చిత్రం: అమరన్ (Amaran) (2024) సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ నటీనటులు: శివకార్తికేయన్, సాయి పల్లవి దర్శకత్వం: రాజ్‌కుమార్ నిర్మాత: కమల్ హాసన్ , సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ విడుదల తేది: 31.10.2024
Songs List:
హే రంగులే పాట సాహిత్యం
చిత్రం: అమరన్ (Amaran) (2024) సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ సాహిత్యం: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి గానం: అనురాగ్ కులకర్ణి , రమ్య బెహరా హే రంగులే (రంగులే) హే రంగులే (రంగులే) నీ రాకతో లోకమే రంగులై పొంగేనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే స్నేహమే మెల్లగా గీతలే దాటేనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మనవైపు రారాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చెలి చైత్రం జతగా కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా హే రంగులే (రంగులే) హే రంగులే (రంగులే) నీ రాకతో లోకమే రంగులై పొంగేనే హే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే స్నేహమే మెల్లగా గీతలే దాటేనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం
No comments
Post a Comment