Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Mamta Mohandas"
Rudrangi (2023)



చిత్రం: రుద్రంగి (2023)
సంగీతం: నాఫల్ రాజా ఐఏఎస్
నటీనటులు: జగపతి బాబు, అశిస్ గాందీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం
దర్శకత్వం: అజయ్ సామ్రాట్
నిర్మాత: 
విడుదల తేది: 2023



Songs List:



జాజిమొగులాలి పాట సాహిత్యం

 
చిత్రం: రుద్రంగి (2023)
సంగీతం: నాఫల్ రాజా ఐఏఎస్
సాహిత్యం: అభినయ శ్రీనివాస్ 
గానం: మోహన భోగరాజ్ 

ఏ వచ్చిందే వచ్చిందే
తయ్యారై వెన్నెల వయ్యారే
ఓ పోరి…
పుట్ట మీద పాల పిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి
పుట్ట మీద పాల పిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి
మంత్రమేసే మామ కొడుకా జాజిమొగులాలి
మందు దంచుకొని రారా జాజిమొగులాలి
పుట్ట మీద పాల పిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి

పేరు పెట్టి ప్రేమతోని పిలవనంటడే
వాడు ఇగురంగా ఇస్తారా చేస్తానంటడే
ఏలు పెట్టి నలుగుట్ల నడువనంటడే
వాడు ఏమి ఎరుగనట్టు
ఎన్ని వగలుపడతడే
ఒక్కదాన్ని దొరికితే వదులనంటడే
నన్ను బక్కపలుసాగున్నవంటు లెక్కలేస్తాడే
తిక్క తిక్క పనులెన్నో చెయ్యమంటడే
వాడు పక్కనుంటే చాలు నాకు ఉడకపోతలే
ఇస్సునంతా రమ్మంటే
నా ఇంటి దానివంటడే
ఆకురాయి సుపులోడే జాజిమొగులాలి
అందమంతా మెరుగు బెట్టే జాజిమొగులాలి
వాడు చూసే చూపులకు జాజిమొగులాలి
కన్నెతనమే కరిగిపాయె జాజిమొగులాలి

ఏ అర్ధరాత్రి యాదికొస్తే నిద్దరుండేదే
వాడు ముద్దు మీద ముద్దు పెడితే
పొద్దు పొడువదే
అమ్మ తోడు పాడు మనసు ఆగనంటదే
నాకు వాని మీద పానమంతా గుంజుతుంటదే
రాక రాక వచ్చినాడు మొన్న రాతిరే
నా రామసక్కనైన బావ సాటి ఎవ్వరే
కోరి కోరి పెట్టినాడు కొత్త కిరికిరే
వాడు అదుముకుంటే ఆడనంది ఉన్న ఊపిరే
నా తోడే వాడుంటే ఇగ మస్తు మస్తుగుంటదే
గుడెపోలే పిలగాడే జాజిమొగులాలి
గుండె కొల్లగొట్టినాడే జాజిమొగులాలి
కన్ను కన్ను కలిపినంటే జాజిమొగులాలి
ఎన్నులోన వణుకు బుట్టె జాజిమొగులాలి
దొరసాని నువ్వులు చూడే జాజిమొగులాలి
పున్నమోలే పోసినాయే జాజిమొగులాలి
తీగ నడుము చూడ బోతే జాజిమొగులాలి
నాగుపాము లెక్క ఊగే జాజిమొగులాలి




ుద్రంగి టైటిల్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: రుద్రంగి (2023)
సంగీతం: నాఫల్ రాజా ఐఏఎస్
సాహిత్యం: మానుకోట ప్రసాద్ 
గానం: కైలాష్ ఖేర్

రుద్రంగి టైటిల్ సాంగ్

Palli Balakrishna Wednesday, April 5, 2023
Homam (2008)



చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అమర్ మొహిలే 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ (All)
నటీనటులు: జగపతి బాబు, జె.డి.చక్రవర్తి , మమతా మోహన్ దాస్, మధురిమ తులి 
డైలాగ్స్: కోనా వెంకట్ 
దర్శకత్వం: జె.డి.చక్రవర్తి
నిర్మాత: కోనేరు కిరణ్ కుమార్ 
విడుదల తేది: 29.08.2008



Songs List:



ఏ పాగలే ఏ హవులే పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: శివాని, జె.డి.చక్రవర్తి

ఏ పాగలే ఏ హవులే 




ఏయ్ మిస్టర్... నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మమతా మోహన్ దాస్, శివాని, నిహాల్ 

ఏయ్ మిస్టర్... నిన్నే



పెడవికేదెం కసిరో పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మమతా మోహన్ దాస్, జగపతి బాబు, జె.డి.చక్రవర్తి

పెడవికేదెం కసిరో 




మగాళ్ళు మీ మాటలో పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మధుశ్రీ,  జె.డి.చక్రవర్తి

మగాళ్ళు మీ మాటలో 



కత్తినాకు గుచ్చాడమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మాలతి 

కత్తినాకు గుచ్చాడమ్మో 



హోమం యుద్ధం పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: వినోద్ రాథోడ్ 

హోమం యుద్ధం 

Palli Balakrishna Sunday, August 7, 2022
Victory (2008)


చిత్రం: విక్టరీ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కలువ కృష్ణ సాయి
గానం: నితిన్ , మమతా మోహన్ దాస్ , శశాంక్
నటీనటులు: నితిన్ , మమతా మోహన్ దాస్ , సింధూ తులాని, శశాంక్ మరియు కోరస్
దర్శకత్వం: రవి సి.కుమార్
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
విడుదల తేది: 27.06.2008

ఏయ్ స్కూటీ నేర్పకుండా వెళ్లిపోతావెంట్రా
ఏ పోవే
ఏంట్రా మధ్యలోనే వచ్చేశావ్
దానికి నేను చచ్చినా బైక్ నేర్పించనురా
చె నువ్వు మారవురా
ఏంట్రా పోజ్ కొడుతున్నావ్

జన్నీఫర్ లా ఉన్నవంటూ
మార్లిన్ మన్రో షేపుల్ అంటూ
డైలీ నన్నే కాకా పడుతూ
డ్రీమ్ గర్లంటూ ఫిక్స్ అయిపోతూ

రాజేష్ రోహిత్ సైటే కొట్టారే
బన్నీ బూబ్లూ మున్నా చిన్నా వెంటే పడ్డారే

అరే ఎంత చెప్పినా ఫోజులు కొడతావేందిరా
ఇంత ఓవర్ వంటికి మంచిది కాదురా
పిల్ల బైక్ నేర్పమంటే నేర్పవా
వీలుకాదు అంటు వెళ్లిపోతవా
అందులోన కిక్ నీకు తెలుసునా
అంతకన్న లక్కు నీకు దక్కునా
వెళ్ళు వెళ్ళురా ఒక్క ట్రైల్ వెయ్యరా
అందులో ఉన్న మజా తెలుసుకో జరా

చల్ పొబే

వీడి బుర్ర జర మార్చండోయ్
నిజమేనోయ్ మార్చాలోయ్
ఆడపిల్ల తను కాదండోయ్
ఎందుకురా ఏమండోయ్
ఎంత చెప్పినా నీకే అర్ధం కాదురా
విన్నవిందక ఏదో చెప్తున్నావురా

