Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Shraddha Das"
Guntur Talkies (2016)

చిత్రం: గుంటూర్ టాకీస్ (2016)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రేష్మి గౌతమ్, శ్రద్ధా దాస్, నరేష్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాత: యమ్. రాజకుమార్
విడుదల తేది: 04.03.2016







చిత్రం: గుంటూర్ టాకీస్ (2016)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కృష్ణ మదినేని
గానం: అంబిక సాషితల్, అనంత్ శ్రీకర్

నర నరము పూల రధమై రగిలే ఇటు రారా
అణువణువు నీది అనన ఇలా
రసికతలో నీకు ఎవరూ జగమున సాటి రారురా
అని తెలిపే మాట నిలుపు హలా...

ఏదో చెయ్యి నాతోటి కలిసి పరువం నీదెరా
ఎదభారం మోయానాలోన కురిసే అలుపేరాదురా
మొహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా
ఒక మేఘం లోన లోకాలు కదిపే హాయే చూపరా

నీ సొంతం నేనిక ఒడిలో అందం నీది గా
భరిలో అంతం చూడిక  తొలిగా పలికా 
ఓ గాయం చేయరా జతలో సర్వం దోచరా
మరల తాపం లేపరా వడిగా తడిగా 

నీ కోసం నాలోన ప్రాయం దాచా ఏనాడో
ఆ సాగర కెరటం లో పడిపోనా పైన
ఈ గాజుల గోలేదో మళ్ళీ మళ్ళీ మోగాలి
ఆ కాలి మువ్వేమో ఊగి ఊగి అలిసేపోని

తొలి సారి ఒక దాహం తీరెనే తియ్యగా
మలి సారి ఒక భావం రేగెనే హాయిగా హా...
తనువంతా ఒక వైరం కోరెనే మోజుగా హా...
వయసంతా అర విరిసే తడిసే సేదంలో

నీ వేడి కౌగిలి అడిగా ఇష్టం తీరక 
నిమిషం విడిచి ఉండక దరికే జరిగా
నీ వెనకే నేనిలా నడిచా నీలో భాగమై 
సగమైపోయి నేడిల పనిలో పనిగా పని గా


Palli Balakrishna Thursday, March 4, 2021
Siddu from Sikakulam (2008)


చిత్రం: సిద్దు from శ్రీకాకుళం (2008)
సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణన్
నటీనటులు: అల్లరి నరేష్ , మంజరి, శ్రద్దా దాస్
దర్శకత్వం: ఈశ్వర్
నిర్మాత: మల్లా విజయ్ ప్రసాద్
విడుదల తేది: 14.08.2008

Palli Balakrishna Friday, February 15, 2019
Siddu from Sikakulam (2008)

చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: గాయత్రి
నటీనటులు: అల్లరి నరేష్ ,మంజరి ఫాదనిస్, శ్రద్ధా దాస్
దర్శకత్వం: ఈశ్వర్
నిర్మాత: మళ్ళ విజయప్రసాద్
విడుదల తేది: 14.08.2008

పల్లవి:
తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని
మనసు కనక మనవి వినక
చలికి మరి దూరాన ఉంటే ఎలా

తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని

చరణం: 1
ఆ నింగి జాబిలమ్మ తొడుగానే ఉందిగా
చుక్కే నీదంటు పక్కే రమ్మంటే చూస్తావే అలా

తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని

చరణం: 2
ఏమంత లేనిదాన్ని కానిదాన్ని కానుగా
ఇలా చీ పో లు పై పై కోపాలు నాపై నీకిలా

తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని
మనసు కనక మనవి వినక
చలికి మరి దూరాన ఉంటే ఎలా

తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని


Palli Balakrishna Thursday, March 15, 2018
PSV Garuda Vega (2017)



చిత్రం: గరుడ వేగ (2017)
సంగీతం: శ్రీ చరణ్ పాకల, భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: రాజశేఖర్ , పూజా కుమార్, శ్రద్దా దాస్, సన్నీ లియోన్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తార్
నిర్మాతలు: యమ్. కోటేశ్వర రాజు
విడుదల తేది: 03.11.2017



