చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ నటీనటులు: రంగనాథ్, కైకాల సత్యనారాయణ, గుమ్మడి దర్శకత్వం: రాజశ్రీ నిర్మాత: కె. రాఘవ విడుదల తేది: 14.02.1975
Songs List:
ఆగండి ఆగండి మన సంస్కతికే పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు & కోరస్ ఆగండి ఆగండి మన సంస్కతికే ఇది మచ్చండి
దీపానికి కిరణం ఆభరణం..పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల పల్లవి: ఉమ్.. ఊఁ.. ఆ.. ఆ.. దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం తరగని సుగుణం.. ఆభరణం దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం చరణం: 1 నిండుగ పారే యేరు.. తన నీటిని తానే తాగదు జగతిని చూపే కన్ను.. తన ఉనికిని తానే చూడదు పరుల కోసం.. బ్రతికే మనిషి.. పరుల కోసం బ్రతికే మనిషి.. తన బాగు తానే కోరడు.. తన బాగు తానే కోరడు.. దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం చరణం: 2 తాజమహలులో కురిసే వెన్నెల.. పూరి గుడిసెపై కురియదా బృందావనిలో విరిసే మల్లియ.. పేద ముంగిట విరియదా మంచితనము పంచేవారికి.. మంచితనము పంచేవారికి.. అంతరాలతో పని ఉందా.. అంతరాలతో పని ఉందా.. దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం తరగని సుగుణం.. ఆభరణం చరణం: 3 వెలుగున ఉన్నంత వరకే.. నీ నీడ తోడుగా ఉంటుంది చీకటిలో నీవు సాగితే.. అది నీకు దూరమవుతుంది ఈ పరమార్థం తెలిసిన నాడే.. ఈ పరమార్థం తెలిసిన నాడే.. బ్రతుకు సార్థకమౌతుంది.. బ్రతుకు సార్థకమౌతుంది.. దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం తరగని సుగుణం.. ఆభరణం
నేను ఎవ్వరో అడగకు పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ గానం: పి.సుశీల నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను నీ కొరకే
లవ్ ఈజ్ బ్లైండ్ పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ గానం: పి.సుశీల లవ్ ఈజ్ బ్లైండ్ ప్రేమ గుడ్డిది యూత్ ఈజ్ మాడ్
వద్దు వద్దు పెళ్ళొద్దు పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు వద్దు వద్దు పెళ్ళొద్దు నీతో నా పెళ్ళొద్దు వద్దు వద్దు
సొగసైన చిన్నది పొగ రేగుతున్నది పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు సొగసైన చిన్నది పొగ రేగుతున్నది
No comments
Post a Comment