Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Charan Arjun"
Vimanam (2023)



చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్
నటీనటులు: సముద్రఖని, అనసూయ, మీరా జాస్మిన్, రాహూల్ రామక్రిష్ణ 
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
నిర్మాతలు: కిరణ్ కొర్రపాటి & జీ స్టూడియోస్
విడుదల తేది: 09.06.2023



Songs List:



రేలా రేలా పాట సాహిత్యం

 
చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్ 
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: మంగ్లీ 

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా

రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

వేల వేల వెన్నెలలే
నవ్వులుగా మారి
పెదవులపైనే విరబూసాయేమో
చుట్టూ ఉన్నవాళ్ళే
నీ చుట్టాలు ఈడ
ఇంతకన్న స్వర్గం ఇంకేడా లేదో

ఇల్లే జూస్తే ఇరుకురో
అల్లుకున్న ప్రేమలు చెఱుకురో
తన హృదయం ఓ కోటరో
నువ్వే దానికి రారాజురో

రేలా రేలా రేలా రేలా
రెక్కల గుర్రం ఎక్కాలా
లెక్కే లేని ఆనందాన
సుక్కలు తెంపుకురావాలా

నువ్వు కన్న కలలే
నిజమౌతాయి చూడు
అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు
దశరథ మహారాజే నాన్నై పుట్టాడు
నువ్వు రాముడంత ఎదగర నేడు

చరిత్రలు ఎన్నడు చూడనీ
మమతల గూడే మీదిరో
సంపద అంటే ఏదో కాదురో
ఇంతకుమించి ఏది లేదురో

రేలా రేలా రేలా రేలా
నీదే నింగీ నేలా
నిత్యం పండగల్లె
బతుకు జన్మే ధన్యమయ్యేలా

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా

రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా




సుమతే సుమతే పాట సాహిత్యం

 
చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్ 
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్

సుమతే సుమతే
నీ నడుములోని మడత చూస్తే
పాణమొనికే వనిత

నువ్ పూసే రంగులన్నీ జూస్తే
నేను పొంగిపొర్లుతా
మత్తెక్కుతాది జూస్తే
ఒల్లంత కల్లు ముంత

తైతక్కలాడుతుందే
నర నరము నాగులాగా

నీ సొత్తు మస్తుగుందే
షాపుల కొత్త చెప్పులెక్క
నీ ఎత్తు పొడవు జూస్తే
పుడుతది మునులకైన తిక్క

సుమతే సుమతే
నువ్వు ఓ లెదరు బూటు లెక్క
నాది హవాయి బతుకు తొక్కా
యాడ తేనే వెయ్యి నీకు
శెప్పు జర ఓ సుమతీ

కలరు జూడ మెరుస్తావు నువ్వు
కయ్యిమని ఎందుకరుస్తావు
రాంగు సైజు చెప్పులెక్క
కరవకే నా సుమతీ

ఎడమకి కుడికి
గింత తేడాలు తెలియకుండా
కుడతనే మట్టసంగ
పాదాల కొత్త జోడు

మట్టిలో కలువలాంటి
నీ మనసు గెలవమంటే
తెలియదే కిటుకు ఏమిటో
నాకు అమ్మ తోడు

ఏ సదువు సంధ్య లేదే
నాకే ఆస్థి పాస్తిలేదే
ఈ గరీబోని మొఖము జూసి
గనువ ధియ్యరాదే

నా కొట్టు సిన్నదైనా
ప్రేమ గట్టిదమ్మ సుమతి
సీ కొట్టకుండ నాపై
దయ సూపరాదే సుమతీ
సుమతే సుమతే

Palli Balakrishna Friday, May 26, 2023
Nuvvo Rai Neno Shilpi


పాట: నువ్వో రాయి నేనో శిల్పి
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్


నువ్వో రాయి నేనో శిల్పి పాట సాహిత్యం

 
హరి హరా...

నువ్వో రాయి, నేనో శిల్పీ 
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాతా అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని

నువ్వో రాయి, నేనో శిల్పీ 
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాతా అంటారంతా 
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని

నీ గర్భ గుడినే కట్టేటపుడు
నేను పెద్ద మేసిరి
అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే
నన్ను బయటికి తొస్తివి...

నిన్ను మేలు కొలుపగ డోలు సన్నాయి
నేనే వాయిస్తిని
కాని నిన్ను తాకే భాగ్యం లేదా
నేనేం పాపం చేస్తినీ

అయ్యో.... ఓ... ఓ...ఓ.... దేవా..ఆ..ఆ..ఆ...

