Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Takkar (2023)
చిత్రం: టక్కర్ (2023)
సంగీతం: నివాస్ కె ప్రసన్న 
నటీనటులు: సిద్ధార్ద్ , దివ్యన్ష 
దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్ 
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ 
విడుదల తేది: 26.05.2023Songs List:పెదవులు వీడి మౌనం పాట సాహిత్యం

 
చిత్రం: టక్కర్ (2023)
సంగీతం: నివాస్ కె ప్రసన్న 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: దీపక్ బ్లూ, చిన్మయి శ్రీపాద

పెదవులు వీడి మౌనం
మధువులు కోరె వైనం
తనువులు చేసె స్నేహం, నేడే

తొలకరి రేపే తాపం
అలజడి కోరె సాయం
తపనలు తీర్చు భారం, నీదే

పదములే కరువయే
తాకుతూ మాటాడనా నీతో
దూరమే మాయమై
ఊపిరే శ్రమించెనా మాతో

ఓ ఓ ఓ హో హో హో
హో హో హో
తమకములో… తడబడగా ఆ ఆ
విడివిడిగా ఆ ఆ… ఓ సుఖమిదిగా ఆ ఆ ఆ

వానల్లే అడిగాగా ఆకాశం
వదిలేసే జాబిల్లై వచ్చావే
నన్ను వెతుకుతూనే

నే కోరే వరమేగా
నీలాగ నిజమేగా
ఈ బంధం నిలిచేగా
మనని కలుపుతూ

నా నింగే సగమై దాగే కౌగిలిలో
సరదా రాతిరిలో గోవు పూలు విరిసే

ముగిశాక వర్షం… జారే చినుకల్లే
అలిసాక దేహం… వదలలేని తనమే

దరి నీవా… నది నేనా
కలిసాకా ప్రేమ తీరమే

తమకములో ఓ ఓ ఓ
తడబడగా ఆ ఆఆ ఆ
విడివిడిగా ఆ ఆఆ ఆ
ఒక సుఖమిదిగా ఆ ఆఆ ఆ ఆ
ఊపిరే పాట సాహిత్యం

 
చిత్రం: టక్కర్ (2023)
సంగీతం: నివాస్ కె ప్రసన్న 
సాహిత్యం:  కు. కార్తిక్ 
గానం: అభయ్ జోద్పుర్కర్, సంజనా కల్మన్జీ

సొగసే మా వీధివైపు
సరదాగా సాగెనే
దిశలేమో నన్ను చూసి
కను గీటెనే

గగన నీలిమేఘం తగిలేటి వేలెనే
హృదయాన తీగ మీటెనే

జడివాన తుంపరేదో
ఎదపైన రాలెనే
తుదిలేని సంబరాన
ఎగిరేటి గుండె పట్టి ఆపెనే

ఊపిరే… ఊపిరే ఏ ఏ
ఊపిరే ఏ ఏఏ… ఊపిరే
ఆ ఆ ఆఆ ఆ ఊపిరే

అందాల ఆకాశం నీవేలే
క్షణంలో పూసిన పువ్వేలే
నీవేలే ఏ… నీవేలే నీవేలే

నిదరైనా రాక చూడు
వలనేమో వాడెలే
ఊహల్లో ముళ్ళ గాయమే
ఒడి చేరు ప్రేమకోరి
కనులేమో వేచెనే
కన్నీటి చాటు మాటునే

ఒక కన్నే గుండె ఆశ
కరిగించి పోయెనే
మౌనంతో మాటలాడ
మనసేమో కూతపెట్టి తీసెలే
ఊపిరే… ఊ ఊ ఊపిరే ఊపిరే

అందాల ఆకాశం నీవేలే
క్షణంలో పూసిన పువ్వేలే
నీవేలే ఏ… నీవేలే నీవేలేనువ్వో సగం పాట సాహిత్యం

 
చిత్రం: టక్కర్ (2023)
సంగీతం: నివాస్ కె ప్రసన్న 
సాహిత్యం: శ్రీమణి 
గానం: సంజిత్ హెగ్డే , సిద్ధార్ద్ , మాల్వి సుందరిసేన్

నువ్వో సగం నేనో సగం
అనే జగం అయ్యే సగం
మనం అనే పదం
మనం ఇక అనం

అద్దమే పగిలిందిలే
శబ్దమే వినిపించదే
యుద్ధమే జరిగిందిలే
గాయమే కనిపించదే

నిజమిదే నువ్వు నమ్మవే
ఋజువిదే ఇటు చూడవే
తియ్యని ప్రతి జ్ఞాపకం
చేదులా విరిచేసెను మనసుని

నేనన్న మాటే
నువ్వు కాదన్న చోటే
మనలో ప్రేమ పాటే
అయ్యిందే పొరపాటే

మరి నీవన్న మాటే
నే కాదన్న పూటే
మనలో ప్రేమలోటే తెలిసే

నువ్వో సగం నేనో సగం
అనే జగం అయ్యే సగం
మనం అనే పదం
మనం ఇక అనం

నువ్వో ఓ ఓ, సగం ఓఓ
నువ్వో సగం నువ్వో ఓ ఆ ఆ

నువ్వు నేను కలిపి
కన్న కలలు వేరు చేసి
కంటిపాప నీవి నీకు
తిరిగి ఇవ్వమందే

నువ్వు నేను కలిసి
పెంచుకున్న ఆశలోంచి
బైటికొచ్చే దారి ఎదో
మనసు వెతుకుతోందే

నువ్వు పక్కనున్న వేలలోన
వెన్నెలంత వాడి వాడి
పువ్వులాగా వాలిపోతోందే
నీకు నాకు మధ్య
తీపి తీపి గుర్తులున్న కాలమంతా
కళ్లలాగా మారిపోయి రాలిపోయే

తప్పటడుగులన్నీ ఒప్పులై పోయే
ప్రేమ మాటలన్నీ తప్పులై పోయే
కంటి విప్పులేని ముప్పులైపోయే
మనసులు వేరయే

తిరుగుతున్న భూమి నిమిషం ఆగే
గుండెలోని ప్రేమ విషమే తాగే
అంతు లేని చీకటంచుల్లోకే
ప్రాణం నడిచేనులే

అడుగేయొద్దే కదిలి
విడిపోవద్దే వదిలి
వదిలేయొద్దే మజిలీ

అద్దమే పగిలిందిలే
శబ్దమే వినిపించదే
యుద్ధమే జరిగిందిలే
గాయమే కనిపించదే

నిజమిదే నువ్వు నమ్మవే
ఋజువిదే ఇటు చూడవే
తియ్యని ప్రతి జ్ఞాపకం
చేదులా విరిచేసెను మనసుని

నేనన్న మాటే
నువ్వు కాదన్న చోటే
మనలో ప్రేమ పాటే
అయ్యిందే పొరపాటే, పొరపాటే

మరి నీవన్న మాటే, మాటే
నే కాదన్న పూటే
మనలో ప్రేమలోటే తెలిసే, తెలిసే

నువ్వో (నువ్వో) సగం (సగం)
నేనో (నేనో) సగం (సగం)
మరి (అనే) అనే జగం
అయ్యే (అయ్యే) సగం (సగం)
మనం అనే పదం (పదం)
మనం ఇక అనం
(మనం ఇక అనం)


No comments

Most Recent

Default