Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kiran Abbavaram"
Rules Ranjann (2023)



చిత్రం: రూల్స్ రాజన్ (2023)
సంగీతం: అమ్రిష్ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం 
దర్శకత్వం: రాతినం కృష్ణ 
నిర్మాతలు: దివ్యాంగ్ లావణ్య, వేమూరి మురళి కృష్ణ 
విడుదల తేది: 2023



Songs List:



నాలో నేనే లేను పాట సాహిత్యం

 
చిత్రం: రూల్స్ రాజన్ (2023)
సంగీతం: అమ్రిష్ 
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: శరత్ సంతోష్ 

నాలో నేనే లేను
నీలోనే ఉన్నాను
ఊహల్లోనా లేను
పిల్ల ఊసుల్లోనే ఉన్నాను

మనసంతా నువ్వేలే
నీ రూపం ఏమాయె
నిదురంటూ లేదాయే
నీ రూపం మాయే

ఏ మాయే నాకు ఏమాయే
అరె ఇంతకుముందు
లేదు ఈ హాయే

నాలో నేనే లేను

నాలో నేనే లేను
నీలోనే ఉన్నాను
ఊహల్లోనా లేను పిల్ల
ఊసుల్లోనే ఉన్నాను

మనసంతా నువ్వేలే
నీ రూపం ఏమాయె
నిదురంటూ లేదాయే
నీ రూపం మాయే

ఏ మాయే నాకు ఏమాయే
అరె ఇంతకుముందు
లేదు ఈ హాయే

పూవల్లే నువ్వు వస్తే
నీ పరిమళాల గాలే
నాతోనే మాటలాడే
మనసున కురిసే చినుకా

నువు సిగ్గుపడుతు నవ్వేస్తే
నా జాడ నేను మరిచానే
అరె ఇంతకుముందు
లేదు ఈ హాయే

హే పిల్లా..!
నా పలుకంతా నీ పేరైందే
హే పిల్లా..!
నా గుండెల్లో నీ గుడి ఉందే

గుడి ఉందే

నాలో నేనే లేను
ఊహల్లోనా లేను




సమ్మోహనుడ పాట సాహిత్యం

 
చిత్రం: రూల్స్ రాజన్ (2023)
సంగీతం: అమ్రిష్ 
సాహిత్యం: రాంబాబు గోసాల, రాతినం కృష్ణ 
గానం: శ్రేయా ఘోషల్ 

సమ్మోహనుడ పెదవిస్త నీకే
కొంచం కోరుక్కోవ
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా

పచ్చి ప్రాయాలే వెచ్చనైన
చిలిపి ఊసులాడ వచ్చే
చెమటల్లో తడిసిన దేహం
సుగంధాల గాలి పంచె

చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్
తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా

సమ్మోహనుడ పెదవిస్త నీకే
కొంచం కోరుక్కోవ
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా

ఝుమ్మను తుమ్మెద నువ్వైతే
తేనెల సుమమే అవుతా
సందెపొద్దే నువ్వైతే
చల్లని గాలై వీస్తా

శీతాకాలం నువ్వే అయితే
చుట్టే ఉష్ణాన్నౌతా
మంచు వర్షం నువ్వే అయితే
నీటి ముత్యాన్నౌతా

నన్ను చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్
తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా

నదిలా కదిలిన ఎదలయలే
పొంగి ప్రేమ అలలై
ఎదురౌతా కడలై
మెత్త మెత్తని హృదయాన్ని
మీసంతో తడమాల
ఇపుడే తొడిమే తుంచి
సుఖమే పంచి ఒకటైపోవాలా

నదిలా కదిలిన ఎదలయలే
పొంగి ప్రేమ అలలై
ఎదురౌతా కడలై
మెత్త మెత్తని హృదయాన్ని
మీసంతో తడమాల
ఇపుడే తొడిమే తుంచి
సుఖమే పంచి ఒకటైపోవాలా

సమ్మోహనుడ పెదవిస్త నీకే
కొంచం కోరుక్కోవ
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా

పచ్చి ప్రాయాలే వెచ్చనైన
చిలిపి ఊసులాడ వచ్చే
చెమటల్లో తడిసిన దేహం
సుగంధాల గాలి పంచె

చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్
తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా



ఎందుకురా బాబ పాట సాహిత్యం

 
చిత్రం: రూల్స్ రాజన్ (2023)
సంగీతం: అమ్రిష్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రేవంత్, రాహుల్ సిప్లిగంజ్ 

ఎందుకురా బాబూ
కొంచెం ఆగరా బాబూ

ఎందుకురా బాబు
కొంచెం ఆగురా బాబు
నీ చెడ్డీ ఫ్రెండ్స్
ఇస్తున్నమ్ అడ్వైజు
వినరా ఓ బాసు
లేకుంటే నీకు లాసు

మన లోకలు బారే, ఏ ఏ ఏ
మన లోకలు బారే
ఫైవ్ స్టారనుకోరా మామ
ఈ మాన్షన్ హౌసే
అంబానీ హౌసనుకోరా

అర్రె ఎందుకురా బాబు
అర్రె ఎందుకురా బాబు
అందని సందమామ కోసం
నువ్వే ఆశ పడతావు
అరె ఎందుకురా బాబు
అర్రె ఎందుకురా బాబు
అచ్చం అప్పడమే తనలాగా ఉందని
సర్దుకొని పోవు

ఆడి కారైనా కూడా
ఆకాశంలో పోనే పోదు
ఈ మలుపుల దారుల్లో
ఆటో సుఖమేలే

సెవెను సీటరులో ఉన్న
హెవెనె చూడచ్చురా కన్నా
హే దొరికిందే తిరుపతి లడ్డు
అనుకుంటే వెర్రీ గుడ్డు
లేకుంటే లైఫుల మనకు
మిగిలేదీ గుండు

లేని షూసుకి ఎడ్వద్దు
ఉన్న కాళ్ళని చెయ్ ముద్దు
రాజి పడితే రాజా లాగా
బతికేస్తావని మరవద్దు

