Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kuberaa (2025)




చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
నటీనటులు: ‘కింగ్’ నాగార్జున అక్కినేని , ధనుష్ , రష్మిక మందన్న 
దర్శకత్వం:  శేఖర్ కమ్ముల 
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు 



Songs List:



నా కొడుకా పాట సాహిత్యం

 
చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
గానం: సిందూరి విశాల్ 
సాహిత్యం: నంద కిషోర్ 

పచ్చ పచ్చని చెల్లల్లో
పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు ఏరుతు నడిచేద్దాము
చేతులు పట్టుకో నా కొడుకా..

కడుపున నిన్ను దాచుకుని
నీడల్లే నిన్ను అంటుకుని
కలిసే ఉంటా ఎప్పటికీ
నీ చేతిని వదలను నా కొడుకా..

పదిలంగా నువ్వు నడవలే
పది కాలాలు నువ్వు బతకాలే
చందమామకు చెబుతున్నా
నిను చల్లగా చూస్తాది నా కొడుకా..

ఆకలితో నువ్వు పస్తుంటే
నీ డొక్కలు ఎండిపోయేరా
చెట్టు చెట్టుకి చెబుతున్నా
నీ కడుపు నింపమని నా కొడుకా..

నిద్దురలేక నువ్వుంటే
నీ కన్నులు ఎర్రగా మారేరా
నీలి మబ్బుతో చెబుతున్నా
నీ జోల పాడమని నా కొడుకా..

మనుషికీ మనిషే దూరమురా
ఇది మాయా లోకపు ధర్మమురా
బడిలో చెప్పని పాఠం ఇదిరా
బతికే నేర్చుకో నా కొడుకా..

తిడితే వాళ్లకే తాగిలేను
నిను కొట్టిన చేతులు విరిగేను
ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు
ఓపికతోటి నా కొడుకా..

రాళ్ళు రప్పల దారులు నీవి
అడుగులు పదిలం ఓ కొడుకా
మెత్తటి కాళ్ళు ఒత్తుకు పోతాయి
చూసుకు నడువురా నా కొడుకా..

చుక్కలు దిక్కులు నేస్తులు నీకు
చక్కగా బతుకు ఓ కొడుకా
ఒక్కనివనుకొని దిగులైపోకు
పక్కనే ఉంటా నా కొడుకా..

పాణము నీది పిట్టల తోటిది
ఉచ్చుల పడకు ఓ కొడుకా
ముళ్ళ కంపలో గూడు కట్టేటి
నేర్పుతో ఎదగారా నా కొడుకా..

ఏ దారిలో నువ్వు పోతున్నా
ఏ గండం నీకు ఏదురైనా
ఏ కీడు ఎన్నడు జరగదు నీకు
అమ్మ దివేనిది నా కొడుకా..

ఈ దిక్కులు నీతో కదిలేను
ఆ చుక్కలే దిష్టి తీసేను
ఏ గాలి ధూళి సోకదు నిన్ను
అమ్మ దివేనిది నా కొడుకా..

ఏ పిడుగుల చప్పుడు వినపడినా
ఏ బూచోడికి నువ్వు భయపడినా
ఈ చీకటి నిన్నేం చెయ్యదులేరా
అమ్మ దివేనిది నా కొడుకా..
అమ్మ దివేనిది నా కొడుకా.



అనగనగా కథ.. పాట సాహిత్యం

 
చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: హైడే కార్తీ , కరిముల్లా 

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

నమ్మే వాడిని అమ్మేయడం….
మొక్కేవాడిని తొక్కేయడం..
దొరికేవాడిని దోచేయడం..
తల వంచేవాడిని ముంచేయడం..

యుగాల నుండీ..
జరుగుతున్న కథ..
యుగాంతమైనా మారిపోని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

వంతెన కట్టేదొకడు..
దాన్ని దాటే వాడింకొకడు..
నిచ్చెన వేసేదొకడు…
పైపెకెక్కే వాడింకొకడు..
ముందుకు తీసుకు వెళ్ళేవాడిని అక్కడితోనే ఆపడం..
ఎత్తుకు మోసుకు వెళ్ళేవాడిని లోతులలోనే ఉంచడం..

పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సిరి ఉందా!??
బీదల కన్నుల నీటిని తుడవని కథలకు అర్ధం ఉందా..?!?

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

లేని వాడికి నోటి ఆకలి..
ఉన్నవాడికి నోట్ల ఆకలి..
నోటికి తెలుసును వద్దు వద్దు..
నోట్లకు తెలియదు హద్దు పద్దు..

బలహీనుడికి ఆశే ఉంటది..
బలవంతుడికి అత్యాశుంటది..

ఓ.. ఆశకు బ్రతుకే సరిపోద్ది..
ఒక బ్రతుకే సరిపోద్ది..
అత్యాశే అందరి బ్రతుకులతో ఆట ఆడుకుంటది..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..



పోయిరా మావా పాట సాహిత్యం

 
చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: ధనుష్ 

ఏయ్ వన్ డే హీరో నువ్వే ఫ్రెండ్
నీ కోసమే డప్పుల సౌండు
అస్సలు తగ్గక అట్నేఉండు
మొక్కుతారు కాళ్ళు రెండు
నిన్నే చూస్తున్నది చూడు
ఊరు మొత్తం దేవుడి లాగ
వన్ వే లోన నువ్ వెళ్లిన ఆఫర్ నిన్నను అందరిలాగా
రధం మీద నువ్వే అలాగ
దూసుకువెళ్తా ఉంటె అబ్బో యమగా
సీఎం పీఎం ఎదురే వచ్చిన
నువ్వు సలాం కొట్టే పనే లేదుగా
ముందరిలాగా అంత ఈజీ గా
నిన్నే కలుసుకోలేరుగా
నీతో ఫోటో దిగాలన్న
చచ్చేతంత పనౌతుందిగా
ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా

చూస్తూ చూస్తూనే మారింది
నీ రేంజ్ ఈరోజున
నిన్నే అందుకోవాలి అనుకుంటే
సరిపోదే ఏ నిచ్చెన
సొమ్ములైన సోకులైన తలొంచావా నీ ముందర
నిన్నే కొనే ఐస పైసా ఈ లోకం లో యాడుందిరా
నిన్నే తిట్టి గళ్ళ పెట్టి సతాయించే సారె లేదు రా
ఓఓఓ ఓఓఓ…..
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా

నీతోటో మాట్లాడి గెల్చేటి దమ్మే ఈడ లేడేవాడికి
స్వర్గం అరేయ్ నీ జేబులో ఉంది బాధే లేదు ఏనాటికి
ఏరోప్లేనే రాకెట్టు నీ కాళ్ళ కిందే ఎగరాల్సింది
ఎంతోడైన తలే ఎత్తి ఆలా నిన్ను చూడాల్సిందే
తల రతన్ చెరిపి మల్ల రాసేసుకో నీకే నచ్చింది
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా


No comments

Most Recent

Default