Songs List:



డియ్యో డియ్యో డిస్సక డిస్సక పాట సాహిత్యం

 
చిత్రం: గరుడ వేగ (2017)
సంగీతం: శ్రీ చరణ్ పాకల, భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: గీతామధురి, రఘురామ్, భీమ్స్ సిసిరోలియో

నీ చుట్టుకొలతకి చుట్టూపక్కల చానా ప్రేరుంది బేబీ
నాటు సారా కన్న పిల్లా నువ్వే కిక్కంటారే
లారీలకి  వచ్చేత్తారే నువ్వంటే చచ్చిపోతారే 

అల్లో నేరేడు  అల్లో నేరేడు 
అల్లో నేరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు
నన్నే చుస్తే కోరికలోనే ఔటై పోతారూ

డియ్యో డియ్యో డిస్సక  డిస్సక 
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక  డిస్సక డిస్సక డిస్సక డీ

చూపులకో రేటు మాటలకో రేటు 
నవ్వులకో రేటు నా నాడుముకో రేటు
గంపగుత్తగ కావాలంటే ఇస్తా రిబేటు

డియ్యో డియ్యో డిస్సక  డిస్సక 
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక  డిస్సక డిస్సక డిస్సక డీ

ఒంపు సొంపుల్సే జస్టు శాంపిల్సే
చాటుకొస్తే చూపిస్తా నా చాలా యాంగిల్సే

హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో 
ఆ రర రర డియ్యో డియ్యో డిస్సక  డిస్సక 
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక  డిస్సక డిస్సక డిస్సక డీ

సైడేంగిల్లో నేను సిమ్లా ఆపిల్ 
వైడేంగిల్లో నేను ఓడ్కా బాటిల్

డియ్యో డియ్యో డిస్సక  డిస్సక 
డిస్సక డిస్సక డిస్సక డిస్సక

టాప్ యాంగిల్లో నేను రెనాల్డ్ రీఫిల్ లా
లో యాంగిల్లో లోడ్ చేసిన రైఫిల్ 
ఆ రైటేంగిల్లో జిలేబిలా నోరూరించే టైపు
ఈ లెఫ్టేంగిల్లో మిర్చీలాగ అల్లాడించే టైపు
నా కట్టలు విప్పి కన్నే కొట్టాలా

హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో 
ఆ రర రర డియ్యో డియ్యో డిస్సక  డిస్సక 
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక  డిస్సక డిస్సక డిస్సక డీ

నైటింగేలే నేను నైటేంగిల్లో
హీటెక్కిస్తా జారు పైటేంగిల్లో

డియ్యో డియ్యో డిస్సక  డిస్సక 
డిస్సక డిస్సక డిస్సక డిస్సక

ఫైటే చేస్తా నేను ఫ్రంటేంగిల్లో
టెంప్టే చేస్తా ఫుల్ టైటేంగిల్లో
ఒక్కోడికి ఒక్కో యాంగిల్ నచ్చేస్తుంటాదబ్బి
నీకేయాంగిల్లో నచ్చుద్దో చూస్కోరా ఎంకట సుబ్బి
నీ డియోడ్రెంట్ నేనే అవ్వాలా

హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో 
ఆ రర రర డియ్యో డియ్యో డిస్సక  డిస్సక 
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక  డిస్సక డిస్సక డిస్సక డీ

డియ్యో డియ్యో డిస్సక  డిస్సక 
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక  డిస్సక డిస్సక డిస్సక డీ




ప్రేమలే పాట సాహిత్యం

 

చిత్రం: గరుడ వేగ (2017)
సంగీతం: శ్రీ చరణ్ పాకల, భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: శక్తిశ్రీ గోపాలన్ , ఎల్.వి.రేవంత్ 

ప్రేమలే 

Palli Balakrishna Tuesday, October 17, 2017
Rey (2015)

చిత్రం: రేయ్ (2015)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, శ్రద్ధా దాస్, సయామి కెహర్
దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి
నిర్మాత: వై. వి.యస్. చౌదరి
విడుదల తేది: 27.03.2015

ప్రియతమా ఎందుకే చంపుతావే నన్నిలా
మనసులో గుణపమే దించుతావే ఇంతలా
ప్రియతమా...

