Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sai Dharam Tej"
BRO (2023)



చిత్రం: BRO (2023)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ , కేతిక శర్మ , ప్రియాప్రకాష్ వారియర్ 
దర్శకత్వం: సముద్రఖని
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్
విడుదల తేది: 2023



Songs List:



# పాట సాహిత్యం

 
చిత్రం: BRO (2023)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ఎల్.వి.రేవంత్, స్నిగ్డా శర్మ

ఇంట్రో ఆపు
దుమ్ము లేపు

డాన్స్ బ్రో
లైక్ బ్రో

హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీ నే జుక్ బాక్స్ బ్రో

హే రాచో రచ్చ రాక్స్ బ్రో
మజ పిచ్చ పీక్స్ బ్రో
మనల్నఆపె మగాడెవడు బ్రో

అరె లేంతూ చూస్తే ప్రతి
లైఫ్ వెరీ షార్ట్ ఫిల్ము
ఎహె కుసింతయినా దాని సైజు
పెంచలేవు నమ్ము

కానీ నువ్వు గాని
తలుచుకుంటే
ప్రతి ఒక్క ఫ్రేము

భలే కలర్ఫుల్ Ga
మార్చగలవురో

మై డియర్ మార్కండేయ మంచి
మాట చెప్తా రాసుకో
మల్లి పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

హే పక్క దిగి నిద్దర్లేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైం లోన
అంతో ఇంతో అనుభవించి పో

హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీ నే జుక్ బాక్స్ బ్రో

హే రాచో రచ్చ రాక్స్ బ్రో
మజ పిచ్చ పీక్స్ బ్రో
మనల్నఆపె మగాడెవడు బ్రో

హే ఆయా రేయ్ ఆయా రేయ్
సితార మంజరి సితార మంజరి
మంజరి మంజరి
సిలిపి సితార మంజరి

మెయిన్ హుం సితార మంజరి
రయంట సరాసరి
రెక్కల గుర్రం ఎక్కి
ఇట్టా వచ్చా మేస్తిరి

చానా చానా చాకిరి
పొద్దంతా మీరు చేస్తిరి
కేంప్ల్సేరి చిల్లవ్వాలి
చీకటి రాతిరి

మీ ఎంటర్టైన్మెంట్కు
ఇస్తా గారంటీ
మీరు హ్యాపీ అయితే అంతే
చాలు అదే రాయల్టీ

మీ ఆహ ఓహో లేగ నాకు
నచ్చే కామెంటరీ
మీరు మల్లి మల్లి రారమ్మన్న
ఇస్తా రి ఎంట్రీ

హే ఆయా రేయ్ ఆయా రేయ్
సితార మంజరి సితార మంజరి
మంజరి మంజరి
సిలిపి సితార మంజరి

యహ లైఫ్ అన్నాక ఉండాలిగా
రిలీఫ్ అన్న మాట
యహ మూడొచ్చాక ఆడలిగా
హుషారైన ఆట

యహ బిజీ పనుల గజి బిజీ
ఎక్కువైనా పూట
రవ్వంత ఖుషి రాంగే
కాదట

మై డియర్
మై డియర్ మార్కండేయ

మై డియర్ మార్కండేయ మంచి
మాట చెప్తా రాసుకో
మల్లి పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

హే పక్క దిగి నిద్దర్లేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైం లోన
అంతో ఇంతో అనుభవించి పో




జాణవులే నెర జాణవులే పాట సాహిత్యం

 
చిత్రం: BRO (2023)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: యస్.యస్.థమన్, కె.ప్రణతి 

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ద నాట్ బేబీ

జాణవులే నెర జాణవులే
నా జానే నువ్వులే
జాణవులే వాణివిలే
అలివేణివిలే
నా మూను నువ్వులే
జాణవులే…

హే బంగారు కొండలా
ముందుంటే నువ్విలా
గోరెచ్ఛ ఎండలా తోచావులే
నీ రెండు కన్నులా
పున్నామి వెన్నెలా
ఈ చిట్టి గుండెలో వాలేనులే

