Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "N. R. Anuradha Devi"
Illale Devata (1985)




చిత్రం: ఇల్లాలే దేవత (1985)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: నాగేశ్వర రావు, రాధిక, భానుప్రియ
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: యన్. అర్. అనురాధాదేవి
విడుదల తేది: 01.05.1985



Songs List:

Palli Balakrishna Friday, August 20, 2021
Nindu Manishi (1978)




చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: శోభన్ బాబు, జయచిత్ర 
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: యస్.డి.లాల్
నిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవి
విడుదల తేది: 26.01.1978



Songs List:



రామయ్య రామయ్య రారో పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల అండ్ కోరస్

పల్లవి:
రామయ్య రామయ్య రారో
రాతిరి ఎత్తకపోరో
ఆకులు వక్కలు తేరో
నోరంత పండించు కోరో
ఆ ఎర్ర రంగే నా ఎర్రి సెప్పేను మామో

||రామయ్య||

చరణం: 1
నాగులేటి గట్టుమీద నాగమల్లి సెట్టుకాడ
సైగలు చేశావురో సన్నగ నవ్వావురో
మంగళారం మాపటేల సెరువులోన తానమాడ
సీరెత్తు కెళ్ళావురో నా సిగ్గంత దోశావురో
ఆనాటినుంచి ఈనాటిదాకా
ఆనాటినుంచి ఈనాటిదాకా
ఎన్నెన్ని ఎన్నెన్ని ఎన్నెన్ని చేశావు మామో

||రామయ్య||

చరణం: 2
కందిరీగ నడువుదాన్ని కలవరేకుల కళ్ళదాన్ని
కవ్వించి పోయావురో నిన్ను కలుసుకోమన్నావురో
అంటుమామిడి తోటలోన అంటకాగి జంటకూడి
ఆశలు రేపావురో ఏమో బాసలు చేశావురో
నీ మాట నమ్మా నే కాసుకున్నా
నీ మాట నమ్మా నే కాసుకున్నా
రాకుంటే రానంటే నే సచ్చిపోతా మామో

||రామయ్య||



పూలై పూచె రాలిన తారలే పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

పల్లవి:
పూలై పూచె రాలిన తారలే
ఆలలై వీచె ఆరని ఆశలే
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై
నీలో పలికేను ఏనాడు నీ గీతమై

చరణం: 1
కాంతులు విరిసే నీ కన్నులలోన 
నా కలలుండాలి ఏ జన్మకైనా
మమతలు నిండిన నీ కౌగిలిలోన 
నా మనుపూ తనుపూ పండించుకోనా
నా వలపే నిండనీ పండనీ నీ రూపమై
నా వలపే నిండనీ పండనీ నీ రూపమై

చరణం: 2
మెరిసెను నవ్వులు నీ పెదవుల పైన 
అవి వెలిగించాలి ఏ చీకటినైనా
వెచ్చగ తాకే నీ ఊపిరి లోన 
జీవించాలి నా బాసలు ఏనాడైనా
నా బ్రతుకే సాగనీ ఆగనీ నీ ధ్యానమై
నా బ్రతుకే సాగనీ ఆగనీ నీ ధ్యానమై



అబ్బ నీయబ్బ తీశావురా దెబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: శ్రీమతి జానకి

పల్లవి:
అబ్బ నీయబ్బ తీశావురా దెబ్బ
అర్థరాతిరబ్బా అబ్బలాల దెబ్బ
హోయ్ పులిరాజు  పంజా దెబ్బ
హొయ్ హొయ్ పులిరాజు  పంజా దెబ్బ

