Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bangarraju (2022)



చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా
దర్శకత్వం: కె. కళ్యాణ్ కృష్ణ
నిర్మాతలు: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
విడుదల తేది: 14.01.2022



Songs List:



లడ్డుండ పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: నాగార్జున, ధనుంజయ్, మోహన భోగరాజు, నూతన మోహన్, హరిప్రియ

బాబు తబలా...
అబ్బాయ్ హార్మొనీ...
తానా న న న న
డాంటకు డ డ న

రాజు గారు
డాంటకు డ డ న అనగా ఏమి

హ హ హ హ హ
ఓరి బుడ్డోడ ఇంతకాలం తెలుసుకోకుండా ఏమి చేస్తున్నావురా? అడగాలి కదా!

డాంటకు డ డ న
బంగారు పాపలూ...

చెరుకు తోటలో చారెడు బియ్యం
వంగతోటలో మరదలి కయ్యం
లగెత్తి కొడితే  లడ్డుండ లడ్డుండ

మాటల్లోనే మల్లెల చెండు
చూపుల్లోనే కితకితలుండు
బంగార్రాజు కి జువ్విచ్చి జువ్విచ్చి

జువ్విచ్చి జువ్విచ్చి
జువ్విచ్చి జువ్విచ్చి

హో కంది సేనుకాడ డాంటకు డ డ న
కన్ను కలిపితే డాంటకు డ డ న
పంపు షెడ్డు కాడ డాంటకు డ డ న
పైట తగిలితే డాంటకు డ డ న
లడ్డుండ లడ్డుండ

జువ్విచ్చి జువ్విచ్చి
తిప్పమాకు మీసాలు వెయ్యమాకు వేషాలు
నీ నవ్వు అగరొత్తి నీ చూపు చురకత్తి
కొయ్యమాకు ఊచకోతలు
ఓ ఆయీ ఆయీ ఆయీ
రీలు రీలు రీలు రీలు
ఆహా ఇరగదీస్తున్నారు స్త్రీలు

మెరిసే బంగారు కళ్ళు
తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు

లడ్డుండ జువ్విచ్చు
లడ్డుండ జువ్విచ్చు

హే గడ్డి మేటకాడ డాంటకు డ డ న
అగ్గిరాసుకుంటే డాంటకు డ డ న
వంగ తోట కాడ డాంటకు డ డ న
దొంగచాటుగా డాంటకు డ డ న

కల్లని చూస్తే కలుపు పువ్వు
వలపులు చూస్తే పాపి కొండలు
పిల్లని చూస్తే లడ్డుండ ఇచ్చే లడ్డుండ

జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి ఇచ్చే లడ్డుండ





నా కోసం పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ
గానం: సిద్ శ్రీరామ్

కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలైందో
అంతగా నాకర్ధం కాలేదే
మెరుపులా నీ చూపేమందో
చినుకులా నాపై వాలిందో
మనసిలా నీవైపే తిరిగిందే
ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేశావు
మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావూ..

నాకోసం మారావా నువ్వూ...
లేక నన్నే మార్చేశావ నువ్వూ..

చరణం: 1
ఓ నవ్వులే చల్లావూ పంచుకో మన్నావూ
తొలకరి చిరుజల్లై నువ్వూ...
కళ్లకి దొరికావు రంగులా మెరిసావూ
నేలపై హరివిల్లా నువ్వూ..
నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా
నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మరాలన్ని మంచులాగ మార్చావో

నీకోసం మారానే నేనూ...
నిండు నూరేళ్ళు ఉండేలా నేనూ..

చరణం: 2
మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్నూ...
కన్నులే అడిగేలా చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నిన్నూ..
పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలే 
నాకే ఈవేళ నేనే నచ్చానే నీవల్ల
మోమాటాలే దూరం చేసే మాట నీకు చెప్పేలా...

నీ వెంటే ఉంటున్నా నేనూ..
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ..




వస్సివాడి తస్సాదియ్యా పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కళ్యాణ్ కృష్ణ
గానం: మోహన్ భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్ధన్ చావలి

నీకేమైంది బుజ్జీ
మూడు లేదు మాస్టారూ..
నీకేమైంది
ఏమైందంటే ఏం చెప్పమంటావ్

ఓయ్ బంగార్రాజు
నువ్వు పెల్లిచేసుకేల్లిపోతే బంగార్రాజు 
మా కింకెవ్వడు కొనిపెడతాడు కోక బ్లౌజు
నువ్వు శ్రీరాముడు వైపోతే  బంగార్రాజు
మా కింకెవ్వడు తీరుస్తాడు ముద్దు మోజు 
నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే బంగార్రాజు
మాకు కెట్టుకో బుద్దవ్వదు బొట్టు గాజు
నా చేతి గారి తిన్నప్పుడు బంగార్రాజు
పొగిడి పొగిడి చంపావు నువ్వారోజు
అరె కట్టిపూడి సంతలోన బంగార్రాజు 
నువ్వు తినిపించ మరచిపోను కొబ్బరి లౌజ్
రెండొకట్ల మూడంటావ్ బంగార్రాజు
నీ ఎక్కాలకి పడిపోయా నేనా రోజూ

వస్సివాడి వస్సివాడి 
వస్సివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా 

హా నువ్వొచ్చినప్పుడు ముద్దిచ్చి నప్పుడు
నా గుండె చప్పుడు హండ్రెడ్
నీ చీర కట్టుడు నీ నడుము తిప్పుడు
నా గుండె చడుగుడు వాట్ టు డూ

ఊరుకున్నడొక్కడు పెళ్లి అంట ఇప్పుడు
మేము ఎట్ట బతుకుడు డూ డూ డూ
పిల్ల పేరు గిల్లుడు ఇంటిపేరు దూకుడు
దీన్ని ఎట్ట ఆపుడు డూ డూ డూ

హోల హోలమ్మ హోల హోలమ్మ
ఈ పిల్లాడు నచ్చాడు మనసైన సోగ్గాడు
ముద్దొస్తు ఉన్నాడు


వస్సివాడి వస్సివాడి 
వస్సివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా


నువ్వుంటే సందడి నీ రాక గారడీ
నీ రాక కొసమే అల్లాడి
గారాల అమ్మడి నీ సోకు పుత్తడి
కల్లోకి వచ్చేస్తావు అల్లాడి

నువ్వు పెద్ద తుంటరి చూపుల్లోన పోకిరి
కల్లతోనే కాల్చుతావు తందూరి
తేనెపట్టు సోదరి పాలముంజ మాదిరి 
నిన్ను చూస్తే గుండెజారి రి రి రీ

ఈ పిల్లాడు నచ్చాడు మనసైన సోగ్గాడు
ముద్దొస్తు ఉన్నాడు

వస్సివాడి వస్సివాడి 
వస్సివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా

నువ్వు పెళ్లి చేసుకెల్లి పోయినా బంగార్రాజు
మా గుండెల్లో ఉండిపోతావ్ బంగార్రాజు
నువ్వు ఎక్కడుంటే అక్కడుండు బంగార్రాజు
నువ్వు హ్యాపీగా ఉండాలోయ్ బంగార్రాజు
ఉమ్మా... 
వస్సివాడి తస్సాదియ్యా



బంగారా బంగారా పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: మధు ప్రియ, అనూప్ రూబెన్స్

కళ్ళకి కాటుక ఎట్టుకొని
కాళ్ళకి పట్టీలు కట్టుకొని
సెవులకు కమ్మలు ఎట్టుకొని
సేతికి గాజులు ఏసుకొని

సిలుకు చీర కట్టుకొని
సెంటు గట్రా కొట్టుకొని
కొత్తగా ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడొస్తావయ్యా
నిన్ను సూడకుంటె గుండె
కొట్టుకోదయ్యా, ఆ ఆఆ

బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నువ్వంటే పడిపడి చస్తారా

బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నీ వెంటే లేచి వస్తారా

ఓ ఓ ఓఓ ఓ, చీరకు కుచ్చిళ్ళలాగా
జెడకు రిబ్బను లాగా
ఉంటావా ఉంటావా… తోడుగ ఉంటావా

ఓ, మూతికి ముడుపులాగ
నడుముకి మడతలాగ
నీతోనే ఉంటాగా… వదలనంటాగా

అంటుకు పోతావా
నా ఒంటికి అత్తరులా
సిగ్గై పోతావా నా సెంపకి
సువ్వి సువ్వాలా

నీకింకా ఇంకా ఇంకా
ఏం కావాలో చెప్పవే ఇల్లాలా
మళ్ళి మళ్ళి పుట్టేద్దామా
మొగడు పెళ్ళాల్లా, ఆ ఆఆ

ఊయ్, బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నువ్వంటే పడిపడి చస్తారా

బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నీ వెంటే లేచి వస్తారా

(బంగార్రాజు బంగార్రాజు)



ఎంత సక్కాగుందిరో పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: సాయి మాధవ్, మోహన్ భోగరాజ్, మేఘన, అపర్ణ, కావ్య  

రంగు రంగులు ఎగిసి
నింగి తాకే సంబరం
ఊరు ఊరంతా మెరిసే
అంగరంగా వైభవం

కోక కొంగు కోలాటాలు
ఆడే సరదా కృష్ణుడు
పింఛం పిల్లనగ్రోవి లేని
మా చిలిపి కృష్ణుడు

హే, రంగు ఓణీ రవ్వ గాజు
పిల్లని చూస్తే లడ్డుండా
ఎంతా సక్కాగుందిరో
ఎంత సక్కాగుందిరో

అరె కొంగు చాటు దాచుకున్న
నడుమును చూస్తే లడ్డుండా
ఎంతా సక్కాగుందిరో, యెహే
ఎంత సక్కాగుందిరో

ఆ, ఘల్లు ఘల్లు గజ్జెలు చూసి
గుండెకాయ గుంజీలు తీసే
బొంగరాల నడకలోన సక్కాగుందిరో
అరె అరె అరె అరే

ఎంతా సక్కాగుందిరో
ఎంత సక్కగుందిరో
లడ్డుండా లడ్డుండా, యెహే
లడ్డుండా, ఏ లడ్డుండా

హే, రంగు ఓణీ… రవ్వ గాజు
పిల్లని చూస్తే లడ్డుండా
ఎంతా సక్కగ సెప్పిండే
ఎంత సక్కగ సెప్పిండే

అరె బతికుండాలి ఖవ్వాలీలా
రోజు కొత్త ఉగాదిలా
కళ్ళల్లోనే దివాళిలా
ప్రతిపూటా పండుగలా

నువు పక్కన ఉంటే మహాశయా
రోజూ కృష్ణాష్టమేనయా
పొగిడావంటే అంతేనయా
సందట్లో సడేమియా

హే, పాలపిట్టకి పరికిణిలాగ
కొండవాగుకి గమకము లాగా
చందమామకి చెమికిలాగా
ఇరగేస్తుందోరి

అరె అరె అరె అరే
ఎంతా సక్కాగుందిరో
ఎంత సక్కగుందిరో
సక్కగుందే సక్కగుందే
సక్కగుందే సక్కగుందే




