Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chennai Love Story (2026)




చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: హరి చరణ్, శృతిక సముద్రాల
నటీనటులు: కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ
దర్శకత్వం: రవి నంబూరి
నిర్మాత: SKN 
విడుదల తేదీ: 2026



Songs List:



గురుతుందా.. గురుతుందా..పాట సాహిత్యం

 
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: హరి చరణ్, శృతిక సముద్రాల

గురుతుందా.. గురుతుందా..
నువ్వు తడిచిన తొలి వర్షం
అది వెలిసిన తరువాతా.. ఆగిందా ఆకాశం

గురుతుందా.. గురుతుందా..
వెలిగించిన తొలి దీపం
అది ఆరిన తరువాతా.. మసకైందా ఈలోకం

జల్లులో హాయిని చూడాలంతే
వెలుగులో అందం చూడాలంతే
అది తొలిదా.. మలిదా.. నీకెందుకే

తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ

వెనకకి చూసుకుంటూ నీ పయనమలా
ముందుకైతే సాగలేదు దారి బాగున్నా
వెనకటి జ్ణాపకంతో నీ ప్రాణమిలా
కొత్త హాయి పంచలేదు వేడుకల్లో ఉన్నా

పోవాలే పాత నీరూ తూలే కళ్లల్లో
పొంగాలే పాటలేరూ నీ గొంతుకలో

తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ

మనసును మార్చుకుంటే ఏం నేరమనీ
నేరుగానే నేడు నాకు ప్రశ్నవేశాడే
గతములు తవ్వుకుంటే ఏం లాభమనీ
రేపు వైపు చూపు నేర్పి ఆశలందించాడే

లోలోతుల్లోకి వెళ్లీ ఆలోచిస్తున్నా
నాలోంచి నన్ను మళ్లీ బయటకి తేనా

తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ

Palli Balakrishna Saturday, April 4, 2026
Garividi Lakshmi (2026)





చిత్రం: గరివిడి లక్ష్మి (2025)
సంగీతం: చరణ్ అర్జున్ 
నటీనటులు: ఆనంది, రాగ్ మయూర్ 
నిర్మాతలు: T.G. విశ్వ ప్రసాద్, టి.జి. కృతి ప్రసాద్ 
దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము
విడుదల తేది: 09.01.2026



Songs List:



నా నల్ల జిలకర మొగ్గ పాట సాహిత్యం

 
చిత్రం: గరివిడి లక్ష్మి (2025)
సంగీతం: చరణ్ అర్జున్ 
పాట మూలం : ఉత్తరాంధ్ర జనపదాలు 
అదనపు సాహిత్యం: జానకిరామ్ 
గాయకులు: అనన్య భట్, జానకిరామ్,  గౌరీ నాయుడు జమ్ము 

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?

నా రూపు రేఖ సల్లగుంటే..
అ.. ఎలగా ?
మావ.. నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
రూపాయి పువ్వులెందుకు

ఆహా !
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
రూపాయి పువ్వులెందుకు
అవును

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?
అవును అవును
రూపాయి కావాలా
ఆహా !
రూపాయి పువ్వులు కావాలా ?

నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
నాకు పువ్వులెందుకు

ఓహో
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
నాకు పువ్వులెందుకు
అవునా

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ

పావలా కావాలా ?
పావలా సిల్లర కావాలా ?
పావలా కావాలా ?
పావలా సిల్లర కావాలా ?

నా పాదాలు సల్లగుంటే…
ఆ.. ఏటి సల్లగుంతే..

నా పాదాలు సల్లగుంటే
పావలెందుకు నాయినా సిల్లరెందుకు
అయ్యా నా పాదాలు సల్లగుంటే
పావలెందుకు నాయినా సిల్లరెందుకు

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
సిరలు కావాలా?
సిల్కు సిరలు కావాలా ?
సిరలు కావాలా?
సిల్కు సిరలు కావాలా ?

