Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nandita Raj"
Savitri (2016)
చిత్రం: సావిత్రి (2016)
సంగీతం: శ్రావణ్
నటీనటులు: నారారోహిత్, నందిత రాజ్
దర్శకత్వం: పవన్ సాదినేని
నిర్మాత: Dr.B.V. రాజేంద్ర ప్రసాద్
విడుదల తేది: 01.04.2016

Palli Balakrishna Sunday, February 28, 2021
Sankarabharanam (2015)



చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, నందిత రాజ్, అంజలి
కథ, మాటలు: కోన వెంకట్
దర్శకత్వం: ఉదయ్ నందనవనం
నిర్మాత: ఎమ్.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 04.12.2015



Songs List:



బన్నో రాణి పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

బన్నో రాణి



దారు పీలే బ్రో పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: సిరాశ్రీ 
గానం: బాబా సెహగల్ 

దారు పీలే బ్రో



డింగ్ డాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: నూతన మోహన్, హేమచంద్ర 

డింగ్ డాంగ్



ఘంటా పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: ఉమా నేహా 

ఘంటా 



రాక్ యువర్ బాడీ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: యస్. థమన్ 

రాక్ యువర్ బాడీ



సంగీత్ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: రాహుల్ నంబియార్ , లిప్సిక 

సంగీత్ పాట



తూరుపే పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: కార్తిక్, రమ్యా బెహ్రా 

తూరుపే

Palli Balakrishna Sunday, March 24, 2019
Prema Katha Chitram (2013)



చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
నటీనటులు: సుదీర్ బాబు, నందిత
దర్శకత్వం: జె. ప్రభాకర్ రెడ్డి
నిర్మాత: మారుతి
విడుదల తేది: 07.07.2013



Songs List:



I just love you baby...పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: లిప్సిక, రేవంత్

నీతో నాకేదో స్నేహం మొదలైంది నీవైపే నే వస్తున్నా 
నాతో ఈరోజే మౌనం మాటాడింది ఎన్నాళ్ళో పరిగెడుతున్నా 
నాలా ఉన్నదే నే నీవా .. నీలో ఉన్న నీవే నేనా 
బాగున్నదే ఎదేమౌతున్నా ఓ... 
I just love you baby... 
You r my heart come to me jaana tooo 
Can you be my baby... 
Feel you what i do we know jaana toooo 

చరణం: 1 
చూస్తున్నా చేరువేయ్యదురా కలా 
దాగున్నా నా ఊహనే నిజంగా ఇలా 
ఎదురుగ ఉంటే కుదురుగ లేనే 
ఏమైందో ఏదో ఏదో మాయలా 
జతే చేరాలంటూ మదే కోరింది ఏదో గతంలా ... 
నువ్వే కావాలంటూ మరీ ఆగిందీ ఎదే ఈ వేళా .. 
కుదరదుగా 

చరణం: 2 
నీవుంటే రోజులే క్షణంలా అలా... 
నీవెంటే సాగేనులే అలల్లా ఎలా .. 
అలసిపోతున్నా హాయిగా ఉందే 
నిదురలో మువ్వల్లే గురుతుగా 
నువ్వే నచ్చావంటూ కథే రేగింది సడే గుండెల్లో ... 
అదే చెప్పాలంటూ అటే వాలింది చూపే నీ ఒళ్ళో ... 
జరగదుగా 




వెన్నెలైనా చీకటైనా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
సాహిత్యం: వేటూరి
గానం: మలవిక, రేవంత్ 

(ఈ పాట పచ్చని కాపురం (1985)  సినిమా నుండి రీమిక్స్ చేయబడింది.  క్రిష్ణ , శ్రీదేవి నటించిన ఈ చిత్రానికి  కె. చక్రవర్తి గారు సంగీతాన్ని స్వరపరచగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు, కె.జె.జేసుదాస్, యస్.జానకి ఆలపించారు )

వెన్నెలైనా చీకటైనా 
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము 
నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు
నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు
వెన్నెలైనా చీకటైనా 
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము 
నీ ప్రేమే శాశ్వతము

చరణం: 1
జ్ఞాపకమేదో నీడల్లో తారాడే
స్వప్నాలేవో నీ కళ్ళు దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వమూ నాదైనదీ
నేను దేహమల్లె నీవు ప్రాణమల్లె ఏకమైన రాసలీలలోనా
వెన్నెలైనా చీకటైనా 
చేరువైనా దూరమైనా

చరణం: 2
అంతం లేని ఈ రాగబంధంలో
అంచున నిలిచి నీవైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూలడోలలు
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు
ఆ ముద్దులే మూడైనవి
బాలచంద్రుడొస్తే నూలు పోగులిస్తా
ఇంటిదీపమాయే జంట ప్రేమ