నువ్వు తకిట తకిట అడుగు పెడితే
నేల నెమిలి కాదా
నువ్వు అచ్చట ఇచ్చట ఎదురుపడితే
మనసు గొలుసు తెంచుకోదా

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ద నాట్ బేబీ

టుగెదర్ టుగెదర్
ప్రేమ దేశమేలుకుందమా
ఉందమా ఉందమా ఉందమా
ఫరెవర్ ఫరెవర్
ఒకరి కోసమొకరముందమా
ఉందమా ఉందమా ఉందమా

జాణవులే నెర జాణవులే…

కుశలమా కునుకు మరచి ఓ నేస్తమా
కలలతో కలత నిదుర నీ బంధమా
తెలుసునా మాట నేర్చిన మౌనమా
కలిసిన కులుకుతోటి నీ స్నేహమా

నా ఎదలో కధను మొదలు పెడితే
ముందు మాట నీదే
నీ కలవ కలువ కనులు పలికే
కొంటె భాష చెప్పరాదే

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ద నాట్ బేబీ

టుగెదర్ టుగెదర్
ప్రేమ దేశమేలుకుందమా
ఉందమా ఉందమా ఉందమా
ఫరెవర్ ఫరెవర్
ఒకరి కోసమొకరముందమా
ఉందమా ఉందమా ఉందమా

Palli Balakrishna Tuesday, August 1, 2023
Virupaksha (2023)



చిత్రం: విరూపాక్ష (2023)
సంగీతం: బి.అజనేష్ లోకేష్ 
నటీనటులు: సాయి ధర్మ తేజ్, సంయుక్త మీనన్
దర్శకత్వం: కార్తీక్ దండు 
నిర్మాత: B. V. S. N. ప్రసాద్ 
విడుదల తేది: 21.04.2023



Songs List:



నచ్చావులే నచ్చావులే పాట సాహిత్యం

 
చిత్రం: విరూపాక్ష (2023)
సంగీతం: బి.అజనేష్ లోకేష్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కార్తీక్ 

నచ్చావులే నచ్చావులే
చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే
నీ కొంటె వేషాలే చూసాకే
తడబడని తీరు నీదే
తెగబడుతూ దూకుతావే
ఎదురుపడి కూడా
ఎవరోలా నను చూస్తావే
బెదురూ మరి లేదా
అనుకుందే నువ్వు చేస్తావే

ఏ నచ్చావులే నచ్చావులే
చూశానో ఆ రోజే
కపటి కపటి కపటి
కపటి కపటి కపటియా

అప్పుడే తెలుసనుకుంటే
అంతలో అర్థం కావే
పొగరుకే అనుకువే అద్దినావే
పద్దతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే
అమ్మడు నమ్మితే తప్పు నాదే
నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే
నచ్చావులే నచ్చావులే
చూశానో ఆ రోజే

పైకి అలా కనిపిస్తావే
మాటతో మరిపిస్తావే
మనసుకే ముసుగునే వేసినావె
కష్టమే దాటేస్తావే
ఇష్టమే దాచేస్తావే
లోపలో లోకమే ఉంది లేవే
తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావె
ఎదురు పది కూడా
ఎవరోలా నను చూస్తావే
బెదురూ మరి లేదా
అనుకుందే నువ్వు చేస్తావే

నచ్చావులే నచ్చావులే
చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే
నీ కొంటె వేషాలే చూసాకే

Palli Balakrishna Tuesday, April 4, 2023
Republic (2021)



చిత్రం: రిపబ్లిక్ (2021)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్ , జగపతి బాబు, రమ్యకృష్ణ
దర్శకత్వం: దేవ కట్టా
నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లయ్య
విడుదల తేది: 01.10.2021



Songs List:



Gaana of Republic పాట సాహిత్యం

 
చిత్రం: రిపబ్లిక్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రెహ్మాన్
గానం: అనురాగ్ కులకర్ణి, ధనుంజయ, పృద్విచంద్ర, హైమత్ మహమ్మద్, ఆదిత్య అయ్యంగార్

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో

నా ప్రాణంలోని ప్రాణం… నా దేహంలోని దాహం
నా మౌనం పాడే గానం… నా ప్రశ్న సమాధానం
అది అందమైన అందరాని కన్నెరా
లక్ష అక్షరాలు రాయలేని కవితరా
ఈ ప్రపంచమే కోరుకునే అతివరా
పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్చరా