నువు సిగ్గుపడితే… పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: చిత్ర, రమ్యా బెహ్రా , సాయి చరణ్ 

నువు సిగ్గుపడితే… నువు సిగ్గుపడితే
నువు సిగ్గుపడితే బాగుంటావే
ఓ సత్యభామ సిగ్గుల సింగారముంటాదే

వద్దన్నా కొద్ది ముద్దొస్తావే
నా ఎన్నెలమ్మ
కారంగా చూస్తూనే
గారం చేస్తావే

నువ్వు మాటలతో పడగొడతావే
ఓ బంగార్రాజు నవ్వులతో సెగపెడతావే
నీ సూపులతో చుట్టేస్తవే… నా రంగుల రాజు
సూదంటు రాయల్లే లాగేస్తావే

మళ్ళీ పుట్టానా అనిపిస్తుందే
ప్రాణం నా నువ్వు నను చేరితే

ఓ ఓ ఓఓ, నువ్వు నేనొకటేగా… ఏడున్నా
నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా
నువ్వు నేనొకటేగా ఏడున్నా
నువు నా సొంతమెగా ఏ లోకంలో ఉన్నా

యాలె యాలె యాలెయాలె యాలే యాలే
యాలె యాలె యాలెయాలె యాలే యాలే

హోయ్ సుందరుడా సుందరుడా
మీసమున్న సెందురుడా
అందమైన ఆశపెట్టే నరుడా, హొయ్

ఊరువాడ పిట్టగోడ దూకినోడ్నే నేనాడా
కాసుకుంటానంటే పందెం ఈడా

అరె అరె అరె, చెఱుకుగడ పెరుగువడ
జున్ను పాల మీగడ
మాటల్లోనే చూపించావే గురుడా

హో, పూల జడ ఒంపు మెడ
హత్తుకున్న పావడా
ఎక్కి తొక్కుతున్నాయే గుండె కాడ

పొద్దూమాపంటూ ఏం లేదురా
స్వర్గమంటే ప్రతీ పూట
నీతోటే మా ఆటలే

ఓ ఓ ఓఓ, నువ్వు నేనొకటేగా… ఏడున్నా
నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా
నువ్వు నేనొకటేగా ఏడున్నా
నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా


Palli Balakrishna Thursday, January 13, 2022
Hero (2022)



చిత్రం: హీరో (2022)
సంగీతం: గీబ్రన్
నటినటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్
దర్శకత్వం: టి.శ్రీరాం ఆదిత్య 
నిర్మాత: పద్మావతి గల్లా 
విడుదల తేది:  15.01.2021



Songs List:



అచ్చ తెలుగందమే పాట సాహిత్యం

 
చిత్రం: హీరో (2021)
సంగీతం: గీబ్రన్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సిద్ శ్రీరాం, నమిత బాబు, అనుదీప్ దేవ్ 

నింగిలో తారక నేలపై వాలెనే
కన్నుల పండగై కాలమే ఆగెనే
ప్రేమనే బాణమే నన్నిలా తాకెనే
నేననే ప్రాణమే నువ్వుగా మారెనే

బుజ్జి గుండె వెండితెర నిన్ను చూసి
మెచ్చుకుంది కోరుకున్న హీరోయిన్ నువ్వనీ
డ్రీంల్యాండు థియేటరే నిన్ను బొమ్మ గీసుకుంది
రెప్పమూయకుండా రోజు చూసుకోవాలని

అచ్చ తెలుగందమే… నీలా కలిసే
అంబరాలనందెనే… నాలో మనసే
గాలిలో పతంగమై… వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే… నీతో జతకలిసే

యు ఆర్ మై లవ్… ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్… మేరీ జాన్ (4)

ఇప్పటివరకు ఇలా
మనసు తన చప్పుడు తను వినలేదుగా
నిన్నటి వరకు కల
అసలు తన రంగును కనలేదు కధగా

గుర్తుకురాదసలే… ఏ రోజు ఏ వారం
తిరుగుట మానినదే… నా గది గడియారం

ఇన్నినాళ్ళ ఒక్క నేను… ఇద్దరల్లే మారినాను
తట్టి లేపినవే నాలో ప్రేమనీ
పక్కపక్క నువ్వు నేను… పండుగల్లే ఉంది సీను
అద్భుతంగా మార్చినావు… ప్రతి ఒక్క ఫ్రెముని

అచ్చ తెలుగందమే… నీలా కలిసే
అంబరాలనందెనే… నాలో మనసే
గాలిలో పతంగమై… వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే… నీతో జతకలిసే

యు ఆర్ మై లవ్… ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్… మేరీ జాన్ (4)

నెమ్మది నెమ్మదిగా దరికి నను
పిలిచిన చనువుకు పడిపోయా
దగ్గర దగ్గరగా జరిగి
నీ కౌగిలిలో జతపడిపోయా

ఎప్పుడు చెరిగినదో సిగ్గుల సరిహద్దు
చప్పున దొరికినదే చక్కర తొలిముద్దు

వేచి ఉన్న గుండెలోకి
నన్ను నేను పంపినాను
చుంబనాల సంబరాల దారిగా
నాకు నువ్వు నీకు నేను
సంతకాలు చేసినాను
నింగి నేల నీరు నిప్పు గాలి వాన సాక్షిగా

అచ్చ తెలుగందమే… నీలా కలిసే
అంబరాలనందెనే… నాలో మనసే
గాలిలో పతంగమై… వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే… నీతో జతకలిసే

యు ఆర్ మై లవ్… ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్… మేరీ జాన్ (4)




డోనాల్ డగ్గు పాట సాహిత్యం

 
చిత్రం: హీరో (2021)
సంగీతం: గీబ్రన్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సిద్ శ్రీరాం, నమిత బాబు, అనుదీప్ దేవ్ 

ఊరు వాడ చూడు ఈడ… అన్న కేము
హల్చల్ ఉంది కిర్రాకునే
పెంచామంది జిల్లా మొత్తం
ఊగుతోంది గల్లా ఎత్తి

స్టెప్పు లేంది పడి పడి పడి
ఇచ్చి పడెయ్, వీడే ఊర మాస్సు
అడుగడుగున దంచికొట్టేయ్
అందరి కన్నా ఖాస్సు

గలగలమని గోల పెట్టెయ్
స్టైలు ఫస్టు క్లాస్సు
అన్నకు జర్రా గొడుగు పట్టు
ఫుల్ ఆన్ జకాస్సు

కొట్టు కొట్టు కొట్టరా… చినిగేట్టు కొట్టరా
ఎక్కేటట్టు కొట్టరా… ఇరిగేట్టు కొట్టరా

ఎవ్రీబాడీ కమాన్ సింగిట్
లెట్స్ ప్లే ద బీట్ నౌ
ఎవ్రీబాడీ కమాన్ సింగిట్
లెట్స్ ప్లే ద బీట్ నౌ

ఐ వాఁన్న డూ డూ
యు వాఁన్న డూ డూ
వి ఆల్ డూ డూ
లెట్స్ ఆల్ డూ డూ, డు వాట్

హే కౌ బాయ్ కమ్ ఏ
కౌ బాయ్ కమ్ ఏ
కౌ బాయ్ కమ్ ఏ
కమ్మే కమ్మే

హో, లిటిల్ బాయ్ కమ్మే
లిటిల్ బాయ్ కమ్మే
లిటిల్ బాయ్ కమ్మే
కమ్మే కమ్మే

స్టెప్పు చూపించిన చిరంజీవి బాస్సు
స్టైలు నేర్పించిన రజినీకాంత్ మాస్సు
సెంటీ అవ్వాలంటే వెంకీ మామ క్లాస్సు
తొడకొట్టాలంటే బాలయ్య బాబు బెస్టు

స్క్రీను మీద అట్టా
నేనొచ్చినంటే ఇట్టా
జిలేలమ్మా జిట్టా
వేస్తా బంతి పూల బుట్ట

బీటు బీటు ఏది
వచ్చేత్తది గెట్ రెడీ
బీటు బీటు ఏది
కొట్టు కొట్టు మరీ

కొట్టు, ఏస్కో ఏస్కో
ఏస్కో ఏస్కో… ఏస్కో ఏస్కో

డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి

ఐ వాఁన్న డూ డూ
యు వాఁన్న డూ డూ
వి ఆల్ డూ డూ
లెట్స్ ఆల్ డూ డూ, డు వాట్

హే కౌ బాయ్ కమ్ ఏ
కౌ బాయ్ కమ్ ఏ
కౌ బాయ్ కమ్ ఏ
కమ్మే కమ్మే

హో, లిటిల్ బాయ్ కమ్మే
లిటిల్ బాయ్ కమ్మే
లిటిల్ బాయ్ కమ్మే
కమ్మే కమ్మే

డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి




బుర్ర పాడవుతదే పాట సాహిత్యం

 
చిత్రం: హీరో (2022)
సంగీతం: గీబ్రన్ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ

బుర్ర పాడవుతదే
బుంగ మూతి పెట్టకే
బుర్ర పాడౌతదే
సన్నా నడుం తిప్పకే

కోపంలో నీ అందం
వెయ్యి రెట్లు పెరిగితే
నీ వెనక పడకుండా
మనసు ఎట్ల ఉంటదే

Sponsored Content
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్

బుర్ర పాడవుతదే
చుట్టూ చుట్టూ తిరిగితే
బుర్ర పాడౌతదే
ఆడ ఈడ తడిమితే

అమ్మాయి ఇలాకాలంటే
ఆర్డీఎక్స్ లాంటిదే
దగ్గరికే వచ్చారో దద్దరిల్లి పోతదే

డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్

డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్

అరెరే మిల్కీ మిల్కీ
నవ్వుల్నే కురిపించు
తెరిచే ఉంచా దిల్ మే కిటికీ

గడికి గడికి నసపెట్టి చంపొద్దు
డాడీ వచ్చి ఇస్తడు ధమ్కీ

నాజూగ్గా నడుఒంపి ఊరిస్తుంటే
చిట్టి నేనెట్టా ఉండాలే చేతులు కట్టి

ఓపిగ్గా చెప్తుంటే ఓవర్ చేస్తావేంటి
పొద్దున్నే పెగ్గేసి వచ్చావేంటి
నీకన్నా కిక్కు ఏముంటాదే నువ్వే చెప్పు
నీళ్ళే కలపక నీటే తాగిన

అరె ఏం చేసిండే
నారాయణ నారాయణ
కమాన్ అంటే కరిగిపోతానా

డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna
Shekar (2022)



చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
నటీనటులు: రాజశేఖర్ 
దర్శకత్వం: జీవిత 
నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి 
విడుదల తేది: 2022



Songs List:



లవ్ గంటె పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనూప్ రూబెన్స్ , విజయ్ ప్రకాష్, రేవంత్ 

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం

ఆ, బొట్టు పెట్టి కాటుకెట్టి
వచ్చిందమ్మా సిన్నది
బుగ్గా మీద సుక్కే పెట్టి
సిగ్గే పడుతు ఉన్నదీ

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం

అరె, నెత్తి మీద బుట్టే పెట్టి
వచ్చిందమ్మా సిన్నదీ
బుట్టలోన నన్నే పెట్టే
వన్నె సిన్నెలున్నదీ

కోలా కళ్ళతో నను చూస్తున్నది
కొంటె నవ్వుతో నమిలేస్తున్నది
ఆ నవ్వే చూసి నా ప్రాణం
జివ్వు జివ్వు మన్నది

హే, డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
డండ డండ డండ
లవ్ గంటే మోగిందంట

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
ఓకే, మరి నీ కదేంట్రా..?

