Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2022"
Kapolla Intikada






  
పాట: కాపోల్ల ఇంటికాడ కామూడాటలట
సంగీతం: మదీన్ SK
రచన, గానం: శ్రీలత యాదవ్ 
ఆర్టిస్ట్స్: నాగ దుర్గ 
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్
విడుదల: 24.01.2022


కాపోల్ల ఇంటికాడ కామూడాటలట పాట సాహిత్యం

 

పాట: కాపోల్ల ఇంటికాడ కామూడాటలట
సంగీతం: మదీన్ SK
రచన, గానం: శ్రీలత యాదవ్ 
ఆర్టిస్ట్స్: నాగ దుర్గ 


కాపోల్ల ఇంటికాడ కామూడాటలట
పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా
మనం ఆడబోదమా బావ సూడబోదమా

కాపోల్ల ఇంటికాడా, అరె కామూడాటలటా
ఆ, పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా
మనం ఆడబోదమా బావ సూడబోదమా

జాలూ తండలోన తీజు పండుగట
జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా

జాలూ తండలోనా, అరె తీజు పండుగట
ఆ, జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా

శాలోళ్ల ఇంటికాడ సక్కాని సీరాలట
సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా బావ గొని తెస్తవా
నువ్వు పొయ్యి వస్తవా నాకు గొని తెస్తవా

శాలోళ్ల ఇంటికాడా, అరె సక్కాని సీరాలటా
ఆ, సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా నాకు
పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా

బెస్తోళ్లింటీకాడ ఒట్టీ శాపాలట
ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా
బావ వండిపెడతరా నీకు తినపెడతరా

బెస్తోళ్లింటీకాడా, అరె ఒట్టీ శాపాలటా
ఆ, ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా
నేను వండిపెడతరా నీకు తినపెడతరా

పెసరు బండ మీద ప్రేమా జంటలట
ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా

పెసరు బండ మీదా, అరె ప్రేమా జంటలటా
ఆ, ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా

Palli Balakrishna Saturday, March 30, 2024
Prem Kumar (2022)



చిత్రం: ప్రేమ్ కుమార్ (2022)
సంగీతం: ఎస్. అనంత శ్రీకర్
నటీనటులు: సంతోష్ శోభన్, రాశి సింగ్
దర్శకత్వం: అభిషేక్ మహర్షి
నిర్మాత: శివప్రసాద్ పన్నీరు
విడుదల తేది: 2022



Songs List:



నీలాంబరం చూసి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ్ కుమార్ (2022)
సంగీతం: ఎస్. అనంత శ్రీకర్
సాహిత్యం: కిట్టు విస్స ప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి, అమృత ఆనంద్

నీలాంబరం చూసి నీ కళ్ళలో
మేఘామృతం జారే నా గుండెలో
మాటలని మోయలేని పెదవే
మౌనంగా నిన్ను సాయమడిగే

పదే పదే మనోహరంగా
తదేకమే యధావిధంగా
నీపైనే ఆశ నీతో గీతే దాటి
పోతుంటే ఎలా… వింటుందా ఎద

(నీలాంబరం చూసి నీ కళ్ళలో
మేఘామృతం జారే నా గుండెలో)

(నీలాంబరం చూసి నీ కళ్ళలో
మేఘామృతం జారే నా గుండెలో)

మేఘాలపై పాదం మోపేంతల
నీ ఊహకే వేగం చేరిందిగా




సుందరీ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ్ కుమార్ (2023)
సంగీతం: యస్. అనంత్ శ్రీకర్ 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: కార్తీక్

సుందరీ హు హు హూ
ఓ ఓ, కన్నే నీ వైపే నన్నే
లాగింది చూపుల దారమే
నీ కన్నుల్లోనే దాగింది మిన్నే
చూస్తూనే ఆడెను నా కుడి కన్నే

తొలి చూపే శుభలేఖే రాసిందే ఇలా

సుందరీ హు హు హూ
ఊహలకే పరుగే మొదలే
సుందరీ హు హు హూ
ఈ క్షణమే నువ్వు నా సగమే

కుదురే మరిచే అలవాటు లేదు
ఇదిగో ఇపుడే మొదలైంది నేడూ
కలలో నిన్నే పెనవేసుకుంటూ
గడిపే పనిలో ఉంటుంది మనసు