నా కళ్ళలోన రంగుల కలరా, ఆ ఆఆ
నా కళ్ళలోన రంగుల కలరా
నా ఊహలకే ఉనికే తనురా
నా బతుకులోన బాగం కదరా
నా ఊపిరికే అర్థం తనురా

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో

తెల్లవాడినెదిరించి నల్లని చీకట్ల నుంచి
పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే, ఏ ఏ
అంతలోనే తెలిసిందది మాయమై పోయిందని
ముందుకన్నా ముప్పుఉన్న పంజరానా ఉన్నదని

అసలెక్కడుందో తెలియకుంది చూడరా
అది లేక మనిషికింకా విలువేదిరా
ఏ పోరాటంతో దానిని చేరాలిరా, ఆ ఆఆ
ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో

అనాదిగా ఎవడో ఒకడు… అది నాకే సొంతమంటూ
నియంతలై నిరంతరం… చెరలో బంధించారు, ఊఊ ఊ
రెక్కలనే విరిచేసి… హక్కులనే చెరిపేసి
అడిగే ప్రతి ఒక్కడిని… అణిచి అణిచి వేసినారు

నరజాతి చరిత్రలో నలిగిపోయెరా
చల్లారని స్వాతంత్య్ర కాంక్ష స్వేచ్చరా
నరనరాల్లోనా ప్రవహించే ఆర్తీరా, ఆ ఆఆ
కనిపించక నడిపించే కాంతిరా

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో ||2||




జొర్సే బార్సే పాట సాహిత్యం

 
చిత్రం: రిపబ్లిక్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
సాకీ: శ్రీనివాస్ దరిమి శెట్టి
గానం: అనురాగ్ కులకర్ణి

సిగురు సింతల మీద రామ సిలకలోయ్
పగలెదిగినాయి సూడు సెంద్రవంకలోయ్
సెరుకూ పిల్లాడు సూసే సూపు సురుకులో
కలికీ బుగ్గలమీద సిగ్గు మరకలోయ్
సూడబోదమా ఆడబోదమా..!!

సూడబోదమా ఆడబోదమా..!
హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
సూడబోదమా ఆడబోదమా..!
హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా

జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ
జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ

ఢమఢమ జాతర పండుగరోయ్
గుమగుమ పువ్వుల దండలు వెయ్
కనులతో కాచే తల్లికి జై
తనువుతో పొర్లి దండం సెయ్

ఢమఢమ జాతర పండుగరోయ్
గుమగుమ పువ్వుల దండలు వెయ్
కనులతో కాచే తల్లికి జై
తనువుతో పొర్లి దండం సెయ్

ఎన్నెల్లో కొల్లు యేరు
తానమాడుతున్నాదంటా… ఎల్దామా ఎల్దామా
సరసుతోని సెందురుడు
సరసమాడుతున్నాడంట… ఎల్దామా ఎల్దామా
గాలి సెంపా గిల్లుతుంటే
పూలు సిగ్గు పడతాయంటా… ఎల్దామా ఎల్దామా
వలసా పచ్చులొచ్చి నీళ్ళ హోళీ జల్లుకుంటాయంట

సూడబోదమా ఆడబోదమా..!
హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
సూడబోదమా ఆడబోదమా..!
హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా

జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే, ఏ ఏఏ
జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే, ఏ ఏఏ

పసుపుకుంకాలు గాచే పార్వతమ్మ రూపమంటా
పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
కొల్లేరు బిడ్డల కోసం కొలువైన తల్లేనంటా
పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
రంగురంగుల ప్రభాలు కట్టి… తారంగమాడుకుంటా
ఎల్దామా ఎల్దామా
ఏ, ముడుపుకట్టుకున్న జంట… ముళ్ళు ఏసుకుంటాయంటా

జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ
జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ

Palli Balakrishna Friday, October 1, 2021
Solo Brathuke So Better (2021)


 







చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్ (2020)
సంగీతం: ఎస్.తమన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: విశాల్ దాద్గాని
నటీనటులు: సాయి తేజ్, నభా నటేష్
దర్శకత్వం: సుబ్బూ
నిర్మాణం: బివిఎస్ఎన్ ప్రసాద్
విడుదల తేది: 25.12.2020

సున్లో సున్లో 
జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో
సోలో బ్రతుకే సో బెటర్

సున్లో సున్లో 
జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో
సోలో బ్రతుకే సో బెటర్

ఓఓఓ... హేయ్, హేయ్...
ఓఓఓ... హేయ్, హేయ్

బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్
తగని పీకులాటలో... తగులుకోకురో
నిను విడిపించే దిక్కెవరు..?
ఉన్నపాటుగా ఊబిలోకి దిగి పోతావా డియర్
అసలు ప్రేమనేది ఓ ముళ్లదారి కదా నువ్వనేది ఎవరూ
కనుక కళ్లు మూసుకొని వెళ్లి పోకు అది చాలా డేంజర్ నమ్మరేమి ఎవరు

బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్
బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్

ఏ.... సన్యాసంలోనే కదా... 
ఇహముంది, పరముంది
సంసారం ఏమిస్తుందయ్యా... నానా ఇబ్బంది
ఈ సంగతి పెద్దాల్లెవరికి  తెలియనిదా చెప్పండి
తెలిసున్నా మనతో ఆ సత్యం చెప్తారు చూడండి

సోలో బ్రతుకే సో బెటర్... 
వినరమంట బ్యాచిలర్
బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్

బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్

బాయ్స్ అండ్ గర్ల్స్...

సున్లో సున్లో 
జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో
సోలో బ్రతుకే సో బెటర్

సున్లో సున్లో 
జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో
సోలో బ్రతుకే సో బెటర్

హేయ్...








చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్ (2020)
సంగీతం: ఎస్.తమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: నకాష్ అజిజ్
నటీనటులు: సాయి తేజ్, నభా నటేష్
దర్శకత్వం: సుబ్బూ
నిర్మాణం: బివిఎస్ఎన్ ప్రసాద్
విడుదల తేది: 25.12.2020

బల్బు కనిపెట్టినోడికే... 
బ్రతుకు సిమ్మసీకటై పోయిందే
సెల్లు ఫోను కంపినోడికే... 
సిమ్ము కార్డ్ బ్లాకై పోయిందే
రూటు సూపే గూగులమ్మనే... 
ఇంటి రూటునే మర్చిపోయిందే
రైటు టైం సెప్పే వాచ్ కే... 
బ్యాడు టైమే స్టార్టై పోయిందే

అగ్గిపుల్ల నేనే మెల్లగా కాల్చుతుంటే... 
సొంత కొంపనే ఫుల్లుగా అంటుకున్నాదే
పాస్ట్ లైఫ్ లో నేను చెప్పిన ఎదవ మాటే... 
బైట్ ఫ్యూచరే నీలా తగలబెట్టిందే

ఒగ్గేసి పోకే అమృత... 
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత... 
నువ్వు వెళ్ళిపోతే ఒంటరైపోతా

ఒగ్గేసి పోకే అమృత... 
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత... 
నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా

5 స్టార్ చాక్లెట్ ఇచ్చి బుజ్జగించ... 
చిన్న పిల్లవు కాదే
ఫెవికాల్ కన్నా గట్టిగ ఫిక్సయ్... 
చుక్కలు చూపిస్తావే
చెంప మీద ఒక్కటిద్దామంటే... 
చెయ్యే రావట్లేదే
హుగ్గు చేసుకొని చెప్తామంటే... 
భగ్గుమంటావన్న భయమే
బండరాయి లాంటి మైండ్ సెట్టు మార్చి...
మనసుతోటి లింకు చేస్తే బాగుపడతవే....
నీ హార్ట్ గేటు తెరిచి... నీలో తొంగి చూడే
నా బొమ్మనే గీసి ఉంది... నాపై లవ్వుందే

ఒగ్గేసి పోకే అమృత... 
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత... 
నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా

ఒగ్గేసి పోకే అమృత... 
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత... 
నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా








చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్ (2020)
సంగీతం: ఎస్.తమన్
సాహిత్యం: రఘురాం
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: సాయి తేజ్, నభా నటేష్
దర్శకత్వం: సుబ్బూ
నిర్మాణం: బివిఎస్ఎన్ ప్రసాద్
విడుదల తేది: 25.12.2020

నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి

భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్ళకైన వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా...

మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజి సోదరా
నువ్వు మోయలేవురా ఈ బంధాల గోల
సంసార సాగరం నువ్వీదలేవురా
నట్టేట్ల మునుగుతావురా
పెళ్లంటే టార్చరేరా... ఫ్రాక్చరేరా
పంచరేరా... రప్చరేరా... బీ కేర్ఫుల్ సోదరా

నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి

భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్ళకైన వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా...

పెళ్లే వద్దంటే ఎల్లా... ఎందుకీ గోల
యు గాట్ ఆ మేక్ ఇట్ గొనా 
సీ ఇట్స్ షైన్...లైఫె ఈ కలర్ఫుల్ అంతే
అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా ఉండగా పండగే (పండగే...పండగే...పండగే)

నీ ఫ్రీడమే పోయేంతలా
నీ కింగ్డమే కూలి పోవాలా...!
డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఎలా
లైఫ్ ఉండాలి వీకెండ్ లా
నీకున్న స్పేసుని... నీకున్న పేస్ ని
నీ కున్న పీస్ ని... డిస్టర్బ్ చేసుకోకు
ఎడారి దారిలో... ఒయాసిస్ వేటకై
ప్రయాణమెంచుకోకు
పెళ్లంటే కాటు వేసే నాగు పాము
నువ్వు గెలవలేని గేము
బీ కేర్ఫుల్ సోదరా

నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి



Palli Balakrishna Sunday, January 17, 2021
Prathi Roju Pandage (2019)








చిత్రం: ప్రతీ రోజూ పండగే (2019)
సంగీతం: ఎస్ ఎస్ తమన్
సాహిత్యం: కెకె
గానం: సత్య యామిని, మొహన భోగరాజు, హరి తేజ
నటినటులు: సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్న
దర్శకుడు: మారుతి
నిర్మాత: బన్నీ వాసు
విడుదల తేది: 20.12.2019

లవ్ యూ అంటూ వెంట పడలేదు....
డేటింగన్న మాటసలే రాదు...
హీ ఈస్ సో కూల్..
హీ ఈస్ సో క్యూట్..
ఫేక్ అనిపించే టైపసలే కాదూ....
బ్రేకప్ చెప్పే వీలసలు లేదు..
హీ ఈస్ సో హాట్..
హీ ఈస్ సో క్యూట్..

ఏమి తక్కువంట సూడు... 
టిప్పు టాపుగున్నాడు..
టిక్ టాక్ లోన చూసి ఫ్లాటయ్యాడు..

వాన్న సీ యూ అంటూ .. సెవెన్ సీస్ దాటివచ్చాడు.
ల్యాండు అయ్యి అవ్వగానే... బ్యాండు ఎంట తెచ్చినాడు.
నీ హ్యాండు ఇవ్వమంటు... నీస్ బెండు చెసి...
విల్ యూ మ్యారీ మీ అన్నాడు.. డు..డు..డు..డు..డు..

ఓ బావా మా అక్కని సక్కగ సూస్తావా...
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా...
ఓ బావా మా అక్కని సక్కగ సూస్తావా....
ఓ బావా సింధూరం నువ్ పెడతావా..

మచో మ్యాన్ మా బావా... పేచీలే మానేవా...
కటౌటే చూస్తూనే... కట్టింగే ఇస్తావా..
హ్యాండ్సమ్మే మా బావా... నీ సొమ్మే అడిగాడా...
తానే చేతులు చాపొస్తే... తెగ చీపైపోయాడా...

ఓ బావా.... ఓ బావా..

లవ్ యూ అంటూ వెంట పడలేదు....
డేటింగన్న మాటసలే రాదు....
హీ ఈస్ సో కూల్..
హీ ఈస్ సో క్యూట్..

