Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sreeleela"
Guntur Kaaram (2024)



చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
నటీనటులు: మహేష్ బాబు, శ్రీ లీల, 
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ 
నిర్మాత: యస్.రాధాకృష్ణ 
విడుదల తేది: 12.01.2024



Songs List:



దమ్ మసాలా బిరియాని పాట సాహిత్యం

 
చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సంజిత్ హెగ్డే, జ్యోతి నూరాన్

సర్రుమండుతాది బాబు గొడ్డు కారం
గిర్ర తిరుగుతాది ఈడితోటి బేరం
కరర కరర బాబు గొడ్డు కారం
గిరర గిరర ఈడితోటి బేరం

ఏ పట్టాభిపురం ఎళ్లే రోడ్డు
ఎవడినైనా అడిగి చూడు
బుర్రిపాలెం బుల్లోడంటే
తెలీనోడు ఎవడు లేడు
ఏ ఎవడు లేడు

ఏ మిల మిల మిల మెరుస్తాడు
దంచుతాడు అమ్మ తోడు
కొడితే మెదడు పనిచెయ్యక
మరిచిపోరా పిన్నుకోడు

కర్ రా అర్ర యెర్రి
హే సుర్రు హే సుర్రు
హే సుర్రు సుర్రు సుర్రు సురక ఈడు

ఎర్రనోడంట ఎర్రిస్పీడంట
సుర్రు సురక ఈడు
హైలీ ఇన్ ఫ్లేమబుల్

ఎవ్రీబడీ మేక్ వే
లీడర్ ఆన్ ద వే
ఏంట్ గాట్ నో టైం టు ప్లే

ఎదురొచ్చే గాలి
ఎగరేస్తున్న చొక్కా పై గుండి
ఎగబడి ముందరికే వెలిపోతాది
నేనెక్కిన బండి

ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి
ఏ హక్కులు ఎవడికి రాయాలి
ఎవడెవడో వేసిన బరువు
ఎందుకు ఎందుకు నే మొయ్యాలి

దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

నేనో నిశేబ్ధం అనునిత్యం
నాతో నాకే యుద్ధం
స్వార్ధం పరమార్ధం
కలగలిసిన నేనో ప్రేమ పదార్థం

ఏ పట్టు పట్టు కోమలి
ఎత్తిపట్టి రోకలి
పోటు మీన పోటు ఏసి
దమ్ముకొద్ది దంచికొట్టు దంచికొట్టు

ఏ ఏటుకొక్క కాయనీ
రోటికియ్యవే బలి
ఘాటు ఘాటు మిరపకోరు
గాల్లో నిండి ఘుమ్మనేటట్టు

ఏ పైట సెంగు దోపవే
ఆ సేతి పాటు మార్చావే
ఏ జోరు పెంచావే
గింజ నలగ దంచవే
కొత్త కారమింకా గుమ్మరించుకోవే

నా మనసే నా కిటికీ
నచ్చక పోతే మూసేస్తా
ఆ రేపటి గాయాన్ని
ఇపుడే ఆపేస్తా

నా తలరాతే రంగుల రంగోలి
దిగులైన చేస్తా దీవాళి
నా నవ్వుల కోటను నేనే
ఎందుకు ఎందుకు పడగొట్టాలి

దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని



ఓ మై బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శిల్పారావు

నా కాఫీ కప్పుల్లో
షుగర్ క్యూబు నువ్వే నువ్వే
నా కంటి రెప్పల్లో
కాటుక ముగ్గు నువ్వే నువ్వే

నా చెంపలకంటిన
చామంతి సిగ్గు నువ్వే నువ్వే
నా ఊపిరి గాలిని
పెర్ఫ్యూమల్లె చుట్టేస్తావే

ఓ మై బేబీ ఓ ఓ
నీ బుగ్గలు పిండాలి
ఓ మై బేబీ ఓ ఓ
నీకు ముద్దులు పెట్టాలి
ఓ మై బేబీ ఓ ఓ
నా చున్నీ నీకు టై కట్టాలి

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

నా వేకప్ కాల్ అయి
వెచ్చగ తాకే సూర్యుడు నువ్వేలే
నా బాల్కని గోడలు దూకే
వెన్నెల చంద్రుడు నువ్వేలే

ఏ నూటికో కోటికో
నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే
నే పుట్టిన వెంటనే
గుట్టుగా నీకు పెళ్ళాం అయ్యాలే

ఓ మై బేబీ ఓ ఓ
నీ పక్కన వాలాలి
ఓ మై బేబీ ఓ ఓ
నీతో చుక్కలు చూడాలి
ఓ మై బేబీ బేబీ బేబీ ఓ ఓ
నీ కౌగిలి ఖాళీ పూరించాలి

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

ఓ మై బేబీ ఓ ఓ
ఓ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓ
ఓ మై బేబీ ఓ ఓ
తాన నన్నా నన్నానా
హ బేబీ బేబీ ఓ
తాన నన్నా నన్నా నన్నా




ఆ కుర్చీని మడత పెట్టి పాట సాహిత్యం

 
చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి, శ్రీకృష్ణ 

రాజమండ్రి రాగమంజరి
మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రిరి
కళాకార్ల ఫ్యామిలీ మరి
మేము గజ్జ కడితే నిదరపోదు నిండు రాతిరి

సోకులాడి స్వప్న సుందరి
నీ మడతసూపు మాపటేల మల్లె పందిరి
రచ్చరాజుకుందె ఊపిరి
నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరీ

తూనీగ నడుములోన తూటాలెట్టి
తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి
మగజాతి నట్ట మడతపెట్టి

ఆ కుర్చీని మడత పెట్టి
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
కు కు కుకూ కూ కూ కూ కూ

దాని కేమో మరి దానికేమో
దానికేమో మేకలిస్తివి
మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి
మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయే
నాకిచ్చిన నూకలేమో ఒక్క పూటక్ కరిగిపాయే
కు కు కుకూ

ఆడ పచ్చరాళ్ల జూకాలిస్తివి
మరి నాకేమో చుక్క గల్ల కోకలిస్తివి
దాని చెవిలో జూకాలేమొ దగా దగా మెరిసిపాయే
నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే

ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి
ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి

ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
కు కు కుకూ కూ కూ కూ కూ

సో సో సో సోకులాడి స్వప్న సుందరి
మడత పెట్టి మడత పెట్టి
మాపటేల మల్లె పందిరి
మడత పెట్టి మడత పెట్టి

రచ్చరాజుకుందె ఊపిరి
మడత పెట్టి మడత పెట్టి
గుండెలోన డీరి డిరి డిరి

ఏందట్టా చూస్తన్నా
ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్‌ రైటర్‌
రాసుకోండి మడతెట్టి పాడేయండి

మడత పెట్టి మ మమ మ మమ
మడత పెట్టి మడత పెట్టి
మ మమ మ మమ మడత పెట్టి
మడత పెట్టి మ మమ మ మమ మడత పెట్టి
మడత పెట్టి మ మమ

ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి





మావా ఎంతైనా పర్లేదు బిల్లు పాట సాహిత్యం

 
చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కృష్ణ , రామాచారి కొమండూరి

పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని పని పని పని పని

సత్యేంద్ర గ్రాంఫోన్
ఇక్కడకు తెచ్చారేంది

పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని పని పని పని పని

మావా ఎంతైనా పర్లేదు బిల్లు
మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు
గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు
చెప్పుకోలేని బాధే డబల్లు

