Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "G.Nageswara Reddy"
Galli Rowdy (2021)



చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
నటీనటులు: సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీసింహా, రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: యమ్.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది:17.09. 2021



Songs List:



పుట్టెనే ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: రామ్ మిరియాల

పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా...
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా
నీ పేరేంటో చెప్పు కొంచం ఒట్టేసుకుంట
నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంట
సెల్లు నెంబర్ని చెప్పు రింగు ఇచ్చేసుకుంట
మంచి డేటుంటే చెప్పు పెళ్లి చేసేసుకుంట

పుట్టెనే... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా

కత్తులతో ఎప్పుడూ కల్లోలంగా ఉండే దారుల్లో
పువ్వులాగ మెరిసావే ఓ...
మగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో
ఆడవాసనిపుడే చూపావే
నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చేసుకుంట
నీ టేస్ట్ ఏంటో చెప్పు నేను వంట నేర్చేసుకుంట
నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంట
నాన్నకప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంట

పుట్టెనే.... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టేనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా

దోమ తెరలాగా ఉస్సూరని ఉండే నా లైఫు
వెండితెరచేసావే ఓ...
ఒక్క నవ్వుతోనే కుండీ లాంటి బుజ్జి గుండెలోన
ప్రేమవిత్తనాలే జల్లేసావే
నీ ఇష్టాలు జెప్పు లిస్టు రాసేసుకుంట
నీ కష్టాలు జెప్పు నెత్తిమీదేసుకుంట
ఏమి కావాలో జెప్పు గిఫ్టు ఇచ్చేసుకుంట
నువ్వు కాదంటే జెప్పు నేను ఉరేసుకుంట

పుట్టెనే... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా





చాంగురే ఐటెం సాంగురే పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: మంగ్లీ, సాయి కార్తీక్ , దత్తు 

లాయ్ లబ్బ లల్లాయిలే, లాయ్
లాయ్ లబ్బ లల్లాయిలే
లాయ్ లబ్బ లల్లాయిలే, లాయ్
లాయ్ లాయ్ లబ్బ లల్లాయిలే

ఏ, చాంగురే చాంగురే ఐటమ్ సాంగురే
రాతిరంత పాడుకుంటే రాదు నిద్దరే
(నిద్దరే నిద్దరే నిద్దరే నిద్దరే నిద్దరే)

ఏ, ఎప్పుడంటె అప్పుడే… ఎక్కడంటె అక్కడే
నన్ను చూస్తే ఎవ్వడైనా పూలరంగడే
(రంగడే రంగడే రంగడే రంగడే రంగడే రంగడే)
హబబ్బా ఇంతందంతో ఎట్టా సచ్చేది
హబబ్బా మీ కుర్రాళ్ళని ఎట్టా ఆపేది

ధవళేశ్వరం ఆనకట్ట తెంచినట్టు
నాపై జనం దూకుతుంటరే
పిఠాపురం పీటసెక్క లాగ
నేను మహాదిట్టం అంటూ ఉంటరే

రాజాధిరాజా రౌడీ రాజా
మీసం తిప్పిన మార్తాండకేయ
రాజాధిరాజా రౌడీ రాజా
ఇరగదీద్దాం ఆయుధ పూజ

కత్తులకైనా అధరవులేరా… ఒంపులకైనా బెదరవులేరా
తాతకి తగ్గా మనవడివేరా… రా రాజా రాజా

నా నడుం మడతలిస్తిరి చేసేటోడు
కత్తిలాంటోడు నాకు దొరికినాడు
ఆ గాజువాక నుంచి మధురవాడ దాకా
నీ పేరు చెప్పగానే కెవ్వు కేక

ఏం చెప్పావే గ్రీకు సుందరీ
స్వర్గంలో వేస్కో మల్లె పందిరి
ఏ, అందరికన్నా పెద్ద కంతిరీ
తీర్చేస్తా నీ తిమ్మిరీ

హబబ్బా నీ ఘనకార్యం సూడాలని ఉందే
నీతో కొత్త యవహారం నడపాలని ఉందే
సీకాకుళం అడ్డరోడ్డు దాటగానే
సీతాఫలం బుట్టలిస్తనే
భీమునిపట్నం బీచ్ కాడ
సిత్తరాల సోకుల పొట్లం చేతికిస్తనే




విశాఖపట్నంలో రౌడీ గాడు పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: సాయిమాధవ్

పిల్ల పిల్ల పిల్ల పిల్ల కోసం
పిల్లగాడు వేసే కొత్త వేషం
ఇంతలోనే ఎంత అట్టహాసం
కదిలేను కదా… వీడి ప్రేమ కథ

చెయ్యలేదు వీడు ఒక్క యుద్ధం
చూడ లేడు వీడు కోడి రక్తం
రాడు పట్టినాడు ప్రేమ కోసం
ముదిరెను కదా వీడి ప్రేమ కథ
వీడేమో పడుచోడు… వీడెనక ముసలోల్లు
ఓఎల్ఎక్స్ పీసులతోటి ఏం సాధిస్తాడు

ముందెనకా చూడకుండా… ఫైటింగ్ కే దిగినాడు
ఈ కత్తుల కొట్లాటల్లో ఏమైపోతాడు

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ

టిప్పు టాపుగా ఉండేటోడు… ఎంత రఫ్ గా అయిపోయాడు
రచ్చబండ మీద పంచాయితీ చేస్తున్నాడు
కీ బోర్డు మీదా మనసైనోడు… కీళ్లు విరవడం మొదలెట్టాడు
మౌసు పక్కనేటి మీసం తిప్పి… ధూకేశాడు

సెంటు కొట్టుకునే డీసెంటు పిల్లగాడే
బెల్టు పట్టుకొని సెటిల్‌మెంట్ చేస్తాడే
ప్యారు పుట్టగానే వీడు గేర్ మార్చినాడే
అమ్మో అమ్మో ఆగడే..!!