ఇంతకి ఏం చేసిందిరా బాయ్ ఆ పోరి
స్పీడ్ బ్రేకర్ అడ్డురాకపోయినా
చీటిమాటికి బ్రేక్ వేస్తది
మీద మీదకొచ్చి నేను పడినా
నంగానాచిలా నవ్వుతున్నది
వెళ్లలేనురా అది పిల్లకాదురా
నౌకరల్లే వాడుకుంటున్నది

అబ్బాయి చేసే పని అమ్మాయి చేసిందా
బానే ఉంది
అంతకన్న లక్కేముందోయ్
ఇంకేంటోయ్ ఎంజాయ్ చెయ్
అందుకె నాకు మండిందోయ్
ఏమిటోయ్ ఎమ్మనిషోయ్
ఆయ్ అదేంటండి అమ్మాయిగారు
పైనడుతుంటే పట్టించుకోరేంటండి

ఏంట్రా డిస్కషన్ వస్తావా రావా
చూశావారా అరె తురే అంటుంది
లైట్ తీస్కో
మనసుకు నచ్చితే అమ్మాయిలు అలానే పిలుస్తారు
కాఫీడేలు  రెస్టౌరెంట్లు ఉన్నది
నువ్వు నేను ఒక్కటవ్వడానికే
హే కాఫీడేలు  రెస్టౌరెంట్లు ఉన్నది
ఆ నువ్వు నేను ఒక్కటవ్వడానికే
హిచ్కాక్ సినిమా హీరోయిన్ ఇది
డ్రాగుల్లాల పట్టి చంపుతున్నది
ఎంత తిట్టినా కోపం వస్తాలేదురా
ఎందుకంటే ఎంతో నువ్వు నచ్చినావురా
ఈ ముక్క చెవిలో కేళి ఫ్లవర్ పెట్టినోడికి చెప్పు

పాపను ఏడిపించొద్దవోయ్
పాపంరోయ్ వెళ్ళొద్దోయ్
మధ్యలో నువ్వు మొరగొద్దోయ్ జారే బాయ్ నువ్వెవడోయ్
ఏంరా మళ్ళొచ్చినావ్
అది అమ్మాయ్ కాదురా బాబు ఆటం బాంబు
ఓ పోరి వీళ్ళతో కాదుగాని నన్ను రమ్మంటావా
రేయ్ పొట్టోడా భూమికి జానెడున్నావ్ కొట్టానంటే
రేయ్ దానికి నేను నచ్చలేదురా బాయ్
నువ్వే పో
ఊ ఏం చెయ్యాలో చెప్పు
కూల్ డ్రింక్ తెచ్చి కూల్ చెయ్యరా
స్ట్రాలు రెండు వేసి నాతో తాగరా
డబ్బులిస్తా నువ్వువెళ్లి తెచ్చుకో
మిత్తమంత నువ్వుతాగిపో
వీడు ఎవడు సెన్స్ లేని పొరడు
అందమైన ఆడపిల్ల ఆఫర్ ఇస్తే పోతడు
నేను చూస్కుంటాగా
బాయ్ ఫ్రెండ్ అంటే అంతేరో ఎక్కడికోయ్ కూర్చోవోయ్
పిల్లతో లింక్ పెట్టద్ధోయ్
మీకు బాయ్.. దానికి గుడ్ బై




Palli Balakrishna Monday, March 5, 2018
Kedi (2010)


చిత్రం: కేడి (2010)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: సునిధి చౌహన్
నటీనటులు: నాగార్జున
దర్శకత్వం: కిరణ్ కుమార్
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
ప్రొడక్షన్స్: అన్నపూర్ణా స్టూడియోస్, కామాక్షి మూవీస్
విడుదల తేది: 12.02.2010

జాదు గాడురా ఈ మాయ మచ్చుం రా
జంతర్ మంతర్ చేసేటి కేడి గాడు రా
జల్స గాడు రా ఈ మాయ మచ్చుం రా
ఉల్ట పల్ట ఆటల్లొ కింగ్ ఏ వీడు రా
కేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can

జాదు గాడురా ఈ మాయ మచ్చుం రా
జంతర్ మంతర్ చేసేటి కేడి గాడు రా
జల్స గాడు రా ఈ మాయ మచ్చుం రా
ఉల్ట పల్ట ఆటల్లొ కింగ్ ఏ వీడు రా
కేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can

కన్నింగోడు ఈ దొంగోడు కన్నం వేసి అన్ని దోచెస్తాడు
చీటింగోడు చీతగాడు మ్యాటర్ ఉన్న మాటగాడు వీడు
కిల్లడి వీడు స్టైలే ఉన్నోడు అల్లడిస్తాడు చూడు

రమ్మి గాడూ రా ఈ మాయ మచ్చుం రా
సుపర్ డూపర్ వేషాలా ఆట గాడు రా
దొమ్మి గాడు రా ఈ మాయ మచ్చుం రా
మాయ మంత్ర చేసేటి గాలి గాడు రా
కేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can

కల్లె మూసి తెరిచేలోపు వేల వేసి గ్లోబె అమ్మేస్తాడూ
తాలం ఉన్న మేదల్లోకి గాలై దూరి మాయ చేస్తుంటాడూ
సునామి కన్నా వీడే స్పీడు స్కెచ్చేసి సాదిస్తాడు

జాదు గాడురా ఈ మాయ మచ్చుం రా
జంతర్ మంతర్ చేసేటి కేడి గాడు రా
జల్స గాడు రా ఈ మాయ మచ్చుం రా
ఉల్ట పల్ట ఆటల్లొ కింగ్ ఏ వీడు రా
కేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can


******  *******   ********


చిత్రం: కేడి (2010)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: టిప్పు , గీతామాధురి

మ మ మ మ మ ముద్దంటిచ్చేదా
ఇప్పుడా ఉద్దేసం లేదా
ఇప్పుడొద్దన్నావంటె కుర్రవాడా
రేపు ఇమ్మన్న ఇస్తాన వెర్రి వాడ
ము ము ము ము ముద్దంటె మోజె
ఇప్పుడా ఉంద్దేసం లేదె
నిను ముద్దాదాలన్న కుర్రదానా
అసలు మనసంటు ఉండాలే వెర్రి దానా

మ మ మ మ మ ముద్దంటిచ్చేదా
ఇప్పుడా ఉద్దేసం లేదా

నిగనిగలాడె నా సుకుమారం చూడవుగా కాస్తైనా
మగువను మించిన ఆనందం ఏముందయ్యో లోకానా
దగ దగ మెరిసే గాంధి నవ్వుల నోటే లే నా దారీ
తెగ బడి రాకే నాకు నీకు సరిపడదే సుకుమారీ
హేయ్ చూడు ఉబలాటం...ఆడు చలగాటం
అంతలేదమ్మో ఆపు ఆరాటం
చేతుల్లోన పైసా ఉంటె అంతా నా సొంతం

మ మ మ మ మ ముద్దంటిచ్చేదా
ఇప్పుడా ఉద్దేసం లేదా
నిను ముద్దాదాలన్న కుర్రదానా
అసలు మనసంటు ఉండాలే వెర్రి దానా

మనసు పడ్డ మగువను లెక్క చేయవెందుకూ
నా అందమే నీదిరా నన్ను కాదనకూ
నిన్న నేదు రేపులో నేడు ఉంది చేతిలో
ఈ నాటికి ఏ నాటికి డబ్బేలె రారాజూ
మోజు పడకుంటె మగవాడె కాదు
మోహమేలేని సరసం సరి కాదూ
కాసులు తప్ప లోకంలో మరి నాకేం కనపడదూ

