చిత్రం: గోపి గోపికా గోదావరి (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చక్రి , కౌశల్య
నటీనటులు: వేణు తొట్టెంపూడి, కమిలినీ ముఖర్జీ
దర్శకత్వం: వంశీ
నిర్మాత:
విడుదల తేది: 10.07.2009
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల
సరిగమలే వర్ణాలుగ కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగ కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోలా
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాలా
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరపునా గీత చెరపనా
ఎంత దూరాన నే ఉన్నా నీతోనే నేలేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
Gopi Gopika Godavari (2009)
Palli Balakrishna
Wednesday, July 26, 2017