Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chal Mohana Ranga"
Chal Mohana Ranga (2018)



చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: నితిన్ , మేఘ ఆకాష్
దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాతలు: పవన్ కళ్యాణ్ , నిఖితా రెడ్డి
విడుదల తేది: 05.04.2018



Songs List:



నువ్వు పెద్దపులి .. పాట సాహిత్యం

 
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: సాహితి
గానం: రాహుల్ సిప్లిగంజ్

అరె ఇనుకోరా భై
నీకు అమెరికా వీసా వచ్చిన ఈ మంచి గడియలో
చిగరెటు ఆగితో ఆరతిచ్చి
సురపానంతో నీ సోపతికి దావతివ్వాలని
పబ్బతి బట్టినం
జర బద్రంగ ఎల్లి రా బిడ్డో

హే రంగా రంగా రంగా చిందెయ్యీ సామిరంగా
శివమెత్తి సుబ్బరంగ
హే చల్ మోహన్ రంగా

హే రంగా రంగా రంగా చిందెయ్యీ సామిరంగా
శివమెత్తి సుబ్బరంగ
హే చల్ మోహన్ రంగా

అరే పొద్దూగాలే బయలెల్లూ బోనం యెత్తీ బయలెల్లూ
గండీ మైసకి మొక్కెల్లూ గాలీ మోటారెక్కెల్లూ

నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో బెమ్మాండం బద్దలు గొట్టేయ్.రో
నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో బెమ్మాండం బద్దలు గొట్టేయ్.రో

అరే పొద్దూగాలే బయలెల్లూ బోనం యెత్తీ బయలెల్లూ
గండీ మైసకి మొక్కెల్లూ గాలీ మోటారెక్కెల్లూ

నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో బెమ్మాండం బద్దలు గొట్టేయ్.రో
నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో బెమ్మాండం బద్దలు గొట్టేయ్.రో

హే రంగా చిందెయ్యీ
శివమెత్తు...శివమెత్తు
శివమెత్తు సుబ్బరంగ
చిందెయ్యీ... చిందెయ్యీ..
చిందెయ్యీ.. హే చల్ మోహన్ రంగా

సీటి గొట్టీ బయలెల్లూ చత్రీ బట్టీ బయలెల్లూ
దంకా ఇస్తూ దత్తర్లూ కమ్మా ఇంచూ డల్లర్లూ
సీటి గొట్టీ బయలెల్లూ చత్రీ బట్టీ బయలెల్లూ
దంకా ఇస్తూ దత్తర్లూ కమ్మా ఇంచూ డల్లర్లూ

నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువ్వు పెద్దపులి వేషం గట్టెయ్.రో
చంపన్న దేశం చుట్టెయ్.రో
నువ్వు పెద్దపులి వేషం గట్టెయ్.రో
చంపన్న దేశం చుట్టెయ్.రో

U.S కులువు నీదైతే లడకీలంతా నీవెంటే
అయ్యే నాడూ నీ పెళ్ళే అన్ని నీకూ అత్తిల్లే
U.S కులువు నీదైతే లడకీలంతా నీవెంటే
అయ్యే నాడూ నీ పెళ్ళే అన్ని నీకూ అత్తిల్లే

నీకు పెద్ద పులి నీకు పెద్ద పులి
నీకు పెద్ద పులి పట్టం గడతరురో
పిల్ల నీకు పోటి పడతరురో
నీకు పెద్ద పులి పట్టం గడతరురో
పిల్ల నీకు పోటి పడతరురో

నీకు పెద్ద పులి పట్టం గడతరురో
పిల్ల నీకు పోటి పడతరురో

నీకు పెద్ద పులి పట్టం గడతరురో
పిల్ల నీకు పోటి పడతరురో

హే రంగా చిందెయ్యీ
శివమెత్తు...శివమెత్తు
శివమెత్తు సుబ్బరంగ
చిందెయ్యీ... చిందెయ్యీ..
చిందెయ్యీ.. హే చల్ మోహన్ రంగా




రెండక్షరాలే దాచెయ్యడం పాట సాహిత్యం

 
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: బాలాజీ 
గానం: యాజిన్ నజీర్

రెండక్షరాలే దాచెయ్యడం ఆ లక్షనాలే లక్షవ్వడం
ఎడం ఎడంగా ఎడం పక్కనున్న గుండేల్ని పిండేయడం
O very very sad...O very very sad
O very very very very very sad
the boy is sad...the girl is sad
they are just very very very sad

