Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mem Famous (2023)




చిత్రం: మేమ్ Famous (2023)
సంగీతం: కళ్యాణ్ నాయక్ 
నటీనటులు: సుమంత్ ప్రభాస్ , మణి ఏగుర్ల, మౌర్య  చౌదరి 
దర్శకత్వం: సుమంత్ ప్రభాస్ 
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, చరత్ చంద్ర , చంద్రు మనోహరన్ 
విడుదల తేది: 26.05.2023



Songs List:



దోస్తులం పాట సాహిత్యం

 
చిత్రం: మేమ్ Famous (2023)
సంగీతం: కళ్యాణ్ నాయక్ 
సాహిత్యం: కళ్యాణ్ నాయక్ & కోటి మామిడాల 
గానం: కాల భైరవ 

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం

చిన్ననాటి నుండి
జ్ఞానపకాల తోని
కట్టుకున్న వంతెనేమైంది
ఇంతలోనే వాన తాకినట్టు
ఈ కాలం కూల్చెనా

మనకు మనకు మధ్య
దాచుకున్న మాటలంటు
లేనే లేవు ఇంతవరకు
ఇప్పుడెందుకో దాచిపెట్టె
ఈ బాధే లోతునా

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా
బాధలోను ఉంటేనే దోస్తులురా
మాది కాదు బాధనుకుంటే
స్నేహం ఉండదురా

తప్పుల్లోను నీతోనే ఉన్నామురా
గొప్పల్లోను నీతోనే ఉన్నామురా
చెప్పలేని బాధే ఉన్నా
చెయ్యే వదలమురా

నీతో ఉంటూ మాటలు రాని
మౌనం చూడకురా
మౌనం వెనకే మాటలు కలిసిన
భాదుందిరా లోపల

స్నేహంలోన కోపాలన్నీ
కరిగే మేఘాలురా
స్నేహం అంటే ఎపుడు ఉండే
ఆకాశమే కదరా

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

కళ్లలోకి కన్నీరు రాగానే
మాట కొంచం తడబడుతుండగనే
ఏమయ్యింది మామా అంటూ
అడిగె గొంతువిరా

నీతో ఉంటే నవ్వుతు ఉంటరా
నువ్వుంటేనే మనమని అంటమురా
కారణాలు దొరకవు
నువ్వు దూరం పోవాలన్నా

నీకు నాకు మధ్యలో
దూరం రావాలన్నా
వద్దు అంటూ ఆ క్షణాన్ని
ఏడుస్తు ఆపనా

గమ్యం చేరే పయనాన్నీ
స్నేహం ఆపుతుందా
నీ మంచే కోరి పొమ్మనేంత
ప్రేమే మాకు లేదు

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం




మినిమమే పాట సాహిత్యం

 
చిత్రం: మేమ్ Famous (2023)
సంగీతం: కళ్యాణ్ నాయక్ 
సాహిత్యం: కళ్యాణ్ నాయక్ & కోటి మామిడాల 
గానం: రాహుల్ సిప్లిగంజ్

ఈ ఊర్ల పోరగాల్లం ఊరకుండము
ఏదో లొల్లి జేసేదాక
మేము గమ్మునుండము
దావత్తు బారతుల్ల ఊగుతుంటము
మరి రాతిరంత డీజే పెట్టి సంపుతుంటము

పొద్దున్నే బీరు తాగి బువ్వ తింటము
పొద్దుబోయిందంటే బార్ తాన ఆగమైతము
మందికాడ మాటల్లో రెచ్చిపోతము
మరి మాట గిట్ట జారితే ఇచ్చిపోతము

మేమంతా చిల్లు రా
లైఫ్ అంతా చిల్లురా
మాతోటి వెట్టుకుంటే
గిప్ప గిప్ప గుద్దుడేరా
వద్దురా వద్దురా
మమ్మల్ని గెలకొద్దురా

