చిత్రం: లక్కీ భాస్కర్ (2024) సంగీతం: జివి ప్రకాష్ కుమార్ నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి దర్శకత్వం: అట్లూరి వెంకీ నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య విడుదల తేది: 31.10. 2024
Songs List:
శ్రీమతి గారు పాట సాహిత్యం
చిత్రం: లక్కీ భాస్కర్ (2024) సంగీతం: జివి ప్రకాష్ కుమార్ సాహిత్యం: శ్రీమణి గానం: విషాల్ మిశ్రా, శ్వేతా మోహన్ కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు చామంతి నవ్వే విసిరే మీరు కసిరేస్తూ ఉన్నా బావున్నారు సరదాగా సాగే.. సమయంలోన మరిచిపోతే బాధ కబురు వద్దు అంటూ ఆపేదెవరు కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు పలుకే నీది.. ఓ వెన్నె పూస అలకే ఆపే మనసా మౌనం తోటి మాట్లాడే భాష.. అంటే నీకే అలుసా ఈ అలలా గట్టు.. ఆ పూల చెట్టు.. నిన్ను చల్లబడవే అంటున్నాయే ఏం జరగనట్టు నీవ్వు కరిగినట్టు.. నే కరగనంటూ చెబుతున్నాలే నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి సరసాలు చాలండి ఓ శ్రీవారు.. ఆఖరికి నెగ్గేది మీ మగవారు హాయే పంచే ఈ చల్లగాలి.. మళ్లీ మళ్లీ రాదే నీతో ఉంటే ఏ హాయికైనా.. నాకే లోటేం లేదే అదుగో ఆ మాటే.. ఆంటోంది పూటే.. సంతోషమంటే మనమేనని ఇదిగో ఈ ఆటే.. ఆడే అలవాటే మానేయవేంటో కావాలని నువ్వే.. ఉంటే చాల్లే.. మరిచిపోనా ఓనమాలే బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు గారాబం మెచ్చిందే శ్రీమతి గారు
లక్కీ భాస్కర్ పాట సాహిత్యం
చిత్రం: లక్కీ బాస్కర్ (2024) సంగీతం: జివి ప్రకాష్ కుమార్ సాహిత్యం: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి గానం: ఉషా ఉతుప్ షబాషు సోదర కాలర్ ఎత్తి తిరగర కరెన్సీ దేవి నిను వరించేరా తమాష చూడరా నీ గ్రహాలు సర సరా అదృష్టరేఖ పైనే కదిలెరా నిన్ను ఆపేవాడే లేడే నీదైన కాలం నీదే మొదలురా మొదలురా మొదలురా….. యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ శక్తి నీదిర యుక్తి నీదిర కోటి విద్యలేవైనా కూటి కోసమేలేరా లెగర నరవర మెదడుకే పదును పెట్టరా దిగర ధీవర లాకెర్లు కొల్లగొట్టరా ఎగుడుదిగుడుగా ఇన్నాళ్ల రొస్టు చాలుర బెరుకునోదలరా మారాజులాగ బతకరా మబ్బుల్లో తేలే చోర డబ్బుల్తో నాట్యం చేయరా గల గల గల గల గల గల యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ గీత దాటర రాత మార్చరా సగటు మానవా సైరా నగదు పోగు చేసేయరా మనను నమ్మిన నలుగురి మంచి కొరకెర మంచి చెడునల మనసులోనే దాచర మెతుకు పరుగులు ఈ పైన నీకు లేవురా బతుకు బరువుని దించేసి కాస్త నవ్వరా ఆర్చేది వారా వీర నీ యుద్ధం నీదేలేరా చెగువరా చెగువరా చెగువరా యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
నిజామా కలా పాట సాహిత్యం
చిత్రం: లక్కీ బాస్కర్ (2024) సంగీతం: జివి ప్రకాష్ కుమార్ సాహిత్యం: శ్రీమణి గానం: కృష్ణ తేజస్వి నిజామా కలా
No comments
Post a Comment