లోలోపలే తెగ నచ్చెయ్యడం ఆ లోపలే తగువచ్చెయ్యడం
ప్రతీ కొత్త ఎద ఇదే పాత కథ మల్లి ఇలా చెప్పడం
O very very sad...O very very sad
O very very very very very sad
the boy is sad...the girl is sad
they are just very very very sad

హార్ట్ అనే ప్లేసులో హార్ట్ అయే హాబియే తమాషా ఓ నషా
ఇష్క్ అనే రిస్కులో ముస్కురా ఉండదా హమేషా అదో నసా
O very very sad...O very very sad
O very very very very very sad
the boy is sad...the girl is sad
they are just sad

విడిపోయేంతలా ముడిపడలేదుగా  
మనసయ్యేంతలా మాటల్లేవుగా
అలకొచ్చేంతలా ఊసుల్లేవుగా
అలుపొచ్చేంతలా అడుగులు లేవుగా
O very very sad...O very very sad
O very very very very very sad
the boy is sad...the girl is sad
they are just sad



మియామి పాట సాహిత్యం

 
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: నీరజ్ కోన 
గానం: అదితి సింగ్ శర్మ , మనీషా ఈరబత్తిని

మియామి 





వారం వారం పాట సాహిత్యం

 
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కేదారనాథ్
గానం: నకాష్ అజిజ్

ఫస్ట్ లుక్ సోమవారం
మాట కలిపె మంగళవారం
బుజ్జిగుంది బుధువారం
గొడవయ్యింది గురువారం
గొడవయ్యింది గురువారం
గొడవయ్యింది గురువారం

సారి అంది శుక్రవారం
సెన్సార్ కట్ శనివారం
rest లేదు ఆదివారం
ప్రేమే ఉంది యేవారం
ప్రేమే ఉంది యేవారం
ప్రేమే ఉంది యేవారం

వారం గాని వారం పేరు యవ్వారం
నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం
జాములేని వారం చెయ్యి జాగారం
గోద గడియారం మోగెను గుండెల్లొ అలారం

నీ రూపం చూస్తె సెగలు
నీ కోపం చూస్తె దిగులు
నువ్వు అర్దం కాని పజిలు
నువ్వేలే నా విసిలూ
నీ కల్లల్లోని పొగలు
నా గుండెల్లోని రగులు
నువ్వు అందని ద్రాక్ష పల్లు
నువ్వేలే నా స్ట్రగుల్

ఫస్ట్ లుక్  సోమవారం
మాట కలిపె మంగళవారం
బుజ్జిగుంది బుధువారం
గొడవయ్యింది గురువారం

దాని మమ్మిలాగ దానిక్కూడ ఉందే ఎంతో పొగరూ
అది చూపిస్తుంటె సర్రంటుందీ BP నాదే బ్రదరూ
నీ వల్లే తాగే మందుకి నన్నే తిడుతుందీ లివరూ
ఇక నీకు నాకు సెట్ అవదంటు చెప్పెను ఊటి వెదరూ

వారం గాని వారం పేరు యవ్వారం
నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం
జాములేని వారం చెయ్యి జాగారం
గోద గడియారం మోగెను గుండెల్లొ అలారం

నీ రూపం చూస్తె సెగలు
నీ కోపం చూస్తె దిగులు
నువ్వు అర్దం కాని పజిలు
నువ్వేలే నా విసిలూ
నీ కల్లల్లోని పొగలు
నా గుండెల్లోని రగులు
నువ్వు అందని ద్రాక్ష పల్లు
నువ్వేలే నా స్ట్రగుల్



గ ఘ గ ఘ మేఘ పాట సాహిత్యం

 
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రాహుల్ నంబియర్

గ ఘ గ ఘ మేఘ
కనులే చెప్పె కొత్త సాగా
గ ఘ గ ఘ మేఘ
నింగే మనకు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ
అల్లేశావే హాయి తీగ
గ ఘ గ ఘ మేఘ
పయనం ఇంక ముందుకేగా
ఇలాగే ఇలాగే ఇలాగే
యెటేపో వెళ్ళాలి అంటూ మనసు లాగే
అలాగే అలాగే అలాగే
అంటూనే లేదేంటో ఏది ముందులాగే
ఇవ్వాళే  ఇవ్వాళే ఇవ్వాళే
కన్నుల్లో కళల్ని నువ్వు పైకి లాగే
సరేలే  సరేలే ఘ అన్నానులే మేఘ

