Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Stand Up Rahul (2022)




చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
నటీనటులు: రాజ్ తరుణ్, వర్ష బోల్లమ్మ 
దర్శకత్వం: సంతూ మోహన్ వీరంకి 
నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
విడుదల తేది: 2022



Songs List:



అలా ఇలా పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: సత్య యామిని , స్వీకర ఆగస్తి 

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే
పెదవులపైనా మెరిసే ఈ నవ్వులే
ఇది వరకైతే ఎపుడు కనిపించలే
ఇన్నాళ్ళీ వెన్నెల్లన్నీ లోలోపలే

ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నే నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే

పని తెలియని పసితమట నాది
అది తెలిసిన పెద మనసట నీది
అనువుగ మరి జరగదు కద ఏది
అనుకువగల మగువకు తిరుగేదీ

నీ వలనే అవుతుందేమో నేనెపుడూ కోరే పని
నీ జతగా ఉండె గుండె అంటుందే ఇంతే చాలని
వందేళ్ళీ వర్ణాలన్నీ తోడుండనీ

ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నీ నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే




పదా పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: యాజిన్ నిజార్

పదా…
పదమంటోంది పసి ప్రాయం
సదా…
నిను చేరేటి ఆరాటం

ఆగే వీల్లేదు కదా
నా… కలా నిజాల మెలకువలోన
నిన్ను చూపే వేళ
పాడెలే పెదాలు కదలక పాటలే

నా అడుగులు ఉరుకులు
పరుగులు తీస్తుంటే
మైమరపులు మెరుపులు
ఎ హే హేహే హే

ఆ వలపులు తలపులు
తపనలు పెంచేస్తుంటే ఆశలే

పదా…
పదమంటోంది పసి ప్రాయం
సదా…
నిను చేరేటి ఆరాటం

బయటికి రాకున్నా
నీవేనా లోలోన
ఎదురుగ నువ్వున్న
జారేనా ఓ మాటైనా

అనుమానం లేదింకా
అనుకోని ఏదో వైఖరి
మార్చిందే ఈరోజే కధలన్నీ
సందేహం బంధించి పెంచిందే
లోలో అలజడి
వివరించే దారేదో మరీ

ఏమిటో క్షణాలు కదలక
ఆగిపోయే ఆరాదీస్తే
ఊపిరే తపించి అడిగెను నీ జతే

ఈ పలుకులు పదములు
మెలికలు వేస్తుంటే
ముందెనకలు మునకలు
ఈ చొరవలు చనువులు
కబురులు ఊపేస్తుంటే ఊగెలే



తప్పా..? పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: రఘురాం 
గానం: బెన్నీ దయాల్ 

మా ఇంటి గేటు పక్కన
ఎవడో స్పోర్ట్స్ కారు పార్కు చేస్తే
ఫోజులిచ్చి సెల్ఫీ కోసం దానికానుకుంటే
ఇంతలోనే డ్రైవరొచ్చి గేరు వేసి తొక్కితే
నా తప్పా..?

అమాయకంగా రెండు పెగ్గులేసి
సొంత స్ట్రీటు బైటే
చిన్ననాటి దోస్తు తోటి బైక్ రైడుకెల్తే
పట్టపగటి పూట డ్రంకన్ డ్రైవ్ పెట్టి
దొరికిపోతే తప్పా..?

వెకేషనే వచ్చేసినా
లొకేషనే చేంజ్ అవ్వని
పోసిషనే శపించనే
అయ్యయ్యో ఏమిటీ జిందగీ
డెస్టినీ తప్పా..?

జాలీగా బ్యాచ్ తోటి మేడ మీద
పార్టీ ప్లాన్ చేస్తే టెన్ టు ఫైవ్
డీజే పెట్టి మస్తు మస్తు స్వింగులోన ఉంటే
వేళకాని వేళలోన వర్షమొచ్చి వెక్కిరిస్తే
తప్పా..?