మ మ మ మ మ ముద్దంటిచ్చేదా
ఇప్పుడా ఉద్దేసం లేదా
ఇప్పుడొద్దన్నావంటె కుర్రవాడా
రేపు ఇమ్మన్న ఇస్తాన వెర్రి వాడ
ము ము ము ము ముద్దంటె మోజె
ఇప్పుడా ఉంద్దేసం లేదె
నిను ముద్దాదాలన్న కుర్రదానా
అసలు మనసంటు ఉండాలే వెర్రి దానా



******  *******   ********


చిత్రం: కేడి (2010)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: అర్జిత్ సింగ్ , నేహా కక్కర్

నీవేన నీవేనా నీతోనె నేనున్నానుగా
నీలోన నాలోనా ఈ సంతోషం కల కాదుగా
ఇంకో జన్మెనేమో నీతోనె చూశానేమో
ఏదేమైనా ఈ రోజె మల్లి మల్లి రాదేమో

నీవేన నీవేనా నీతోనె నేనున్నానుగా
నీలోన నాలోనా ఈ సంతోషం కల కాదుగా

మెల్లగా మెల మెల్లగా నా మనసులో విరబూశనే
నీ గ్ఞాపకాలే నీ గ్ఞాపకాలే
మెరుపులా నువు నవ్వుతూ అణువణువునా చేసావులే
సంతకాలే సంతకాలే
నీతోనె పాదం నా పాదం సాగిపోనీ
మౌనంగ కాలం కల కాలం ఆగిపోనీ
ఇంకో జన్మెనేమో నీతోనె చూశానేమో
ఏదేమైనా ఈ రోజె మల్లి మల్లి రాదేమో

నీవేన నీవేనా నీతోనె నేనున్నానుగా
నీలోన నాలోనా ఈ సంతోషం కల కాదుగా

కొత్తగా సరి కొత్తగా ఈ లోకమే కనిపించనే
నీ రాకతోనే నీ రాకతోనే
ఇప్పుడు నేనిప్పుడు నీ రూపమే దాచానుగా
నా గుండెలోనే నా గుండెలోనే
చుసాలె నేడే ఈ నాడె నా జాడె
అందంగ నాకే అందాడె అందగాడే
ఇంకో జన్మెనేమో నీతోనె చూశానేమో
ఏదేమైనా ఈ రోజె మల్లి మల్లి రాదేమో

నీవేన నీవేనా నీతోనె నేనున్నానుగా
నీలోన నాలోనా ఈ సంతోషం కల కాదుగా

Palli Balakrishna Monday, January 8, 2018
Krishnarjuna (2008)



చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: విష్ణు మంచు, నాగార్జున అక్కినేని, మోహన్ బాబు మంచు, మమతా మోహన్ దాస్
దర్శకత్వం: పి. వాసు
నిర్మాత: మోహన్ బాబు మంచు
విడుదల తేది: 01.02.2008



Songs List:



అ అ ఆ ఇ ఇ ఈ స్కూలు బెంచీల పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: టిప్పు, సునీత

అ అ ఆ ఇ ఇ ఈ స్కూలు బెంచీలు బెత్తాల చైరు చిక్కుల్ని
దాటాలంటే మై హూనాచుట్టూరా చూడాలి కళ్ళు
దిక్కుల్ని దాటాలి కాళ్ళు చుక్కల్ని చేరాలంటే మై హూనా
పడమర కూకు దక్షిణం ఉత్తరం నీలాల నింగి పాతాళ దీవి
ఎక్కడికైనా మైహూనా మైహూనా

చరణం: 1
బడిలోను ఆ చదువే ఇంట్లోను ఆ గొడవే సరదాలే కనపడవే
గడియారం విసిరేస్తే టైం టేబుల్ చింపేస్తే అడిగే వారుండరంతే
అరచెయ్యి అడ్డుపెడితే ఆనందం ఆగిపోదంతే అమ్మైనా నానైన్నా
అవునన్నా కాదంటే తోడుంటే అర్జునుడైనా మై హూనా మైహూనా
జిగి జా జిగిజా - - -

చరణం: 2
చిటికెల్లో నీ కోసం కనిపెట్టా ఓ లోకం కలకాదు నిజమే
నండి మబ్బుల్నే మడి చేసి మెరుపుల్తో కట్టేసి ఉయ్యాలలూ
గేస్తానండి చీకట్లో రాని చోటుంది చాక్లెట్లు కాసే చెట్టుంది
వానల్లే లస్సీలు వడగల్లే కుల్ఫీలు కోరింది ఇవ్వగా
మైహూనా మైహూనా 




ఆజా మెహబూబా పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సాహితి
గానం: అచ్చు, గీతా మాధురి

ఆజా మెహబూబా తూహి హే దిల్‌మేరా
లేజా లెహిరి ఫ్యారి ఓయాజు నేనేరా
నారీ నాజూపూరి నవ నవ శృంగారి
చేరా నిన్నే కోరి యెదే నీకు జారి
ఒక మనసుకు లోకాలుకే రామాయమా కుషి ఇష్కేలలగునా
కౌగిలికే కమ్‌ కమ్‌ కరుగుదాం ఒరుగుదాం
సీనా సీనా హే దేఖోనా కోనా కోనా హే మసిమే హొనా
సోకే గుర్రమే అరుకే గూడేతే జుర్రేలెత్తేజీసీనా సీనా మస్తిమే హొనా

చరణం: 1
పడిపోమరి సుఖమస్తు నా నడుమే బొంగరము ఒడి చుట్టూ
తిరిగేటట్టు ఒడుచు చూపు వారెవా
పడతా ఇక కుషమత్తు పెడుతూ శ్రయ చూపడము మిడిషేపుల
రుచి చూపిస్తూ నాటాప్‌లో కొస్తావా
రసగుల్ల మసకలో కసి గురువుల ఇస్తామల్ల చెకుముకి సెగ
రగలగ చెంగు వార చెంగు వార బిగిసొగసుల రంగుమార
బుగ్గమార బెంగపడకురా నువ్వొస్తే పువ్వులరస్తా నే పరిపిస్తా
నా పరుపిస్తా ఆహిస్తా ఆడిస్తానా అత్తరు పూస్తా లాంతరు తీస్తా
సీనా సీనా హే దేఖోనా
కోనా కోనా హే మస్తిమేహొనా

చరణం: 2
వీనస్‌లో నోరూరించే ఈ ఫిగర్‌ నాడ్రీయు బోనస్‌గా
వన్స్‌మోరంటూ వాటెయ్యవే నడిచావు
ఈ టక్కునినుపిస్‌ చేసే ఈ టైమే నా బూము
ఓ నైటు లవ్ పాటేస్తూ ఎక్సైటింగుగా గడిసావో
బిగి బిగినిల జిగపిల్లకున్న సొగసునిక లవ్వులోనా జగ్గు
చేస్తుకున్నా హంగరీల శృంగారాలే సంగరాల జడ కోహిలాల
జగుజను స్వింగు లేచిపోడా ఆపితేస్తానే తినిపిస్తా గిలిగిలిగిస్తా
కమ్మగా నీ కల ఇంట్లోనే కరిగిస్తానే కలబడి కన్నా
సీనా సీనా హే దేఖోనా
కోనా కోనాహీ మస్తియే హొనా (2)