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ (2)

కింగ్ లాగ ఉండేవాన్ని కులాషాగ తిరిగేవాన్ని
భాదలేమి తెలియని వాణ్ణి బిందాస్ గా బ్రతికేవాణ్ణి
నిన్నే నే చూశాను నీ చుట్టు తిరిగాను
శని పట్టి సన్యాసయ్యను
నీకే మనసిచ్చాను నిన్నే ప్రేమించాను
నిలువెల్లా నాశనమయ్యాను

ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఓ ఓ హో
ఓ సమ్మగుందిరో ఓ హో ఓ హో...
నా చెలినందుకే ఏ ఏ ఏ ఏ
వడలబోనురో... ఓ

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ

గురియైన అంతో ఇంతో డమ్ డమ్ అని కలిసే
పువ్వైతే ఎంతో కొంత లోతుల్లో ధమ్ ధమ్ అని కలిసెనే
నీవల్లే లోతే తెలియని ప్రేమల్లో నే మునిగానే
నీ వల్లే తీరం చేరని దారుల్లో నే తిరిగానే
సునామీలు ఎదురవగా సుడుల్లోన పడిపోగా
నీళ్ళల్లో కన్నిరాయెనే
కన్నీరే కనుమరుగాయెనే

ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఓ ఓ హో
ఓ సమ్మగుందిరో ఓ హో ఓ హో...
తాను చస్తే ఎహ ఎహ నేను చస్తారా

స్వర్గానికి తనుపోతే తనవెనకే నే పోతా
తనుతాగే అమృతమైపోతా
నరకానికి తను పోతే తనపక్కన నేనుంటా
తన శిక్షలు నాకే ఇవ్వమంటా

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ

ఇన్నాళ్లు సంతోషాల దేశాలెన్నో ఏలానే
ఇన్నాళ్లు ఆనందాల ఆకాశంలో ఎగిరానే
నీతోని జంటే కోరి శూన్యంలోకే జారానే
నీ పైనే ప్రాణాలుంచి సున్నా నేనై మిగిలానే
నిప్పు ఉప్పెనెదురైనా మంట చుట్టుముడుతున్నా
మసిబారి మళ్ళీ వస్తానే కసితీర నిను కదిలిస్తానే


ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఓ ఓ హో
ఓ సమ్మగుందిరో ఓ హో ఓ హో...
నన్ను కుడితే ఏయ్ ఏయ్ ఏయ్ నేను కుడతా

ఏ జీవిగ తానుంటే ఆ జీవిగ నేనుంటా
నా జీవిత లక్ష్యం ప్రేమంటా
ఏ జాతిలో తానుంటే ఆ జాతిలో నేనుంటా
నా ప్రేమకు జాతర జరిపిస్తా

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ
ఎందుకే చంపుతావే నన్నిలా ఓహో
ఓ ప్రియతమా... ఎందుకే చంపుతావే నన్నిలా ఓహో

Palli Balakrishna Sunday, October 15, 2017
Nagavalli (2010)



చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
నటీనటులు: వెంకటేష్ , అనుష్క శెట్టి, రీచా గంగోపాధ్యాయ, శ్రద్ధా దాస్, కమిలిని ముఖర్జీ
దర్శకత్వం: పి.వాసు
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 16.12.2010



Songs List:



అభిమాని లేనిదే పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే
హీరో నువ్వే లీడర్ నువ్వే
ఓనర్ నువ్వే దైవం నువ్వే
వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా
నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే

చరణం: 1
నీ శక్తే ఆయుధము నీ ప్రేమే ఆలయము నమ్మరా ఒరేయ్ తమ్ముడా
నీ చెమటే ఇంధనము ఈ దినమే నీ ధనము లెమ్మురా నువ్వో బ్రహ్మరా
మనసే కోరే మందు ఇదే
మనిషికి చేసే వైద్యమిదే
అల్లోపతి టెలీపతీ
అల్లోపతి హోమియోపతి అన్నీ చెప్పెను నీ సంగతి

వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
 
ఒణకు బెణుకు తొణుకు వదలరా
జర ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే

చరణం: 2
సంతృప్తే చెందడమూ సాధించేదాపడమూ తప్పురా అదో జబ్బురా
సరిహద్దే గీయటమూ స్వప్నాన్నే మూయటమూ ముప్పురా కళ్లే విప్పరా
ఆ లోపాన్నే తొలగించు ఆశయాన్నే రగిలించు
దేహం నువ్వే ప్రాణం నువ్వే
దేహం నువ్వే ప్రాణం నువ్వే దేశానికి గర్వం నువ్వే

వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

చమకు చమకు చురుకు చూపైరా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే
హీరో నువ్వే లీడర్ నువ్వే
ఓనర్ నువ్వే దైవం నువ్వే
వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా
నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా





వందనాలు వందనాలు పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్ కృష్ణన్, నందిత , షమిత మల్నాడ్ 

వందనాలు వందనాలు 




గిరిని గిరిని పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు 

గిరిని గిరిని 





ఖేలో ఖేలో పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్, జోగి సునీత 

ఖేలో ఖేలో



ఓంకార పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర 

ఓంకార 




రారా రీమిక్స్ పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: నిత్యశ్రీ మహదేవన్, శ్రీ చరణ్ 

రారా రీమిక్స్ 


Palli Balakrishna Monday, August 7, 2017
Arya 2 (2009)




చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్
దర్శకత్వం: సుకుమార్
నిర్మాత: ఆదిత్య బాబు
విడుదల తేది: 27.11.2009



Songs List:



మిస్టర్ పర్ఫెక్ట్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కేదారినాథ్ పరిమి
గానం: బాబా షెహగల్, దేవిశ్రీ ప్రసాద్


హే టిప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడు లెండో
ముదురండో గడుసండో తొడిగిన ముసుగండో
ఉప్పుకప్పు రంబు నొక్క లుక్కునుండో
వీడి లుక్కు చూసి మోసపోకండో
ఎదవండో బడవండో వలలో పడకండో

కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు
కమాన్ కమాన్ మస్తు టైమింగు
కమాన్ కమాన్ రైటులలొరాంగు ఏ యాయి యయ్యో
కమాన్ కమాన్ కోతలల కింగు
కమాన్ కమాన్ మార్చె తన రంగు
కమాన్ కమాన్ పక్కా ప్లానింగు ఏ యాయి యయ్యో

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

హో వీడో పెద్ద వెదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు
వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా కందిపోయింది
కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో
ఇలాంటోళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ
అయినా ఇంకోసారి ట్రై చేస్తా
తప్పకుండా వీడి తాటతీస్తా

సారీ నేను గుడ్ బాయ్ లా ఉండాలనుకొంటున్నాను
అందుకే అందరిముందు కాల్చను

హిప్పులూపుతున్న క్యాటు వాకులండో
క్రోకడైల్ వీడు కాలు జారకండో
బ్రూటండో బ్రైటండో లైఫే చూస్తుండో
మేడి పండులాంటి మ్యాన్ వీడండో
మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండో
చీటండో చీపండో గజిబిజి పజిలండో

కమాన్ కమాన్ హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్
కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్
కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే
కమాన్ కమాన్ హీస్ ద జ్యాదుగర్
కమాన్ కమాన్ హి గీవ్స్ యు ఫీవర్
కమాన్ కమాన్ హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే హే

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ (2)

కమాన్ కమాన్ ఓరి గోవిందో
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తాడయ్యో
కమాన్ కమాన్ హరియవో సాంబో
కమాన్ కమాన్ రేగింది పంబో
కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్



ఉప్పెనంత ఈ ప్రేమకీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: బాలాజి
గానం: కె.కె

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకీ ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో

I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా 
I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా 


ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావూ
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావూ
తీసుకుంటె నువ్వు ఊపిరీ పోసుకుంట ఆయువే చెలీ
గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరా సరీ !