నిదరే పోడు ఏమీ తినడు 
నువ్వే కావాలంటాడు..
నిన్నే చూసి ప్రతీ రోజుని 
శుభముగ ప్రారంభిస్తాడు.
తినే పప్పులోన బీరు కలుపుతాడు... 
తన పప్పి లోన నిన్ను వెతుకుతాడు..
నీ పేరే పలికే.. నిన్నే తలిచెనే..
అక్కా నమ్మే... అతనే జెమ్మే..

మచో మ్యాన్ మా బావా... పేచీలే మానేవా..
కటౌటే చూస్తూనే... కట్టింగే ఇస్తావా..
హ్యాండ్సమ్మే మా బావా... నీ సొమ్మే అడిగాడా...
తానే చేతులు చాపొస్తే... తెగ చీపైపోయాడా..

ఓ బావా మా అక్కని సక్కగ సూస్తావా...
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా...
ఓ బావా మా అక్కని సక్కగ సూస్తావా...
ఓ బావా సింధూరం నువ్ పెడతావా..







చిత్రం: ప్రతీ రోజూ పండగే (2019)
సంగీతం: ఎస్ ఎస్ థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్, గీతామాధురి

తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట

తకిట తకిట తకిట తకిట(2)
తకిటతథిమి తకిటతథిమి కొట్టర డీజే
తకిట తకిట తకిట తకిట(2)
తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే

ఎక్కితే ఫ్లైటూ.. ఎదుగుతుంటే హైటూ
ఇచ్చేస్తుంటే ట్రీటూ.. కాదోయ్ నువ్వే గ్రేటూ
తోడుగా ఉంటూ.. కన్నోళ్లనే కంటూ
పంచుకుంటే హర్టూ.. అదే పెద్ద గిఫ్టూ...

తకిట తకిట తకిట తకిట(2)
తకిటతథిమి తకిటతథిమి కొట్టర డీజే
తకిట తకిట తకిట తకిట(2)
తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే

ఎక్కితే ఫ్లైటూ.. ఎదుగుతుంటే హైటూ
ఇచ్చేస్తుంటే ట్రీటూ.. కాదోయ్ నువ్వే గ్రేటూ
తోడుగా ఉంటూ.. కన్నోళ్లనే కంటూ
పంచుకుంటే హర్టూ.. అదే పెద్ద గిఫ్టూ...

హ్యపీ బర్త్ డే.. ఏ ఏ... 
హ్యపీ బర్త్ డే.. ఏ ఏ..

నీకై నువ్వే బ్రతికేస్తు ఉంటే.. 
భూమ్మీదకే వచ్చి టైమ్ వేస్టురా.. ఆ.. ఆ
అమ్మనాన్నని హ్యాపీగా ఉంచే.. 
ప్రతికొడుకు తలవంచని ఎవరెస్టారా..

నీ ఊరు మెచ్చేట్టూ నీ పేరు వచ్చేట్టూ
నీ స్టైలింకా నేర్చేస్తాం నీతో ఉంటూ
సిక్స్ ఫీట్ కటౌటూ ఆల్వేజు ఉండేట్టూ
ఇక సెంచరినే కొట్టిస్తాం బ్యాటే పట్టూ

తకిట తకిట తకిట తకిట(2)
తకిటతథిమి తకిటతథిమి కొట్టర డీజే
తకిట తకిట తకిట తకిట(2)
తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే

ఎక్కితే ఫ్లైటూ.. ఎదుగుతుంటే హైటూ
ఇచ్చేస్తుంటే ట్రీటూ.. కాదోయ్ నువ్వే గ్రేటూ
తోడుగా ఉంటూ.. కన్నోళ్లనే కంటూ
పంచుకుంటే హర్టూ.. అదే పెద్ద గిఫ్టూ...

