చిత్రం: మామా మశ్చీంద్ర (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ నటీనటులు: సుధీర్ బాబు, దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు నిర్మాత: బన్నీ వాస్ విడుదల తేది: 2023
Songs List:
గాలుల్లోనా కలలే వాలే పాట సాహిత్యం
చిత్రం: మామా మశ్చీంద్ర (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కపిల్ కపిలన్, నూతన్ మోహన్ గాలుల్లోనా కలలే వాలే కనురెప్పే దాటే కొత్తగా సరికొత్తగా నీలా మారే మైకంలోన కనులే తేలే అరె, నిన్నే చూసే చుట్టిలా కనికట్టులా మాయే చేరే ఏమైందో భూమే నేడిలా ఆగాగి తిరిగెలే నా కలలు పిలిచెగా నిలిచి నా ముందే ఏమైందో సాగే మేఘమే తలను నిమిరేలే నీ వలన కుదురుగా మనసు లేకుందే అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు మారే తనువే అద్దంలో నేనే వేరేలా ఉన్నా అమ్మాయో మాయో నీతో చేరే చనువే గుండెల్లోనా మోగెలే గాలుల్లోనా కలలే వాలే కనురెప్పే దాటే కొత్తగా సరికొత్తగా నీలా మారే మైకంలోన కనులే తేలే అరె, నిన్నే చూసే చుట్టిలా కనికట్టులా మాయే చేరే తెగదు కల నీదేలే నీదెలే ఈవేళే పగలు ఒకటే గొడవ ఎలా నడిపే నను నీవేలే నీవేలే నీవేలే నీకేదిష్టం అయితే నే మెచ్చేస్తా చెలియా నువ్వేసే ఓ అడుగే రమ్మంటు నన్నడిగే ఎందాకైనా వస్తా నీతో పాటే తూఫాను నీ పరుగే గల్లంతు నా గొడుగే వదలనులే నిన్నే పదా ఏమైందో భూమే నేడిలా ఆగాగి తిరిగెలే నా కలలు పిలిచెగా నిలిచి నా ముందే ఏమైందో సాగే మేఘమే తలను నిమిరేలే నీ వలన కుదురుగా మనసు లేకుందే అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు మారే తనువే అద్దంలో నేనే వేరేలా ఉన్నా అమ్మాయ్యో మాయో నీతో చేరే చనువే గుండెల్లోనా మోగెలే దీంతనా హఠాత్తుగా నా రాతలో గ్రహాలు మలుపే తిరిగే కనులు కనులు కలిసి చెలిమి పెరిగే మరుగుపడని మధురక్షణమిదే అదేమిటో నీ రాకతో లయలూగిందే ఊపిరే నీవైపే చూపే లాగే ఈ క్షణం ఇలా నీతో పాటే అలా అణువణువు మెరిసే మిలమిలా ఆకాశమే ఈ వేళే నాకోసమే ఈ నేలే తాకే తీరాలే ఆశే తీరేలా ఏమైందో భూమే నేడిలా ఆగాగి తిరిగెలే నా కలలు పిలిచెగా నిలిచి నా ముందే ఏమైందో సాగే మేఘమే తలను నిమిరేలే నీ వలన కుదురుగా మనసు లేకుందే అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు మారే తనువే అద్దంలో నేనే వేరేలా ఉన్నా అమ్మాయ్యో మాయో నీతో చేరే చనువే గుండెల్లోనా మోగెలే దీంతనా
No comments
Post a Comment