చిత్రం: సంతానం సౌభాగ్యం (1976) సంగీతం: బి. శంకర్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్య, శ్రీ శ్రీ, దాశరథి గానం: పి. సుశీల, యస్.పి. బాలు, ఎల్.ఆర్.అంజలి నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల, జరీనా వహెబ్ , మాస్టర్ నరేష్ కుమార్ అతిధి నటులు: సావిత్రి, చంద్రమోహన్ మాటలు: ఆప్పలా చార్య, మధన్ మోహన్ (నూతన రచయిత) దర్శకత్వం: డి. యస్. ప్రకాశ రావు నిర్మాత: కేశన జయరాం విడుదల తేది: 24.10.1976
Search Box
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974) సంగీతం: బి. శంకర రావు (ఘజల్ శంకర్ ) సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి నటీనటులు: కృష్ణ , జమున, సావిత్రి దర్శకత్వం: బి. భాస్కర్ నిర్మాత: టి. కృష్ణ విడుదల తేది: 31.05.1974
Songs List:
అమ్మా అని నోరారా పిలవరా పాట సాహిత్యం
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974) సంగీతం: బి. శంకర రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల అమ్మా అని నోరారా పిలవరా
ఓరోరి మల్లన్న సోంబేరి మల్లన్న పాట సాహిత్యం
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974) సంగీతం: బి. శంకర రావు సాహిత్యం: కొసరాజు గానం: ఎల్.ఆర్.ఈశ్వరి ఓరోరి మల్లన్న సోంబేరి మల్లన్న
నిన్ను కోరేది వేరేమి లేదురా పాట సాహిత్యం
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974) సంగీతం: బి. శంకర రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల నిన్ను కోరేది వేరేమి లేదురా
నీలో విరిసిన అందాలన్నీ పాట సాహిత్యం
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974) సంగీతం: బి. శంకర రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, పి. సుశీల నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె ఓ ఓ ఓ... నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలాయె ఊఁ ఊఁ.. నీ..లో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె అల్లరి గాలి నిమిరే దాకా మల్లె మొగ్గకు తెలియదు ఏమనీ తానొక తుమ్మెదకై తపియించేననీ తానొక తుమ్మెదకై తపియించేననీ మూగ కోరికా ముసిరే దాకా మూగ కోరికా ముసిరే దాకా మూసిన పెదవికి తెలియదు ఏమనీ తానొక ముద్దుకై తహతహలాడేనని తానొక ముద్దుకై తహతహలాడేనని ఆ కోరికలే ఇద్దరిలోనా ఆ కోరికలే ఇద్దరిలోనా కార్తీక పూర్ణిమలై వెలగాలి నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె ఓ ఓ ఓ... మధుమాసం వచ్చే దాకా మామిడిగున్నకు తెలియదు ఏమనీ తానొక వధువుగా ముస్తాబైనాననీ తానొక వధువుగా ముస్తాబైనాననీ ఏడడుగులు నడిచేదాకా ఏడడుగులు నడిచేదాకా వధూవరులకే తెలియదు ఏమనీ ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ ఆ బంధాలే ఇద్దరిలోనా ఆ బంధాలే ఇద్దరిలోనా కార్తీక పూర్ణిమలై వెలగాలి దేహమే దేవాలయం నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె ఓ ఓ ఓ... నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలాయె
పాగలపైన బూసోడమ్మా ఆ పోకిరోడు పాట సాహిత్యం
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974) సంగీతం: బి. శంకర రావు సాహిత్యం: కొసరాజు గానం: ఎల్.ఆర్.ఈశ్వరి పాగలపైన బూసోడమ్మా ఆ పోకిరోడు
భాషకు అక్షరాలెంతో పాట సాహిత్యం
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974) సంగీతం: బి. శంకర రావు సాహిత్యం: మోదుకూరి జన్షన్ గానం: యస్.పి. బాలు భాషకు అక్షరాలెంతో
మట్టినే మనిషిగా మలచేవు పాట సాహిత్యం
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974) సంగీతం: బి. శంకర రావు సాహిత్యం: మోదుకూరి జన్షన్ గానం: యస్.పి. బాలు మట్టినే మనిషిగా మలచేవు
నవ్య మానవ జాతి దివ్వివై వెలిగావు పాట సాహిత్యం
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974) సంగీతం: బి. శంకర రావు సాహిత్యం: మోదుకూరి జన్షన్ గానం: యస్.పి. బాలు నవ్య మానవ జాతి దివ్వివై వెలిగావు
Manushulu Matti Bommalu (1974)