చూడిదారు చుట్టుకోని
వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను
కప్పుకొని ఉన్నదీ

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
అరె , చూడిదారు చుట్టుకోని
వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను
కప్పుకొని ఉన్నదీ

మెల్లమెల్లగా అడుగేస్తున్నది
నేల వెన్నెల మడుగౌతున్నది
తన నడకే చూసి నా గుండె
ధడకు ధడకుమన్నది

హే, డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
డండ డండ డండ
లవ్ గంటే మోగిందంట

ఆహ, ఏంట్రా..! నీ కథేంటి?
చింతా పూలా, ఓ ఓ ఓ హో
చింతపూలా చీరె కట్టి
వచ్చిందమ్మ సిన్నది
సంతోషాల నగలే పెట్టి
గంతులేస్తు ఉన్నది

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
ఆ, రాణి లాగ రైకే చుట్టి
వచ్చిందమ్మా సిన్నది
రాను రాను అంటూనే
రయ్యున వచ్చేస్తున్నది

తీగ మల్లికి చెల్లెలు అన్నది
తేనె చుక్కకి అక్కను అన్నది
తన మాటే వింటూ నా మనసే
తన మాటే వింటూ నా మనసే
నా మాటే విననన్నది, ఆయ్

డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట




కిన్నెరా పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: అనంత్ శ్రీరాం 
గానం: అర్మాన్ మాలిక్ 

ఓ, సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా
సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా

చీకటి నిండా నీ కలలే
వేకువ నిండా నీ వెలుగే
నన్ను చేరెనే ఓ కిన్నెరా
నిన్ను కోరెనే నా కిన్నెరా

అన్నులా మిన్నులా అల్లిబిల్లి వెన్నెలా
నవ్వుతు నువ్వు నా వెంటరా
గల్ గలా గల్ గలా తుళ్లుతున్న మువ్వలా
గుండెలో చిందగా జంటరా, నా జంట రా

ఒక గంటనో రోజో నాకు చాలదే
ఒక జీవితం కూడా తక్కువే కాదే
అందుకే మరి ప్రాణం ఊరకుండదే
జన్మ జన్మని నీకే రాయమన్నదే
రాసి ఇస్తానే మనసారా

కిన్నెరా... ఓ కిన్నెరా
కిన్నెరా... నా కిన్నెరా

సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా
సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా

నిన్నే నిన్నే చూడందే రాదే నిద్దుర
కిన్నెరా... ఓ కిన్నెరా
నిన్నే ఉంచమంది నా రెండు కళ్ళ ముందర
కిన్నెరా... ఓ కిన్నెరా

ఏమౌతుందో ఎదరెదరా
నువ్వెదురైతే మతి చెదరా
ఓ కిన్నెరా… నా కిన్నెరా
నిన్నే కోరెరా… నా తోడు రా

గవ్వలా రవ్వలా రివ్వుమన్న గువ్వలా
జంటలో సంబరం చెయ్యరా
గుండెలో గంధమై... వంద ఏళ్ళ బంధమై
ఉండిపోమంది ఈ తెమ్మెరా... నా కిన్నెరా

కళ్ళ నిండుగ నిన్నే నింపుకుందునా
కంటిపాపను కాచే రెప్పనవ్వనా
నువ్వు కోరితే ప్రాణం చేతికివ్వనా
జన్మజన్మని నీకే కానుకివ్వనా
నాకు ఎవ్వరింక లోకాన

కిన్నెరా... ఓ కిన్నెరా
కిన్నెరా... నా కిన్నెరా



చిన్ని చిన్ని ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చిన్మియి శ్రీపాద, హైమత్ 

చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

నేనే తానై వీచే గాలి
పాడే జో లాలి
ఖాళీ ఖాళీ కన్నుల్లోనా
కలలా దీవాళీ

చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

పచ్చని గూడు… వెచ్చని తోడు
పొద్దు పొడిచాడు… కొత్త సూరీడు
నిండు నట్టింట… ముద్దు బంగారు
ఎంత బాగుందో… జీవితం నేడు

ఇంతే ఇంతే చాలు… ఇల్లా ఉంటె చాలు
నా చేయి పట్టినాయి చిట్టి వేళ్ళు
నిన్న మొన్న లేనే లేని… ఆహ స్వరాలూ
ఏరి కోరి నన్నే చేరే… ఎన్నో వరాలు

చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

పసిడి పాదాల… మువ్వనై నేనే
ఘల్లు మంటోంది… నా గుండె సడులే
పరికిణి అంచు… పరవళ్లలోనే
పరవసించేటి నాన్ననయ్యాలే

ఏదో లేదే అన్న చేదు బాధ అన్ని
మరిపించి మురిపిస్తుంది ఈ ప్రపంచం
రంగు రంగు జతగా చేర్చి… గీసా రంగోలి
రోజు పూసే రోజా పువ్వై… సమయం నవ్వాలి

చిన్ని చిన్ని ప్రాణం… చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం… అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా





సత్యం శివం సుందరం పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ యేసుదాస్ ఉమా నేహా 

సత్యం శివం సుందరం
జగమే దివ్య మందిరం
ఎటుగా చూసినా నీ వెలుగేనయా
నీ వారేగా అందరం
నీ ప్రేమేగా మా బలం
ఎపుడేం జరిగిన నీ వలనేనయా

హితుడై నువ్వలా… జతగా నిలువ
కలత నలత… ధరి రాగలవా
ప్రతి మలుపు మార్పు… నీ వలనే దేవా

నీ కను చూపే వసంతం
నీ కరునేగా సమస్తం
నింగి నేల దిగంతం
దేవా నీ దయ అనంతం

ఎన్ని జన్మాల… వరమో ఏమో గాని
నాన్నావయ్యావు నాకు
ఎంత దూరాన… కొలువై ఉన్నాగాని
ఊతమిస్తావు ఎదకూ

అంతులేని నీ ప్రేమే… పండు వెన్నెల
అంతరాయమే లేని పండుగై ఇలా
కాలమంతా నువ్వు నన్ను… చూస్తుంటే చాలు

నీ కను చూపే వసంతం
నీ కరునేగా సమస్తం
నింగి నేల దిగంతం
దేవా నీ దయ అనంతం

శిధిలాలన్నీ చేర్చన
శిల్పంలాగ మార్చనా
మరల కొత్తగా మొదలై సాగనా

ఎదలో దిగులు తుంచన
కాలం రంగు మార్చనా
నడిచే దారిలో… నవ్వులు పెంచనా

నిన్న మొన్న… నిశిలో ఉన్న
ఇకపై నీతో అడుగేస్తున్న
బ్రతికే బలమై… నను నడిపించవయా

నీ కను చూపే వసంతం
నీ కరునేగా సమస్తం
నింగి నేల దిగంతం
దేవా నీ దయ అనంతం

Palli Balakrishna Sunday, January 9, 2022
Super Machi (2022)



Movie Details



Songs List:



చూసానే చూసానే పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మచ్చి (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రీటా

చూసానే చూసానే కోరుకున్న పిల్లగాడు తానే
చూసానే చూసానే చూడగానే నేలపైన లేనే
వేచి వేచి చూసే కనులు మాని ఇంకా వేరే పనులు
రెప్పదాటి వచ్చే కలలు  చెప్పలేని హాయే అసలు
నా కన్నులే నవ్వాలిలే కన్నీరు కారేంతలా

ఆగిపోయెనే మనసు చిన్ని గుండెకేం తెలుసు
జ్ఞాపకాలదే గొలుసు తీరనివ్వాలి నా కోరిక
ఆగిపోయెనే మనసు చిన్ని గుండెకేం తెలుసు
జ్ఞాపకాలదే గొలుసు తీరనివ్వాలి నా కోరిక

చూసానే చూసానే కోరుకున్న పిల్లగాడు తానే
చూసానే చూసానే చూడగానే నేలపైన లేనే
చూసానే... చూసానే...చూసానే...

కళ్ళు రెండు వాలిపోయెనే చూశాక నిన్ను నేనే
గుండె చప్పుడాగిపోయెనే ఆ నిమిషం ఆగలేకే
నీ కోసమే వచ్చానుగా నా ప్రేమ తెచ్చానురా
నిన్నింతగా మెచ్చానురా నాలోనే దాచానురా
నా కన్నులే నవ్వాలిలే కన్నీరు కారేంతలా

ఆగిపోయెనే మనసు చిన్ని గుండెకేం తెలుసు
జ్ఞాపకాలదే గొలుసు తీరనివ్వాలి నా కోరిక
ఆగిపోయెనే మనసు చిన్ని గుండెకేం తెలుసు
జ్ఞాపకాలదే గొలుసు తీరనివ్వాలి నా కోరిక
చూసానే చూసానే కోరుకున్న పిల్లగాడు తానే
చూసానే చూసానే చూడగానే నేలపైన లేనే
చూసానే... చూసానే... చూసానే...





# పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మచ్చి (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: వేణు శ్రీరంగం , గీతా మాధురి 

అందాల రాక్షసిలా నన్ను దోచే పిల్లా చాలే
ముక్కు మీద కోపమున్నా ముద్దుముద్దుగుంటే చాలే
అందాల రాక్షసిలా అందమోటి ఉంటే చాలే
కొంటె కొంటె చేతలున్నా తట్టుకుంటాలే
మీనమ్మా తెచ్చే భారం నీదే చూడమ్మా
మీనమ్మా నచ్చేలాగా నువ్వే చూడమ్మా

అందునా అందాల కొమ్మ… నన్నలా మెచ్చాలోయమ్మా
అందులో రాజీ కానమ్మా… అందుకే నమ్మానోయమ్మా
చక్కని చుక్కే తేవమ్మా… చల్లగా ధీవించేయమ్మా, ఆ ఆఆ

నిన్నమొన్న లేదే అసలు… నిజమై వచ్చే నావే కలలు
దగ్గరికొస్తే ఏదో గుబులు… గుండెల్లోనే ఎగిసే అలలు
నేనా నేనా నాతో ఉండి లేనా
నీతో చేరే అయినా అయినా ఉంటే బాగుండేనా, నేనా నే నే

మీనమ్మా తప్పే నాది మన్నించేయమ్మా, ఆ ఆఆ ఆ
మీనమ్మా మనసుకన్నా అందం లేదమ్మా… ఆ ఆఆ
నీడకేం రంగుందోయమ్మ… తోడునే వీడేపోదమ్మా
రూపమే ముఖ్యం కాదమ్మా… ఆ ఆ ఆఆ
కంటికే దూరం ఉంచమ్మ… గుండెలో దాస్తా ఆ బొమ్మ
గుట్టుగా ప్రేమిస్తానమ్మా… ఆ ఆఆ