మారిపోయే లోకం
చెడ్డోల్లంతా ఏకం
నాజూకైన నాబోటోడికి
దినదినమొక నరకం

యాడో లేదు లోపం
నా మీదే నా కోపం
అందనన్న ఆకాశానికి
ఎంతకని ఎగబడతాం

ఎవ్వరికెవ్వరు అయినోళ్లంటూ ఉన్నగాని లేరే
ఏ వావి వరస పేరు పిలుపు అన్నీ నోటి చివరే
యహె విసిగుపుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే
ఎటు తిరిగి చూడు మనకి మనమే
వన్ అండ్ ఓన్లీ లవరే

అన్నా
సర్రా సర్రా సురం
సుర్రంటాది కారం హేయ్
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా

ఇనప సువ్వ కౌకు దెబ్బ
ఇరగదీసే రవన్న దెబ్బ ఉయ్

Palli Balakrishna Tuesday, January 16, 2024
Adikeshava (2023)



చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
నటీనటులు: వైష్ణవ్ తేజ్, శ్రీలీల 
దర్శకత్వం: శ్రీకాంత్ N. రెడ్డి 
నిర్మాత: నాగ వంశీ, సాయి సౌజన్య 
విడుదల తేది: 2023



Songs List:



సిత్తరాల సిత్రావతీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి 
గానం: రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహ్ర 

సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి

నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

అరెరెరే పిల్లా నీ అందం అదిరే నవలా
రోజు ఓ కొంచం చదివెయ్ కధలా
పక్కనువ్వుంటే పగలే వెన్నెలా
ప్రేమే మార్చిందా కవిలా నిన్నిలా

నీ పేరు పెట్టుకుని
అందాల తుఫానుని
ముంచెత్తి వెళ్ళమని
డైలీ రప్పిస్తా

కొండంత నీ ప్రేమని
ఏ చోట దాచాలనీ
ప్రపంచ బ్యాంకులనీ
లాకార్లిమ్మని అడిగేస్తా

పొద్దు పొడుపే నువ్వంటూ
నిద్దరంటూ రాదంటూ
కొన్ని కోట్లు కన్నాలే నీ కలలే

దివిలాగ నేనుంటే
అస్తమానం నా చుట్టూ
ఆ వైపు ఈ వైపు
నీ ఆలోచన్ల అలలే

నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి

నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే




హే బుజ్జి బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి 
గానం: అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల 

ఆ ఆ ఆ మగసనిస
ఆ ఆ ఆ నిసదానిస

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

నీ మౌనరాగాలే నాతో ఏమన్నా
ఇష్టాంగా వింటున్నా పరవశమౌతున్నా
ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా
నా దారి మారిందే నీ దయ వలనా

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపా

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపాపా

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

అనగనగా కథలోని
రాజకుమారి నువ్వేలే
కలివిడిగా నను కోరి
దివి దిగి వచ్చావే

కలగనని కన్నులకు
వెలుగుల దీవాళీ నువ్వే
ఎదసడిగా జతచేరి
నా విలువను పెంచావే

ఓ అమ్మాయో నీదేం మాయో
ప్రేమాకాశం అందించావే
ఆ జన్మనా నీ రోమియో
నేనేనేమో అనిపించావే

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

ఇన్నేళ్ళు ఇంతిదిగా
సందడిగా లేనే
భూమ్మీద ఉంటూనే
మెరుపులు తాకానే

నీ మనసు లోతుల్లో
నా పేరే చూసానే
లవ్ స్టోరీ రాస్తానే
మన కథనే

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపా

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపాపా

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా




లీలమ్మో లీలమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: నకాష్ అజీజ్ 

బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావా
బళ్లారి తోవల్లో బొమ్మనాదేస్తావా
సిట్టి నా గుండె మీద గుట్టుగా పాలపిట్టై
సిగ్గు సీమంతం జేస్తావా, వా వా వా

లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూత్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగులరాట్నంలాగ నీ వొళ్ళో
కూసోపెట్టి సీమంతా తిప్పుకొస్తావా, వా వా వా

లగో లగోరే లగ్గం పెట్టిస్తా
బాసింగాలు కట్టించాకా బంతులాడిస్తా
హే గజ్జల్ పట్టీల్తో హే గడప దాటేస్తా
మున్నెల్లకే మమ కచ్చా మ్యాంగో తినేస్తా

అమ్మి యమ ఉన్నావే కిరాక్కు
సోనామసూరి లాంటి నీ సోకు
రెడ్డి నీ మీసాలే కసక్కు
నేనిచ్చే చాన్సే హే ఇచ్చాయి పాసు

పొద్దు పొద్దున్నే ముద్దు ఫలహారం
మధ్యాహ్నంకే మడత నడుం నీకే గుడారం
ఏ సందే దూకిందా సైగా అలారం
కోక పుంజు కూసేదాక దుమ్ము ధుమారం

అమ్మీ నీ కులుకేమో గోకాకు
దొమ్మీ అయిపోద్దే నువ్ నవ్వాకు
రెడ్డి నువ్ సెయ్యస్తే పటాకు
హే వడ్డి ఇస్తా లెక్కే తెల్సాకు

లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూస్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగులరాట్నంలాగ నీ వొళ్ళో
కూసోపెట్టి సీమంతా తిప్పుకొస్తావా, వా వా వా

Palli Balakrishna Friday, October 27, 2023
Extra Ordinary Man (2023)



చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
నటీనటులు: నితిన్, శ్రీలీల 
దర్శకత్వం: వక్కంతం వంశీ 
నిర్మాత: యన్.సుధాకర్ రెడ్డి, నితిన్ రెడ్డి 
విడుదల తేది: 23.12.2023



Songs List:



డేంజర్ పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: అర్మాన్ మాలిక్

అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోకచిలుకవా
చీకట్లో తిరగని మిణుగురు తలుకువా
ఒక్క ముళ్ళు కూడా లేనే లేని రోజా పువ్వా
రేరు పీసే నువ్వా

కలలు కనదట.. కన్నెత్తి కనదట
కరుకు మగువట, హొయ్
నగలు బరువట… గుణమే నిధి అట
ఎగిరి పడదట, హోయ్

డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియకుండా
హార్టే మాయం చేసావెల్లా?

టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెల్లా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా

అరె నాకే నేను బోరే కొట్టే మనిషినే
ఏమైందో ఫస్టు లుక్కులోనే నీకే పడితినే
స్లీపు వాకులోన ఫాలో చేసే పొజిషనే
రేరు కేసే నేనే

హో ఓ నచ్చిందే చేస్తుంటా
అందాకా తింటా పంటా
మంతోటి కష్టం అంటా, హోయ్
టెన్షన్లు మోసే తంటా
లేదంటా ఇంటావంటా
షోమాను అంటారంతా, హోయ్

డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెల్లా

టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా, మునుపులా

ఓ ముద్దు అప్పిస్తావా
పొద్దున్నే చెల్లిస్తాలే
వడ్డీగా ఇంకొటిస్తా
పెదవులు అడిగితే

అమ్మాయి హగ్గిస్తావా
దూరాన్నే తగ్గిస్తావా
దునియానే ఏలేస్తానే
నీకు నాకు కుదిరితే

రాసేసుకుంటాలే వందేళ్లకి
కథ ఏదైనా నువ్వేలే నా నాయకి
కావ్యాలు చాలేనా నీ కళ్ళకి
కనిపించాలి వాటిల్లో నా బొమ్మ

ప్రేమ ప్రేమ… రావే ప్రేమ
ప్రాణం ఇస్తానన్నా
చాలా చిన్న మాటేనమ్మా
నీతో ఉండాలన్నా
సరిపోతుందా నాకో జన్మా

పెట్టెయ్ పేరేదైనా
పోదీ ప్రేమ నమ్మాలమ్మా
హత్తెరీ ఒంటరితనమే
అంతం చేసే హంతకీ

డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెళ్ళా

టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా
ఓహొ హో ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా



బ్రష్సే వేస్కో పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి  
గానం: సంజిత్ హెగ్డే

ఎట్టా చూస్తావ్ ఎగ్గులోని
చికెన్ చికెను
ఫట్టా ఫట్టని ఎట్టా
చూపగలను చూపు

అయ్యానిపుడే లైఫులోకి
లాగిన్ లాగిను
రెసిల్టెంటాని పెట్టమాకు
టెన్షన్ టెన్షను

నేనేంటో ఏమవుతానో
నాకేగా తెల్సు
ఏ నోళ్లు ఏమన్నా
తగ్గదంట ఫోర్సు

దిల్ అంతా డల్ అయ్యేలా
ఎన్నో కామెంట్సు
డీల్ పిక్ చేయందే
నెగ్గదంట రేసు

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

ఐన్‌స్టీన్ అయినా అబ్దుల్ కలాం
అయినా అయినా
గొప్పోళ్ళయ్యే ముందు
ఒక్కసారైనా అయినా

పక్కా వాళ్ళ డాడీ తిట్టుంటాడ్రా
నాయనా నాయనా
ఏందీ పనులని చెప్పుంటారు
శానా శానా

గజినీలా కింద మీద పడితే
ఏం తప్పు తప్పు
ఏంటో ఆ కంగారేంటో సక్సెస్
అయ్యేలోపు లోపు లోపు

వద్దన్నా పడిపోతాందే
ఫెయిల్యూర్ నలుపు నలుపు
తుడిచేయకుంటే దాన్ని
రాదు కధా గెలుపు

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

పుట్టే జిందగీలన్నీ
డిట్టో బాట పట్టాలా
సేమ్ టు సేమ్ లెక్కల్లో
చేరి క్యూ కట్టాలా

ఏ కల నేను చూడాలో
వేరే వాళ్ళు చెప్పాలా
నవ్వే లేని నవ్వులో
నన్ను దాపెట్టాలా

మనకిష్టమైనదేదో కష్టపడి చేరుకునే
ఆలోచనైనా చెయ్యొద్దా
అంతో ఇంతో మనం కూడా
కాలర్ ఎత్తి చెప్పుకునే
సొంత హిస్టరీ రాయొద్దా

అరె వాళ్ళు వీళ్ళు చెప్పేదేంది
నీ దారేదో నువ్వే చూస్కో
హే మామ హే మామ
హే మామ మామ మామ

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో




ఒలె ఒలె పాపాయి పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల, ప్రియా 

హేయ్ హేయ్ హేయ్ హెయ్
ఒలె ఒలె పాపాయి
పలాసకే వచ్చెయ్యి

గుంట చూస్తె పూలగుత్తి
గుంటడేమో ఏట కత్తి
అంటుకుంటె అత్తి పత్తి
అంటుకుంది అగరుబత్తి

ఊరుకోదు నీ చెయ్యే
ఇచ్చావురా రావోయి

ఆపమాకే రంగబోతి
పెట్టమాకే బుంగమూతి
ఆరుమూరలుంది చాతి
ఆడుకోవే నువ్వు బంతి

ఒంపు చూస్తే ఒరిస్సా
ఊపుతానే హైలెస్స

తియ్యగుంది నీ హింసా
కన్నె దిల్లులో ధింసా

రయ్యిమని రాయే రాయే హంసా

ఎర్ర ఎర్ర ఎర్రగున్న
కొర్రమీనురో హెయ్
ఇది జర్ర జర్ర జారిపోయే
కుర్రమీనురో హెయ్

గర్ర గర్ర గర్ర గర్ర
గర్రమైతరో హెయ్
నీ కుర్ర బుర్ర జోరు
సూత్తె గుర్రమైతరో హెయ్

హెయ్ హెయ్ హెయ్

ఓసి కీసుపిట్ట నువ్వు కాపుకొచ్చే పంట
కోరమీసమెట్టి నిన్ను కోసుకుంటా
ఓరి కోడెగిత్త ఈ కుమ్ములాట కొత్త
కావాలనే ఉంది కూసింత

ఒడిసెల రాయిలెక్క
ఇసరకే సూపులట్ఠా
నడుమును తాకుతుంటే
సరిగమలొచ్చెనటా

పెదవికి నేర్పిస్తా ప్రేమా
హోయ్

రాక రాక కోకిలొస్తే ఊరు కావ్ కావ్
ఓ కేకే పెట్టే సోకులన్నీ నీవి కావ్ కావ్

కొక రైక కాకరేపే సూడు కావ్ కావ్
ఈ చీకటింట సిగ్గులన్ని నావి కావ్ కావ్

ఒలె ఒలె పాపాయి
పలాసకే వచ్చెయ్యి

గుంట చూస్తె పూలగుత్తి
గుంటడేమో ఏట కత్తి
అంటుకుంటె అత్తి పత్తి
అంటుకుంది అగరుబత్తి

ఊరుకోదు నీ చెయ్యే
ఇచ్చావురా రావోయి

ఆపమాకే రంగబోతి
పెట్టమాకే బుంగమూతి
ఆరుమూరలుంది చాతి
ఆడుకోవే నువ్వు బంతి

ఒంపు చూస్తే ఒరిస్సా
ఊపుతానే హైలెస్స

తియ్యగుంది నీ హింసా
కన్నె దిల్లులో ధింసా

రయ్యిమని రాయే రాయే హంసా

ఎర్ర ఎర్ర ఎర్రగున్న
కొర్రమీనురో హెయ్
ఇది జర్ర జర్ర జారిపోయే
కుర్రమీనురో హెయ్

గర్ర గర్ర గర్ర గర్ర
గర్రమైతరో హెయ్
నీ కుర్ర బుర్ర జోరు
సూత్తె గుర్రమైతరో హెయ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్





చిరాకు తాండవం పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి  
గానం: రామ్ మిరియాల

చిరాకు తాండవం 

Palli Balakrishna Sunday, October 8, 2023
Bhagavanth Kesari (2023)



చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
నటీనటులు: బాలక్రిష్ణ, కాజల్ అగర్వాల్ శ్రీలీల
దర్శకత్వం: అనీల్ రావిపూడి
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల తేది: 19.10.2023



Songs List:



గణేష్ పాట పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కరిముల్లా, మనీషా పండ్రంకి

గణేష్ పాట



ఉయ్యాలో ఉయ్యాలా పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యస్.పి.చరణ్

ఉడత ఉడత ఉష్షా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగ ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారీ

ఉడత ఉడత ఉష్షా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగ ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారీ

సిలకా సిలకా గప్పు సుప్
గమ్మున కూసోర్రి
నీకన్న తియ్యగ పలుకుతాంది
మా పొట్టి పొన్నారి

