పాట: శెనిగచెన్ల నిలబడి చేతులీయవే సంగీతం: వెంకట్ అజ్మీర రచన: అవర్దుతి లక్ష్మన్ అన్న గానం: అశ్విని, జోగుల వెంకటేష్ ఆర్టిస్ట్స్: జానులిరి, రాజేష్ కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ ప్రొడ్యూసర్: సంతోష్ యాదవ్ రికార్డింగ్ లేబుల్:: E96TV FOLK విడుదల: 14.05.2024
శెనిగచెన్ల నిలబడి చేతులీయవే పాట సాహిత్యం
పాట: శెనిగచెన్ల నిలబడి చేతులీయవే సంగీతం: వెంకట్ అజ్మీర రచన: అవర్దుతి లక్ష్మన్ అన్న గానం: అశ్విని, జోగుల వెంకటేష్ ఆర్టిస్ట్స్: జానులిరి, రాజేష్ కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ ప్రొడ్యూసర్: సంతోష్ యాదవ్ రికార్డింగ్ లేబుల్:: E96TV FOLK విడుదల: 14.05.2024 అరె శెనిగచెన్ల నిలబడి చేతులీయవే సెందురాల తు బాల చేతులీయవే సెందురాల తు బాల సేతులియ్య నీతో నాకు సెల్లెళ్ళున్నర్రో మాయ దారి మల్లేష సెల్లెళ్ళున్నర్రో మాయ దారి మల్లేష అరె బంతితోట్లో నిలవడి బాసలాడవే సెందురాల తు బాల బాసలాడవే సెందురాల తు బాల బాసలాడ నీతో నాకు బావళ్ళున్నర్రో మాయ దారి మల్లేష బావళ్ళున్నర్రో మాయ దారి మల్లేష నా అరటితోట్లో కలుసుకొని ఆటలాడవే సెందురాల తు బాల ఆటలాడవే సెందురాల తు బాల ఆటలాడ నీతో నాకు అక్కలున్నర్రో మాయ దారి మల్లేష అక్కలున్నర్రో మాయ దారి మల్లేష ఎయ్ పత్తిచెన్ల పక్కకొచ్చి పలకరియ్యావే సెందురాల తు బాల పలకరియ్యావే సెందురాల తు బాల పలకరియ్య నీతో నాకు పాలేళ్ళున్నార్రో మాయ దారి మల్లేష పాలేళ్ళున్నార్రో మాయ దారి మల్లేష అరె కందిచెన్ల నిలవడి కన్నుకొట్టవే సెందురాల తు బాల చేయ్యివట్టవే సెందురాల తు బాల కన్నుకొట్ట నీకు నాకు వరస కాదురో మాయ దారి మల్లేష వరస కాదురో మాయ దారి మల్లేష మిరపతోట్లో నిలవడి మాటలియ్యవే సెందురాల తు బాల మాటలియ్యవే సెందురాల తు బాల మాటలియ్య నీతో నాకు మామలున్నర్రో మాయ దారి మల్లేష మామలున్నర్రో మాయ దారి మల్లేష అబ్బబ్బ మక్కచెన్ల మంచ మీద సరసమాడవే సెందురాల తు బాల సరసమాడవే సెందురాల తు బాల సరసమాడ నువ్వు నాకు బావ కాదురో మాయ దారి మల్లేష బావ కాదురో మాయ దారి మల్లేష నువ్వు నిమ్మతొట్లో నిలవడి నిజం చెప్తనే సెందురాల తు బాల నిజం చెప్తనే సెందురాల తు బాల నిజం చెప్తే నిన్ను నేను నమ్మలేనురో మాయ దారి మల్లేష నమ్మలేనురో మాయ దారి మల్లేష వట్టి మాటలు కాదె పిల్ల మనువాడుతనే సెందురాల తు బాల మనువాడుతునే సెందురాల తు బాల మనువాడుతనంటే నేను నీతో వస్తారో మాయ దారి మల్లేష నీతో వస్తారో నా బావ మల్లేష చలో ఏడడుగులు యేసి మనం కలిసి ఉందమే సెందురాల తు బాల కలిసి ఉందమే సెందురాల తు బాల నీ మాట నేను వింటా నీతో ఉంటానోయ్ మాయ దారి మల్లేష నీతో ఉంటానోయ్ నా బావ మల్లేష అరె నిన్నేలువట్టుకుంటా ఇడిసివుండెనే సెందురాల తు బాల ఇడిసివుండెనే సెందురాల తు బాల..
No comments
Post a Comment