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ, ఓ మై గాడూ





అడ్డంగా బుక్కైపోయా పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: సాయిమాధవ్

బట్ రైట్ నౌ… ఐ జస్ట్ వన బి ఫ్రీ
ఐ వన బి ఆల్ ఐ కెన్ బి

అడ్డంగా బుక్కైపోయా
విరిగిన అప్పడమైపోయా
ఘోరంగా ఎలకల నోటికి
దొరికిన పుస్తకమైపోయా
హే, హరహర మహాదేవ దేవా
విడుదల ఇక లేదా లేదా
మలమల మల ఎండల్లోన
పులుసే కారి పోతోందయ్యా

ఏంటో నా రాత రాత
ఈ మలుపున మోత మోత
వీడేమో యముడికి దూత
వదిలేస్తే నేనింటికి పోతా
పులిహోరే పులిహోరే

అడ్డంగా బుక్కైపోయా
విరిగిన అప్పడమైపోయా
ఏ, అచ్చంగా బ్లేడుకి దొరికిన
పెన్సిలు ముక్కను అయిపోయా

ఏ సరదా లేక లేకా… నిదరేమో రాక రాకా
పెడుతున్నా నే పొలికేక
బతికేస్తున్నా రేపటి దాకా
పెంచాలట బాడీ బాడీ
అవ్వాలట రౌడీ రౌడీ
ప్రాణాలే తోడి తోడి
ఆడేస్తున్నరు కబడ్డీ కబడ్డీ
పులిహోరే పులిహోరే
బట్ రైట్ నౌ… ఐ జస్ట్ వన బి ఫ్రీ
ఐ వన బి ఆల్ ఐ కెన్ బి




తల్లడిల్లిపోద పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Tuesday, May 18, 2021
Denikaina Ready (2012)


చిత్రం: దేనికైనా రెడీ (2012)
సంగీతం: యువన్ శంకర్ రాజా,  చక్రి
నటీనటులు: మంచు విష్ణు, హన్సిక మోత్వాని
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: మంచు మోహన్ బాబు
విడుదల తేది: 24.10.2012


Palli Balakrishna Tuesday, February 19, 2019
Seema Tapakai (2011)



చిత్రం: సీమ టపాకాయ్ (2011)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: అల్లరి నరేష్ , పూర్ణా
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాత: డా. విజయ ప్రసాద్ మళ్ళా
విడుదల తేది: 13.05.2011



Songs List:



దిరె దిరె దిరె ధిల్లే పాట సాహిత్యం

 
చిత్రం: సీమ టపాకాయ్ (2011)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భీమ్స్
గానం: కారుణ్య, గీతామాధురి

దిరె దిరె దిరె  ధిల్లే




ఆకాశంలో ఒక తార పాట సాహిత్యం

 
చిత్రం: సీమ టపాకాయ్ (2011)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: జావేద్ ఆలీ , శ్రావణ భార్గవి

(ఈ పాట సూపర్ స్టార్ కృష్ణ నటించి, నిర్మించిన సింహాసనం (1986) సినిమా నుండి రీమిక్స్ చేయబడింది.  పాడినవారు: రాజ్ సీతారాం, పి.సుశీల, లిరిక్స్: వేటూరిగారు, సంగీతం: బప్పీ లహరి  )

సరిగమగా...

ఆకాశంలో.. ఆకాశంలో.. (2)

ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేల
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
హే తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే...

జుం జుం జుం జుం తన జుం
జుం జుం జుం జుం తన జుం

హే అనురాగం అందమిలా మెరిసింది నీ కళ్ళలోన
అందుకో నా లేత వలపే నీ ముద్దు ముంగిళ్లలోన
కదిలే నీ ప్రాణశిల్పం మదిలో కర్పూరదీపం
హోయ్ నింగి నేల కలిసిన చోట ఏ వెలుతురు రాదులే

జుం జుం జుం జుం తన జుం
జుం జుం జుం జుం తన జుం

ఎన్నాళ్ళో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
హే..నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
హో వాగు వంక కలవని నాడు ఏ వెల్లువా రాదులే

జుం జుం జుం జుం తన జుం
జుం జుం జుం జుం తన జుం




ఐ లవ్ యు బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: సీమ టపాకాయ్ (2011)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: విశ్వా , శ్రావణ భార్గవి 

ఐ లవ్ యు బేబీ 




కందిచేను కొచ్చినావు పాట సాహిత్యం

 
చిత్రం: సీమ టపాకాయ్ (2011)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చిలకరెక్క గణేష్
గానం: హేమచంద్ర, ఉష, నోయల్ సేన్

కందిచేను కొచ్చినావు

Palli Balakrishna Wednesday, March 14, 2018
Achari America Yatra (2018)