సిరిగల నీ ముఖము జూస్తే సిరలేందుకు
మావ.. సారెలెందుకు
ఆహా!
సిరిగల నీ ముఖము జూస్తే సిరలేందుకు
మావ.. సారెలెందుకు
అదే

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నా నల్ల జిలకర మొగ్గ నా నల్ల జిలకర మొగ్గ
నా నల్ల జిలకర మొగ్గ….



కోసింది కొయిగూర పాట సాహిత్యం

 
చిత్రం: గరివిడి లక్ష్మి (2025)
సంగీతం: చరణ్ అర్జున్ 
పాట మూలం : ఉత్తరాంధ్ర జనపదాలు 
గాయకులు: అనన్య భట్, షకలక శంకర్ ,  గౌరీ నాయుడు జమ్ము 


కోసింది కొయిగూర 

Palli Balakrishna
The Paradise (2026)




చిత్రం: The Paradise (2026)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ 
నటినటులు: నాని , సోనాలి కులకర్ణి 
దర్శకత్వం: 
నిర్మాత: 
విడుదల తేది: 2026



Songs List:



ఆయా షేర్ పాట సాహిత్యం

 
చిత్రం: The Paradise (2026)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ 
సాహిత్యం: కాసర్ల శ్యాం 
గానం: అద్దుల జంగి రెడ్డి , అర్జున్ క్యాండీ 

హే నీ అయ్య జాగీరా
చల్ మావాడొచ్చిండ్రా
ఇగ జడ్తియ్యాలే జుంబలికే ఆయా షేర్

హే యే దార్ కా సుల్తానే
మా ఘర్ కా సైతానే
చల్ షికార్ జెయ్యా జుంబలికే ఆయా షేర్

పచ్చ బొట్టు గాయమిది ఆయా షేర్
గుంజుకునే న్యాయమిది ఆయా షేర్
బూడిదల గడ్డ ఇది ఆయా షేర్
మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్

జడలురో జడలురో హడలురో ధడలురో
కొడుతారో తొడలురో తీస్తారో తోలురో

సవారికి దొరుకు బిడ్డా
సేవాలే లేస్తాయి బిడ్డా
పెగుల్ దీసి మెడలో యేసి
ఆడుతాం బిడ్డా ఆడుతాం బిడ్డా

ఆడ ఈడ యెడ జూడు బిడ్డా
వణుకే పుట్టలింక పడితేనే నా నీడా
బొంద పెట్టుత మాలిక్నైనా గూడా
వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా

చల్ ఉడుకుతుంది సారా
బట్టిలో మా కంట తడే
జుంబలికే ఆయా ఆయా షేర్

ఇగ రాలుతాది బొట్టు
బొట్టులో నీ పంచె తడే
జుంబలికే ఆయా ఆయా షేర్

జడలురో జడలురో హడలురో ధడలురో
కొడుతారో తొడలురో తీస్తారో తోలురో

సవారికి దొరుకు బిడ్డా
సేవాలే లేస్తాయి బిడ్డా
పెగుల్ దీసి మెడలో యేసి
ఆడుతాం బిడ్డా ఆడుతాం బిడ్డా

హే బరి బత్తలునొన్నిన్రా
బర్ బాధే అయినొన్రా
నన్ను పీకుతావా జుంబలికే ఆయా షేర్

హే మొల్దారం లేనోన్రా
నీ కన్నా మొండోడ్రా
ఇగ పీకుతావా జుంబలికాకే ఆయా షేర్

పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్
మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్
పేరు పతా లేనొన్నిరా ఆయా షేర్
చూస్కో పరడైస్ కే అడ్రస్ ఐతా ఆయా షేర్

పొట్టు పొట్టు ఆకలుంది
మెట్టు మెట్టు ఎక్కుతారా
పేరు పతా లేనొన్నిరా
చూస్కో పరడైస్ కే అడ్రస్ ఐతా

Palli Balakrishna
Ranabaali (2026)




చిత్రం: రణబలి (2026)
సంగీతం: అజయ్ అతుల్ 
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక 
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్ 
నిర్మాత: 
విడుదల తేది: 2026 