నువ్ ఉరకవే నా తల్లి
తుల్లి పలకవే నా తల్లి
ఉరికి పలికి అలిసి వోతే
గుండెపై వాలిపోవే జాబిల్లీ

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్ల నిన్ను మొయ్యాల

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాలా

ఉడత ఉడత ఉష్షా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగ ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారీ

అమ్మనైత లాల పోస్తా
అయ్యనైత జోల పాడుతా ఆ ఆ
అవ్వనైత బువ్వ వెడతా
దువ్వేనైత జడలల్లుతా ఆ ఆ

పత్తి పువ్వైతా
నీకు రైకలియ్యనీకి
పట్టు పురుగైతా
నీకు పావడియ్యనీకి

ఏమన్నైతే నీకెమన్నైతే
నేనెమన్నైతా నిన్ను కాయనీకీ

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్ల
గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాలా

ఒప్పుల గుప్పా ఉయ్యాలో
వయ్యారి భామా ఉయ్యాలో
సిగ్గుల మొగ్గ ఉయ్యాలో
సింగారి బొమ్మ ఉయ్యాలో

వోనీల నెమలమ్మ రాణిలెక్కస్తంటే
ఊరూరంతా ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
సంబరాలా గుమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో

సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో



Roar of Kesari పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: బృంద గానం  (Chorus)

చండ్రనిప్పు కండ్లు చూస్తే
సాగరాలే చల్లబడవా
వేట కత్తే వేటు వేస్తే
అగ్గికైనా భగ్గుమనదా

కేసరీ, ననా నన నా
నిట్టనిలువు నీడ చూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా

ధడ ధడ ఒకడే కేసరి
వీడికి వీడేలే సరి
తత్వమసి భగవంత్ కేసరి
వీడి కసి నిత్యం ఓ చరి

నిట్టనిలువు నీడ జూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా

నిట్టనిలువు నీడ జూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా
కేసరీ… లల లల లా



మాను మాకు పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కీర్తన శ్రీనివాస్ 

మాను మాకు మారేడు
ఆకు మాటాడుతాంది బిడ్డా
మల్ల ఇన్నాండ్లకు
కుకు కుకు కుకు కుకు
ఇప్ప ఈత తంగేడు పూతా
ఇప్పారుతాంది బిడ్డా
ఇట్టా ఇన్నేండ్లకు
కుకు కుకు కుకు కుకు

పల్లేరు ముల్లు సూడూ
పరిసింది మల్లెరస్తా
గన్నేరు కొమ్మ జూడూ
పన్నీరు సల్లుతాందా

ఎట్ల ఉంటివానని
ఏమి తింటివానని
పొద్దుగాలే యాదికొచ్చేదీ
యాడ ఉంటివానని
యాడ పంటివానని
సందెగాలే ఆగమయ్యేదీ

నా తానకొస్తున్నావనీ
ఈ ఖాన సెపుతున్నాదీ
రెండు కండ్లతో ఒక్కసారి
నిన్ను జూడాలే
గంతకన్న నాకు దునియాలా
ఏం గావాలే
కుకు కుకు కుకు

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్లా
నా సేతుల్తో నిన్ను మొయ్యాలా

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్లా
నా సేతుల్తో నిన్ను మొయ్యాలా

Palli Balakrishna Thursday, October 5, 2023
Skanda (2023)



చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల 
దర్శకత్వం: బోయపాటి శ్రీను 
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి 
విడుదల తేది: 15.09.2023



Songs List:



నీ చుట్టూ చుట్టూ పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: రఘురాం
గానం: సిద్ శ్రీరాం, సంజనా కల్మాన్జి

నీ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన
నా చిట్టి చిట్టి
చిట్టి చిట్టి గుండెనడిగినా

నా దిమ్మ తిరిగే
బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

ఓహ్ దమ్ము లాగి గుమ్మతో
రిదమ్ము కలిపి ఆడమందిగా

ప్రాణమే పతంగి లాగ
ఎగురుతోందిగా
ఇంతలో తతంగామంత
మారుతోందిగా

క్షణాలలో ఇదేమిటో
గల్లంతు చేసే
ముంత కల్లు లాంటి
కళ్ళలోన తెల్లగా

మరింత ప్రేమ పుట్టుకొచ్చి
మత్తులోకి దించుతోందిగా

నీ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన
నా చిట్టి చిట్టి
చిట్టి చిట్టి గుండెనడిగినా

నా దిమ్మ తిరిగే
బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

మీసాలనే తిప్పమాకు బాబో
వేషాలతో కొట్టమాకు డాబు
నువ్వెంత పొగుడుతూనే
నేను పాడనే పడనుగా

చటుకునొచ్చే ప్రేమ
నమ్మలేను సడెనుగా

కంగారుగా కలాగేనయ్యో కైపు
నేనస్సలు కాదు నీ టైపు
ఇలాంటివెన్ని చూడలేదు
కాళ్ళ ముందర

నువ్వెంత గింజుకున్నా
నన్ను గుంజలేవురా

ఏమిటో అయోమయంగా ఉంది
నా గతి
ముంచినా భలేగా ఉంది
ఈ పరిస్థితి

ఇదో రకం అరాచకం
కరెంటు షాక్ లాంటి
వైబ్ నీది అంటే
డౌట్ లేదు గా

ఖల్లాస్ చేసి పోయినావు
ఒరా చూపు గుచ్చి నేరుగా

నీ చుట్టూ చుట్టూ
చుట్టూ తిరిగిన
నా చిట్టి చిట్టి
గుండెనడిగినా

నా దిమ్మ తిరిగే
బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

ఓహ్ దమ్ము లాగి గుమ్మతో
రిదమ్ము కలిపి ఆడమందిగా



కల్ట్ మామ పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: హేమచంద్ర, రమ్యా బెహరా, మహా 

బిట్టు బిట్టు బాడీ మొత్తం
రెడ్డు చిల్లీ సాల్టు
ఏయ్, చుట్టు చుట్టూ కమ్మేసుంది
పొగరే డిఫాల్టు
ఏయ్, పెట్టుకుంటే ఓడిపోద్ది
ప్రతి నట్టు బోల్టు
ఏయ్, కొట్టి సూడు ఎట్టుంటాదో
కండల్లో రివోల్టు

ఓయ్ లాక్కొడితే లాక్కొడితే లైఫులకే జోల్టు
హే, వేటపులి దూకుతంటే ఊపిరికే హాల్టు
హే, ఉక్కునరం ఉగ్గడితే కిక్కు ట్రిపుల్ మాల్టు
అరె ఎయ్ దరువెయ్ ఎయ్ దరువెయ్
స్టెప్పులిక ఫుల్టూ

ఎయ్ మామ ఎయ్ మామ
ఎయ్ మామ ఎయ్ మామ
ఎయ్ మామమామమామమామ
మామ మామ మామ మామ

ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే

ఓయ్ మీసమిలా మీసమిలా
మెలిపెడితే కల్టు
నీ కాలరిలా కాలరిలా
ఎగరేస్తే కల్టు
అరె బాడీలిలా బాడీలిలా
తిరగేస్తే కల్టు
ఏయ్, వీధుల్లో వెంటపడి
ఇరగేస్తే కల్టు

మెడకి కర్చిఫ్, తలకి రిబ్బను
కట్టేసి నించున్న కటౌట్ కల్టు
సైలెన్సరు పీకేసి ఆక్సిలేటర్ని
రయ్యంటు తిప్పేసి కట్టింగ్ కల్టు