చిత్రం: ఆచారి అమెరికా యాత్ర  (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం:
గానం:
నటీనటులు: మంచు విష్ణువర్ధన్ , ప్రాగ్యా జైస్వాల్
కథ, మాటలు ( డైలాగ్స్ ): డార్లింగ్ స్వామి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: కీర్తి చౌదరి , కిట్టు , వివేక్ కూచిబొట్ల
సినిమాటోగ్రఫీ: ఆర్.సిద్దార్ధ్
ఎడిటర్:
బ్యానర్:
విడుదల తేది: 16.03.2018

ఏడు కొండల స్వామి నువ్విట్ట చేసావేమి
నీ దేశం కాని దేఅం లోనా మాకీ కస్టాలేమీ
అర్చన చేసె మాపై నీ కక్షలు కట్టడమేమి
నెత్తిన ఒక్కటి ముట్టక పోతే నిద్దర పట్టద స్వామి
మా లైఫుకి చిల్లు మరి నీకేమొ త్రిల్లు
పగబట్టి పట్ట పగలు చుక్కలు చూపించావ్
డాలర్స్ యే నిల్లు మండుతోంది ఒల్లు
తలరాతలు తలకిందులు ఎందుకు చేసెశావూ
ఆచారి అమెరిక యాతరా
అరె అరె గ్రహచారం ఆడిన ఆటరా
ఆచారం మారును చూడరా
అరె అపచారం కానే కాదురా

ఆచారి అమెరిక యాతరా
అరె అరె గ్రహచారం ఆడిన ఆటరా
ఆచారం మారును చూడరా
అరె అపచారం కానే కాదురా

come to me baby.. get to me Truly..
lets get little higher
you mine so truly..
ఓ లైల.. లైల..
ఓ లైల.. లైల..
ఓ లైల.. లైల..లైలా

మైయామి బీచుల్లొ..
మేం.. హాటూ పాపలతో..
మేము ఇంగ్లిష్ ముద్దులు కుప్పలు తెప్పలు expecత్ చెసాము
మీ ప్తతీ స్టాచ్యు తో ఓ సెల్ఫీ దిగేసి
మా facebook-లొ పెట్టెద్దాం అని కలలు కన్నాం రో…
అరె ఆ దేవుడు గ్రేటు యహ మార్చును మన ఫేటూ
వాడెవరికెప్పుడు ఏం చేస్తాడొ అంతా సీక్రెట్టూ
అరె వేస్తాడు వేటు పొడిచాడు పోటు
శని లాడేస్తుందె శని గ్రహం పనేం లేదట్టు

ఆచారి అమెరిక యాతరా
అరె అరె గ్రహచారం ఆడిన ఆటరా
ఆచారం మారును చూడరా
అరె అపచారం కానే కాదురా

ఆచారి అమెరిక యాతరా
అరె అరె గ్రహచారం ఆడిన ఆటరా
ఆచారం మారును చూడరా
అరె అపచారం కానే కాదురా


******  ******  *******


చిత్రం: ఆచారి అమెరికా యాత్ర (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం:

అరెరే నేనకున్నానా కలనైనా కలగన్నానా
కనులే చెదిరే అద్భుతమా నీతో ఉన్నా
ప్రేమంటె అర్దం ఏంటొ ప్రేమించే పద్దతి ఏంటొ
మరి మరి మరి నిను చూశాకే తెలిసిందే ప్రేమా

అరెరే నేనకున్నానా కలనైనా కలగన్నానా
కనులే చెదిరే అద్భుతమా నీతో ఉన్నా
ప్రేమంటె అర్దం ఏంటొ ప్రేమించే పద్దతి ఏంటొ
మరి మరి మరి నిను చూశాకే తెలిసిందే ప్రేమా

ఊపిరిది ఉన్నది నీకోసం
దేహమిది ఉన్నది నీకోసం
సాక్షమదిగో నీలాకాశం
జన్మలెన్నైనా నీకోసం
కొవెలై నిలిచే అవకాశం
దేవతై ఇవ్వవె నా కోసం

నీలో నువ్వే నాలో నువ్వే
అనువనువునా పొంగే ప్రేమయ్యావే
ఒక్క చూపుతో చంపేస్తావే
చిరునవ్వుతో మరలా బ్రతికిస్తావే
అరెరె ఏమందమే ఎంతందమే
ఈ భూమికే నువ్వందమే
వందనాలు నిను చేసిన ఆ చేతులకీ
ఓ నా ప్రేమకు రూపం నువ్వే
నా కోసం పుట్టవే వరమల్లే వచ్చాశావే నన్నే వెతికీ

చెలియా చెలియా....
అరెరే నేనకున్నానా కలనైనా కలగన్నానా
కనులే చెదిరే అద్భుతమా నీతో ఉన్నా
ప్రేమంటె అర్దం ఏంటొ ప్రేమించే పద్దతి ఏంటొ
మరి మరి మరి నిను చూశాకే తెలిసిందే ప్రేమా

ఊపిరిది ఉన్నది నీకోసం
దేహమిది ఉన్నది నీకోసం
సాక్షమదిగో నీలాకాశం
జన్మలెన్నైనా నీకోసం
కొవెలై నిలిచే అవకాశం
దేవతై ఇవ్వవె నా కోసం


******  ******  *******


చిత్రం: ఆచారి అమెరికా యాత్ర (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం:
గానం:

