చిత్రం: నేను (2004) సంగీతం: విద్యాసాగర్ నటీనటులు: అల్లరి నరేష్ , వేద దర్శకత్వం: ఇ. సత్తిబాబు నిర్మాత: ముళ్ళపూడి బ్రహ్మానందం విడుదల తేది: 15.04.2004
Songs List:
ఎందుకు ఎందుకు పాట సాహిత్యం
చిత్రం: నేను (2004) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: కార్తిక్ ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు దరికి రానీక నింగి శశిరేఖ పొదువుకోనీక వదులుకోనీక ఇంతగా చితిమంటలా నన్నంటుకోవాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు || పాలనవ్వుల రూపమా నను తాళనివ్వని తాపమా దారి చూపని దీపమా జత చేరనీయని శాపమా తళతళ తళతళ కత్తుల మెరుపై కళ్ళను పొడిచేలా తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా జంటగాని జంటలా నా వెంట నడవాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు || నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా సలసల మరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా ఎంత దగ్గర ఉన్నా దక్కని వరమాల నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||
నా కంటి పాప పాట సాహిత్యం
చిత్రం: నేను (2004) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: వేటూరి గానం:శ్రీవర్ధిని నా కంటి పాప
పన్నెండు దాటి పాట సాహిత్యం
చిత్రం: నేను (2004) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: భువనచంద్ర గానం: టిప్పు పన్నెండు దాటి
చూస్తూ చూస్తూనే పాట సాహిత్యం
చిత్రం: నేను (2004) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: సిరివెన్నెల గానం:కార్తిక్ చూస్తూ చూస్తూనే
దేవతలా నిను చూస్తున్నా పాట సాహిత్యం
చిత్రం: నేను (2004) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: వేటూరి గానం:హరీష్ రాఘవేంద్ర దేవతలా నిను చూస్తున్నా
దిక్కుల్నే దాటింది పాట సాహిత్యం
చిత్రం: నేను (2004) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: సిరివెన్నెల గానం:కార్తిక్ దిక్కుల్నే దాటింది
Nenu (2004)
Palli Balakrishna
Friday, February 15, 2019