దందా కోసం పెట్టే సిట్టింగు కల్టు
వంద మందితోనే బెట్టింగు కల్టు
మిడ్ నైట్ మోగించే డీజే బీట్ కల్టు
ఫ్లడ్ లైట్ వెలుతుర్లో
పట్టే కుస్తీ కల్టు

స్కెచ్చు గీస్తే కల్టు
రచ్చ చేస్తే కల్టు
ఇస్మైల్ కల్టు, ఇస్మైల్ కల్టు
ఇస్టయిల్ కల్టు, ఇస్కూలు కల్టు
కల్టు కల్టు కల్టు కల్టు కల్టు

ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే



డుమ్మారే డుమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: అర్మాన్ మాలిక్, అయ్యన్ ప్రణతి 

తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా

కోలమ్మ కోలో కొమ్మ గుమ్మల్లో
గువ్వా గువ్వా
కొండ కోనమ్మ జళ్ళో
వాగమ్మ పాటే మువ్వా మువ్వా

ఏలమ్మ ఏలో
ఏరమ్మ ఒళ్ళో గవ్వా గవ్వా
ఆహ ఏ రంగు లేని
సారంగమంటే నువ్వా నువ్వా

ఇంత అందం చందం గంధంలాగ
గంతే వేసే పల్లెటూరు సాటేది రాదే
మచ్చుకైనా మచ్చేది లేదే

కొత్త పాత అంటు తేడా లేనే లేదు
ప్రేమ ప్రతిక్షణం
రారా అని పోదామని
కలగలిపే పిలుపు ఇది

డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే

తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే

తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా

చెక్కర లేని పాలల్లో
చెక్కిన మీగడ తీపల్లే
కారంగా ఉన్న
ఊరించే ఆవకాయల్లే

హే, చుక్కలు లేని గీతల్లో
చక్కగ గీసిన ముగ్గల్లే
కోరంగి దాటె
కోనసీమ నావల నీడల్లే

తన ఒళ్ళే తుళ్ళి మళ్ళీ మళ్ళీ
జల్లే చల్లే మేఘంలాగ
కోనంగి కళ్ళే పంపెనే
చూపుల కౌగిళ్లే

అవి ఎల్లకిల్లా అల్లీ గిల్లి
అల్లో మల్లో ఆకాశంలో
అల్లాడెనే తెల్లారులు
కలవరపడి కల వదిలే

డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే




గండర బాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హర్ష. డి

హేయ్, గండర గండర
హేయ్, గండరబాయ్

ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే

గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్తనే
గండర గండర బాయ్

గజ్జె కట్టి సెప్పుకో
గాజులెట్టి సెప్పుకో
గాలివాన తెస్తనే
గండర గండరబాయ్

ఏయ్, విన్నారోయ్ విన్నారోయ్
తయ్యారయ్యే ఉన్నారోయ్
విస్తారే విస్తారే విందే వడ్డించేస్తారో
ఇష్టంగా ఇస్తానోయ్
నువ్వే నువ్వే విస్తారోయ్
నా గల్లా పెట్టె
గళ్ళుమంటున్నాదిరోయ్

గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

గండరబాయ్ గండరబాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే

గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్తనే
గండర గండర బాయ్
గజ్జె కట్టి సెప్పుకో
గాజులెట్టి సెప్పుకో
గాలివాన తెస్తనే
గండర గండర బాయ్

గల్లా లుంగి ఏసుకో, గడ్డివాము సూసుకో
గట్టిగానే ఉంటాదోయ్ సయ్యాటియ్యాల
గడ్డపార తీసుకో, గట్టునింక తవ్వుకో
సిగ్గునంత లోతుగా పాతి పెట్టలా

నీ తట్ట బుట్ట సర్దేసుకో సోదాపి
నా చెట్టాపట్టా పట్టేసుకో సోల్లాపి
ఆ ముద్దుల్తోనే చల్లేస్తావే కళ్ళాపి
ఓ ముగ్గులెడుతూ కూకుంటే
నీకెట్టా పనౌద్దీ

హే, వత్తాసే వత్తాసే
నువ్వేమన్నా వత్తాసే
నీ కట్టా మిట్టా పట్టే
పట్టెయ్యాలిరోయ్

గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే

Palli Balakrishna Thursday, August 3, 2023
Dhamaka (2022)



చిత్రం: దమాకా! (2022)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన 
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్
విడుదల తేది: 2022



Songs List:



జింతక పాట సాహిత్యం

 
చిత్రం: దమాకా! (2022)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం:  కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ, భీమ్స్ సిసిరోలియో

ఎంకన్న తీర్థంలో
యాల పొద్దు ముదంలో
పూల జడ ఎత్తుతుంటే
పుస్తె నువ్ కడుతుంటే
ఏ కన్ను సూడకుండా
కన్ను నాకు కొడుతుంటే, ఏ ఏ హే

నిన్ను సూడబుద్దైతంది రాజిగో
మాటాడబుద్దైతంది రాజిగో
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

చెయ్ పట్టబుద్దైతంది రాజిగో
ముద్దు పెట్టబుద్దైతంది రాజిగో

జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

అట్ల అంటుంటె మస్తుందే ఓ పిల్లో
లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో
భూమిపూజ చేసుకుంట బుగ్గల్లో
కొంప గూడు కట్టుకుంట కౌగిల్లో

నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది

జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది

జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె గుంగురే

గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గుంగురే

నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో 
నీ సూపు తాడు సుట్టి తిరగాలో గింగిరాలో

నా చేతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలా
నువ్వు చెమట చుక్కలెక్కపెట్టాలే ఇయ్యాలో

రోజు మార్చాలిరా చేతి గాజులు
నలిగి మూగాలిరా సన్నజాజులు
పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు
పట్టే మంచంకే పుట్టే నొప్పులు

ఓయ్, నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేస్ హహ్హాహహ్హ

జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్

జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

నే నీళ్ళు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో
నువ్ కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో

ఎన్ని ఏండ్లు కానీ సంటి పోరన్నే ఓ పిల్లో నీ ఒళ్ళో 
నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్లో

నువ్వు తిప్పుతు ఉండర మీసాలు
నే తప్పుతు ఉంటా మాసాలు
అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు
ఇంక చెద్దర్లో చేద్దామే తిరునాళ్ళు

హు, నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది

జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది



మాస్ రాజా పాట సాహిత్యం

 
చిత్రం: దమాకా! (2022)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం:  రామజోగయ్య శాస్త్రి 
గానం: నకాష్ అజీజ్

ఏ ఊరు వాడ దూము దాము చెయ్యండ్రో
పేపర్లో హెడ్లైన్లు వెయ్యండ్రో
బ్యానర్లు కటౌట్లు కట్టండ్రో
డప్పు తీయండ్రో దరువెయ్యండ్రో

హే గింగిరగిర గిర గిర గిర గిర
హే మేరా బడ్డీ
హే గింగిరగిర గిర గిర గిర గిర
ఖేలు కబడ్డీ

హే గింగిరగిర గిర గిర గిర గిర
హే మేరా బడ్డీ
హే గింగిరగిర గిర గిర గిర గిర
తోడ్ దేనా హడ్డి

గింగిరగిర గిరా గిరా
గింగిరగిర గిరా గిరా
గిరగిర గిరగిర గిరా గిరా గిరా హా

ఓ బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆగయా
బిసి సెంటర్లో మోగాలి తాలియా