ఓ సిరి సిల్లా చీరకట్టినా
ఓ రేణుకా సిరి సిల్ల చీర కట్టిన రేణుకా
చుడరాదే చిట్టి పొట్టి చిట్టి పొట్టి చిలక లాంటి రేణుకా
నువ్వే నా మేనకా....ఓయె రేణుకా
ఓ సిరి చిల్లా చీర కట్టి సిగలో చామంతులెట్టి
ఆపు తాపు సెంటు కొట్టి అదిరే లిప్స్టిక్ ఏసి
రావా నా వెంటా రేణుకా
నువ్ వస్తావా నా వెంట రేణుకా
వస్తావా నా వెంట రేణుకా
నువ్ వస్తావా నా వెంట రేణుకా

కోటప్ప కొండకు వస్తావా రేణుకా
కొబరెల్లి జాతరకు పోదామే రేణుకా
బోనాల పండక్కి వైపెల్లె ఎల్లె రేణుకా
సమ్మక్క జాతరకు పోదామే రేణుకా
కమ్మన బైకెక్కి నువ్వొస్తే రేణుకో
హేయ్ రేణుకా వినవే...
నీకు పక్క పిన్ను కొనిపెడతా రేణుకో
నీకు బొట్టు బిల్ల కొనిపెడతా రేణుకా
నీకు వడ్డి కాసులేయిస్తా రేణుకో
నీకు జడ గంటలు జడ గంటలు కొనిప్ర్డతా రేణుకా
రేణుకా రేణుకా రేణుకా

సిరి సిల్లా
అబబ్బబ్బా సిరి సిల్లా
అరె అరె సిరి సిల్లా
అమ్మా సిరి సిల్లా

ఓ సిరి చిల్లా చీర కట్టి సిగలో చామంతులెట్టి
సిరి సిల్లా
సిరి సిల్లా

పక్క పిన్నులిస్తననీ ...పక్కకు రమ్మంటావో
బొట్టు బిల్ల పెడతననీ...బుగ్గను గిల్లేస్తావో
గాజులు తొడుగుననై పిల్లడో
నను గాబర పెట్టెస్తవుగా పోరడా
జద గంటలు పెడతవనీ పిల్లడో
నువు నడుముని తదిమేస్తుంటవు పిల్లడా
పిల్లగో ఓ పిల్లగా పిల్లగో రేయ్ జరగరా జరా

సిరి సిల్లా
సిరి సిల్లా

బొద్దు బుగ్గలా పిల్ల నీ కోసం పడి చస్తే
నాకోసం నువ్వేమో ఇంతనన్న చెయ్యవాయె
గిట్లా గిట్లా రమ్మంటె రేణుకో
నువ్ గట్ల గట్ల పోతవేందె రేణుకా
నా సగబాగం ఇస్తనంటె రేణుకో
నువ్వు సతాయించి చంపుతావె రేణుకా
హేయ్ గుస్స గాకు ఓ పిల్లగా జల్దినా బైలెల్లి వస్తా
ఏడికైన నీతోనె దూము దాముగా వస్తా

కరీం నగరు
అరెరె కరీం నగరు
అరెరె కరీం నగరు
కరీం నగరు సెంటరులో పిల్లడో
నన్ను కళ్యానం చేసుకోర పిల్లడా
అరే లాయి లాయి లగ్గమాడి పిల్లడో
నన్ను గాయి గాయి చేసుకోర పోరడా
పిల్లడో ఓ పిల్లడా
పోరడొ దిల్ దడ దడా
దడ దడా

ఓ సిరి చిల్లా చీర కట్టి సిగలో చామంతులెట్టి
ఆపు తాపు సెంటు కొట్టి అదిరే లిప్స్టిక్ ఏసి
రావా నా వెంటా రేణుకా
నువ్ వస్తావా నా వెంట రేణుకా


******  ******  *******


చిత్రం: ఆచారి అమెరికా యాత్ర (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం:
గానం:


స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు
నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు
హేయ్ వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు
నీ మొరాలకించువాడు తిరుమలేషుడు

ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు
నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు
హేయ్ వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు
నీ మొరాలకించువాడు తిరుమలేషుడు

ఏడు కొండలెక్కి కుర్చున్న దేవ దేవుడు
నా మాసులోని మాటలెప్పుడు వింటాడు
తన చల్లనైన చూపుతోటి దీవించేది ఎప్పుడో
అరె భక్తి తోటి మొక్కినోడ్ని మర్చిపోడు
వాడు కచ్చితంగ గుర్తుపెట్టు కుంటాడు
తన అంతులేని ప్రేమని కురిపిస్తాడు అమ్మడూ

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు
హేయ్ నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు
వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు
నీ మొరాలకించువాడు తిరుమలేషుడు

కోలొ కోలన్న కోలు కోలాటం
ఏలొ ఎంకన్న స్వామి కళ్యానం
కళ్యానమేమొ కమనీయం
చూసె కన్నులకెంతొ రమనీయం
బుగ్గ చుక్క పెట్టుకుంది...అలువేలు మంగమ్మ
సిగ్గు మొగ్గలవుతుందీ...పధ్మావతమ్మా
అంగరంగ వైభవంగా అంతులేని సంభరంగా
జరుగున్న పెళ్ళీకి శ్రీరస్తు శుభమస్తు అభిగ్నమస్తూ