Songs List:



ఏందయ్యా సామి పాట సాహిత్యం

 
చిత్రం: రణబలి (2026)
సంగీతం: అజయ్ అతుల్ 
సాహిత్యం:రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్వేతా మోహన్ అజయ్ గంగవాలె 

ఏందయ్యా సామి
ఇట్ట గాస్తాంది ఎన్నెల
ఊపేస్తా ఉంది
సిత్తరాల ఉయ్యాలా

వీచేగాలికి
అత్తరద్దిందెవ్వరో
మారే జాముకి
మందు పెట్టిందెవ్వరో
మాయదారి మనస్సాగాక
జాగరమయ్యారా

తడిసిపోయారా
తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో
ఒళ్లు మరిసిపోయారా

తడిసిపోయారా
తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో
ఒళ్లు మరిసిపోయారా

Palli Balakrishna
Band Melam (2026)




చిత్రం: బ్యాండ్ మేళం (2026)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
నటీనటులు: హర్ష రోహన్, శ్రీదేవి సాయి 
దర్శకత్వం: సతీష్ జవ్వాజి 
నిర్మాత: కోన వెంకట్ 
విడుదల తేది: 26.03.2026



Songs List:



తిప్పుకుంటన్నావ్.. పాట సాహిత్యం

 
చిత్రం: బ్యాండ్ మేళం (2026)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: చంద్రబోసు 
గానం: అతిధి భావరాజు, రాము రాథోడ్ 

బెల్లం చుట్టూ ఈగ లెక్క
మంచం చుట్టూ దోమ లెక్క
బెల్లం చుట్టూ ఈగ లెక్క
మంచం చుట్టూ దోమ లెక్క

గుడి చుట్టూ భక్తుని లెక్క
బారు చుట్టూ తాగుబోతు లెక్క

తిప్పుకుంటన్నావ్.. తిప్పుకుంటన్నావ్..
నన్నే నీ చుట్టూ తిప్పుకుంటన్నావ్
యాహే.. తిప్పుకుంటన్నావ్.. తిప్పుకుంటన్నావ్..
నన్నే నీ సుట్టు తిప్పు తిప్పేసుకుంటన్నావ్

పచ్చని లంగా చుట్టి
ఎర్ర ఎర్రని ఊని ఏసి
చెవులకు కమ్మలు పెట్టి
అరే కాళ్లకు పట్టీలు కట్టి

పచ్చని లంగా చుట్టి
ఎర్ర ఎర్రని ఊని ఏసి
చెవులకు కమ్మలు పెట్టి
అరే కాళ్లకు పట్టీలు కట్టి

అరే కొబ్బరి కాయ బుట్ట పట్టుకుని
కోవెలకే నువ్వు పోతూ
నా తలకాయలో గత్తర లేపి
గబరా నన్నే చేస్తూ

సూర్యుని చుట్టూ భూమి లెక్క
పైసల చుట్టూ మనుషులు లెక్క

తిప్పు అరే తిప్పు అబ్బా తిప్పుకుంటన్నావ్
తిప్పు తిప్పుకుంటన్నావ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పుకుంటన్నావ్
అరే తిప్పుకుంటన్నావ్, తిప్పుకుంటన్నావ్
నన్నే నీ ఎనక తిప్పు తిప్పు తిప్పేసుకుంటన్నావ్

కళ్లెగరేస్తుంటావ్
ఎంటలో పల్లె నూరుతుంటావ్
అల్లరి చేస్తూ ఉంటావ్
అంతలో చల్లని మాటలు చెబుతావ్

కళ్లెగరేస్తుంటావ్
ఇంటలో పల్లె నూరుతుంటావ్
అల్లరి చేస్తుంటావ్
అంతలో చల్లని మాటలు చెబుతావ్

అందరి కంటే చిన్న మోల్లిలా
అలిగి నువ్వు కూర్చుంటావ్
సందే దొరికితే పెద్ద మనిషిలా
పెట్టనమే చేస్తుంటావ్

ఎన్నో ఎన్నో వేషాలేసి
దీపం చుట్టూ పురుగులు చేసి
తిప్పు.. ఏమి తిప్పున్నావే..