చరణం: 1
కన్నుగొట్టి పోయావు వన్నెకాడా
ఎన్నెలొచ్చి కొట్టింది ఎండదెబ్బా
సెయ్యి పట్టుకున్నావు సిన్నవాడా
సెయ్యి దాటిపోయింది సాటు దెబ్బా
తడిసి మోపెడౌతుంటే
గుడిసెమీద తీశావు
ఒడిసిపట్టి పడుసుదెబ్బా

||అబ్బ నీయబ్బ||

చరణం: 2
గాలిముద్దు లివ్వబోతే పొద్దుకాడ
ఎనకనించి తీశావు ఎదురు దెబ్బ
సందమావఁ నివ్వనంటె సందకాడ
ముందుకొచ్చి తీశావు ముసుగు దెబ్బ
మల్లెపూలు దూశావు మాపటేల తీశావు
మనసుమీద మాయదెబ్బా

||అబ్బ నీయబ్బ||




ప్రేమించుకుందాం ఎవరేమన్న పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల, S.P. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
ప్రేమించుకుందాం
ఎవరేమన్న ఏమన్న గానీ
పెనవేసుకుందాం
ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా
పూలలో తేలుతూ తావిలా

||ప్రేమించుకుందాం||

చరణం: 1
నీ కళ్ళల్లో చిరుసిగ్గు పల్లవి పాడేనూ
నీ ఒళ్ళంతా మెరుపేదో ఉయ్యాలూగెను
దుడుకైన నీ చూపు దూసుకుపోయెను
నా ఎదలోన కనరాని సెగలే రేపెను
పొంగనీ ఊహలే వేడిగా హా
పూయని ఆశలే తోడుగా హా

||ప్రేమించుకుందాం||

చరణం: 2
పరువాల జడివాన పడుతూ ఉన్నది
అది పడుతుంటే గిలిగింత మొదలౌతున్నది
మొదలైన ఈ హాయి తుదివరకుండాలి
అది ప్రతిరేయి మనసైన రుచులే చూపాలి
చిందనీ ప్రేమలే జల్లుగా హా
పండనీ జీవితం చల్లగా హా

||ప్రేమించుకుందాం||




ఇంతటి సొగసే ఎదురుగ వుంటే పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

పల్లవి:
ఇంతటి సొగసే ఎదురుగ వుంటే
తుంటరి మనసే తొందరు పెడితే
ఏమీ అనుకోకు  ఏమీ అనుకోకు

ఇంతటి సొగసే ఎదురుగ వుంటే
ఇరువురి నడుమ తెరలేవుంటే
ఏమీ అనుకోకు హా ఏమీ అనుకోకు

చరణం: 1
లేత లేత పొంగులేమో
లేనిపోని అల్లరి చేస్తే
ఏపులోన ఉన్న నేను ఎలావూరుకోను
వద్దు వద్దు ఇప్పుడొద్దు
ముందు ముందు వుంది విందు 

ఏమీ అనుకోకు ఏమీ అనుకోకు
ఇంతటి సొగసే ఎదురుగ వుంటే
ఇరువురి నడుమ తెరలేవుంటే
ఏమీ అనుకోకు హా ఏమీ అనుకోకు

చరణం: 2
చిన్నవాని కౌగిలిలోన
కన్నెవయసు కాగుతుంటే
ఎన్ని ఎన్ని తెరలూవున్నా ఎలా అగిపోను
వద్దు వద్దు ఆగవద్దు ఇచ్చుకోవా ఒక్క ముద్దు

ఏమీ అనుకోకు హా ఏమీ అనుకోకు
ఇంతటి సొగసే ఎదురుగ వుంటే
తుంటరి మనసే తొందరు పెడితే
ఏమీ అనుకోకు హహ  ఏమీ అనుకోకు
ఏమీ అనుకోకు ఏమీ అనుకోకు



తనయుడు పుట్టగానె పద్యం సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: S. P. బాలసుబ్రహ్మణ్యం

రాజయ్య: 
తనయుడు పుట్టగానె - తన
తండ్రికి సంత సమీయ జాలడు - ఆ
తనయుడు కీర్తిలోన తన
తండ్రిని మించిన నాడే నిక్కమౌ
తనివిని పొందు తండ్రియని
ధర్మమిదేయని చాటనెంచి నీ
తనయుల చేత నోడితివి
దాశరథి కరుణా పయోనిధీ

Palli Balakrishna Wednesday, June 23, 2021
Srivari Muchatlu (1981)



చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల     
నటీనటులు: నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవి
విడుదల తేది: 15.01.1981



Songs List:



ఆకాశం ముసిరేసింది పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల     

పల్లవి:
ఆకాశం ముసిరేసింది ఊరంతా ముసుగేసింది
ఆకాశం ముసిరేసింది ఊరంతా ముసుగేసింది
ముసుగులో పువ్వులు రెండు
ముసుగులో పువ్వులు రెండు
ఆడుకుంటున్నాయి... పాడుకుంటున్నాయి
ఆడి పాడి కిందా మీదా...  పడిపోతున్నాయి

హా..హా..హా..హ...
హా... ఆకాశం ముసిరేసింది... 
ఊరంతా ముసుగేసింది

చరణం: 1
తొలకరి జల్లుల చినుకులలో... హా...
గడసరి చినుకుల తాకిడిలో... హా..
మగసిరి గాలుల సైగలలో... హా..
ఊపిరి సలపని కౌగిలిలో... హా...

చెట్టాపట్టాలెసుకొని.. చెట్టుల చాటుకు వస్తే
పిట్టలు కూతలు కూస్తే.. తలపై పువ్వులు పడితే
పిట్టలు కూతలు కూస్తే.. తలపై పువ్వులు పడితే
.
మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు?.. 
బాజాలెందుకు? భజంత్రీలెందుకు?
హా... ఎందుకు?

హోయ్... హోయ్.. ఆకాశం ముసిరేసింది
ఊరంతా ముసుగేసింది

చరణం: 2
చిరుచిరు నవ్వుల పెదవులపై.. హా...
కురిసి కురవని ముద్దులలో.. హా...
చిరు చిరు చెమటల బుగ్గలపై... హా..
తెలిసి తెలియని సిగ్గులలో... హా..

బుగ్గా బుగ్గ కలుసుకొని సిగ్గుల పానుపులేస్తే
పెదవి పెదవి కలుసుకొని ముద్దుల రాగం తీస్తే
పెదవి పెదవి కలుసుకొని ముద్దుల రాగం తీస్తే

మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు?
బాజాలెందుకు? భజంత్రీలెందుకు?
ఛా... ఎందుకు? 

ఆకాశం ముసిరేసింది... 
ఊరంతా ముసుగేసింది..
ఆ... ఆకాశం ముసిరేసింది... 
ఊరంతా ముసుగేసింది..
ముసుగులో పువ్వులు రెండు
ముసుగులో పువ్వులు రెండు
ఆడుకుంటున్నాయి.. పాడుకుంటున్నాయి
ఆడి పాడి కిందా మీదా పడిపోతున్నాయి

హోయ్..ఆకాశం ముసిరేసింది... 
హా.. ఊరంతా ముసుగేసింది
ఆ.. ఆకాశం ముసిరేసింది 
ఆ.. ఊరంతా ముసుగేసింది




శ్రీవారి ముచ్చట్లు.. పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: పి.సుశీల       

పల్లవి:
తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరిచి తెరవగనే
తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరిచి తెరవగనే

చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..
తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..
శ్రీవారి ముచ్చట్లు.. శ్రీ శ్రీవారి ముచ్చట్లు..
శ్రీవారి ముచ్చట్లు.. నీ శ్రీవారి ముచ్చట్లు..

చరణం: 1
కలగన్న మొదటి రాత్రికి.. తలుపు తెరచే వేళ ఇది
వలదన్న ఒంటి నిండా.. సిగ్గులొచ్చే వేళ ఇది..

బెదురు చూపుల కనులతో... ఎదురు చూడని వణుకులతో...
బెదురు చూపుల కనులతో... ఎదురు చూడని వణుకులతో..
రెప్పలార్పని ఈ క్షణం... సృష్టికే మూలధనం
తెప్పరిల్లిన మరుక్షణం... ఆడదానికి జన్మఫలం..
ఆడదానికి జన్మఫలం... 

తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరచి తెరవగనే
చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..
తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు.. 