కోలొ కోలన్న కోలు
కోలొ కోలన్న కోలు

నీకల్లనేమొ కలువలుగా
పూఇంచి పూజలు జరిపాకా
పరవసించి అడిగిన వన్నీ ప్రసాదించడా
ప్రదక్షనాలను చేసాకా
నీకు ప్రసన్న మవకుండ ఉంటాడా
సాష్టాంగమే పడిపోతున్నా చలనముండదే
పొర్లు దండాలెట్టెస్తున్నా కనికరించడే
హేయ్ పైకి చూస్తె రాయిలాగ ఉంటాడు
కాని వాడి మనసు బండరాయి కానె కాదు
నిన్ను గుండెలోన పెట్టుకొని దాచుకుంటాడు దేవుడూ

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

స్వామి రా రా స్వామి రా రా
దివి నుంచి దిగి రా రా
స్వామి రా రా స్వామి రా రా
దయ తోటి బ్రోవరా

ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు
హేయ్ నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు
వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు
నీ మొరాలకించువాడు తిరుమలేషుడు

Palli Balakrishna Tuesday, January 30, 2018
Seema Sastri (2007)


చిత్రం: సీమశాస్త్రి (2007)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: అల్లరి నరేష్ , ఫర్జానా
దర్శకత్వం, నిర్మాత: జి. నాగేశ్వర రెడ్డి
విడుదల తేది: 16.11.2007

చిత్రం: సీమశాస్త్రి (2007)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్

ప్రియతమా.........ప్రియతమా
ఇంత అందమైన అమ్మాయిని... ని... ని... ని..
ఇంత అందమైన అమ్మాయిని దేవుడా
ఎట్టా తలచినావో మలచినావో దేవుడా
ఇంత అందమైన అమ్మాయిని దేవుడా
నేను ఇంతకాలం చూడలేదు దేవుడా
ఐస్కాంతమేదో తనచూపుల్లో దాగుంది
తనవైపే లాగేస్తూ ఉందే
నా మనసే ఆగదు ఏ భాషైనా చాలదు
తనరూపం వర్ణిస్తూ ఉంటే
హరివిల్లును బొమ్మగ చేసి అణువణువు వెన్నెల పోసి నాకోసం పుట్టించావేమో

తనుసన్నగా నవ్వితే ముత్యాల వాన
ఆ వానలో తడవాలే ఏమైనా
నడువొంపులో ఉన్నదే వయ్యారి వీణ
ఆ వీణలో రాగాన్నైపోనా
అమ్మాయి ఊరేంటో తన ముద్దు పేరేంటో తన ఇష్టాలేంటేంటో.....
చెలినే తలచి పనులే విడిచి రేయి పగలు తనఊహలతో
ఇదివరకెరగని అలగడి మొదలై
తడవ తడవకి తడబడి పొరబడి
కలవరపడుతు కలలే కంటూ
కునుకే రాదు కుదురే లేదు
ప్రియతమా.........ప్రియతమా

తను అడిగితే ఇవ్వనా నా ప్రాణమైనా
నా సర్వము తానని అంటున్నా
కనుపాపని కాపాడే కనురెప్పలాగా
చెలితోడుగా నూరేళ్ళుంటాగా
ఆ దేవుడు వరమిచ్చి తన మనసే నాకిస్తే నాకింకేం కావాలి
ఎపుడులేదే ఎదలో గుబులు నిను చూసాక సెగలే మొదలు
కదలదు సమయం క్షణమొక యుగమై
కనులు తెరవగా ఎదురుగ నిలబడి
చేతులుచాచి రమ్మని పిలిచి
అందీ అందక ఊరిస్తావే
ప్రియతమా... ప్రియతమా

Palli Balakrishna Thursday, September 14, 2017
Intlo Deyyam Nakem Bhayam (2016)


చిత్రం: ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాగిత్యం: భాస్కరభట్ల
గానం: రేవంత్ , హరిణి ఇవటూరి
నటీనటులు: అల్లరి నరేష్, కృతికా జయకుమార్
దర్శకత్వం: జి. నాగేస్వర రెడ్డి
నిర్మాత: బి.వి.ఎస్. ఎస్. ప్రసాద్
విడుదల తేది: 30.12.2016

శతమానం భవతి నువ్వు మనసిచ్చావే
అడగకముందే ఎన్నో వరములు కురిపించావే
భవతి బిక్షాందేహి అనకుండానే
పంచ ప్రాణాలైనా తెచ్చి ఇచ్చేస్తాలే
చచ్చేటంత ఇష్టం నాక్కూడా నువ్వంటే
బదికేదెట్టా నేను నువ్వే లేకుంటే
దాచాలంటే కష్టం అంతేలే ప్రేమంటే
దాసోహం అయిపోయా వెనకే పడిపోయా పడిపోయా

కలలోకే నువ్వోస్తే ఉప్పొంగి పోతా
ఎదురుగ్గా కనిపిస్తే నే లొంగిపోతా
అందంగా పొగిడేస్తే నాకెందుచేత
శీతాకాలం కూడా ఈ ఉక్కపోత
నీ గల గల నవ్వుల నదిలో పడి కొట్టుకు పోతున్నా
పరువాలను కడవగ చేసి ఇదిగో తెస్తున్నా తెస్తున్నా

సరదాగా అనుకుందాం ఓ సత్యభామా
సరిపోతుందా నీతో ఆ చందమామ
ఇన్నాల్లేమయ్యిందో నీలోని ప్రేమ
ఇపుడే గుర్తొచ్చిందా హయ్యయ్యో రామా
నువ్వేమంటావో ఏమో అనుకున్నా ఇన్నాళ్లు
నేనెపుడు అనుకున్నాగ నీతో నడవాలి నూరేళ్లు నూరేళ్లు



**********   *********    **********



చిత్రం: ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాగిత్యం: భాస్కరభట్ల
గానం: ధనుంజయ్

పడ్డానే ఇందుమతి ప్రేమలోన
చెడిపోయిందే ఉన్నమతి గంటలోన
హే పడ్డానే ఇందుమతి ప్రేమలోన
చెడిపోయిందే ఉన్నమతి గంటలోన
నల్లద్రాక్ష లాంటి కళ్ళు తిప్పుకుంటు తిరుగుతుంటే
తెల్లవారకుండ నాకు మెళుకువచ్చే ఒరినాయనో...