బుగ్గలెర్ర బడ్డ బుల్లె పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సాహితి
గానం: యమ్. యమ్. కీరవాణి , మమతా మోహన్ దాస్

బుగ్గలెర్ర బడ్డ బుల్లె
బుంగమూతి బుండుమల్లె
బుల్లి బుల్లి గ సిగ్గులె దాచుకొ నీకు నాకు పెళ్ళె
సొకు సంబరల రాజ
కొట్టుకొర పూల బాజ
కొంగ పట్టు అ వాడిలొ వెడిలొ నీవెలె నీదెలెర కాజ
చాలు చాలు అంతు ఇంక నన్ను ఆపమాకు
చెల్తెర నన్ను తొందరింక పెట్టమాకు
చూస్తుండగానె ఎటవలు కన్ను కొట్టి పైట చెంగు దాచుకుంటలె 

మస్తుగ సిలక పుస్తెపడినాక
పస్తుండ మనక సొగసె అందిస్తావ
రెపు నీ సూపె ఆలినె కాగ
కమ్మగ కడుపె నింపె ముద్దివ్వన
కొతికొమ్మ ఆదకుండ కొతజున్ను పలకుండ ఎద దాచినావె అమ్మడ
ముద్దు ఎవ్వడికందకుండ ఉట్టిమీద పట్టినన్ను పట్టుకొర పడుచుమీగడా
ఓ ఓంటి వీడి అంతకంత ఎక్కిపొయి పెట్టు నాకు పెరుగు ఆవడ 
చిక్కగ రెయి చుమ్మ చీకటైనాకు ఊహ
చక్కగ చిలకె నీకె చుట్టివన
ఒక్కల నలిగి ఒక్కటైనాక ఎక్కడొ గిలిగ మెలికె పెట్టెయన
మంచివెళ మించనీక పంచలొన మంచమెసి ఉంచుకొర దిండు తలగడ
గించ కొడి పుజులాగ రంజులన్ని పుంజుకుంటు ఉంచుకొన పూల వాలుజడా
గంపకింద పిట్టలగ దాచకుండ పట్టు ఇంక పిట్టజల్లెడ





యమా రంజుమీద ఉంది పుంజు పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: గురుకిరణ్
గానం: సునీత, టిప్పు

యమా రంజుమీద ఉంది పుంజు జమాయించి దూకు
తుంది రోజు తిరుగుబోతుపెట్టని బుట్టకింద పెట్టుకో
కొంగురేగి పోయాకా అమ్మమ్మో అబ్బబ్బో అనకే రంగసామి
యమ రంగుతేలి ఉంది పిట్ట దాని జమాయింపు
దాచలేదు బుట్ట దమ్ములుంటే రమ్మను తరుగు ఏది మద్దెకి
కాలు కూడా గుంజారే అప్పుడే చెబుతూ దమ్ములు మంచు
మాయం 

ఆకుందా వక్కిస్త సున్నంతో పొక్కిస్తా మల్లెపూల పక్కేస్తా
ఒళ్ళంతా రక్కేస్తా కమాన్‌ బేబి టాంగ్‌ వితిమి ట్రీట్‌ ఎగైన్‌

చరణం: 1
భలే పాడు పుంజు అని పొదల్లోకి లాగా పిచ్చి వేషాలేశా
వంటే పట్టుకొని లాగుతాను రెండు జడలురెండు
జడలు పట్టి లాగినా జారుపైట జారినా నిన్నువిడిచి
పెట్టదుగా పొగలా సెగలా గుబులుకోరే పెట్ట ఒడేసికొట్టా
వగల మారి పెట్టని వాటమైన పుంజువి ముచ్చటంతా
తీరేదాకా సచ్చి పిచ్చి రెచ్చి పోవునులే

చరణం: 2
పూల బాట నాదేనని ఒళ్ళు విరుచుకుంటే కళ్ళ ముందే
ముగ్గులోకి దించుతాది భలే కౌజుపిట్ట వాటే సిపట్టా
రెక్క విప్పి కొట్టనంటే చుక్కలు పడతాయి ముగ్గుపోటు
తగిలిందంటే ముచ్చటెత్తా తీరతాడే పెట్ట ఎగిరి కొట్టా
ఎగిరి దెబ్బ కొట్టినా బదులు ముద్దు పెట్టినా ముందు చూడు
వేడి పుడితే హద్దు పొద్దు లేదు పుంజుమావ



త్రువ్వట బాబ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: టిప్పు 

త్రువ్వట బాబ 



పెద్ద మర్రికేమో చిన్న కాయలిచ్చె పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మనో, మధు బాలకృష్ణన్

పెద్ద మర్రికేమో చిన్న కాయలిచ్చె సన్న తీగల్లోనా గుమ్మళ్ళు
కాయించి చిత్రం చేస్తివే గురువా ఎందుకో చెప్పగలవా బురదగుంట
లోనా తామర నుంచి ముద్దు గులాభికి ముళ్ళనడ్డుపెట్టే చిత్రం చేస్తివే
గురువా ఎందుకో చెప్పగలవా లెక్కలేని చిత్తరాలు ఎన్నో కళ్ళ
ముందు లేవా గుట్టువిప్పి చెప్పుకుంటూ పోతే అంతు చూడగలవా
అసలెందుకు నీకిగొడవ కాస్త ఊరికే ఉండలేవా (2)

చరణం: 1
అందమైన కస్తూరి జింకను అడవిలోకి తోలేసినావు మందలుగా
పందులనేమో ఊరిమీదకి వదిలేశావుఅంతో ఇంతో పొద్దు
పోనిదే రాతలేమి రాయవు నువ్వు లెక్క తప్పుకోనిదే నువ్వు నిద్దర
పోలేవు ముచ్చటైన మనిషివి తెచ్చి పల్లెల్లోనా పెంచింది నేను
కోతి మూక అల్లరినంతా కోనల్లోనే దాచి ఉంచాను ఆచి తూచి
ఆలోచించే అన్నీ నేను చేసుంటాను చెప్పదంటూ సందేహాలకు
ఎట్టా దొరుకుతాను ఎందుకు నీకి గొడవ కాస్త ఊరికే ఉండలేవా
అసలెందుకు నీకి గొడవ కాస్త ఊరికే ఉండలేవా

చరణం: 2
ఓ బంగారు నేలపైనా బుక్కరు భాగం ఉప్పునీరు నింపేసినారు
తాగు నీరు లోతున దాచి బావులెన్నో తవ్వించావు కొంచెమైన
తిరకాసులేనిదే ఏ పని చెయ్యనలేవు తారు మారు తప్పులతోనే
దేవుడి డయ్యావు ఉప్పులేని ఉత్పత్తి వంట ఒక్కపూట తినలేవు
నువ్వు సంధ్రమున్నదందుకేనని తీరుగా మర్చిపోయావు లేని
పోని ప్రశ్నలు వేసే చిట్టి బుర్ర నీకు ఇచ్చింది నేను దాన్ని నువ్వు
సాన పెట్టకుంటే అర్ధం కాను నేను ఏది ఎక్కడుందో అక్కడుంటే
నీళ్ళు ఎందుచేత ఉందో తెలుసుకుంటే చాలు చిత్రం బోద పడదా
చిక్కులే తీరిపోవా గడ్డిపోచ నుంచి గగనాల ద్వీపాలు అన్నీ చోట్ట ఉండి
నాదే ఆనవాలు లోకం రంగుల పరదా చిత్రమే నాకు సరదా (2)





