Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Pavitra Bandham"
Pavitra Bandham (1971)



చిత్రం: పవిత్రబంధం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: నాగేశ్వరరావు, వాణిశ్రీ, కాంచన
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: టి.గోవింద రాజన్
విడుదల తేది: 24.02.1971



Songs List:



గాంధి పుట్టిన దేశమా ఇది పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

పల్లవి:
గాంధి పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా
గాంధి పుట్టిన దేశమా...

చరణం: 1
సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం (2)
ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు
యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు

చరణం: 2
సమ్మె ఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూటీ (2)
శాంతి సహనం సమధర్మం పై విరిగెను గూండా లాఠీ
అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ
హెచ్చెను హింసాద్వేషం ఏమవుతుందీ దేశం

చరణం: 3
వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లెసైన్స్
అర్హతలేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓ యస్
సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు
పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం




ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల. స్వర్ణలత

ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి
గణ గణ గణ గణ గంటల బండి
పల్లెటూరి యీ పడుచుల బండి
సవాలుచేస్తూ పోతుంది - ఆహ
జోరు జోరుగా పోతుంది
బుర్రిపిట్టవలె సైకిలు మీద
తుర్రున బోయెర సోగ్గాడు
అహ పట్నం పోయెర సోగ్గాడు
డాబుకుపోయి జేబు దులుపుకొని
దేబె మొకముతో వసాడు ఆహ వస్తాడు
ప్రజలకు పుష్టిగ తిండి పెట్టుటకు
కష్టించును ఆ కుర్రోడు
అతడె నిజమగు రైతు బిడడు
అడుగో అడుగో అటు చూడు

కడుపు కట్టుకొని పాలూ పెరుగు అమ్మబోతది అచ్చమ్మా
డబ్బుకాశపడి దొడ్ల కూరలు టౌనుకేస్తది బుచ్చమ్మ
పాడిపంట పట్నంఫాలు పచ్చడి మెతుకులు మన పాలు
పల్లెటూళ్ళ కథ ఇంతేను ఎన్నా ళిలాగ జరిగేను

గుయ్యి గుయ్యి న హరన్ గొడుతు దూ కెర బస్తీబుల్లోడు
గడుసు దేరిన పల్లెపడచులా తడాఖ ఎన్నడు ఎరగడురా
బడాయిజూపి పోటీ చేసి పందెంలోన పల్టీకొట్టి
దిమ్మెరపోయి చూస్తాడు తోకముడుచుకొని పోతాడు. Iఘల!



ఫిఫ్టీ..ఫిఫ్టీ పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్ర బంధం (1971)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ 
సగం సగం.. నిజం నిజం
నీవో సగం.. నేనో సగం
నీవో సగం.. నేనో సగం
సగాలు రెండూ.. ఒకటైపోతే
జగానికే ఒక.. నిండుదనం
నిజం నిజం.. నిజం నిజం... ఫిఫ్టీ..ఫిఫ్టీ

చరణం: 1 
నీవే నాదం.. నేనే గీతం
నీవే నాదం.. నేనే గీతం
నీ నా కలయిక.. సంగీతం
నీ నా కలయిక.. సంగీతం

నీవే నింగి.. నేనే నేల
నీవే నింగి.. నేనే నేల
నిండు విలీనమే.. ఈ భువనం 

నీవే కుసుమం.. నీవే భ్రమరం
పువ్వూ తుమ్మెద.. ఒకటైపోతే
జగానికే ఒక.. కమ్మదనం

నిజం నిజం.. నిజం నిజం
ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ  

చరణం: 2
రాధ సగం.. మాధవుడు సగం
రాధ సగం.. మాధవుడు సగం
రాసవిహారమే.. ప్రణయమయం
రాసవిహారమే.. ప్రణయమయం

గౌరి సగం.. శివుడు సగం
గౌరి సగం.. శివుడు సగం
అర్ధనారీశ్వరమే.. అఖిల జగం 

అవినాభావం.. అమృతరావం
అభేద రూపం.. స్థిరమైపోతే
జగానికే ఒక  అమర పథం 

నిజం నిజం.. నిజం నిజం .. ఫిఫ్టీ...ఫిఫ్టీ
సగం సగం.. నిజం నిజం 
నీవో సగం.. నేనో సగం
సగాలు రెండూ ఒకటైపోతే
జగానికే ఒక నిండుదనం
ఫిఫ్టీ..ఫిఫ్టీ.. ఫిఫ్టీ..ఫిఫ్టీ




