Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Maanas"
Song: Nuvve Kavali Amma



పాట: నువ్వే కావలి అమ్మ 
సంగీతం: సందీప్ సన్ను
సాహిత్యం: రంజిత్ కుమార్ రిక్కి
గానం: సందీప్ సన్ను, సోనీ ఆరే
ఆర్టిస్ట్స్: మానస్ , ఆమని, లికిత్ సాయిరాం కాసర్ల
దర్శకత్వం: సందీప్ సన్ను
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 21.02.2023



నువ్వే కావలి అమ్మ పాట సాహిత్యం

 
పాట: నువ్వే కావలి అమ్మ 
సంగీతం: సందీప్ సన్ను
సాహిత్యం: రంజిత్ కుమార్ రిక్కి
గానం: సందీప్ సన్ను, సోనీ ఆరే

లాలి జోజో కన్నా
జోజో లాలీ కన్నా
నాకన్నీ నువ్వే నాన్న
నీకంటే ఏదీ మిన్నా

ప్రాణమంత పోసి నాకు ఇచ్చినావే జన్మ
నువ్వు లేని లోకమంత చిమ్మచీకటమ్మ
కంటి నీరు పిలుపుకైనా పలకవెందుకమ్మ
దేవుడైనా ఇవ్వలేడు అమ్మలాంటి ప్రేమ

తిరిగివచ్చి నాకు జోల పాడవమ్మ
అమ్మలేని ప్రేమకు ఆయువెందుకమ్మ
వెలుగు లేక వెల్లిపోయే నింగి జాబిలమ్మ
మళ్ళి వచ్చి ఒక్కసారి ప్రేమ పంచవమ్మ

నువు లేక ఆగిపోయే
కాలమంతా ఏకాంతంగా
పసివాన్ని వదిలేసి వెళ్లిపోకమ్మా

నువ్వే కావాలమ్మా
నీతో ఉండాలమ్మా
నా ప్రాణం నువ్వేనమ్మా
నా సర్వం నువ్వేనమ్మా

విశ్వమంతా నువ్వు లేని క్షణం
ఆగిపోయే అంతులేని జీవం
జాలి చూపి టెన్ టు ఫైవ్ తిరిగిరావమ్మా
క్షణమే చూపలేవా నిండు చందమామ
గుర్తు లేదు కన్నపేగు ప్రేమ
గుండె నిండా కొలువు తీరేనా కన్నీరే

నడిపించావులే లాలించావులే
నేనే ప్రాణమని జీవించావులే
ఆనందమేదో చూపించావులే
గతమే మళ్ళీ రాదే హో

కవ్వించావులే సహించావులే
నాకోసమే నువు తపించావులే
నీ త్యాగమేదో తెలిసెలోపలే
తనువు వదిలినావే హే

Palli Balakrishna Saturday, May 27, 2023
Song: Gangulu



పాట: గంగులు
నటీనటులు: విష్ణు ప్రియ మరియు మానస్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: తరుణ్ సైదుల్
గానం: స్వరాగ్ కీర్తన్ 
కొరియోగ్రఫి : స్రష్టివర్మ
నిర్మాత: జ్యోతి కున్నూరు
విడుదల తేది: 2023



గంగులు పాట సాహిత్యం

 
పాట: గంగులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: తరుణ్ సైదుల్
గానం: స్వరాగ్ కీర్తన్

ఓయ్ గంగులొహ్ .. ఏ గంగులు...
ఏ నల్లంచ్చు సిరేదాన
నకిలీసు పెట్టెదన
నవ్వు కుంటూ పోయెదాన
సూడే నా దిక్కు ఓ పిల్లా...హేయ్

ఏ కంటికి కటుక పెట్టి
ఒంటికి అత్తరు కొట్టి
లైట్ కొట్టే ముక్కు పుల్లను పెట్టి
రయ్యినా పోతున్నావ్ ఎందుల్లా

గంగు మీద పానం తోటి ఫీలైతాందిరో మనసు

మిట్ట మిట్ట సూడంగనే సాలైతాందిరా ..
ఫుల్ తాగే బాడీ పెగ్గు లో డిచ్ అవతాందిరో మామా
గంగులు సూపుల మాయల సూపై తాందిరా

హా .. ఆడ గట్టు కాడా అందరున్నా కాడ
అట్ట పోతా ఉంటె చూసింది కన్ను
సిగ్గు మొగ్గలెయ్య చెక్కిల్ల సూపు
అందరి ముందర రేపింది బొంగు

నీళ్ళు నింపుతున్న బోరింగు కాడ
యెడమ చేత పట్టి శెక్కింది కొంగు
తీగల తిప్పుడు పోకడ చూసి
కన్లు బైర్లుకమ్మే నేనేమి చేద్దు

సీరె కట్టు బొడ్డులు చూత్తే సిగైతందిరో గంగులు
ముత్యమోలే మాటలు ఇంటే ముద్దై తాందిరా హేయ్
గంటకొక్క తీరుగ గుండెలో మోతాందిరో గంగులు
ఎన్నడు సూడని అందం నాకైతాందిరా