హే డించకు డించకు పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మచ్చి (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాకేత్ కొమందూరి

హే డించకు డించకు దంచింగు
డీజే వాల పంచింగు
దిమ్మ తిరిగి కట్టయ్యింది
ధీమాకు వైరింగు

సూపరు డూపరు సెట్టింగు
సౌండ్ లైట్ ఫిట్టింగు
ఈ పబ్ దెబ్బకు ఒంట్లో జోషు
వంద రెట్లు పంపింగో

అబ్బో ఇది అంబియెన్స్
పిచ్చ మైండ్ బ్లోయింగో
అటు ఇటు డ్రింక్స్ గర్ల్స్
కన్నుగొట్టి కాలింగు

1 2 3 అంటాందే
ఈ డాన్స్ కా ఫ్లోరింగు
తగ్గనంటూ దూకుతాంది
అరికాళ్లలోని స్ప్రింగు

ఐ యామ్ కమ్మింగ్ టు కుమ్మింగు
ఐ యామ్ కమ్మింగ్ టు కుమ్మింగు
ఐ యామ్ కమ్మింగ్ టు కుమ్మింగు

నీలో ఏదో మ్యాజిక్కుంది
నాలో కూడా మ్యూజిక్కుంది
పదా మావ పన్చేసుకుందాం
పాజిటివ్ ఎనర్జీ

సోలో పాటలు థ్రిల్లేముంది
పండగ చేద్దాం పది మంది
ఏ చోటైనా ఏం చేస్తున్నా
స్మైలే మన ఎమోజి

హే బూస్టు మిల్కు బుజ్జాయిలా
ఎందుకంత ఆక్టింగు
మొనాటమీ బ్రేకైపోగా
తప్పు లేదు చీటింగు

లైఫ్ అంటే ఇంతేరా
ఫుల్ పార్టీ పండగ సాంగ్
చిల్ మారో చిందులతోన
దాన్ని చేద్దాం డబుల్ స్ట్రాంగు

ఐ యామ్ కమ్మింగ్ టు కుమ్మింగు
ఐ యామ్ కమ్మింగ్ టు కుమ్మింగు
ఐ యామ్ కమ్మింగ్ కమ్మింగ్ టు కుమ్మింగు
ఐ యామ్ కమ్మింగ్ టు కుమ్మింగు

Palli Balakrishna
1945 (2022)



చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నటీనటులు: రాణా  దగ్గుబాటి, రెజీనా కసండ్రా
దర్శకత్వం: సత్య శివ 
నిర్మాత: ఎస్.యన్.రాజరాజన్
విడుదల తేది: 07.01.2022



Songs List:



అల్లరి చేసే కల పాట సాహిత్యం

 
చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హరిచరణ్ , ప్రియా మాలి 

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

వెల్లువలాంటి ప్రాణమే
వేచి వేచి చూడాలా
నీ ఎద నేనే చేరుతా
నిన్ను ఏదోలా
అయితే అదేదో
ఈ క్షణం లోనే చేరితే పోలా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

నెమ్మదిగా నెమ్మదిగా
ముసురులా కమ్మినదే
మైకమేదో మరుపు నేర్చేలా

ఆఆ ఆ, నమ్ముదుగా నమ్మవుగా
మేమేదో రమ్మందిగా
నేను నీతో కనులు కలుపుతూ
ఆదమరిచేనా

పెదవిపైన పెదవిలా
హాయిగా పవళించగా
ఎదలలోనా కదలనే
మౌనమే తెలపాలిగా
అవధులన్నీ చెరిపివేసే
ప్రేమసాక్షంగా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

Palli Balakrishna
Peddalu Maarali (1974)



చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర
నటీనటులు: కృష్ణ , జమున, అంజలీ దేవి, పండరీ బాయి
దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాతలు: డి. ఎల్. నారాయణ, జి. మాధవరావు
విడుదల తేది: 28.03.1974



Songs List:



మాబాబు చిరునవ్వు నవ్వాలి పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
మాబాబు చిరునవ్వు నవ్వాలి
మాఇంట చిరుజల్లు
కురవాలి
ఆడాలి హాయినిండాలి
పెరగాలి పేరు నిలపాలి

చరణం: 1
చిట్టిపాస ఆడిన ఆటలూ-తొలివూనులూ
మణిపూసలు
చిన్నారి వేసిన చిరు చిందులూ కనువిందులు
తనుపలికితే గిలిగింతలు 
అందాలు కోటి మురిపాలు

చరణం: 2
మా మదిని జూబిలి ఉదయించెనే... మురిపించెనే
మా కంటికలవలు వికసించెనే ఉదయించెనే
కలకాలమూ నగుమోముతో
మా కులదీపకాంతి వెలగాలి

చరణం: 3
నీ తల్లి ఆశలు కొనసాగును నెర వేరునూ
నీ తండ్రి కోరిక చిగురించును ఫలియించునూ
పలుచదువులు పైపదవులు
పొందాలి కలలు పండాలి





మమ్మీ టెల్ మి టెల్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి
గానం: కళ్యాణి, రమ, యస్.పి. బాలు

పల్లవి:
మమ్మీ టెల్ మి టెల్ మీ
డాడీ - ఏడి ఏడీ?
వేగుచుక్కపై - చిలక రెక్క పై
ఎగిరివస్తాడురా - డాడీ 

చరణం: 1
వెల్ కం పప్పా వెల్ కం
టాంక్యూ మైసన్ టాంక్యూ
మరి ఇన్నాళ్ళేమి చేశారు
మీ మమ్మీ జపంచేశాము
హరేరామ  హరక్రిష్ణ
మమ్మీడాడీ  డాడిమమ్మీ మమ్మీ!

చరణం: 2
వస్తూ వస్తూ ఏం తెచ్చారు
బాబుకు బొమ్మలు తెచ్చాము మా
బాబుకు బొమ్మలు తెచ్చాము 
మరి ! మమ్మీ కేమి తెచ్చారు ?
ముద్దు ముచ్చట్లు తెచ్చాము !
ఆ ముద్దులన్ని నావి 
ఆ ముచ్చట్లేమో మమ్మీవి

హరేరామ - హరిక్రిష్ణా
మమ్మీ డాడి డాడి మమ్మీ మమ్మీ!

డాడీ టెల్ మి టెల్ మీ
మమ్మీ ఏది ఏది?
వేగుచుక్కపై చిలక రెక్క పై
ఎగిరి రమ్మందిరా మమ్మీ
ని ముద్దులు లేక ! నిద్దుర రాక
నీకై వేచెను మమ్మీ ! నీమమ్మీ !
మా వెలుగైనా ! మా వరమైనా
నీవే నీవే నాన్నా




ఏమని వ్రాయను పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి. బాలు

పల్లవి:
ఏమని వ్రాయను - ఏమని వ్రాయను
ప్రతిపలుకూ విరహగీతమై
పరవశింప జేసుంటే 
ఏమనివ్రాయను - ఏమనివ్రాయము
ప్రతిపలుకూ నీ రూపమై
పలకరించి పోతుంటే

చరణం: 1
నింగీలోన తారలు ఉన్నా
నీ కనుపాపలే కనిపించగా
తోటలోన పూలెన్ని వున్నా
నీ సిగమల్లెలే కవ్వించగా

చరణం: 2
మొదటి రేయి మూగహాయి
ఎదలో ఇంకా పులకించగా
పిదప పిదప పెరిగిన మమతా
వేయింతలుగా వికసించగా

చరణం: 3
ఏ కలనైనా నీవే నీవే
నా కౌగిలిలో నిదురించగా
అన్ని వేళలా నీవే నీవే
నా కన్నులలో నివసించగా





కన్నిటిలోన రగిలింది జ్వాల పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

పల్లవి:
కన్నిటిలోన రగిలింది జ్వాల
నీలోన లోలోన మమత
నిన్నే దహియించె నమ్మా

చరణం: 1
అతి గారాబం నీ అనురాగం
వెతలకు దారి తీసిందా
ఆలూ మగలా అన్యోన్యాలే
హాలాహలమై నిండిందా

చరణం: 2
అదువు ఆజ్ఞా ఆవేశాలు
ఆరని మంటలుగా మారాయా
అభమూ శుభమూ ఎరుగనివాడు
అయ్యో ఆహుతి అయ్యాడా

చరణం: 3
కడువున కాచే కాయలు హెచ్చి
కటిక దరిద్రం పెరిగిందా
తప్పులమాటు చెప్పిన బుద్దులు
నిప్పులవానై కురిసిందా




భయం భయంగా వుందమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
భయం భయంగా వుందమ్మా
పట్టణమంతా ఎంతో ఎంతో
భయంభయంగా వుందమ్మా
నువ్వే జ్ఞాపక మొస్తావూ
మన ఇల్లే గుర్తుకు వస్తుంది
ఇల్లూ నువ్వు జ్ఞాపక మొచ్చి
ఏడువువచ్చి కన్నీరొస్తే
తుడిచేవాళ్ళే లేరమ్మా

చరణం: 1
తెలిసినవాళ్ళే లేరు
నాతో కలిసినవాళ్ళే లేరు
ఆకలివేస్తే అన్నం పెట్టి
చీకటిపడితే దుప్పటికప్పి
జో కొట్టేవాళ్ళే లేరమ్మా

చరణం: 2
నీ ఒడిలో బజ్జుంటే
ఏ బాధా లేదమ్మా
నీ పాటే వింటుంటే , ఏ దిగులూ లేదమ్మా
ఎందుకు నువ్వు కొట్టావమ్మా
ఇప్పుడు మాకు ఎలాగమ్మా



మాయదారి లోకం తీరు పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి:
మాయదారి లోకం తీరు
ఓ రయ్యో చూడు
అల్లి బుల్లి కల్ల కపటం ఓ లమ్మో చూడు
ఉన్న వాళ్ళకు అన్ని జాస్తి
లేని వాళ్ళకు సర్వం నాస్తి

చరణం: 1
నీతులు చెబుతారు  మాటలు తఖరారు
చక్కని వేషాలు చాటున మోసాలు
గొప్పవాళ్ళ గోత్రాలు చెప్పరాని చిత్రాలు

చరణం: 2
మంచికి విలువే లేదు - సై సై
వంచన కంతే లేదు
మనిషికి వెల కడతారు - సై
మనసేమో బలి చేస్తారు
రాను రాను ఈ లోకం
పోను పోను యమలోకం

చరణం: 3
చల్లని లోకంలో పిల్లలు పెరగాలి
పెద్దలు మారాలి  బుద్ధులు మారాలి
కన్న వారి ఆడుగుల్లో చిన్న వాళ్ళు నడవాలి
కన్న వారి అడుగుగ్లో చిన్న వాళ్ళు నడవాలి





అతడే నా జతగాడు పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దలు  మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల

పల్లవి:
అతడే నా జతగాడు
కళలు మాయని నెలరేడు
కను విందు చేసే. పూల విలుకాడు!