హే బార్ బార్ దేఖో ఫిగరు అదిరిందో
ఆ గోరి గోరి బుగ్గ చూస్తే గోవిందో
దీన్నింక కన్నోడు గొప్పోడే ఏ చోట ఉంటడే
కాళ్ళునే కడుగుతా పిల్లనిమ్మనడుగుతా

హే నోరు తెరిచి అడుగుతుంటే నోరుమెదపవే
హే చిటికెనేలు కలపమంటే చిందులేస్తావే
బాధ పెట్టకే నీకు పుణ్యముంటదే
పస్తులెట్టకే పాపమంటుకుంటదే
కేట్ వాక్ చేసుకుంటు ఎళ్లిపోకలా
బొగ్గునట్టులాగ గుండె భళ్ళుమంటు బద్దలౌతదే...

హే పడ్డానే ఇందుమతి ఇందుమతి ఇందుమతి

ఆ గుళ్ళు గోపురాలు నువ్వు ఎన్ని తిరిగినా
కోరస్: గోవిందా గోవిందా
ఆ దేవుడొచ్చి కోరుకున్న వరములిచ్చునా
కోరస్: స్వామి
హే పాలు పోసినా పూల దండలేసినా
కొండలెక్కినా మొక్కులెన్ని తీర్చినా
ప్రాణముండే నువ్వు ఇంత కరగనప్పుడు
రాయిలోన దేవుడొచ్చి నిన్ను ఎంత కనికరిస్తడే

హే పడ్డాను పడ్డాను డాను డాను డాను జాను
పడ్డానే ఇందుమతి ప్రేమలోన
చెడిపోయిందే ఉన్నమతి గంటలోన
నల్లద్రాక్ష లాంటి కళ్ళు తిప్పుకుంటు తిరుగుతుంటే
తెల్లవారకుండ నాకు మెళుకువచ్చే ఒరినాయనో...



**********   *********    **********



చిత్రం: ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాగిత్యం: భాస్కరభట్ల
గానం: సాయి గీతిక

జో అచ్చుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో జో... , జో జో...

జో అచ్చుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో అచ్చుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా

జో అచ్చుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో అచ్చుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా



**********    **********    ***********



చిత్రం: ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాగిత్యం: భాస్కరభట్ల
గానం: సాయి చరణ్, సాయి శిల్పా

దిరణాన దిరణాన దిరణ దిరణాన దిరణాన దిరణ
దిరణానానాన హే దిరణానానాన
దిరణాన దిరణాన దిరణ దిరణాన దిరణాన దిరణ
దిరణానానాన హే దిరణానానాన

అయ్యాను నేనే ఫిదా ఇదేమి మాయో ఖుదా
ప్రేమించా నిన్నే కదా ఉంటాను నీతో సదా
నాకోసమె దిగివచ్చిన నయగారమె నువ్వా
ఆకాశము హాద్దయి దాటి సుఖమేదో నాకీయవా
సరదాగా సాయంత్రం సరదాగా సాయంత్రం సరదాగా సాయంత్రం

ఏనాడు ఎవరు చూడంది రవికిరణం కూడ తాకంది
నీకోసం దాచానురా అది నువ్వే చూడాలిరా
ఎన్నాళ్ళో ఎదురు చూశాను నిదరాక కలలు కన్నాను
మనసారా దరిచేరనా నిను ముద్దులతో ముంచేయనా
కోపమో నీ తాపమో ఇక నా మీద చూపించరా

పువ్వంటి మేని సొంపుల్ని మువ్వంటి నడుము ఒంపుల్ని
సుకుమారంగ తాకేయనా తనివితీరేలా దోచేయనా
నీలోనే కరిగి పోతాను నాలోనే మురిసి పోతాను
ప్రాణాలు పులకించనీ అలసి పోనీయి అందాలనీ
అధరోత్సవం జరగాలిక మనసైన నా మగువతో

దిరణాన దిరణాన దిరణ దిరణాన దిరణాన దిరణ
దిరణానానాన హే దిరణానానాన
దిరణాన దిరణాన దిరణ దిరణాన దిరణాన దిరణ
దిరణానానాన హే దిరణానానాన



*********   ********    ***********



చిత్రం: ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాగిత్యం: భాస్కరభట్ల
గానం: సింహా, దివిజ కార్తిక్