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల, కృష్ణం రాజు దర్శకత్వం: పి.పుల్లయ్య నిర్మాత: విడుదల తేది: 05.11.1970
Songs List:
వానలు కురవాలి పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి వానలు కురవాలి
జాబిల్లి వచ్చాడే పిల్లా పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా ! నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే ఎదురుచూస్తున్నాడే పిల్లా ఎన్నెల్లు విరబూసే పున్నమీ నడిరేయి వయసూ ఉరకలు వేసే సొగసైనా చినదానా ఎంతో చక్కని వాడే చెంతకు రమ్మన్నాడే జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా ! నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే ఎదురుచూస్తున్నాడే పిల్లా రేకురేకున నువ్వు సోకు సేసు కున్నావే ముద్దు మొగమూ సూసి మురిసిపోతున్నావే కలహంస నడకలతో కదలిరావే పిల్లా జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా ! నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే ఎదురుచూస్తున్నాడే పిల్లా సిగ్గె నీ చెంపలకు నిగ్గాయే లేవే నవ్వె నీ కన్నులకు వెలుగాయె లేవే వయ్యారి ఓ పిల్లా సయ్యాట లాడాలా జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా ! నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే ఎదురుచూస్తున్నాడే పిల్లా
సుక్కు సుక్కు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: యస్.పి. బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి సుక్కు సుక్కు
నీవని నేనని పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల పల్లవి: నీవనీ నేననీ నీవనీ నేననీ లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు ఓ... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు కెరటాలై కిరణాలై ఓ... కెరటాలై కిరణాలై పరుగిడ పరుగిడ పరువాలు పలుకలేని కన్నులతో పలుకరించుకుందాము పలుకలేని కన్నులతో పలుకరించుకుందాము పులకరించు పెదవులతో వలపు పంచుకుందాము వలపు పంచుకుందాము ఒకరికొకరు పందిరిగా ఊహలల్లుకుందాము ఊహలల్లుకుందాము ఆ.... నీవనీ నేననీ నీవనీ నేననీ లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు ఓ... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు చరణం: 1 నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు ఆ.... నీవనీ నేననీ నీవనీ నేననీ లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు ఓ... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
బడా జోరు పిల్ల పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: ఎల్.ఆర్.ఈశ్వరి బడా జోరు పిల్ల
పెళ్లి కుదిరింది పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల పెళ్లి కుదిరింది
Allude Menalludu (1970)
చిత్రం: చల్ మోహన రంగ (1978) సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్) సాహిత్యం: దాశరధి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, జాలాది, గొల్లపూడి, సముద్రాల సుధాకర్ గానం: పి.సుశీల, యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్, విజయలక్ష్మీ శర్మ నటీనటులు: కృష్ణ , దీప , జయమాలిని , పుష్ప కుమారి, మోహన బాబు, షావుకారు జానకి మాటలు: గోపి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.భాస్కర్ ఫోటోగ్రఫీ: పుష్పాల గోపికృష్ణ ఎడిటర్: వి.జగదీష్ నిర్మాత: పి.త్రినాధ రావు విడుదల తేది: 29.06.1978
Songs List:
దూరాన కొండల్లో సూరీడు పాట సాహిత్యం
చిత్రం: చల్ మోహన రంగ (1978) సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్) సాహిత్యం: జాలాది రాజారావు గానం: యస్.పి.బాలు దూరాన కొండల్లో సూరీడు
ఏమి సగం రైక ఏమి తుండు కొక (చల్ మోహన రంగ) పాట సాహిత్యం
చిత్రం: చల్ మోహన రంగ (1978) సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్) సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, విజయలక్షిశర్మ ఏమి సగం రైక ఏమి తుండు కొక
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు పాట సాహిత్యం