చరణం: 2
ఇన్నాళ్ళ మూగనోముకు... మనసు విప్పే వేళ ఇది..
ఇన్నేళ్ళ కన్నెపూజకు... హారతిచ్చే చోటు ఇది..

మల్లెపందిరి నీడన... తెల్లపానుపు నడుమన
మల్లెపందిరి నీడన... తెల్లపానుపు నడుమన
ఎదురు చూసిన ఈ క్షణం.. మరువలేని అనుభవం..
మరచిపోనీ ఈ స్థలం...  ఆడదానికి ఆలయం...
ఆడదానికి ఆలయం... 

తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరచి తెరవగనే
చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..
తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..




సూర్యునికొకటే ఉదయం.. పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల     

పల్లవి:
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం

ఆ ఉదయం ఎందరిదో.. ఈ హృదయం ఎవ్వరిదో
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం  

చరణం: 1
చీకటి పోకకు.. వెలుతురు రాకకు.. వారధి... ఆ ఉదయం
ప్రేమ పోకకు త్యాగం రాకకు .. సారధి... ఈ హృదయం
చీకటి పోకకు.. వెలుతురు రాకకు.. వారధి ఆ ఉదయం
ప్రేమ పోకకు త్యాగం రాకకు .. సారధి ఈ హృదయం
అది వెలిగే ఉదయం.. ఇది కరిగే హృదయం

ఆ ఉదయం ఎందరిదో.. ఈ హృదయం ఎవ్వరిదో
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం

చరణం: 2
జాబిలి విరిసినా.. భానుడు వెలిసినా.. ఒకటే ఆకాశం
కలలు తీరినా.. కథలు చెరిగినా.. ఒకటే అనురాగం... 

జాబిలి విరిసినా.. భానుడు వెలిసినా.. ఒకటే ఆకాశం
కలలు తీరినా.. కథలు చెరిగినా.. ఒకటే అనురాగం...

అది మారని ఆకాశం... ఇది మాయని అనురాగం..
ఆకాశం ఎందరిదో.. అనురాగం ఎవ్వరిదో...
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
ఆ ఉదయం ఎందరిదో.. ఈ హృదయం ఎవ్వరిదో





ముక్కుపచ్చలారని కాశ్మీరం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల     

పల్లవి:
ముక్కుపచ్చలారని కాశ్మీరం
ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
దీని వయ్యారం కాశ్మీరం. 
దీని యవ్వారం కాశ్మీరం
దీన్ని ఒల్లంతా కాశ్మీరం
దీన్ని చూస్తే కాశ్మీరం
రామ్.. రామ్.. రామ్.. రామ్

చరణం: 1
మొదటి సారి చూసుకుంటే ఊరింతలు
ఆపై కలుసుకుంటే ఉడికింతలు
కలిసి తిరుగుతుంటే గిలిగింతలు
పెళ్ళిదాక వస్తే  అప్పగింతలు
మనసు విప్పి కప్పుకుంటే 
అసలైన సిసలైన కేరింతలు

ముక్కుపచ్చలారని కాశ్మీరం  
ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం

చరణం: 2
కళ్ళు కళ్ళు చూసుకుంటే చెలగాటము
చెయ్యి చెయ్యి పట్టుకుంటే ఉబలాటము
కాలు కాలు ముట్టుకుంటే బులపాటము
బుగ్గ బుగ్గ రాసుకుంటే ఇరకాటము
మనసు విప్పి కప్పుకుంటే 
అసలైన సిసలైన ఆరాటము

ముక్కుపచ్చలారని కాశ్మీరం
హా.. మూడుముళ్ళకొచ్చింది  కాశ్మీరం
దీని వయ్యారం కాశ్మీరం
వీడి చూపులన్ని మాటలన్ని  కాశ్మీరం
దీన్ని ఒల్లంతా కాశ్మీరం
వీణ్ణి  చూస్తే కాశ్మీరం
రామ్.. రామ్.. రామ్..  రామ్..

