చిత్రం: విజయదశమి (2007)
సంగీతం: శ్రీకాంత దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: సుజాత మోహన్, హరీష్ రాఘవేంద్ర
నటీనటులు: కళ్యాణ్ రామ్, వేదిక
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఈదర రంగారావు
విడుదల తేది: 21.09.2007
ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో
ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
కలవై కలసి కథ మార్చావు
మెరుపై మెరిసి నను తాకావు
కుదురంటు లేకుంది మనసుకు
నిదరంటు రాకుంది ఎందుకు
అందర్నీ చూస్తున్నాను వింతగా
చుక్కల్ని లెక్కేస్తున్నా కొత్తగా
సరదాగా మొదలైన ఈ ప్రయాణం
మొత్తంగా ప్రేమాయణం
ఎటు చూస్తున్నా ఏదో లోకం
అటు నీవుంటే తెగ సంతోషం
ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
చంద్రుడు చేతికి అందెనా
మబ్బులు మాటలు నేర్చెనా
పువ్వులు పాటలు పాడెనా
కొండలు నాట్యములాడెనా
ఏ బ్రహ్మ సృష్టించాడో ప్రేమగానే
జగమంత వింతగుంది నేడు
ఎటు చూస్తున్నా అటు అద్బుతమే
మాయలు చేసే మది సంబరమే
ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో
****** ****** ******
చిత్రం: విజయ దశమి (2007)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: ఈశ్వర్ తేజ
గానం: నవీన్, వసుంధరా దాస్
పల్లవి:
అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
పంచాంగాలే పక్కనపెట్టి పరువాలనే చదివేయరా
వారం వర్జ్యం ఒడ్డుకు నెట్టి వయ్యారాలే చూసేన
నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
చరణం: 1
ఎటు అడుగులేసిన నా వెనక వచ్చేసేయ్
కుడికాలు ముందుకేసి నా ఎదకి విచ్చేసేయ్ (2)
నందమూరి సుందరాంగుడే వేడి చెయ్యి పడితే చిలక కొట్టుడే
పంచదార పాలమీగడే నాకంటపడితే వీరబాదుడే
నీతోనే వచ్చేస్తా ఏదైనా ఇచ్చేస్తా
మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
చరణం: 2
అడవి రాముడల్లె నీ అల్లరంత చూపు
అగ్గిరాముడల్లె నాలోన సెగలు రూపు (2)
సాయంత్రం పువ్వులు ఇష్టం ఇక తెల్లార్లు నువ్వే ఇష్టం
నీవల్లే ఇంతటి కష్టం నేనేలే నీ అదృష్టం
చినదాని పెదవుల్లో పుట్టింది పొడితేనె
మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
2007
,
Edara Rangarao
,
Nandamuri Kalyan Ram
,
Sai Kumar
,
Srikanth Deva
,
V. Samudra
,
Vedhika
,
Vijayadasami
Vijayadasami (2007)
Palli Balakrishna
Thursday, March 22, 2018