Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Shaakuntalam (2023)




చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: దేవ్ మోహన్, సమంతా, అనన్య నగాళ్ళ, అల్లు అర్హ
దర్శకత్వం: గుణశేఖర్ 
నిర్మాత: నీలం గుణ 
విడుదల తేది: 14.04.2023



Songs List:



మల్లికా మల్లికా పాట సాహిత్యం

 
చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీమణి 
గానం: అర్మాన్ మాలిక్ , శ్రేయా ఘోషల్ 

మల్లికా మల్లికా మాలతీ మాలికా
చూడవా చూడవా ఏడి నా ఏలికా
మల్లికా మల్లికా మాలతి మాలికా
చూడవా చూడవా ఏడి నా ఏలిక

హంసికా హంసికా జాగునే సేయకా
పోయిరా పోయిరా రాజుతో రా ఇక
అతనికో కానుక ఈయనా నేనిక
వలపుకే నేడొక వేడుకే కాగా

మహ నీలవేణి పూచే పూల ఆమని
రాజే చెంత చేరా రాజ్యాన్నేలు మా రాణి
మునుల ఘనుల మన వనసీమ
మరుని శరము పరమా
మధుర సుధల సుమమా ఆ ఆ
మనసు నిలుపతరమా

స్వప్నికా చైత్రికా
నా ప్రియ నేత్రికా
చూడవా చూడవా
ఏడి నా ఏలికా

సాగుమా మేఘమా మేఘమా
సాగుమా మేఘమా స్వామినే చేరుమా
వానలే వీణలై మా కథే పాడుమా
నీ చెలీ నెచ్చెలీ చూలు దాల్చిందని
శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా

మిల మిలా మెరిసెలే శారదాకాశమే
వెలవెలా వెన్నెలై వేగే మా ప్రేమే
తార తోరణాలై తీర్చే నింగి దారులే
నేలే పాలపుంతై నింపే ప్రేమ దీపాలే

మరుల విరుల రసఝరి లోనా
మనసు తడిసె లలనా
అమల కమల నయనా
తెలిసె హృదయ తపనా

ఆకులో ఆకునై ఆశ్రమ వాసివై
ఆశగా చూడనా ఆతని రాకకై

ఓ చెలి ఓ చెలీ ఎందుకే ఈ చలి
భూతలం నా మది శీతలం అయినది
మంచులే ముంచిన ఎంత వేధించినా
ఆతని అంశనే వెచ్చగా దాచని
శిశిరమే ఆశలా ఆకులే రాల్చిన
చిగురులే వేయగా చైత్రమే కానా

హేమంతాలు ఏలా సీమంతాల వేళలో
చిందే ఏలా బాల వాసంతలే నీలోనా
నెలలు గడచినవి నెలబాల
కదలి కడలి అలలా
అమర విమల సుమమా
సుగుణ మణిని కనుమా

కన్నులే వేచేలే కాయలే కాచేలే
ఆశగా చూడగా ఆతని రాకకై




ఋషివనంలోనా పాట సాహిత్యం

 
చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీమణి 
గానం: చిన్మయి శ్రీపాద, సిద్ శ్రీరామ్

ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్నివర్షం
ప్రణయకావ్యానా ప్రథమ పర్వంలా
మనువు కార్యానా వనము సాక్ష్యంలా

స్వయంవరమేది జరుగలేదే
స్వయంగా తానే వలచినాడు
చెఱుకు శరమే విసిరినాడే
చిగురు ఎదనే గెలిచినాడే

ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్నివర్షం

వనములో నేను పూలకోసమే అలా
వలపు విరిసింది నిన్ను చూసిలా
అడవిలో నేను వేటగాడినై ఇలా
వరుడు వేటాడినాడు నన్నిలా

చుక్కల్ కొక చిలుకలే అలిగే
చుక్కందాలు మావని
కత్తుల్ తోటి తుమ్మేదే దూకే
పువ్వుల్ తేనె తమదని
చిక్కెన్ గాంత దక్కేనని నాకే
చక్కంగానే తగవులాడే
నీవే నాతో రా

స్వయంవరమేది జరుగలేదే
స్వయంగా తానే వలిచినాడే

కలల సిరి వాగు ఆన దాటి ఏరులా
విధిగా జేరాలి సాగరాన్నిలా
మాలిని తీర లాలనింకా చాలిక
కొమ్మలను దాటి రావే కోకిలా