నీ ఇంటి పేరులోన తలదాచుకోగా
ఆశ్చర్యాలన్నీ ఇంకా అలవాటైపోతాయిగా

మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం

మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం

Palli Balakrishna Tuesday, August 1, 2023
Song: Zanjeere



పాట: జంజిరే 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: భీమ్స్ సిసిరోలియో, సాహితి గాలిదేవర 
ఆర్టిస్ట్స్: పూజిత పొన్నాడ 
కోరియోగ్రాఫర్: రామ్ (D 13 Winner)
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 08.03.2022



జంజిరే పాట సాహిత్యం

 
పాట: జంజిరే 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: భీమ్స్ సిసిరోలియో, సాహితి గాలిదేవర 

జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే

వాడొచ్చిన వానవ్వొచ్చిన
కొన ఏదో మొదలేదో గుర్తుపట్టలేని
జంజిరే నేను జంజిరే
నా కాలి మడమల్ల ఆని నీడ గిలగిల్లా
నా పాణం పెదవుల్ల ఆని ప్రాణం విలవిల్లా

అద్దంలెక్కుంటావ్ అర్ధం కాకుంటావ్
ముద్దుగా ఉంటావ్ ముద్దివ్వనంటావ్
పందెమేసుకోని ఎందరొచ్చినా గాని
అందనే అందను అంగూర పండును జంజిరే

జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే

ఎదురుంగా సూడు ఎనుకంగా సూడు
అటుపక్క ఇటు పక్క ఎటుపక్క సూడూ
ఓరకంట సూత్తినా ఆని నోరు ఎండుకపోతది
ఒళ్ళు విరుచుకొంటినా ఆని కళ్ళు పేలిపోతయి

నా జడలా కుచ్చుల్లా ఆని చూపులు గిలగిల్లా
టెన్ టు ఫైవ్ నుండి సేకరణ
నా చీర కుచ్చిళ్ళ ఆని బతుకు విలవిల్లా

జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే

సెలకల్ల సూడు పొలమల్ల సూడు
మా ఇంటి మూల మలుపుళ్ళ సూడు
దూరం నుండి చూసినా
నాది గంధం సెక్క వాసన
దగ్గరకొచ్చి చూసినా నేను
అగ్గి పువ్వును తెలుసుగా

నా తీపి మాటల్లా
ఆని మనసు గిలగిల్లా
నా లోతు గుండెల్ల
ఆని బతుకే విలవిల్లా
జంజిరే జంజిరే జంజిరే

Palli Balakrishna Saturday, May 27, 2023
Song: Ringu Juttu Ranguloda



పాట: రింగు జుట్టు 
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: రాజేందర్ కొండా
గానం: ప్రభా
ఆర్టిస్ట్స్: అక్షా ఖాన్
కోరియోగ్రాఫర్: టీనా
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 15.07.2022



రింగు జుట్టు పాట సాహిత్యం

 
పాట: రింగు జుట్టు 
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: రాజేందర్ కొండా
గానం: ప్రభా

పల్లవి:
రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

ఆ రింగు జుట్టు రంగులోడా గుండెల్లోన నీదే గోల
నిను ఇడిసి ఉండదంట నా మనసు అడ ఇడ

రింగు జుట్టు
అరెరె రింగు జుట్టు
అబబ్బా రింగు జుట్టు
రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

చరణం: 1
గా ఎంకటి తాత పొలము ఆ పక్కనే పులా వనము
ఆ పువ్వొలే నీ గుణముర నా కెంత సక్కటి వరము
నిను సూడకుండ దినము ఇడిసుంటాన ఓ క్షణము
నువ్వు గాణరాకపోతే రా బావోత్తది నాకు జొరము 
నువ్వేడుంటే గా సోట ని తొవ్వెంటే నా బాట
ను సెప్పిందే నే ఇంట నేనుంటారా ని జంట
కాసుకుంటా ఓర కంట ఎన్ని తంటలైన నీతోనుంటా

రింగు జుట్టు
అరెరె రింగు జుట్టు
అబబ్బా రింగు జుట్టు
రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

చరణం: 2
మట్టిపెళ్ల లాంటి తనము దిట్టంగా ఉందే ధనము
ఒట్టేసి సెబుతా ఇనవు మావ నిన్నే గోరె తనువు
ఎంత సెప్పుకున్న ఇనవు సక్కాగున్నావన్న పొగరు
గి సిగ్గులు నాకు తెగవు నిన్నే జేసుకుంటా మనువు
నా కళ్ళల్లో నీ ధ్యాసే నా కలల్లో నీ ఊసే
నా కళ్ళల్లో నీ ధ్యాసే నా కలల్లో నీ ఊసే
గిదేందయ్య నా గోసే నేనుంటారా నీతోటే