ఆన్లైన్ లో ఆఫర్ ఏదో చూసి
నేను టెంప్ట్ అయిపోయి
బెస్ట్ ప్రైస్ తోటి కొత్త స్మార్టు ఫోన్ కొంటే
జస్ట్ ఎ వీక్ గ్యాప్ లోనే
నెక్స్ట్ మోడల్ వస్తే నాది తప్పా..?

పిల్ల నాకు నచ్చి లవ్వు చెప్పబోతే
బెస్ట్ ఫ్రెండే వచ్చి
వాడి గర్ల్ ఫ్రెండంటే తప్పా, తప్పా..??

సెల్ ఫోన్ నుంచు పేటిఎం చేస్తూ
బిల్లు కట్టే లోపు స్విఛాప్ ఐపోతే
తప్పా, నా తప్పా..?

రెంటు కట్టలేక పెంట్ హౌస్ వదిలి
టెంటు వేసుకుంటే నా తప్పా..?
జంట అంటూ లేక మెంటలెక్కి పోయి
కంటనీరు వస్తే నా తప్పా..?

ప్రమోషనే కొట్టేసిన
ఎమోషనే చేంజ్ అవ్వని
కండిషనే వచ్చేసెనే
అయ్యయ్యో ఏమిటీ జిందగీ
ట్రాజెడీ తప్పా..?

జూమ్ కాల్ లోనా ఫేసు కాస్త చూపి
నచ్చినట్టే నాకు కింద నిక్కరేస్తే
నా తప్పా, తప్పా..?
రివ్యూలన్నీ చూసి సినిమాకి వెళ్తే
రేటింగ్ ఉన్నా గాని రొట్టలాగ ఉంటే
తప్పా, నా తప్పా..?

ఛాన్స్ వస్తే తప్పా
డాన్స్ వస్తే తప్పా
ఫాన్స్ ఉంటే తప్పా, నా తప్పా
బ్యాండ్ ఉంటె తప్పా
బ్రాండ్ ఉంటే తప్పా
డిమాండ్ ఉంటే తప్పా, నా తప్పా





షాలో కలల వ్యాలీలో పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: శ్రీమణి 
గానం: షాన్

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే నీతో
జంటవ్వాలని ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే
నీతో జంటవ్వాలని
ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా, షాలో

మౌనం పలికిందా తానె మాటలే మలిచి
ప్రాణం నిండా సంగీతం కురిసేలా
తీరం వచ్చిందా తానే వద్దకే నడిచి
నీతో అడుగేస్తే హాయిగా ఇలా

నిదురెరుగని మదిలోన
గతిచెదిరిన గమనములోన
శృతికుదిరిన సమయాన
నీతో సాగే సావాసానా

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే
నీతో జంటవ్వాలని
ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా, షాలో




ఉండి లేనట్టుండి పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: శ్రీ సాయి కిరణ్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఉండి లేనట్టుండి అందంగా
ఎదురైన బంధం నాకడ్డంగా
వెంటే వెంటే ఉండి ఏ దారి
పోయిందో అర్ధం కానట్టుందా

ఉన్నన్నాళ్ళు ఎన్నో ఆశల్ని చూపించి
సొంతం కానంటుందా
గాయాలెన్నో నిండి నీ లోకం
నీ నుండి దూరం అయినట్టుందా

సందేహంగా సాగే దారంతటా
సంతోషంగా ఉండే వీలంటూ లేదట

కలో అవునో బదులు అడుగు మనసుని
ఉందో లేదో మనసుపడిన ప్రేమ జాడనీ

పొందేనేదో పోయెనేదో తేలిందా నీకీనాడైనా
పోనీ నీలో మిగిలేదేదో తెలిసిందా కొంతైనా

ఆగేదేనా ఆలోచనా ఆపేయ్
నీ పంతంనే అంటున్నా
తీరేదేనా ఈ వేదన
దూరంగా ఉంటూ ఏ తీరం చేరినా

కలో అవునో బదులు అడుగు మనసుని
ఉందో లేదో మనసుపడిన ఆ క్షణాలనీ

No comments

Most Recent

Default