ప్రతి ఒక్క వైఫు
సిక్స్ ప్యాక్ కోరితే ఎట్టా
ఫ్యామిలీ ప్యాకోళ్ళు
యాడికి పోవాలంటా

కోడిని నెమలనుకుంటారు
తోడుగ మనతో ఉంటారు
పక్క ఇంటి అంజలి లోన
ఏంజెల్ చూసెయ్ రా బ్రదరూ

ఎక్కిందే, ఎక్కిందే
ఎక్కింది డోసు… కరిగే కలలా ఐసు
పగిలింది గ్లాసు
నా హార్ట్ కు మాత్రం తెలుసు

నా లవ్ సీసా, ఆ ఆ ఆ ఆ
నా లవ్ సీసా… ఈ రోడ్డుపై విసిరేసా
సరికొత్త వీసా ఈ రోజే మళ్ళీ తెరిసా

అరె ఎందుకురా బాబు
మనకి ఎందుకురా బాబు
మీరే చెప్పిందింటా
చేరిపోతా కాంప్రమైస్ క్లబ్బు





దేఖో ముంబై పాట సాహిత్యం

 
చిత్రం: రూల్స్ రాజన్ (2023)
సంగీతం: అమ్రిష్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అద్నాన్ సామి, పాయల్ దేవ్ 

దేఖో ముంబై
దోస్తీ మజా

మ్ మ్ దేఖో ముంబై
దోస్తీ మజా
టీకే కర్లో, మస్తీ మజా
జిందగీ జీవన్ చేతన్ మజా
జానే మన్, హ

హోగే పాగల్ చేతన్ మజా
బచ్చోన్ జైసే ఖేలే ఆజా
గల్లీ మే యే గానా బజా నాచే మన్

అంధేరి అందాన్నిరా
బ్యూటీలో బాంద్రానిరా, ఓ ఓ
జూహులో అ ఆ లు, వర్లీలో ఒ ఓ లు
మెరైన్ డ్రైవ్ నచ్చేరా

ఆ, వోడ్కా బాటిల్ ఫుల్లు
ఈ వడాపాప్ థ్రిల్లు, హ
కాలా ఘోడా దిళ్లు
ఇది కూడా చాలు

నువు పక్కానుంటే చిళ్ళు
తిరగొద్దె వాచు ముళ్ళు
నీకు రెక్కలిచ్చే ఒళ్ళు, ఎగిరెళ్ళు

ఆజా చలో మస్తీ కరే
ఆ, ఆజా జర వాజిల్ కరే
ఆజా ఓ చలో మస్తీ కరే
ఓ, ఆజా జర వాజిల్ కరే

దేఖో ముంబై
దోస్తీ మజా
టీకే కర్లో, మస్తీ మజా
జిందగీ జీవన్ చేతన్ మజా
జానే మన్, హ

Palli Balakrishna Wednesday, August 2, 2023
Meter (2023)



చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి 
దర్శకత్వం: రమేష్ కాడురి 
నిర్మాత: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు 
విడుదల తేది: 07.04.2023



Songs List:



ఓ చమకు చమకు పోరి పాట సాహిత్యం

 
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బాలాజీ 
గానం: అరుణ్ కౌండిన్య, ML గాయత్రీ 

ఏ, అందగత్తె ఎవ్వరంటే
చూపించారే మీ రోడ్డు
అందాకొచ్చి చూద్దామంటే
బయటున్నడే మీ డాడు

హే చందమామ వచ్చే వేళ
టెర్రస్ ఎక్కేస్తా చూడు
చెయ్యే ఊపి సిగ్నల్ ఇస్తా
చూడకపోతే నీ బ్యాడు

మేడపై చూసాకే గోడనే దూకానే
చుక్కలే పోగేసి దిష్టే తీసానే

నీకు నా పిచ్చుంది నాకదే నచ్చింది
దోచిపెట్టుకో ఇంకా దాచేదేముంది

ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి

ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి

ఏ, అందగత్తె ఎవ్వరంటే
చూపించారే మీ రోడ్డు
అందాకొచ్చి చూద్దామంటే
బయటున్నడే మీ డాడు

ప్రతి సెంటర్లో ఉండే లవ్ జంటల్లో
మనమే టాపిక్ కావాలే
ట్రెండీ గాసిప్ అవ్వాలే

లవ్ జుంక్షన్లో చేసే, ప్రతి ఫంక్షన్లో
మనం ముచ్చటుండాలె
అది ముద్దుగుండాలె

ప్రతి కన్ను కుట్టినట్టు
మన జంట సూపర్ హిట్టు
అయ్యేటట్టు పద పడదాం పట్టు

మన లవ్ దాటుకుంటూ
వేద్దాము పెళ్లి టెంటు
నీదే లేటు, ఫిక్స్ చేసేయ్ డేటు

ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి

చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి




ఓ బేబీ జారిపోమాకే పాట సాహిత్యం

 
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బాలాజీ 
గానం: ధనుంజయ్ 

హే అందమెట్టి కొట్టావే
అందనంటు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే

హే హే, పట్టు పట్టి పోతున్న
జట్టు కట్టనంటున్న
నిన్ను పట్టి ఇస్తాలే నాలో ప్రేమకే

మగవారంటే పగబడతావే
తెగ తిడుతూ అలా కారాలు నూరి
దూరాలు పోతే కుదిరేదెట్టా

ఓ బేబీ జారిపోమాకే
నన్ను వదిలెళ్ళి పోమాకే
అట్టా మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే

వయసుని వాడిపోనీకే
చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫేటు మార్చేసి
నా రూటులో నిన్ను
చూపిస్త నీ కళ్ళకే

అందమెట్టి కొట్టావే
అందనంటు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే

నువ్వే చుక్కవి అయితే
ఆ జాబిలి పక్కకు పోదా
నిన్నే వెన్నెల చూస్తే
తన కన్నులు చిన్నవి కావా

అందం ఎంతున్నా
బంధమంటూ ఒకటుంటే
గడిచే ప్రతి నిమిషం
తోడు రాదా నీ వెంటే

ఒకటే లైఫంట
నకరాలొద్దంటా చెప్పిందినమంటా
నీకంట నీరు తుడిచేటి వేలై
నే పడి ఉంటా

ఓ బేబీ జారిపోమాకే
నన్ను వదిలెళ్ళి పోమాకే
అట్టా మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే

వయసుని వాడిపోనాకే
చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫేటు మార్చేసి
నా రూటులో నిన్ను
చూపిస్త నీ కళ్ళకే




Meter Title Song పాట సాహిత్యం

 
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బాలాజీ 
గానం: సాయి కార్తీక్ 

అడ్డే లేదు అడ్డా లేదు
పడి లేచాడో ఉప్పెనల ఒడ్డే లేదు
ఏస్కో మీటర్, రాస్కో మ్యాటర్

హద్దే లేదు, పద్దే లేదు
అనుకున్నాడో ఏదైనా రద్దే లేదు
ఏస్కో మీటర్, రాస్కో మ్యాటర్

అలా తరిమి తరిమి
పరుగు పెడితే తప్పదు లెక్క
అదో ఉరుము ఉరిమి
మెరుపులాగా ఉంటది పక్కా
చెడే చూసాడో ఇరగేసి రాస్తాడు
తిరగేసి పనిలో దిగితే గురిచూసి

దడ దడ దడ దడ ఉరుకుడే
అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే
దడ దడ దడ దడ ఉరుకుడే
అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే

అదరగొట్టు బెదరగొట్టు చెదరగొట్టు
కొట్టేయ్ కొట్టేయ్ కొట్టు కొట్టు
గురినిపెట్టు గురుతుపట్టు
మడతపెట్టి కొట్టు కొట్టు

బాకీ పడ్డ ఖాకి డ్రెస్సు
ఓకే అంటూ ఎక్కేసాడు
దానెనక ఉన్న పవరు తెలిసి
దారిలోకి వచ్చేసాడు

కథే మలుపు తిరిగి
మనసు చెదిరి పోయినచోటే
ఎదే తలుపు తెరిచి
గెలుపు వెతికి ఆడెను వేటే

అరె ఎదురొస్తే ఎవడైనా
ఎదురించే దమ్మున్న
తెగువ పొగరు ఉన్నోడు

దుము దుము దుమ్మెత్తించే దులుపుడే
అరె కుమ్మీ కుమ్మీ ఆడేస్తాడు చెడుగుడే
దుము దుము దుమ్మెత్తించే దులుపుడే
అరె కుమ్మీ కుమ్మీ ఆడెస్తాడు చెడుగుడే

Palli Balakrishna Friday, May 26, 2023
Vinaro Bhagyamu Vishnu Katha (2023)



చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
నటీనటులు: కిరణ్ అబ్బవరం , కాశ్మీర
దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు 
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 17.02.2023



Songs List:



వాసవ సుహాస గమన సుధా పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని 
గానం: కారుణ్య 

వాసవ సుహాస గమన సుధా
ద్వారవతీ కిరనార్బటీ వసుధా
అశోక విహితాం క్రుపానాన్రుతాం కోమలామ్
మనోజ్ఞితం మమేకవాకం

మయూఖ యుగళ మధుసూదన మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగ రధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా
యోగ నిగమ నిగమార్చన వశనా
అభయప్రద రూపగుణ నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిల జన సా లోచన

యుగ యుగాలుగా ప్రభోధమై
పది విధాలుగా పదే పదే
పలికేటి సాయమీమన్న
జాడలే కదా నువ్వెదికినదేదైనా

చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన
చిగురేయక ఆగునా… నువ్వెళ్ళే దారిన
నిను నిన్నుగా మార్చిన… నీ నిన్నటి అంచున
ఓ కమ్మటి పాఠమే… ఎటు చూసినా

మయూఖ యుగళ మధుసూదన మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగ రధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా
యోగ నిగమ నిగమార్చన వశనా
అభయప్రద రూపగుణ నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిల జన సా లోచన



ఓ బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కపిల్ కపిలన్ 

ఓ బంగారం... నీ చెయ్యి తాకగానే ఉప్పొంగి పోయిందే నా ప్రాణం
నా బంగారం... కన్నెత్తి చూడగానే నిద్దర్లె మానేచి జాగారం
నా చిట్టి చిట్టి గుండే నీ లోనే కొట్టుకుందే 
బుర్రంతా  పిచ్చెక్కిందే నా బంగారు తల్లి 
ఏ మొట్ట మొదటిసారి  మరిచానే  ఇంటి దారి 
ఆ సొట్ట బుగ్గతోటే నువ్వు నవ్వబట్టే
అద్తోదం ఇంత యుద్ధం చేయలేదే 
నీకోసం మారిపోవడం నమ్మే లేదే
 పుట్టాక ఇంత ఆనందం చూడలేదే 
నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే

నువ్వు పక్కనుంటే చాల్లే మత్తుఎక్కి తూలె మాయదారి మనసే 
మరి నిన్ను తాకే గాలే నన్ను తాకుతుంటే ఆదమరుపు ఇప్పుడే ఎగసే 
 నీ చూపు వలకే చాపలా దొరికే నా ఊపిరే తొలిగా అల్లాడే 
ఈ ప్రేమ వలలో ఏదో ఏదో జరిగే నడిచి నడిచి ఆగి ఆగేలా..  

నా చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లి
ఏ మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గ తోటే నువ్వు నవ్వబట్టే

 కాటుక కనులే పుట్టిస్తుంటే  కలలే వదిలేదెట్టాగే ఓ మైనా
నీ వల్లే మొదలై తిక్క తిక్క పనులే దిల్ రూబా  మోగిందే నాలోనా
 నీ పేరు పిలిచే ఆస్తమాను తలిచే నా సంగతే మరిచా అదేంటో
ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే ఒకటో రెండో ఎన్నో  ఎన్నెన్నో

 చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కింది నా బంగారు తల్లి
 ఏ మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సోట్ట బుగ్గ తోటే నువ్వు నవ్వబట్టే




దర్శన పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి

మనసే మనసే తననే కలిసే
అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా
తనతో నడిచే అడుగే మురిసే
తనకా విషయం చెప్పలేక ఆగిపోయా కదా