రింగు జుట్టు
అరెరె రింగు జుట్టు
అబబ్బా రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

ఆ రింగు జుట్టు రంగులోడా గుండెల్లోన నీదే గోల
రింగు జుట్టు రంగులోడా గుండెల్లోన నీదే గోల
నిను ఇడిసి ఉండదంట నా మనసు అడ ఇడ

రింగు జుట్టు
రింగు రింగు రింగు జుట్టు
అబబ్బా రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

Palli Balakrishna
Song: Allahe Allaha



సాంగ్ : అల్లా హే అల్లా…
సంగీతం: మదీన్ SK
రచన: లక్ష్మ న్
సింగర్: రామ్ (అద్నాన్)
ఆర్టిస్ట్స్: టోనీ కిక్ , సునీత , నజ్మా మున్నా 
డైరెక్టర్: బుల్లెట్ బండి లక్ష్మన్
ప్రొడ్యూసర్: రఘు లవాద్య



అల్లా హే అల్లా... పాట సాహిత్యం

 
సాంగ్ : అల్లా హే అల్లా…
సంగీతం: మదీన్ SK
రచన: లక్ష్మ న్
సింగర్: రామ్ (అద్నాన్)


కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే

సురుమా పెట్టిన కన్నులతో
నన్ను చూసే రోజు
ఎర్రగా పండిన పెదాలతో
నన్ను పిలిచే రోజు

యే ధువా మిల్ జాయె వఫా యే తో
అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
(యే ధువా మిల్ జాయె వఫా యే తో)

రంగుల కొంగు నిండుగా కప్పి
వస్తుంటే నువ్ దర్గకి
అల్లా పిలిచిండానిపించెనే పిల్లా

నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని
ఇలా కలిపెను… మన బంధమే అల్లా
నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో
నిండుకున్నవే నా నిండు జన్మలో
ఆస్మా ఆమెలే… నజుమా అందదే
(యే ధువా మిల్ జాయె వఫా యే తో)

అల్లా హే అల్లా... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా... నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా... నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

నిను చూడకుంటే నా కళ్ళు
ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
అల్లా మహిమనే అనుకుందున పిల్లా

నీ చెయ్యి నేను పట్టను అంటే
ఈ ఊపిరాగినదే
అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
షాజహాన్ చూడని… ఆగ్రా అందమే
తోడుగొస్తదా పేదోడి ఇంటికి
జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే
(యే ధువా మిల్ జాయె వఫా యే తో)

అల్లా హే అల్లా... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా... నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా... నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

Palli Balakrishna Friday, May 26, 2023
Situkesthe Poye Pranam (2022)



సాంగ్: సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
సంగీతం: మదీన్ SK
రచన: గను
సింగర్: హన్మంత్ యాదవ్ 
ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్ 



సిటీకేస్తే పోయేటి ప్రాణానికి పాట సాహిత్యం

 
సాంగ్ : సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
సంగీతం: మదీన్ SK
రచన: గను
సింగర్: హన్మంత్ యాదవ్ 
ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్ 

వేములవాడ రాజన్న దేవుని
అడుగే నీ మీదున్న ఇష్టం 
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే 
నీకు రావద్దు కష్టం 
సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సీక్కులు పెటీనవేందే
బండ తీరు ఉండేటీ నా గుండెకు
ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే 

ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మీదే పానమయే
పిల్ల నీ తోడు లేక పోయే
నాకు సావన్న రాకపాయే 

వేములవాడ రాజన్న దేవుని అడుగే
నీ మీదున్న ఇష్టం 
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే 
నీకు రావద్దు కష్టం 

ఎందుకే పిల్ల నామీద కోపం 
గుండె కోసి చూడు నీ రూపం
ఎందుకే పిల్ల నామీద కోపం
నువ్వే కదానే నా లోకం
ఎందుకే పిల్ల నామీద కోపం 
ఏ జన్మలో చేసిన పాపం 
నా గుండెల్లో దాగున్న ఈ బాధని
నేను ఎవరితో చెప్పుకోనే 


ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మిదే పానమయే
పిల్ల నీ తోడు లేకపాయే
నాకూ సావన్నా రాకపాయే

వేములవాడ రాజన్న దేవుని అడుగే
నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే 
నీకు రావద్దు కష్టం

నువ్వు ఎట్లా ఉన్నావు ఇంటికాడ
నేను రాలేను నిన్ను చూడ 2
నేను ఉన్నది బార్డర్ కాడ
చచ్చిపోయిన తేలువది జాడ