ఓ బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆగయా
బిసి సెంటర్లో మోగాలి తాలియా
బాడీ లోకల్ మైండే గ్లోబల్
క్లాసు మాసు కాంబో మోడల్

బోలో బోలో బోలో బోలో
బోలో ప్యార్ సే
బోలో ఎవ్రిబడీ జరా
జరా జోర్ సే

ఓ ఏ తో మాస్ మాస్ రాజా
ఓ జరా ఉటాకే మార్ బ్యాండ్ బాజా
ఎయ్ రా మచ్చా
ఏ తో మాస్ మాస్ రాజా
జర్రా ఉటాకే మార్ బ్యాండ్ బాజా
దేతడి

వీడు నుంచున్న ఆ చోటికి విలువెక్కువ
వీడు కూర్చుంటే కుర్చీలే పొగరెక్కవా
వీడు తిప్పేటి మీసాలకి బలుపెక్కువ
హెడ్ వెయిట్ ఉన్న తలలన్నీ పడి మొక్కవా

దెబ్బ కొడితే ఫుల్లు ఫోర్సు
ఎవ్వడైనా రెస్ట్ ఇన్ పీసు
పట్టి బిగించాడో జిమ్ము బాడీ కండలే
ఎంతటి పోటుగాడి ఫోటోకైనా దండాలే

ఓ ఏ తో మాస్ మాస్ రాజా
ఓ జరా ఉటాకే మార్ బ్యాండ్ బాజా
ఎయ్ రా మచ్చా
ఏ తో మాస్ మాస్ రాజా
జర్రా ఉటాకే మార్ బ్యాండ్ బాజా
దేతడి

రేయ్ సిసిరోలియో ఓయ్
అప్పుడే ఆపేసావేంటేహే
ఇంకోసారి దరువేసుకో

దబిడి దిబిడి దబిడి దిబిడి
దబిడి దిబిడి దబిడి దిబిడి
దబిడి దిబిడి దబిడి దిబిడి
దబ దబ దబ దబ దబ

ఆ ఇక చాల్రాబాబోయ్ ఎల్లండ్రో ఆయ్




What's Happening పాట సాహిత్యం

 
చిత్రం: దమాకా! (2022)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం:  రామజోగయ్య శాస్త్రి 
గానం: రమ్యా బెహ్రా, భార్గవి పిళ్ళై 

సింగిల్ గానే ఉంటా
ఏ లవ్ లో పడకుండా
అని అనుకున్న మాటే ఏమయ్యిందో
అబ్బయిలతో కాస్త
అమ్మాయి జాగ్రత్త
అని నాన్న అన్న మాటే ఎటుపోయిందో
ఇలా చూసి చూడగానే భలే నచ్చేసాడే
నచ్చాడని తెలిసే లోపే
నాలోకొచ్చేశాడే
పిల్లో దాటి కల్లో కూడా
వాడే ఉన్నాడే
సింగిల్ పిల్ల సిస్టం మొత్తం
డిస్టర్బ్ చేసాడే
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఆన్ మై వేలో
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఆన్ మై వేలో

పది గంటలకే పడుకునేదాన్ని
వీడొచ్చాకేమో రెండవుతోందే
గది గడపలనే
దాటని దాన్ని
తిరిగొచ్చే టైం ఏమో ఏడవుతోందే
ఫ్రెండ్స్ మీటింగ్స్ పార్టీస్ మానేస్తున్నా
డైలీ ఛార్జింగ్ 3 టైమ్స్ పెట్టేస్తున్నా
నేను నాకన్నా తనతోనే గడిపేస్తున్న
ఇన్నినాళ్ళు నాతో పెరిగిన
నేనేమైపోతున్నా
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఆన్ మై వేలో
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఆన్ మై వేలో

బుజ్జి అంటూ కన్నా అంటూ
వాడంటుంటే పడి చస్తున్నా
కాఫీలంటూ మూవీస్ అంటూ
తనతో తిరిగే సాకులే వెతికేస్తున్నా
జాలీ జాలిగా లాంగ్ డ్రైవ్ లు తిరిగేస్తున్నా
కాలి దొరికిందో వాట్సాప్ ను తిరగేస్తున్నా
క్రేజీ మూమెంట్స్ ఎన్నెన్నో పోగేస్తున్నా
అయిబాబోయ్ ఈ లవ్లో
ఇంతుందా అని అనుకుంటున్నా
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఆన్ మై వేలో
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హప్పెనింగ్ వాట్స్ హప్పెనింగ్
ఆన్ మై వేలో




డూ డూ డూ డూ పాట సాహిత్యం

 
చిత్రం: దమాకా! (2022)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం:  రామజోగయ్య శాస్త్రి 
గానం: పృద్వి చంద్ర 

వీడు ఎగ‌బ‌డి తెగ‌బ‌డి
క‌ల‌బ‌డి గెలిచే మాస్‌
వాడు మ‌న‌సును
మెద‌డును ప‌దునుగ
విసిరే క్లాస్‌

వీడి గ్లామరైతే పొగ‌రు
వాడు కార్పొరేటు ప‌వ‌రు
వీడు చెయ్యి వేస్తే పిడుగు
వాడు వెయ్యి వాట్స్ వెలుగు

డ‌బ డూ డూ డూ డూ డూ
వీడు ల్యాండు మైను లెక్క‌
డ‌బ డూ డూ డూ డూ డూ
వాడు గోల్డుమైను కాకా

డ‌బ డూ డూ డూ డూ డూ
ఇది డ‌బ‌లు ధ‌మాకా
డ‌బ డూ డూ డూ డూ డూ

బై నేచ‌ర్ రెబ‌లీడు
అగ్రెషన్ ఫుల్ లోడు
ప్ర‌తి మ‌నిషిలో ఉండే
మాస్ ఎలిమెంటుకి
సింబల్ లాంటోడు

బై బ‌ర్తే ప్రిన్సయినా
సింపుల్ గా ఉంటాడు
మ‌న‌లో క‌ద‌లాడే
క్లాస్ యాంగిల్ కి ఐడ‌ల్ రా వీడు

దూస్రా తీస్రా
మాటంటూ లేదురా
వీడి లైఫ్ లో ఫిలాస‌ఫీ
చిల్ బ్రో చిల్ మారోరా

దూస్రా తీస్రా రూటైనా ఓకేరా
రేసులోకి దూకాడో వాడు
బాసుల‌కే బాసైపోతాడు

వీడు ఎగ‌బ‌డి తెగ‌బ‌డి
క‌ల‌బ‌డి గెలిచే మాస్‌





దండకడియాల్ పాట సాహిత్యం

 
చిత్రం: దమాకా! (2022)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భీమ్స్ సెసిరోలె
గానం: భీమ్స్ సిసిరోలియో, సాహితి చాగంటి, మంగ్లీ

లైలై లైలా లైలై లైలా
లైలై లైలా లల లైలై లైలా
లైలై లై లే లల లైలై లై లే
లైలై లై లే లల లైలై లై లే
దండకడియాల్

యే దండకడియాల్ దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
అరె కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల
పల్లెటూరోడంటివె పిల్లో

యే దండకడియాల్ దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
కిరు కిరు చెప్పుల కిన్నెర మోతల
పల్లెటూరోడంటివె పిల్లో