చరణం: 1
నెమలి అడుగులకు గతులు నేర్పేది
నీలమేఘ మొకటేలే!
రాధ మనసులో రాగాలు మీటేది
మాధవు డొకడేలే!
నను పలికించేది మై మరపించేది
నా స్వామి ఒక్కడే ఒక్కడే లే!

చరణం: 2
అతని రాక నా బ్రతుకులోన
కార్తీక చంద్రరేఖ 
ఏమే చెలీ అని నను పిలువగా విని
ఏమౌదునో మాటరాక !
క్షణమే యుగముగ  మనసే కనులుగా
వేచేను అందాక - అందాకా


Palli Balakrishna Saturday, January 8, 2022
Manchi Manushulu (1974)



చిత్రం:  మంచి మనుషులు (1974)
సంగీతం:  కె.వి. మహదేవన్
నటీనటులు: శోభన్ బాబు, మంజుల 
నిర్మాత, దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్ 
విడుదల తేది: 01.10.1974



Songs List:



నీవు లేని నేను లేను పాట సాహిత్యం

 
చిత్రం:  మంచి మనుషులు (1974)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  బాలసుబ్రహ్మణ్యం, సుశీల 

ఆ హా ఆఆ ఆఆ ఆ ఆ
ఆ హా ఆఆ ఆఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆఆ… ఆహా హా ఆహా హా ఆహా హా

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు
నీవు లేని నేను లేను  నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు

తీగల్లో నువ్వూ నేనే  అల్లుకునేదీ
పువ్వుల్లో నువ్వు నేనే మురిసి విరిసేదీ (2)
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేదీ
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేదీ
తేనెకు మన ముద్దేలే తీపిని ఇచ్చేదీ, తీపిని ఇచ్చేదీ

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు

నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ
నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ
సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరమూ
జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో  
ఈ జగమే లేదు

కొండల్లే నువ్వున్నావు నాకు అండగా
మంచల్లే నువ్వున్నావూ నాకు నిండుగా, ..(2)
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా
నిన్నా నేడు రేపే లేని  ప్రేమ జంటగా, ఆ ఆ
ప్రేమ జంటగా…ఆ ఆ

నీవు లేని నేను లేను,  నేను లేక నీవు లేవు
నీవు లేని నేను లేను,  నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో  ఈ జగమే లేదు
ఆహా హా ఆహా హా ఆహా హా




నిన్ను మరచి పోవాలని పాట సాహిత్యం

 
చిత్రం : మంచి మనుషులు
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం : బాలసుబ్రహ్మణ్యం

నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా (2)

నువ్వు విడిచి వెళ్ళినా నీ రూపు చెరిగిపోలేదూ
నువ్వు మరలి రాకున్నా నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ (2)
తలుపు తెరిచి ఉంచుకొనీ తలవాకిట నిలిచున్నా
వలపు నెమరేసుకుంటూ నీ తలపులలో బ్రతికున్నా

నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా (2)

ఎందుకిలా చేశావో నీకైనా తెలుసా
నేనెందుకింకా ఉన్నానో నాకేమో తెలియదూ (2)
నేను చచ్చిపోయినా నా ఆశ చచ్చిపోదులే
నిన్ను చేరు వరకు నా కళ్ళు మూతపడవులే

నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా (2)

గుండెలోన చేశావూ ఆరిపోని గాయాన్నీ
మందుగా ఇచ్చావు మన వలపు పంట పసివాణ్ణీ (2)
ఆ లేత మనసు తల్లికోసం తల్లడిల్లుతున్నదీ
నీ తల్లి మనసు తెలియకనే దగ్గరవుతూవున్నదీ

నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా (2)




పడకు పడకు వెంట పడకు పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనుషులు
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలసుబ్రహ్మణ్యం,  సుశీల

పల్లవి:
పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా... చినవాడా...
పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా... చినవాడా...

పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే... చినదానా....
పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే... చినదానా....

చరణం: 1
లైలా...
మజ్ఞూ....మంజూ....
మేలిముసుగులో పైడిబొమ్మలా మిసమిసలాడే లైలా
నీ సొగసుకు సలాము చేస్తున్న నీ సొగసుకు సలాము చేస్తున్నా
సొగసును మించిన మగసిరితో నా మనసును దోచిన మజ్ఞూ
నీ మమతకు గులామునవుతున్న నీ మమతకు గులామునవుతున్న

పెళ్ళికూతురై.....వెళ్ళుతున్నావా...
మన ప్రేమను ఎడారి చేశావా, మన ప్రేమను ఎడారి చేశావా
పెళ్ళి తనవుకే....చేశారూ....
మన ప్రేమ మనసుకే వదిలారూ, మన ప్రేమ మనసుకే వదిలారూ
లైలా....

పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా... చినవాడా...
ఏహే.....పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే... చినదానా....

చరణం: 2
అనార్....
సలీం..
గులాబి పూలతోటలో....
ఖవ్వాలి తీపిపాటలో గులాబి పూలతోటలో ఖవ్వాలి తీపిపాటలు
సలీము లేత గుండెకు షరాబు మత్తు చూపినా....
అనార్కలీవి నువ్వు  అనార్కలీవి నువ్వు

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మొఘల్ సింహాసనానికి.. ఆ....
కసాయి శాసనానికి మొఘల్ సింహాసనానికి..
కసాయి శాసనానికి సవాల్‌గా జవాబుగా  గరీభ్నేవరించినా...
జహాపనావు నువ్వు జహాపనావు నువ్వు

సలీం....సలీం....సలీం....
అనార్........
పవిత్ర ప్రేమకు సమాధి లేదులే...
చరిత్ర మొత్తమే విషాధగాథలే...
విషాధగాథలే...

పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా... చినవాడా...
ఏహే....పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే... చినదానా...
పోపోరా... చినవాడా...
ఏహే.... పోలేనే... చినదానా....
పోపోరా... చినవాడా...




పెళ్ళయింది ప్రేమవిందుకు పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనుషులు (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలు, సుశీల 

పల్లవి:
పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
వయసు ఉరికింది సొగసు బెదిరింది
పెదవి అదిరింది పంటానొక్కింది

పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది
వయసు ఉరికింది  సొగసు బెదిరింది
పెదవి అదిరింది పంటానొక్కింది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది

చరణం: 1 
కమ్మని కల వచ్చింది  ఆ కలకొక రూపొచ్చింది
కమ్మని కల వచ్చింది  ఆ కలకొక రూపొచ్చింది
జరిగినది గురుతొచ్చింది  ఇక జరిగేది ఎదురొచ్చింది
జరిగినది గురుతొచ్చింది  ఇక జరిగేది ఎదురొచ్చింది
కళ్ళకు జత కుదిరింది కతలెన్నో చెబుతుంది
పెదవి మీద రాసుంది  చదివి చెప్పమన్నది

పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది

చరణం: 2 
కుర్రతనం కొత్త రుచులు కోరింది
రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది
కుర్రతనం కొత్త రుచులు కోరింది
రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది
గడుసుతనం కొసరిస్తా.. అసలు ఇవ్వనన్నది
ప్రతి రోజు కొసరిస్తే  అసలు మించిపోతుంది

పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది

చరణం: 3 
ఎప్పుడో నన్నిచ్చాను  ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనివి  మిగిలి ఎన్నెన్నో ఉన్నవి
ఎప్పుడో నన్నిచ్చాను  ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనివి  మిగిలి ఎన్నెన్నో ఉన్నవి

ఇపుడే తెలిసింది  ఎప్పుడేప్పుడని ఉంది
మూడుముళ్ళు వేసినది  ఏడడుగులు నడిచినది
అందుకే... ఆ విందుకే... అహహా... అహహా... అహహా... ఆ... ఆ...

పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది
వయసు ఉరికింది  సొగసు బెదిరింది
పెదవి అదిరింది  పంటానొక్కింది
పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది
ప్రేమవిందుకు వేళయింది  ప్రేమవిందుకు వేళయింది



విను నా మాట విన్నవంటే పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనుషులు (1974)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల

పల్లవి:
విను నా మాట.. విన్నావంటే...
జీవితమంతా....ఆ పూవ్వుల బాట...
విను నా మాట విన్నావంటే 
జీవితమంతా పూవ్వుల బాట

చరణం: 1
ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు
ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు
కష్టాలందూ నవ్వాలి కలకల ముందుకు సాగాలీ
కంటికి వెలుగూ ఇంటికి వెలుగూ ఆరని జ్యోతి నువ్వే నువ్వే

విను నా మాట విన్నావంటే 
జీవితమంతా పూవ్వుల బాట

చరణం: 2
బిడ్డలు ముద్దుగా పెరగాలీ పెద్దల ముచ్చట తీర్చాలీ
బిడ్డలు ముద్దుగా పెరగాలీ పెద్దల ముచ్చట తీర్చాలీ
ఆటలు హాయిగ ఆడాలి చదువులు పెద్దవి చదవాలీ
ఇంటికి పేరూ, ఊరికి పేరూ, తెచ్చేవాడివి నువ్వే నువ్వే

విను నా మాట విన్నావంటే 
జీవితమంతా పూవ్వుల బాట

చరణం: 3
తల్లీతండ్రి ఒకరైనా దైవసమానం తల్లి సుమా
తల్లీతండ్రి ఒకరైనా దైవసమానం తల్లి సుమా
దీవిస్తుంది నీ అమ్మ దేవునిలాగే కనపడక
చల్లని మనసూ, తీయని మమత, చక్కని బ్రతుకూ నీదే నీదే

ఇది నీమాట... విన్నానంటే... జీవితమంతా... పూవ్వుల బాటా
ఇది నీమాట విన్నానంటే జీవితమంతా పూవ్వుల బాటా



నీవు లేని నేను లేను (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం:  మంచి మనుషులు (1974)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  బాలసుబ్రహ్మణ్యం, సుశీల 

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు (2)

అందరిలా నాకు ఒక అమ్మ ఉందనుకున్నాను
ఏది నాన్న అమ్మ ఏదని ఎన్నోసార్లడిగాను (2)

నిన్ను సరే చూడలేదు  రూపైనా చూడలేదు 
నువ్వుంటే రాకుంటావా నన్ను చూడకుంటావా
నన్ను చూడకుంటావా...

