Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Devudamma (1973)
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చలం, జయలలిత, రామకృష్ణ, లక్ష్మీ 
దర్శకత్వం: కె.వి.నందనరావు
నిర్మాత: చలం 
విడుదల తేది: 15.06.1973Songs List:ఎక్కడో దూరాన కూర్చున్నావు పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు 

పల్లవి: 
ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడీ చేస్తున్నావు
తమాష చూస్తున్నావు

చరణం: 1
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము కాని
తరుగుతుంది ఆయువనీ తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా మా
కళ్ళమీద మాయతెరలు కప్పేస్తావు 

చరణం: 2
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు మమ్ము
తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా స్వంతమని అనిపిస్తావు
అది మూడునాళ్ళ ముచ్చటగా చేసేస్తావుతల్లీ తండ్రీ నీవే పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు & కోరస్ 

తల్లీ తండ్రీ నీవే ఓరి నరిసింహా
మా తోడూనీడా నీవే ఓరోరి నరిసింహా !
అహ నమ్మినవాళ్ళని కాచేవాడా
ముల్లోకాలను ఏలువాడా

అంతర్వేదిని వెలిసితివయ్యా లక్ష్మీ నరిసింహా
లక్ష్మీ నరసింహా
అహోబిలంలో ఉన్నావయ్యా ఉగ్రనరసింహా
ఉగ్రనరిసింహా
సింహాచలమున కులికితివయ్యా వరాహనరసింహా
వరాహనరిసింహా
తిరుపతిగిరిపై వెలిగితినయ్యా యోగనరిసింహా
యోగనరసింహా
ఊరేదైనా
అవునూ
పేరేదైనా
అవునవునూ
ఊరేదైనా పేరేదైనా అన్నీనీవే మా నరిసింహా

హారి హరీల్లోరంగా‌ - హరి
హరిలోరంగా - హరి
తారకనామా - హారి
వైకుంఠధామా - హారి
నరిసింహసామీ - హారి
హరిలో రంగా -హారి
హరిల్లోరంగా - హారి
హరిల్లోరంగా - హరి
హరిల్లోరంగా - హరి

ప్రహ్లాదుడు నినుపిలిచినవెంటనే పరుగునవచ్చావూ
పరుగునవచ్చావూ
హిరణ్యకశిపుని గుండెలు చీల్చీ నెత్తురుతాగావూ
నెత్తురు తాగావు
అహ వన్నెలచిన్నెల చెంచులక్ష్మిని వలచి వరించావూ
వలచి వరించావు.
నిన్నే నమ్మిన జనాలకోసం గుడిలో నిలిచావు
ఈ గుడిలో నిలిచావు
నిండుగనీపూ
అవునూ
మా గుండెలలోనా
అవునవునూ
నిండుగ నీపూ గుండెలలోనా ఉండాలయ్యా ఓ నరిసింహా

హారి హరిల్లోరంగా - హారి
తారకనామా - హరి
కవైుంఠధామా -హారి
నరిసింహస్వామి - హారి

హరిలోరంగా - హారి
హరిలో రంగా -హారి
హరిల్లోరంగా - హారి
హరిలోరంగా - హారి .....
శ్రీమద్రమారమణ గోవిందోహారి
హారి
చిన్నారిచెల్లీ నా బంగారు తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, మోహనరాజు, పి.సుశీల 

చిన్నారిచెల్లీ నా బంగారు తల్లి
నీవేనమ్మ మా ప్రాణము
ఈ యింటి సిరిమల్లివే నీవు నేడు
ఏ యింటి జాబిల్లి వౌతావో రేపు
పల్లకిలో సాగి చల్లగ వూరేగి
పల్లకిలో సాగి చల్లగ వూరేగి

పచ్చగ నూరేళ్ళు బ్రతకాలి చెల్లీ
బ్రతకాలి చెల్లీ 
ఈ పూట వెలిగే మతాబాలకన్నా
నీ పాల నవ్వుల దీపాలె మిన్నా
ఈ యింట వున్నా మరే యింట వున్నా
నీవున్న ఆ యింట దీపావళీ

