Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sankranthi Songs"
Sankranthi Song (2019)


పాట: సంక్రాంతి పాట (2019)
సంగీతం: SK.బాజీ
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్
గానం: మంగ్లీ


సంక్రాంతి పాట (2019) సాహిత్యం

 
రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు 
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు 
పట్టు పరికిణి కట్టి చుక్కల వరసలు పెట్టి 
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి..
కోడితో పందెం కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి 
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి 

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

పంతాలతో రగిలిన మన రాయలసీమ. 
ఆనందాలకు సంక్రాంతే చిరునామా
పౌరుషాల వెలివేసిన పండుగ నీవు
ప్రేమలతో  ప్రతి గుండెల పెనవేసావు
తెలతెలవారుతుంటే రాజేసే భోగి మంట 
కొత్త అల్లుళ్ళతో  కోనసీమ మురిసేనంట
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా
ఊరిని తలుచుకొని తన్మయమే చెందేనట

ఆట పాటలకే  పట్టం కట్టి 
సంతోషాలకే శ్రీకారం చుట్టి..
తరలి తరలి వచ్చెనదిగో సంక్రాంతి
ప్రేమల చిరునామా..రాయలసీమ 
అనురాగాల రాగం పాడేనమ్మా
పసిడి కోనసీమ  పంటచేల నడుమ 
పరువాల గోదావరి పారేనమ్మా
పంటలు కానుక ఇచ్చి 
రైతుల కలలను తీర్చి 
పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి
పచ్చి పాలజల్లు పచ్చని పొదరిల్లు
పైరులతో పల్లెలన్నీ విలసిల్లు
మంచు పూలజల్లు పరిమళాలు చల్లు
వేలాది పువ్వుల కల్లాపిని చల్లు

ఏరువాక ఎదల మీద పంటను తీసి 
సంచారజాతికింత దానం చేసి
గోమాత, భూమాతల పూజలు చేసి 
హరిదాసుల కీర్తనలు గానం చేసి
నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణం..
బొమ్మల కొలువులోన కొలువుదీరే పసితనం 
పసుపు కుంకుమలే పడతులకు వాయనం
గగనం తాకునమ్మా గాలిలోన పతంగం
స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం 
ఉత్తర దిక్కున భానుడి  సంచారం 
తెలంగాణ, ఆంధ్రులకు చెరిపెను దూరం

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు 
పట్టు పరికిణి కట్టి చుక్కల వరసలు పెట్టి 
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి
కోడితో పందెం కట్టి. ఎడ్లతో పరుగులు పెట్టి 
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే    సంక్రాంతి 

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

Palli Balakrishna Saturday, May 29, 2021
Sankranthi Song (2018)


పాట: సంక్రాంతి పాట (2018)
సంగీతం: నందన్ బొబ్బిలి
సాహిత్యం: కందికొండ
గానం: మంగ్లీ


సంక్రాంతి పాట (2018) సాహిత్యం

 
భోగిమంటలు, సంక్రాంతులు
కనుమ పూజలు, సరదాలు
హరిదాసులు, బసవడాటలు
భోగిపండ్లతో దీవెనలు
ఇది మూడు రోజుల సందడులు 
ప్రతి రైతు గుండెకు పండుగలు
ఇటు పిండి వంటల ఘుమఘుమలు
అటు బొమ్మల కొలువుల సరిగమలు

హే రంగు పతంగి వచ్చింది
నింగి సింగిడి అయ్యింది
హే. చల్ చరక్ తెచ్చింది
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

హే పాత బస్తీకి జావో
హే దూళ్ పేటకు భాగో
ఇటు మాంజా లేజా
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

ఆ.. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే
ఉత్తరాన భానుడు నిలిచాడే
ఈ మకర రాశి లోకి అడుగు వేసే
తన దిశను నేటితో మార్చేసే

చెట్లు పూలను పూసేలే పండ్లు నిండుగా కాసేలే
ఇంట్లో పంటలు నిండే పశువులు పాడిని చిందే
బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే
సంక్రాంతి ఇంటికి వచ్చేసే
గుండె వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే
జ్ఞాపకాల ముద్దరలేసే

హే చిచ్చా లచ్చా మారేంగే
హే గోల్కొండకు జాయేంగే
హే మచ్చా డీల్ మారేంగే
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

హే మేరా ప్లాస్టిక్ మాంజా
హే తేరా నైలాన్ మాంజా
హే మామ పేంచ్ కి ఆజా
కీంచ్ కాంట్ ఆఫా కరేంగే
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం
మకరరాశి తొంగి చూసి ఆయుష్షు పోసే
కనుమనాటి యోగం గోవులకు స్నానం
పశువుల పాదాలు మొక్కి రైతు తరించే
కడప వీధులు కనుమకు కదం తోక్కెగా
ఒంగోలు లో గిత్తలు పోటికురిగేగా

పల్లెల్లో ముగ్గుల పందెం
భూమికే అద్దెను అందం
గొబ్బెమ్మలు చుట్టూ గానం 
ఆడబిడ్డలు చేసే దైవమిచ్చే దీవేనలీనాదేలే
కష్టం మరిచి కళ్ళు మెరిశాయే
ఇండ్లు ఇంధ్రధనస్సులయ్యాయే

హే చల్ డబీర్ పుర
హే నడువ్ దూద్ బౌళి
హే మంచి పతంగి తెద్దాం
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

హే చల్ పోటీకి పోదాం
హే దిల్ జీతాయిద్దాం
హే దమ్ము చూపించొద్దాం
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం
కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం
సమర రణ నినాదం పందెం కోళ్ళ పందెం భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం

పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చేగా
రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చేగా
మంచుతో కప్పిన చెట్లు అందాల ముగ్గుల మెట్లు 
కన్నతల్లి పిలిచినట్టు రా రమ్మని పిలిచే

గుండె ఎగిరి పుట్టినింట వాలేలే
పుట్టిన ఊరు చూసి నయనాలే
కృష్ణా గోదావరి నదులాయే
కృష్ణా గోదావరి నదులాయే

ఆ...దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే
ఉత్తరాన భానుడు నిలిచాడే
ఈ మకర రాశి లోకి అడుగు వేసే
తన దిశను నేటితో మార్చేసే


Palli Balakrishna Friday, May 28, 2021
Sankranthi Song (2020)




పాట: సంక్రాంతి పాట (2020)
సంగీతం: మదీన్ ఎస్ కె
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ


సంక్రాంతి పాట (2020) సాహిత్యం

 
సంక్రాంతి పాట (2020)

Palli Balakrishna

Most Recent

Default