Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Shraddha Srinath"
Saindhav (2024)



చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
నటీనటులు: వెంకటేష్, ఆర్య, శ్రద్ధా శ్రీనాద్, రుహని శర్మ, అండ్రియ జర్మియా
దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి 
విడుదల తేది: 13.01.2024



Songs List:



బుజ్జికొండవే పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యస్.పి.చరణ్

బంగారమే బంగారమే
నువ్వు నా వరమే
నీ క్షేమమే, నీ సంతోషమే
నను నడిపించే బలమే.

చిట్టి తల్లి నీవే పుట్టుకంటె నీదే,
దేవతల్లే నన్నే చేరుకుంటివే,
గుండెపట్టనంత ప్రాణమంటే నీవే,
నాన్న లాగా నన్నే ఎంచుకుంటివే,

ఓ చంటిపాపనై
నీతో నన్ను ఆడనివ్వవే
నీ ఆట పాట ముద్దు ముచ్చట తీర్చనివ్వవే
నా ఆయువంత నువ్వు అందిపుచ్చుకుని
చిందులాడవే

బుజ్జికొండవే నా బుజ్జికొండవే
బుజ్జికొండవే నా బుజ్జికొండవే…

బంగారమే బంగారమే
నువ్వు నా వరమే
నీ క్షేమమే నీ సంతోషమే
నను నడిపించే బలమే…

ఏదో జన్మలో అమ్మవే
నా పాపవైనావిలా నమ్మవే

లోకాన పూసే ప్రతి నవ్వు తీసి
పువ్వుల దండ చేసి నీకందించనా
నీకై కన్నకలలా ఉంది జీవితం
ప్రతి ఋతువు నీకై తేవాలి వసంతం

నా ఆనందాలకి అద్దం పట్టిన
కంటి చెమ్మవే
నా అదృష్టాలన్నీ భూమికి దించిన
బుట్ట బొమ్మవే
నా గుండెపైన చిందులాడ వచ్చిన
జాబిలమ్మవే.

బుజ్జికొండవే… నా బుజ్జికొండవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే

బంగారమే బంగారమే
నువ్వు నా వరమే
నీ క్షేమమే నీ సంతోషమే
నను నడిపించే బలమే

(ప్లీజ్ నవ్వు నాన్న)
ఏదో జన్మలో అమ్మవే
నా పాపవైనావిలా నమ్మవే



సింపుల్ జెంటిల్ పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కార్తీక్ మనివాసగం 
గానం: కార్తీక్ మనివాసగం 

సింపుల్ జెంటిల్ ఐ’మ్ ఫ్రీ
గోల్డెన్ సన్ షైన్ అంగ్రీ

సింపుల్ జెంటిల్ ఐ’మ్ ఫ్రీ
గోల్డెన్ సన్ షైన్ అంగ్రీ




లెక్క మారుద్దిరా పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: పృద్వి చంద్ర

రగిలే క్రోధము, నడిచే యుద్ధము
జననం భస్మం నుండేలే
అరె ఎవరాసిద్ధము, మరణము తథ్యము
అతడే మృత్యువులే

పగ పగ సెగ సెగ పోరే నీదా
ధగ ధగ యుగాలుగా తీరే పోదా

చెడునిక ఆపెయ్
నరకము చూపే… నవ సైంధవుడే
నవ సైంధవుడు, నవ సైంధవుడూ

ఆట మొదలయే వేట మొదలయే
రక్త మడులు పారే
జాత మొదలయే, కోత మొదలయే
కొత్త పదునుతోనే

పగ పగ సెగ సెగ పోరే నీదా
ధగ ధగ యుగాలుగా తీరే పోదా
చెడునిక ఆపెయ్
నరకము చూపే కలి సైంధవుడే

కొంచెం బెదరడే
లక్ష్యం విడువడే
అష్టం కొలవడే
మంత్రం అలవడే

పడి పడి ఎగబడి
కలబడి ముట్టడి
వదలడులే ఇకా
అరె కుదరదు కట్టడి
బతకరు తలబడి
నిలబడిపోకా

మరి ఎదురుగ నిలబడి
సిగబడె సత్తువిది మిగలదులేమ్మా
అరె చెదిరిన లెక్కను
కుదురుగ మార్చెడి కుదుమిది దెబ్బా
లెక్క మారుద్దిరా నా కొడకల్లారా..!