ఎన్నో ఊసులు ఉన్నాయిలే
గుండే లోతుల్లో
అన్ని పంచేసుకుందామంటే
కళ్ళముందు లేదాయే దర్శన
దర్శన తన దర్శనానికింకా
ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

ఇష్టమైంది లాగేసుకుంటే చంటిపిల్లాడల్లాడినట్టే
దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే
నువ్వుగాని నాతో ఉంటే నవ్వులేరుకుంటానంతే
నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే

చక్కగా చెట్టాపట్టా తిరిగాం అట్టా ఇట్టా
అరె లెక్కపెట్టుకుంటే
బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

దారులన్ని మూసేసినట్టే
చీకటేసి కప్పేసినట్టే
నువ్వు లేకపోతే
నేను ఉన్నా లేనట్టే
చందమామ రావే రావే
జాబిలమ్మ రావే రావే
కమ్ముకున్న ఈ మేఘాలలో
వెలుతురు కనబడదే

బెంగతో ఇల్లా ఇల్లా
పోయేలా ఉన్నానే పిల్ల
నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా
ముట్టనులే నీమీదొట్టే

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా




చుక్కలెత్తు కొండలే పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని 
గానం: అనురాగ్ కులకర్ణి

చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం

ఊరులెన్ని చూసుకో వారికో వీరికో
పేరు పెట్టుకోవడం ఖచ్చితం
ఎల్లలన్ని ఏకమై చేసినా సంతకం
వేవేల మైళ్ళకైనా కాదు దూరం

పేదరాసి పెద్ద ముత్తైదువురా
సాధువురా ఈ ఊరే
చేసుకున్న పూర్వపుణ్యముంటేనే
పుడతారే మా ఊరే

దేశం మొత్తం పరపతిరా
తిరుపతి పేరంటే మోతరా
సామికైనా ధీమాలాగా నిలబడతారే
ఇట్టాంటి ఊరు చూడరే

చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం

సరదా సంద్రంలా ఉంటారే
సర్దుకు పోతారే
సమయాసమయాలే లేకుండా
సాయం చేసే కుదురే

దిగులే దాటుకొని
స్థిరంగా నిలబడిపోతారే
కల్లాకపటాన్నే ఖండించి
నవ్వుతు గెలువగ పొగరే

ఈ యాసలో ఉందో కదరే
అరె వినరో భాగ్యంబిదికదరే
మీసాల సామి ఉన్న ఊరే
రోషాలకేమో మాది పెద్ద పేరే

ఊరు చూస్తే కొత్తకొత్తగుంటుందీ
ప్రతిసారి కంగారే
వింద వింద గోవిందా అనుకుంటూ
కష్టాలే దాటేరే

దేశం మొత్తం పరపతిరా
తిరుపతి పేరంటే మోతరా
సామికైనా ధీమాలాగా నిలబడతారే
ఇట్టాంటి ఊరు చూడరే (2)

చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం



ప్రవాసాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని 
గానం: హైమత్ మహమ్మద్ 

ప్రవాసాన్ని 

Palli Balakrishna Monday, March 20, 2023
Nenu Meeku Baaga Kavalsinavaadini (2022)



చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ 
రచన: కిరణ్ అబ్బవరం
దర్శకత్వం: శ్రీధర్ గాదె 
నిర్మాత: కోడి దివ్య దీప్తి 
విడుదల తేది: 16.09.2022



Songs List:



లాయర్ పాప పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రామ్ మిరియాల 

లాయర్ పాప 



నచ్చావ్ అబ్బాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ధనుంజయ్, లిప్సిక

నచ్చావ్ అబ్బాయ్ 



మనసొక మాటే పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి

మనసొక మాటే 




అట్టాంటి ఇట్టాంటి పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కీర్హన శర్మ, సాకేత్ 

అట్టాంటి ఇట్టాంటి 



చాలా బాగుందే ఈ ప్రయాణం పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ఆదిత్య అయ్యంగార్ 

చాలా బాగుందే ఈ ప్రయాణం
నాతో వస్తోందే నా సంతోషం
ఓహో, ఆ ఆ ఓహూ ఆ ఆ

నిజంగా నిజంగా ఏంటో ఇదంతా
కలేమో అన్నట్టు ఉంది కదంతా
అందంగా మారిందే వెళ్లే దారంతా
కళ్ళారా చూస్తున్న నాలో కేరింతా

ప్రేమా ప్రేమా నేనే స్వయానా
పడిపోతున్నా పరాకులోనా

షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
ఓహో, ఆ ఆ ఓహూ ఆ ఆ

నవ్వుల్లో ముంచావే నన్నే అమాంతం
నాకంటూ ఏముంది నువ్వే సమస్తం
నాతోటి నువ్వుంటే ఏదో ప్రశాంతం
దూరంగా వెళ్ళావో అదే యుగాంతం

నీతో గడిపే క్షణాలకోసం
కాలం కాళ్ళే పటేసుకోనా

షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
ఓహో, ఆ ఆ ఓహూ ఆ ఆ



మనసే (Family Song) పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీకృష్ణ, రమ్యా బెహ్రా

మనసే (Family Song)

Palli Balakrishna Thursday, October 13, 2022
Sammathame (2022)



చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి 
దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ 
విడుదల తేది: 2022



Songs List:



కృష్ణ అండ్ సత్యభామ పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: యాజిన్ నిజార్ , శిరీష భార్గవతుల

నేనూహించలే నేననుకున్న అమ్మాయి
నువ్వేనని అసలూహించలే..!
నేనూహించలే ఇంతీజీగా
నే నీకు పడతానని అస్సలూహించలే..!