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు

కొమ్మలేక ఎక్కడైనా పిందె పెరుగుతుందా
కాడలీక ఏనాడైనా పువ్వు నిలిచి ఉంటుందా
సృష్టి లోన జరగని వింత మనిషి చేతనౌతుందా
బిడ్డలెరుగని తల్లికైనా పేగు కదలకుంటుందా
ప్రేమ య్తేలియకుంటుందా

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు

కొండల్లే నేనున్నాను గుండె పగలక 
మంచల్లె నువ్వెల్లావు వలపు తెలియక (2)
ఎన్ని జన్మలో అనుకున్నాము ఈ కలయిక
నిన్న నేడే మాచిపొతే రేపులేదిక రేపులేదిక 

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు




హరిలో రంగ హరి పాట సాహిత్యం

 
చిత్రం:  మంచి మనుషులు (1974)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  బాలసుబ్రహ్మణ్యం, సుశీల 

పల్లవి:
శ్రీమద్రమారమణ గోవిందో...హరి
హరిలో రంగ హరీ... అమ్మాయి గారి  పని హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలో రంగ హరీ... అమ్మాయి గారి పని హరి 

శ్రీమద్రమారమణ గోవిందో...హరి
హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి 

చరణం: 1
చల్లగాలి తగిలిందంటే పిల్లదానికి రెపరెపలు (2)
పిల్ల గాలి సోకిందంటే కుర్రవాడికి గుబగుబలు (2)
గుబులు రేగిన కుర్రవాడు కూడ కూడ వస్తానంటే
గూబ మీద చెయ్యి ఒకటి గుయ్యీమంటూ మోగిందంటే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

హరిలో రంగ హరీ... అమ్మాయిగారి పని హరి

చరణం: 2
వెంటపడిన కొంటే వాణ్ణి ఇంటిదాక రానిచ్చి
తోడు వచ్చిన దొరబిడ్డా పోయి రమ్మని తలుపే మూస్తే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

తలుపు మూసిన తలుపుల్లోన తరుముకొస్తూ వాడేవుంటే (2)
తెల్లవార్లూ కలలోకొచ్చి అల్లరల్లరి చేశాడంటే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి

చరణం: 3
దోర వయసు జోరులోన కన్నుమిన్ను కానరాక
జారిజారి కాలు జారి గడుసువాడి వడిలో పడితే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

మనసు జారి పోతేగాని కాలు జారదు కన్నెపిల్ల (2)
గడసువాడది తెలుసుకోక వడిని పట్టి లొట్టలేస్తే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

హరిలో రంగ హరీ... అమ్మాయి గారి పని హరి
హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి

హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి (3)

హరి హరి హరి హరి హరి హరి హరి హరి





విను నా మాట (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనుషులు
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: బాలసుబ్రహ్మణ్యం 

పల్లవి:
విను నా మాట.. విను నా మాట
విన్నావంటే... విన్నావంటే
జీవితమంతా.... జీవితమంతా
పూవ్వుల బాట...పూవ్వుల బాట

ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు
కష్టాలందూ నవ్వాలి కలకల ముందుకు సాగాలీ
కంటికి వెలుగూ.. కంటికి వెలుగూ
ఇంటికి వెలుగూ.. ఇంటికి వెలుగూ
ఆరని జ్యోతి నువ్వే నువ్వే... నువ్వే నువ్వే..

Palli Balakrishna Thursday, January 6, 2022
Datta Putrudu (1972)



చిత్రం: దత్త పుత్రుడు (1972)
సంగీతం: టి. చలపతిరావు
నటీనటులు: నాగేశ్వర రావు, వాణిశ్రీ, రామకృష్ణ , వెన్నిరాడై నిర్మల 
దర్శకత్వం: టి.లెనిన్ బాబు 
నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి 
విడుదల తేది: 09.06.1972



Songs List:



అందానికి అందానివై పాట సాహిత్యం

 
చిత్రం: దత్త పుత్రుడు (1972)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: బాలు, సుశీల

పల్లవి: 
అందానికి అందానివై ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా... నా దానా..
అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా... నా రాజా

చరణం: 1
వలపించావు వల వేశావు నను నీలోనే దాచేసావు
వలపించావు వల వేశావు నను నీలోనే దాచేసావు
మనసు సొగసు దోచావు
మనసు సొగసు దోచావు మదిలో నన్నే నిలిపావు నిలిపావు

అందానికి అందానివై ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా... నా దానా..
అనురాగమే నీ రూపమై.. కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా... నా రాజా

చరణం: 2
నీలాకాశం నీడలలోన నిర్మల ప్రేమ వెలగాలి
నీలాకాశం నీడలలోన నిర్మల ప్రేమ వెలగాలి
వలపే విజయం పొందాలి
వలపే విజయం పొందాలి మమతల మధువే కురవాలి కురవాలి

అందానికి అందానివై ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా... నా దానా..
అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ.. నా రాజా




చక్కాని చిన్నవాడే పాట సాహిత్యం

 
చిత్రం: దత్త పుత్రుడు (1972) 
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: సినారె 
గానం: సుశీల 

పల్లవి: 
చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే 
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే 
ఎవరో... తెలుసా గారాల బావ తెలుసా 

చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే 
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే 

చరణం: 1
ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 
అత్తకొడుకని విన్నానే అయిన వాడనుకున్నానే 
ఓహో.. ఓహో..ఓ..ఓ.. 
ఓహో.. ఓహో..ఓ..ఓ.. 
వల్లమాలిన సిగ్గేసి తలుపు చాటున చూసానే 
ఏమి అందం ఏమి చందం 
ఏమి అందం ఏమి చందం.. గుండెల్లో రేగెను గుబగుబలేవో గుసగుసలేవో 

చక్కాని చిన్నవాడే హహహా చుక్కల్లో చందురూడే హహహా.. 
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే 
ఎవరో... తెలుసా.. గారాల బావ తెలుసా 

చరణం: 2
హ..హ..హ...హ..ఊఁహుహూహు.. 
ఆ..ఆ..ఆ...ఆ..ఆహహా..ఆ.. 
ఆ..ఆ..ఆ...ఆ.. 
ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 
ఆ..ఆ...ఆ...ఆ.. 
ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 
ఆహాహాహా.. ఆహాహాహా.. ఆహాహాహా..ఆ..హా..ఆ..హా 
లల్లాలలా.. లల్లాలలా.. లల్లాలలా.. లాలలా.. 

మెల్లగా.. హాయ్ 
మెల మెల్లగా.. హాయ్.. హాయ్.. హాయ్.. హాయ్ 
మెల్లగా నను చూసాడే కళ్ళతో నవ్వేసాడే 
మెత్తగా నను తాకాడే కొత్త కోరికలు లేపాడే 
ఏమి వింత ఈ గిలిగింత 
ఏమి వింత ఈ గిలిగింత రెపరెపలాడే నా ఒళ్ళంతా ఏదో పులకింత 

చక్కాని చిన్నవాడే హహహా.. చుక్కల్లో చందురూడే హహహా.. 
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే 
ఎవరో... తెలుసా.. గారాల బావ తెలుసా



గంపా నెత్తిన పెట్టి పాట సాహిత్యం

 
చిత్రం: దత్త పుత్రుడు (1972)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా

హాయ్ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

చరణం: 1
తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి
నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి.. ఆహా..
తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి
నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి

అదను చూసి నా చేయి పట్టుకుంటివి
ఆనాటి నుంచి నా మదిలో.. అల్లరి పెడుతుంటివి

గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా

ఆఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

చరణం: 2
నీ కందీరగ నడుమేమో కదులుతున్నది
దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది
నీ కందీరగ నడుమేమో కదులుతున్నది
దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది

నీ ఉంగారాల జుట్టేమో ఊగుతున్నది
దాన్ని ఒక్కసారి నిమరాలని ఉబలాటం ఉన్నది

హోయ్.. గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా

హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

చరణం: 3
పైర గాలి నా చెవిలో ఊగుతూ ఉన్నది
పైర గాలి నా చెవిలో ఊగుతున్నది
నీ పడుచుదనం రుచి ఎంతో చూడమన్నది

లగ్గమాడే రోజు దగ్గెరున్నది
మనం లగ్గమాడే రోజు దగ్గెరున్నదీ... ఈ ఈ ఈ ...
అందాకా ఈ తొందర ఎందుకులే అన్నది

హాయ్.. గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా

హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా.. హా...




మా చేను బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: దత్త పుత్రుడు (1972) 
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

మా చేను బంగారం 




మనసైన ఓ చినదాన పాట సాహిత్యం

 
చిత్రం: దత్త పుత్రుడు (1972) 
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, రమోల 

పల్లవి: 
మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా 
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా  - ఓహో.. 
మనసైన.. ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా 
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా 

ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా 
అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా 
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. 
అహహహహా.. 
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. 
అహహహహా.. 

చరణం: 1
నా గుండెలోన అందమైన గూడు ఉన్నది 
ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది  - ఆహ.. 
నా గుండెలోన అందమైన గూడు ఉన్నది 
ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది 
ఆ చోట ఉంటావా - ఆ.. 
నా మాట వింటావా - ఊఁహూఁ.. 
ఆ చోట ఉంటావా - ఆ.. 
నా మాట వింటావా..ఆ..ఆ.. నా మాట వింటావా.. 
గుణపాఠం తీర్చుకుంటావా 

మనసైన.. ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా 
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా 
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా 
అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా 
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. 
అహహహహా.. 
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. 
అహహహహా.. 

చరణం: 2
మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది
ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది 
మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది
ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది 
ఆ పానుపు అడిగింది - ఊఁ.. 
నీ రాణి ఎవరంది - ఓహో.. 
ఆ పానుపు అడిగింది నీ రాణి ఎవరంది
మన కోసం చూస్తూ ఉంది 

మనసైన.. ఓహ్ చినదాన.. ఒక మాటుంది వింటావా 
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా 
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా 
అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా 
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. 
అహహహహా.. 
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. 
అహహహహా.. 

చరణం: 3
నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి
నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి  - ఊఁ.. 
నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి
నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి 
కొంచెం చూడనిస్తావా - నో..నో.. 
పోని తాకనిస్తావా - ఆహ.. 
కొంచెం చూడనిస్తావా..ఆ..ఆ.. పోని తాకనిస్తావా
నను నీతో చేర్చుకుంటావా..ఆ.. 

మనసైన.. ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా 
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా



పిల్లోయ్ జాగర్త పాట సాహిత్యం

 
చిత్రం: దత్త పుత్రుడు (1972)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి:
పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త
పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త 
మళ్ళీ మళ్ళీ పేలితే.. చెవులు పిండి చేతికిస్తా

పిల్లోడోయ్ జాగర్త. ఒళ్ళుపొగరా ? జాగర్త
పిల్లంటె పిల్లకాదు పిడుగురోయ్
జాగర్త జాగర్త  జాగర్త
పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త

చరణం: 1 
ఆడదిలే అని వొదిలేస్తుంటే అడ్డు తగులుతున్నావా? 
నా దెబ్బ చూపమంటావా ?
ఆడదిలే అని వొదిలేస్తుంటే అడ్డు తగులుతున్నావా? 
నా దెబ్బ చూపమంటావా ?
పాపం పోనీ పసివాడంటే పైకి పైకి వస్తావా ?  
ఒక పట్టు పట్టమంటావా ?