గ ఘ గ ఘ మేఘ
కనులే చెప్పె కొత్త సాగా
గ ఘ గ ఘ మేఘ
నింగే మనకు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ
అల్లేశావే హాయి తీగ
గ ఘ గ ఘ మేఘ
పయనం ఇంక ముందుకేగా

Baby everyday I write you love letter
I promise I will make your the much better
I promise I won't treat you like them others
I promise I won't make you think of the rather
If you looking at the sky that's up
Above the moon and the stars
Are the symbols of my love
Just call me by my name
when you need my my dear
And I will be right there to make your problems disappear

గమ్మత్తులో ఊగామా
తుళ్ళింతలో తేలేమా
ఇంతింతలై సంతోషం మాతో సందడి చేసేనా
హఠాత్తుగా ఎదలోన హడావిడే పెరిగేనా
అమాంతము ఈ చిరునవ్వులకే అర్థం దొరికెనా ఓ ఓ ఓ
ముందే మలుపువుందో ఓ ఓ ఓ
గ ఘ గ ఘ మేఘ




అర్దంలేని నవ్వు పాట సాహిత్యం

 
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రఘురాం 
గానం: శ్రీనిధి

అర్దంలేని నవ్వు అర్దాలెన్ని అంటూ
అర్దంలేని నవ్వూ అర్దాలెన్ని అంటూ
అర్దంలేని నవ్వూ అర్దాలెన్ని అంటూ
అర్దంలేని నవ్వూ అర్దాలెన్ని అంటూ

ఎవరిమనసునిపుడు చేరుతుందొ ప్రేమా
ఎవరిమనసునిపుడు చేరుతుందొ ప్రేమా
ఎవరిమనసునిపుడు చేరుతుందొ ప్రేమా
నీ పలుకులన్నీ వినే వీలు ఉందా
ఎవరిమనసునిపుడు చేరుతుందొ ప్రేమా
నీ పలుకులన్నీ వినే వీలు ఉందా

అర్దంలేని నవ్వూ అర్దాలెన్ని అంటూ ...

Palli Balakrishna Thursday, March 1, 2018
Chal Mohana Ranga (1978)



చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: దాశరధి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, జాలాది, గొల్లపూడి, సముద్రాల సుధాకర్
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్, విజయలక్ష్మీ శర్మ
నటీనటులు: కృష్ణ , దీప , జయమాలిని , పుష్ప కుమారి, మోహన బాబు, షావుకారు జానకి
మాటలు: గోపి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.భాస్కర్
ఫోటోగ్రఫీ: పుష్పాల గోపికృష్ణ
ఎడిటర్: వి.జగదీష్
నిర్మాత: పి.త్రినాధ రావు
విడుదల తేది: 29.06.1978



Songs List:



దూరాన కొండల్లో సూరీడు పాట సాహిత్యం

 
చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి.బాలు 

దూరాన కొండల్లో సూరీడు 



ఏమి సగం రైక ఏమి తుండు కొక (చల్ మోహన రంగ) పాట సాహిత్యం

 
చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, విజయలక్షిశర్మ

ఏమి సగం రైక ఏమి తుండు కొక 



ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు పాట సాహిత్యం

 
చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

పల్లవి:
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి
సింగారమొలకంగ చీర కొంగులు జారే రంగైన నవమోహనాంగీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ

చరణం: 1
అందాల గంధాలు పూసేయనా...
సింధూర కుసుమాలు సిగ ముడవనా...
అందాల గంధాలు పూసేయనా...
సింధూర కుసుమాలు సిగ ముడవనా...

చిలకమ్మో... కులికి పలుకమ్మో
ఆ... చిలకమ్మో.. కులికి పలుకమ్మో
నిలువెత్తు నిచ్చెన్లు నిలవేయనా... నీ కళ్ళ నెలవళ్ళ నీడంచనా

మడతల్లో.. మేని ముడతల్లో.. ముచ్చట్లో.. చీర కుచ్చిట్లో
మడతల్లో.. మేని ముడతల్లో.. ముచ్చట్లో.. చీర కుచ్చిట్లో

పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి
పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి
దొంతు మల్లెల మీద దొర్లించనా

అలివేణీ అలకల్లే.. నెలరాణి కులుకల్లే.. తరలెల్లి పోకమ్మా కలికీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి

చరణం: 2
గగనాల సిగపూల పరుపేయనా... పన్నీటి వెన్నెల్లో ముంచేయనా
గగనాల సిగపూల పరుపేయనా... పన్నీటి వెన్నెల్లో ముంచేయనా

నెలవంకా.. చూడు నా వంక
చిట్టి నెలవంకా... చూడు నా వంక
నీ మేని హొయలన్నీ బులిపించనా.. ఎలమావి కోకేసి కొలువుంచనా

పొద్దుల్లో... సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో
పొద్దుల్లో... సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో

నట్టింట దీపాన్ని నడికొండ కెక్కించి
చీకట్ల వాకిట్లో చిందేయనా

పొగరంతా ఎగరేసి.. వగలన్నీ ఒలకేసి.. కవ్వించబోకమ్మా కలికీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోమెందుకే కోమలాంగీ.. రాణీ
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ




నువ్వొచ్చే దారిలో అమ్మాయి... పాట సాహిత్యం

 
చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: సినారె
గానం: యస్. పి. బాలు, పి.సుశీల  

పల్లవి:
నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నే రివ్వేసి కైపెక్కి కాశాను
నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నే రివ్వేసి కైపెక్కి కాశాను
ముద్దబంతి అద్దకాల ముద్దు లేసి... ఒళ్లంతా చుడతాను పగ్గమేసి
ఒళ్లంతా చుడతాను పగ్గమేసి 

రేకెత్తి పోకోయు కుర్రోడా రేగేది... ఎందాక చిన్నోడా
రేకెత్తి పో కోయి కుర్రోడా రేగేది... ఎందాకా చిన్నోడా
ఈ వేడి నిండార నిలవుండిపోవాలి...  నూరేళ్లు కౌగిళు  నూరేసుకోవాలి

రేకెత్తి పోకోయి కుర్రోడా రేగేది... ఎందాకా చిన్నోడా
నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నేరివ్వే సి కైపెక్కి కాశాను 

చరణం: 1 
గువ్వలల్లె యవ్వనాలు గుండెల మీదుంటే
ఈ కోడెగాడి కోరికేదో రంకెలు వేస్తోంటే 

కళ్లె మేసి ఆపలేని కసి మీదున్నావు
నీ కళ్లతో నా ఒళ్లంతా తెగ తడి మేస్తున్నావు 

సిరిమల్లే బుగ్గల మీద చెంగావి పెదవుల మీద
సిరిమల్లే బుగ్గల మీద చెంగావి పెదవుల మీద
మాటేసి కాటేసి మైమరిచిపోతాను
ఆ రోజు రావాలిగా... మరి నా మోజు తీరాలి గా 

రేకెత్తి పోకోయి కుర్రోడా... రేగేది ఎందాకా చిన్నోడా
అరెరె నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నే రివ్వేసి కైపెక్కి కాశాను 

చరణం: 2 
పగడాల పడవల్లే నువ్వూగుతూ వస్తుంటే
ఆ జగడాల బిడియాలు సుడి పడిపోతుంటే

జడివాన వరదల్లె నను తడిపేస్తున్నావు
నీ మగసిరిని సెగ చూపి ఆరేస్తున్నావు

ఆ తెరచాప కొండల కేసి నడియేట గెడ పోటేసి
తెరచాప కొండలకేసి నడియేట గెడపోటేసి
దూరాల తీరాల దరి చూసుకుంటాను
తీగల్లె నిన్నల్లుకుంటాను... నీ చుట్టు మెలితిరిగివుంటాను

రేకెత్తి పోకోయి కుర్రోడా... రేగేది ఎందాకా చిన్నోడా
నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నేరివ్వేసి కైపెక్కి కాశాను
లాలాలా లాలాల లాలాలా



ఎన్నాళ్ళీ తలపులు... పాట సాహిత్యం

 
చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: గొల్లపూడి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల  

పల్లవి:
ఎన్నాళ్ళీ తలపులు... కలల మేలుకొలుపులు
ఎగిసిపడే హృదయంలో ఘడియ పడని తలుపులు

ఎన్నాళ్లీ పిలుపులు.... మూసిన కనుకొలకులు
ఎన్నాళ్లీ పిలుపులు.... మూసిన కనుకొలకులు
నువు నడిచే బాటలో ... తీయని తొలి మలుపులు

ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు

చరణం: 1
తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా

చిరునవ్వులలు వెన్నెలకే.. కొత్త సిగ్గు నేర్పేనా
కొత్త సిగ్గు నేర్పేనా

నిదుర రాదు... నిదుర రాదు... నిదుర రాదు... నిదుర రాదు...
నిను చూసిన కనులకు 

ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు

చరణం: 2
ఆమని నీ కౌగిలో... అలసి నిలిచి పోయేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆమని నీ కౌగిలో... అలసి నిలిచి పోయేనా

ఏమని నా మనసు నన్నే  ...  విసిగి వేసరించేనా
విసిగి వేసరించేనా

విడిది చేసే మధుమాసం
విడిది చేసే మధుమాసం
చల్లని నీ లే ఎదలో...
చల్లని నీ లే ఎదలో... 

ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు




గుమ్మెత్తించే ఈ రేయి... పాట సాహిత్యం

 
చిత్రం : చల్ మోహన రంగ (1978)
సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: 
గానం : ఎల్. ఆర్. ఈశ్వరి 

పల్లవి:
గుమ్మెత్తించే ఈ రేయి... అహా కోరికలెన్నో ఉన్నాయి
సిగ్గులు చెందిదమ్మాయి.. అహా సరసన చేరాడబ్బాయి
జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా
ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో

గుమ్మెత్తించే ఈ రేయి... అహా కోరికలెన్నో ఉన్నాయి
సిగ్గులు చెందిదమ్మాయి.. అహా సరసన చేరాడబ్బాయి
జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా
ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో

చరణం: 1
లోకం నిద్దుర పోతుంటే లోపల సందడి అవుతుంది
లోకం నిద్దుర పోతుంటే లోపల సందడి అవుతుంది
మత్తెక్కించే చీకటిలో మనసే ఊయల ఊగింది
అందిఅందని అందాలు అవి ఎందరికైనా సరదాలు
ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో

చరణం: 2
గిన్నెల నిండా మధువుంది..ఓ... కన్నుల నిండా కైపుంది
గిన్నెల నిండా మధువుంది... కన్నుల నిండా కైపుంది

బుగ్గలు ముద్దులు కోరాయి... పెదవులు చెంతకు చేరాయి
కౌగిలినిండా వెచ్చదనం... కావల్సింది కొంటెతనం

ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో

గుమ్మెత్తించే ఈ రేయి... అహా కోరికలెన్నో ఉన్నాయి
సిగ్గులు చెందిదమ్మాయి.. అహా సరసన చేరాడబ్బాయి
జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా
ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో





ఎంత తియ్యని మాట పాట సాహిత్యం

 
చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: సముద్రాల సుధాకర్ 
గానం: పి. సుశీల  

పల్లవి:
ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు
పులకింతలై పుచెరా
కొత్త కొత్త వయసు పైటంత  పాటమ్మ 
పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింక హోలాల
ఊగిందే నా మనసే ఉయ్యాల

ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు
పులకింతలై పుచెరా
కొత్త కొత్త వయసు పైటంత  పాటమ్మ 
పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింక హోలాల
ఊగిందే నా మనసే ఉయ్యాల

చరణం: 1
మనసైన వాడే వరసైనాడని స్వప్నాల విహరించనా
కన్నె మనసే నీకు కనుకైయ్యిందని పువ్వు పువ్వుకు చెప్పనా
ఉన్నపాటున నిన్ను పెనవెయ్యనా
ముద్దుల్లో మురిపాలు ముంచెత్తనా
నా కొంగుచాటున నిన్ను దాచెయ్యనా

ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు
పులకింతలై పుచెరా
కొత్త కొత్త వయసు పైటంత  పాటమ్మ 
పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింక హోలాల
ఆ ఊగిందే నా మనసే ఉయ్యాల

చరణం: 2
ఆ నాడు వద్దంటే పైపైకి వచ్చావు
ఈనాడు ఏమాయెరా
అసలైన వగలేమో బుసగొట్టి కసిరేపే 
ఇక కైపుగున్నానురా
వలపంతా రంగరించి కలబోయారా
చెలరేగి స్వర్గాలు చూపించరా

ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు
పులకింతలై పుచెరా
కొత్త కొత్త వయసు పైటంత  పాటమ్మ 
పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింక హోలాల
అహహ  ఊగిందే నా మనసే ఉయ్యాల




చిక్కావు నా కొడక పాట సాహిత్యం

 
చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: కొసరాజు 
గానం: జి.ఆనంద్, యస్.పి.బాలు 

చిక్కావు నా కొడక 

Palli Balakrishna Sunday, February 11, 2018

Most Recent

Default