ధగ ధగ యుగాలుగా తీరే పోదా




సరదా సరదా పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి

శ్రద్ధ: ఏం చేసావ్ ఈరోజంతా?
వెంకీ: మధ్యాహ్నం మోడీ గారితో మీటింగ్ అయింది. దేశ పరిపాలన మీద కొన్ని టిప్స్ ఇచ్చి వచ్చా,ఊ..! లేకపోతే నేనేం చేస్తాను. హహహ.
శ్రద్ధ: ఆపకు, మాట్లాడుతునే ఉండు. బావుంటది, నువ్ మాట్లాడితే.
వెంకీ: నా వయసెంతో తెలుసా..?
శ్రద్ధ: ష్… ఇదా నేను మాట్లాడమంది..!
బేబీ సారా: నాన్న
వెంకీ: హే, నిద్రపోలేదా బంగారం. ఊ, దా దా
బేబీ సారా: ఆంటీ, నువ్వు మాతోనే ఇక్కడ ఉండిపోవచ్చు కదా..! రోజు మీ ఇంటికి ఎందుకు వెళ్తావ్.
వెంకీ: మను ఆంటీ కొన్ని రోజుల తర్వాత మనతోనే ఉంటుంది. ఏమంటావ్ మను ఆంటీ?
శ్రద్ధ: అంతే..!
వెంకీ: అంతే. ఊ, అంతే

ఎగిరే స్వప్నాలే మనం
మనదే కాదా గగనం
సిరివెన్నెలలో తడిసే గువ్వలం
చిరునవ్వులలో చననం

ఇది చాల్లే… ఇంతే చాల్లే
ఇదిలా నిత్యం ఉంటే చాల్లే
ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేల్లుగా
ఊపిరిలో సుమగంధాలే

సరదా సరదా
సరదాగా సాగింది సమయం
మనసు మనసు దూరాలే మటుమాయం
మనకు మనకు పరదాలే లేనే లేవందాం
ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం

కలలా ఉందేంటీ నిజం
నిజమేనందీ నయనం
మనకే సొంతం అవునా ఈ వరం
విరబూసింది హృదయం

అందాల పూల వందనాలు
చేసే రాదారులే
తల నిమురుతున్న
పలకరింపులాయె చిరుగాలులే

ఈ ఉల్లాసమే మనకో విలాసమై
మనసంతా చిందాడిందే

సరదా సరదా
సరదాగా సాగింది సమయం
మనసు మనసు దూరాలే మటుమాయం
మనకు మనకు పరదాలే లేనే లేవందాం
ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం

ఆనందమే అరచేతులా
వాలిందిలా పసిపాపలా
ఒక గుండెలో
ఈ మురిపెమంతా బంధించేదేలే
కరిగి ఆ వానవిల్లే ఇలా
రంగుల్లో ముంచెత్తగా
ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదేల

సరదా సరదా
సరదాగా సాగిందీ సమయం
మనసు మనసూ దూరాలే మటుమాయం
మనకు మనకూ పరదాలే లేనే లేవందాం
ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం



రాంగు యూసేజూ పాట సాహిత్యం

 
చిత్రం: సైంధవ్ (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: నకాష్ అజీజ్

రేయ్, అరె బాధలలోనే
తెగ ఏడుపులోనే
నువు తాగుతున్నావ్ రా
రేయ్ దిల్ కుషీ కుషీలోనే
భల్ చిందులతోనే
నువ్వు తాగి చూడరా

ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబలైతది
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబలైతది
కుషీనే డబల్ చేస్తావా
లేక బాధనే డబల్ చేస్తావా, హా
ఏడుపే డబల్ చేస్తావా
ఏసే చిందునే డబల్ చేస్తావా, ఆ ఆ ఆవ్

చెయ్యొద్దురా చెయ్యొద్దురా
రాంగు యూసేజ్
అరెరెరె చెయ్యొద్దురా రాంగు యూసేజ్
చెయ్యొద్దురా చెయ్యొద్దురా
రాంగు యూసేజ్
మందుని చెయ్యద్దురా రాంగు యూసేజ్
రాంగ్ యూసేజ్, రాంగ్

దునియాలో అందరికీ
దగ్గరవ్వడం కొరకే కనిపెట్టారి సెల్లుని
సివరికి నీకు నువ్వు దూరమయ్యి
నువ్వే ఒక ఒంటరయ్యి
ఈ సెల్లే నీకు జైలు సెల్లయిందే

రాంగు యూసేజూ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యూసేజూ
సెల్లుని చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు

పైసలనే నువ్వు వాడుకోవాలే
బాబాయ్ మనుషులనే లవ్వు సెయ్యాలే
మనుషులను వాడి నోట్ల కట్టలనే లవ్ చేస్తే
కట్టల్లో పడి లైఫ్ తో కట్టయ్యావే, హ

చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యుసేజు
చెయ్యకు చెయ్యకు
డబ్బుని చెయ్యకు రాంగు యూసేజు ||2||

నీలో తెలివే… నీకు బానిసవ్వాలే
ఆ తెలివే తెలివి మీరి
అతి తెలివిగ అది మారి
నీ బానిసకే నవ్వు బానిసయ్యావే

రాంగు యూసేజూ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యూసేజూ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు

చెడు అన్నది నేడు మంచి ఫ్యాషనయిందే
మంచి మాసెడ్డగ బోరు కొట్టిందే, ఏ ఏ ఏయ్
మంచి టైమ్ తీరిపోయి
చెడు వైపే జారిపోయి
లైఫులోన లైటన్నది ఆరిపోయిందే

రేయ్, రాంగు రాంగు రాంగు రాంగు
చెయ్యొద్ధురా చెయ్యొద్ధురా రాంగు యుసేజు
అరరర చెయ్యొద్దురా రాంగు యూసేజ్
చెయ్యకు చెయ్యకు చెయ్యకు
చెయ్యకు రాంగు యూసేజు
చెయ్యకు చెయ్యకు లైఫుని
చెయ్యకు రాంగు యుసేజు

Palli Balakrishna Tuesday, February 13, 2024
Chakra (2021)
చిత్రం: చక్ర (2021)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిన్మయి శ్రీపాద, ప్రార్థన ఇంద్రజిత్
నటీనటులు: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: యం. యస్. ఆనందన్
నిర్మాత: విశాల్
విడుదల తేది: 19.02.2021







అమ్మ నువ్వంటే నాకు ప్రాణం
అమ్మ నీతోనే నాకు లోకం
నీతోనే నేనుంటా నీ రాణినంట
నీలో కనిపించేది నా రూపేనమ్మా

నీ చేతుల్లో నా చేయుంటే ఎంత సుఖం
నువ్ లేకుండా ఉండలేనే నేను క్షణం
నన్ను నడిపించేవి నీ మాటలే
దారి చూపించేవి నీ చూపులే

చిరునవ్వై ఒదిగుంటా నీ ఒడిలో నేనమ్మా
చీకట్లో దీపంలా నా దరికొచ్చావమ్మా
నువ్వే నా నేస్తం నా ప్రాణం అమ్మ
నే చూడలేనే నీ కళ్ళల్లో చెమ్మ
రెక్కలు వచ్చాయే నా మనసుకు ఈనాడు
నేనే నువ్వైపోతానమ్మా ఓ నాడు

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆఆ ఆఆ ఆఆ ఓఓ


Palli Balakrishna Sunday, March 21, 2021
Jodi (2019)



చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
నటీనటులు: ఆది, శ్రద్ధా శ్రీనాథ్
దర్శకత్వం: విశ్వనాథ్ అరిగెళ్ళ
నిర్మాతలు: సాయి వెంకటేష్ గుఱ్ఱం, పి. పద్మజ
విడుదల తేది: 06.09.2014



Songs List:



ఇది నిజమేనా పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: యాజిన్ నజీర్ 

ఇది నిజమేనా



దేనికో ఏమిటో పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: ఆదిత్యా రావు, సత్య యామిని 

దేనికో ఏమిటో 




చెలియ మాటే పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: హరిచరన్, సమీరా భరద్వాజ్ 

చెలియ మాటే 




సఖియా సఖియా పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ 
గానం: హైమత్, అపమ నందన్ 

సఖియా సఖియా 



ఓ మై డాడీ పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: ఫణి కళ్యాణ్ 

ఓ మై డాడీ 



నువ్వు లేవన్న పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: ప్రియాంకా, అపమ నందన్ 
గానం: అపమ నందన్ 

నువ్వు లేవన్న 

Palli Balakrishna Tuesday, October 8, 2019
Jersey (2019)




చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
విడుదల తేది: 19.04.2019



Songs List:



అదేంటొగాని పాట సాహిత్యం

 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: సంగీతం: అనిరుధ్

అదేంటొగాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కుమీద నేరుగా
తరాల నటి కోపమంతా... ఎరుపేగా
నాకంటూ ఒక్కరైనా లేరుగా
నన్నంటుకున్న తారవే నువా
నాకున్న చిన్ని లోకమంత నీ... పిలులేగా

తేరిపారా చూడసాగె దూరమే
ఏది ఏది చేరె చోటనే
సాగె క్షణము లాగెనే వెనకె మనని చూసెనే
చెలిమి చేయమంటు కోరెనే
ఓ ఓ ఓ ఓ
వేగమడిగి చూసెనే
అలుపే మనకి లేదనే వెలుగులైనా వెలసిపోయెనే
ఓ ఓ ఓ ఓ

