Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Guru Sishyulu"
Guru Sishyulu (1990)

చిత్రం: గురు శిష్యులు (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, చిత్ర (All)
నటీనటులు: కృష్ణంరాజు , రాజేంద్రప్రసాద్ , సుమలత , కుష్బూ
దర్శకత్వం: యస్.పి.ముత్తురామన్
నిర్మాతలు: యమ్.పూర్ణ ప్రకాష్ , యస్.సాంబశివరావు
విడుదల తేది: 1990

పల్లవి:
మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై  పుట్టానయ్యా
మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా
నీటిలో చేపలా దాగున్నది తాగిన లేదులే తప్పన్నది
డబ్బుతో వచ్చిన జబ్బేనయ్యా తండ్రికి తగ్గదీ బిడ్డేనయ్యా

మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా

చరణం: 1
కుర్రదంటే ఒక గుర్రమంటా దమ్ము ఉంటే నన్ను తెమ్మంటా
పెగ్గులంటే ఒళ్ళు మంటంటా బాటిలుంటే కాచుకోమంటా
వయసోక తాపం నీళ్లతో తీరదు దాహం
మధువక స్నేహం చేసినా కాదది పాపం
ఆడు తైతక్కని ఈడు వేడెక్కని
అందాలు బంధాలు అయిపోని
ఒళ్ళు చల్లారని తెలివి తెల్లారని
పొద్దుల్ని ముద్దుల్ని మాపేయ్ నీ
ఇంపు ఈడున్నది సొంపు తోడున్నది
లేనే లేదు ఇంక అడ్డన్నది

మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా

చరణం: 2
ఆడదంటే గొప్ప ఏమున్నది గొర్రెలాంటిది అన్న పేరున్నది
బంధామంటూ అరె ఎక్కడున్నది
వ్యాపారమే దాని ఊపిరైనది
ప్రేమొక పాట అందులో మనసోక మాట
బ్రతుకొక ఆట కలిమికే గెలుపనమాట
గ్లాసు నిండున్నది నైసు ఊపున్నది
కళ్ళల్లో ఎర్రాని కైపుంది
కాదు రేపన్నది పోదు మాపన్నది
ఈరోజు నా మోజు తీరేది
సిగ్గు యెగ్గన్నది లేదు రానన్నది
సందు చూసి గూబ గుర్రన్నది

మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా
నీటిలో చేపలా దాగున్నది తాగిన లేదులే తప్పన్నది
డబ్బుతో వచ్చిన జబ్బేనయ్యా తండ్రికి తగ్గదీ బిడ్డేనయ్యా

మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా

Palli Balakrishna Saturday, December 9, 2017
Guru Sishyulu (1981)

చిత్రం: గురు శిష్యులు (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, కృష్ణ , శ్రీదేవి, సుజాత
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: సి.అశ్వినీదత్
విడుదల తేది: 21.03.1981

పల్లవి:
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా

చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా

చరణం: 1
పాలుగారే చెంప పైనా కెంపురంగులూ అందమైనా
పాలుగారే చెంప పైనా కెంపురంగులూ అందమైనా
ముద్దు పెట్టే తావులోనా దెబ్బపడ్డది న్యాయమేనా
ముద్దు పెట్టే తావులోనా దెబ్బపడ్డది న్యాయమేనా

తప్పు చేసే చేతికేమిటి నువ్వు వేసే దండనా
తప్పు చేసే చేతికేమిటి నువ్వు వేసే దండనా
ఊపిరాడని కౌగిలింతతో సంకెళేస్తే చాలునా
హేహే... లలలలలా...

చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా

చరణం: 2
ప్రేమ తాపం బయటపడ్డది పిచ్చి కోపం రూపానా
తాపమారి చల్లబడితే ప్రేమ మిగులును నీపైనా
ప్రేమ తాపం బయటపడ్డది పిచ్చి కోపం రూపానా
తాపమారి చల్లబడితే ప్రేమ మిగులును నీపైనా

తాపమారినా ప్రేమలోనా తనివితీరునా ఎవరికైనా

చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా

చరణం: 3
అద్దమల్లే నిలుపుకున్నా నిన్ను ముద్దుగా నాలోనా
అద్దమల్లే నిలుపుకున్నా నిన్ను ముద్దుగా నాలోనా
అందమంతా చూసుకున్నా రోజురోజూ నీలోనా
అందమంతా చూసుకున్నా రోజురోజూ నీలోనా

నిన్ను నేను చూడగానే నేను లేను నాలోనా
నిన్ను నేను చూడగానే నేను లేను నాలోనా
నన్ను నేనే పెంచుకున్న నీకు తెలియక నీలోనా
అహహా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా

తానతందానా.... తాననతందానా
హోయ్.. తానతందానా.... తాననతందానా

Palli Balakrishna

Most Recent

Default