నా గట్టు కెందుకొచ్చావ్ - నిన్ను చూసి పోదామని
అంత బాగున్నానా ? - అయ్యో చెప్పాలా? హనుమంతుడి తమ్ముడు
అడ్డం దిడ్డం మటలంటే హద్దుపద్దు మీరుతుంటే
గడ్డిమొపులా నిన్నే కట్టేస్తా మోసేస్తా  

పిల్లోయ్ జాగర్త  ఒళ్ళు కాస్తా జాగర్త
పిల్లోయ్ జాగర్త  ఒళ్ళుకాస్తా జాగర్త 
మళ్ళీ మళ్ళీ పేలితే  చెవులు పిండి చేతికిస్తా

పిల్లోడోయ్ జాగర్త ఒళ్ళుపొగరా? జాగర్త
పిల్లంటె పిల్లకాదు పిడుగురోయ్
జాగర్త  జాగర్త జాగర్త  పిల్లోయ్ జాగర్త  ఒళ్ళుకాస్తా జాగర్త

చరణం: 2 
కొమ్ములు మొలిచిన కోడెగిత్తలా  కాలుదువ్వుతున్నావా?
ముక్కు తాడు వెయ్యమన్నావా?
కొమ్ములు మొలిచిన కోడెగిత్తలా కాలుదువ్వుతున్నావా?
ముక్కు తాడు వెయ్యమన్నావా?
కూతకొచ్చిన కోడిపెట్టలా ఎగిరి కేరుతున్నావే ఏ పుంజు కోసమున్నావే
నువు పుంజువ అయితే మరి నేను పెట్టనేంటి
అబ్బో పెద్ద మొగాడివి అప్పుడే ఏం చూశావ్  ఇక ముందు చూడు
సూటిపోటి మాటలంటె గోటుగాడవనుకుంటే 
మేకపిల్లలా నిన్నే పట్టేస్తా ఎత్తేస్తా

పిల్లోడోయ్ జాగర్త ఒళ్ళుపొగరా? జాగర్త
పిల్లంటె పిల్లకాదు పిడుగురోయ్
జాగర్త జాగర్త  జాగర్త
పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త 
మళ్ళీ మళ్ళీ పేలితే చెవులు పిండి చేతికిస్తా
పిల్లోడోయ్ జాగర్త, పిల్లోయ్ జాగర్త,  పిల్లోడోయ్ జాగర్త  పిల్లోయ్ జాగర్త




గౌరమ్మ తల్లికి పాట సాహిత్యం

 
చిత్రం: దత్త పుత్రుడు (1972)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల 

గౌరమ్మ తల్లికి 


Palli Balakrishna
Veedevadandi Babu (1997)



చిత్రం: వీడెవడండి బాబు (1997)
సంగీతం: సిర్పి
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: మోహన్ బాబు, శిల్పాశెట్టి,
దర్శకత్వం: ఇ.వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: అన్నారావు
విడుదల తేది: 18.04.1997



Songs List:



రామా హై రామా పాట సాహిత్యం

 
చిత్రం: వీడెవడండి బాబు (1997)
సంగీతం: సిర్పి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, గీతా

రామా హై రామా 




చమక్ చమక్ పాట సాహిత్యం

 
చిత్రం: వీడెవడండి బాబు (1997)
సంగీతం: సిర్పి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, సుజాత మోహన్

చమక్ చమక్  



చిట్టి చిట్టి గువ్వపిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: వీడెవడండి బాబు (1997)
సంగీతం: సిర్పి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, సుజాత మోహన్

చిట్టి చిట్టి గువ్వపిల్ల 




ఐ లవ్ యు లవ్ యు అంటే పాట సాహిత్యం

 
చిత్రం: వీడెవడండి బాబు (1997)
సంగీతం: సిర్పి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో

ఐ లవ్ యు లవ్ యు అంటే



ఓ చెలీ చెలీ పాట సాహిత్యం

 
చిత్రం: వీడెవడండి బాబు (1997)
సంగీతం: సిర్పి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో

ఓ చెలీ చెలీ



ఔర లైలా ఇది హౌరా మెయిలా పాట సాహిత్యం

 
చిత్రం: వీడెవడండి బాబు (1997)
సంగీతం: సిర్పి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో

ఔర లైలా ఇది హౌరా మెయిలా
నిలబడదేరా అది అమ్మడి స్టైలా
కదిలే వెన్నెల శిల్పంలా
ఏం తిని పెంచారు  నిలువెల్లా

ఔర లైలా ఇది హౌరా మెయిలా
నిలబడదేరా అది అమ్మడి స్టైలా
కదిలే వెన్నెల శిల్పంలా
ఏం తిని పెంచారు  నిలువెల్లా

ఓహ్ ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్ ఓహ్

ఏ రంభను మించిన రబ్బరు బొమ్మ
నిను కనిపెంచిన అబ్బెవరమ్మా
బ్రహ్మను మించిన మొనగాడమ్మా
ఆ మహనీయుని చూడాలే
ఘమ్మున్న చెప్పవే నీ చిరునామా
నీ ఐయ్యేనా కాదల భామ
నేనే ఆయన కాళ్ళని కడిగి పిల్లని ఇమ్మని అడగాలే
కొంపలు ముంచాకే ఒంపుల భామ

అం అం ఓ కళ్ళను చూస్తే కాళ్లే వనికి
కాళ్ళను చూస్తే కళ్ళే తిరిగి ఏం అయిపోతాను
మత్తులు రేపే మహారాణి కొత్తగా ఉందే నీ బాణీ

ఔర లైలా ఇది హౌరా మెయిలా
నిలబడదేరా అది అమ్మడి స్టైలా
కదిలే వెన్నెల శిల్పంలా
ఏం తిని పెంచారు  నిలువెల్లా

చెక్కిలి మీద నొక్కులు చూస్తే ఎక్కువ కాదా చక్కని బాధ 
పక్కన చేరి నొక్కకపోతే పురుషుడు పుట్టుక చెడిపోదా
తిక్కలు పెంచే పిక్కలు చూస్తే టక్కుల రాధ టక్కరి సరదా 
ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే  ఉలకవు పలకవు మరియాదా

గాలిని ఐన బాగుండేదే బుల్లమ్మో
ఎప్పుడు పడితే అప్పుడు చేరి ఎక్కడ పడితే
అక్కడ వాలే వీలుండేదేమో
మక్కువ పెంచే మహారాణి 
ఎక్కువ చూపకే అందాన్ని

ఔర లైలా ఇది హౌరా మెయిలా
నిలబడదేరా అది అమ్మడి స్టైలా
కదిలే వెన్నెల శిల్పంలా
ఏం తిని పెంచారు  నిలువెల్లా

Palli Balakrishna Friday, December 31, 2021
Waiting for you (2013)



చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట , కసర్ల శ్యామ్
నటీనటులు: గాయత్రీ, అనిల్
దర్శకత్వం: సునీల్ కుమార్ రెడ్డి 
నిర్మాత: ఎక్కాలి రవీంద్ర బాబు
విడుదల తేది: 30.08.2013



Songs List:



వెయిటింగ్ ఫర్ యు పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: కసర్ల శ్యామ్
గానం: మానస ఆచార్య 

కన్నే మూయక రెప్పే వాల్చక
అలా నువ్వు నా కొరకు చూస్తావనీ
నీకై నేను వేచున్నా వస్తావనీ
నిన్నే చేరమంటోంది నా ప్రాణమే
ఎటూ తేల్చుకోలేదు నా హృదయమే

waiting for you
waiting for you
waiting for you
my love

waiting for you
waiting for you
waiting for you
my love

నీడలా నా జ్ఞాపకాలు నను వీడక నా తోడులాగ
నువ్ చేరిన ఆ రోజులా వెంటాడుతూ ఉంటే
గాలిలా నీ ఉహలేమో నను తాకుతూ నా శ్వాసలాగ
అవి మారుతు నీ పిలుపులా నను పలకరిస్తుంటే
చేరువయ్యే సమయం కోసం ఎదురు చూస్తే కదలదు కాలం

waiting for you
waiting for you
waiting for you
my love

జాడలా నీ అడుగులోన అడుగెయ్యగా నా దారిలోన
నువు చేరవా ఓ ఋతువులా
మౌనాలు వీడుతుంటే
నీడగ యదలోన తలచి వరమియ్యవా
నిలువెల్లా కరిగి నువ్వు నా జతై ఓ దేవతై
మనసార కోరుకుంటే
చీకటైన తూరుపులోన వెలుగు నింపే వేకువ కావా

waiting for you
waiting for you
waiting for you
my love





ఏకాంతం మన సొంతం పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: సింధూరి

ఏకాంతం మన సొంతం జతగా రావేలా
నాలోనా సంగీతం పలికే ఈ వేళ
ఏవొ ఏవేవో సెగలే రగిలే
నీతో ఈ నిముషం చనువే పెరిగే
ఏకాంతం మన సొంతం జతగా రావేలా

తొలితొలిగా మరి అడుగే తడబడి
అలజడులే కని తెలిపే పరిసని
లోలోని భావాలు కరిగే మది మురిసిపొతున్న వైనం
ఏకంత తీరాలు ఒకటై ఇల కలిసిపోతున్న తరుణం
నిజమా కలవరమా ఇలా గడిచే సమయం

ఏకాంతం మన సొంతం జతగా రావేలా

కనివిని ఎరుగని వరసే ఇది మరి
కలమరి వింతని నేనే ఋజువని
చిలిపి భావాలు రేగే పెనవేసుకోమంది బిడియం
ఈ హాయి తమకంలో తడిసి మైమరిచిపోతుంది పరువం
జతలో నీ జతలో జీవితమే స్వర్గం

ఏకాంతం మన సొంతం జతగా రావేలా




తలపే కోరినా పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: సురభి శ్రావణి

తలపే కోరినా కలతే తీరునా గుబులే గుండెలో మానునా
పాదం మోపినా పయనం ఆగునా
కదిలే ఈ క్షణం మారునా
కాలమా భావ్యమా జాలినే చూపుమా
కనులలో తారాడినా కలలతో పొరాడినా కలతగా నే మారినా కలనిలా

తలపే కోరినా కలతే తీరునా గుబులే గుండెలో మానునా

ఏమిటో ఈ సమయం అంతులేనీ సమరం శరములై శోధింప సరియేనా
ఎందుకో తెలియదులే గుండెలో అలజడులే తీరని భారాలే జడిలోనా
ఓపలేనీ వేదనే చేరువై
ఊరడించే చేతులే దూరమై
మూగబోతే ప్రాణమే న్యాయమా
ఒకటే జ్ఞాపకం మెదిలే ఈ క్షణం మదిలో దాగనీ సాగనీ
ఈ పొరాటమే నాలో శ్వాసగా అడుగే వేయనీ నేనిలా
గుండెలో భారమా ఇంతలో మౌనమా
చెరగని గాయలతో చెదరని దూరలతో సాగే నా పయనమే నేడిలా
ఎటులే చూసిన నిన్నే చూడనా కాలం చూపదా దారిక





ప్రాణం పురి విప్పిన వేళా పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట 
గానం: గాయత్రీ నారాయణ్

ప్రాణం పురి విప్పిన వేళా పులకింతల సీమ పరిచింది ఈ నేల
లోకం కనుసన్నలలోన శోకించే కూన నవ్వించే ఓ నేల
కలే పండే ఒడే నిండే మనసున కురిసే జడి వానే