ప్రేమకథా చిత్రమిది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

ప్రేమకథా చిత్రమిది 





కొత్తగున్నా హాయె నువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: దీపు, రమ్యా బెహ్రా

కొత్తగున్నా హాయె నువ్వా
మత్తుగున్నా మాయె నువ్వా
రమ్మన్న తెమ్మన్నా తీయనీ బాధ
వస్తున్న తెస్తున్నా రాయనీ గాధ

కొత్తగున్నా హాయె నువ్వా
హే మత్తుగున్నా మాయె నువ్వా

యు ఆర్ మై హనీ లవ్ యు హనీ కమ్ టు మి బేబీ ఓ బేబీ

అడుగు సవ్వడేదో తరుముతోంది నన్ను
ఊహ రివ్వుమంటూ చేరమంది నిన్ను
నిన్న మొన్నలేని కొత్త మోమాటంలో ఎందుకింత గుబులో
విప్పి చెప్పలేని వింత ఆరాటంలో ఎంత సడి ఎదలో
తెరవనా తలపులు పిలుపుతో
తెలవనీ మలుపులో 
తెలిసినా తలపులో
వస్తున్న తెస్తున్నా రాయనీ గాధ
రమ్మన్న తెమ్మన్నా తీయనీ బాధ
మత్తుగున్నా మాయె నువ్వా
తనననా త త త త త త

చిన్ని తాకిడేదో ఝల్లుమంది నాలో
విన్న అలికిడేదో తుళ్లిపడెను లోలో
జారుతున్న కల తీరనున్న వేళ ముడుచుకుంది పెదవే
కోరుకోని దూరమేదో చేరువయ్యి తీర్చమంది మనవి
పిలవనా మైకం అంచులో
Touch me not touch me not 
Touch me not touch me not 
Touch me not touch me not 
Touch me not touch me not
తడబడే తపనలో 
జతపడే తనువులో



ఓ మై లవ్... ఓ మై లవ్... పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: లిప్సిక

ఓ మై లవ్... ఓ మై లవ్... మై లవ్ మై లవ్... 
ఓ మై లవ్... ఏ చోట ఉన్నా 
నీడల్లే నీవెంట ఉన్నా 
నన్నే నేను నీలో చూస్తు వున్నా 
ఓ మై హార్ట్ ఏం చేస్తు వున్నా 
ఏదోలా నీ తోడు కానా... 
నువ్వే లేని నేనే నేను కానా 
నాలోనూ దాగున్న నీ ప్రేమ... నీదాక చేరేది ఎలా 
మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... 


చరణం: 1 
కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే 
ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే 
నీవల్లే కలవరమంతా మదినే తడిపేస్తుందే 
చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే 
నీవేగా నీవేగా నీవేగా... 
నా చుట్టూ నీవేగా ఇలా... 
మై లవ్ ఓ... మై లవ్ ఓ... 
ఓ మై లవ్... 

చరణం: 2 
నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే 
చొరవగనే వస్తున్నా చేరువ నీవుంటే 
నీవున్నావన్న ధ్యాసే 
నన్నే నడిపిస్తుందే 
అందంగా ఉంది నాకే నువ్వే నేనౌతుంటే 
నీవేగా నీవేగా నీవేగా... 
నేనంటూ నీవేగా ప్రియా... 
మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... 

Palli Balakrishna Thursday, March 22, 2018
Krishnamma Kalipindi Iddarini (2015)
చిత్రం: కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని (2015)
సంగీతం: హరి
సాహిత్యం:
గానం: హరిచరన్
నటీనటులు: సుదీర్ బాబు, నందిత
దర్శకత్వం: ఆర్. చంద్రు
నిర్మాత: శ్రీధర్ లగడపాటి
విడుదల తేది: 19.06.2015

విడిచే సమయమెదురై అది పిలిచెనే వ్యధయై
గడచిన కాలమే ఇలా నిధురై కలగమారే
మరిచే వీలులేదే మరలా తిరిగి రాదే

రాదే రాదే రాదే రాదే

గడచిన కాలమిల్లా  తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనిల్లా
గడచిన కాలమిల్లా  తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనే..