దీపావళీ నిత్యదీపావళీ
దీపావళీ నిత్యదీపావళీ

ఏ పూర్వజన్మల పుణ్యాల ఫలమో
ఈ జన్మలో నేను మీ చెల్లి నయ్యాను
ఏ చోట వున్నా ఇదే మాట అన్నా.
మీ పేరు నా పేరు నిలిపేనన్నా.... నిలిపేనన్నా

ఆడపిల్లలా సిగ్గుపడే పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల , యస్.పి.బాలు 

ఆడపిల్లలా సిగ్గుపడే వీడెవడమ్మా
బస్తీ ఎరుగని బైతులాగ వున్నాడమ్మా
ఎవడమ్మా ? వీడు ఎవడమ్మా 
మొద్దమ్మా చవటాదద్దమ్మా !
కొంగలా నుంచున్నాడు.
దొంగలా పొంచున్నాడు.
చక్కనీ చుక్కలు చూసి చెమటలు పోసి
ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు
అయ్యయ్యో పాపం పసివాడు.
అమ్మమ్మో ! చేతికి చిక్కాడు.

లాగులో బొందును చూడు
మెడలోని బిళ్ళని చూడు
జూలోకి పనికొస్తాడు
రాతియుగానికి చెందినవాడు
అయ్యయ్యో పాపం పసివాడు
అమ్మమ్మో చేతికి చిక్కాడు

ఏయ్....
రంగులా లుంగికట్టి
బిగురుగా పంట్లాం వేసీ
బొత్తిగా సిగ్గూ బిడియం వదిలేశారు
దేశం పరువూ తీస్తున్నారు.

అయ్యయ్యో ఎంతో అవమానం
అబ్బొబ్బో ఇదేనా నాగరికం.
ఆడపిల్లలా సిగ్గుపడేది ఎవరమ్మా ?
మీ మగరాయుళ్ళకి తగినశాస్తి చేస్తానమ్మా
ఏవమ్మో కాస్తా తగ్గమ్మా
తలపొగరూ మీకు తగదమ్మా

పీతలా నడకలు చాలు
కోతిలా గెంతులు చాలు
కన్నెలకు సిగ్గే ముద్దు తెగబడవద్ధు
ఏ పనికైనా వున్నది హద్దు
తెలిసిందా ? తలకూ ఎక్కిందా?
లేకుంటే మీ పని గోవిందా .... గోవిందా
హేయ్ ఆగు జరాజరా పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, వసంత 

హేయ్ ఆగు జరాజరా నర్సమ్మా 
చూడూ ఇలా ఇలా మిస్సమ్మా
అహ ఏమిరంగు నీది అహ ఏమి పొంగు నీది
నిను తేరిపార చూస్తే తల తిరుగుతుంది గిరాగిరా!

ఏండా? సోంబేరీ ఎన్నా నెనిచికినే మనసిలే
గలాటా పండ్రే పోడా ఫో 
నువ్వు కాదన్నా నీ వెంటపడతా
మరో జన్మకైన నీమొగుడ్ని అవుతా
అహ తాళికట్టివేస్తా అహ తలంబ్రాలు పోస్తా
ఆ బ్రహ్మరాతనై నా తిరగేసిరాసి పారేస్తా

నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళుమంట
ఎప్పు డొదులుతుందో ఈ పాడుతుంట
అయ్యోడా ఏమ్మా మీరుకూడా మొదలు పెట్తిరా
కర్మం కర్మం
నీ కర్మం కాదురా నా ఖర్మ
నీ కోపమేమొ ఎండ
నీ కులుకు పూలదండ
నీవు గల్లీలో వున్నా
నా కదే గోలకొండ

చిల్లి గవ్వకైన కొరగావు పోవోయ్
చాలు కాకిగోల నోరు మూసుకోవోయ్
నిరు పేదవాడ్ని గాని నీ పాదుషానే రాణి
నువ్వు బ్రతికివుండగానే మరో తాజ్మహల్ కట్టిస్తా
మేరీ
అయామ్ సారీ
మేరీ
అయామ్ సారీ
తాగాలి రమ్ మనమందరమ్ పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