ఏది మంచి ఏవిమైల తెలుపనా పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మధు బాలకృష్ణన్

ఏది మంచి ఏవిమైల తెలుపనా మౌల పది దిక్కులలో నువ్వే లేవా
నిన్నే నువ్వే వెలెయ్యగలవా నీడలెన్ని కూడినా దిక్కునంట గలవా
కనుపాపకు కాంతి నీవే నందలాలా నందలాలా 

చరణం: 1
నీదయ పెంచిన ప్రాణం గురి తప్పని అర్జున బాణం పదమను
కనుసైగన కదిపింది నీవురా ఆపద పొడచూపకు నీ మీద ఆనరా
ఔధార్యం సహ చర్యం నువ్వు కరుణించిన పుణ్యం ఈ కారణ
జన్మం నీ కనుపాపకు కాంతి చూపలేవా

చరణం: 2
జన్మకు మూలం నీవు కర్తవు కర్మవు నీవు ఆత్మకు ఆకారమిచ్చు సృష్టి
మూలమా ఆయువును అరచేతదాచి ఆడుకోకుమా చిరుగాలి
సుడిగాలై నీ గుడి తలుపులు తాకి పెనునిద్దుర విడరా నీకను
పాపకు కాంతి చూపలవా




We R Coming పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ప్రణవి, భార్ఘవి పిళ్ళై, నోయెల్ 

We R Coming


Palli Balakrishna Friday, September 15, 2017
Chintakayala Ravi (2008)



చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
నటీనటులు: వెంకటేష్, అనుష్క, మమతా మోహన్ దాస్
దర్శకత్వం: యోగి
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
విడుదల తేది: 02.10.2008



Songs List:



బాగుందే బాగుందే పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ ప్రకాష్, హాన్షిక

ప్రేమేనా...
హొ... ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగ నా మనసునే అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోన జరిగే ఇది

బాగుందే బాగుందే ఏదో బంధమే
సాగిందే నీతో పాదమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
ఊగిందే నీకై హృదయమే

చరణం: 1
ద్వేషమే  స్నేహమై కష్టమే ఇష్టమై
దూరమే తీరమై భారమే తేలికై
పంతాలే చిలిపిగ చదివిన పాఠాలై
భేదాలే చివరికి కలిసిన భావాలై
ఏనాడో చినుకల్లే మొదలైనది
ఈనాడే వరదైన వరమే ఇది

బాగుందే బాగుందే ఏదో బంధమే
మోగిందే నాలో మౌనమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
లాగిందే ఊహాలోకమే

ప్రేమేనా...

చరణం: 2
చూపులే చిత్రమై మాటలే మంత్రమై
ఊపిరే ఊయలై నవ్వులే వెన్నెలై
దేహాలే ప్రణయపు పూవుల దారాలై
ప్రాణాలే మమతల మల్లెల హారాలై
బ్రతుకంతా బ్రతికించే భావం ఇది
ప్రతిరోజూ జన్మించే మార్గం ఇది

బాగుందే బాగుందే ఏదో బంధమే
నువ్వంటే నా ప్రతిబింబమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
నీకేలే నా సగభాగమే

ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగ నా మనసునే అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోన జరిగే ఇది

బాగుందే...




ఓ సునీత ఓ సునీత పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
తకదిమిత మొదలెడతా తికమకమక పెడతా
ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
అడుగెడతా తెగబడతా లైఫ్ ను చెడగొడతా

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

ముందు ముందు నువ్వు పోతే
వెనక వెనక నేను వస్తా
షాక్ మీద షాక్ ఇస్తా నహి చోడుంగారే
ఏడ ఏడ నువ్వు పోతే ఆడ ఆడ నేను వస్తా
బ్రేక్ మీద బ్రేక్ వేస్తా నహి చోడుంగారే
టెన్షన్ పుట్టిస్తా క్షణ క్షణం ప్రతి క్షణం
టార్చర్ పెట్టేస్తా నహి చోడుంగారే

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

పగ బట్టేస్తా ఇక భయపెట్టేస్తా
ఇలా మెంటల్ గా డిస్టర్బ్ చేస్తా
పని పట్టేస్తా ఇక శని పట్టిస్తా
ఇలా నీ బాటరీ డిశ్చార్జ్ చేస్తా
హే చలికిస్తా గిల గిల వనికిస్తా విల విల

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
ఎగగెడతా పొగబడతా లైఫ్ ను చెడగొడతా
ఇరికించేస్తా ఇలా ఇరుకున పెడతా
యమా ఇరిటేషన్ తెప్పించేస్తా
పరిగెట్టిస్తా ఎదో ప్రాబ్లెమ్ తెస్తా
ఇక సొల్యూషన్ లేదనిపిస్తా
హా పోగొడతా ఫ్రీడమే చూపెడతా నరకమే

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

కారులోన టూర్ కెళితే టైరు లోనగాలి తీస్తా
ఊపిరాడకుండ చేస్త నహి చోడుంగారే
బోర్ కొట్టి ఫిల్మ్ కెళితే స్క్రీన్ పైన నేను వస్తా
స్క్రీన్ మార్చి ఎడిపిస్తా నహి చోడుంగారే
టెన్షన్ పుట్టిస్తా క్షణ క్షణం ప్రతి క్షణం
టార్చర్ పెట్టేస్తా నహి చోడుంగారే

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
తకదిమిత మొదలెడతా తికమకమక పెడతా
ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
నువ్వొకటి నాకిస్తే నేనిక డబలిస్తా
ఓ సునీత



సే షావా షావా పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, మహాలక్ష్మి అయ్యర్

సే షావా షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే
సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే

సరదాకే సరదా పుట్టే సమయంలో
సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో
హే సరదాకే సరదా పుట్టే సమయంలో
సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో
కిర్రెక్కి కొట్టే కేరింతల్లో

యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో
యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో

సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే
సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే

ఇన్నాళ్లు మనసు కనివిని ఎరుగని చెలిమి దొరికెనీ చోట
హే ఈ తోడు కరువై సగముగ మిగిలిన బ్రతుకు అతుకునీ చోట
నిన్నటి తలుపే మూసి నిన్నుగా కోరేదీ చోట
రేపటి తలుపే తీసి రేపుగా మారేదే చోట
ఇది అంతులేని పూబాట

యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో
యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో

ఆ వైపు చూడు అలసట తెలియక కథలు కదెలెనీ చోట
ఈ వైపు చూడు ఇరుకున నలిగిన పరుగు పరుగులిడు చోట
కొద్దిగ గందరగోళం ముద్దుగా ముదిరేనీ చోట
మందిలో మంత్రజాలం విందుగా జరిగెనీ చోట
ఇది ఆగిపోని పడుచాట

యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో
యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో

సరదాకే సరదా పుట్టే సమయంలో
సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో
హే సరదాకే సరదా పుట్టే సమయంలో
సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో
కిర్రెక్కి కొట్టే కేరింతల్లో

యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో
యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో

సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే
సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే

సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే
సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే





మెరుపులా మెరిసే సిరివెన్నలవో పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్ , శ్రేయ గోషల్