ఏంటో ప్రతి పాటలో
చెప్పే పదమే కదా
అయినా ప్రతిసారి
సరికొత్త వెలుగే ఇదా

వేరే పనిలేదుగా
ప్రేమే సరిపోదుగా
ఇక చాలు చాలు అని
కొంతసేపు మరి కొంతసేపు
పోనీదు అంత త్వరగా

కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా

అందం తప్పేలే
కంట్రోలే తప్పిస్తుందే
అరె చెయ్యేమో
నా మాట వినబోదులే

ఈ మాటలే తగ్గించరా
నీ చెంపపై తగిలిస్తే వినునా
కోపాలు డూపేలే… నీకైనా ఒకేలే
ముద్దంటే పైపైకే తిడతావులే

కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా

డ్రెస్సే బాగుందే మంటల్నే
పుట్టిస్తుందే గాని
పరికిణీలో నీ బ్యూటీ ఓ రేంజేలే

నా ఇష్టమే నాకుండదా
నీ టేస్టులే రుద్దేస్తే తగునా
డ్యూయెట్టు సెంటర్లో
ఈ ఫైటు ఆపమ్మా
వద్దంటే కామెంటే చేయబోనులే

కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా





బుల్లెట్ లా పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సామ్రాట్ 
గానం: రితేష్ జి. రావు 

చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సామ్రాట్ 
గానం: రితేష్ జి. రావు 

బుల్లెట్టులా నీ వైపే నేనొస్తున్నానే
కమ్మిట్టులా అయిపోయానే
చాక్లెట్టులా నీ నవ్వునే చూసి నేను
హాట్ కేకులా మెల్టయ్యానే

ప్రతి రోజూ నీ కళ్ళనే
తొంగి తొంగి నే చూసే
ఆ కళ్ళు నన్ను పిలిచే వేళలో
ఇంకేం ఇంకేం కావాలే

చంపేయకే మనసిట్ఠే
నువ్వు లాగి పీకి తోసేయకే
ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెల్లోన
ఇంత ప్రేమ నింపెయకే
చిత్రహింసలేంటి ఇలా

నిన్న మొన్న లేని హాయే
నువ్వొచ్చాకే చుట్టేసిందే
నాకే నీను నచ్చేసానే
నన్నే నీకు ఇచ్చేసానే

నీ మాటల్లో మాయేదో గమ్మత్తుగుందే
ఏ బాటిల్ లో లేనంత మత్తుందిలే
రేయైన పగలైనా హాయైన దిగులైన
నాతోడు నువ్వుంటే నాకింక సమ్మతమే

చంపేయకే మనసిట్ఠే
నువ్వు లాగి పీకి తోసేయకే
ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెల్లోన
ఇంత ప్రేమ నింపెయకే
చిత్రహింసలేంటి ఇలా

నిదుర లేదే నేరం నీదే
హద్దే లేనీ ప్రేమే నాదే
ఇద్దరమొకటై బతికేద్దామే
వద్దనకుండా హత్తుకుపోవే

ఏ చోటున్న నీ గొంతే వినిపిస్తూ ఉందే
ఏ పాటిన్న రానంత కిక్కుందిలే
జగమంతా సగమైన క్షణమేను యుగమైన
ఈ వలపు మలుపుల్లో సతమతము సమ్మతమే

చంపేయకే మనసిట్ఠే
నువ్వు లాగి పీకి తోసేయకే
ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెల్లోన
ఇంత ప్రేమ నింపెయకే
చిత్రహింసలేంటి ఇలా

బుల్లెట్టులా నీ వైపే నేనొస్తున్నానే
కమ్మిట్టులా అయిపోయానే
 




బావ తాకితే పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సెనాపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: మల్లికార్జున్, మాళవిక

తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం, ఆ ఆ… తననం తననం, ఆ ఆ
తననం తననం, ఆ ఆ… తననం తననం

చిటపట చినుకులు కురిసెనులే, మ్ మ్
ఎదలో అలజడి రేగే, జుం జుం జుం జుం
పడి పడి తపనలు తడిసెనులే, మ్ మ్
తనువే తహ తహలాడే, జుం జుం జుం జుం

ఏమి జరిగిందో
నీ జారు జారు పైట జారిపోతుంది
ఈడు దాడుల్లో
నా ఒంటి నుండి సిగ్గు పారిపోయిందే

కొండల్లో కోనల్లో… వాగుల్లో వంకల్లో
ఎన్నెన్నో వేషాలే వేద్దామా
ఎంచక్కా ఇంపుల్లో… తైతక్క ముద్దుల్లో
ఊరేగి ఆహ అందామా

బావ తాకితే… మురిసే మురిసే
లేత పరువం మెరిసే
భామ కులుకులు… తెలిసే తెలిసే
ఆగనన్నది వయసే

తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
లాల లలలలా లాల లలలలా
లల లాల లలలలా లల లల లలలలలా
జుం జుం జుం జుం జుం జుం జుం జుం

మాటా మాటా… చూపు చూపు
ఏకం చేసే వేళల్లోనా, మ్మ్ మ్మ్
కాలక్షేపం చేయొద్ధంది కొంటె కోరిక
జుం జుం జుం జుం

రాలేనంటూ రారమ్మంటూ
సైగల్లోనే సంబంధాన్ని
తెలియజేస్తూ ఉన్న నేను
హాయ్ హాయ్ నాయకా
జుం జుం జుం జుం

ఏదో ఏదో చేసావే మ్యాజిక్కే మ్యాజిక్కే
ఆగేలాగా లేదే లోలో మ్యూజిక్కే
వచ్చావంటే వేగంగా నా దిక్కే నా దిక్కే
ఐబాబోయ్ అంతా నా లక్కే

బావ తాకితే… మురిసే మురిసే
లేత పరువం మెరిసే
భామ కులుకులు… తెలిసే తెలిసే
ఆగనన్నది వయసే
జుం జుం జుం జుం
జుం జుం జుం జుం

నిద్ర గిద్రా మాకేమాత్రం
వద్దొద్దంటూ చెప్పే కళ్ళు
నలుపు రంగు రాత్రిలోన
ఎరుపెక్కాలమ్మా, జుం జుం జుం జుం

పెదవి పెదవి సున్నితంగా
రాజూకుందే మోజుల్లోన
రాణించేటి రాజా నిన్ను ఆపాతరమా

జివ్వు జివ్వు అంటుందే… లోలోన లోలోన
బజ్జోబెట్టుకోవా నన్ను ఒల్లోన
ఏనాడైనా నీ ఇష్టం కాదంటూ ఉన్నానా
ఊ అంటే, ఊహు అన్నానా

