Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Peddalu Maarali (1974)




చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర
నటీనటులు: కృష్ణ , జమున, అంజలీ దేవి, పండరీ బాయి
దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాతలు: డి. ఎల్. నారాయణ, జి. మాధవరావు
విడుదల తేది: 28.03.1974



Songs List:



మాబాబు చిరునవ్వు నవ్వాలి పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
మాబాబు చిరునవ్వు నవ్వాలి
మాఇంట చిరుజల్లు
కురవాలి
ఆడాలి హాయినిండాలి
పెరగాలి పేరు నిలపాలి

చరణం: 1
చిట్టిపాస ఆడిన ఆటలూ-తొలివూనులూ
మణిపూసలు
చిన్నారి వేసిన చిరు చిందులూ కనువిందులు
తనుపలికితే గిలిగింతలు 
అందాలు కోటి మురిపాలు

చరణం: 2
మా మదిని జూబిలి ఉదయించెనే... మురిపించెనే
మా కంటికలవలు వికసించెనే ఉదయించెనే
కలకాలమూ నగుమోముతో
మా కులదీపకాంతి వెలగాలి

చరణం: 3
నీ తల్లి ఆశలు కొనసాగును నెర వేరునూ
నీ తండ్రి కోరిక చిగురించును ఫలియించునూ
పలుచదువులు పైపదవులు
పొందాలి కలలు పండాలి





మమ్మీ టెల్ మి టెల్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి
గానం: కళ్యాణి, రమ, యస్.పి. బాలు

పల్లవి:
మమ్మీ టెల్ మి టెల్ మీ
డాడీ - ఏడి ఏడీ?
వేగుచుక్కపై - చిలక రెక్క పై
ఎగిరివస్తాడురా - డాడీ 

చరణం: 1
వెల్ కం పప్పా వెల్ కం
టాంక్యూ మైసన్ టాంక్యూ
మరి ఇన్నాళ్ళేమి చేశారు
మీ మమ్మీ జపంచేశాము
హరేరామ  హరక్రిష్ణ
మమ్మీడాడీ  డాడిమమ్మీ మమ్మీ!

చరణం: 2
వస్తూ వస్తూ ఏం తెచ్చారు
బాబుకు బొమ్మలు తెచ్చాము మా
బాబుకు బొమ్మలు తెచ్చాము 
మరి ! మమ్మీ కేమి తెచ్చారు ?
ముద్దు ముచ్చట్లు తెచ్చాము !
ఆ ముద్దులన్ని నావి 
ఆ ముచ్చట్లేమో మమ్మీవి

హరేరామ - హరిక్రిష్ణా
మమ్మీ డాడి డాడి మమ్మీ మమ్మీ!

డాడీ టెల్ మి టెల్ మీ
మమ్మీ ఏది ఏది?
వేగుచుక్కపై చిలక రెక్క పై
ఎగిరి రమ్మందిరా మమ్మీ
ని ముద్దులు లేక ! నిద్దుర రాక
నీకై వేచెను మమ్మీ ! నీమమ్మీ !
మా వెలుగైనా ! మా వరమైనా
నీవే నీవే నాన్నా




ఏమని వ్రాయను పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి. బాలు

పల్లవి:
ఏమని వ్రాయను - ఏమని వ్రాయను
ప్రతిపలుకూ విరహగీతమై
పరవశింప జేసుంటే 
ఏమనివ్రాయను - ఏమనివ్రాయము
ప్రతిపలుకూ నీ రూపమై
పలకరించి పోతుంటే

చరణం: 1
నింగీలోన తారలు ఉన్నా
నీ కనుపాపలే కనిపించగా
తోటలోన పూలెన్ని వున్నా
నీ సిగమల్లెలే కవ్వించగా

చరణం: 2
మొదటి రేయి మూగహాయి
ఎదలో ఇంకా పులకించగా
పిదప పిదప పెరిగిన మమతా
వేయింతలుగా వికసించగా

చరణం: 3
ఏ కలనైనా నీవే నీవే
నా కౌగిలిలో నిదురించగా
అన్ని వేళలా నీవే నీవే
నా కన్నులలో నివసించగా