మెరుపులా మెరిసే సిరివెన్నలవో
మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి జాము రాతిరివో
కనులను కొరికిన కోరికవో
కునకును తరిమిన కలవో
వలపులు అలికిన వేదికవో
వయసులు అడిగిన వేడుకవో

మెరుపులా మెరిసే సిరివెన్నలవో
మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి రేయి జానకివో

You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన

మెరుపులా మెరిసే సిరివెన్నలవో
మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి జాము రాతిరివో

అందానికే అర్దం నువ్వు
ప్రాయానికే ప్రాణం నువ్వు
రూపానికే ఊపిరి నువ్వు నువ్వే...
హో... ఎదురుపడి పొగడకు నన్నూ
మనసుపడి కలపకు కన్ను
వెనకపడి తడమకు వెన్ను
తిరగపడి తేల్చకు మైకపు మబ్బులలో

మెరుపులా మెరిసే సిరివెన్నలవో
మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి రేయి జానకివో

కుదురుగ నిలవని నడుమును
నడిపిన చేతులు చేసెను పుణ్యం
పొదుపుగ చిలిపిగ పెదవిని చిదిమిన
పెదవుల జన్మిక ధన్యం
ముద్దులలో చక్కెరలాగ నువ్వు
నిద్దురలో చక్కిలిగింత నువ్వు
ఇద్దరిలో ఒక్కరిలాగ నువ్వు
వానగ నేడు పొంగే నువ్వు నింగిలో

మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి రేయి జానకివో
కనులను కొరికిన కోరికవో
కునుకును తరిమిన కలవో
వలపులు అలికిన వేదికవో
వయసులు అడిగిన వేడుకవో

మెరుపులా మెరిసిసే సిరివెన్నెలవో
మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి జాము రాతిరివో

You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన




ఎందుకో తొలి తొందరెందుకో పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సోను నిగమ్, మహాలక్ష్మి అయ్యర్

ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
ఎన్నడూ తెలియంది ఎందుకో
నాలో మొదలైంది ఎందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో
సొగసులకు ఈ రోజు బరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన చూపులోన తన రూపులోన
తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన
చిరు తేనెలోన మునిగేందుకా

ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో

చరణం: 1
ఆ ఊరు ఈ ఊరు వేరైనా
ఆకాశం అంతా ఒకటేగా
ఆ నువ్వు ఈ నేను ఏడున్నా
ఆలోచనలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయబారం
ఊసులే చేరవా వేగిరం
ప్రేమలో చిన్నదే ఈ ప్రపంచం
అని తెలిసి కూడ తెగ అలజడాయె
ఆ త లపులోనే తలమునకలాయె
మరి ఎందుకో

చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన బాటలోన తన తోటలోన తన తోడులోన
తన నీడలోన నడిచేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన తనువులోన అణువణువులోన
మధువనములోన ప్రతికణములోన కలిసేందుకా

ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
సొగసులకు ఈ రోజు బరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన చూపులోన తన రూపులోన
తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా




వల్ల వల్ల వల్లా బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె. కె. సునిధి చౌహాన్

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దూసుకొచ్చేయ్ రే
కొలంబస్ చేరుకోని చోటు చూసేయ్ రే

అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దున్ని పారెయ్ రే
త్రివేండ్రస్ గేమ్ కింక గేటు తీసేయ్ రేయ్

ఇన్ని నాళ్ళుగా బాచిలర్
ఇప్పుడిప్పుడే మ్యాచ్యులర్
భామ చర్యతో బ్రహ్మ చర్యమే
హిప్పు హిప్పు హుర్రే
రెచ్చిపోతే పట్టుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

టచ్ ఇస్తే తట్టుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

లాస్ ఏంజెల్  ఏంజెల్తో
ఎంజాయ్ రా యమ జాయ్ రా
డల్లాస్ డార్లింగ్తో ఖల్లాసు రా
వాషింగ్టన్ వణితలతో రిఫ్రెష్ బోడీ వాష్ రా
సిలికాను చిలకలతో బిందాసు రా
రక రకాల మీ కలలు తీర్చనా
పలురకాల ఆ రుచులు పంచనా
కళ్యాణం లోపే కిటుకేదొ నేర్పనా
నేర్చుకుంటే అడ్డు కోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

ఒక్కటిస్తే ఓర్చుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

మియామి బీచ్ ల్లో సన్ బాత్ రా క్యా బాత్ రా
మినిమం బికినీలల్లో ఇక మోతరా...
అట్లాంటిక్ తీరం దాటి వెళ్ళరా ఒక పిల్లరా
ఇట్లాంటి సమయం మళ్ళి రాదురా...
యవ్వనానికి అలుపు లేదురా
ప్రస్తుతానికి మెరుపు నీదిరా
మొగవాడి లోని ఆ వాడి చూపరా
చూపు చూస్తే తేరుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

కం కం కం
కమ్ముకొస్తే కోలుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దూసుకొచ్చేయ్ రే
కొలంబస్ చేరుకోని చోటు చూసేయ్ రే

అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దున్నిపారెయ్ రే
త్రివేండ్రస్ గేమ్ కింక గేటు తీసేయ్ రేయ్

ఇన్ని నాళ్ళుగా బాచిలర్
ఇప్పుడిప్పుడే మ్యాచ్యులర్
భామ చర్యతో బ్రహ్మ చర్యమే
హిప్పు హిప్పు హుర్రే
రెచ్చిపోతే పట్టుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ


ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్


Palli Balakrishna Friday, July 28, 2017
Yamadonga (2007)



చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: జూనియర్ ఎన్ టీ ఆర్ , ప్రియమణి, మమతా మోహన్ దాస్
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాత: ఊర్మిళ గుణ్ణం, పి. చెర్రీ
విడుదల తేది: 15.08.2007



Songs List:



నువ్వు ముట్టుకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రంజిత్, ప్రణవి

నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటా
నువు పట్టుకుంటే నే చుట్టుకుంటా
నువు మర్చిపోతే నే సచ్చిపోతా…
నువు గిచ్చుకుంటే నే విచ్చుకుంటా
నువు పర్చుకుంటే వెచ్చ వెచ్చగుంటా
నువు మెత్తగుంటే మెత్తమెత్తగుంటా
ఓల ఓలాల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓలాల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల…
ఓల ఓలాల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి

చెప్పకుండా చెయ్యి లాగితే చెంపమీద చెంప కోరతా
అప్పనంగా అందమడిగితే అప్పడంగా నేను మారతా
తళుకుమంటే తుల్లిపడ్డ కూన కలుక్కుమంది కుర్ర గుండెలోనా
కదుపుతుంటే కంటి సైగతోన కుదుపు ఆగేనా
ఓల ఓల ఓలా, ఓల ఓల, ఓల ఓలా… 
ఓల ఓలాల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓల ఓల ఓలాల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి

సున్నిపిండి ముందరుంచితే స్నానం వేళ నీకు అందుతా
సున్నితంగా నన్ను తాకితే సుబ్బరంగా నీకు చెందుతా
చిటుక్కుమంటే చింగిలాల జాణ లటుక్కుమంటూ లొంగదీసుకోనా
వణుక్కుతుంటే ఇంత వేడిలోన దినకు దింతానా
ఓల ఓల ఓల, ఓల ఓల, ఓల ఓలా…
ఓల ఓలాల ఓల ఓలా ఓసారి ఒప్పుకుంటే పోలా
ఓల ఓలాల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి నాగమల్లి