అట్ల తద్దాయ్ ఆరట్లోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం:పి.సుశీల & బృందం

అట్ల తద్దాయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్ మూడట్లోయ్
ఆటల నోము అట్లతద్ది
ఆడపిల్లలు నోచె అట్లతద్ది
వేడుక మీరగ కోరిక తీరగ
ఓ చెలియా నోచవే జీవితమే పూచెనే
ఓ చెలియా 
చందమామకన్న చాల అందమైన మొగుడు
సన్న జాజి పొదలకన్న చక్కనయిన యిల్లు
ఈ బంగారు బొమ్మకు కావాలె బావయ్య నేడే రావాలా

పన్నీరు జల్లేటి పబ్బాలకోసం
నోచినచో 
గోరింటాకు పెట్టుకుం టే చెయ్యి
చేయి. పండితే చేపట్టేవాడొత్తాడు
పండెనమ్మా




తంత్రాల బావయ్య పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత

తంత్రాల బావయ్య రావయ్య
మంత్రాలకు రాలవయ్య చింత కాయలు
తాయత్తా రక్ష రేఖ
విబూదా చెట్ట వేరా
మాయదారి చుప్పనాతి మరదలు పిల్లా
చాలించు నీ ఎగతాళి టక్కరి పిల్లా
నంగనాచి బుంగమూతి
చిట్టెలుకా చేంచెలుకా

తాయత్తుకట్టావు తందనాలు తోక్కేవు
అమ్మాయి కోసం ఊరంత ఊరేగావు
చీ అంటే పడ్డావు చీవాటులు తిన్నావు
తబ్బిబై దెబ్బతిని తోక ముడుచుకోచ్చావు
చిట్టి బావా పొట్టి బావా
పాలకోవా తింటావా
అత్త కూతురా మేనత్త కూతురా
తప్పొప్పుకున్నాను దాసోహం అన్నాను
నీవే కాదెంటేనూ దోవే బందంటేనూ
నిదొడ్లో నీళ్ళు లేని బావిలోన పడతాను




పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల, ఘంటసాల

పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా
పడుచుజంట చెదిరిపోదులే నా రాజా
పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాణి
పడుచుజంట చెదిరిపోదులె నా రాణీ

పండిన చేలు పసుపుపచ్చ
నిండు మమతలు మెండు సొగసులు లేతపచ్చ
నీ మెడలో పతకం చిలకపచ్చ 
మన మేలిమి గురితీ వలవుల పచ్చ

కలసిన కలయక తలవని తలపు
మన కలసిన కలయక తలవని తలపు
నీ చెలిమి వీలువచె చేతి చలువచే చిగిర్చె నా మనసు
తిరిగెను బ్రతుకె క్రొత్త మలుపు
ఇది  తీయని వాడని మన తొలి వలపు

నూరేళ్ళ వెలుగు నుదిటిబొట్టు 
అది నోచిన నోముల పూచిన రోజున పెళ్ళిబొట్టు
కట్టేను నీ చేయి తాళిబొట్టు
అది కలకాల కాంతుల కలిమి చెట్టు



చిన్నారి నవ్వులే పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

చిన్నారి నవ్వులే సిరిమల్లె పువ్వులు
అల్లారు ముద్దు లే కోటి వరాలు
చిగురించి విరబూసే చెట్టే చెట్టు
చిట్టి పాప నడయాడే ఇల్లే ఇల్లు
ఆడినదే అట తను పొడినదే పాట
అది చూచి మైమరచే తల్లే కదా తల్లి

బాలపాప పలుకులె పంచదార చిలుకలు
చందమామకన్న మా చంటి బాబు మిన్న
చల్లనివి చక్కనివి పసిపిల్లల కళ్లు
ఆ కళ్ళే కమలాలు అవి దేవుని గుళ్ళు

ఎనలేని స్వప్నాలునోచెను తల్లి
కనులారా కనగానే మురియును తండ్రి
కన్న వారి ఫలము కనులున్న వారి ధనము
వెలగాలి మా బాబు వెయ్పేళ్ళ దీపం





