చిత్రం: సూర్యకాంతం (2019)
సంగీతం: కె. రోబిన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్
దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మానందపల్లె
నిర్మాతలు: సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ ఎరబోలు
విడుదల తేది: 29.03.2019
ఇంతేనా ఇంతేనా
ప్రేమంటే ఇంతేనా
పడినదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే
నిదురలేదు కుదురులేదు
నిమిషమైనా నాకే
కదలలేను వదలలేను
మాయా నీదేనా
మాటలైనా రానేరావు
పెదవిదాటే పైకే
పక్కనున్న వెతుకుతున్నా
నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం
నీతో సావాసం నను చేసేనా మాయం
తారలన్ని రాలిపోయే కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయే
మనసు తనువులు తాకితే
ఎదురుచూడని స్నేహమే
ఎదురువచ్చిన వేళలో
ఎవరు చూడని వైపుకే
వెతికి వచ్చిన తోడువో
గుండెలో మాట చెప్పలేకున్నా
ఆ మాయలో నేనున్నా
ఎంత చూస్తున్నా చాలలేదమ్మా
నా కళ్లలో దాగిపోవా
ఇంతేనా ఇంతేనా
ప్రేమంటే ఇంతేనా
పడినదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే
నిదురలేదు కుదురులేదు
నిమిషమైనా నాకే
కదలలేను వదలలేను
మాయా నీదేనా
మాటలైనా రానేరావు
పెదవిటదాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా
నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం
సరిపోయేనా దేహం
నీతో సావాసం
నను చేసేనా మాయం
తారలన్ని రాలిపోయే
కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయే
మనసు తనువులు తాకితే
No comments
Post a Comment