్తి 
జై జై శక్తి శివ శివ శక్తి 


కంచిలో కామాక్షమ్మ
మధురలో మీనాక్షమ్మ నువ్వే 
అమ్మా కాశీలో అన్నపూర్ణవే
శ్రీశైల భ్రమరాంబవే
బెజవాడ కనకదుర్గవు నువ్వే
అమ్మా కలకత్తా కాళీమాతవే

నరకున్ని హతమార్చి  శ్రీకృష్ణున్ని కాచి
సత్య భామ మై శక్తివి నివే చూపినావే 
నార లోక భారాన్ని భూదేవీ మోచి 
సాటిలేని సహనం చాటినవే
భద్రకాళి నిన్ను శాంతి పరిచేందుకు 
రుద్రనేతుండు శివుడిన సరితుగున 

బ్రహ్మకు మేధస్సు విష్ణువు తేజస్సు 
ని పద పుపెఇనె తాకగా వచెనటా
బ్రహ్మకు మేధస్సు విష్ణువు తేజస్సు 
నీ పద ధూళిని తాకగ వచ్చెనటా

నీ పద ధూళిని తాకగ వచ్చెనటా
నీ పద ధూళిని తాకగ వచ్చెనటా
నీ పద ధూళిని తాకగ వచ్చెనటా




పిడుగులు పడిపోని పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: యస్.పి. బాలు


పిడుగులు పడిపోని




నిరుపేదల దేవుడయా పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: యస్.పి. బాలు, సుజాత


నిరుపేదల దేవుడయా



స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత


స్వాగతం

Palli Balakrishna Monday, October 23, 2017
Talla Pellama (1970)



చిత్రం: తల్లా? పెళ్ళామా? (1970)
సంగీతం: టి.వి. రాజు
నటీనటులు: యన్.టి.రామారావు, హరికృష్ణ, చంద్రకళ, దేవిక, శాంత కుమారి
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత:  నందమూరి త్రివిక్రమ రావు
విడుదల తేది: 08.01.1970



Songs List:



తెలుగు జాతి మనది పాట సాహిత్యం

 
చిత్రం: తల్లా? పెళ్ళామా? (1970)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల

పల్లవి:
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది 
అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా వచ్చాడన్నా ఆ...
వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా...
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

చరణం: 1
మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలసింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

చరణం: 2
పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం  వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

చరణం: 3
ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు




ఓ..బంగారు గూటిలోని చిలుక పాట సాహిత్యం

 
చిత్రం: తల్లా? పెళ్ళామా? (1970)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఓ..బంగారు గూటిలోని చిలుక...
పేదముంగిట్లో వాలానని ఉలుకా
ఓ..బంగారు గూటిలోని చిలుక...
పేదముంగిట్లో వాలానని ఉలుకా

ఓ..DON'T BE SILLY

ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిల్క వచ్చిందని కేరింతా
ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిల్క వచ్చిందని కేరింతా

చరణం: 1
పవళించగ ..పూల పానుపు లేదూ
తలవూనగ ..పట్టు తలగడయే లేదు
జలకలాడగ ..పన్నీరు లేదు
జలకలాడగ ..పన్నీరు లేదు
పరిచర్యలు చేయ చెలులైన లేరు

ఓ..బంగారు గూటిలోని చిలుక
పేదముంగిట్లో వాలానని ఉలుకా

SWEETNESS OF THE ROSES..
BRIGHTNESS OF THE SKY..
SMELL IN THE MOON LIGHT..
THRILL OF MY LIFE

చరణం: 2
మెత్తని నీ మది విరిపాన్పు కాదా
వెచ్చని కైదండ నా అండ లేదా
మెత్తని నీ మది విరిపాన్పు కాదా
వెచ్చని కైదండ నా అండ లేదా
కురిసే వెన్నెల పన్నీరు కాదా
కురిసే వెన్నెల పన్నీరు కాదా
కొండంత నీ వుండ కోరిక లేలా..

ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిల్క వచ్చిందని కేరింతా..

ఓ..బంగారు గూటిలోని చిలుక...
పేదముంగిట్లో వాలానని ఉలుకా




తాగితే తప్పేముందే పాట సాహిత్యం

 
చిత్రం: తల్లా పెళ్ళామా (1970)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల

తాగితే తప్పేముందే 




బ్రహ్మం తాత చెప్పింది పాట సాహిత్యం

 
చిత్రం: తల్లా పెళ్ళామా (1970)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది
బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం
తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ
నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం
తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ
నీవాణ్ణే నువ్వు తిట్టకపోతే తెలుగువాడివే కాదు..