పచ్చబొట్టు చెరిగిపోదులే (విషాదం) పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా
పడుచుజంట చెదిరిపోదులే నా రాజా
పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాణి
పడుచుజంట చెదిరిపోదులె నా రాణీ

పండిన చేలు పసుపుపచ్చ
నా నిండు మమతలు మెండు సొగసులేతపచ్చ
నీ మెడలో పతకం చిలకపచ్చ 
మన మేలిమి గురితీ వలవుల పచ్చ

కలసిన కలయక తలవని తలపు
నీ చెలిమి వీలువచె చేతి చలువచే చీగిర్చె నా మనసు
తిరిగెను బ్రతుకె క్రొత్త మలుపు
తీయని వాడని మన తొలి వలపు

నూరేళ్ళ వెలుగు నుదిటిబొట్టు అది
నోచిన నోముల పూచిన రోజున పెళ్ళిబొట్టు
కట్టేను నీ చేయి తాళిబొట్టు
అది కలకాల కాంతుల కలిమి చెట్టు


Palli Balakrishna Wednesday, October 4, 2017
Pavitra Bandham (1996)



చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నటీనటులు: వెంకటేష్ , సౌందర్య, షెర్రీ (తొలిపరిచయం)
మాటలు: పోసాని కృష్ణ మురళి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: సి. వెంకటరాజు, జి. శివరాజు
విడుదల తేది: 17.10.1996



Songs List:



మాయదారి మాయదారి అందమా పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుజాత మోహన్

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా
హయ్య హయ్య హయ్
మాటకారి మాటకారి బంధమా
మహా మాయ చేయ వద్దమ్మా
హయ్య హయ్య హయ్
మదిలోన మొదటి ప్రేమా మితిమీరి పోయె భామా
మది మాటలు మానమ్మా ...
మల్లె గాలి పైన తేలి రామ్మా

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా
హయ్య హయ్య హయ్

మరిగే జాబిలీ కరిగే కౌగిలీ
మదనపడే మదనుడికే విందు చెయ్యాలీ
పెరిగే ఆకలీ కొరికే చెక్కిలీ
మైమరిచే మురిపెముతో కంది పోవాలీ
అందించనీ  అధరాంజలీ
శృతిమించనీ  జతజావళీ
చలిగాలి పైనతేలి చెలరేగు ఈ ఖవాళీ
ప్రతి పూటా కావాలీ
తాళ లేని వేళ లేని కేళీ

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా
హయ్య హయ్య హయ్

కుదురే లేదనీ ముదిరే బాధనీ
తెలుసుకుని అలుసుకుని ముళ్ళు పడి పోనీ
నిదరే రాదనీ అదిరే రాధనీ
అదుముకొని చిదుముకొని చల్లబడి పోనీ
కసిరేపనీ కొసరే పనీ
నిశి కైపునీ నస ఆపనీ
రస రాజధానిలోని రతిరాజుతో జవానీ
సయ్యాటకు సయ్యననీ
మోయలేని మోజు తీరిపోనీ

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా 
హయ్య హయ్య హయ్
మాటకారి మాటకారి బంధమా
మహా మాయ చేయ వద్దమ్మా
హయ్య హయ్య హయ్





చలి కొడతంది పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర 

చలి కొడతంది



పాటంటే పాటే కాదు పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: సురేష్ పీటర్స్, అనురాధ శ్రీరాం 

పాటంటే  పాటే కాదు 




ఐసలకడి పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు,, ఆశా భోస్లే

ఐసలకడి 



ఓ మై డాడీ పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు,, మనో , చిత్ర 

ఓ మై డాడీ 




అపురూపమైనదమ్మ ఆడజన్మ పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జె. యేసుదాస్

కార్యేషుదాసి  కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
బ్రతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు
ఏ పూజ చేసినా ఏ నోము నోచినా
ఏ స్వార్దము లేని త్యాగం
భార్యగా రూపమే పొందగా...

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

కలిమిలేములన్నీ ఒకే తీరుగా
కలిసి పంచుకోగా సదా తోడుగా
కలిసి రాని కాలం వెలే వేసినా
విడిచి పోని బంధం తనై ఉండగా
సహధర్మచారిణి సరిలేని వరమణి
సత్యాన్ని కనలేని నాడు
మోడుగా మిగలడా పురుషుడు...

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా..

కార్యేషుదాసి  కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default