నా ప్రాణం పోతున్నది
ఇంట్లో చీకటి అయితె ఉన్నది
నువ్వు నాతోవ చూడ బోకు
నా అడుగులో నువ్వు రాకు
కంట కన్నీరు పెట్టబోకు
ఇంట్లొ దుఃఖాల పాలుగాకు

సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సీక్కులు పెటీనవేందే
బండ తీరు ఉండేటీ నా గుండె ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే
ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మీదే పానమయే పిల్ల నీ తోడు లేకపాయే
నాకు సావన్నా రాకపాయే

Palli Balakrishna Friday, December 16, 2022
Sommasilli Pothunnave (2022)



సాంగ్: సొమ్మ‌సిల్లిపోతున్న‌వే ఓ సిన్నా రాముల‌మ్మ‌! (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: రాము రాథోడ్ 
సింగర్: రాము రాథోడ్ 
ప్రొడక్షన్: MS అడ్డా



సొమ్మ‌సిల్లిపోతున్న‌వే ఓ సిన్నా రాముల‌మ్మ‌! పాట సాహిత్యం

 
సాంగ్: సొమ్మ‌సిల్లిపోతున్న‌వే ఓ సిన్నా రాముల‌మ్మ‌! (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: రాము రాథోడ్ 
సింగర్: రాము రాథోడ్ 
ప్రొడక్షన్: MS అడ్డా

కంటికి కునుకే క‌రువాయినే!
గుండెల బ‌రువే మొద‌ల‌యినే!

సొమ్మ‌సిల్లిపోతున్న‌వే ఓ సిన్నా రాముల‌మ్మ‌!
చెమ్మ‌గిల్లి ముద్దివ్వ‌వే చూపించ‌వే నాపై ప్రేమ‌!
న‌ల్ల న‌ల్లాని క‌ళ్ల‌తో నాజూకు న‌డుముతో! న‌న్నాగం జేసితివే!
గుండెలో గాలిలో తేలుతు ఆరాటాలాడుతూ..నీ ఒళ్లో నీవాలినే!
సుట్టు దిప్పూకున్నావే! ఓ చిన్నా రాముల‌మ్మ‌!
చెమ‌ట‌చుక్కొలే తీసెయ్య‌కే నీ చీర కొంగుకే ముడివెయ్య‌వే!

సాయం కాలం వేళ సందె పొద్దులాగ చెంత‌లోనే ఉండ‌వే!
చీక‌టేల మెరిసే సుక్క‌లాగ గుండెలోన దాగ‌వే!
నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీబొమ్మ‌లావున్న‌దే!
నీ చేతిన‌డ్డేసి క‌ల‌ల‌న్నీ చెరిపేసి కాలాన్ని మార్చ‌కే

ఎక్క‌డున్నా ఎదుర‌య్యే నీ స‌న్న‌జాజి న‌వ్వులే!
స‌క్క‌నైనా సొగ‌సులే నాకిచ్చి స్వ‌ర్గంలో బంధించ‌వే!

ఏటి గ‌ట్టి మీద ఎదురు చూపుల్లోన‌ క‌ళ్ళ‌ల్లో నిండిన‌వే!
గాలి వాన‌ల్లోన గొడుగ‌ల్లే ర‌మ్మ‌న‌వే వెచ్చ‌గ కౌగిలికే!
నీ ఊహ‌లే క‌న్న నీ ధ్యాస‌లో ఉన్న నా ద‌రికి ర‌మ్మంటినే!
నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నునా..నా అడుగు నీ జాడ‌కే!

ముద్దుగున్నా నా చెలివే! ఓ చిన్నా రాముల‌మ్మా!
సుక్క చేరే రోజెన్న‌డే ప్రాణం అల్లాడే నీ కోస‌మే!

పారేటి సెల‌యేరు ప‌ల‌క‌రించ‌కున్న ప‌ర్వాలేద‌నుకుంటినే!
ప్రాణం క‌న్న నీవు ఎక్కువ అంటున్న ప‌ట్టించుకోవెందుకే!
పువ్వుల్లో దాగున్న ప‌రిమ‌ళాల‌న్ని నీ చెంత చేరిస్తినే!
పంచ‌బూత‌ల‌న్ని సాక్షులుగ చేసి మ‌నువాడు కుంటాలే!

జ‌న్మ‌జ‌న్మాల బంధానివే! ఓ సిన్నా రావుల‌మ్మా!
నా చీక‌టి బ్ర‌తుకులో వెలుగివ్వ‌వే!
నా ఇంటి దీపాన్ని వెలుగించ‌వే!

Palli Balakrishna

Most Recent

Default