గజ్జెల పట్టీలిస్తివో
గాజులిచ్చి బుట్టలో వేస్తివో
ముక్కెర నువ్వై పూస్తివో
నీ ముద్దుల ముద్దెరలేస్తివో
అరె సందడి వోలె వస్తివో
సోకు లంగడి తీసుపోతివో ఓ ఓ ఓ

యే దండకడియాల్ అరెరె దస్తీ రుమాల్
యే దండకడియాల్ దస్తి రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగో
కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల
పల్లెటూరోడంటివె పిల్లో

నీ చూపుల తల్వారు
నా సెంపల తీన్మారు
సంపెంగ మొగ్గల మంచం ఎక్కి
తెంపెయ్ నవారు

నీ మెట్టల జాగీరు
చేపట్టే జాగీరుదారు
నీ పట్టా భూమిలో గెట్టు
నాటుకుంటా జోర్దారు

ఇంచుమించు నీదే పోరా చుట్టూ శివారు
అటు ఇటు చూడకుండా చేసేయ్ షికారు

ఆగమన్న ఆగేటోన్ని కాదే బంగారు
దూకమంటే ఆగుతాడా దుమ్ములేపే
నాలోని మీసమున్న మగాడు

హే దండకడియాల్
అరెరెరె దస్తీ రుమాల్
హే దండకడియాల్ దస్తీ రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగో

అది అది అరెరెరె
కిర్రు కిర్రు చెప్పుల
కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో

అల్లో మల్లో రాముల మల్లో
అల్లో మల్లో రాముల మల్లో
జిల్లేడాకుల బెల్లం పెట్టె
జిల్లేడాకుల బెల్లం పెట్టె

నాకు పెట్టక నక్కకి పెట్టె
నాకు పెట్టక నక్కకి పెట్టె
నక్క నోట్లో బెల్లం ఇరికే
నక్క నోట్లో బెల్లం ఇరికే

పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయే
పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయే
అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే
అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే
తోట్లో ఉన్నకూడా గుబ్బల పర్సు
గుబ్బల పర్సుకు జబ్బల రైక

నీ కంది పువ్వునురా
నే కంది పోతానురా
నీ ఎకరంనర చాతితోనే చత్తిరి పట్టేయిరా

నీ సింగుల సెండోలే
నీ కొంగుల దండోలే
నీ గుండెల నిండ
ఎన్నెల కుండ దింపిపోతాలే

సింత మీద సిలకోలే కనిపెడతావా
బాయి మీద గిలకోలే నులిపెడతావా
ఏ గుడిసెలో గొడవేదో ఎపుడుండేదే పిల్లా
మడిసెల్లో నిలబడి వడిసెల్లో రాయి బెట్టి
ఇసిరిసిరి కొడతమే

హే దండకడియాల్
అరెరెరె దస్తీ రుమాల్
హే దండకడియాల్ దస్తీ రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగ
హే కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల
పల్లెటూరోడంటివే పిల్లో

Palli Balakrishna Monday, August 22, 2022
Pelli SandaD (2021)



చిత్రం: పెళ్లి సందD (2021) సంగీతం: యం. యం. కీరవాణి నటీనటులు: రోషన్ , శ్రీలీల దర్శకత్వం: గౌరీ రోనంకి నిర్మాత, దర్శకత్వ పర్యేక్షణ: కె. రాఘవేంద్ర రావు విడుదల తేది: 2021



Songs List:



ప్రేమంటే ఏంటీ? పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరణ్, శ్వేతా పండిట్

నువ్వంటే నాకు - ధైర్యం
నేనంటే నీకు - సర్వం
నీకు నాకు - ప్రేమా
ప్రేమంటే ఏంటీ?

చల్లగా అల్లుకుంటది
మెల్లగా గిల్లుతుంటది
వెళ్ళనే వెళ్ళనంటది
విడిపోనంటుంది

మరి నువ్వంటే నాకు - ప్రాణం
నేనంటే నీకు - లోకం
నీకు నాకు - ప్రేమా
ప్రేమంటే ఏంటీ?

చల్లగా అల్లుకుంటది
మెల్లగా గిల్లుతుంటది
వెళ్ళనే వెళ్ళనంటది
విడిపోనంటుంది

హో హోహో హోహో హోహో హో
హో హోహో హోహో హోహో హో

తనువు తనువున తీయదనమే నింపుతుంటది
పలుకు పలుకున చిలిపిదనమే చిలుకుతుంటది
కొత్తంగా కొంగొత్తంగా ప్రతీ పనినే చేయమంటది
ప్రాణానికి ప్రాణం ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది

ఇంకా ఏమేమ్ చేస్తుంది..!!

పులిలా పొంచి ఉంటది
పిల్లిలా చేరుకుంటది
వెళ్ళనే వెళ్ళనంటది
విడిపోనంటుంది

పులిలా పొంచి ఉంటది
పిల్లిలా చేరుకుంటది
వెళ్ళనే వెళ్ళనంటది
విడిపోనంటుంది

నువ్వంటే నాకు -  హ్మ్ మ్
నేనంటే నీకు - హ ఆ ఆఆ
నీకు నాకు - ప్రేమా
ప్రేమంటే ఏంటీ?




బుజ్జులు బుజ్జులు పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: బాబా షెహగాల్, మంగ్లీ

పాలకుండ నెత్తినెట్టి పంజాగుట్ట పోతావుంటే
బోరబండ పోరగాడు రాయిపెట్టి కొట్టినాడు
రాయిపెట్టి కొట్టినాడు రాయిపెట్టి కొట్టినాడు
కుండపాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు
చిల్లుపడ్డ కుండతోటి ఇంటికెట్ట పోనురా
పోరాడా నీ మీద కోపమొచ్చేరా కోపమొచ్చేరా

నీ బుంగమూతి సూడనీకి రాయితోటి కొట్టినా
కంటి ఎరుపు సూడనీకి కుండ పగలగొట్టినా
అలకనీది సూడనీకి అల్లరెంతో జెసినా

బుజ్జులు బుజ్జులు బుజ్జులూ
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కొనిపెడతా బంగరు గజ్జెలు
హెయ్ బుజ్జులు బుజ్జులు బుజ్జులు
తినిపిస్తా తీయని ముంజులు
గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
హెయ్ గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు

బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కట్టుకుంటా బంగరు గజ్జెలు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కొరికి తింటా తియ్యని ముంజులు
గోస తీరిపోయేలాగా తీసుకుంటా
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
నా గోస తీరిపోయేలాగా తీసుకుంటా
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు

చమ్కీలు కొననీకి ఛార్మినారు పోతావుంటే
అఫ్జల్ గంజ్ కాడ అడ్డమొచ్చినవ్ ఆహ
బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ - బేబీ బేబీ ఆ

మీద జల్లినవ్ ఆహ మీద జల్లినవ్
బుగ్గ మీద జల్లినవ్
బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ ఆహ
రంగు జూసి మా అయ్య రంకెలేస్తడు
మచ్చ జూసి మా అమ్మ రచ్చ చేస్తది
పోరడా నీతోటి పీకులాటరా హా హా హా ఆ