ఆ.. పక్కల జాకెట్ జబ్బకంద నట్టు
గాజుల సప్పుడ్ల ఘల్ ఘల్ గంగు
లవ్వుల వను క్కుంటా జరమచ్ఛినట్టాయే
నిన్ను చూసే గుండె జల్ జల్ గంగు

కొయ్య బొమ్మ తీరు కొంటె సూపు జోరు
నాగు పాము జడ గంటల తీరు
వాలు వాలు కురులు తాకంగనే ఈడ
కాలు నిలవ కుండా తిన్నరు సూడు

జోరు జోరు జోకరు చేస్టల తీరై తున్నదే గంగులు
జాలి సూపరాదే పిల్లో ఎందుకే టింగులు...హో
ముంచినావే పిల్లో నీ మాయల కొంగులో గంగులు
దేవదాసు చేయకే పిల్లో డేంజరు రెంజు లో..

జోరు జోరు జోకరు చేస్టల తీరై తున్నదే గంగులు

జాలి సూపరాదే పిల్లో ఎందుకే టింగులు...హో
ముంచినావే పిల్లో నీ మాయల కొంగులో గంగులు

దేవదాసు చేయకే పిల్లో డేంజరు రెంజు లో...

Palli Balakrishna Thursday, May 25, 2023
Zari Zari Panche Katti (2022)



పాట : జరీ జరీ పంచె కట్టి (2022)
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శ్రావణ భార్గవి, సాకేత్ కొమండురి, స్ఫూర్తి జితేందర్
నటీమణులు: మానస్, విష్ణుప్రియ 
కోరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
నిర్మాత: జ్యోతి కున్నూరు 



జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి పాట సాహిత్యం

 
పాట : జరీ జరీ పంచె కట్టి (2022)
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శ్రావణ భార్గవి, సాకేత్ కొమండురి, స్ఫూర్తి జితేందర్

జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి
జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి
జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో
జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో

ఏలికి, నా కాలికి నా కంటికి, నా ఒంటికి
జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో
జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో

జరీ జరీ జరీ జరీ జరీ జరీ చీరె కట్టి
జారుడు పంచ గట్టి టెన్ టు ఫైవ్
జరీ జరీ జరీ జరీ జరీ జరీ చీరె కట్టి
జారుడు పంచ గట్టి టెన్ టు ఫైవ్
రానే రమ్మంటి నా రాణి నువ్వంటి
రానే రమ్మంటి నా రాణి నువ్వంటి

వేలికి, నీ కాలికి నీ కంటికి, మునిపంటికి
యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే
యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే
జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో
పిలగా, జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో

ఓయ్, రింగు రింగుల రొమ్ము మీద
రింగుల రోమాలున్నయ్
రింగు రింగుల రొమ్ము మీద
రింగుల రోమాలున్నయ్

రింగోలున్నవ్ రో పులి రంగోలున్నవ్ రో
రింగోలున్నవ్ రో పులి రంగోలున్నవ్ రో

ఎత్తుకి నా నెత్తికి పూ గుత్తికి కసి కత్తికి
వంగకున్నవ్ రో నాకు లొంగకున్నవ్ రో
వంగకున్నవ్ రో నాకు లొంగకున్నవ్ రో

ఏయ్, ఎందరెందరున్నాగాని
మందలో గోవిందులాగ
ఎందరెందరున్నాగాని
మందలో గోవిందులాగ
మందగున్నవ్ రో
హరి చందంగున్నవ్ రో
మందగున్నవ్ రో
హరి చందంగున్నవ్ రో

పోరుకు, మెడ పేరుకు
నా జోరుకు పదహారుకు
అందకున్నవ్ రో
బాగందంగున్నవ్ రో
అందకున్నవ్ రా
బాగందంగున్నవ్ రో

ము ము ము ముందారెందరు, ముందరెందరు
ముందరెందరు ఉన్నాగాని
పొందుకోరి వచ్చినోన్ని
ముందరెందరు ఉన్నాగాని
పొందుకోరి వచ్చినోన్ని

తొందరెందుకే ఈ రద్దీ ఏందాకే
తొందరెందుకే ఈ రద్దీ ఏందాకే
పోరుకు మెడ పేరుకు
నీ జోరుకు పదహారుకు
బంధినైతే నీ బంధాన్నైతినే
బంధినైతే నీ బంధాన్నైతినే

జారుతున్నవ్ రో
చేజారుతున్నవ్ రో
పిలగా, జారుతున్నవ్ రో
చేజారుతున్నవ్ రో

వేలికి, నీ కాలికి నీ కంటికి, మునిపంటికి
యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే
యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే

Palli Balakrishna Tuesday, September 20, 2022

Most Recent

Default