మాతోటి మినిమమే మినిమమే
మినిమమే చల్
అరె క్రికెట్ లా మినిమమె
మినిమమే మినిమమే చల్

మాతోటి మినిమమే
మినిమమే మినిమమే
క్రికెట్ లా మినిమమే
మినిమమే మినిమమే

ఆటాడితే మినిమమే
మినిమమే మినిమమే
డైలాగేస్తే మినిమమే
మినిమమే మినిమమే చల్

నిద్రలేస్తే సూసేది ఖాళీ బీరు సీసే
ఇడ్లీ వడ ఏదీ లేదు
ఫస్ట్ ఫస్ట్ ఛాయే

మామ రోజు వంద పెట్రోలు
గల్లి గల్లి తిరుగుడే
అన్ని చోట్ల ఖాతాలే
జీవితంలో కట్టేద్ లే

బీరు రేటు పెరిగితే
బాధ పడుత తాగుతాం
బాధ గిట్ల పెరిగితే
రెండెక్కువ తాగుతాం

గెలికింది ఎవ్వడని
చిట్టి మొత్తం తీస్తాం
కొట్టాలనిపించినోడ్ని
దవడ పగలగొడతాం

వద్దురా వద్దురా
ఊరమాస్ గ్యాంగ్ రా
స్కెచ్చేసి పంచిస్తే
ఆగమై పోతవ్ రా
వెళ్లిపో వెళ్లిపో
మేంకొడితే ఫేమసైతవ్

డిస్టెన్స్ మినిమమే
మినిమమే మినిమమే ప్లీజ్
అరె మాతోటి మినిమమే
మినిమమే మినిమమే ప్లీజ్



అయ్యయ్యయ్యయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: మేమ్ Famous (2023)
సంగీతం: కళ్యాణ్ నాయక్ 
సాహిత్యం: కళ్యాణ్ నాయక్ & కోటి మామిడాల 
గానం: రాహుల్ సిప్లిగంజ్

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏవయ్యింది గుండెలోన
నాకు నచ్చిన నా పిల్ల
నాతోనె నడవంగ
ఆగమాయే లో లోనా

తన మాటలు చెక్కెరలా
బుక్కినట్టు మస్తుంది లో లోపల
ఎంతుండాలో అంతలా
తియ్యగుంది తన సోపతిలా
అరె రోజులేని ఓ అలజడేదో
పుట్టే గుండె లోతుల్లోన

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏవయ్యింది గుండెలోన
నాకు నచ్చిన నా పిల్ల
నాతోనె నడవంగ
ఆగమాయే లో లోనా

ఏడు రంగులు నీ నవ్వులొక్కటే
ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే
ఆ మబ్బుల వర్షం లాంటిదే
మన జంటనే

ఎప్పుడొస్తావంటూ ఎదురు చూస్తనే
ప్రతి గంటను ముందుకు తోస్తనే
ఒక్కసారి కంటి ముందు నువ్వుంటే
కాలాన్ని ఆపేస్తనే

మనసు మనసులా ఉండదే నువ్వొదిలెల్లక
బండరాయిలా బీరిపోత ప్రతి రోజలా
అరె నాకై నువ్వు నీకై నేను
పోదాం పద పై పై కలా

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏవయ్యింది గుండెలోన
నాకు నచ్చిన నా పిల్ల
నాతోనె నడవంగ
ఆగమాయే లో లోనా

ఒట్టేసి నే సెప్పలేనులే
నువ్వు ప్రాణం కన్న నాకు ఎక్కువే
నా మాటల్లోన ప్రేమనెతికితే
ఎట్ల తెలుపనే

నీ కండ్లకు కవితలు సాలవే
నీ సూపుకు వంతెన వెయ్యవే
ఇట్ల రాలిపోని కొత్త పువ్వలే
ఎట్లా పుట్టావే

ఓణీ సొగసులో పడిపోయా మాయదారి పిల్ల
ఏమందం సరస్సువే
నువ్వే నా మల్లె పూలమాల
అరె రోజు లేని ఓ అలజడేదో
పుట్టె గుండె లోతుల్లోనా

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏముందిర ముద్దుగుమ్మ
కంటి కింద కాటుకెట్టి
కన్ను కొట్టగానే
కింద మీద ఆయే జన్మ





# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

No comments

Most Recent

Default