రాదే  రాదే రాదే రాదే రాదే రాదే రాదే

పరిచయమైన తొలి రోజులు విడిచే ఆ తుది క్షణములు
పోల్చుకుంటే మన మనసులు ఎన్నో సాధించే..
అపురూపమైన ఈ విలువని నేటితో ఇక సెలవని
వదిలేదంటు మరి లేదని చేయి చేయి కలిపే
పేరు నీ కీర్తిని సాధించిన లక్ష్యాలు ఎన్నో చేధించిన
మరల తిరిగి ఆ రోజులు నీ ముంగిటే నిలుచునా

రాదే  రాదే రాదే రాదే

జాబిలి లేని ఆ నింగినై తీరంలేని ఓ సాగరమై
నాలో ఆశలే కెరటమై నన్నే తరుముతుంటే
దూరం స్నేహమై నిలవనీ స్నేహం బంధమై ఎదగనీ
నాలో ఉన్న ఈ ప్రేమనీ నిన్నే చేరుకోనీ
సంద్రపు లోతులే తెలిసినా ముత్యపు సంపదే దొరకునా మరల తిరిగి ఆ రోజులే నీ ముంగిటే నిలుచునా



Palli Balakrishna
Kathalo Rajakumari (2017)


చిత్రం: కథలో రాజకుమారి (2017)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: బాలాజీ
గానం: విభవరి
నటీనటులు: నారారోహిత్ , నాగ సౌర్య, నమిత ప్రమోద్, నందిత రాజ్
దర్శకత్వం: మహేష్ సూరపనేని
నిర్మాత: సుధాకర్ రెడ్డి బీరం
విడుదల తేది: 15.09.2017

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే
ఈ నేలే ఉయ్యాలై పాడుతుంది సరిగమలే
మేఘంలో నీ పేరే తిరుగుతున్నా లోకాలే
మనసే రాసె చందమామ కథ నేనే

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే

చూసుకుంటాను నన్నే నేనే పూసే పువ్వుల్లో
విరబూసే నవ్వుల్లో
పాడుకుంటాను ఆటే ఆడి ఊగేకొమ్మల్లో
ఆ కోయిల గొంతుల్లో
కనిపించే సంతోషం నను చేరకుంటె రాదు
చిగురించే ఆనందం నను పెంచుకున్న నాది
కదనంటే రాను వెంటే చిన్నబోతుంది నీ అందం

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే

దాచుకున్నాను కన్నుల్లోనే ఏవో ఆపదలు
ఎపుడొస్తాయో కలలు
గుడుకట్టేసి గుండెల్లోనే  ఉండే స్నేహాలు
ఎదురవుతాయా అసలు
కనిపించే ఆకాశం సిరివెన్నెలమ్మ నేస్తం
కురిసిందా చిరుజల్లే ఈ నేలతల్లి సొంతం
ఎక్కడుందో  ఎక్కడుందో నన్ను చేరేటి ఆనందం

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే
ఈ నేలే ఉయ్యాలై పాడుతుంది సరిగమలే
మేఘంలో నీ పేరే తిరుగుతున్నా లోకాలే
మనసే రాసె చందమామ కథ నేనే

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే

Palli Balakrishna Thursday, November 2, 2017
Lovers (2014)







చిత్రం: లవర్స్ (2014)
సంగీతం: జె.బి. (జీవన్ బాబు)
సాహిత్యం: ఓరుగంటి
గానం: దివ్యా దివాకర్, సాయి చరణ్ భాస్కరుని
నటీనటులు: అశ్విన్ సుమంత్, నందిత, తేజస్వి
దర్శకత్వం: హరినాథ్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు
విడుదల తేది: 15.08.2014

ప్రియతమా నా మనసే 
పువ్వాల్లే పూసి నవ్వే చిలిపిగా
తెలుసున వరసే ఓ ఓ…

తెలిసిన నా వయసే 
జుంమ్మని తుమ్మదల్లే ఎగిరెనే
కరగనీ ఈ క్షణమే ఓ ఓ..

ఏదురుగా ఎన్నళ్లాని నిలవను
వినపడి నీ గుండెల సవ్వడిని
ఓ ఓ ఓ ఓ

ప్రియతమా నా మనసే 
పువల్లే పూసి నవ్వే చిలిపిగా
తెలుసున వరసే ఓ ఓ ఓ ఓ

ఏవేవో ఊహలు ఊయలులూగె
నా ఊహ కోరిన ఊపిరి నీవు మరి
ఎన్నెన్నో ఆశలు రేగిన రోజే
నా చూపు సోకిన తారక నీవె

కాలాలు తెలియని హాయిలో
నీ ప్రేమకు జత పడనా
తీరాలు కలిసిన దారిలో
ఇలా ఆలై ఎగసి పడనా

ప్రియతమా నా మనసే 
పువల్లే పూసి నవ్వే చిలిపిగా
కరగనీ ఈ క్షణమే ఓ ఓ

మేఘాన్ని తాకిన గాలివి నీవె
లోలోనా దాచిన వానకు నీవు సరి
మేఘాలు దాటిన వేణువులూది 
రాగాలు తీసిన వేడుక నాదే
లోకాలు మరచీన ప్రాణమై నీతో ముడిపడిన
మౌనాన్ని విడిచిన గానమై
అలా అలా ఎదురు పడనా

ప్రియతమా నా మనసే 
పువల్లే పూసి నవ్వే చిలిపిగా
కరగనీ ఈ క్షణమే ఓ ఓ..



Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default