పల్లవి: 
తాగాలి రమ్ మనమందరమ్
మనకొద్ధు ఈ లోకం మనమిద్దరం ఏకం
ఎక్కాలిరా మైకం
గరం గరం గరం గరం ఏయ్

చరణం: 1
కన్నుల్లో కైపుంది
పెదవుల్లో మధువుంది
మన సైతే చెలరేగి
మజా చెయ్యరా !
చల్లనీ వేళలో, వెచ్చనీ, కౌగిలీ ఇవ్వరా

చరణం: 2
నీ చేయీ తగిలింది
నా మేనూ పొంగింది
నీ చూపులో ఏదో నిషా వున్నది
మత్తులో ముంచరా గమ్మత్తులో తేల్చరా
హాయిగా
తాగాలి రమ్ మనమందరమ్.నీ మాటంటే నాకూ అదే వేదమూ.. పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
నీ మాటంటే నాకూ అదే వేదమూ.. 
నీ తోడుంటే చాలూ అదే లోకమూ
నీ మాటంటే నాకూ అదే వేదమూ..  
నీ తోడుంటే చాలూ అదే లోకమూ
ఓహొ హొ హొ హొ హొ...  
లాలా లాలా లాలాలా లా లా

చరణం: 1 
పెడదారిలోనా పడిపోవు వేళా..   
రహదారి నీవే చూపావూ
పెడదారిలోనా పడిపోవు వేళా.. 
రహదారి నీవే చూపావూ
నీ అడుగులలో నడిచేనూ..  
నీలో నేనూ నిలిచేనూ

నీ మాటంటే నాకూ అదే వేదమూ.. 
నీ తోడుంటే చాలూ అదే లోకమూ
మ్‌హు ఊ ఊ ఊ ఊ.. అహా అహా హా హా హా

చరణం: 2 
నా జీవితానా తొలిపూల వానా.. 
కురిపించే నేడూ నీ నవ్వులే
బడివైన నీవే . . గుడివైన నీవే.. 
గురువూ దైవం నీవేలే
తరగని కలిమీ మన స్నేహం..  
నీదీ నాదీ ఒక ప్రాణం

నీ మాటంటే నాకూ అదే వేదమూ.. 
నీ తోడుంటే చాలూ అదే లోకమూ
మ్‌హు ఊ ఊ ఊ ఊ.. మ్‌హు ఊ ఊ ఊ ఊ..
మ్‌హు ఊ ఊ ఊ ఊ..  మ్‌హు ఊ ఊ ఊ ఊ
ఉన్నావా నువు లేవా? పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి. బాలు

ఉన్నావా నువు లేవా?
ఉంటే దిగి రాలేవా ?
మా గోడు వినీ
నాకెందు కనీ
నిదురించావా దేవుడా!
దేవుడా! దేవుడా | దేవుడా

చరణం: 1
కంటిపాపలా చూసిన చెలి ని
కంటికి దూరంచేశావే
నువ్వే దిక్కని నమ్మిన నన్నూ
నిలువున గొంతుక కోశావే

డైలాగ్స్:
నరిసింహా
ఆపద్బాంధవుడవంటారే
పిలిసే పలుకుతావంటారే
గుండె రగిలి
గొంతు పగిలి
కుమిలి కుమిలి ఏడుస్తుంటే
ఎక్కడున్నావురా?
ఏంచేస్తున్నావురా?

చరణం: 2
అన్నెం పున్నెం ఎరుగనివారిని
అగాధాలలో తోశావే
మంచిని వంచన కబళిస్తుంటే
కళ్ళు మూసుకుని ఉన్నా వే!

డైలాగ్స్:
నరిసింహా !
ఇంతేనా నీ దైవత్వం, ఇదేనా నీ మహాత్యం
నిన్ను తలుచుకోవడమే నేరమా?
నిన్ను కొలుచుకోవడమే పాపమా?
నువురావా ? నువులేవా? నరిసింహా?

No comments

Most Recent

Default