నువ్వు నడిచెప్పుడు
నీ పాదాలు కందకుండా 
చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే నీ గుళోన మోపనీవు
ఏంటయ్యా నా తప్పులూ

సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో
నేసాయి నా చేతులు
కాని నిను చూడ రావాలంటే
నాకో జత బట్టల్ లేవు
ఏంటయ్యా మా రాతలు

నీ మాసిన బట్టలే మా ప్రసాదామని
నేను శుభ్రంచేస్తిని
కాని మలిన పడిన వాడివంటూ
దూరంగా ఉండాలంటివి

నీ ముందు వెలిగే దీపాంటలు
నా చెమట తో చేసినీ
కాని ఎందుకో మా మట్టి బ్రతుకున
ఏదీపం పెట్టవైతివి...

ఏ... ఏ... ఏ...

నోరే లేని మూగ జీవాలను గాయమని
గోసీ వో గొంగలీ ఇస్తివి
ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే
లేవన్నట్లు చులకనగా వెనకబడెస్తివి

తల్లీ పాల వంటి తాటి కల్లు గీసే
నా గోసలు చూడవైతివి
వందడుగుల చెట్టే ఎక్కే నా కళ్ళకు 
నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి

నీ పల్లకీ చేసిన చేతులకు పాచిక
పుల్లయిన ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే
నా బ్రతుకే క్షవరం చేస్తివి

మా పుట్టుక బట్టీ చేసే పని బట్టీ 
ఏవేవో పేర్లు పెడితో
కాని ఉన్నోడు లేనోడంటూ తేడాలు చూపి
నీవు కూడా మనిషై పోతివి

Palli Balakrishna Saturday, May 29, 2021
Saani


పాట: సాని.. (ఒక వేశ్యా గానం) పాట (2020)
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: మౌనికా రెడ్డి, నల్గొండ గద్దర్ నర్సన్న
నటీనటులు: స్వర్ణ గణేష్ అరెడ్డి,నిసార్, ఉదయ్, బంగార్రాజు
దర్శకత్వం: మహేష్ నందు
నిర్మాణం: మల్లేష్ కొండేటి
విడుదల తేది: 15.08.2020


సాని.. (ఒక వేశ్యా గానం) సాహిత్యం

 
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: మౌనికా రెడ్డి, నల్గొండ గద్దర్ నర్సన్న

నల్లంచు తెల్లచీర కట్టాను గానీ...
తల్లోన మల్లెపూలు పెట్టాను గానీ...
కనురెప్పలకేమో కాటుక రుద్దాను గానీ...
పెదవులకు రంగులు ఏవో అద్దాను గానీ...

నా ముఖమే చూస్తే మీకు సుఖమిచ్చేదాన్ని..
ఎనకున్న నరకం ఎవరు గుర్తించరు గానీ.

సూపులకేమో నేను దొరసాని ఓ... ఓ...
లో లోపల మాత్రం నా పేరు సాని ఓ... ఓ...

నల్లంచు తెల్లచీర కట్టాను గానీ
తల్లోన మల్లెపూలు పెట్టాను గానీ
సూపులకేమో నేను దొరసాని - రేల రేలా.. రా...
లో లోపల మాత్రం నా పేరు సానీ -  ఆ..అ ఆ...ఆ..

నీది నాదీ.. కాదు తల్లీ
ఇది పైవాడి ఆటనే సెల్లీ
దేవాన దేవుళ్లన్నాడే
ఈ సిత్రాలు ఉన్నాయ్ తలచి సూడే

నాన్న కానీ నాన్న పడమటి అర్రలో
నన్ను తోసే బతుకు పోరులో
అమ్మ నుండి నాకు దక్కిన వరము
అమ్మితేనే ఒళ్ళు అన్నమూ...

ఎముకల గూడు నేను ఎనకాల గోడ నేను,
నీ మొరటు చేతుల్లోన నలిగిపోనూ...
నీ ఆనందాల కోసం చేస్తా ఏదేదో శబ్దం,
వినగలిగే మగవాడెవడు ఎద చప్పుడూ

చూపులకేమో నేను దొరసాని ఏహే.. ఏహే..
లో లోపల మాత్రం నా పేరు సానీ.. ఏహే..ఏహే..