నా బైకే ఎక్కలి అంటే ఏక్ దబాయ్
నాతో దోస్తీ కావాలి అంటే దో దబాయ్
నన్ను తిట్టాలి అనిపిస్తే తీన్ దబాయ్
దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్
నా చెయ్యే పట్టాలి అంటే చార్ దబాయ్
నన్ను పట్టుకోవాలి అంటే పాంచ్ దబాయ్
నా సొబ్బే గిల్లాలి అంటే చే దబాయ్
హే అబ్బాయ్ అబ్బాయ్ ఇక దబాయ్ దబాయ్
ముద్దుదాటి హద్దుతోటి దబాయ్
బుగ్గపైన కిస్సుతోటి దబాయ్
ఆకతాయ్ అబ్బాయ్ ఇస్తారారా గుబ్బాయ్ ఆగలేడు అల్లరబ్బాయ్

అబ్బాయ్ అబ్బాయ్ నువ్వు దబాయ్ దబాయ్
హే అబ్బాయ్ అబ్బాయ్ నువ్వు దబాయ్ దబాయ్
దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్
దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్

కౌగిళ్ళు కావాలంటే సాత్ దబాయ్
ఎంగిల్లు కావాలంటే ఆట్ దబాయ్
పొత్తులు కావాలంటే నౌ దబాయ్
తాపాలు తీరాలంటే దస్ దబాయ్
టాలెంట్ చూపాలంటే గేరా దబాయ్
కరంట్ పుట్టాలంటే తేరా దబాయ్
నువ్ పొత్తి పెన్ను లోకి  పిల్లా నువ్వేల్లాలంటే ఓసోసి చిన్నదానా హేష్ దబాయ్

దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్
హెయ్ దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్
దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్
దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్

చందమామ విరిగి కింద పడ్డదా
అందమంత ఒలికి వెల్లువైనదా
కళ్ళు చూసి కనువే కుల్లుకున్నదా
ఈర్ష్య తోటి నీకే దిష్టి పెట్టదా

నేనంటే ఇష్టమంటే స్మైల్ దబాయ్
నాతోటి వస్తానంటే ఎస్ దబాయ్
నా చెంగు కావాలంటే స్వేర్ దబాయ్
ప్రైవసి కావాలంటే ప్లస్ దబాయ్
లిప్పీస్ కావాలంటే ఇంటూ దబాయ్
నాపైన ప్రేమ ఉంటే నిల్ దబాయ్
దాగివున్న అందమంత పిల్లొడ కావాలంటే
రాతిరేలా వచ్చి నువు స్విచ్ దబాయ్

అబ్బాయ్ అబ్బాయ్ నువ్వు దబాయ్ దబాయ్
హే అబ్బాయ్ అబ్బాయ్ నువ్వు దబాయ్ దబాయ్
దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్
హే దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్

Palli Balakrishna Thursday, July 27, 2017
O Radha Iddaru Krishnula Pelli (2003)



చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003)
సంగీతం: చక్రి
నటీనటులు: శ్రీకాంత్, ప్రభుదేవా, నమిత
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాత: జి.నాగేశ్వర  రెడ్డి
విడుదల తేది: 05.09.2003



Songs List:



శ్రీరామచంద్ర సిగ్గే గోవింద పాట సాహిత్యం

 
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరబట్ల రవికుమార్
గానం: ఉదిత్ నారాయణ్, కౌశల్య

శ్రీరామచంద్ర సిగ్గే గోవింద
ముద్దులతో మొదలెట్టే సామిరంగా
శ్రీరామచంద్ర సిగ్గే గోవింద
ముద్దులతో మొదలెట్టే సామిరంగా
కృష్ణా ముకుందా కొంగే జారిందా
కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా
చాల్లే సంబడం ఏంటీ ఆగడం
వెచ్చంగా వచ్చేయనా
ఊపొచ్చి ఊగించనా ఉఁ అంటే మోగించనా
నామోస్తూ నారాయణా తథాస్తు వాత్సాయనా

హే శ్రీరామచంద్ర సిగ్గే గోవింద
ముద్దుల్లో ముంచేస్తా సామిరంగా
కృష్ణా ముకుందా కొంగే జారిందా
కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా

తివురు తివురు తివురు తివురు తివురు
చివుకు చివుకు చివుకు చివుకు
చివుకు చివుకు చివుకు చివుకు తివురు గివురు

జింకనకన జింకనకన జింకనకన (2)

బాగున్నావే నా బంగరు బుజ్జి బందరు బజ్జి
అందరు మెచ్చే తింగరు బుజ్జి
బాగుంటావే ఆ చందనపట్టు చీరను కట్టు
కళ్ళకు కొంచం కాటుక పెట్టు
మెరిసిన అందమిలా తొందరగా తీసుకొచ్చాలే
సరే సరే వన్నెల జింగా
వెళ్లకు ఇంకా దూరం దూరంగా
తెరిచిన గ్రంథమిలా ఉంది నీతో చూడు భళారే
చర చర చక్కెర బిళ్ళా
తొక్కుడు బిళ్ళా పక్కకు రా మల్లా...