చిత్రం: చల్ మోహన రంగ (1978) సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్) సాహిత్యం: జాలాది రాజారావు గానం: యస్.పి.బాలు, పి. సుశీల పల్లవి: ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి సింగారమొలకంగ చీర కొంగులు జారే రంగైన నవమోహనాంగీ ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ చరణం: 1 అందాల గంధాలు పూసేయనా... సింధూర కుసుమాలు సిగ ముడవనా... అందాల గంధాలు పూసేయనా... సింధూర కుసుమాలు సిగ ముడవనా... చిలకమ్మో... కులికి పలుకమ్మో ఆ... చిలకమ్మో.. కులికి పలుకమ్మో నిలువెత్తు నిచ్చెన్లు నిలవేయనా... నీ కళ్ళ నెలవళ్ళ నీడంచనా మడతల్లో.. మేని ముడతల్లో.. ముచ్చట్లో.. చీర కుచ్చిట్లో మడతల్లో.. మేని ముడతల్లో.. ముచ్చట్లో.. చీర కుచ్చిట్లో పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి దొంతు మల్లెల మీద దొర్లించనా అలివేణీ అలకల్లే.. నెలరాణి కులుకల్లే.. తరలెల్లి పోకమ్మా కలికీ ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి చరణం: 2 గగనాల సిగపూల పరుపేయనా... పన్నీటి వెన్నెల్లో ముంచేయనా గగనాల సిగపూల పరుపేయనా... పన్నీటి వెన్నెల్లో ముంచేయనా నెలవంకా.. చూడు నా వంక చిట్టి నెలవంకా... చూడు నా వంక నీ మేని హొయలన్నీ బులిపించనా.. ఎలమావి కోకేసి కొలువుంచనా పొద్దుల్లో... సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో పొద్దుల్లో... సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో నట్టింట దీపాన్ని నడికొండ కెక్కించి చీకట్ల వాకిట్లో చిందేయనా పొగరంతా ఎగరేసి.. వగలన్నీ ఒలకేసి.. కవ్వించబోకమ్మా కలికీ ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోమెందుకే కోమలాంగీ.. రాణీ ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ
నువ్వొచ్చే దారిలో అమ్మాయి... పాట సాహిత్యం
చిత్రం: చల్ మోహన రంగ (1978) సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్) సాహిత్యం: సినారె గానం: యస్. పి. బాలు, పి.సుశీల పల్లవి: నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నే రివ్వేసి కైపెక్కి కాశాను నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నే రివ్వేసి కైపెక్కి కాశాను ముద్దబంతి అద్దకాల ముద్దు లేసి... ఒళ్లంతా చుడతాను పగ్గమేసి ఒళ్లంతా చుడతాను పగ్గమేసి రేకెత్తి పోకోయు కుర్రోడా రేగేది... ఎందాక చిన్నోడా రేకెత్తి పో కోయి కుర్రోడా రేగేది... ఎందాకా చిన్నోడా ఈ వేడి నిండార నిలవుండిపోవాలి... నూరేళ్లు కౌగిళు నూరేసుకోవాలి రేకెత్తి పోకోయి కుర్రోడా రేగేది... ఎందాకా చిన్నోడా నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నేరివ్వే సి కైపెక్కి కాశాను చరణం: 1 గువ్వలల్లె యవ్వనాలు గుండెల మీదుంటే ఈ కోడెగాడి కోరికేదో రంకెలు వేస్తోంటే కళ్లె మేసి ఆపలేని కసి మీదున్నావు నీ కళ్లతో నా ఒళ్లంతా తెగ తడి మేస్తున్నావు సిరిమల్లే బుగ్గల మీద చెంగావి పెదవుల మీద సిరిమల్లే బుగ్గల మీద చెంగావి పెదవుల మీద మాటేసి కాటేసి మైమరిచిపోతాను ఆ రోజు రావాలిగా... మరి నా మోజు తీరాలి గా రేకెత్తి పోకోయి కుర్రోడా... రేగేది ఎందాకా చిన్నోడా అరెరె నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నే రివ్వేసి కైపెక్కి కాశాను చరణం: 2 పగడాల పడవల్లే నువ్వూగుతూ వస్తుంటే ఆ జగడాల బిడియాలు సుడి పడిపోతుంటే జడివాన వరదల్లె నను తడిపేస్తున్నావు నీ మగసిరిని సెగ చూపి ఆరేస్తున్నావు ఆ తెరచాప కొండల కేసి నడియేట గెడ పోటేసి తెరచాప కొండలకేసి నడియేట గెడపోటేసి దూరాల తీరాల దరి చూసుకుంటాను తీగల్లె నిన్నల్లుకుంటాను... నీ చుట్టు మెలితిరిగివుంటాను రేకెత్తి పోకోయి కుర్రోడా... రేగేది ఎందాకా చిన్నోడా నువ్వొచ్చే దారిలో అమ్మాయి... నేరివ్వేసి కైపెక్కి కాశాను లాలాలా లాలాల లాలాలా
ఎన్నాళ్ళీ తలపులు... పాట సాహిత్యం