ఎల్లల్లేని యవ్వనవలోకం
మనకై వేచి ఉందిగా
కల్లల్ లేని కొత్త నవనీతం
మననే స్వాగతించగా
అడవిన్ గాయు వెన్నెలా రావే
రాజ్యాన్నేలు రాణివై నీవే
నీవే నేనై రా ఆ ఆఆ ఆ

ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్ని వర్షం



ఏలేలో ఏలేలో పాట సాహిత్యం

 
చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఏటిలోన సాగే నావా
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దూరాలేవో చేరే తోవా

సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా
ఓ ఓ ఓ ఓ దాయి

సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా
సారే పట్టుకొచ్చిందే సందమామ
చెలికాని గూడే సేరగా

అమ్మే తాను అయ్యే వేళ
అందాలే సిందే బాలా
తన మారాజైనోడే పూజే సేసేడో
ముని గారాలమ్మ సెయ్యే పట్టేడా
తన పేనాలన్నీ తానే అయ్యేడా

ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఓరకంట సూసినావ
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దోర సిగ్గై నవ్వినావా

రాజే తానై రాజ్యాలేలేటోడు
నిను సూడంగానే బంటై ఉంటాడు హో ఓఓ
రాణిలాగ నిన్నే సూసేటోడు
నువు సేరంగానే దాసుడౌతాడు ఓ ఓ

మేళాలెన్నో తెచ్చి తను దరువే వేసీ
మేనాలెన్నో తెచ్చి నిను అతనే మోసి
పూలేజల్లి దేవేరల్లే ఊరేగిత్తాడే
ఇలలోనే ఉన్న మేనక నువ్వమ్మా
ఎనలేని గొప్ప కానుక నువ్వమ్మా

ఏలేలో ఏలేలో ఏలో యాలా
సంతోషంగా సాగే నావ
ఉయ్యాలై జంపాలై ఊగే నావ
ఊహల్లోన తేలినావా

తుపానైనా గిపానైనా రాని
రగిలేటి ఆశ దీపానార్పేనా హో
కోపాలైనా శాపాలైనా రాని
ఎదురీదే ఏటి కెరటాన్నాపేనా హో

ఏదేమైనా గాని ఎద నది ఆగేనా
మానేయన్నా గాని మనసనగారేనా
ఏరే ఇంకి నీరే బొంకి దారే దిబ్బయినా
దరి సేరాలమ్మ సాగే నావమ్మా
ప్రతి రోజు కొత్త కాన్పే సూడమ్మా

ఏలేలో ఏలేలో ఏలో యాలా
తీరాలెన్నో దాటే నావ
ఏలేలో ఏలేలో ఏలో యాలా
సొంత గూడే సేరినావా





మధుర గతమా పాట సాహిత్యం

 
చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: రమ్యా బెహ్రా

మధుర గతమా
కాలాన్నే ఆపక ఆగవే సాగక
అంగుళీకమా జాలైనా చూపకా
చేజారావే వంచికా

నిశి వెనుకే మెరుపు వలా
నిదురెనుకే మెళకువలా
నాలో నీ ఆశే ఓ శీతలం
మౌనంగా కూసే శాకుంతలం

మధుర గతమా
కాలాన్నే ఆపక ఆగావే సాగక
హృదయ సగమా నీ వెంటే తోడుగా
నేనే లేనా నీడగా

తారనే జాబిలె తోడునే వీడునా
రేయిలో మాయలే రేడునే మూసెనా
జ్ఞాపికే జారినా జ్ఞాపకం జారునా
గురుతులే అందినా అందమే ఎందునా
ఎదురవకా ఆ ఆ ఎన్నాళ్ళే ఏలికా
ఈ కన్నీళ్లే చాలికా

మధుర గతమా
కాలాన్నే ఆపకా
ఆఆ ఆ ఆ ఆగావే సాగకా

దూరమే తీయనా ప్రేమనే పెంచనా
తీరదే వేదన నేరమే నాదనా
ప్రేమనే బాటలో నీ కథై సాగనా
నీ జతే లేనిదే పయనమే సాగునా
కలయికలే కాలాలే ఆపినా
ఈ ప్రేమల్నే ఆపునా

మధుర గతమా
కాలాన్నే ఆపక ఆగవే సాగక
నిశి వెనుకే మెరుపు వలా
నిదురెనుకే మెళకువలా
నాలో నీ ఆశే ఓ శీతలం
మౌనంగా కూసే శాకుంతలం

No comments

Most Recent

Default