హే... ఉన్న ఫలంగా ఊపేయి ఘనంగా
కొత్తరకం కూత పెట్టి కెవ్వుమనంగా

హె హే శ్రీరామచంద్ర సిగ్గే గోవింద
ముద్దుల్లో ముంచేస్తా సామిరంగా
కృష్ణా ముకుందా కొంగే జారిందా
కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా

అయ్యోరామ  అయ్యోరామ  అయ్యోరామ (2)

చెయ్యేశాడే నను కౌగిన పట్టి మాటున పెట్టి 
సిగ్గులకేమో గొళ్లెం పెట్టి
చంపేశాడే అరె అత్తరు బుడ్డి పక్కన పెట్టి
లెక్కలు కట్టి మతిని చెడి
బలె బలె సోకు ఘని ఉంది అని విందుకొచ్చాలే
తకదిమి చీరల దొంగ తీర్చర బెంగ రారా సారంగా
తరగని ఒంటి పని కొంటె పని చేసుకుంటాలే
సరి సరి చప్పున వచ్చి చెక్కిలి గిచ్చి చుక్కలు చూపయ్య
హే... గాలిపటంలా మోకాలి ఘటంలా
భూగోళపటం గోలకట్టి ఘొల్లు మనంగా

శ్రీరామచంద్ర సిగ్గే గోవింద
ముద్దులతో మొదలెట్టే సామిరంగా
కృష్ణా ముకుందా కొంగే జారిందా
కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా
చాల్లే సంబడం ఏంటీ ఆగడం
వెచ్చంగా వచ్చేయనా
ఊపొచ్చి ఊగించనా ఉఁ అంటే మోగించనా
హె నామోస్తూ నారాయణా తథాస్తు వాత్సాయనా





ఆకు వక్క పాట సాహిత్యం

 
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: చక్రి, శ్రేయా ఘోషల్ 

ఆకు వక్క



నా గుండె కలమే అయితే పాట సాహిత్యం

 
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: పైడిపల్లి శ్రీనివాస్
గానం: శంకర్ మహదేవన్, కౌశల్య

నా గుండె కలమే అయితే
నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే
నా మనసే పువ్వే అయితే
నీ జడ్లో పూస్తాలే  పూస్తాలే పూస్తాలే
నా ఊపిరి రంగును చేసి
నా ఊహను కుంచగ మలచి
నా నవ్వుల వెన్నెల పైనే
నీ రూపు చిత్రాన్ని గిసేయనా
ఓ పడుచు సితార పలికెవితారా నా మనసార
ఓ నింగిని తారా చెంగున రావా నన్నే చేరా

నా గుండె కలమే అయితే
నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే

ఇన్నాళ్లు సోకు సిద్ధంగ పెంచా
నా లేత పరువం నీకోసముంచా
ఆ గండు సీమ పిలగెందుకోమా
కుట్టేసి పోతుంది
వరాల జింకా వలేసుకుంటా
కుచ్చిళ్ళు సోకు వడ్డించ మంటా
ఓ జీడి ముక్క నీ తీపి తిక్క
తీర్చేస్తా ఎంచక్కా
నొక్కి చూడవా ఈడు స్విచ్ ని
లేటు చేయక గోపాలా
దాచుకున్నది దోచలేనిది
సోకు లాకరు తీస్తాగా
నాలోన ఏముందేమో నాకంటే నీకే తెలుసు
ఏమంత్రమెసేవేమో
నా స్మైలు దోచావు నీ స్టయిలుతో

ఓ వెన్నెల ముక్క పగడపు ముక్క
తకదిమి ధిమి తక్కా
ఓ చక్కని చుక్క ముద్దుల లెక్క
తీర్చేయ్ చక చక్కా

నా గుండె కలమే అయితే
నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే

వేసేయ్ జోడీ రమ్మంది నాటీ
సయ్యంది పోటీ పువ్వాల తోటి
నీ కన్ను గీటి నా వెన్ను మీటి
చేసేయ్ రా లూటీ
నువ్వేమొ చెమ్మా నేనేమో అష్టా
లవ్వట లేద్దాం ఇవ్వాళ తిష్ట
నాజూకు బొమ్మా ఆటాడదామా
పెదాల హంగామా
సోకు అలారం మోగుతున్నది
సాకు చెప్పకు ఈ వేళా
ఓసి రుక్మిణి స్వీటు సింఫనీ
ఈడు ఎక్సరే తీస్తారా
చూడాలి వయసుల తీరం
తగ్గాలి తనువుల దూరం
తీరాలి తపనల భారం
చేసేయి ఈ ధాటి కాదంటానా
ఓ బాదం పిస్తా రావే కాస్తా
ముద్దులు మురిపిస్తా
నీ సోకులు కాస్తా నాకరువిస్తే
అమ్మో అనిపిస్తా...

నా గుండె కలమే అయితే
నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే
నా మనసే పువ్వే అయితే
నీ జడ్లో పూస్తాలే  పూస్తాలే పూస్తాలే
నా ఊపిరి రంగులు చేసి
నా ఊహలు కుంచగ మలచి
నా నవ్వుల వెన్నెల పైనే
నీ రూపు చిత్రాన్ని గిసేయనా
ఓ నింగిని తారా చెంగున రావా నన్నే చేరా
ఓ పడుచు సితార పలికెవితారా నా మనసార



లవ్వు దోమ కుట్టేసి చంపే పాట సాహిత్యం

 
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భువనచంద్ర
గానం: సుఖ్విందర్ సింగ్ ,  కౌశల్య

లవ్వు దోమ కుట్టేసి చంపే 



చిలకా చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ 
గానం: కుమార్ సాను, శ్రేయా ఘోషల్ 

చిలకా చిలకా 



గరం గరం పోరి పాట సాహిత్యం

 
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ 
గానం: చక్రి, కౌసల్య 

గరం గరం పోరి 

Palli Balakrishna Thursday, July 6, 2017

Most Recent

Default