బావ తాకితే… మురిసే మురిసే
లేత పరువం మెరిసే
భామ కులుకులు… తెలిసే తెలిసే
ఆగనన్నది వయసే




నందలాల పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: కరిముల్లా

హరిలోరంగ హరి
ఇది కదా మొదలయ్యే దారి
కనుల కంచె దాటి
కల కంచిని వెదికే వారి

హరిలోరంగ హరి
బరి తెలియని బాలమురారి
సరిగా గడసరిగా మారి
బైలుదేరే చూద్దమురారి

కొనలేని కోరికలన్నీ ఏకరువు పెట్టాడే
ఆ కొరత తీర్చే నారీ 
మరి యాడున్నాదో
లోకమే ఏకమై చూసినా
తెలియని లోతితడే

నందలాల గోకుల బాల
కృష్ణ నవ్వుల నది ఇతడేరా
గోపీనాథ కోలాహలమై
పట్నం బాలికొచ్చెను కదరా

నందలాల గోకుల బాల
కృష్ణ నవ్వుల నది ఇతడేరా
వీధి వీధిలో ఎదురయ్యే కథ
మనలాంటోడే కదరా

కాలమే పరిగెడుతుంటే
కాలితో గొడవడుతాడే
మొండిగా నమ్మిందొకటే
మంచని అంటాడే

కొనలేని కోరికలన్నీ
ఏకరువు పెట్టాడే
ఆ కొరత తీర్చే నారీ
మరి యాడున్నాదో
లోకమే ఏకమై చూసినా
తెలియని లోతితడే

నందలాల గోకుల బాల
కృష్ణ నవ్వుల నది ఇతడేరా
గోపీనాథ కోలాహలమై
పట్నం బాలికొచ్చెను కదరా

నందలాల గోకుల బాల
కృష్ణ నవ్వుల నది ఇతడేరా
వీధి వీధిలో ఎదురయ్యే కథ
మనలాంటోడే కదరా




తెలుసో లేదో పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: హరిచరణ్, దినేష్ రుద్ర

జిలుగైన చెంగావి… జిగి మీరు కుచ్చిళ్ళు
చిన్ని యడుగుల మీద చిందులాడ
నీటైన రత్నాల తాటంకముల కాంతి
కుల్కు గుబ్బలమీద గునిసియాడా
 
గురుతైన అపరంజి
గొప్పముత్తెపు సత్తు మోవిపై
నొక వింతా ముద్దుగుల్కా

తెలుసో లేదో కలలో చూశా
అపుడెపుడో నాలో నిన్నే కలిశా
ఎవరిని చూసో ఎవరన్నావో
పరుగొదిలిక కొంచం ఆగే మనసా

సో సో… తెగ పోరుతో లైఫులో
సోలో… అనుకుంటూ పడుంటే
స్లోమో… ఎలివేషన్ లోన నువ్వొచ్చావా
 
అన్నో, తెగ ఊహలు వద్దుర
అమ్మో, తన లెక్కలు వేరో
ఏమో, కలిసే ఇక చూడరా
ఏమౌతుందో

ఎపుడూ ఒకటే పరిపాటా
తనకే పడదా సరదా
అసలే పడవే పనీపాటా
మనసే వేయదే పరదా

వీరు వీరే మరి వారు వారే
అరె వేరే వేరే దిశలొకటిగా
కలిసెనా..?

సో సో… తెగ పోరుతో లైఫులో
సోలో… అనుకుంటూ పడుంటే
స్లోమో… ఎలివేషన్ లోన నువ్వొచ్చావా

అన్నో, తెగ ఊహలు వద్దుర
అమ్మో, తన లెక్కలు వేరో
ఏమో, కలిసే ఇక చూడరా
ఏమౌతుందో

రంగవల్లి నేలలా
చంటిపాప జోలలా
అంటుకోనె ఉండదా
జంట తారలా టెన్ టు ఫైవ్

అమ్మలా ఆలోపే ఆలిలా మారదా
ఓపిగ్గా కనులను నిమురుతూ
కలలను నిలపదా

అల తాకిడి లేకనే
కడలై ఎద మారే
మనసంచులదాకా ఏదో హాయే

అల తాకిడి లేకనే
కడలై ఎద మారే
మనసంచులదాకా ఏదో హాయే




ప్రేమా ఇది ఏమో పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: ఆదిత్య RK

నిమిషమైనా ఆగునా
నిలవదే ఎపుడు కాలమే
క్షణము కూడా ఉండదే
తిరగడం మాని భూమిదే
ఎవరికో ఎందుకో
మనసులే మారితే ఎలా

లేదు ఎవరి మీద హక్కు
నీకు తెలియదా..?
ఇంతే తెలుసుకుంటే
ఎపుడు నీకే తెలియలేదెలా

నిమిషమైనా ఆగునా
నిలవదే ఎపుడు కాలమే
క్షణము కూడా ఉండదే
తిరగడం మాని భూమిదే

నిన్నింత నమ్మిందనే నీకింత అలుసా
ప్రేమిస్తే అయిపోతుందా బానిస
ప్రతిదీ నీతో పోల్చి అడిగితే
తనది కూడా నీవే బ్రతికితే

ప్రేమా ఇది ఏమో మరి
చేసావులే నీకు నీవే మోసమే
ఇంతే తెలుసుకుంటే
ఎపుడు నీకే తెలియలేదెలా

ఇన్నాళ్లు చూపించిన కోపాలు బహుశా
దూరంగా పేరే మార్చి చేరేనా
ఇంతా చేసి చోటు వెతికితే
సమము కాని కంటతడి ఇదే

ప్రేమ ఇది ఏమో మరి
చేసావులే నీకు నీవే మోసమే
లేదు ఎవరి మీద హక్కు నీకు తెలియదా
ఇంతే తెలుసుకుంటే
ఎపుడు నీకే తెలియలేదెలా

Palli Balakrishna Monday, July 11, 2022
Sebastian P.C. 524 (2022)



చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
నటీనటులు: కిరణ్ అబ్బవరం , నువేక్ష, కోమలి ప్రసాద్ 
దర్శకత్వం: బాలాజీ సయ్యపు రెడ్డి 
నిర్మాతలు: బి.సిద్దా రెడ్డి, రాజు, ప్రమోద్ 
విడుదల తేది: 04.03.2022



Songs List:



నా ప్రపంచం హేలి పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం: కపిల్ కపిలన్ 

నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లా
నువ్వు లేను నేను ఖాళీ కాదులే కల్లా

నీ కలలే మదిలో మెదులు
నీ వలనే సరదా మొదలు
నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే

నా ప్రపంచం హేలి అనే నాకు
అసలేమౌతోందో చుట్టూ తెలియదుగా
నా చిరాకే ఉంది పరారీలో
తెగ సంబరపడుతూ ఉంటా
నువ్వే కనబడగా కదలనుగా
మెదలనుగా వదలనుగా

ఎక్కడిదే ఈ వెలుగంతా నా కళ్ళలో
నీలాలలా మెరిసే నీ నవ్వులందే
ఎప్పటికీ నను బతికించే ఊపిరివే
గాలాడదే క్షణమైనా నువ్వు లేనిదే

నువ్వొచ్చాకనే కదా జీవితం అంటే తెలిసింది
అవస్థ ఉన్నా సరే నా పనికి బాధ్యత పెరిగింది
నువ్వు లేవా… నేనసలు ఏమైపోతానో జీవితము ఏమౌనో
ఎపుడైతే నీతో ఉంటానో సందడిగా ఉంటానే

నిజము తెలుపనా లేదుగా
మనసు మనసులా
జతపడు అడుగు అడుగునా
కుదురుగా మనసు నిలవదా

విడివిడినే మడగడదాం
వడివడిగా ముడిపడదాం
హా, ముడిపడదాం
విడివిడినే మడగడదాం

నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లా
నువ్వు లేను నేను ఖాళీ కాదులే కల్లా

నీ కలలే మదిలో మెదులు
నీ వలనే సరదా మొదలు





కంటిలోని చీకటిని పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం: పద్మలత 

కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా
వెలుగు సెబా..!
రాజాధి రాజా

వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా..!
రాజాధి రాజా

నిజాలు కన్న కలల్లో
సమాధి నీ గతం
సవాలు ఉన్న కధల్లో
జవాబు జీవితం

నిరాశ ఒడిలోన పారాడక
తీరానికి దారి చూపు
ఆశ మీద దూసుకుపో పారిపోక

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజా రాజాధి రాజా
రాజాధి రాజా రాజాధి రాజా

నీ వంక చూసే మసకబారు లోకం
కనకుండా చూడు నీ లోపం
నీ నీడకైనా తెలియనీకు సారం
నిశ్శబ్దం చేయు నీకోసం

దోబూచులాడే కరుకు మనసు కాలం
కరిగేలా రగులు ఆసాంతం
ఏనాటికైనా నీకు నీవే ఊతం
నీతోనే నీకు పోరాటం

కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా
వెలుగు సెబా..!
రాజాధి రాజా

వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా..!
రాజాధి రాజా

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజా రాజాధి రాజా
రాజాధి రాజా రాజాధి రాజా

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ




నీ కనులలో దాగుందా పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం:  అనుదీప్ దేవ్

హ్మ్ మ్ మ్ మ్
నీ కనులలో దాగుందా మాయాజాలం
ఏ కదలికా లేకుండా లేదా కాలం

మనసారా మన మాటల్లో మునకేసింది
తనువారా మహదానందం చవిచూసింది
మనపై పనిలో పనిగా కధ రాసింది
మరలా మరల చదివి తెగ మురిసింది

ఎంత ప్రేమగా బిగిసింది
జంట మధ్యలో జారుముడీ

నీ కనులలో దాగుందా
మాయాజాలం
ఏ కదలికా లేకుండా
లేదా కాలం




న్యాయాన్ని కాపాడే పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం:  అనుదీప్ దేవ్ , సాహితి గాలిదేవర 

న్యాయాన్ని కాపాడే
ఆరాటం లేనే లేని
చట్టాన్ని కాదయ్యా
చూడాలనుకుంది

అన్యాయం వైపుండే
బంధాలే ఉన్నా కాని
సంకెళ్ళు వద్దంటే
నేరం అవుతుంది

లోకం చూడని లోపం బాధిది
లోనుండే ఇజాన్ని మోయకు
ఫ్రెండేరాయని ప్రశ్నే వేయక
సాగించే ప్రయాణమే దులుపు

మేయగా చిమ్మ చీకటి మారదే
నిజాన్ని ఓ కాంతిరేఖలా నీ చూపు
ఏమైనా కాని ధైర్యాన్ని పూని
సత్యాన్ని గెలిపించెయ్ నేడు

న్యాయాన్ని కాపాడే
ఆరాటం లేనే లేని
చట్టాన్ని కాదయ్యా
చూడాలనుకుంది




The Rage Of Seba పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: గీబ్రాన్
గానం:  దీప్తి సురేష్ 

The Rage Of Seba

Palli Balakrishna Monday, March 21, 2022
SR Kalyanamandapam (2021)



చిత్రం: SR కళ్యాణ మంటపం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయి కుమార్
దర్శకత్వం: జి. శ్రీధర్
నిర్మాత: ప్రమోద్ రాజు
విడుదల తేది: 2021



Songs List:



చూశాలే కళ్ళారా... పాట సాహిత్యం

 
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్

ఈ నేల తడబడే వరాల ఉరవడే
ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే
అదేదో అలజడే క్షణంలో కనబడే
గతాలు వదిలి పారిపోయే చీకటే

తీరాన్నే వెతికి కదిలే అలలా 
కనులే అలిసెనా ఎదురై ఇపుడే దొరికెనా
ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా 

చూశాలే కళ్ళారా...
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ తొలకరి చూపే నా అలజడినాపే
నా ప్రతిదిక నీకే ఇక పోను పోను దారే మారేనా

నా శత్రు వీ నడుమే చంపదా తరిమే
నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలేనా
నా రాతే నీవే మార్చేశావే నా జోడి నీవేలే
చూశాలే కళ్ళారా...
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ జత కుదిరాకే నా కదలిక మారే
నా వధువిక నీవే ఆ నక్షత్రాల ధారే నా పైనా