ఎవ్వరికి ఎవ్వరే ఈ లోకానా
అరిగోశాలిస్తున్నావో కూనా
కాగడవెలుగే చూస్తారే పైనా
కాలే గాయాలే కనిపించేనా

ఆట పాట ప్రేమ పెళ్లి పేరంటం
అన్ని ఆశలున్నా నలుసునీ
నల్ల మబ్బులోకి వెళ్ళిపొమ్మని
దాచినారు చందమామనీ

డబ్బున్న మగమహరాజు నా ఇంటికి వస్తూపోతే,
మా గొప్ప రసికుడు అంటూ పొగిడేస్తారు...
మీ కామ దాహం తీర్చి తరిగిన బ్రతుకును మాత్రం
హీనంగా చూస్తూ ఎందుకు చీ కొడతారు...

సూపులకేమో నేను దొరసాని ఓ.. ఓ...
లో లోపల మాత్రం నా పేరు సాని ఓ...

అందరిలోతెంతో ఉంటది ఈడా
సందర్భం చూపును దాని జాడ
ఎవరెవరి గుట్టుందో నీ కాడా
నేనైతే గా ముచ్చట మాట్లాడా

Palli Balakrishna Friday, May 28, 2021
Lopali Manishi




పాట: లోపలి మనిషి
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్
కోరస్: సాయి దీవెన్, అరుణ్ రవి
నటీనటులు: నిసార్, సంజయ్ మహేష్ వర్మ
దర్శకత్వం: మహేష్ నందు
నిర్మాణం: మల్లేష్ కొండేటి
విడుదల తేది: 13.09.2020


లోపలి మనిషి పాట సాహిత్యం

 
పాట: లోపలి మనిషి
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్

వేదాంతం వేధికెక్కితే
వెధవ పనులు వెనకకు వెళితే
వెధవ పనులు వెనకకు వెళితే
ధర్మం ఎదుటోడి కోసమే
తన బతుకంతా అధర్మమే
తన బతుకంతా అధర్మమే

పైకే పత్తిత్తు రూపమే
లోపలా ఆణువణువూ లోపమే
గురువిందా గింజ సందమే
గురితించదు పిచ్చి లోకమే
సుట్టూ అందరు సాత్వికులే
ఎటుపాయే కోడిపిల్లే

మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి  ఎంత తేడ మీ ఇద్దరికీ

వేదాంతం వేధికెక్కితే
వెధవ పనులు వెనకకు వెళితే
వెధవ పనులు వెనకకు వెళితే
ధర్మం ఎదుటోడి కోసమే
తన బతుకంతా అధర్మమే
తన బతుకంతా అధర్మమే!

నీ చెల్లెను ఎవడేమన్నంటే చెంప షెల్లు ఎంబడే
ఎవడి శెల్లో ఎదురుగ వస్తుంటే నీ కళ్ళే మిటమిటే
కొలువు కాడ హక్కుల కోసం బాసు తోటి వాదన
నీ ఇంట్లో పనిమనిషంటే నీకు ఎంత ఏలనా

మంది పోరలు హేమంది పోరలు
దేశం కోసం అమరులవ్వాలంట
మన పిల్లలు ఫారిన్ లోన సల్లగ సదవాలంట
ఎరగనోడు ఎదిగితే వాడిని ఉదాహరిస్తారంట
తెలిసినోడు ఎదిగాడంటే ఎంత కడుపుల మంట

మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ

సిటికడంత సాయం చేసి శింపుతావు పబ్లిసిటీ
సీక్రెట్టుగ దోసిన సొమ్ముకు లెక్క చెప్పవేమిటి
బతికి ఉన్న మనుషులనేమో నేలకు పడ దోస్తరు
పోయినాక పల్లకి మోస్తూ నింగికి ఆనిస్తరు

రాజ్య నేతలు హేయ్ రాజ్య నేతలు
నీతిమంతులై నిన్ను పాలించాలి
నువ్వు మాత్రం ఓటు అడిగితే
నోటుకు సెయ్యి సాపాలే
ఇల్లు దాటి బయటికొస్తే కృష్ణుడవతారాలు
ఇంటిలోని ఇల్లాలేమో సీతలా ఉండాలే

మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ

వేదాంతం వేధికెక్కితే
వెధవ పనులు వెనకకు వెళితే
వెధవ పనులు వెనకకు వెళితే
ధర్మం ఎదుటోడి కోసమే
తన బతుకంతా అధర్మమే
తన బతుకంతా అధర్మమే

మాటలు సీరంగా నీతులే మాపటికి సాని కొంపలే
మంచైతే నీ గొప్పలే శెడు ఇతరుల ఖాతలేసుడే
సుట్టూ అందరు సాత్వికులే ఎటుపాయే కోడిపిల్లే

మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి ఎంత తేడ మీ ఇద్దరికీ

Palli Balakrishna

Most Recent

Default