మీ అమ్మంటే భయమంటవ్ నేనంటే ప్రేమంటవ్
అయ్యంటే వనుకంటవ్ నన్ను చూస్తే కులుకంటవ్ 

మీ అమ్మంటే భయమంటవ్ నేనంటే ప్రేమంటవ్
అయ్యంటే వనుకంటవ్ నన్ను చూస్తే కులుకంటవ్ 

అందరికంటే నేను ఇష్టమంటవ్
ఇష్టమంటవ్ ఇష్టమంటవ్
ఆ ముచ్చటంత లోలోనే దాచుకుంటవ్

బుజ్జులు బుజ్జులు బుజ్జులూ
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
తొడిగేస్తా రవ్వల గాజులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
పెట్టేస్తా కాలికి మెట్టెలు
అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్నా
కట్టివేస్తా మెడలో పుస్తెలు
హేయ్, అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్నా
కట్టివేస్తా మేడలో పుస్తెలు
కట్టివేస్తా మేడలో పుస్తెలు

బుజ్జులు బుజ్జులు బుజ్జులు
అందుకుంటా రవ్వల గాజులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
పెట్టుకుంటా కాలికి మెట్టెలు
అడ్డమెవ్వడొచ్చి మననాపుతున్నా
కట్టమంటా మెడలో పుస్తెలు
అడ్డమెవ్వడొచ్చి మననాపుతున్నా
కట్టమంటా మెడలో పుస్తెలు
అయిపోదాం ఆలుమొగలు

హో భల్లె భల్లె భల్లె భల్లె బుజ్జులు
భల్లె భల్లె భల్లె భల్లె బుజ్జులు
హో భల్లె హో భల్లె భల్లె భల్లె బుజ్జులు
భల్లె హ భల్లె హ భల్లె భల్లె బుజ్జులూ వావ్




పెళ్లి సందD పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర , దీపు, రమ్యా బెహ్రా

పట్టు చీరల తళతలలు…పట్టగొలుసులా గలగలలు
పట్టు చీరల తళతలలు…పట్టగొలుసులా గలగలలు
పులా చొక్కలా రెపరెపలు…సిల్కు పంచలా టపటపలు
కాసుల పేరులా ధగధగలు…కాఫి గలాసుల భుగభుగలు
మామిడాకుల మిలమిలలు…కొబ్బరాకులా కళకళలు
గట్టి మేళాల ఢమఢమలు…డమ్మా డమ్మా ఢమఢమలు
గట్టి మేళాల ఢమఢమలు…వంటశాలలో ఘుమఘుమలు
అన్ని అన్ని అన్ని అన్నిఅన్ని కలిపితే

పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD
పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD
పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD

మహిళా మణుల చింత పిక్కలు
అబ్బో పుణ్య పురుషుల పేక ముక్కలు
బావమరుదల పరిహాసాలు
పాత మిత్రుల పలకరింపులు
అందరితోటి ఫోటోలు అంత్యాక్షరి పోటీలు
అందరితోటి ఫోటోలు అంత్యాక్షరి పోటీలు
అత్త మామలా ఆత్మీయతలు
తాత బామ్మల ఆశీస్సులు
అందరు చల్లే అక్షింతలు
అమ్మ నాన్నల అమ్మ నాన్నల తడి కన్నులు
కన్నె పిల్లలా కొంటె నవ్వులు
కుర్ర కన్నుల దొంగ చూపులు
అందగత్తెల చిలిపి సైగలు
కోడి గిత్తలా చురుకు చేష్టలు
చెవులలో ఊగేను జూకాలు
మోగించెను మదిలో బాకాలు
ముక్కుపుడకలు మిరుమిట్లు
పెదవేరుపులు పెంచెను పదిరెట్లు
ఆ… ఆ… ఆ… ఆ…

పచ్చని ఓణి అందాలు…నచ్చినయా పరువాలు
ఒప్పుకుంటే అదే పదివేలు…ఆహాలు యమ ఓహోలు
ఎవడికి తెలియని సంగతులు…ఎరగా విసిరే బిస్కట్లు
ఎంత పొగిడిన మీ కథలు…ఆశలు దోశలు అప్పడాలు
చల్ రే చల్

పెళ్లి సందడి పెళ్లి సందD
పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD
పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD





మధురా నగరిలో పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీనిధి, నయన నాయర్, క;కాలభైరవ

మధురా నగరిలో యమునా తటిలో
మురళీ స్వరములే… ముసిరిన యదలో
కురిసెనంట మురిపాల వాన
లయలై హొయలై… జలజల జతులై
ఆఆ ఆఆ ఆఆ ఆ… గలగల గతులై, ఆఆ ఆఆ
వలపుల శ్రుతులై… వయసుల ఆత్రుతలై

దొరక్క దొరక్క దొరికిందీ
తళుక్కు చిలక ఇది
పలక్క పలక్క పలికేస్తూ
ఝలక్కు విసిరినది

రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి
కౌగిళ్ళ ఇల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలు పెట్టి
గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది

మధురా నగరిలో… ఓ ఓ ఓ ఓఓఓ ఓ
మధురా నగరిలో… యమునా తటిలో, ఓ ఓ
మురళీ స్వరములే… ముసిరిన యదలో, ఓ ఓ


చెంతకొచ్చెయ్యగానే
చెమక్కు చెమక్కు చురుక్కు చురుక్కు
చటుక్కు చటుక్కు చిటుక్కులే

చెయ్యి పట్టెయ్యగానే
తడక్కు తడక్కు దినక్కు దినక్కు
ఉడుక్కు ఉడుక్కు దుడుక్కులే

నువ్వులేక చందమామ చిన్నబోయే
నిన్ను చేరి వెన్నెలంత వెల్లువాయే
నువ్వు రాక మల్లెపూలు తెల్లబోయే
నిన్ను తాకి పూల గుట్టు తేలికాయే
ఈ మాటకే ఈరోజుకే… ఇన్నాళ్ళు వేచానే

దొరక్క దొరక్క దొరికిందీ
తళుక్కు చిలక ఇది
పలక్క పలక్క పలికేస్తూ
ఝలక్కు విసిరినది

రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి
కౌగిళ్ళ ఇల్లు కట్టి  నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలు పెట్టి
గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది

మధురా నగరిలో… ఓ ఓ ఓ ఓఓఓ ఓ
మధురా నగరిలో… యమునా తటిలో, ఓ ఓ
మురళీ స్వరములే… ముసిరిన యదలో, ఓ ఓ



గంధర్వ లోకాల పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర , రమ్యా బెహ్రా

గంధర్వ లోకాల… సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల… లావణ్య తేజానివో
ఎవరివో ఎవరివో

ఆనంద క్షేత్రాల… అపరంజి పుష్పాన్నివో
ఎవరివో ఎవరివో
అందాల ఆలయంలో… ప్రాణ శిల్పానివో
ఎవరివో ఎవరివో

ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఎవరివో ఎవరివో… ఎవరివో హో హో

తడిపొడి అందాల నాట్యశాలవో, ఓ ఓఓ ఓ హో
కులుకుల పరువాల కళాశాలవో, ఓ ఓ ఓఓ
పెదవుల అమృతాన పానశాలవో, ఓ ఓఓ ఓ హో
చెదరని సౌఖ్యాల స్వర్గశాలవో

అలజడులాడవిలోన తప్పిపోయిన నన్ను
పిలిచేటి పర్ణశాలవో
ఆ నింగికి ఈ నేలకి ఉయ్యాల కట్టిసి
ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో

గంధర్వ లోకాల… సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల… లావణ్య తేజానివో
ఎవరివో ఎవరివో, హో ఓఓ ఓ ఓ




# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Friday, October 15, 2021

Most Recent

Default