చిత్రం: చల్ మోహన రంగ (1978) సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్) సాహిత్యం: గొల్లపూడి గానం: యస్.పి.బాలు, పి. సుశీల పల్లవి: ఎన్నాళ్ళీ తలపులు... కలల మేలుకొలుపులు ఎగిసిపడే హృదయంలో ఘడియ పడని తలుపులు ఎన్నాళ్లీ పిలుపులు.... మూసిన కనుకొలకులు ఎన్నాళ్లీ పిలుపులు.... మూసిన కనుకొలకులు నువు నడిచే బాటలో ... తీయని తొలి మలుపులు ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు చరణం: 1 తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా చిరునవ్వులలు వెన్నెలకే.. కొత్త సిగ్గు నేర్పేనా కొత్త సిగ్గు నేర్పేనా నిదుర రాదు... నిదుర రాదు... నిదుర రాదు... నిదుర రాదు... నిను చూసిన కనులకు ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు చరణం: 2 ఆమని నీ కౌగిలో... అలసి నిలిచి పోయేనా ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆమని నీ కౌగిలో... అలసి నిలిచి పోయేనా ఏమని నా మనసు నన్నే ... విసిగి వేసరించేనా విసిగి వేసరించేనా విడిది చేసే మధుమాసం విడిది చేసే మధుమాసం చల్లని నీ లే ఎదలో... చల్లని నీ లే ఎదలో... ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు
గుమ్మెత్తించే ఈ రేయి... పాట సాహిత్యం
చిత్రం : చల్ మోహన రంగ (1978) సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్) సాహిత్యం: గానం : ఎల్. ఆర్. ఈశ్వరి పల్లవి: గుమ్మెత్తించే ఈ రేయి... అహా కోరికలెన్నో ఉన్నాయి సిగ్గులు చెందిదమ్మాయి.. అహా సరసన చేరాడబ్బాయి జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో గుమ్మెత్తించే ఈ రేయి... అహా కోరికలెన్నో ఉన్నాయి సిగ్గులు చెందిదమ్మాయి.. అహా సరసన చేరాడబ్బాయి జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో చరణం: 1 లోకం నిద్దుర పోతుంటే లోపల సందడి అవుతుంది లోకం నిద్దుర పోతుంటే లోపల సందడి అవుతుంది మత్తెక్కించే చీకటిలో మనసే ఊయల ఊగింది అందిఅందని అందాలు అవి ఎందరికైనా సరదాలు ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో చరణం: 2 గిన్నెల నిండా మధువుంది..ఓ... కన్నుల నిండా కైపుంది గిన్నెల నిండా మధువుంది... కన్నుల నిండా కైపుంది బుగ్గలు ముద్దులు కోరాయి... పెదవులు చెంతకు చేరాయి కౌగిలినిండా వెచ్చదనం... కావల్సింది కొంటెతనం ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో గుమ్మెత్తించే ఈ రేయి... అహా కోరికలెన్నో ఉన్నాయి సిగ్గులు చెందిదమ్మాయి.. అహా సరసన చేరాడబ్బాయి జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో
ఎంత తియ్యని మాట పాట సాహిత్యం
చిత్రం: చల్ మోహన రంగ (1978) సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్) సాహిత్యం: సముద్రాల సుధాకర్ గానం: పి. సుశీల పల్లవి: ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు పులకింతలై పుచెరా కొత్త కొత్త వయసు పైటంత పాటమ్మ పురివిప్పి ఆడేనురా ఇక ఆగలేను నేనింక హోలాల ఊగిందే నా మనసే ఉయ్యాల ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు పులకింతలై పుచెరా కొత్త కొత్త వయసు పైటంత పాటమ్మ పురివిప్పి ఆడేనురా ఇక ఆగలేను నేనింక హోలాల ఊగిందే నా మనసే ఉయ్యాల చరణం: 1 మనసైన వాడే వరసైనాడని స్వప్నాల విహరించనా కన్నె మనసే నీకు కనుకైయ్యిందని పువ్వు పువ్వుకు చెప్పనా ఉన్నపాటున నిన్ను పెనవెయ్యనా ముద్దుల్లో మురిపాలు ముంచెత్తనా నా కొంగుచాటున నిన్ను దాచెయ్యనా ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు పులకింతలై పుచెరా కొత్త కొత్త వయసు పైటంత పాటమ్మ పురివిప్పి ఆడేనురా ఇక ఆగలేను నేనింక హోలాల ఆ ఊగిందే నా మనసే ఉయ్యాల చరణం: 2 ఆ నాడు వద్దంటే పైపైకి వచ్చావు ఈనాడు ఏమాయెరా అసలైన వగలేమో బుసగొట్టి కసిరేపే ఇక కైపుగున్నానురా వలపంతా రంగరించి కలబోయారా చెలరేగి స్వర్గాలు చూపించరా ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు పులకింతలై పుచెరా కొత్త కొత్త వయసు పైటంత పాటమ్మ పురివిప్పి ఆడేనురా ఇక ఆగలేను నేనింక హోలాల అహహ ఊగిందే నా మనసే ఉయ్యాల
చిక్కావు నా కొడక పాట సాహిత్యం
చిత్రం: చల్ మోహన రంగ (1978) సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్) సాహిత్యం: కొసరాజు గానం: జి.ఆనంద్, యస్.పి.బాలు చిక్కావు నా కొడక