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం
దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు
ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం
దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు
హాయ్ ఛాన్స్ తగిలితే మంత్రినవుదునని ప్లాను లేకపోలేదు

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు
మన ప్రజలబాగుకు కాదు
పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు
మన ప్రజలబాగుకు కాదు
పూలదండలిక పడబోవేమోనని చింతలేకపోలేదు

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

పంచాయతి ప్రసిడెంటు కావడం
గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్దే పోదూ
పంచాయతి ప్రసిడెంటు కావడం
గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్దే పోదూ
ఆహా ఉమ్మడి సొమ్ము భోంచేద్దామని ఊహ లేకపోలేదు

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు
చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు
బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు
చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు
చచ్చిన పిమ్మట శిలావిగ్రహం స్థాపించడమే రివాజు

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

పేకముక్కలు చేతపట్టితే
చీదరించుకొనిరానాడు ఛీఛీ అన్నారానాడూ
పేకముక్కలు చేతపట్టితే
చీదరించుకొనిరానాడు ఛీఛీ అన్నారానాడూ
క్లబ్బుల్లో పేకాటగాళ్ళకే గౌరవమున్నది ఈనాడూ

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే
భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ
బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే
భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ
బిడ్డలు లేని గొడ్రాలికే గౌరవమన్నారీనాడు

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

ప్రజాక్షేమమే పరమార్ధమ్మని
ప్రభువులు పలికారానాడూ పరిపాలించారానాడూ
ప్రజాక్షేమమే పరమార్ధమ్మని
ప్రభువులు పలికారానాడూ పరిపాలించారానాడూ
రకరకాల పన్నులను తగిలించి నీతిని చంపారీనాడూ

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది



నువ్వు నవ్వుతున్నావు పాట సాహిత్యం

 
చిత్రం: తల్లా పెళ్ళామా (1970)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: మహమ్మద్ రఫీ, యస్. జానకి 

నువ్వు నవ్వుతున్నావు 




కాలం ఈ కాలం పాట సాహిత్యం

 
చిత్రం: తల్లా పెళ్ళామా (1970)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

కాలం ఈ కాలం 




కృష్ణయ్య కృష్ణయ్య పాట సాహిత్యం

 
చిత్రం: తల్లా పెళ్ళామా (1970)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: శాంత కుమారి 

కృష్ణయ్య కృష్ణయ్య

Palli Balakrishna Wednesday, October 4, 2017
Ram Raheem (1974)



చిత్రం:  రామ్ రహీమ్ (1974)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: బాలకృష్ణ , హరిక్రిష్ణ , రోజారమని
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
నిర్మాత: కె.ఆర్.వి.ప్రసాద్ రావు
విడుదల తేది: 05.11.1974



Songs List:



నేను కత్తుల రత్తయ్యను లే పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రహీమ్ (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి 
గానం: మహమ్మద్ రఫీ, మాధవపెద్ది రమేష్ 

నేను కత్తుల రత్తయ్యను లే 



కలలే కన్నాను పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రహీమ్ (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

కలలే కన్నాను 



ఎగిరే గాలిపటానికి.. పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రహీమ్ (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం..
ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

చరణం: 1
ప్రేమే ఒక కలిమి . . దానికి లేనే లేదు లేమి
నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ
నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ
కలిసిన జంటల విడదీస్తుంది కాలం కాలం
ఆ కాలానికి ఎదురీదీ.. చేరుకుందాము ఆవలి తీరం

ఎగిరే గాలిపటానికి దారం ఆధారం...
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

చరణం: 2
ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో
ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో
ఈ బంధం గాలిపటంలా... ఏ నిమిషం ఏమవుతుందో

గాలికి చెదరదు...  వానకు తడవదు బంధం . . . మన బంధం
అది ఎగరేసే ఒడుపుంటే...  నిలిచిపోతుంది కలకాలం

ఎగిరే గాలిపటానికి దారం ఆధారం...
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

అహహా అహహా అహాహా హ్హా
అహహా అహహా అహాహా హ్హా





ప్రపంచ మంతా జుత్తా పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రహీమ్ (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: యస్.పి. బాలు 

ప్రపంచ మంతా జుత్తా 



రిక్షా తొక్కాలిరా పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రహీమ్ (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది రమేష్ 

రిక్షా తొక్కాలిరా 



యునాని హకిన్ హుం పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రహీమ్ (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి 
గానం: మహమ్మద్ రఫీ, మాధవపెద్ది రమేష్ 

యునాని హకిన్ హుం 


Palli Balakrishna Friday, September 1, 2017

Most Recent

Default