హే తాళాలు తీశాయి కాలాలే
కౌగిళ్ళలో చేరాలిలే
తాళేమో వేచుంది చూడే నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటోంది గాలే
దూరేందుకే మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టంగా ఈనాడే

తీరాన్నే వెతికి కదిలే అలలా కనులే అలిసేనా 
ఎదురై ఇపుడే దొరికేనా
ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా
చెలియా పిలిచేనా 

చూశాలే కళ్ళారా...
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ జత కుదిరాకే నా కదలిక మారే
నా వధువిక నీవే ఆ నక్షత్రాల దారి నా పైనా




హే చుక్కలు చున్నీకే పాట సాహిత్యం

 
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: అనురాగ్ కులకర్ణి

హే చుక్కలు చున్నీకే నా గుండెని కట్టావే 
ఆ నీలాకాశంలో అరె గిరా గిరా తిప్పేసావే
మువ్వల పట్టికే నా ప్రాణం చుట్టావే
నువెళ్ళే దారంతా అరే ఘల్లు ఘల్లు మోగించావే

వెచ్చ వెచ్చని ఊపిరి తోటి ఉక్కిరి బిక్కిరి చేసావే
ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే

హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా

హే కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకో లేను డప్పే కొట్టి చెప్పలేను
పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను

కాసేపు నువ్వు కన్నార్పకు 
నిన్నులో నన్ను చుస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాట్లాడకు
కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా

ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావె
ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే

హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా




సిగ్గెందుుకురా మామ పాట సాహిత్యం

 
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హరిచరన్

తిట్టిన బాగుంటాదే కొట్టిన బాగుంటాదే
గర్ల్ ఫ్రెండ్ ఏంచేసినా గారాబంగా ఉంటాదే
ఛి అన్న నచ్చేస్తాదే తూ అన్న నచ్చేస్తాదే
పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటాదే
నిజమేరా మామ గుండెలో హాయ్ హాయ్ జాతర్లే
అంతేరా మామ
జిందగీలో రంగు గాలిపటాలే
విన్నావా మామ
తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే
దిల్ మే ధక్ ధక్ సుప్పనాతి సూపులకు
సిగ్గెందుుకురా మామ వొద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఎమన్నా కానీ
శబాష్ అని సీటీ కొట్టు

హే నచ్చక నచ్చక పిల్లే నచ్చుతాదే
పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే
దొరికిన ప్రసాదం కళ్ళకు అద్దుకోవాలి కానీ
లేని పోనీ వంకే పెట్టి వదిలేసుకుంటామా
అయినా ఆ.. బుర్రోనోడు ఆ.. బుద్దున్నోడు
ఆ.. దుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు
వంద కాదు వెయ్యి చెప్పు
ఒప్పుకోదు పూల కొప్పు
దండయాత్ర వాళ్ల హక్కు
లోగిపోడం ఒకటే దిక్కు
సిగ్గెందుుకురా మామ వొద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఎమన్నా కానీ
శబాష్ అని సీటీ కొట్టు

ఆ.. నవ్వితే ముత్యాలే ఏరుకొని పోతామని
చిర్రుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వుని
ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని
చచ్చిన చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే
అయినా ఆ లెక్కల్నే ఆ స్కెచుల్నే
ఆ.. కనిపెట్టాలంటే కాదె మావల్ల
ఆడపిల్ల అందం చందం అయ్యబాబోయ్ అయస్కాంతం
మనమేమో ఇనపముక్క అతుక్కుపోదాం అది లెక్కా
సిగ్గెందుుకురా మామ వొద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఎమన్నా కానీ
శబాష్ అని సీటీ కొట్టు





మెరిసే మెరిసే పాట సాహిత్యం

 
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: చైతన్ భరద్వాజ్

మెరిసే మెరిసే



గుండెసడిలాగా పాట సాహిత్యం

 
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హరిచరన్, చైతన్ భరద్వాజ్

గుండెసడిలాగా నీలో నన్నే దాచావా
కంటి వెలుగు నాన్నే అనుకున్నావా
మహారాజల్లె మళ్లి చూడాలనుకుంటు
సామ్రాజ్యన్ని నిర్మిస్తున్నావా
నన్నింత ప్రాణంగా కొలిచిన నిన్ను
దూరంగా తోస్తు నిందించానా అరెరే
ఇప్పుడే ఇప్పుడే తెలిసినదే
మనసే పోలమరిందే
కనుకే కనుకే కనుపాపే
నిన్నే నిన్నే చూడాలందే

ఏదిగి ఏదిగి ఎగిరి పోయావని
పోరపాటుగా అనుకున్నానే
వెనకే వెనకే తిరుగుతున్నావని
అలస్యంగా గుర్తించానే
నీలంటి కొడుకు ఉన్నంత వరకూ
ఏ ఇంటి పరువు చేజారి పోదే
నువ్వు చేసే పనులు నువ్వు కన్న కలలు
నాకోసమే అంటే కనులకి తడి తగిలేను కదా
ఇప్పుడే ఇప్పుడే తెలిసినదే
మనసే పోలమరిందే
కనుకే కనుకే కనుపాపే
నిన్నే నిన్నే చూడాలందే

తలను నిమిరె మోదటి స్నేహం నువ్వే
నిన్నే ఎలా మారచిపోతా
భుజము తడిమే మోదటి ధైర్యం నువ్వే
నిన్నే ఎలా విడిచిపోతా
నీ గోరు ముద్ద
నీ చేతి స్పర్శ నాకన్నీ గుర్తే ఓ పిచ్చి నాన్నా
నువ్వే నా లోకం
నువ్వే నా సర్వం
నువ్విచ్చిన ప్రాణం
అడుగడుగున గుడి కడతది
ఇప్పుడే ఇప్పుడే తెలిసినాదే
మనసే పోలమరిందే
కనుకే కనుకే కనుపాపే
నిన్నే నిన్నే చూడాలందే

Palli Balakrishna Tuesday, February 9, 2021

Most Recent

Default