I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

చినుకులే నిను తాకీ మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకూ తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే !

I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా
I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో



బేబీ హి లవ్స్ యు పాట సాహిత్యం

 
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవిశ్రీ ప్రసాద్

ఛ… వాడికి నా మీద ప్రేమే లేదు హి డసంట్ లవ్ మి యు నో
నో హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
అవునా ఎంత? ఊ... ఎంతంటే
ఆ మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంత
ఓ... ఇంకా...
హో తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన
అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
హో చల్ల బువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్

హే అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తోణికే గాలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు,  లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్

హాయ్ పంటచేలలోని జీవమంత ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమోచ్చినా వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత రామలాలి అంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు,  లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్

పచ్చి వేప పుల్ల చేదు అంత రచ్చబండ పైన వాధనంత
అర్ధమైన కాకపోయినా భక్తికొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోని జాబిలంత ఏట ఏట వచ్చే జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు,  లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్

అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
హో బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబి బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు,  లవ్స్ యు టూ మచ్

ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, ఐ లవ్ యు సో మచ్



రింగ రింగ పాట సాహిత్యం

 
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ప్రియ హమేశ్

ఓ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (2)
పాషు పాషు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (2)

రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేసాను
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (2)
ఎయిర్ బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి
ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురు చూసినా
ఎవరి కోసం!
బోడి మూతి ముద్దులంటే బోరే కొట్టి కోరమీస కుర్రగాళ్ళ ఆరా పట్టి
బెంగుళూరు కెల్లినాను మంగళూరు కెల్లినాను
బీహారు కెల్లినాను జైపూరు కెల్లినాను
రాయలోరి సీమకొచ్చి సెట్ అయ్యాను

ఓహో మరిక్కడి కుర్రోల్లేం చేశారు?

కడపబాంబు కన్నులతో యేసి కన్నెకొంప పేల్చేసారు అమ్మనీ
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
వేట కత్తి ఒంట్లోన దూసి సిగ్గుగుత్తి తెంచేశారు
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

వాయించెహె
హే రింగ రింగా రింగా రింగ రింగా రింగా (2)

ఇదిగో తెల్లపిల్ల అదంతా సరేగాని అసలు ఈ రింగ రింగ గోలేంటి?

అసలుకేమో నా సొంత పేరు యాండ్రియానా స్పైసో రింగా
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
పలకలేక ఈల్లెట్టినారు ముద్దుపేరు  రింగా రింగా
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
జీన్స్ తీసి కట్టినారు ఓణీ లంగా పాపినారు పెట్టినారు సవరం బాగా
రాయిలాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా
ఇంగ్లీషు మార్చినారు ఎటకారంగా!
ఇంటి యెనకకొచ్చినారు యమకారంగా 
ఒంటిలోని వాటరంతా చెమటలాగ పిండినారు
ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు 
ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు

అయిబాబోయ్ తాగేశారా? ఇంకేం చేశారు?

పుట్టుమచ్చలు లేక్కేట్టేశారు లేని మచ్చలు పుట్టించారు
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
ఆఁ ఉన్న కొలతలు మార్చేసినారు రాని మడతలు రప్పించారు
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
ఇదిగో ఫారిన్ అమ్మాయి ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవర్?
హా పంచకట్టు కుర్రాల్లలోని పంచ్ నాకు తెలిసొచ్చింది 
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
ముంతకల్లు లాగించేటోల్ల స్ట్రెంగ్త్ నాకు తెగ నచ్చింది 
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
నీటి బెడ్ సరసమంటే గర్రు గర్రు నులకమంచమంటే ఇంకా కిర్రు కిర్రు
సుర్రుమన్న సీనులన్ని ఫోన్లో ఫ్రెండ్స్ తోటి చెప్పినా

చెప్పెసావేటి?