ముక్కుపచ్చలారని కాశ్మీరం
హహహా.. మూడుముళ్ళకొచ్చింది  కాశ్మీరం




కాళ్ళగజ్జ కంకాళమ్మా.. పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల     

పల్లవి :
కాళ్ళగజ్జ కంకాళమ్మా.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా?
వేగుచుక్కా వెలగ పండు.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా?

పెళ్ళీ అంటే.. చుక్క పెట్టుకొచ్చా.. ఆ... ఆ..
రమ్మన్నావంటే.. గజ్జెలేసుకొచ్చా... ఆ.. ఆ..
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా.. ఆ.. ఆ..
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా.. ఆ.. ఆ...

హోయ్ కాళ్ళగజ్జ కంకాళమ్మా... హ ... హ
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా... హ... హ

చరణం: 1
నిన్ను చూడగానే నాకు వయసు తెలిసింది
వయసు తెలియగానే పెళ్ళి గురుతుకొచ్చింది
కాళ్ళ మట్టెలు.. రాళ్ళ పోగులు.. 
ఎర్ర గాజులు.. నల్ల పూసలు.. సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను

పెళ్ళి అనగానే నువ్వు గుర్తుకొచ్చా వు
నువ్వు గురుతు రాగానే ఆశ చచ్చిపోయింది
కాషాయాలు.. కమండలలౌ.. 
రుద్రాక్షలు.. పులిచర్మాలు సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను

అరెరెరెరే కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ..
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ..
అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ..
బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా హా హా హా 

చరణం: 2
పువ్వు పుట్టగానే గుప్పు గుప్పు మంటుంది
నేను పుట్టగానే నువ్వు నువ్వు అన్నాను
వెండి కంచము.. పందిరి మంచము.. 
గాలి పింఛము.. పూలగుఛ్చము సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే తలుపుకి గడియ పెట్టేస్తాను
నువ్వు ఊఁ అంటే తలుపుకి గడియ పెట్టేస్తాను

రాతిరిపూట కలలోకి నువ్వే వచ్చావు
జాతరలోని అమ్మోరుని గుర్తుకు తెచ్చావు
వేప మండలు.. కల్లు కుండలు.. 
కోడి పెట్టలు.. పసుపు బట్టలు.. సిద్ధం చేసాను
నువ్వు ఊఁ అంటే జాతర పెట్టేస్తాను
నువ్వు ఊ అంటే జాతర పెట్టేస్తాను

అరె అహా కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ..
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ..
అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ..
బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా

పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా...
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా...
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా
లా లా లా..... లా లా లా.... లా లా లా.... లా లా లా




ఉదయకిరణ రేఖలో... పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి      

పల్లవి:
ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో
ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో
పాడినదీ... ఒక రాధిక... పలికినదీ.. రాగ మాలిక
ఇదే.. ఇదే.. ఇదే... నా అభినందన గీతికా

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో

చరణం: 1
కాశ్మీర అందాలు బాలభారతి నుదుట తిలకాలు దిద్దగా
పురివిప్పు నాట్యాలు నాట్యభారతి పాదాల పారాణి అద్దగా

అడుగుల అడుగిడి స్వరమున ముడివడి 
అడుగే పైబడి మనసే తడబడి
మయూరివై కదలాడగా... వయ్యారివై నడయాడగా
ఇదే...  ఇదే...  ఇదే...  నా అభినందన గీతికా 

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో

చరణం: 2
పయనించు మేఘాలు నిదురించు సృష్టినే మేలుకొలుపగా
రవళించు మువ్వలు నటరాజు ఆశీస్సుకై హారతివ్వగా
స్వరమున స్వరమై పదమున పదమై పదమే స్వరమై స్వరమే వరమై

దేవతవై అగుపించగా... జీవితమే అర్పించగా
ఇదే... ఇదే... ఇదే... నా అభినందన గీతికా

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో
ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో
పాడినదీ... ఒక రాధిక... పలికినదీ.. రాగ మాలిక
ఇదే.. ఇదే.. ఇదే... నా అభినందన గీతికా

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో

Palli Balakrishna Tuesday, March 5, 2019

Most Recent

Default