రబ్బరు గాజులు పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: దలర్ మెహంది, ప్రణవి

రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని  హత్తరి  నీ దరి కొచ్చానే
నువ్వంటే‍ పడి పడి, నువ్వంటే‍ పడి పడి
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే

చల్లని గాలిని  చల్లని గాలిని  చెప్పిన చోటికి తెచ్చేయ్ రో
వెన్నెల కుండలు వెన్నెల కుండలు వెచ్చని వేలకి పట్టెయ్ రో
తట్టెలు నిండుగ బుట్టలు నిండుగ మొగ్గలు పట్టుకు వచ్చేయ్ రో

నువ్వంటే‍ పడి పడి, నువ్వంటే‍ పడి పడి
నువ్వంటే‍ పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో 
నువ్వంటే‍ పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో  

రయ్  రయ్... రయ్  రయ్...
రాజూగారి ఏనుగు మీద రయ్  రయ్ రప్పారై 
రయ్  రయ్ రప్పారై అని ఊరేగిస్తానే పిల్లా
రాణీగారీ  పానుపుమీద దాయి దాయి అమ్మా దాయి
దాయి దాయి అమ్మా దాయి అని బజ్జోబెడతానే పిల్లా
అట్టాగంటే ఐసౌతానా ఇట్టాగొస్తే క్లోజౌతానా
అంతందంగా అలుసవుతానా
బీ హానీ నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి
జుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే

నువ్వంటే‍ పడి పడి, నువ్వంటే‍ పడి పడి 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే‍ పడి పడి వస్తానే 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే‍ పడి పడి వస్తానే  

రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే

రోజు రోజు తోటకు వెళ్లి డీ డీ డిక్కుమ్ డీ
డీ డీ డిక్కుమ్ డీ అని లవ్వాడేద్దామే పిల్లా
డీ డీ డిక్కుమ్ డీ, డీ డీ డిక్కుమ్ డీ
ఏదోరోజు పేటకు వెళ్లి పీ పీ డుం డుం పీ
పీ పీ డుండుం అని పెళ్ళాడేద్దామే పిల్లా
అట్టా చెబితే సెట్టైపోతా పుస్తేకడితే జట్టైపోతా ఆకులోన వక్కైపోతా
దా అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా
ధూమ్ అని ధామ్ అని జబ్బలు జబ్బలు తగిలించేస్తాలే

నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే‍ పడి పడి వస్తానే 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే‍ పడి పడి వస్తానే

రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు... తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు... తెచ్చానే
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని  హత్తరి  నీ దరి కొచ్చానే
నువ్వంటే‍ పడి పడి, నువ్వంటే‍ పడి పడి
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే



ఓలమ్మి తిక్కరేగిందా పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: ఎన్.టి.ఆర్ ,   మమత మోహన్ దాస్

అబ్బయా...ఆఁ 
అబ్బయా... ఏంటే
లవ్వలక... ఆఁ
బిలపిచ్చిపిచ్చి... పిచ్చా
ఊ ఊ కిక్కిరి... ఓయ్
కులుకులో పబ్బలబ... ఏంభాషిది
జింజికా... ఏమయింది నీకు
హూ ఊ... ఏంకావాలెహే

కస్స చెలక చిక చెపక్కు చికిచా 
పబ్బాలబ దబ దబ లబాంగ్ జుంబా
చెమ్చాక లంసప రస రస విపుట
భంచిక తుక తుమ వలక్కి దిమ్సా
చికిబికి చిం హోయ్ బికి చిం హోయ్ 
బికి చిం ఎహేహే చిం

ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా

ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టుకోమందా
ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

చరణం: 1
చువ్వ నడుమే దువ్వుతుంటే జివ్వుమంటోందా
చెయ్యివేస్తే పోటుదనమే పొంగి పోతుందా
ఎగ దోసయ్యావే దొంగా
ఎదురొచ్చే సత్తా ఉందా
పొగరాపే ఊపే ఉందా
బరిలోకీ దూకేదుందా
కొండనైనా పిండిచేసే కోడె గాడి చేత చిక్కి 
గుమ్మ పాప గుండె జారిందా...

ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

చరణం: 2
అధి అబ్బో యమ యమయమ
యమ యమయమ ఏసేయ్...

ప్రభూ లైటు లైటు అబ్బా దీపసికండి బాబు

చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా
ధగధగధగధగ దీపముంటే రంజుగుంటుందా ఆహా ఓహొ
తళతళతళ సోకులన్నీ నీకు చూపాద్దా
మరిమరిమరిమరి దాచుకుంటే ఏమిమర్యాదా అహా ఓహొ

అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాం దా
పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాం దా
కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి గోల చేస్తే హాయిగా ఉందా...

ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా 
ఓలమ్మి తిక్కరేగిందా
ఓరబ్బి తిక్కరేగిందా 
ఓలమ్మి తిక్కరేగిందా





నాచోరే నాచోరే ఓ ఓ పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: దీపు, గంగా

నాచోరే నాచోరే ఓ ఓ 
నాచోరే నాచోరే ఓ ఓ 

ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ కస కసయత పోసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ

నాచోరే నాచోరే ఓ ఓ 
ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ
నాచోరే నాచోరే ఓ ఓ
ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ దొంగ

వన్నా బేబీ నౌ

పెదవి కరిగించి మధువు కురిపించే
మధిని మరిపించి నిదుర తరలించే

ఏక్ పల్ ఎగబాకి వస్తా
ఏక్ పల్ సెగ బాకీలిస్తా
ఏక్ పల్ సుఖ సోఖాలే పెస్తా
ఏక్ పల్ నిను మాటాడిస్తా
ఏక్ పల్ మోహమాటోడిస్తా
ఏక్ పల్ సిరి మూటలు విప్పిస్తా ద ద దా...

నాచోరే నాచోరే ఓ ఓ 
ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ దొంగ
ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ దొంగ

రసిక గుణ రామా సరసకుల సోమా 
వలపు రణ ధీమా మొదలు పెడదామా

దిల్బరా పొరపాటవుతున్న
దిల్బరా పరిపాటవుతున్న 
దిల్బరా చెలి పాటలు ఆగేనా
దిల్బరా తడబాటవుతున్న
దిల్బరా తడి బాటవుతున్న
దిల్బరా విడిపోడం జరిగేనా ద ద దా...