ప్రాణం పురి విప్పిన వేళా పులకింతల సీమ పరిచింది ఈ నేల
లోకం కనుసన్నలలోన శోకించే కూన నవ్వించే ఓ నేల

ఏ రేయి పొత్తిలిలో ఏ కాంతి దాగుందో నునువెచ్చని వేకువలా సూరీడే పొడిచాడు
ఇరు మనసుల ఆ స్వేదం చిరునవ్వై కురిసింది
తొలి ప్రేమకు సాక్ష్యంగా ఓ శ్వాస మురిసింది

ప్రాణం పురి విప్పిన వేళా పులకింతల సీమ పరిచింది ఈ నేల
లోకం కనుసన్నలలోన శోకించే కూన నవ్వించే ఓ నేల

ఈ స్పర్స తాకిడిలొ ఏ ఊపిరి రుణముందో
నిశి విడిచిన స్వప్నం లా ఉదయించిన సింధూరం
తనలోని ఆ గోప్యం తనువవుతూ సారూప్యం
మరుజన్మే అనిపించే ఓ తీయని పోరాటం

ప్రాణం పురి విప్పిన వేళా పులకింతల సీమ పరిచింది ఈ నేల
లోకం కనుసన్నలలోన శోకించే కూన నవ్వించే ఓ నేల




హర్ పల్ నాతో పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: డి. సాధన
గానం: డి. సాధన

హర్ పల్ నాతో ఉంటూనే ఏంటో మాయే చేసెనే
నీ నవ్వే నాలో ఉంటునే ఏంటో వింతలు కలిగేనే
మేఘాలలో ఈ తారలే మాట్లాడెనే నాతో
వికసించే ఈ పువ్వులే అంటుంటే నాతో
మనసాగక వేగక నీకై చూస్తు ఉన్నా

waiting for you
waiting for you
waiting for you
ఓ...

oh my love i hv been crazy in you
in the nights i feel so lone
in the streets i search for you there
without u never again i give my love to u

waiting for you
waiting for you
waiting for you
i m waiting for u

తన్నావా మనసుని వెచ్చగా గిలిగింతలు పెట్టేటంతగా
అడిగాను నీ తొలి స్పర్శని ఉంటావా నాతో ఎపుడనీ
అంటుందే ఈ గాలి ఇలా
వెనువెంటే నడిచావని
వెంటాడే నీ నీడ అలా కనుమూసిన మనసుకు తోడై
మనసాగక వేగక నీకై చూస్తు ఉన్నా

waiting for you
waiting for you
waiting for you
i m waiting for u




సుందరి నీవంటి పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: హైమత్, దీప్తి పండా

సుందరి నీవంటి 




మనసిలా నెమ్మదిగా పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: సురభి శ్రావణి

మనసిలా నెమ్మదిగా 




నాలో నీ ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: గాయత్రీ నారాయణ్


నాలో నీ ప్రాణం 

Palli Balakrishna Thursday, December 30, 2021
Gandhasiri Vanamali (2021)



పాట: గంధసిరి వనమాలి (2021)
సంగీతం: SK మదీన్ 
సాహిత్యం: సదాచంద్ర
గానం: ఇంద్రావతి చౌహాన్


గంధసిరి వనమాలి పాట సాహిత్యం

 
పాట: గంధసిరి వనమాలి (2021)
సంగీతం: SK మదీన్ 
సాహిత్యం: సదాచంద్ర
గానం: ఇంద్రావతి చౌహాన్

గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ

పిండారబోసినట్టు
ఎండీ ఎన్నెల్ల జల్లు, ఊఊ ఊఊ
నిండార నిన్ను సూడ
వద్దామంటే వాళ్ళు వీళ్ళు, ఊఊ ఊ ఊ

పిండారబోసినట్టు
ఎండీ ఎన్నెల్ల జల్లు
నిండార నిన్ను సూడ
వద్దామంటే వాళ్ళు వీళ్ళు, ఊ ఊ

కాపు కాసి ఆపేస్తే రాకుంటినీ
ఓ గంధసిరి వనమాలి
బందిఖాన నన్ను జేస్తే బాధలుంటిని
ఓ గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ

గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి

సందులోకి వచ్చినావు
నన్ను మందలించి పోయినావు
సందెకాడ కల్సినావు
కొంటె సైగలేవో జేసినావు

సేను కాడ కల్సినావు
సెయ్యి సైగ జేసినావు
బాయి కాడ కల్సినావు
బంతిపూలు ఇచ్చినావు
పట్టు చీర కట్టి కొప్పులో మల్లెలెట్టి
కోరుకున్న పోరగాడా
ఆశ పడితి నిన్ను చేరా, ఆ ఆ

ఒట్టు పెట్టుకోని
ఎదురు చూస్త ఉంటిని
గంధసిరి వనమాలి
కట్టుబాటు దాటి బయట రాకుంటిని
గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ

గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి

ఆఆ ఆ ఆ, నా మనసులోన నిండి నీవు
నీ మనసు నాకు తెలిపినావు
నిన్ను మరిసి ఉండలేను
కలుసుకోగా నీవు రావా నన్ను

నాలుగురిట్ల జెయ్యకు
నన్నూ నవ్వుల పాలు
పదుగురిట్ల పందిట్ల పట్టుకో సిటికనేలు
ఒక్కపొద్దులుండి ముడుపులెన్నో గట్టి
జాగారాలు జేసినారా… జల్ది వచ్చి ఏలుకోవా

మా ఇంటి వాళ్ళతో… నువ్వు మాటలాడరా
గంధసిరి వనమాలి
జంట కట్టి సంబురాల్లో తేలుదామురా
గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలీ


Palli Balakrishna
Anademannantina Thirupathi (2019)
/>


పాట: అనాడేమైనంటిన తిరుపతి (2019)
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: లక్ష్మి
దర్శకత్వం: తిరుపతి మట్ల


అనాడేమైనంటిన తిరుపతి పాట సాహిత్యం

 
పాట: అనాడేమైనంటిన తిరుపతి (2019)
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: లక్ష్మి

త్వరలో...

Palli Balakrishna
Deerga Aayushmanbhava (2022)



చిత్రం: దీర్ఘాయుష్మాన్ భవ (2022)
సంగీతం: వినోద్ యాజమాన్య 
నటీనటులు: కార్తీక్ రాజు, మిస్తి చక్రవర్తి
దర్శకత్వం: ఎం.పూర్ణానంద
నిర్మాత: జి.ప్రతిమ 
విడుదల తేది: 2022



Songs List:



# పాట సాహిత్యం

 
Song Details



వదిలి వెళ్లిపోయే పాట సాహిత్యం

 
చిత్రం: దీర్ఘాయుష్మాన్ భవ (2022)
సంగీతం: వినోద్ యాజమాన్య 
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: కృష్ణ మానస

వదిలి వెళ్లిపోయే
నా పెదవి పైన నవ్వులే
ఆవిరైపోయే నా గుండెలోని ఆశలే

మిగిలినా నే ఒంటరై
దారి చూపదు కాలమే
కరిగినా కన్నీటినై
బదులు పలుకదు మౌనమే

అడుగడుగున సుడులు తిరిగే
పయనమే ప్రేమా
క్షణము క్షణమున మలుపు తిరిగే
కధనమే ప్రేమా

అడుగడుగున సుడులు తిరిగే
పయనమే ప్రేమా
క్షణము క్షణమున మలుపు తిరిగే
కధనమే ప్రేమా

ప్రేమా ప్రేమా… ప్రేమా ప్రేమా
ప్రేమా ఆఆ ఆ… ప్రేమా




ఓయ్ ఓయ్ ఓయ్ పాట సాహిత్యం

 
చిత్రం: దీర్ఘాయుష్మాన్ భవ (2022)
సంగీతం: వినోద్ యాజమాన్య 
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: హేమచంద్ర , రమ్యా బెహ్రా

ఓయ్ ఓయ్ ఓయ్
నువ్వెక్కడ ఉన్నావోయ్
ఓయ్ ఓయ్ ఓయ్
నువు గుర్తొస్తున్నావోయ్
(నువు గుర్తొస్తున్నావోయ్
నువు గుర్తొస్తున్నావోయ్)

ఓయ్ ఓయ్ ఓయ్
నువ్వెక్కడ ఉన్నావోయ్
ఓయ్ ఓయ్ ఓయ్
నువు గుర్తొస్తున్నావోయ్

నీ వెంటే నేనున్నా
నీతోనే వస్తున్నా
నిన్నేలే చూస్తున్నా, ఆ ఆ
తం టడానం తం టడానం
తం టడానం తం

నీ జంటే అవుతున్నా
నువు ప్రాణం అంటున్నా
నాలో దాచేస్తున్నా, ఆ ఆ
తం టడానం తం టడానం
తం టడానం తం

ఓయ్ ఓయ్ ఓయ్
నువ్వెక్కడ ఉన్నావోయ్
ఓయ్ ఓయ్ ఓయ్
నువు గుర్తొస్తున్నావోయ్

దూరమెంత ఉన్నా చేరువవుతా
మౌనమెంత ఉన్నా మాటనౌతా
బాధ ఎంత ఉన్నా హాయినౌతా
విరహమెంత ఉన్నా కౌగిలౌతా

కవ్వించి నవ్వించి
ఊరించే కలనౌతా
వరించి భరించి
తపించే ప్రేమౌతా

నీ వెంటే నేనున్నా
నీతోనే వస్తున్నా
నిన్నేలే చూస్తున్నా, ఆ ఆ
తం టడానం తం టడానం
తం టడానం తం

నీ జంటే అవుతున్నా
నువు ప్రాణం అంటున్నా
నాలో దాచేస్తున్నా, ఆ ఆ
తం టడానం తం టడానం
తం టడానం తం

ఓయ్ ఓయ్ ఓయ్
నువ్వెక్కడ ఉన్నావోయ్
ఓయ్ ఓయ్ ఓయ్
నువు గుర్తొస్తున్నావోయ్, ఒహ్హోయ్

అరె ఎండ ఎంత ఉన్నా వెన్నెలౌతా
వాన ఎంత ఉన్నా వేడినౌతా
రేయి ఎంత ఉన్నా వెలుగునౌతా
శూన్యమెంత ఉన్నా స్వర్గమౌతా

ఒట్టేసి నిజంగా… నీలోనే సగమౌతా
తలొంచి ఇష్టాంగా… నీకన్నీ నేనౌతా

నీ వెంటే నేనున్నా
నీతోనే వస్తున్నా
నిన్నేలే చూస్తున్నా, ఆ ఆ
తం టడానం తం టడానం
తం టడానం తం

నీ జంటే అవుతున్నా
నువు ప్రాణం అంటున్నా
నాలో దాచేస్తున్నా, ఆ ఆ
తం టడానం తం టడానం
తం టడానం తం

ఓయ్ ఓయ్ ఓయ్
నువ్వెక్కడ ఉన్నావోయ్
ఓయ్ ఓయ్ ఓయ్
నువు గుర్తొస్తున్నావో ఓ ఓ ఓయ్





# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Monday, December 27, 2021

Most Recent

Default