ఫైవ్ స్టార్ హోటల్ అంటే కచ్చా బిచ్చా 
పంపు సెట్టు మేటర్ ఐతే రచ్చో రచ్చా
అన్నమాట చెప్పగానే ఐర్లండు గ్రీన్లాండు, న్యూజిలాండు, నెదర్లాండు థాయ్ లాండు
ఫిన్ లాండు అన్ని లాండుల పాపలీడ ల్యాండ్ అయ్యారు
లాండయ్యరా! మరి మేమేం చెయ్యాలి?
హాండు మీద హాన్డేసేయ్యండీ లాండు కబ్జా చేసేయ్యండీ
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
హాండు మీద హాన్డేసేస్తామే లాండు కబ్జా చేసేస్తామే
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే



కరిగేలోగా ఈ క్షణం పాట సాహిత్యం

 
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వనమాలి
గానం: కునల్ గంజువాలా, మేఘా

ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా

ఓ... ఓ... ఓ... ఓ...

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ
నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ
నేడీ బంధానికి పేరుందా ఓ
ఉంటే విడదీసే వీలుందా ఓ

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా

హే... హే... హే... హే...
హే... హే... హే... హే... హే... హే

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే
మరునిముషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే
నువు పెంచవా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ
నా బాధంతటి అందంగా ఉందే ఓ
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే ఓ
మరుజన్మే క్షణమైనా చాలంతే ఓ

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ

ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...



మై లవ్ ఈజ్ గాన్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్

మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే
ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే
ఇక ఓటమెంత బాగుందే

మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

ఏ గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే
సరస్సు నిండిపోతుందే సోగస్సు కరిగిపోతుందే
మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే
ఇక మౌనమెంత బాగుందే...

మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

హానెస్టుగుండే పనిలేదే ది బెస్టుగుండే పనిలేదే
హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మలిచే పనిలేదే
కెరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళల్లోనా మిగులుతారే
లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు హిస్టరీలోన వెలుగుతాడే...

మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్



మిస్టర్ పర్ఫెక్ట్ (Remix) పాట సాహిత్యం

 
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కేదారినాథ్ పరిమి
గానం: దేవి శ్రీ ప్రసాద్

Yo Everybody  such  a feet on the floor
this DSP and Aarya once more 

మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్

హే టిప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడు లెండో
హే టిప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడు లెండో
ముదురండో గడుసండో తొడిగెను ముసుగండో
ఉప్పుకప్పు రంబు నొక్క లుక్కునుండో
వీడి లుక్కు చూసి మోసపోకండో
ఎదవండో బడవండో వలలో పడకండో

కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు
కమాన్ కమాన్ మస్తు టైమింగు
కమాన్ కమాన్ రైటులలొరాంగు ఏ యాయి యయ్యో
కమాన్ కమాన్ కోతలల కింగు
కమాన్ కమాన్ మార్చె తన రంగు
కమాన్ కమాన్ పక్కా ప్లానింగు ఏ యాయి యయ్యో

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

హో వీడో పెద్ద వెదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు
వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా ఎండిపోయింది
కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో
ఇలాంటోళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ
అయినా ఇంకోసారి ట్రై చేస్తా
తప్పకుండా వీడి తాటతీస్తా

హిప్పులూపుతున్న క్యాటు వాకులండో
క్రోకడైల్ వీడు కాలు జారకండో
బ్రూటండో బ్రైటండో లైఫే చూస్తుండో
మేడి పండులాంటి మ్యాన్ వీడండో
మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండో
చీటండో చీపండో గజిబిజి పజిలండో

కమాన్ కమాన్ హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్
కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్
కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే
కమాన్ కమాన్ హీస్ ద జ్యాదుగర్
కమాన్ కమాన్ హి గీవ్స్ యు ఫీవర్
కమాన్ కమాన్ హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే హే

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

కమాన్ కమాన్ ఓరి గోవిందో
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తాడయ్యో
కమాన్ కమాన్ హరియవో సాంబో
కమాన్ కమాన్ రేగింది పంబో
కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

Yo Everybody  such  a feet on the floor
DSP will sing song more

Comon Everybody lets burn the floor DSP and Aarya once more

Palli Balakrishna Thursday, July 27, 2017

Most Recent

Default