చరణం:
మా జోడు కాగా
వేడుకేగా వేకువెప్పుడో తెలీదుగా
ఆ ఆ ఆ చందమామ మబ్బులో దాగిపోడా
హే వేళ పాళ మీకు లేదా
అంటు వద్దనే అంటున్నదా
ఆ...సిగ్గులోని అర్థమే మారిపోదా


ఏరి కోరి చేరసాగే కౌగిలే
ఏది ఏది చేరె చోటనే
కౌగిలిరుకు ఆయనే
తగిలే పసిడి ప్రాయమే
కనులలోనే నవ్వు పూసెనే

లోకమిచట ఆగెనే
ముగ్గురో ప్రపంచమాయెనే
మెరుపు మరుపుతోనే కలిసెనే

అదేంటొగాని ఉన్నపాటుగా
కాలమెటుల మారెనే
దొరికే వరకు ఆగదే
ఒకరు ఒకరుగానే విడిచెనే

అదేంటొగాని ఉన్నపాటుగా
దూరమెటుల దూరెనే
మనకే తెలిసె లోపలే
సమయమే మారిపోయెనే



Spirit Of Jersey పాట సాహిత్యం

 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం:  కాలభైరవ

Spirit Of Jersey

అనిగిమనిగిన అలలిక యెగిసెను చూడరా
అసలు అవదులు లేవురా
అలుపు దరికిక చెరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడర
పగలు మెరుపులు చూపర
వయసు సగముగ మారిపోయి ఓడెరా

గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలిమెన
దిగులే పడె మరుగునా
మొదలే ఇక సమరమా
పడిన బెదరక పదా
పరుగే విజయము కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే

తగలగ మేఘమె ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమె అడుగులొ చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నెడు వీడెలె
పరుగుల దాహమె బరువిక తెలికాయెలే

అనిగిమనిగిన అలలిక యెగిసెను చూడరా
అసలు అవదులు లేవురా
అలుపు దరికిక చెరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడర
పగలు మెరుపులు చూపర
వయసు సగముగ మారిపొయి ఓడెరా

గమనాలనే గమనించరా
గమనాలనే గమనించరా
ఒకరొజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా
గమనాలనే గమనించరా
ఒకరొజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా

పిడుగు వలెనె పడుతు కలుపు
ఇక ఈ నింగీ నేలా
ఉరుము మెరుపు బరిలో నిలుపు
ఇక అంతా నీదెరా
అడుగు కదుపు జయము జగము నీ
సొంతం అయ్యేలా
విదికి ఎదురు నిలిచి గెలిచి
నీ పంతాం చూపెలా

తగలగ మేఘమె ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమె అడుగులొ చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నెడు వీడెలె
పరుగుల దాహమె బరువిక తెలికాయెలె

అనిగిమనిగిన అలలిక యెగిసెను చూడరా
అసలు అవదులు లేవురా
అలుపు దరికిక చెరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడర
పగలు మెరుపులు చూపర
వయసు సగముగ మారిపొయి ఓడెరా

గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలిమెన
దిగులే పడె మరుగునా
మొదలే ఇక సమరమా
పడిన బెదరక పదా
పరుగే విజయము కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే

తగలగ మేఘమె ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమె అడుగులొ చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నెడు వీడెలె
పరుగుల దాహమె బరువిక తెలికాయెలె

అనిగిమనిగిన అలలిక యెగిసెను చూడర



పదే పదే పాట సాహిత్యం

 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: బ్రోధ. వి
గానం:  శక్తిశ్రీ  గోపాలన్, బ్రోధ. వి,  అనిరుధ్

ముద్దు పెట్టనా ఊపిరి పైనే
చుట్టు ముట్టనా ఆవిరి లానే
కన్ను కొట్టనా కోరికైనా నిన్ను ముట్టగానే

హత్తుకుందునా ఆఖరులానే
కొత్తగుందనే వైఖరిలోనే
ఎన్ని తిట్టినా ఆపను నేనే ఉండు గుట్టుగానే

పదే పదే పెదాలని
అదే పనై శ్రమించని
పదాలనే పండించని
ఇదే నదై ముంచెయ్యని

పదే పదే పెదాలని
అదే పనై శ్రమించని
పదాలనే పండించని
ఇదే నదై ముంచెయ్యని

I am in pursit of some therapy
As soon as the melody hits
I will never resist the minute I look at you licking you velvety lips
An endless abyss of animalistic energy heavenly thrills

I am letting your empathy enter the feeling I feel is so heavy and steadily builds
Aye yo, chalices of intimacy down
Always got my tunnel vision in focus when you're around
Always got my tunnel vision in focus when you're around