తిప్పుకుంటన్నావ్.. తిప్పుకుంటన్నావ్..
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పుకుంటన్నావ్
తిప్పుకుంటన్నావ్
నన్నే నీ ఎనక తిప్పు తిప్పు తిప్పేసుకుంటన్నావ్

కోడి చుట్టూ గద్ద లెక్క
చంద్రున్ని పట్టిన గ్రహణం లెక్క
ఓయ్! కోడి చుట్టూ గద్ద లెక్క
చంద్రున్ని పట్టిన గ్రహణం లెక్క

పంటల్లో తెగులు లెక్క
తగులోకోకు నువ్ నా ఎనక

ఇడిసి పెట్టేసేయ్, ఇడిసి పెట్టేసేయ్
నా వెంట పడకా
ఇడిసి ఇడిసి ఇడిసి పెట్టేసేయ్

ఇడిసి పెట్టేసేయ్, ఇడిసి పెట్టేసేయ్
నన్నే నా మానాన
ఇడిసి పెడితే పోతానోయ్




రాజమ్మ ఇడిసిపోయిందిరో పాట సాహిత్యం

 
చిత్రం: బ్యాండ్ మేళం (2026)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: చంద్రబోసు 
గానం: రామ్ మిరియాల 

రాజమ్మ ఇడిసిపోయిందిరో
రాజమ్మ ఇడిసిపోయిందిరో
నన్నింక మార్చిపోయిందిరో
నా గుండె ఇదిసిపోయిందిరో

అవ్వయ్యని పని పాటని పక్కన పెట్టి
పక్కన ఉంటె
కేరు చేయక నన్నే దేఖక పోయే రాజమ్మ
అరె పోయే రాజమ్మ

అమ్మో రాజమ్మ ఇడిసిపోయిందిరో
వ్మ్మో రాజమ్మ ఇడిసిపోయిందిరో

గంగలోపాల కాప పిల్లోల్
ప్రేమలో నేను గంటులెత్తుంటే
గట్టు మీదకి సిరిగొట్టి
పోయే రాజమ్మా పోయే రాజమ్మా

అమ్మో రాజమ్మ ఇడిసిపోయిందిరో
వామ్మో రాజమ్మ పొడిసిపోయిందిరో

దెబ్బలు తిన్నా దిల్దారు నేను
అందరి కన్నా చీకటి నేను
ఈసంతియీ ఎన్నో చూసిన నేను
ఫీకరే చేయ విసమెట్టు



పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే పాట సాహిత్యం

 
చిత్రం: బ్యాండ్ మేళం (2026)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: చంద్రబోసు 
గానం: స్వేతమోహన్ 

గల గల పాటలు పాడిన గాలులతోటి మీ పోటీ
బీర బీర పొంగిన వాగులు వంకలు రావు మీ సాటి
దారిలో ఊరిలో అంతటా మీరే
తారలో పైరులో ఉంది మీ తీరే
ఎప్పటికి ఇరువురు ఒక్కరే
అరె ఎన్నటికీ ఎవరికి వినరే

పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే
భూమికే సంబరం మీరు నేర్పరే
ప్రేమకే సంతకం మీరు అయ్యారే

పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే

గొడవ జరిగి అలక పెరిగి
కలిసి మెలిసి పోతారే
తగువు ముదిరి కలత కలిగి
ఒకరికొకరై ఒదిగారే
కారంగా కసురుతున్...




ఎక్కడి దొంగలు అక్కడే పాట సాహిత్యం

 
చిత్రం: బ్యాండ్ మేళం (2026)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: కసర్ల శ్యాం 
గానం: మంగ్లీ

ఎక్కడి దొంగలు అక్కడే 

Palli Balakrishna

Most Recent

Default