పుట్టిన రోజే... కొట్టర డీజే.... పుట్టిన రోజే
తకిట తకిట తకిట తకిట(2)
తకిటతథిమి తకిటతథిమి కొట్టర డీజే
తకిట తకిట తకిట తకిట(2)
తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే




Palli Balakrishna Tuesday, October 15, 2019
Chitralahari (2019)





చిత్రం: చిత్రలహరి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేద పేతురాజ్ దర్శకత్వం: కిషోర్ తిరుమల నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ , మోహన్ చెరుకూరి బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ విడుదల తేది: 12.04.2019



Songs List:



పరుగు పరుగు పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: డేవిడ్ సైమన్

పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు
జరుగు జరుగు అంటుందె లైఫు
ఎంత పెంచుకుంటున్న నా వేగం
నన్ను దాటిపోతుందె లోకం

చక్రాల్లేని సైకిల్ లాగ
రెక్కల్లేని ఫ్లైట్ లాగ
బుల్లెట్ లేని రైఫిల్ లాగ
దారం లేని కైట్ లాగ
నేను కూడ మిగిలిపోయా

పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు
జరుగు జరుగు అంటుందె లైఫు
ఎంత పెంచుకుంటున్న నా వేగం
నన్ను దాటిపోతుందె లోకం

రేపనేది కలల్లోనేనా
నిజంగా అది రాద
నిన్నలోనె నేనుండిపోవాల
దాటి వెల్లె దారి లేదా
మబ్బుల లోని ఫుల్ల్ మూన్ లాగ
ఆర్కెస్ట్రా లేని ట్యున్ లాగ 
నేను కూడ మిగిలిపోయా

పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు
జరుగు జరుగు అంటుందె లైఫు
ఎంత పెంచుకుంటున్న నా వేగం
నన్ను దాటిపోతుందె లోకం

Yeah, You Got to Run
You Got to Run
You Got to Run
You Got to Do
What You Got to Do
To Get to Where You Wanna Be
Life Is Not A
Bed of Roses Man
You Got to Get
That in Your Head
Let’s Go

ఒక్క అడుగు నన్ను
ముందుకెయ్యనివ్వదె వెనక్కి
తోసె ఎదురు గాలి
ఒక్క మెట్టు నన్ను
పైకి ఎక్కనివ్వదె
నన్ను తొక్కె ఫోర్స్ నేమనాలి
అంతం లేని నిరీక్షణ లాగ
ఫలితం లేని పరీక్షలాగ
నేను కూడ మిగిలిపోయా

పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు
జరుగు జరుగు అంటుందె లైఫు
ఎంత పెంచుకుంటున్న నా వేగం
నన్ను దాటిపోతుందె లోకం




గ్లాస్మెట్సు…పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగంజ్ , పెంచల్ దాస్, దేవి శ్రీ ప్రసాద్

స్కుల్ కెల్లె వరకేరా క్లాస్మెట్సు
రెంట్ కట్టె వరకేరా రూమెట్సు

స్కుల్ కెల్లె వరకేరా క్లాస్మెట్సు
రెంట్ కట్టె వరకేరా రూమెట్సు
వీకెండ్ వచ్చె వరకేరా ఆఫిస్మెట్స్
లైఫె ఎండ్ అయ్యె వరకేరా సోల్మెట్స్

అరెయ్..ఎండ్ అంటు లేని
బెండ్ అంటు కాని..
రియల్ రెలేషన్షిప్ యే

గ్లాస్మెట్సు…గ్లాస్మెట్సు
గల గల గల గల గ్లాస్మెట్సు
గ్లాస్మెట్సు…గ్లాస్మెట్సు
గల గల గల గల గ్లాస్మెట్సు

హెయ్ పప్పు రేటు పెరిగితె
పెరగని పెరగని
ఉప్పు రేటు పెరిగితె
పెరగని పెరగని
పెత్రోల్ దర తగ్గితె
తగ్గని తగ్గని
ఏ పార్టి ఓడని
నెగ్గని నెగ్గని

మన స్నాక్స్ ఫ్రెష్గుండని
మన ఐస్ చల్లగుండని
మన మంచింగ్ మంచిగుండని
మన గ్లాస్ ఫుల్లుగుండని
అరెయ్ ముంచేద్దాం దాన్లొ
మన గుండెని

గ్లాస్మెట్సు మనం గ్లాస్మెట్సు
గల గల గల గల గ్లాస్మెట్సు
గ్లాస్మెట్ మనం గ్లాస్మెట్సు
గల గల గల గల గ్లాస్మెట్సు