కనులకి కాపల లేదులే
కలలది ఆగని దూకుడే
కన్ను కొట్టనా కోరికైనా
నిన్ను ముట్టగానే

వయసుకి ఓపిక లోకువే
తనువుకి ఆశల తాకిడే
ఎన్ని తిట్టినా ఆపను నేనే
ఉండు గుట్టుగానే

రాలేవా రాలేవా వానల్లే నా మీద 
రాలేవా దేహం వేసవే
పోలేవా పోలేవా మాటేసే దూరాలు 
పోలేవా నీ నా కోసమే

పదే పదే పెదాలని
అదే పనై శ్రమించని
పదాలనే పండించని
ఇదే నదై ముంచెయ్యని

పదే పదే పెదాలని
అదే పనై శ్రమించని
పదాలనే పండించని
ఇదే నదై ముంచెయ్యని

Aye yo, chalices of intimacy down
Always got my tunnel vision in focus when you're around
Aye Yo, chalices of intimacy down
Always got my tunnel vision in focus when you're around

కనులకి కాపల లేదులే
కలలది ఆగని దూకుడే
వయసుకి ఓపిక లోకువే
తనువుకి ఆశల తాకిడే



ప్రపంచమే అలా పాట సాహిత్యం

 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం:  శశా తిరుపతి , ఇన్నో జంగా 

ప్రపంచమే అలా నిద్దర్లొ ఉందిగా
నవ్వేమొ మేలుకుందిగా పెదాలపై ఇలా
ఆనందమే ఇలా రమ్మందిలే పదా
హుషారు వీధి వైపుగ షికారుకె పదా

ఇటే చీకటె..వెకువై వాలెనా
మరో తీరమే..చేరగ మేమిల

మా కన్నులు వదిలి మరి కలా
మా ఎదురు నిలిచి పిలిచే వేల
మ మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచె వెలుగిదేలా

మా కన్నులు వదిలి మరి కలా
మా ఎదురు నిలిచి పిలిచే వేల
మ మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచె వెలుగిదేలా

ప్రతి క్షణము బ్రతుకు ఒక జగడమె
తెగ పరుగు నడుమ ఇది ఎరగమె

మది కుదుటు పడిన
తొలి తరునమె
ముడి నుదుట విడిన
చిరు సమయమె

పసి వయసు మనిషికొక వరములె
అది తెలిసే సరికే మరి మిగలదె
ముది ముడత అనునదొక తనువుకె
ప్రతి ముడత వెనక గలదొక కథె

ఇటె చీకటె..వెకువై వాలెన
మరో తీరమె..చేరగ మేమిల

మా కన్నులు వదిలి మరి కల
మా ఎదురు నిలిచి పిలిచే వేల
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచె వెలుగిదేలా

మా కన్నులు వదిలి మరి కల
మా ఎదురు నిలిచి పిలిచే వేల
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచె వెలుగిదేలా



నీడ పడదని పాట సాహిత్యం

 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం:  దర్శన్ రవల్

నీడ పడదని మంటననగలరా
నువ్వంటు లేవంటూ
కాని కలలకు కాంతినడిగెదరా
తప్పుంటె లేదంటు

పడిన నేలా
పడిన నేలా
వదలదేల నిలువు నీల
కదపలేల
యెదురుగాలె చెదిరిపోద

కాల్చొద్దు అంటే కాదు స్వర్నం
వోడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటె కష్టం హాయి వ్యర్ధం
యెవరికోసం మారదర్దం

కాల్చొద్దు అంటే కాదు స్వర్నం
వోడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటె కష్టం హాయి వ్యర్ధం
యెవరికోసం మారదర్దం

ఓటమెరగని ఆట కనగలవ
ఉందంటె కాదాటె
దాటి శిషువుగ బైట పడగలవ
నువ్వంటు ఒద్దంటె

అడుగు దూరం
విజయమున్న విడిచిపోన
కదలలేక
వదలలేక చెదిరిపోన

కాల్చొద్దు అంటే కాదు స్వర్నం
వోడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటె కష్టం హాయి వ్యర్ధం
యెవరికోసం మారదర్దం

కాల్చొద్దు అంటే కాదు స్వర్నం
వోడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటె కష్టం హాయి వ్యర్ధం
యెవరికోసం మారదర్దం




ఆరంభమే లే పాట సాహిత్యం

 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం:  అనిరుధ్ , శ్రీనిధి వెంకటేష్ 

ఆరంభమే లే

Palli Balakrishna Sunday, February 17, 2019

Most Recent

Default