కన్నిటిలోన రగిలింది జ్వాల పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

పల్లవి:
కన్నిటిలోన రగిలింది జ్వాల
నీలోన లోలోన మమత
నిన్నే దహియించె నమ్మా

చరణం: 1
అతి గారాబం నీ అనురాగం
వెతలకు దారి తీసిందా
ఆలూ మగలా అన్యోన్యాలే
హాలాహలమై నిండిందా

చరణం: 2
అదువు ఆజ్ఞా ఆవేశాలు
ఆరని మంటలుగా మారాయా
అభమూ శుభమూ ఎరుగనివాడు
అయ్యో ఆహుతి అయ్యాడా

చరణం: 3
కడువున కాచే కాయలు హెచ్చి
కటిక దరిద్రం పెరిగిందా
తప్పులమాటు చెప్పిన బుద్దులు
నిప్పులవానై కురిసిందా




భయం భయంగా వుందమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
భయం భయంగా వుందమ్మా
పట్టణమంతా ఎంతో ఎంతో
భయంభయంగా వుందమ్మా
నువ్వే జ్ఞాపక మొస్తావూ
మన ఇల్లే గుర్తుకు వస్తుంది
ఇల్లూ నువ్వు జ్ఞాపక మొచ్చి
ఏడువువచ్చి కన్నీరొస్తే
తుడిచేవాళ్ళే లేరమ్మా

చరణం: 1
తెలిసినవాళ్ళే లేరు
నాతో కలిసినవాళ్ళే లేరు
ఆకలివేస్తే అన్నం పెట్టి
చీకటిపడితే దుప్పటికప్పి
జో కొట్టేవాళ్ళే లేరమ్మా

చరణం: 2
నీ ఒడిలో బజ్జుంటే
ఏ బాధా లేదమ్మా
నీ పాటే వింటుంటే , ఏ దిగులూ లేదమ్మా
ఎందుకు నువ్వు కొట్టావమ్మా
ఇప్పుడు మాకు ఎలాగమ్మా



మాయదారి లోకం తీరు పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి:
మాయదారి లోకం తీరు
ఓ రయ్యో చూడు
అల్లి బుల్లి కల్ల కపటం ఓ లమ్మో చూడు
ఉన్న వాళ్ళకు అన్ని జాస్తి
లేని వాళ్ళకు సర్వం నాస్తి

చరణం: 1
నీతులు చెబుతారు  మాటలు తఖరారు
చక్కని వేషాలు చాటున మోసాలు
గొప్పవాళ్ళ గోత్రాలు చెప్పరాని చిత్రాలు

చరణం: 2
మంచికి విలువే లేదు - సై సై
వంచన కంతే లేదు
మనిషికి వెల కడతారు - సై
మనసేమో బలి చేస్తారు
రాను రాను ఈ లోకం
పోను పోను యమలోకం

చరణం: 3
చల్లని లోకంలో పిల్లలు పెరగాలి
పెద్దలు మారాలి  బుద్ధులు మారాలి
కన్న వారి ఆడుగుల్లో చిన్న వాళ్ళు నడవాలి
కన్న వారి అడుగుగ్లో చిన్న వాళ్ళు నడవాలి





అతడే నా జతగాడు పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల

పల్లవి:
అతడే నా జతగాడు
కళలు మాయని నెలరేడు
కను విందు చేసే. పూల విలుకాడు!

చరణం: 1
నెమలి అడుగులకు గతులు నేర్పేది
నీలమేఘ మొకటేలే!
రాధ మనసులో రాగాలు మీటేది
మాధవు డొకడేలే!
నను పలికించేది మై మరపించేది
నా స్వామి ఒక్కడే ఒక్కడే లే!

చరణం: 2
అతని రాక నా బ్రతుకులోన
కార్తీక చంద్రరేఖ 
ఏమే చెలీ అని నను పిలువగా విని
ఏమౌదునో మాటరాక !
క్షణమే యుగముగ  మనసే కనులుగా
వేచేను అందాక - అందాకా


1 comment

Manjula said...

ఈ సినిమాలో మొత్తం పాటలు అందించినందుకు ధన్యవాదాలు.

Most Recent

Default