గల గల గల
ఇది గ్లాస్మెట్స్ కల
గల గల గల
ఒక గుటకేస్తె భలా

గల గల గల
ఇది గ్లాస్మెట్స్ కల
గల గల గల
ఒక గుటకేస్తె భలా

ట్రంప్ మనకు విసాలె
ఇవ్వని మానని
పంపు నీల్లు ప్రతిరోజు
నిండని యెండని

బయ్ వన్ కి గెట్ వన్
అమ్మని ఆపని
ఐఫోన్ కి న్యూ మోడల్
దించని ముంచని

మన బీర్ పొంగుతుండని
మన బార్ రస్ గుండని
ఈ సిప్ సాగుతుందని
ఈ కిక్కు వూగుతుండని
ఈ ఒక్కటుంటె లోకం తొ
ఇంకేం పని…

గ్లాస్మెట్స్ మనం గ్లాస్మెట్స్
గల గల గల గల గ్లాస్మెట్స్

గ్లాస్మెట్స్ మనం గ్లాస్మెట్స్
గల గల గల గల గ్లాస్మెట్స్

వి ఆర్ ఆల్ గ్లాస్మేట్స్



ప్రేమ వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సుదర్శన్ అశోక్

రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో 
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో 
నేలకే జారిన కొత్త రంగులా 

వానలా వీణలా వాన వీణ వాణిలా 
గుండెలో పొంగిన కృష్ణ వేణిలా
ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా 
సరిగమల్ని తియ్యగా ఇలా 

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా 

రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో 
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో 
నేలకే జారిన కొత్త రంగులా 

దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల 
మారదా పగలిలా అర్థరాత్రి లా 
నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల
కలవరం గుండెలో కలత పూతలా

రాయలోరి నగలలోంచి 
మాయమైన మణులిలా
మారిపోయెనేమో నీ రెండు కళ్లలా 
నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన 
నిన్ను చూసే రాసినాడలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా 

నడకే  నువ్వలా కలలలో కోమలా...
నడకే  నువ్వలా కలలలో కోమలా
పాదమే కందితే మనసు విల విలా 
విడువకే నువ్వలా పలుకులే గల గల
పెదవులు అదిరితే గుండె గిల గిల 

అంతు లేని అంతరిక్షమంతు చూడకే అలా
నీలమంతా దాచిపెట్టి వాలు కన్నులా
ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంతా పొంగిపోయేలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా 




ప్రయత్నమే పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కైలాష్ కెహర్, విష్ణు ప్రియ రవి

ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అడుగు అడుగు వెయ్యనిదే అంతరీక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే 
పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే
మహా సంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన

ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం (2)

ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే

వెళ్లే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా
అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా
అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి
అడుగంటూ వేసాక ఆగకుండ సాగాలిర నీ సాధన

ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం (2)

ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే


Palli Balakrishna Tuesday, March 19, 2019
Tej I Love U (2018)

చిత్రం: తేజ్  I Love You (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సాహితి
గానం: హరిచరన్, చిన్మయి
నటీనటులు: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: ఎ. కరుణాకరన్
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 2018

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా

పరుగిడు ఈ కాలాన
అడుగులు దరికాలేక
మనమెవరో ఏమో ఎందాక
పరవశమే ప్రతి రాక
చూపి ఓ శుభలేఖ
మన మధిలో ప్రేమే కలిగాక
మన ఇద్దరి పైనే విరిపూలు చెల్లింది పున్నాగా
నీ ముద్దులకోసం నే వేచి ఉన్నా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

ఓ అరవిరిసే జాజుల్లో కలగలిసే మోజుల్లో
అలలెగసే ఆసే ప్రేమంటా
మధి మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో
మెలితిరిగే వయసా రమ్మంటా
పడకింటి కొచ్చి నువ్వు పాల మురిపాలు కోరంగా
నడుమిచ్చు కుంటా వయ్యారిలాగ

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా (2)

Palli Balakrishna Wednesday, July 11, 2018

Most Recent

Default