నాచోరే నాచోరే ఓ ఓ 
ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ కస కసయత పోసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ

నాచోరే నాచోరే ఓ ఓ 
ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ
నాచోరే నాచోరే ఓ ఓ
ఎవడీ దొర దొంగ  దర్జాగా దూరిన దొంగ దొంగ




నూనూగు మీసాలోడు పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ఎమ్. ఎమ్. కీరవాణి  , సునీత

డ డడడి డిడిడు డుడుడు
డ డడడి డిడిడు
ఊఁ... ఊఁ...
ఊఁ... నూనూగు మీసాలోడు
ఊఁ... నీ ఈడు జోడైనోడు
ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు
ఊఁ... కళ్ళల్లో కసి ఉన్నోడు
ఊఁ... కండల్లో పస ఉన్నోడు
ఊఁ...వచ్చెసాడొచ్చేసాడు ...డు

నన్ను ఎంచేస్తాడో ఏమో ఈనాడు
జొన్న పొత్తులతోటి గూడె కట్టి
ఏంచేస్తాడు… ఇచ్చేస్తాడు…

ఊఁ... నూనూగు మీసాలోడు
ఊఁ... నీ ఈడు జోడైనోడు
ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు

చరణం: 1
చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటే 
చెంతకొచ్చి ఆరా తీస్తాడు
బిందె నిండి పోయిందంటె బరువు మొయ్యలేవంటు 
సాయంచేస్తె తప్పేటంటాడు
సాయమేమి కాదోయ్ చెయ్యి కొంత జరిపి 
నడుముకి పైపైనే ఆనిస్తాడు
తస్సదియ్య అట్టా పట్టలేదే పిట్టా ఇకపై ఆ పనినే కానిస్తాడు
పెద్ద దొంగోడమ్మ బాబోయ్ బుల్లోడు
ఇంత బంగారమే ముందే ఉంటె ఏంచెస్తాడు... దోచేస్తాడు…

ఆఁ... నూనూగు మీసాలోడు
ఆఁ... నీ ఈడు జోడైనోడు
ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు
ఊఁ... కళ్ళల్లో కసి ఉన్నోడు
ఊఁ... కండల్లో పస ఉన్నోడు
ఊఁ...వచ్చెసాడొచ్చేసాడు ...డు

ఇంక ఏంచేస్తాడో మళ్ళీ ఈనాడు
లంకె బిందెల్లోన పాలే పోసి 
అబ్బ ఏంచేస్తాడో ...ఆ తోడేస్తాడు

చరణం: 2
ఓ రోజు… రేణిగుంట సినిమ హాల్లో రెండో ఆట కెళ్ళాక
సీటు ఇచ్చి కూర్చోమన్నాడు సచ్చిన్నోడు
పాపమేమి చేసాడండి పల్లెటూరి చిన్నోడు పాపుకారన్ పొట్లం ఇచ్చాడు
ఇచ్చినట్టే ఇచ్చి మీద మీద పోసి అరరె అరరె అని తడిమేశాడు
అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు
ఎంత నాటోడైన వీడే నావోడు
ఇంత బంగారమే సొంతం ఐతే ఏంచేస్తాడు… దాచేస్తాడు…

ఊఁ... నూనూగు మీసాలోడు
ఊఁ... నీ ఈడు జోడైనోడు
ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు
ఊఁ... కళ్ళల్లో కసి ఉన్నోడు
ఊఁ... కండల్లో పస ఉన్నోడు
ఊఁ...వచ్చెసాడొచ్చేసాడు ...డు

వీడు ఏంచెస్తాడో తెలుసా ఈనాడు
కోడి కూరే చేసేకాలం నేడే వచ్చిందంటు కూర్చుంటాడు… వంటింట్లోనే తిష్టేస్తాడు…




యంగ్ యమా యంగ్ యమా పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యమ్. యమ్. కీరవాణి,  మనో (నాగూర్ బాబు), ప్రణవి,  శంకర్ మహాదేవన్ 

పల్లవి:
రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా
కదలిరా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారి పావురాయి పిట్టలా
ఒదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా

షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకుదక్కాలా
అప్సర బాల నా స్టేప్సేనకాల సిగ్గువీడి చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునోయ్ 
అన్నదే తారక మంత్రం

యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో

షేక్ షకాలా షేక్‌ షకాలా షేపులన్ని నాకుదక్కాలా
అప్సర బాల నా స్టేప్సేనకాల సిగ్గువీడి చిందు తొక్కాలా
యాయాయా యమా యాయాయా యమ యాయాయా యమా యాయాయా
యాయాయా యమా యాయాయా యమ
యాయాయా యమా యాయాయా

చరణం: 1
కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
ఎక్కి పెట్టరా విల్లెక్కుపెట్టారా గురిచూసి కొట్టరా...
వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా
పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా
ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేశావంటే
పోయే దేది లేనేలేదోయ్ అన్నదే తారక మంత్రం

కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో

షేక్ షకాలా షేక్‌ షకాలా షేపులన్ని నాకుదక్కాలా
అప్సర బాల నా స్టేప్సేనకాల సిగ్గువీడి చిందు తొక్కాలా

చరణం: 2
ఆనాటి రాముడు అహ అహా అహా ఆహా
ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో
నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు

ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా
సంఘమించరా పురోగమించరా నువధిగమించరా
రింగు రోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా...
ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపట్టి కధంతొక్కి
ఆటాపాటా కానిచ్చేయాలన్నదే తీరిక మంత్రం

దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ పోటుగ కోటనే దున్నేసుకో
దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ పోటుగ కోటనే దున్నేసుకో

యుంగ్ యమా యుంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకి ఎరవేసుకో
 




శ్రీకరాకారుండ పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: మనో

శ్రీకరాకారుండ బీఖరాకారుండ 
నరకాది నాదుండ సురవరుండ
భువన భౌతమ్ములన్ క్రోదండ సూరుండ 
మార్తాండ తనుజుండ మారకృండ ఆయ్...
చండ ప్రచండ పాషండ ప్రాకాయుండ 
కాల పాశధరుండ కర్కసుండ
జై జై యమాగ్రని 
జై యమాగ్రని యని వతకోటి పొగడు సమవర్ధనుండ అవ్ హా...
అట్టి నను గూర్చి రవ్వంత అధరకుండ
మంచి మర్యాదలెవ్వి పాట్టించ కుండ
యముడు రానప్పుడీసబ అపకుండ
చేయుదురే మీరే ఎవరు మీరు
చేయుదురే మీరే నను లెక్కచేయకుండా...




చల చల్లగా గాలి పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: ఎమ్. ఎమ్. కీరవాణి, సంగీత

చల చల్లగా గాలి 
మెల మెల్లగా తేలి
మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
ఆహా... ఓహో... ఓ ఓ ఓ ఓ ఓ ఆహా ఓ ఓ

కసి ఉసిగొలిపే గుస గుసలో రసికత పండాలి
అవసర సుమశర స్వర్గములే చూపించాలి
మ్మ్... మగసిరి గడసరి డోలికలో మన జత ఊగాలి
యమ సుర వరునికి అమృతమే అందించాలి

లాహిరి ఖేలి ఈ జిలిబిలి 
నావ సరళి నీవు కదలి
చలి గిలి అళి

చల చల్లగా గాలి ఉఁ
మెల మెల్లగా తేలి
మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి

ఆహా... ఓహో... ఓ ఓ ఓ ఓ ఓ ఆహా ఓ ఓ





బంభరాల చుంబనాల రంభ పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: మనో, ప్రణవి

బంభరాల చుంబనాల రంభ
పనస తొణల వయసు లలన ఊర్వశి
జలక జలక ఎదలోతులో మునక మేనక
పూట పూట మీతో ఆటా పాటా

సనిపమ రి రి మ ప
ఈ సార్వభౌమునికే మీ ఓటు
యమ సార్వభౌమునికే మన ఓటు

సరి సరి సరి మపని మపని సస ససస సరి రిస రిప మప 
సస రిరి రిరి సస పమ పని సరిపమ  ఓటు 
నిపమ ఓటు తమ ఓటు ఓటు...

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default